కావేరి నది జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు గురువారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో సమావేశం కానున్నారు. రేపు 11.30 గంటలకు సమావేశానికి హాజరు కావాలని తమిళనాడు సీఎం జయలలిత, తనకు ఉమాభారతి వర్తమానం పంపారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.ఈ నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు సీఎంలతో ఉమాభారతి సమావేశమవుతున్నారు. అయితే అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఈ భేటీకి హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. తన తరపున ఆమె ప్రతినిధుల బృందాన్ని పంపనున్నారని సమాచారం.
Published Thu, Sep 29 2016 7:42 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement