తమిళనాడుకు కావేరి నదీ జలాలు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో కర్ణాటకలో మంగళవారం నిరసనలు మిన్నంటాయి. తమిళనాడుకు రోజుకు 15 వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు కావేరి నీటిని విడుదల చేయాలని సోమవారం కర్ణాటకను సుప్రీంకోర్టు ఆదేశించింది.దీంతో కావేరీ రాజకీయాలకు కేంద్రమైన మాండ్యా జిల్లా మంగళవారం భగ్గుమంది.