siddaramaiah
-
డీకే Vs సతీష్.. కన్నడ కాంగ్రెస్‌లో రసవత్తర రాజకీయం!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ పోస్టుపై ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో, అధికార పార్టీ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ సెటైర్లు వేస్తోంది.కన్నడ కాంగ్రెస్‌లో కలహాలు ఉధృతమయ్యేలా ఉన్నాయి. డిప్యూటీ సీఎంతో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. నాయకులు ఇష్టానుసారం మాట్లాడరాదని ఇటీవలే హైకమాండ్ ఆదేశించినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ.. కేపీసీసీ అధ్యక్ష పోస్టు అంగడిలో దొరకదు. మీడియా ముందు మాట్లాడితే లభించదు. మనం పార్టీకి చేసిన సేవలు, శ్రమను గుర్తించి సరైన పదవి ఇస్తారని, కొంతమంది మీడియా ముందుకొచ్చి పదవిని కోరుతున్నారని అన్నారు.పార్టీలో అందరూ క్రమశిక్షణ పాటించాలని రాహుల్‌గాంధీ, సీఎం సిద్దరామయ్య సూచించారన్నారు. కాంగ్రెస్ పార్టీని తానొక్కడే కాదు, కార్యకర్తలు, ప్రజలు కలిసి గెలిపించారన్నారు. జై భీమ్ సమావేశాల నిర్వహణ పరిశీలనకు ఇన్చార్జి సుర్జేవాలా శుక్రవారం బెళగావికి వస్తారని, మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే ఆయనను అడగాలని నేతలకు సూచించారు. మరోవైపు మంత్రి సతీష్ జార్కిహొళికి కేపీసీసీ నుంచి నోటీసులు వెళ్లాయి.రేసులో ఉన్నాననలేదు: సతీశ్కేపీసీసీ నుంచి నోటీసులు ఇచ్చినప్పటికీ ఏమీ కాదు, దీనికి స్పష్టమైన సమాధానం అధ్యక్షుడి ముందు ఇస్తానని మంత్రి సతీష్ జార్కిహొళి చెప్పారు. డీకేపై తరచూ విమర్శలు చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటీస్ ఇచ్చే అధికారం ఆయనకు ఉందన్నారు. కేపీసీసీ రేసులో ఉన్నానని నేను ఎక్కడా చెప్పలేదన్నారు. తన మాటలతో ఎవరికీ ఇబ్బంది లేదని, నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. మీడియా ఉదయం హీరోను చేసి, సాయంత్రం విలన్‌ను చేస్తారని, ఇది సబబు కాదని వాపోయారు. మరోవైపు.. కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలపై ప్రతిపక్ష బీజేపీ నేతలు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇలాంటివి కొత్తేమీ కాదని కామెంట్స్ చేస్తున్నారు. -
రోడ్డుకు సిద్ధరామయ్య పేరు.. ప్రతిపక్షాల ఫైర్
బెంగళూరు:కర్ణాటకలోని మైసూరు(Mysuru) మునిసిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. నగరంలోని ఒక ప్రధాన రోడ్డుకు సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)పేరు పెట్టాలని మైసూరు కార్పొరేషన్ ప్రతిపాదించడం పట్ల ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రజలను అవమానపరచడమేనని జనతాదళ్ సెక్యులర్(JDS) పార్టీ విమర్శించింది.మైసూరు నగరంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి సర్కిల్ నుంచి మెటగల్లిలోని రాయల్‌ఇన్ జంక్షన్ వరకు ఉన్న రోడ్డుకు సిద్ధరామయ్య ఆరోగ్యమార్గ అని పేరు పెట్టేందుకు మైసూరు మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ రోడ్డుకు సిద్ధరామయ్య పేరు పెట్టాలని చామరాజ ఎమ్మెల్యే హరీశ్‌గౌడ తొలుత సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(Muda) కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న సిద్ధరామయ్య పేరును రోడ్డుకు ఎలా పెడతారని బీజేపీ ప్రశ్నిస్తోంది.కార్పొరేషన్లో ఎన్నికైన పాలకవర్గంలేని ప్రస్తుత సమయంలో కొందరు అధికారులు ప్రభుత్వ మెప్పు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదీ చదవండి: గులాబ్జామూన్తో మాజీ మంత్రికి చిక్కులు -
524 మీటర్లకు ఆల్మట్టి డ్యామ్
రాయచూరు రూరల్: కర్ణాటకలోని విజయపుర (బీజాపుర) జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న భారీ జలాశయం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వయంగా ప్రకటించారు. ఆల్మట్టి డ్యామ్ ప్రస్తుత ఎత్తు 519 మీటర్లు కాగా, దానిని 524.256 మీటర్ల ఎత్తుకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లతో భారీ విస్తరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ విషయమై సోమవారం బెళగావిలో రైతు సంఘాల నాయకులు, ఉత్తర కర్ణాటక ప్రజాప్రతినిధులతో సీఎం సిద్దరామయ్య సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు. కాగా, అప్పర్ కృష్ణా మూడో దశ పథకం కింద, బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు లోబడి ఆల్మట్టి ఎత్తు పెంపు ఉంటుందని అధికారులు చెప్పడం గమనార్హం. డ్యామ్ ఎత్తు పెంపు వల్ల తమకు దక్కే 173 టీఎంసీల కృష్ణా జలాల్లో 130 టీఎంసీల వాడకానికి వెసులుబాటు లభిస్తుందని తెలిపారు. 13.10లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల లభించే ఆ నీటిలో కలబుర్గి, రాయచూరు, కొప్పళ్, విజయపుర, యాదగిరి, బాగల్‌కోట, గదగ్ జిల్లాల్లోని 13.10 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డ్యామ్ ఎత్తు పెంపు వల్ల నీటి మట్టం పెరిగి పెద్ద సంఖ్యలో గ్రామాలు నీట మునుగుతాయి. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కింద పరిహారానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
నా చివరి శ్వాస వరకు సిద్ధరామయ్య కోసం నిలబడతా: డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాను చనిపోయే వరకు సిద్ధరామయ్య కోసం ఒక రాయిలా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘సిద్ధరామయ్యకు నా చివరి శ్వాస వరకూ రాయిలా అండగా ఉంటాను. నేను ఎక్కడ ఉన్నా నిబద్ధతతో పనిచేస్తాను. కాంగ్రెస్ శక్తి అంటే దేశ శక్తి. దేశ చరిత్రలో కాంగ్రెస్ త్యాగలే ఎక్కువ. ఈ పార్టీ అధికారంలో ఉందంటే అన్ని వర్గాలకూ అధికారం దక్కినట్లే. కాంగ్రెస్ అధికారంలో ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ప్రజల కష్టాలకు స్పందిస్తుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ప్రతిపక్షాలను ఉద్దేశించి కౌంటరిచ్చారు. ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ..‘25 ఏళ్ల తర్వాత హాసన లోక్‌సభ నియోజకవర్గాన్ని గెలచుకున్న కాంగ్రెస్ 2028లోనూ ఇక్కడి అన్ని స్థానాలను గెలుచుకుంటుంది. ఈ జిల్లాలో మహిళలకు జరిగిన అన్యాయాన్ని చూసి బాధపడని దేవేగౌడ.. తన మనవడి కోసం చెన్నపట్టణకు వచ్చి కన్నీరు పెట్టారు. నందిని పాలను అమూల్ బ్రాండ్‌లో విలీనం చేయాలని ఎన్డీఏ ప్రయత్నించిందని ఆరోపించారు. రాష్ట్ర బ్రాండ్‌ను మేము ఢిల్లీలో ఆవిష్కరించామని గుర్తుచేశారు. కర్ణాటక ప్రజలు కాంగగ్రెస్ వైపు నిలబడ్డారు. 2028 ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని కామెంట్స్ చేశారు. -
దమ్ముంటే నిరూపించండి
సాక్షి బెంగళూరు: తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించిందని, ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వజూపిందని, 50 మంది ఎమ్మెల్యేలను కొనడానికి కుట్రలు చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించడం సంచలనాత్మకంగా మారింది. సిద్ధరామయ్య ఆరోపణలపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే నిరూపించాలని గురువారం సిద్ధరామయ్యకు సవాలు విసిరారు. ముఖ్యమంత్రి సొంత పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయారని, అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వడానికి తాము ప్రయత్నించినట్లు నిరూపించకపోతే ప్రజలు ఎప్పటికీ ఆయనను నమ్మరని తేల్చిచెప్పారు. ఉన్నత పదవిలో ఉన్న నాయకుడి ప్రవర్తన కూడా ఉన్నతంగా ఉండాలని హితవు పలికారు. దర్యాప్తు సంస్థలు ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నాయని, ఆరోపణలను ఎందుకు నిరూపించడం లేదని ప్రశ్నించారు. అయితే, విజయేంద్ర సవాలుపై స్పందించడానికి సిద్ధరామయ్య నిరాకరించారు. మరోవైపు బీజేపీపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ సమర్థించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిన సంగతి నిజమేనని గురువారం చెప్పారు. పలువురు మంత్రులు సైతం సిద్ధరామయ్యకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందందని వారు పేర్కొన్నారు. -
ఈడీ కేసు ఎలా పెడుతుంది?
బెంగళూరు: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) తనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేయడంలో ఔచిత్యం ఏమిటని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. ‘దేని ఆధారంగా మనీలాండరింగ్ కేసు పెట్టారో నాకైతే అర్థం కావడం లేదు. మా నుంచి సేకరించిన భూమికి పరిహారంగా ప్లాట్లు కేటాయించారు. అలాంటపుడు మనీలాండరింగ్ కేసుకు ఆస్కారం ఎక్కడిది? నాకు తెలిసి మనీలాండరింగ్ దీనికి వర్తించదు’ అని సిద్ధరామయ్య మంగళవారం అన్నారు.మైసూరులో సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన 3.16 ఎకరాల భూమిని సేకరించిన ముడా పరిహారంగా 50:50 నిష్పత్తిలో ఖరీదైన ప్రాంతంలో 14 ప్లాట్లకు ఆమెకు కేటాయించింది. ఇందులో అధికార దురి్వనియోగం, అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు సిద్ధరామయ్య, పార్వతిలపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ సోమవారం సిద్ధరామయ్యపై మనీలాండరింగ్ కేసును నమోదు చేసిన విషయం విదితమే. ఈడీ కేసు నమోదైన కొద్దిగంటల్లోనే 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తానని పార్వతి ముడా కమిషనర్‌కు లేఖ రాశారు. తన భర్త పరువుప్రతిష్టలు, మానసిక ప్రశాంతత కంటే ఏ ఆస్తి కూడా తనకు ఎక్కువ కాదని ఆమె పేర్కొన్నారు. తనపై ద్వేష రాజకీయాలకు పార్వతి బాధితురాలుగా మారారని సిద్ధరామయ్య అన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.14 ప్లాట్లు వెనక్కితీసుకున్న ముడా మైసూరు: పార్వతి అభ్యర్థన మేరకు ఆమెకు కేటాయించిన 14 ప్లాట్లను మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) మంగళవారం వెనక్కి తీసుకుంది. పార్వతితో చేసుకున్న సేల్డీడ్లను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్వతి తనయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్ర తమకు లేఖను అందించారని, దాన్ని పరిశీలించి ప్లాట్లను స్వా«దీనం చేసుకోవాలని నిర్ణయించామని ముడా కమిషనర్ ఎ.ఎన్.రఘునందన్ వెల్లడించారు. ఎవరైనా స్వచ్ఛందంగా ప్లాట్లను వదులుకుంటే.. వెనక్కి తీసుకోవచ్చనే నిబంధన ముడా చట్టంలో ఉందన్నారు. -
ముడా కుంభకోణం.. సీఎం సిద్దరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బర్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణం వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను మొదటి ముద్దాయిగా పేర్కొనగా.. ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామి, దేవరాజ్, మల్లికార్జున స్వామిలను వరుస నిందితులుగా చేర్చింది.మూడా భూ కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని ట్రయల్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే లోకాయుక్త పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని బుధవారం హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ అనుమతిని సవాల్ చేస్తూ సీఎం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. గవర్నర్ చర్యలుచట్ట ప్రకారం ఉన్నాయని తెలిపింది. చదవండి: రాహుల్ ధైర్యవంతుడు, నిజాయితీ కలిగిన నేత: సైఫ్ ప్రశంసలు -
సిద్ధరామయ్యకు షాక్
బెంగళూరు: ముడా భూ కుంభకోణం కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ అనుమతించడం తెలిసిందే. ఆ ఉత్తర్వుల చట్టబద్ధతను సవాలు చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు మంగళవారం కొట్టేసింది. గవర్నర్ నిర్ణయం చట్టబద్ధమేనని స్పష్టం చేసింది. ‘‘గవర్నర్ మంత్రిమండలి సలహా మేరకు నడుచుకోవడం రివాజే అయినా ప్రత్యేక పరిస్థితులు తలెత్తినప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఆయనకుంది. ఇది అలాంటి కేసే’’ అని అభిప్రాయపడింది. ‘‘ఈ కేసులో లబి్ధదారు స్వయానా పిటిషనర్ కుటుంబానికి చెందిన వ్యక్తే. కనుక అభియోగాలపై విచారణ అవసరమన్నది నిస్సందేహం’’ అని న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న పేర్కొన్నారు.గవర్నర్ ఏమాత్రం ఆలోచన లేకుండా, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బాగా ఆలోచించిన మీదటే దర్యాప్తుకు అనుమతిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద ముడా కేసులో సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆగస్టు 16న అనుమతించారు. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తానని సిద్ధరామయ్య చెప్పారు.విచారణకు తానేమీ వెనకాడటం లేదన్నారు. అయితే, ‘‘నేనెందుకు రాజీనామా చేయాలి? అవినీతి ఆరోపణల్లో బెయిల్‌పై తిరుగుతున్న కేంద్ర మంత్రి కుమారస్వామి రాజీనామా చేశారా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఈ కేసు నాపై, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాల్లో భాగం. అందుకోసం గవర్నర్ అధికారాలను కూడా దురి్వనియోగపరుస్తున్నారు’’ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా తనకు దన్నుగా ఉందని చెప్పారు.రాజీనామా చేయాలి: బీజేపీ హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘‘మీ అబద్ధాల సామ్రాజ్యం కుప్పకూలింది. గౌరవప్రదంగా రాజీనామా చేయండి. దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేందుకు వీలు కలి్పంచండి’’ అని పార్టీ నేత రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ డిమాండ్‌ను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఆయన రాజీనామా చేయబోరని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ‘‘ఇదో కుట్ర. సిద్ధరామయ్య నిర్దోíÙత్వాన్ని నిరూపించుకుంటారు’’ అన్నారు. ఏమిటీ ముడా వివాదం? సిద్ధరామయ్య మెడకు చుట్టుకున్న మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపు వివాదానిది మూడు దశాబ్దాల పై చిలుకు నేపథ్యం. మైసూరు జిల్లా కెసెరె గ్రామంలో సీఎం భార్య పార్వతికి 3 ఎకరాల 16 గంటల భూమి ఉంది. దేవనార్ 3ఫేజ్ లేఔట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. పరిహారంగా 50:50 నిష్పత్తి పథకం కింద 2021లో మైసూర్‌లోని ఖరీదైన విజయనగర ప్రాంతంలో ఏకంగా 14 ఖాళీ ప్లాట్లను కేటాయించింది.‘‘పార్వతి నుంచి తీసుకున్న భూమి కంటే వీటి విలువ ఏకంగా రూ.45 కోట్లు ఎక్కువ. 50: 50 పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను సొంతం చేసుకుంది’’ అంటూ అబ్రహాం అనే ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు చేశాడు. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి బహుమతిగా ఇచ్చారని సిద్ధరామయ్య చెప్పగా ఇతరుల భూమిని అక్రమంగా లాక్కున్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో పార్వతి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు సిద్ధరామయ్యే సీఎం. ఆమెకు ప్లాట్లు కేటాయించాలని 2017లో ముడా నిర్ణయించింది.ఇది కచి్చతంగా అధికార దుర్వినియోగమేనని విపక్షాలంటున్నాయి. సిద్ధరామయ్య మాత్రం, ‘‘నేను సీఎంగా ఉన్నంతకాలం పరిహారమివ్వడం కష్టమని అధికారులు చెప్పారు. 2021లో బీజేపీ హయాంలో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ప్లాట్లు కేటాయించారు’’ అని వాదించారు. ఈ ఆరోపణలపై జూలైలో సిద్ధరామయ్యకు గవర్నర్ షోకాజ్ నోటీసిచ్చారు. అనంతరం విచారణకు అనుమతిచ్చారు. -
కర్ణాటకలో ముడా స్కామ్ ప్రకంపనలు..
-
నేడు హైకోర్టులో సీఎం సిద్దు పిటిషన్?
శివాజీనగర: మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) ఇంటి స్థలాల స్వీకారంలో తన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ గెహ్లాట్ అనుమతినివ్వడాన్ని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం కోర్టును ఆశ్రయించనున్నారు. గవర్నర్ ఆదేశాలపై స్టే, లేదా కొట్టి వేయాలని హైకోర్టులో పిటిషన్ సమర్పించనున్నారు. కాంగ్రెస్ నేతలు, సీనియర్ వకీళ్లు అయిన కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి ఢిల్లీ నుంచి ఆదివారం బెంగళూరుకు వచ్చారు. వీరిద్దరితో సిద్దరామయ్య న్యాయ పోరాటం గురించి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం సైతం సిద్దరామయ్యకు అండగా ఉంటుందని నాయకులు చెబుతున్నారు. ముడా కేసును, ఫిర్యాదిదారుల లేఖలను, ప్రాసిక్యూషన్ ఆదేశాలను లోతుగా అధ్యయనం చేసి ఎలా ముందుకెళ్లాలనేది సిబాల్, సింఘ్విలు మంతనాలు జరిపారు. రాష్ట్రానికి చెందిన రాజ్యాంగ, న్యాయ నిపుణులు కూడా పాల్గొన్నారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశాక ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారింది.ప్రజా ప్రతినిధుల కోర్టులో..ముడా కేసులో సిద్దరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ ప్రజా ప్రతినిధుల కోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 20న జడ్జి ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. అంతలోపే తమ విన్నపాలను ఆలకించాలని సిద్దరామయ్య సోమవారం మధ్యంతర పిటిషన్ సమర్పించే అవకాశాలు ఉన్నాయి. సామాజిక కార్యకర్తలు స్నేహమయి కృష్ణ, టీజే అబ్రహాం కోర్టులో సీఎంపై ప్రైవేట్ కేసు వేసి ఎఫ్ఐఆర్ నమోదుకు విజ్ఞప్తి చేశారు.అన్ని జిల్లాల్లో ధర్నాలు: డీసీఎంకాంగ్రెస్ పార్టీ ఆందోళనలను కొనసాగిస్తోంది. సోమవారం అన్ని జిల్లాల్లో బీజేపీ, కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా ధర్నాలు జరుపనున్నారు. మైసూర్ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. ఆదివారం బెంగళూరులో కేపీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ విషయాలను తెలిపారు. ప్రతి జిల్లాలో ధర్నాలు చేసి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతోంది. వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మహాత్మాగాంధీ బాటలో అహింసా పద్ధతిలోనే మా పోరాటం జరుగుతుంది అని చెప్పారు. -
MUDA Scam: ‘కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చే కుట్రే ఇది’
బెంగళూరు: మైసూరు అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కర్ణాటకలో ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ కేసులో విచారణ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీంతో సీఎంకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఈ పరిణామంపై తాజాగా సిద్ధరామయ్య స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. తనపై విచారణకు ఆమోదిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్టానికి విరుద్ధమని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సీఎం మాట్లాడుతూ..గవర్నర్ చర్యను కోర్టులో ప్రశ్నిస్తానని, తాను రాజీనామా చేసేంత తప్పు ఏం చేయలేదని పేర్కొన్నారు.‘మొత్తం కేబినెట్, పార్టీ హైకమాండ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ రాజ్యసభ ఎంపీలు నా వెంట ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ, జేడీ(ఎస్) చేస్తున్న కుట్ర ఇది’ అని విమర్శించారు.కేబినెట్ అత్యవసర భేటీ..మరోవైపు ఈ వ్యవహారంపై చర్చించేందుకు సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన నేటి సాయంత్రం కర్నాటక కేబినెట్ అత్యవసర సమావేశమవుతోంది. ఇదిలా ఉండగా గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో సీఎం సిద్ధరామయ్య ఉన్నారు.చదవండి: చిక్కుల్లో సిద్దరామయ్య.. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి -
చిక్కుల్లో సిద్దరామయ్య.. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్థల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై కర్ణాటక ముఖ్యమంత్రి, సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొనున్నారు. ముడా కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు. ఈ స్కామ్ ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త స్నేహమయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.కాగా తనపై వచ్చిన ఆరోపణలకు ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఆయనపై ఎందుకు విచారణ జరపకూడదో తెలపాలని ఆదేశిస్తూ గవర్నర్ గత నెలలో ముఖ్యమంత్రికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీతో ప్రాసిక్యూషన్‌ను అనుమతించవద్దని గవర్నర్‌ను కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. నోటీసును ఉపసంహరించుకోవాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం సూచించింది. గవర్నర్ రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.అయితే తనపై వచ్చిన ఆరోపణలను సీఎం సిద్దరామయ్య కొట్టిపారేశారు. అవి రాజకీయ ప్రేరేపితమైనవని మండిపడ్డారు. తనపై, కర్ణాటక సర్కారుపై బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. తమ కుటుంబానికి ఎవరు, ఎలా ఆ భూములను కేటాయించారో తనకు తెలియదని పేర్కొన్నారు. బీజేపీ హయాంలోనే ఈ కేటాయింపులు జరిగినట్టు చెప్పుకొచ్చారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. భూముల కేటాయింపుల్లో 50:50 ఫార్ములాను బీజేపీనే ప్రతిపాదించిందని పేర్కొన్నారు.ముడా కుంభకోణం ప్రకంపనలు..ఇదిలా ఉండగా సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది.మరోవైపు, 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ గత వారం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కేసరే గ్రామంలో మూడెకరాలకు పైగా ఉన్న వ్యవసాయ భూమి తమదే అని నిరూపించడంతో ఆయన విఫలమయ్యాయడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇకపోతే, పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జు్న్పై మరో ఫిర్యాదు దాఖలైంది. ప్రభుత్వం, రెవెన్యూ శాఖ అధికారుల సహకారంతో 2004లో మల్లికార్జున్ అక్రమంగా భూమిని సేకరించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అందులో పేర్కొన్నాడు. దీంతో, కోట్లాది రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపించాడు. -
ముక్కుసూటి మనిషిపై అవినీతి మరక
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్యది ప్రత్యేక స్థానం. ఆయన ముక్కుసూటి మనిషి. కాంగ్రెస్‌లో అధిష్టానానికి.. ముఖ్యంగా గాంధీ కుటుంబానికి విధేయుడి గుర్తింపు. 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈ అపర చాణక్యుడు.. న్యాయవాద వృత్తిలో ఉంటూ రాజకీయ అరంగేట్రం చేశారు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదొడుకులు చూసిన సిద్ధరామయ్యను ప్రస్తుతం వాల్మీకి కుంభకోణం, ముడా స్థలాల పంపిణీలో అక్రమాల పేరిట ఉన్న రెండు కేసులు నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. 1983లో తొలిసారి ఏడో అసెంబ్లీలో అడుగుపెట్టిన సిద్ధరామయ్య, 1985లోనే మంత్రి పదవిని అలంకరించారు. 1996లో ఉప ముఖ్యమంత్రిగాను, 2013లో తొలిసారి ముఖ్యమంత్రిగా ఇలా ఎన్నో పార్టీ, ప్రభుత్వ పదవులు చేపట్టిన సిద్ధరామయ్య మలి వయసులో ఇబ్బందులు పడుతున్నారు.సోషల్ మీడియాలో బీజేపీ విమర్శల దాడి :40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి బ్లాక్ మార్కు లేదని గర్వంగా చెప్పుకుని తిరిగే సిద్ధరామయ్యకు జీవితంలో ఒంటి నిండా అవినీతి మరకలు ఉన్నాయని ప్రతిపక్ష బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ ఆరోపణలకు బదులు చెప్పలేక సిద్ధరామయ్య మాటలు తడబడుతున్నాయి. ఇదే క్రమంలో సిద్ధరామయ్య పరిపాలన కాలంలో ఏకంగా 9 అవినీతి మరకలు, కుంభకోణాలు ఉన్నాయని బీజేపీ ఒక జాబితాను తయారు చేసి విడుదల చేసింది. ఈ జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిద్ధరామయ్యపై వస్తున్న ఆరోపణలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసి తాను సత్యహరిశ్చంద్రుడినని నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు సవాలు విసురుతున్నాయి. తన నిష్కళంక రాజకీయ జీవితంపై బ్లాక్ మార్కు వేయాలని బీజేపీ ముఖ్య నేతలు ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని సిద్ధరామయ్య మాత్రం పదే పదే చెబుతున్నారు. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు బదులు చెప్పలేక, ప్రతిపక్ష పార్టీ నేతలపై కూడా చాలా వరకు అవినీతి ఆరోపణలు వచ్చాయని, కానీ వాటిపై ఎప్పుడు విచారణ జరగలేదని ఎద్దేవా చేశారు. తాను మాత్రం ముడా కేసులో న్యాయ విచారణకు సిద్ధపడ్డానని, ఇంతకుమించి ఇంకేమీ చేయాలంటే ప్రతిపక్షాల నోరు మూయించే ప్రయత్నం చేశారు.తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి చేయలేదని, తన పేరుకు కళంకం తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ముడా కేసు విషయంపై తనకు ఎలాంటి భయం లేదని, ఎందుకంటే తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి చేసింది. ఈ బ్లాక్ మార్కు ఎవరు పెడుతున్నారు. సిద్ధరామయ్య తన ఒంటి నిండా అవినీతి మరకలు పెట్టుకుని మాపై నిందలు వేయడమా అంటూ బీజేపీ 9 అవినీతి కుంభకోణ కేసులను సోషల్ మీడియాలో ప్రచారం చేసింది.సిద్దూపై బీజేపీ ఆరోపణలు ఇవే⇒ వజ్రాలతో పొదిగిన హ్యుబ్లాట్ వాచ్ ధరించడం⇒ ఆర్కావతి లేఔట్ డీనోటిఫిపై⇒ కృషి భాగ్య పథకంలో వందలాది కోట్ల అవినీతి⇒ అన్నభాగ్య పథకంలో వేలాది కోట్ల రూపాయల అక్రమాలు⇒ ఇందిరా క్యాంటీన్లో అవినీతి⇒ ఇందిరా క్యాంటీన్ అవినీతిని కప్పిపుచ్చేందుకు లోకాయుక్త మూసివేత⇒ వాల్మీకి నిగమలో వందలాది కోట్ల రూపాయల గోల్మాల్⇒ ముడాలో అక్రమంగా స్థలాల పంపిణీ⇒ సిట్‌ను తమ చేతి కీలుబొమ్మగా మార్చుకుని క్లీన్చిట్ పొందడం -
నాకు మొబైల్ లేదు: సిద్ధూ
బనశంకరి: కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాను మొబైల్ ఫోన్ వాడనని చెప్పారు. సోమవారం మీడియా ప్రశ్నకు బదులిస్తూ, ‘‘ఒకప్పుడు ఆర్నెల్లు మొబైల్ వాడాను. రాత్రి వేళ ఫోన్లు రావడం, నిద్రకు భంగం కలగడంతో పక్కన పెట్టా. ఏ విషయమైనా పీఏలు, గన్‌మెన్ వచ్చి చెబుతారు. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో నా కుమారుడు చెబుతాడు’’ అన్నారు. నాయకత్వ మార్పుపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని సిద్దరామయ్య అన్నారు. డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌కు సీఎంగా అవకాశమివ్వాలని ఇటీవల ఒక్కళిగ మతగురువు ఒకరు సిద్దరామయ్య సమక్షంలోనే కోరడం తెలిసిందే. -
పరువు నష్టం కేసులో సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లకు బెయిల్
బెంగళూరు: ప్రజా ప్రతినిధుల కోర్టులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివుకుమార్‌లకు ఊరట లభించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి కేశవ ప్రసాద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి వీళ్లిద్దరికి ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. కాగా గత బీజేపీ ప్రభుత్వం అన్నీ పనుల్లో 40 శాతం కమీషన్ వసూలు చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేపర్లలో ప్రకటనలు ఇచ్చింది. ‘40 శాతం కమీషన్ ప్రభుత్వం’ పేర్కొంటూ పూర్తి పేజీ ప్రకటన ప్రచురించింది. వివిధ పనుల కోసం గత సర్కార్ అవినీతి రేటు కార్డులు నిర్ణయించిందంటూ ఆరోపిస్తూ పోస్టర్లను కూడా ముద్రించింది.అయితే అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని బీజేపీ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు సిద్దరామయ్య, శివకుమార్‌తోపాటు రాహుల్ గాంధీలపై బీజేపీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి కేశవ్ ప్రసాద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై నేడు విచారణ సందర్భంగాసిద్ధరామయ్య, శివకుమార్ 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. అనంతరం సిద్దరామయ్య,, శివకుమార్‌లకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. -
ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్.. ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.మోదీ అబద్ధాలు మాట్లాడుతున్నారని, భావోద్వేగంతో దోపిడీ చేస్తారని ప్రజలు గ్రహించారని అన్నారు. తనను సజీవంగా సమాధి చేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయన్న ప్రధాని వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందించారు. ఆయనను సజీవంగా సమాధి చేయాలని ఎందుకు అనుకుంటారు. బదులుగా, మోదీ చేస్తున్న రాజకీయాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. గత 10 ఏళ్లుగా ఆయన (మోదీ) ప్రధానిగా ఉన్నారు. పేదల కోసం చేసిందేమీ లేదు . దానికి తోడు ఏ ఒక్కటీ నెరవేర్చకపోవడంతో ఆయన అబద్ధాల మాస్టర్ అన్న ఆరోపణలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రధానిని ఓడించడం తప్ప, సజీవ సమాధి చేయాలని ఎవరూ కోరుకోవడం లేదని అన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం మహారాష్ట్రలోని నందుర్బార్లో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న కొందరు తనను సజీవ సమాధి చేయాలని చూస్తున్నారని, దేశ ప్రజలే తనకు రక్షణ కవచమని, వారు తనకు ఎలాంటి హాని జరగనివ్వబోరని పేర్కొన్నారు.ఆ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ప్రధాని నిరాశలో, ఓటమి భయంతో ఉన్నారు. భయం, నిస్పృహతో ఆ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీ అబ్ధాలు, భావోద్వేగంతో మాట్లాడుతున్నారని ప్రజలకు అర్థమైందని ..తమను మానసికంగా దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలకు తెలుసునని, ఈ విషయం తెలిసి ప్రజలు ఓట్లు వేయరని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. పైకి వెళ్లిన వారు కిందకు దిగి రావాల్సిందేనన్నారు. -
నోరు జారిన అమిత్ షా!
-
రాహుల్ వచ్చారు.. సిద్దయ్య పోతారు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ ప్రచారం చేస్తుంటడంతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని ఎద్దేవా చేసింది. ‘రాహుల్ వచ్చారు. సిద్దరామయ్య వెళ్లిపోతారు’ అంటూ బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్‌రావు అన్నారు. రానున్న ఎన్నికల్లో సిద్దరామయ్య ఓడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ‘గడిచిన ఐదు ఏళ్లలో సీఎం సిద్దరామయ్య ఏమీ చేయలేదు. ఇప్పటివరకు పడుకొని ఉండిపోయిన ఆయన.. ఇప్పుడు నిద్రలేచి.. తన కారునిండా ఇటుకలు పెట్టుకొని రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ఎక్కడికి వెళితే.. అక్కడ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. సమయం ఉన్నప్పుడు ఏమీ చేయని సిద్దరామయ్య.. ఇప్పుడు నవకర్ణాటకను నిర్మిస్తున్నానని చెప్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారు’ అని మురళీధర్‌రావు మండిపడ్డారు. తుముకూరులో నిర్వహించిన బీజేపీ గొల్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాకటలో యాదవ సామాజికవర్గం జనాభా 35 లక్షల వరకు ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. యాదవ సామాజిక వర్గానికి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప హామీ ఇచ్చారు. -
మళ్లీ ట్వీటేసిన సిద్ద రామయ్య
సాక్షి, బెంగళూరు : బీజేపీపై విమర్శల దాడిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య దూసుకెళుతున్నారు. ట్విటర్ వేదికగా ఆయన బీజేపీని నిలదీస్తున్నారు. పెద్ద పెద్ద పరిశ్రమల బకాయిలను రద్దు చేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రైతులెందుకు కనిపించడం లేదని, వారికి ఎందుకు రుణ విముక్తి కలిగించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ వెన్నెముక లేని పార్టీగా వ్యవహరిస్తోందని, కార్పోరేట్ లోన్ల రద్దు విషయం లెక్కల పాఠాలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతోందంటూ వ్యాఖ్యానించారు. 'రైతుల రుణాలు మాఫీ చేయాలని అడగాల్సింది పోయి కర్ణాటక బీజేపీ వెన్నెముక లేనిదిగా ప్రవర్తిస్తోంది.. పైగా లోన్లపై లెక్కల పాఠాలు చెప్పుకొస్తోంది. ప్రజలేం మూర్ఖులు కారు. కేంద్రం బడా పారిశ్రామిక వేత్తల లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తుందిగానీ, రైతులకు మాత్రం కోట్లలో ఉన్న రుణాలు రద్దు చేయలేదా?' అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో త్వరలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడితో యుద్ధం చేస్తున్నాయి. The Karnataka BJP is so spineless that instead of asking the center to waive farmers’ loans it is giving accountancy lessons on Twitter. People will not be fooled. Center can write off lakhs of crores of a few industrialists but can’t give debt relief to crores of farmers. https://t.co/D9LH60Asaz — Siddaramaiah (@siddaramaiah) March 22, 2018 -
కర్ణాటకపై కన్నేసిన రాహుల్
-
కర్ణాటకలో రాహుల్ వ్యూహం ఏంటి?
సాక్షి, బెంగళూరు : రాజకీయంగా దిగాలుపడి మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నాల్లో భాగంగా 1978 లో చిక్మగుళూరు నుండి లోక్‌సభకు పోటీచేస్తూ ఇందిరాగాంధీ తుంగనది ఒడ్డున ఉన్న శృంగేరి మఠంలో అడుగుపెట్టారు. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి దేవరాజ్ ఆర్స్ ఇందిరాగాంధీకి పూర్తి అండగా నిలబడి తన నాయకురాలి రాజకీయ పునరుజ్జీవనానికి బాటలు వేసారు. సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత ఇందిరాగాంధీ మనవడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శృంగేరి మఠంలో బుధవారం అడుగు పెట్టనున్నారు. దాదాపు అదే పరిస్థితుల్లో... వేసవికాలం ఎండలకు సమాంతరంగా కర్ణాటకలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ బలగాలను మోహరిస్తున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ ఉపెన్నికల్లో దెబ్బతిన్న బీజీపీకి కర్ణాటక ఎన్నికల్లో పాగా వేయడం తక్షణ అవసరం. అలాగే నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా భావ సారూప్యత ఉన్నా లేకున్నా శత్రువు శత్రువులని కూడగట్టుకొని బీజేపీని చావుదెబ్బకొట్టి కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడం రాహుల్ గాంధీకి తక్షణ కర్తవ్యం. ఎన్నికలు కర్ణాటక విధానసౌధ కోసం అయినా.... నమో, రాగాలకు ఇవి 2019 ఎన్నికలకు ముందు ప్రతిష్టాత్మకమైనవే.. గణాంకాలు ఏమి చెప్పినా, కుల సమీకరణాలు ఎలా ఉన్నా అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి రెండు పార్టీలు సిద్ధంగా లేవు. గత అసెంబ్లీ ఎన్నికలకు (2013) ముందు కర్ణాటక జనతాపక్ష పార్టీ ఏర్పాటు చేసి 9.8 శాతం ఓట్లు 6 సీట్లు సాధించిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి సొంతగూటికికి చేరి బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తన అదృష్టాన్ని, పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 75 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విమర్శలు దాడి మొదలు పెట్టేసారు. ఫిబ్రవరి 4న జరిగిన బెంగుళూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ.. సిద్ద రామయ్య ప్రభుత్వ అవినీతిని ఉద్దేశించి ‘10 శాతం ప్రభుత్వం’ గా చిత్రీకరించారు. కర్ణాటకలో రాజకీయ హింస కాదు ... రాజకీయ తీవ్రవాదం రాజ్యమేలుతోందని దాడికి దిగారు. గత అయిదు సంవత్సరాల్లో 23 మంది బీజేపినాయకుల హత్యలు జరిగాయనేది ఆ పార్టీ ఆరోపణ. అదే సమయంలో గౌరీలంకేశ్ హత్యపై ప్రధాని మౌనం ఇబ్బంది కలిగించే అంశమే. ఫిబ్రవరి 4కి ఇప్పటికి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఉత్తరప్రదేశ్, బిహార్ ఎన్నికల్లో బీజీపీ చావు దెబ్బతినడం ఆ పార్టీ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ని ప్రచారస్త్రంగా వినియోగించుకోవాలన్నఎత్తుగడ విషయంలో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. యోగీ ముందు ఉత్తరప్రదేశ్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని సిద్దరామయ్య విమర్శల దాడి మొదలుపెట్టారు. బీజేపీ (2008–2013) హయాంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. అవినీతి ఆరోపణలు, కుమ్ములాటలు మత ఉద్రిక్తతలు ఆ పార్టీని చావు దెబ్బ తీసాయి. 2013 ఎన్నికల్లో అధికారం కోల్పోయి 40 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేవెగౌడ పార్టీ మూడోస్థానంతో సరిపెట్టుకొంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న సిద్దరామయ్య బలమైన నాయకుడిగా నిలదొక్కుకున్నారు. అయితే శాంతిభద్రతలు, అవినీతి ఆరోపణలు, రైతుల ఆత్మహత్యలు (ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు 4000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు గణాంకాలు చెపుతున్నాయి. సిద్ధరామయ్యకు ఇబ్బందికరమైన అంశాలు. బీజీపీ ఈ అంశాలనే ప్రచారాస్త్రాలుగా వాడుకొంటున్నాయి. ఇక 1985 తర్వాత ఏ పార్టీ కూడా కర్ణాటకలో రెండవసారి అధికారంలోకి రాలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయలేదు. దళితులు, వెనకబడిన తరగతులు, కురబలు, ముస్లింల ఓట్లపై కాంగ్రెస్ ఆధారపడుతూ వస్తోంది. లింగాయత్‌లు, బ్రాహ్మణులు బీజేపీ అండగా ఉంటోండగా మరో బలమైన పార్టీ జీజిఎస్ వక్కళిగల ఓటుబ్యాంక్‌పై నమ్మకాన్ని పెట్టుకున్నాయి. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మంట్ల వారీగా పరిశీలిస్తే బీజేపీ 132 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ 77 సీట్లలో మెజారిటీ సాధించగా, జేడీఎస్ 15 స్థానాలకే పరిమితమైంది. అయితే అప్పటి మోదీ హవా వేరు. గత సంవత్సర కాలంలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా బీజేపీ, దాని మిత్ర పక్షాలు తొమ్మిదిలో పాగా వేసాయి. పంజాబ్ మినహా.. దేశంలో 21 రాష్ట్రాల్లో కాషాయం జెండా రెపరెపలాడుతోంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా కల్పిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర జనాభాలో 17% లింగాయత్‌లు ఇప్పటివరకు బీజేపీకి మద్దతుగా ఉన్నారు. ఈ నిర్ణయం ఎంతవరకు కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే. ఎస్ . గోపీనాథ్‌రెడ్డి -
లింగాయత్‌లకు ప్రత్యేక మతమైనారిటీగా గుర్తింపు
-
ఆ వర్గం వారు.. ఇక ప్రత్యేక మతస్తులు!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్ సామాజికవర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. వారికి మత మైనారిటీ హోదా కల్పించాలన్న నాగమోహన్ దాస్ కమిటీ సిఫారసులను ఆమోదించాలని నిర్ణయించారు. ఈ మేరకు కర్ణాకట కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపింది. లింగాయత్‌లకు మాత్రమే ప్రత్యేక మతమైనారిటీ హోదా కల్పిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని వీరశైవ లింగాయత్ స్వాములు హెచ్చరించిన నేపథ్యంలో ఈ అసమ్మతిని చల్లార్చేందుకు లింగాయత్‌లో భాగంగా వీరశైవ లింగాయత్‌లను కూడా గుర్తించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 12వ శతాబ్దానికి చెందిన వీరశైవ మతస్థాపకుడు బవసన్న అనుచరులే లింగాయత్‌లు, వీరశైవ లింగాయత్‌లు. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 17శాతం మంది ఉన్నారు. వీరికి మత మైనారిటీ హోదా ఇవ్వాలన్న అంశం ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్దరామయ్య లింగాయత్‌ల డిమాండ్ నెరవేర్చాలని నిర్ణయించడం.. కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారుకు కలిసివస్తుందని భావిస్తున్నారు. -
సంతోషంలో రామయ్య.. యోగికి చురకలు
సాక్షి, బెంగళూరు : ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం కావడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య రెట్టింపు సంతోషంతో తన స్వరాన్ని పెంచారు. ట్విటర్ వేదికగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శల వర్షం కురిపించారు. 'ముందు ఉపన్యాసాలు తగ్గించుకోండి' అంటూ హితబోధ చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం నిర్వహించే బీజేపీ ప్రముఖుల్లో యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్న విషయం తెలిసిందే. 'ఒక సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలను బీజేపీ కోల్పోయింది. ఇప్పుడు బీజేపీ తీవ్ర అవమాన భారంతో బాధపడుతోంది. చరిత్రాత్మక విజయం సాధించిన సమాజ్‌వాది పార్టీ బీఎస్పీలకు నా అభినందనలు. బీజేపీయేతర పార్టీల ఐక్యత చాలా కీలక పాత్ర పోషించింది' అంటూ ఆయన ట్వీట్ చేశారు. అదే సమయంలో సీఎం ఆదిత్యనాథ్ కర్ణాటక అభివృద్ధిపై ఉపన్యాసాలు ఇవ్వడం తగ్గించుకుంటే ఆయనకే మంచిదంటూ చురకలంటించారు. ముందు ఆయన ఉండే చోటులో అభివృద్ధిని పట్టించుకోవాలన్నారు. త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు కర్ణాటకపై దృష్టిని సారించింది. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో విజయం అనంతరం ఇక తమ దృష్టి కర్ణాటకపై అని చెప్పింది. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికలు, పైగా దాదాపు 30 ఏళ్లుగా బీజేపీ ఆదిపత్యం కొనసాగిన చోట ఘోర ఓటమిని చవిచూడటంతో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. -
సిద్దరామయ్య రూటే సెపరేటు
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏడాది కాలంగా ప్రధాన ప్రతిపక్షం బీజేపీ జాతీయవాదానికి దీటుగా కన్నడ ఆత్మగౌరవానికి ప్రాధాన్యమిస్తూ సమరాంగణంలో సవాలు విసురుతున్నారు. కాషాయపక్షం వ్యూహాలకు దీటైన రీతిలో ఆయన జవాబిస్తున్నారు. బెంగళూరు మెట్రో రైల్ నమ్మ మెట్రో సైన్ బోర్డుల్లో హిందీ మాటలు తొలగించాలని కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు ఆయన కిందటేడాది లేఖ రాశారు. రాష్ట్రంలో కన్నడ భాష విషయంలో తమిళుల మాదిరిగా ఆత్మగౌరవం అంశాన్ని ముందుకు తెచ్చి మెజారిటీ కన్నడిగుల ఆదరణ సంపాదించాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన. దాదాపు 28 ఏళ్లు కాంగ్రెసేతర పార్టీల్లో కొనసాగినా 2006లో కాంగ్రెస్‌లో చేరిన ఏడేళ్లకే ముఖ్యమంత్రి పదవి చేపట్టడం సిద్దరామయ్య రాజకీయ ఎత్తుగడలకు, సామర్ధ్యానికి అద్దంపడుతోంది. కర్ణాటకకు ప్రత్యేక జెండా! అలాగే కన్నడిగుల ‘అస్మిత’, ఉనికిని చాటిచెప్పేలా సిద్దరామయ్య సర్కారు కర్ణాటకకు ప్రత్యేక జెండా ప్రతిపాదన చేసింది. ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులేవైనా ఉన్నాయా? అనే విషయం పరిశీలకు కిందటి డిసెంబర్లో నిపుణలతో ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ అందుకు పచ్చ జెండా చూపించాక ప్రభుత్వం జెండా రూపొందించింది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని 370 అధికరణ వల్ల జాతీయ పతాకంతో పాటు రాష్ట్ర జెండా ఎగురవేసే అవకాశం ఒక్క జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి మాత్రమే ఉంది. కన్నడిగుల స్వాభిమానానికి సంబంధించిన ఈ అంశంపై బీజేపీ ఎందుకు మాట్లాడదంటూ సిద్దరామయ్య ప్రశ్నించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. వీరశైవులకు ప్రత్యేక మతంగా గుర్తింపు! రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాల్లో పెద్దదైన లింగాయత్‌లను(జనాభాలో 10 శాతం) కాంగ్రెస్‌వైపు మళ్లించడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాలు ఉత్తర కర్ణాటకలో సంచలనం సృష్టించాయి. లింగాయత్లందరూ ఏకాభిప్రాయంతో తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని కోరితే, తాను ఈ కోర్కె తీర్చాలని కేంద్రానికి సిఫార్సు చేస్తానని సిద్ధరామయ్య హామీ ఇవ్వడంతో ఈ సామాజికవర్గంలో కదలిక మొదలైంది. లింగాయత్‌లు మరో వ్యవసాయాధార సామాజికవర్గం వొక్కళిగలతో పాటు వెనుకబడిన వర్గాల(ఓబీసీ) జాబితాలో ఉన్నారు. అయితే, తాము హిందూ సమాజంలో అంతర్భాగం కాదని, తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని లింగాయత్‌లలో కొందరు చాలా ఏళ్ల క్రితమే డిమాండ్‌చేశారు. ఉత్తర కర్ణాటకలో ఇటీవల వరుసగా అనేకచోట్ల ఈ డిమాండ్‌పై వేలాది మందిని సమీకరించి సమావేశాలు నిర్వహించారు. తొలుత వీరశైవులు, లింగాయత్‌లు అనే రెండు వర్గాలుగా ఉన్న జనం ఇటీవల లింగాయత్‌లనే పేరుతో కలిసిపోయారు. చివరి కాంగ్రెస్ లింగాయత్ ముఖ్యమంత్రి వీరేంద్రపాటిల్‌ను పదవిలో ఏడాది కూడా పూర్తి చేయకుండానే 1990లో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం తొలగించింది. అప్పటి నుంచీ ఈ సామాజికవర్గం నెమ్మదినెమ్మదిగా బీజేపీకి దగ్గరవుతూ వస్తోందని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. బీజేపీ మాజీ సీఎంలు బీఎస్ యెడ్యూరప్ప, జగదీశ్ షెట్టర్లు లింగాయత్‌లే. లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తించాలని నిపుణుల కమిటీ ఇటీవల సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును రాష్ట్ర కేబినెట్వెంటనే ఆమోదించి కేంద్రానికి పంపాలని కోరుతూ ఇటీవల లింగాయత్‌లు అధిక సంఖ్యలో ఉండే కలబురగిలో జగతిక లింగాయత మహాసభ నిరవధిక ప్రదర్శన ప్రారంభించింది. ఈ సిఫార్సును అంగీకరించేదిలేదని బీజేపీ నేత యెడ్యూరప్ప ప్రకటించారు. మహదాయి జలాలపై వివాదం వాయవ్య కర్ణాటకలో ఎప్పుడూ మంచినీటి కొరత ఎదర్కునే బెళగావి, విజయపుర సహా ఆరు జిల్లాల అవసరాలు తీర్చడానికి మహదాయి నది నుంచి 7.56 శతకోటి ఘనపుటడుగుల నీటిని తరలించడానికి ఉపనదులైన కలస, బందూరిలను అనుసంధానం చేయాలన్న 16 ఏళ్ల నాటి డిమాండ్‌ను ఇప్పుడు సిద్దరామయ్య మళ్లీ తెరపైకి తెచ్చారు. గోవాలో మాండోవిగా పిలిచే మహదాయి నీటి తరలింపునకు అక్కడి బీజేపీ సర్కారు సుముఖంగా లేకపోవడం బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఇబ్బందిగా మారింది. 2002లోనే కేంద్రంలోని ఏబీ వాజ్‌పేయి ప్రభుత్వం కర్ణాటక ప్రతిపాదనకు ఆమోదముద్రవేసింది. తమిళనాడుతో నిరంతరం వివాదాలకు కారణమైన కావేరీ జలాల పంపిణీ విషయంలో కూడా సిద్దరామయ్య కర్ణాటక ప్రయోజనాలు కాపాడుతున్నారనే ‘ఇమేజ్’ సంపాదించారు. భాషాభివృద్ధి నినాదంతో రాజకీయ జీవితం ప్రారంభం సోషలిస్ట్నేత రామ్‌మనోహర్‌లోహియా స్ఫూర్తితో సిద్దరామయ్య మొదట మాతృభాషాభివృద్ధికి కన్నడ కావలు సమితి అధ్యక్షునిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. ప్రస్తుత రూపంలో కర్ణాటకగా అవతరించడానికి ముందు బొంబాయి కర్ణాటక, హైదరాబాద్‌కర్ణాటక, మద్రాస్కర్ణాటక, మైసూరు అనే నాలుగు పాలనా విభాగాలుగా ఉన్న కారణంగా కన్నడిగులకు భాష విషయంలో స్వాభిమానం ఎక్కువ. అందుకే కన్నడిగులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఇటీవల కన్నడ రక్షణ వేదిక నుంచి వినతిపత్రం అందుకోవడానికి తన మంత్రివర్గసభ్యుడు ఎం.కృష్ణప్పను బెంగళూరులోని ఫ్రీడం పార్క్‌కు పంపించారు. కన్నడ అనుకూల వైఖరి అవలంబించడానికి కారణం కేవలం బీజేపీ అసలు స్వరూపం బయట పెట్టడమే కాదని, జేడీఎస్వంటి ప్రాంతీయపక్షాన్ని కట్టడి చేయడానికి కూడా అది ఉపకరిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆదిత్యనాథ్‌కు సలహా! కిందటేడాది కర్ణాటక పర్యటనకు వచ్చిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్రాష్ట్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు. వాటికి సిద్దరామయ్య ట్విటర్‌ద్వారా దీటైన జవాబు ఇచ్చారు. ‘‘ యూపీ సీఎంను మా రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాం. మీరు ఇక్కడ ఉండగా ఇందిరా క్యాంటీన్లు, రేషన్‌షాపులు చూడండి. అలా చేస్తే మీ రాష్ట్రంలోని ఆకలి చావులు నివారించవచ్చు’’ అని సిద్దరామయ్య ఘాటుగా సమాధానమిచ్చారు. అలాగే, కిందటి జనవరిలో మహదాయి జలాలను కర్ణాటక ప్రజలు దొంగచాటుగా వాడుకుంటున్నారంటూ గోవా నీటి వనరుల మంత్రి వినోద్పలియెంకర్విలేకరుల సమావేశంలో ఆరోపించిన సందర్భంలో కన్నడిగులను ‘హరామీ’ (ద్రోహులు)అని వర్ణించారు. అప్పుడు కూడా సిద్దరామయ్య గట్టిగా స్పందించి నదీ జలాలపై కన్నడిగులకున్న హక్కును తేల్చి చెప్పారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్)