డీఎస్పీ మృతిపై జ్యూడీషియల్ విచారణకు సీఎం ఆదేశం | Siddaramaiah orders judicial inquiry over DSP Ganapathi's death | Sakshi
Sakshi News home page

డీఎస్పీ మృతిపై జ్యూడీషియల్ విచారణకు సీఎం ఆదేశం

Published Wed, Jul 13 2016 4:55 PM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

డీఎస్పీ మృతిపై జ్యూడీషియల్ విచారణకు సీఎం ఆదేశం

డీఎస్పీ మృతిపై జ్యూడీషియల్ విచారణకు సీఎం ఆదేశం

బెంగళూరు: మంగళూరు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ఎంకే గణపతి (51) ఆత్మహత్య కేసుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం దిగివచ్చింది. సీఎం సిద్దరామయ్య జ్యూడీషియల్ విచారణకు ఆదేశించారు. తన చావుకు బెంగళూరు అభివృద్ధి, పట్టణ ప్రణాళిక శాఖ మంత్రి కేజే జార్జ్తో పాటు ఆయన కుమారుడు రాణా జార్జ్లే కారణమని ఆరోపిస్తూ గణపతి తన సూసైడ్ లేఖలో రాసినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని కేసుల విషయంలో సీనియర్ అధికారులు తనను వేధించారని, వారి నుంచి ఒత్తిళ్లు తట్టుకోలేకపోయినట్లు ఆయన అంతకు ముందు ఆరోపించారు.

వారం రోజుల వ్యవధిలో కర్ణాటకలో ఇద్దరు పోలీస్ అధికారులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలోనూ బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్‌పీ అనుపమ షణై  రాజీనామా వ్యవహారం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. నిజాయితీగా పని చేస్తున్నందుకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల రాజీనామా చేసినట్లు విమర్శలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement