బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు కూడా ఇరుక్కునేలా కనిపిస్తోంది.ఈ కేసులో తాజాగా సిద్ధరామయ్య భార్య పార్వతి, కర్ణాటక మంత్రి బైరాతి సురేష్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ గతేడాది అక్టోబర్‌లో దర్యాప్తు ప్రారంభించింది.
ముడా భూముల కేటాయింపు అక్రమాల్లో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి, ఆమె సోదారుడు బీఎం మల్లికార్జునస్వామి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఈడీ ఇదివరకే సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేయడమే కాకుండా ఆయన సన్నిహితుల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించింది.
ఈకేసులో ఈడీ గతంలో లోకాయుక్తకు లేఖ రాయడం వివాదాస్పదమైంది. ముడాకు చెందిన రూ.700 కోట్ల భూమిని అక్రమంగా డీ నోటిఫై చేశారని ఆరోపించింది. ఇందులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించింది. దీనిపై సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. ఈడీ రాజకీయ దురుద్దేశాలతో తన పరిధి దాటి వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ముడాస్కాం వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పందించారు. ఒకే కేసులో లోకాయుక్త, సీబీఐ ఎలా విచారిస్తాయని ప్రశ్నించారు. దీని వెనుక కేంద్రం రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు. ఏ కేసులోనూ రెండు దర్యాప్తు సంస్థలు అవినీతి అంశంపై విచారించకూడదని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment