Uma Bharti
-
మహిళా రిజర్వేషన్ బిలుపై బీజేపీ నాయకురాలు అసంతృప్తి
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనంలో మొదటి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టిన బీజేపీ ప్రభుత్వం ఈసారి బిల్లు ఆమోదం పొందుతుందన్న ఆశాభావంతో ఉండగా సీనియర్ బీజేపీ నేత ఉమాభారతి బిల్లుపై అసంతృప్తిని వ్యక్తం చేసారు. బిల్లులో ఓబీసీ మహిళల ప్రస్తావన లేకవడం నిరాశ కలిగించిందన్నారు. ప్రధానికి లేఖ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహళలకు ముస్లిం మైనారిటీ మహిళలకు చోటు కల్పించకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు సీనియర్ బీజేపీ నేత ఉమాభారతి. ఈ సందర్బంగా ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎట్టకేలకు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది. కానీ బిల్లులో ఓబీసీల ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. నమ్మకం కోల్పోతాం.. మొత్తం 33 శాతం రిజర్వేషన్లలో సగం ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, వెనుకబడిన ముస్లిం మహిళలకు కేటాయించాలని కోరారు. లేదంటే వెనుకబడిన బీసీ ముస్లిం మహిళలలోనూ ఓబీసీ మహిళలలోనూ పార్టీ నమ్మకాన్ని కోల్పోతుందని అన్నారు. గతంలో హెచ్డి దేవెగౌడ ప్రభుత్వం ఇలాంటి బిల్లునే ప్రవేశ పెట్టగా అందులో కూడా తాను కొన్ని మార్పులు సూచించానని అటుపై ఆ బిల్లు స్టాండింగ్ కమిటీకి పంపించారని గుర్తు చేశారు. బిల్లు ఆమోదం పొందాలంటే.. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు సాకారం కావాలంటే రాజ్యాంగంలోని 239-ఏఏ, 330, 332, 334 అధికరణల సవరణ అవసరమని బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే జనగణన, డీలిమిటేషన్ తర్వాతే మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చాక పదిహేనేళ్ల పాటు అమలవుతుందని, తర్వాత ప్రత్యేక చట్టం ద్వారా చట్టాన్ని కొనసాగించాల్సి ఉంటుందని ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. ఇది కూడా చదవండి: రాజ్యాంగంలో ఆ 'రెండు' పదాలు మిస్సింగ్: అధిర్ రంజన్ చౌదరి -
బీజేపీ ఉమాభారతి సంచలన ప్రకటన
బోఫాల్: బీజేపీ ఫైర్‌బ్రాండ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి సంచలన ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్‌లో లిక్కర్ దుకాణాలను గో శాలల కింద మార్చేసే కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించారామె. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లిక్కర్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆమె శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్‌ను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే గడువు ముగిసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో.. ఇకపై గో శాలల కింద మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టానంటూ ప్రకటించారామె. మధ్యప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మద్యం కారణమని బలంగా నమ్ముతున్నారామె. ఈ క్రమంలో బోఫాల్ అయోధ్య నగర్‌లోని ఓ ఆలయం వద్దకు చేరుకుని(సమీపంలోని లిక్కర్ షాప్ ఉంది) నాలుగు రోజుల దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించాలన్న డిమాండ్‌తో ఆమె దీక్ష కొనసాగించారు. మంగళవారం ఆ దీక్ష ముగిసినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో ఆమె మధుశాలా మే గోశాల(లిక్కర్ దుకాణాల్లో గో శాల) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారామె. రాముడి పేరు చెప్పుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, అదే రాముడి గుడి దగ్గర్లో లిక్కర్ దుకాణాలు(ఓర్చా ప్రాంతంలో పరిస్థితిని ఉదాహరిస్తూ..) పెట్టడం ఎంత వరకు సమంజసం అని ఆమె మధ్యప్రదేశ్ సర్కార్‌ను నిలదీశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడం, మహిళలకు.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పించడం నిజమైన అభివృద్ధి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక.. పార్టీలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వర్గంపైనా ఆమె అసహనం వ్యక్తం చేశారు. మద్యం నిషేధంపై ఉద్యమించినంత మాత్రానా నాకు ప్రధాని పదవి దక్కుతుందా?.. ఇది చాలా విడ్డూరంగా ఉంది.. ఒక వర్గం ఇలా ప్రచారం చేయడం సరికాదు అని ఆమె వ్యాఖ్యానించారు. లిక్కర్ పాలసీ కోసం ఎదురు చూపులు ఉండబోవని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న లిక్కర్ షాపులను దగ్గరుండి తానే గోశాలలుగా మారుస్తానని ఆమె ప్రకటించారు. అలాంటి దుకాణాల బయట 11 ఆవుల్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే తన బృందానికి ఆదేశాలు జారీ చేశానని.. తనను ఆపే ధైర్యం ఎవరికి ఉందో చూస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారామె. ఈమధ్యే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన ఉమాభారతి.. లిక్కర్ పాలసీలో కొన్ని సవరణలు సూచిస్తూ.. కొత్త విధానం తేవాలని కోరారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు కూడా. అయితే.. ఆచరణలోనే అది కనిపించలేదు. ఈ పరిణామంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
వాజ్‌పేయికి ఆలయం
సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి తమిళనాడులో ఆలయం నిర్మించనున్నారు. మహాకవి భారతియార్ ముని మనవరాలు, బీజేపీ అగ్రనేత ఉమాభారతి కలిసి ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుకోటై జిల్లా వీరాలిమలై సమీçపంలో వాజ్‌పేయికి గుడి కట్టించాలని ఆయన అభిమానులు సంకల్పించారు. రూ.2 కోట్లతో 2,400 చదరపు అడుగుల్లో నిర్మాణ కమిటీ తెలిపింది. -
ఉమా భారతి: అధికారులున్నది చెప్పులు మోయడానికే!
భోపాల్: ప్రభుత్వాధికారులున్నది నాయకుల చెప్పులు మోయడానికేనంటూ కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.‘అధికారుల గురించి మీకేమీ తెలియదు. వారున్నది మా స్లిప్పర్లు మోయడానికే’ అని ఉమ వ్యాఖ్యానించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తన వ్యాఖ్యలపై ఆ తర్వాత ఉమా స్పందించారు. ఓబీసీ నేతలతో పిచ్చాపాటీ మాటల్లో ఈ వ్యాఖ్యలు చేశానని , నిజానికి తాను అధికారులను వెనుకేసుకొచ్చానని సమర్ధించుకున్నారు. నిజాయతీ ఉన్న అధికారులు బలమైన నాయకులకు మద్దతుగా ఉంటారన్నారు. అయితే తన భావన మంచిదైనా, వాడిన భాష బాగోనందున విచారిస్తున్నానని వివరించారు. -
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు..
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీలో అంతర్గత రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు సందర్భోచితంగా బహిర్గతమవుతుంటాయి. పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీ వంటి మహిళానేతను ధీటుగా ఎదుర్కొని దేశవ్యాప్తంగా తమ సత్తా చాటుకోవాలని ఉవ్విళూరుతున్న కమలదళ పెద్దలకు, సొంత పార్టీలోని ఇతర రాష్ట్రాల మహిళానేతల ప్రణాళికలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత అధిష్టాన నిర్ణయాలతో రాజస్తాన్ రాజకీయాల్లో నిశ్శబ్దంగా ఉన్న వసుంధరా రాజే మరోసారి యాక్టివ్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నారు. రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ గడువు ఉన్నప్పటికీ పార్టీలో మరోసారి తన పట్టును పెంచుకొనేందుకు, తన బలాన్ని హైకమాండ్ ముందు నిరూపించుకొనేందుకు వసుంధరారాజే ఏ అవకాశాన్ని వదులుకొనేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. అందులో భాగంగానే మార్చి 8న తన పుట్టినరోజున రాష్ట్రవ్యాప్తంగా దేవ్ దర్శన్ యాత్రను ప్రారంభించి తమ బలాన్ని నిరూపించుకోవాలని వసుంధరా రాజే సింధియా వర్గం నిర్ణయించింది. దీంతో రాబోయే రోజుల్లో రాజస్తాన్ బీజేపీలో పైచేయి సాధించే గొడవ తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మౌన ముద్రలో వసుంధర.. ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వైఫల్యానికి మాజీ సీఎం వసుంధరారాజేపై విధేయత కారణంగా జిల్లాల్లో పార్టీకి సమాంతరంగా పార్టీ యూనిట్లు పనిచేయడమే కారణమని పలువురు బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు జరిగిన 90 మున్సిపల్‌ల్లో బీజేపీ 38 గెలుచుకోగా, అధికార కాంగ్రెస్ పార్టీ 50 గెలుచుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వసుంధరా రాజేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆమె వర్గం నాయకులు అధిష్టాన పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. 2019లో కమలదళం అధిష్టానం వసుంధరా రాజే అనుయాయులను పక్కనబెట్టి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సతీష్ పూనియాను నియమించడంతో పాటు, రాష్ట్ర నాయకులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘవాల్, కైలాష్ చౌదరి వంటి వారికి కేంద్ర ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత కల్పించినప్పటి నుంచి ఆమె మౌనముద్రలో ఉన్నారు. గతేడాది జూలైలో సీఎం గహ్లోత్‌కు వ్యతిరేకంగా సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభ సమయంలోనూ ఆమె మౌనంగా ఉన్న కారణంగా కమలదళం ఆ సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంతో పూర్తిగా విఫలమైంది. కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాజే మద్దతుదారులు ఇప్పుడు ఆమె మళ్ళీ అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవడంలో ముందుండాలని కోరుకుంటున్నారు. గత ఆదివారం వసుంధరా రాజేకు గట్టి పట్టున్న కోటాలో జరిగిన ఒక అంతర్గత సమావేశానికి సింధియా వర్గ బీజేపీ ఎమ్మెల్యేలు హాజరై, 2023 ఎన్నికల్లో ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించేలా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అధికార గహ్లోత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పార్టీని పునరుద్ధరించే సామర్థ్యం, ఛరిష్మా ఉన్న లీడర్ కేవలం వసుంధరా రాజే అని ఆమె వర్గ ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. ఏప్రిల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ర్యాలీని నిర్వహించాలని, ఆ ర్యాలీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజే మౌనంగా ఉన్న కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగిందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. మార్చి 8న ప్రారంభమయ్యే గోవర్ధన్ యాత్ర కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే యూనుస్ ఖాన్ సమన్వయం చేస్తారని రాజే వర్గం తెలిపింది. రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో దక్కని ప్రాధాన్యత.. సతీష్ పునియాను రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం నియమించిన తర్వాత పార్టీలో అంతర్గత సమస్యలు బహిర్గతం అవుతున్నాయి. రాజే మనస్తత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు అధికార పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం ఇష్టపడదని, అధిష్టాన పెద్దలతో సఖ్యత లోపించినకారణంగా అంతర్గతంగా పరిస్థితులు సర్దుకోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీలోని అంతర్గత సమస్యల కారణంగా రాజేను అధిష్టానం పక్కనబెట్టినప్పటికీ, రాష్ట్రంలో గహ్లోత్‌ను ఎదుర్కోగలిగి, ఓడించగలిగే బలమైన నాయకులు ఎవరూలేరనే అంశాన్ని అధిష్టానం అంగీకరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. కమలదళం పెద్దలతో వసుంధరా రాజేకు మధ్య ఏమాత్రం సత్సంబంధాలు లేని కారణంగా ఇటీవల ఏర్పాటైన రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో ఆమె వర్గానికి ఏమాత్రం ప్రాధాన్యత దక్కలేదు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి సహా రాజే సన్నిహితులు అనేకమందిని పక్కనబెట్టి కేవలం 14మందికి మాత్రమే అవకాశం కల్పించడాన్ని సింధియా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అయితే 2012, 2018ల్లో జరిగిన పరిణామాల సమయంలో అధిష్టానంపై పైచేయి సాధించిన పరిస్థితులు ప్రస్తుతం లేవన్న విషయాన్ని వసుంధరా రాజే అర్థంచేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మద్య నిషేధాన్ని కోరుతూ ప్రచార యాత్ర మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సొంత పార్టీ ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకొని పార్టీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి రంగంలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి మద్యపాన నిషేధం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె మార్చి 8న ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో కమలదళ పెద్దలకు మరో తలనొప్పి ఎదురుకానుంది. ఇప్పటికే మద్యపాన నిషేధం విషయంలో నిర్ణయం తీసుకోకపోవటంపై సొంత పార్టీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై ఆమె ఆరోపణలు చేశారు. మరోవైపు గత నెల 21న పార్టీ పాలిత అన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమాభారతి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లో జరిగిన విపత్తు నేపథ్యంలో కేంద్రప్రభుత్వ విధానాలపై నేరుగా దాడి చేశారు. మోదీ ప్రభుత్వ మొదటి పదవీకాలంలో జల వనరులు, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ మంత్రిగా గంగానది, దాని ప్రధాన ఉపనదులపై విద్యుత్ ప్రాజెక్టులను తాను వ్యతిరేకించారని ఉమాభారతి ఇటీవల వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ హైకమాండ్‌కు సవాలు విసురుతూ ఆమె రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధ అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, పార్టీ అధిష్టానం తనను పక్కనపెట్టేయడాన్ని ఉమాభారతి జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఉమా భారతికి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఉమాభారతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమె ఈ విషయాన్ని స్వయంగా శనివారం అర్ధరాత్రి ట్విటర్లో పోస్ట్ చేశారు. గత మూడు రోజులగా జ్వరంతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల హిమాలయాలకు వెళ్లినపుడు సామాజిక దూరం సహా.. కోవిడ్ నిబంధనలను పాటించినప్పటికీ కరోనా వైరస్ సోకింది అని చెప్పారు. గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు. (అయోధ్యకు వెళ్తా.. అక్కడికి మాత్రం వెళ్లను) ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'నేను ప్రస్తుతం హరిద్వార్, రిషికేశ్ మధ్య ఉన్న వందేమాతరం కుంజ్ వద్ద క్వారంటైన్లో ఉన్నాను. నాలుగు రోజుల తర్వాత మరోసారి కోవిడ్ పరీక్ష చేయించుకుంటాను. పరిస్థితి ఇలాగే ఉంటే వైద్యులను సంప్రదిస్తాను' అంటూ ట్వీట్ చేసింది. (60 లక్షలకు చేరువలో కరోనా కేసులు) -
అయోధ్యకు వెళ్తా.. అక్కడికి మాత్రం వెళ్లను
న్యూఢిల్లీ: ఆగస్టు 5న అయోధ్యలో జరిగే రామ మందిర పునాది కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి అయోధ్యకు చెందిన రామ్ జన్మభూమి న్యాస్, ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. 'కరోనా వైరస్ మహమ్మారి మధ్య అయోధ్యలో జరిగే కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఇతరుల ఆరోగ్యం గురించి తాను ఆందోళన చెందుతున్నానంటూ' ఉమాభారతి ట్వీట్ చేశారు. (150 నదుల జలాలతో అయోధ్యకు..) కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీకి చెందిన మరికొందరు ముఖ్యనేతలకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన వార్తలు విన్న తర్వాత ఆమె ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అయితే భోపాల్ నుంచి యూపీకి రైళ్లో వెళ్తానని అనేక మంది ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని సరయూ నది తీరంలోనే ఉంటానని.. భూమిపూజ జరిగిన చోటు నుంచి అందరూ వెళ్లిపోయిన తర్వాత భూమిపూజ స్థలానికి వెళ్తానని ఆమె స్పష్టం చేశారు. -
అద్వానీ, జోషిలకు అందని ఆహ్వానం
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆగస్టు 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగనుంది. అందుకోసం ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. కేవలం 150 మంది అతిథులు సహా 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించింది. రామ మందిరం అనగానే మొదటగా మనకు గుర్తొచ్చే పేర్లలో మొదటి వరుసలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కళ్యాణ్‌సింగ్ ఉంటారు. వీరి ఆధ్వర్యంలో అయోధ్యలో రామమందిరం కట్టాలన్న డిమాండ్‌తో 1990లో అద్వానీ చేపట్టిన రథయాత్ర బీజేపీని మరింత ఎత్తున నిలబెట్టాయి. అయితే రామమందిర భూమి పూజ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నాయకులు ఎల్కే అద్వానీ, ఎమ్ఎమ్ జోషిలకు ఆహ్వానం అందకపోగా.. మాజీ కేంద్రమంత్రి ఉమాభారతి, మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్‌లకు మాత్రమే ఆహ్వానం అందింది. ఈ వివాదంలో ఈ ఇద్దరు నేతలు సీబీఐ విచారణను సైతం ఎదుర్కొన్నారు. బాబ్రీ మసీదు వివాదంలో వీరంతా కోర్టు ముందు కూడా హాజరయ్యారు. అటువంటి అగ్రశ్రేణి నాయకులకు ఆగస్టు 5న జరిగే రామ మందిరం శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. ఇప్పటివరకు రూపొందించిన షెడ్యూల్‌లోకానీ, వేదికపై కూర్చొనే ఆహ్వానితుల జాబితాలో కానీ వారి పేర్లు ఎక్కడా కనిపించలేదు. -
‘ఉరి తీసినా ఆశీర్వాదంగానే భావిస్తాను’
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు గురించి తనకు ఎలాంటి పట్టింపు లేదన్నారు బీజేపీ నాయకురాలు ఉమా భారతి. తీర్పు ఎలా ఉన్నా.. దాన్ని అంగీకరిస్తానని ఆమె తెలిపారు. ఈ కేసులో కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకులలో ఉమా భారతి, ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉమా భారతి మాట్లాడుతూ.. ‘నా స్టేట్మెంట్ కోసం కోర్టు నన్ను పిలిచింది. నిజం ఏంటో కోర్టుకు వెల్లడించాను. ఇక తీర్పు ఎలా వస్తుంది అనే దాని గురించి నాకు చింత లేదు. ఒక వేళ నన్ను ఉరి తీయాలనుకున్నా.. దాన్ని కూడా నేను ఆశీర్వాదంగానే భావిస్తాను. నా స్వస్థలంలో కూడా ఎంతో ఆనందిస్తారు’ అని తెలిపారు. (5 శతాబ్దాల సమస్య!) ఉమా భారతి ఈ నెల ప్రారంభంలో లక్నోలోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రముఖ బీజేపీ నాయకుడు ఎల్కే అడ్వాణీ (92) శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుకాగా.. మురళీ మనోహర్ జోషి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సీబీఐ కోర్టు, రోజువారీ విచారణల ద్వారా, దర్యాప్తును పూర్తి చేసి, ఆగస్టు 31 లోగా తన తీర్పును ఇవ్వాలి.(బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు) రామ మందిరం నిర్మాణం గురించి శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ఉమా భారతి స్పందించారు. ‘కరోనా, మందిర నిర్మాణం ఈ రెండు అంశాలకు అసలు ఎలాంటి సంబంధం లేదు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వీరితో ఎలాంటి సంబధం లేని ట్రస్ట్ ఆలయ నిర్మాణం చేపడుతోంది. పవార్ వ్యాఖ్యలు వ్యతిరేక అర్థాన్ని సూచిస్తాయి. ఎలాంటి గొడవ జరగకుండా మందిర నిర్మాణం జరగడం వారికి నచ్చడం లేదు. ఆ ఆందోళనలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీ జీ అయోధ్యలో ఉన్నప్పుడు పవార్ జీ.. ‘జై శ్రీరామ్.. జై రామ్’ అని పాడాలని నేను కోరుకుంటున్నాను’ అన్నారు ఉమా భారతి. -
‘మతం ఆధారంగా దేశాన్ని విభజిస్తున్నారు’
న్యూఢిలీ: కాంగ్రెస్ పార్టీ మతం ఆధారంగా దేశాన్ని విభజిస్తుందని బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి విమర్శించారు. ఉమాభారతి గురువారం ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1984లో జరిగిన సిక్కుల మారణకాండలో కాంగ్రెస్ పాత్ర ఉందని ఆరోపించింది. అయితే కాంగ్రెస్ చెబుతున్నట్లు సెక్యూలరిజమ్ వల్ల దేశంలో ఎలాంటి ఉపాధి కల్పన జరగలేదని తెలిపారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ అయోద్య పర్యటనను రాజకీయం చేయడం తగదని, ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఆర్టికల్ 370పై సుప్రీం కోర్టు తీర్పుతో దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొందని, అయితే కాంగ్రెస్ పార్టీకి దేశం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదని పేర్కొన్నారు. ఇటీవల శివసేన అధినేత శరద్ పవార్ మోదీపై పరోక్ష విమర్శలు చేశారు. దేవాలయాలు కట్టినంత మాత్రాన కరోనా నియంత్రణ కాదని మోదీని ఉద్దేశించి పవార్ విమర్శించిన విషయం తెలిసిందే. (చదవండి: యువ నేతలను రాహుల్ ఎదగనీయడం లేదు: ఉమా భారతి) -
‘గాంధీ’ అంటే మహాత్మ గాంధీ కాదు..
ముంబై : కేంద్ర మంత్రి ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ.. వారి ఇంటి పేరులోని ‘గాంధీ’.. ‘మహత్మా గాంధీ’ని సూచించదు.. ‘ఫిరోజ్ గాంధీ’ని సూచిస్తుందని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భర్త పేరు ఫిరోజ్ గాంధీ అని అందరికి తెలిసిన సంగతే. అయితే నెహ్రూకు, ఫిరోజ్‌కు మధ్య అంత మంచి సంబంధాలు ఉండేవి కావనే విషయం కూడా విదితమే. మధ్యప్రదేశ్ విదిశలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఉమాభారతి.. ‘మన మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తనను తాను రాజా అని చెప్పుకుంటారు. కానీ సోనియా గాంధీ ఇంటి బయట క్యూలో నిల్చుంటారు. దత్ తివారి.. సంజయ్ గాంధీ చెప్పులు మొసుకొచ్చేవారు. పెద్ద పెద్ద నాయకులు సైతం ఇందిరా గాంధీ ముందు చేతులు జోడించి నిల్చునేవారు. వారి కుటుంబానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే.. వారి పేరు చివర ‘గాంధీ’ అని తగిలించుకున్నారు. అయితే ఇక్కడ ‘గాంధీ’ అంటే ‘జాతిపిత’.. మహాత్మ గాంధీ కాదు.. ‘ఫిరోజ్ గాంధీ’’ అని ఉమా భారతి తెలిపారు. అంతేకాక ‘‘గాంధీ’ అనే ఇంటి పేరును వాడుకునే హక్కు ఆ కుటుంబానికి లేదు. అయినా వాడుకుంటున్నారు. ఎందుకంటే ‘గాంధీ’ అనే ఇంటి పేరు వారికి గౌరవాన్ని కల్గిస్తుందని తెలుసు. అందుకే ఆ పేరును వాడుకుంటున్నారు. కానీ ఆయన ఆదర్శాలను మాత్రం పాటించరు. మహాత్మ గాంధీ అడుగుజాడల్లో నడిచే ఏకైక వ్యక్తి మోదీ మాత్రమే’ అని ఆమె స్పష్టం చేశారు. అంతేకాక ‘కాంగ్రెస్ నాయకులు మేము తమను అధికారంలోంచి దించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నామా.. అధికారంలో ఉన్నామా అనే దాని గురించి మా పార్టీ పట్టించుకోదు. ప్రజలకు మేలు చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తుంద’ని చెప్పుకొచ్చారు. ప్రజలే ఈ ప్రభుత్వాన్ని కులుస్తారని ఉమా భారతి పేర్కొన్నారు. -
‘ఆమెను ఓ దొంగ భార్యను చూసినట్లే చూస్తారు’
రాయ్‌పూర్ : ప్రజలు ఓ దొంగ భార్యను ఎలా చూస్తారో.. ప్రియాంక గాంధీని కూడా అలానే చూస్తారంటూ కేంద్ర మంత్రి ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె పలు విషయాల గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఉమా భారతి స్పందిస్తూ.. దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రభావం ఏ మేరకు ఉండబోతుందని ఓ విలేకరి ఆమెను ప్రశ్నించగా.. ‘ఏమి ఉండదు. ఆమె భర్త మీద దొంగతనం అభియోగం ఉంది. అలాంటప్పుడు ఆమె వల్ల ఏం ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఓ దొంగ భార్యను ఎలా చూస్తారో.. ప్రియాంకను కూడా అలానే చూస్తార’ని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. ఓడిపోతానని తెలిసే అతను అమేథీ, వయనాడ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్.. జయప్రదను ఉద్దేశిస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఉమా భారతి.. ఈసీ ఆజం ఖాన్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. అంతేకాక దేవుడి పేరును ఉచ్ఛరించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అలాంటిది మహిళను కించపర్చిన ఆజం ఖాన్ మీద ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేయాలని కోరారు. -
ఎన్నికల్లో పోటీ చేయను.. కానీ..
లక్నో : ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కేంద్ర మంత్రి ఉమాభారతి పునరుద్ఘాటించారు. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు శనివారం ఆమె లేఖ రాశారు. ఈ సందర్భంగా... ‘ ముందు చెప్పినట్లుగానే నేను 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయితే అధిష్టానం కోరిన సమయంలో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గంగా నదీ కాలుష్య ప్రక్షాళనలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాను. అందుకే అమిత్‌షాకు లేఖ రాశాను. అయితే రాజకీయాల్లో తప్పకుండా కొనసాగుతాను’ అని ఉమాభారతి ట్వీట్ చేశారు. ఇక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా వచ్చే ఎన్నికల్లో తాను నిలబడటం లేదని, ఆరోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తోందని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖా మంత్రిగా ఉన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం తమ లక్ష్యమని చెప్పే ఆమె కరుడుగట్టిన హిందుత్వవాదిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో బాబ్రీ మసీదు కూల్చివేతలో ఉమాభారతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2017లో సీబీఐ కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. प्रिय मित्र, जैसा कि मैंने पूर्व में घोषित भी किया था, उसी को पुन: दोहराते हुए अपनी पार्टी के राष्ट्रीय अध्यक्ष श्रीमान @AmitShah जी को पत्र लिखकर चुनाव नहीं लड़ने का अनुरोध दोहराया है, ताकि पार्टी आधिकारिक तौर पर इसकी घोषणा कर दे। — Uma Bharti (@umasribharti) March 16, 2019 -
స్త్రీలోక సంచారం
భారతీయ సంతతి అమెరికన్ సెనెటర్ కమలాహ్యారిస్ 2020లో జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసేదీ లేనిదీ ఒకటీ రెండు రోజుల్లో తేలిపోనుంది. ఏదైనా తన కుటుంబ నిర్ణయం ప్రకారం జరుగుతుందని ‘మాణింగ్ జో’ అనే టీవీ కార్యక్రమంలో కమల వెల్లడించారు. 54 ఏళ్ల కమలకు డెమొక్రటిక్ పార్టీలో ప్రత్యేకమైన ఇమేజ్‌తో పాటు, ప్రజాదరణ కూడా ఉంది. కమల కాలిఫోర్నియాలో జన్మించారు. ఆమె తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ చెన్నై నుంచి 1960లో అమెరికా వలస వచ్చారు. కమల తండ్రి జమైకన్ ఆఫ్రికన్. ఒమాబా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సెనెట్‌లో ఆమెనంతా ‘ఫిమేల్ ఒబామా’ అనేవారు. హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలు కాలేజ్‌కి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు రోడ్డు మీద అబ్బాయిలతో మాట్లాడకూడదని ఒడిశాలోని వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (వి.ఎస్.ఎస్. యు.టి.) లోని ఐదు గర్ల్స్ హాస్టళ్లలో ఒకటైన ‘రోహిణి హాల్ ఆఫ్ రెసిడెన్స్’ ఆంక్షలు విధించింది! ‘గౌరవనీయులైన వైస్ చాన్స్‌లర్ సూచనల మేరకు.. రోహిణి హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలు రోడ్డు మీద అబ్బాయిలతో మాట్లాడ్డం నిషేధించడమైనది కనుక, నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకోబడుతుంది’ అని డిసెంబర్ 1న హాస్టల్ నోటీస్ జారీ చేసింది. హాస్టల్ వార్డెన్ సంతకం చేసిన ఆ నోటీసును హాస్టల్ బోర్డులో పెట్టడంతో పాటు నోటీస్ కాపీలను స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్‌కు, వైస్ చాన్స్‌లర్ పి.ఎ.కు పంపించారు. విద్యార్థినుల రక్షణ కోసమే ఈ విధమైన ఆంక్షలు విధించవలసి వచ్చినట్లు యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ ఇన్చార్జి ప్రొఫెసర్ సి.సి. స్వెయిన్ వివరణ ఇచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని మరో కేంద్ర మంత్రి (కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖలు) ఉమా భారతి వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాజకీయాల నుంచి బయటికి వచ్చేసి పూర్తి ఆధ్యాత్మిక జీవితం గడపడంలో భాగంగా తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ఆమె తెలిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, గంగా నదీ కాలుష్య ప్రక్షాళనలో పాలు పంచుకోవాలని ఉందని కూడా ఆమె అన్నారు. రెండు వారాల క్రితం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా వచ్చే ఎన్నికల్లో తాను నిలబడటం లేదని, ఆరోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవలసి వస్తోందనీ ప్రకటించారు. గర్భంతో ఉన్నప్పుడు తల్లులు వాడే టూత్పేస్ట్లు, మేకప్ క్రీములు, సబ్బులు, ఇతర వ్యక్తిగత సంరక్షణ లేపనాలు, పౌడర్లలోని రసాయనాల వల్ల.. వారికి పుట్టే ఆడ శిశువులు సమయానికన్నా ముందే యవ్వనదశకు (ప్యూబర్టీ) చేరుకునే ప్రమాదం ఉన్నట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఆ రసాయనాలలోని డీథిల్ ఫాలేట్, ట్రైక్లోజన్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్ల ప్రభావమే ఇందుకు కారణమని వారు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ మహిళల జాతీయ ఫుట్‌బాల్ టీమ్‌లోని క్రీడాకారిణులను ఆ దేశ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సహా అధికారులు కొందరు లైంగికంగా వేధించి, వారిని లోబరుచుకున్నట్లు ‘గార్డియన్’ పత్రికలో వచ్చిన సంచలనాత్మక కథనంలోని ఆరోపణలపై తక్షణం విచారణ జరపాలని ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఆదేశించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన అత్యున్నతస్థాయి అధికారుల బెదిరింపులకు భయపడి దేశం వదిలి పారిపోయిన నేషనల్ ఫుట్‌బాల్ టీమ్ మాజీ కెప్టెన్ ఖలీదా పోవల్ను ఉటంకిస్తూ గార్డియన్ ఈ వార్తా కథనాన్ని కొన్ని రోజుల క్రితమే ప్రచురించింది. -
దళితులు నా ఇంట్లో భోజనం చేస్తే..
సాక్షి, న్యూఢిల్లీ : దళితుల ఇళ్లకు వెళ్లి.. వారితో భోజనం చేసినంత మాత్రాన తాము పవిత్రులం కాబోమని, అదే దళితులను తన ఇంటికి ఆహ్వానించి.. వారికి తన స్వహాస్తాలతో భోజనం వడ్డించినప్పుడే.. పవిత్ర భావం కలుగుతుందని కేంద్రమంత్రి ఉమాభారతి తెలిపారు. మధ్యప్రదేశ్ నౌగావ్‌లోని గాధ్మౌవ్ గ్రామంలో ఆమె సామాజిక సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, దళితుల ఇంటికి వెళ్లి.. వారితో భోజనం చేసినంత మాత్రాన దళితులకు గౌరవం లభించడంగానీ, సామాజిక సామరస్యం ఏర్పడటంగానీ జరగదని ఆమె అన్నారు. ‘ నేను వెళ్లి దళితుల ఇళ్లలో భోజనం చేసినంతమాత్రాన వారు పవిత్రులు అవ్వడానికి నేనేమీ రాముడ్ని కాదు. అందుకు బదులు నేనే దళితులను నా ఇంటికి పిలిచి.. వారికి స్వయంగా భోజనం వడ్డించినప్పుడు.. అది నన్ను పవిత్రురాలిని చేస్తుంది’ అని ఆమె అన్నారు. ‘నన్ను నేను శ్రీరాముడినని భావించుకోను. అందుకే సామాజిక సామూహిక భోజనాల్లో నేను పాల్గొనను’ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ.. ఆమె దళితులతో కలిసి భోజనం చేయలేదు. వేరే ప్రభుత్వ కార్యక్రమాలు ఉండటంతో త్వరగా వెళ్లాల్సి వచ్చిందని, అందుకే భోజనంలో పాలుపంచుకోలేదని ఆమె తర్వాత వివరణ ఇచ్చారు. ‘దళితులను అంటరానివారిగా చూసే రోజులు.. వారితో కలిసి భోజనం చేస్తే.. వారు ఆనందపడి.. స్వాధికారిత వస్తుందనుకునే రోజులు పోయాయి. దళితులు ఇప్పుడు ఆర్థిక, సామాజిక సావలంబన కోరుకుంటున్నారు. ప్రభుత్వ, పరిపాలనలో భాగం కోసం తపిస్తున్నారు’ అని ఆమె తెలిపారు. -
‘హీరోయిన్ను చంపితే రూ.5 కోట్లు ఇస్తాం’
సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన ’పద్మావతి‘ చిత్రం విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ వివాదాలు, విమర్శలు తీవ్రమవుతున్నయి. పద్మావతి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన దీపికా పదుకునే ముక్కు కోస్తామని కొందరు అంటుంటే.. ఆమెను చంపితే రూ. 5 కోట్లు ఇస్తామని మరో సంస్థ ప్రకటించింది. పద్మావతి చిత్రంపై ఎవరూ ఊహించని స్థాయిలో కర్ణిసేన ప్రతిస్పందిస్తోంది. సినిమా విడుదలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని సంస్థ తేల్చి చెప్పింది. సంజయ్‌లీలా భన్సాలీ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని కర్ణిసేన ఆరోపించింది. సినిమా విడుదల ఆపకపోతే దీపిక ముక్కు కత్తిరిస్తామని కర్ణిసేన బహిరంగంగా ప్రకటించింది. థియేటర్లను ధ్వంసం చేస్తామని స్పష్టం చేసింది. మరికొందరు మాత్రం దీపికను చంపితే రూ. 5 కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఆదిత్యనాథ్ లేఖ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న పద్మావతి చిత్రాన్ని నిలపాలని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ చిత్రం విడుదలను ఆపకపోతే.. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని ఆదిత్యనాథ్ కేంద్రానికి తెలిపారు. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని సెన్సార్ బోర్డు వ్యహరించాలని యూపీ ప్రభుత్వం కోరింది. ఇదిలా ఉండగా.. పద్మావతి చిత్ర వివాదంపై జోక్యం చేసుకోలేమని కేంద్రం స్పష్టం చేసింది. అదే సమయంలో శాంతి భద్రతల విషయాన్ని రాష్ట్రాలే చూసుకోవాలని కేంద్రం తెలిపింది. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీకి, నాయిక దీపికా పదుకునేకు తగినంత భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీపికకు ఉమాభారతి అండ పద్మావతి చిత్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై కేంద్ర మంత్రి ఉమాభారతి మండిపడ్డారు. భన్సాలీ హిందువుల ఆత్మస్థైర్యాన్ని రాజపుత్రుల సెంటిమెంట్లను అవమానిస్తున్నారని అన్నారు. అదే సమయంలో దీపికపై వస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోలేం : సుప్రీం కోర్టు పద్మావతి చిత్రంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టిస్టులకు తమ అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా.. సినిమా పరిశ్రమను భయపెట్టడం, బెదిరించడం, దాడులకు పాల్పడడం కల్చరల్ టెర్రరిజం కిందకు వస్తుందని ఐఎఫ్‌టీడీ అధ్యక్షుడు అశోక్ పండిట్ వ్యాఖ్యానించారు. 4. The director and his associate as the scriptwriter of #Padmavati are responsible for its story. They should have taken care of the sentiments and the historical facts. — Uma Bharti (@umasribharti) November 16, 2017 -
పద్మావతి వివాదంపై స్పందించిన ఉమా భారతి
-
పద్మావతి వివాదం.. చూస్తూ ఊరుకోను!
జైపూర్ : పద్మావతి చిత్ర వివాదంపై కేంద్ర మంత్రి ఉమా భారతి స్పందించారు. అభ్యంతరాలు లేవనెత్తున్న వారికి ఈ చిత్రాన్ని ప్రదర్శించి చూపాలని పద్మావతి చిత్ర మేకర్లను ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆమె తన ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు. ‘‘ఈ విషయంపై నేను మౌనంగా చూస్తూ ఉండలేను. తమ మనోభావాలు దెబ్బతినేలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ కొందరు వాదిస్తున్నారు. చరిత్రకారులు, చిత్ర నిర్మాతలు, నిరసనకారులు, సెన్సార్ బోర్డు వీరందరితో కలిపి ఓ కమిటీని నియమిస్తే సమస్య పరిష్కారం అవుతుంది కదా’’ అని అర్థం వచ్చేలా ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో మహిళల గౌరవాన్ని దెబ్బతీసే యత్నం జరగకూడదని ఉమా భారతి అభిప్రాయపడ్డారు. रानी पद्मावती के विषय पर मैं तटस्थ नही रह सकती। मेरा निवेदन है कि पद्मावती को राजपूत समाज से न जोड़कर भारतीय नारी के अस्मिता से जोड़ा जाए।/1 — Uma Bharti (@umasribharti) November 3, 2017 क्यो न रिलीज़ से पहले इतिहासकार, फ़िल्मकार और आपत्ति करने वाला समुदाय के प्रतिनिधि और सेंसर बोर्ड मिलकर कमिटी बनाये और वो इसपर फैसला करे/2 — Uma Bharti (@umasribharti) November 3, 2017 చిత్తోర్‌ఘడ్ మహరాణి పద్మిని కథాంశంతో సంజయ్ లాలా భన్సాలీ పద్మావతిని తెరకెక్కించిన విషయం తెలిసిందే. చరిత్రను వక్రీకరించి అల్లావుద్దీన్ ఖిల్జీ-పద్మిని పాత్రల మధ్య కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు చిత్రీకరించాడంటూ శ్రీ రాజ్‌పుత్ కర్ణి సేన మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది. ఈ జనవరిలో దర్శకుడు భన్సాలీతోపాటు చిత్ర యూనిట్‌పై దాడి చేసి కెమెరాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ముందు తమకు ప్రదర్శించాలంటూ డిమాండ్ చేస్తోంది. సినిమాకు మేం వ్యతిరేకం కాదు. కానీ, భన్సాలీ బృందం మేధావులకు, చరిత్రకారుల సమక్షంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించాలని కోరుతున్నాం అని రాజ్‌పుత్ కర్ణి అధికార ప్రతినిధి విశ్వబంధు రాథోడ్ చెబుతున్నారు. ఈ మేరకు పలు సంఘాల మద్దతుతో శనివారం చిత్తోర్‌ఘడ్ బంద్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు బీజేపీ కూడా చిత్రంపై అభ్యంతరం లేవనెత్తుతోంది. క్షత్రియ మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయో లేదో తెలియాలంటే ముందుగా ప్రదర్శించాలని, లేకపోతే ఆ ప్రభావం గుజరాత్ ఎన్నికలపై పడే అవకాశం ఉంటుందంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ బీజేపీ చర్యలను ఖండిస్తూనే చిత్రాన్ని ప్రదర్శించి తీరాలని కోరటం విశేషం. అయితే అహ్మదాబాద్ యువత మాత్రం సినిమా రిలీజ్‌ను అడ్డుకోవటం కళను అవమానించినట్లే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలను రాజకీయాలకు వాడుకోవటం సరికాదని వారు పార్టీలకు సూచిస్తున్నారు. -
ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,భోపాల్: కేంద్ర మంత్రి ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు.కొంతకాలంగా బీజేపీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న జేఎన్‌యూ నేత కన్నయ్య కుమార్, పటేల్ ఉద్యమనేత హార్థిక్ పటేల్‌లను పోరాట యోధులుగా ఆమె అభివర్ణించారు. వారికి చురకలు వేస్తూనే మరోవైపు ప్రశంసలు గుప్పించారు. వారిద్దరూ మంచి పోరాట పటిమ కలవారేనని, అయితే ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడంతో వారు ప్రజల మద్దతును కూడగట్టలేకపోయారని అన్నారు. ‘హార్థిక్ పటేల్ మంచి చురుకైన కుర్రాడు..అతను రాజకీయాలకు దూరంగా ఉంటేనే అతని బలం మరింత పెరుగుతుంది..కన్నయ్యను కూడా నేను గమనిస్తూనే ఉన్నా..అతను మంచి పోరాటపటిమను కనబరుస్తాడు..కన్నయ్య ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సింది కాద’ని ఉమాభారతి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ గుజరాత్‌కు గర్వకారణమని, తమ రాష్ర్టానికి చెందిన నేత కాకున్నా యూపీ ప్రజలు మోదీని ఆదరించిన విషయం హార్థిక్ పటేల్ గుర్తెరగాలన్నారు. గుజరాత్ ప్రజలు మరోసారి బీజేపీకి అండగా నిలిచి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు. హార్థిక్ పటేల్ రాజకీయాలకు దూరంగా ఉండి పటేళ్ల రిజర్వేషన్ అంశంపైనే దృష్టిసారించాలని ఉమా భారతి సూచించారు. కన్నయ్య సైతం మోదీని విమర్శించడం మానుకోవాలని అన్నారు. మోదీని తిడితే తమకు ఆదరణ లభిస్తుందని వారు భావిస్తున్నారన్నారు. -
బాబ్రీ కేసు: బీజేపీ నేతలకు ఊరట
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలు పలువురికి సీబీఐ కోర్టులో పెద్ద ఊరట లభించింది. కురువృద్ధ నేతలు ఎల్కే అడ్వాణీ (89), మురళీ మనోహర్ జోషి (83)లతో పాటు.. కేంద్రమంత్రి ఉమాభారతి(58)కి కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించిన వెంటనే బెయిల్ కూడా ఇచ్చిన కోర్టు.. తాజాగా వారు వ్యక్తిగతంగా సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపింది. దాంతో ప్రతిసారీ కేసు విచారణ సందర్భంగా వాయిదాలకు ఈ సీనియర్ నేతలు లక్నో వరకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ తదితరులపై ఇంతకుముందు నేరపూరిత కుట్ర అభియోగాలను నమోదుకు ఆదేశాలు జారీ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. వారికి రూ. 50వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ను సైతం మంజూరు చేసింది. నిందితులపై ఇప్పటికే జాతీయ సమైక్యతకు హాని కలిగించడం, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, ఉద్దేశపూర్వకంగా మతపరమైన భావాలను దెబ్బతీయడం, బహిరంగ అల్లర్లకు దారితీసేలా ప్రకటనలు చేయడం, అల్లర్లు చేయడం తదితర అభియోగాలు ఉన్నాయి. వీటికి అదనంగా కోర్టు నేరపూరిత కుట్ర అభియోగాన్ని కూడా మోపింది. నేరం రుజువైతే నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని కోర్టులో ఈ కేసు విచారణను పరిశీలిస్తున్న ఓ న్యాయవాది పేర్కొన్నారు. -
‘ఆ రోజు కుట్ర ఏమీ జరగలేదు’
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించి ఎలాంటి కుట్ర జరగలేదని, అదొక బహిరంగ ఉద్యమంలాగా ప్రారంభమై ధ్వంసం వైపు మళ్లిందని కేంద్ర మంత్రి ఉమా భారతీ అన్నారు. ప్రస్తుతం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కుట్రపూరిత నేరం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు మంగళవారం బెయిల్ లభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘ డిసెంబర్ 6, 1992న నేను అయోధ్యలోనే ఉన్నాను. ఇది రహస్యం కాదు. కోట్లమంది బీజేపీ కార్యకర్తలు, లక్షలమంది అధికారులు, వేల మంది రాజకీయ నాయకులు ఆ రోజు పాల్గొన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి ఉద్యమం వచ్చిందో అదే తరహాలో అప్పుడది ఒక బహిరంగ ఉద్యమం. నాకు అందులో ఏ కుట్ర కనిపించలేదు’ అని ఆమె చెప్పారు. -
అడ్వాణీకి షాక్.. 30న కోర్టుకు రావాల్సిందే!
-
అడ్వాణీకి షాక్.. 30న కోర్టుకు రావాల్సిందే!
లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీకి చుక్కెదురైంది. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు హాజరు నుంచి మినహాయింపునివ్వడానికి సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. అడ్వాణీ సహా మరో బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి, కేంద్రమంత్రి ఉమాభారతి ఈ నెల 30న కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టుకు హాజరు నుంచి ఈ ముగ్గురు నేతలకు మినహాయింపు ఇవ్వలేమని, వారు 30న విచారణకు హాజరుకావాల్సిందేనని ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది. 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి ఈ ముగ్గురు నేతలు క్రిమినల్ కుట్రకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీరిపై మరిన్ని అభియోగాలను కోర్టు మోపే అవకాశముందని భావిస్తున్నారు. 2001లో సీబీఐ కోర్టు క్రిమినల్ కుట్ర అభియోగాల నుంచి ఈ ముగ్గురు నేతలకు విముక్తి కల్పించింది. ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు ఏడేళ్ల కిందట సమర్థించగా.. తాజాగా సుప్రీంకోర్టు అడ్వాణీ, జోషి, ఉమాభారతిలపై అభియోగాల ఎత్తివేత కుదరదని, ఈ అభియోగాలపై విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
హరే రామ సారీ కృష్ణా..!
-
1992 నుంచి 2017 వరకు ఇలా..
1992, డిసెంబర్: బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో కరసేవకులపై, అలాగే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు బీజేపీ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, మరికొందరిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 1993, అక్టోబర్: అడ్వాణీతో పాటు మరి కొందరు నేతలు ఈ కుట్రలో భాగస్వాములని సీబీఐ కాంపోజిట్ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 2001, మే 4: అడ్వాణీ, జోషీ, ఉమాభారతి, బాల్‌థాకరే తదితరులపై కేసు విచారణను అదనపు సీబీఐ కోర్టు కొట్టివేసింది. 2004, నవంబర్ 2: సాంకేతిక కారణాలను చూపి కేసును కొట్టివేయడంపై సీబీఐ హైకోర్టులోని లక్నో బెంచ్‌ను ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం నిందితులకు నోటీసులు జారీ చేసింది. 2010, మే 20: సీబీఐ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దాఖలు చేసిన పునర్విచారణ పిటిషన్‌కు ఎటువంటి యోగ్యత లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 2011, ఫిబ్రవరి: హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. 2017, మార్చి 6: బాబ్రీ కుట్ర కేసులో బీజేపీ నేతలపై పునర్విచారణకు అత్యున్నత న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది. మార్చి 21: అయోధ్య వివాద పరిష్కారానికి తాజాగా ప్రయత్నాలు ప్రారంభించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఏప్రిల్ 6: నిర్ణీత సమయంలో విచారణ పూర్తిచేయడానికి సుముఖత వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, సీబీఐ విజ్ఞప్తిపై ఆదేశాలను రిజర్వ్ చేసింది. ఏప్రిల్19: అడ్వాణీ, జోషీ, కేంద్ర మంత్రి ఉమాభారతీలపై నేరపూరిత కుట్రకు సంబంధించి విచారణను సుప్రీం పునరుద్ధరించింది. అంతేకాకుండా కరసేవకులతో పాటు వీఐపీలను వీరితో కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. -
అయోధ్య కోసం ఉరిశిక్షకైనా సిద్ధం: ఉమ
ఉమ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్ న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉమాభారతి ఘాటుగా స్పందించారు. ‘రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నందుకు గర్వంగా ఉంది. ఇందుకోసం పశ్చాత్తాప పడను. ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు. అయోధ్య కోసం ఉరిశిక్షకైనా నేను సిద్ధం’ అని ఉమాభారతి స్పష్టం చేశారు. బాబ్రీ మసీదు విధ్వంసం విషయంలో కుట్రేమీ లేదని.. అంతా బహిరంగంగానే జరిగినందున రాజీనామా చేసే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఈ దేశం గంగానది, త్రివర్ణ పతాకం, ఆవు, రాముడిదని వీటికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ఆమె తెలిపారు. రాముడి దర్శనం కోసం అయోధ్య వెళ్లాలనుకున్నా అర్ధంతరంగా తన పర్యటనను ఆమె రద్దుచేసుకున్నారు. బుధవారం కోర్టు తీర్పు వెలువడగానే.. ఉమాభారతి మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో దోషులకు శిక్ష పడాల్సిందేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. అటు ఉమాభారతి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మరోవైపు, కోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర సీనియర్ మంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, వెంకయ్య నాయుడుతోపాటు పలువురు సీనియర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు, కోర్టు తీర్పును పూర్తిగా చదివాకే స్పందిస్తామని బీజేపీ స్పష్టం చేసింది. -
తిరిగొచ్చిన కుట్ర కేసు!
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక దాదాపు రిటైర్మెంట్ జీవితం అనుభవిస్తున్న బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణి, మురళీమనోహర్ జోషిలకు బాబ్రీ మసీదు విధ్వంసం కుట్ర కేసు మళ్లీ మెడకు చుట్టుకుంది. ఆ ఇద్దరితోపాటు కేంద్ర మంత్రి ఉమాభారతి, సాధ్వి రితంబర, వినయ్ కటియార్ తదితరులు కూడా ఈ కేసు విచారణను ఎదుర్కొనవలసిందేనంటూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఇచ్చిన ఆదేశాలు ఆ నేతలందరినీ దిగ్భ్రమపరిచి ఉండాలి. ఈ కేసు న్యాయస్థానాల్లో నలుగుతున్న తీరును గమనిస్తే సామాన్యులు కూడా బిత్తర పోవాల్సిందే. దేశాన్ని ఓ కుదుపు కుదిపిన ఉదంతాలతో ముడిపడి ఉన్న కీలకమైన కేసుకే ఇలాంటి స్థితి ఏర్పడితే సాధారణ కేసుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. కేసులో మొత్తం 21మంది నిందితులుంటే అందులో బాల్ ఠాక్రే, మహంత్ అవైద్యనాథ్, అశోక్సింఘాల్సహా 8మంది మరణించారు. మరో నింది తుడు, రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్ రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నందువల్ల ఆయనపై కేసు విచారణ ప్రస్తుతానికి ఉండదు. బాబ్రీ విధ్వంసానికి సంబంధించి రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకటి– గుర్తు తెలియని కరసేవకులపై పెట్టిన కేసు. ఇది లక్నో సెషన్స్ కోర్టులో నడుస్తోంది. మరొకటి– అడ్వాణి తదితర నేతలపై పెట్టిన కేసు. ఇది రాయ్‌బరేలీ కోర్టులో కొనసాగుతోంది. భిన్న వర్గాలమధ్య విద్వేషాలు సృష్టించడం, జాతీయ సమగ్రతకు భంగం కలి గించడం, వదంతులు సృష్టించి శాంతికి భంగం కలిగించడం వంటివి నాయకులపై పెట్టిన కేసులో ఉన్నాయి. ఇది విచారణలో ఉండగా సీబీఐ 120–బి కింద కుట్రకు పాల్పడ్డారంటూ అదనపు అభియోగాన్ని మోపింది. ఒకే ఉదంతంపై రెండు కేసులు పెట్టడం, అవి రెండూ వేర్వేరు న్యాయస్థానాల్లో కొనసాగడం విచిత్రం. కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వాలేవీ ఈ విషయంలో సీబీఐకి తగిన మార్గ నిర్దేశం చేయలేక పోయాయి. ఈ రెండు కేసులనూ విలీనం చేసి విచారించమని పాతికేళ్ల తర్వాత సుప్రీంకోర్టు చెప్పాల్సివచ్చింది. ఇది సీబీఐకి చెంపపెట్టు. న్యాయస్థానాల్లో సాగిన విచారణల పరంపర సంగతలా ఉంచి వివిధ దశల్లో ఆ తీర్పులకూ, సీబీఐ అప్పీళ్లకూ మధ్య ఉన్న వ్యవధి గమనిస్తే ఆశ్చర్యం కలుగు తుంది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కరసేవకులు ధ్వంసం చేసినప్పుడు, ఈ నేతలంతా అక్కడకు సమీపంలోనే ఉన్నారని... అంతక్రితం వారు చేసిన రెచ్చ గొట్టే ప్రసంగాలే అందుకు కారణమని సీబీఐ ఆరోపించింది. 1993 అక్టోబర్‌లో సీబీఐ ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేయగా మరో ఏడేళ్లకు... అంటే 2001 మే నెలలో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. విచారణ కొనసాగుతుండగా కుట్ర కేసు పెట్టడం సరికాదంటూ సాంకేతిక కారణాలను చూపి వారిపై ఈ అభియోగాన్ని తొలగించింది. దీనిపై అప్పీల్ చేయడానికి సీబీఐ మూడేళ్ల వ్యవధి తీసుకుని 2004 నవంబర్‌లో ఆ తీర్పుపై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో సీబీఐ అప్పీల్ చేసింది. ఈలోగా ఇతర నిందితులపై సీబీఐ అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేసింది. 2010లో హైకోర్టు తీర్పు వెలువరిస్తూ కింది కోర్టుతో ఏకీ భవించింది. ఈ తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పర్యవసానంగా తాజా తీర్పు వచ్చింది. కుట్ర అభియోగాన్ని పునరుద్ధరించడంతోపాటు రెండు కేసులనూ కలిపి లక్నో సెషన్స్ కోర్టులో విచారణ సాగాలని, రోజువారీ ప్రాతి పదికన విచారణ కొనసాగించి రెండేళ్లలో తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయోధ్య అనగానే కోట్లాదిమంది హిందువులకు రాముడు గుర్తుకొస్తాడు. రాముడి గురించి, అయోధ్య గురించి తెలిసినవారికి కూడా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) రామ జన్మభూమి విముక్తి పేరుతో 80వ దశకంలో ఉద్యమం ప్రారం భించేవరకూ అందుకు సంబంధించిన వివాదం నడుస్తున్నదని తెలియదు. 1528లో నాటి మొగల్ చక్రవర్తి బాబర్ అయోధ్యలో ఉన్న రామాలయాన్ని కూల్చి మసీదు కట్టించాడన్నది వీహెచ్‌పీ, బీజేపీల వాదన. 1949లో ఆ మసీదు ఆవ రణలో రాముడి విగ్రహాన్ని ఉంచడంతో రాజుకున్న స్థల వివాదం ఫైజాబాద్ సివిల్ కోర్టులో కొనసాగుతూనే ఉంది. వీహెచ్‌పీ ఉద్యమాన్ని బీజేపీ స్వీకరించాక అది మరింత తీవ్ర రూపం దాల్చింది. అంతవరకూ అంతంతమాత్రంగా ఉన్న బీజేపీ దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించడానికి, అధికారంలోకి రావడానికి బాబ్రీ మసీదు వివాదం ఏ స్థాయిలో తోడ్పడిందో అందరికీ తెలుసు. దాంతోపాటే ఆ వివాదం ప్రారంభమయ్యాక దేశంలో ఏర్పడ్డ వైషమ్య భావాలు బాబ్రీ మసీదు కూల్చివేతతో పరాకాష్టకు చేరాయి. దేశవ్యాప్తంగా చెలరేగిన మత కల్లోలాల్లో 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందరో గాయాలపాల య్యారు. వేల కుటుంబాలు నిరాధారమయ్యాయి. అనంతరకాలంలో దేశంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనలకు, ఉగ్రవాద ఉదంతాలకు మూలాలు బాబ్రీ విధ్వంసంలోనే ఉన్నాయి. అడ్వాణి తదితర నేతలపై సీబీఐ పెట్టిన అభియోగాలపై ప్రత్యేక కోర్టులో ఆనాటి ఐపీఎస్ అధికారిణి అంజూగుప్తా ఇచ్చిన వాంగ్మూలం కీలకమైనది. కర సేవకులు కూల్చివేత సాగిస్తుండగా సమీపంలోనే ఉన్నారని, నివారించే ప్రయత్నం చేయకపోగా ‘పని’ పూర్తయ్యేవరకూ కదలొద్దని వారిని ఆదేశించారని ఆరోపిం చారు. పైగా విధ్వంసం పూర్తయ్యాక మిఠాయిలు పంచుకున్నారని తెలిపారు. కరసేవకులు అప్పటికప్పుడు ఉద్రేకంలో విధ్వంసానికి పూనుకున్నారని బీజేపీ నేతలు చేసిన వాదనను ఆమె తోసిపుచ్చారు. అయితే అడ్వాణి మాత్రం బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు తన జీవితంలో అత్యంత విషాదకరమైన దినమని అనంతరకాలంలో వ్యాఖ్యానించారు. ఏదేమైనా కేసు ఈ స్థాయికి చేర డానికి పాతికేళ్లు పట్టడం మన దేశంలో నెలకొన్న అవ్యవస్థకు నిదర్శనం. కనీసం దేశాన్ని కుదిపిన కీలకమైన కేసుల్లోనైనా సత్వర విచారణ సాగాలని, దోషులని తేలితే ఎంతటివారికైనా శిక్షలు పడాలని కోరుకోవడం అత్యాశేమీ కాదు. కానీ అది కూడా సాధ్యపడని స్థితి నెలకొని ఉండటం ఎంత విషాదకరం! -
విచారణకే కాదు, ఉరిశిక్షకైనా సిద్ధం
-
విచారణకే కాదు, ఉరిశిక్షకైనా సిద్ధం
► ఈరోజు అయోధ్య వెళ్తా.. రామ మందిరాన్ని కట్టాల్సిందే ► నన్ను రాజీనామా చేయాలనే హక్కు కాంగ్రెస్‌కు లేదు ► అవును... నేను రామమందిర ఉద్యమంలో పాల్గొన్నా ► కోర్టు తీర్పుపై కేంద్ర మంత్రి ఉమా భారతి స్పందన న్యూఢిల్లీ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణకే కాదు.. అవసరమైతే ఉరి తీయించుకోడానికైనా తాను సిద్ధమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. విచారణ రెండు గంటలు గడిచినా, రెండు సంవత్సరాలు గడిచినా దాన్ని తాను ఎదుర్కొంటానన్నారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ రామ మందిరాన్ని నిర్మించాలనే తాను చెప్పాలనుకుంటున్నానని అన్నారు. తనను రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఆమె చెప్పారు. తిరంగా వివాదం సమయంలో తన మీద ఆరోపణలు రుజువయ్యాయి కాబట్టే తాను అప్పట్లో రాజీనామా చేశానన్నారు. తాను ఈరోజు అయోధ్య వెళ్తానని, కాంగ్రెస్ ఆరోపణల మీద, తాను రాజీనామా చేయాలన్న వాళ్ల డిమాండు మీద మాత్రం స్పందించబోనని తెలిపారు. అసలు ఏ విషయమైనా చెప్పడానికి వాళ్లెవరని ఆమె ప్రశ్నించారు. ఎమర్జెన్సీ విధించింది వాళ్లు, బలవంతంగా ముస్లింలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించింది వాళ్లు, 1984 మత ఘర్షణలకు కారణమైంది వాళ్లేనని ఉమాభారతి మండిపడ్డారు. రామ మందిరాన్ని తాము కట్టాలన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని, రామ మందిరం అంశం వల్లే తాము అధికారంలోకి వచ్చామని ఆమె చెప్పారు. ఎలాంటి తీర్పునైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి కుట్ర లేదని, అంతా బహిరంగంగానే ఉందని అన్నారు. తన ఉద్దేశం, చర్యలు అన్నీ ఒకటేనని, తాను రామమందిర ఉద్యమంలో పాల్గొన్నానని కూడా ఉమాభారతి చెప్పారు. -
‘మందిరం’ కోసం చావడానికైనా రెడీ
ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు లక్నో: రామమందిరం విశ్వాసానికి సంబంధించిన అంశమని, మందిరం కోసం జైలుకెళ్లేందుకైనా సిద్ధమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ను కలిసిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. ‘రామ మందిరం విశ్వాసానికి సంబంధించిన అంశం. దానిపై నాకెంతో గౌరవం ఉంది. మందిరం కోసం జైలుకెళ్లడానికైనా, ఉరేసుకోడానికైనా సిద్ధం’ అని చెప్పారు. ‘ రామ మందిరంపై చర్చించాల్సిందేమీ లేదు. ఈ అంశం మాకేం కొత్త కాదు. రామ మందిరం ఉద్యమానికి ఆదిత్యనాథ్ గురువు అవైద్యనాథ్ నాయకుడు’ అని వివరించారు. -
‘మందిరం’ కోసం చావడానికైనా రెడీ
ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు లక్నో: రామమందిరం విశ్వాసానికి సంబంధించిన అంశమని, మందిరం కోసం జైలుకెళ్లేందుకైనా సిద్ధమని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలసిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. ‘రామ మందిరం విశ్వాసానికి సంబంధించిన అంశం. దానిపై నాకెంతో గౌరవం ఉంది. మందిరం కోసం జైలుకెళ్లడానికైనా, ఉరేసుకోడానికైనా సిద్ధం’ అని చెప్పారు. ‘రామ మందిరంపై చర్చించాల్సిందేమీ లేదు. ఈ అంశం మాకేం కొత్త కాదు. రామ మందిరం ఉద్యమానికి ఆదిత్యనాథ్ గురువు అవైద్యనాథ్ నాయకుడు’ అని వివరించారు. -
ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు
లక్నో: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటి బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె.. శనివారం యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రామజన్మభూమిలో ఆలయ నిర్మాణానికి అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధమన్నారు. 'ఆలయ నిర్మాణం కోసం జైలుకు వెళ్లడానికైనా, ఉరికంబం ఎక్కడానికైనా నేను రెడీ'అని ఉమాభారతి అన్నారు. సీఎం యోగితోనూ ఇదే విషయంపై చర్చించారా? అన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ.. ముఖ్యమంత్రితో రామాలయం గురించి మాట్లాడలేదని, అయితే, ఈ అంశం తమకు కొత్తదేమీ కాదని బదులిచ్చారు. అయోధ్యలో మందిర నిర్మాణం కోసం ఉద్యమించిన వారిలో సీఎం యోగి గురువు గురు మహంత్ అవైద్యనాథ్ ఒకరని ఉమాభారతి గుర్తుచేశారు. వివాదానికి సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున ఇక తానేమీ మాట్లాడలేనన్నారు. -
సుప్రీం వ్యాఖ్యలను స్వాగతించిన ఉమాభారతి
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కేసు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఉమా భారతి స్వాగతించారు. అయోధ్య వివాదం కోర్టు బయటే పరిష్కారం అవుతుందనే నమ్మకం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బాబ్రీ మసీదు వివాదంపై అత్యవసరంగా విచారణ జరపాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. పిటిషనర్లు, ప్రతివాదులతో చర్చించి కోర్టు బయట వివాదాన్ని పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచనలు చేసింది. అయితే చర్చల ద్వారా పరిష్కారం దొరక్కపోతే తాము కల్పించుకుంటామని తెలిపింది. మరోవైపు సుప్రీం వ్యాఖ్యలను షాహి ఇమామ్ బుఖారీ స్వాగతించారు. కాగా అయోధ్యలో రామమందిరం వివాదాన్ని 2019 ఎన్నికలలోపే.. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించాలని శివసేన నేత సంజయ్ కాంత్ డిమాండ్ చేశారు. -
21 సెంచరీలో నాకు ఇదే బెస్ట్ న్యూస్!
లక్నో: 'నా వరకు 21వ శతాబ్దిలో ఇదే ఉత్తమవార్త ఏదంటే.. అది నరేంద్రమోదీజీ ప్రధానమంత్రి కావడం, సోదరుడు యోగిజీ యూపీ సీఎం అవుతుండటమే' అని కేంద్రమంత్రి ఉమాభారతి ఆనందం వ్యక్తం చేశారు. జాతీయవాదం, అభివృద్ధి కలయికగా యూపీని యోగి నడిపిస్తారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు యూపీ సీఎం కాబోతున్న యోగి ఆదిత్యనాథ్‌తో తనకెలాంటి విభేదాలు లేవని బీజేపీ రాష్ట్ర చీఫ్ కేశవప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. తనకు అప్పగించిన డిప్యూటీ సీఎం పదవిని బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రథమ ప్రాధాన్యమిస్తానని తెలిపారు. కాగా, యూపీ సీఎంగా మధ్యాహ్నం 2.15 గంటలకు యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ సహా బీజేపీ ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం యోగి లోక్‌భవన్ చేరుకొని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత మంత్రులతో భేటీ అవుతారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. -
అడ్వాణీ మెడకు మళ్లీ బాబ్రీ ఉచ్చు
-
అడ్వాణీ మెడకు మళ్లీ బాబ్రీ ఉచ్చు
► సాంకేతిక కారణాలతో కేసు తొలగింపును అంగీకరించం: సుప్రీంకోర్టు ► అదనపు చార్జిషీట్ సమర్పణకు అనుమతి న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్కే అడ్వాణీ, ఇతరులపై కేవలం సాంకేతిక కారణాలతో కేసులు తొలగించేందుకు అంగీకరించబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వారిపై నమోదైన కుట్ర ఆరోపణలపై అవసరమైతే విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపింది. అడ్వాణీతోపాటు మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, ఇతరులపై కేసు ఉపసంహరణకు సంబంధించి వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం నమోదైన రెండు ఎఫ్ఐఆర్లను సంయుక్తంగా విచారించాలని ట్రయల్ కోర్టును ఆదేశిస్తామని జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘కేవలం సాంకేతిక కారణాలతో 13 మందిని కేసు నుంచి విముక్తి చేసేందుకు అంగీకరించబోం. అలాగే అదనపు చారి్జషీటు సమర్పించేందుకు అనుమతిస్తున్నాం’ అని వెల్లడించింది. అనంతరం విచారణను కోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది. అడ్వాణీ తరఫు న్యాయవాది కోర్టు వ్యాఖ్యలతో విభేదిస్తూ... రెండు కేసుల్లో వివిధ రకాల వ్యక్తులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, వారిపై విచారణ చివరి దశలో ఉందని, మళ్లీ ఇప్పడు ఉమ్మడి విచారణ చేస్తే మళ్లీ మొదటికొస్తుందని వాదించారు. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి అ డ్వాణీ సహా 13 మందిపై అభియోగాల్ని ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. కింది కోర్టు తీర్పును అలహాబాదు హైకోర్టు సమర్థించగా... సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. కరసేవకులపై నమోదైన మరో కేసు లక్నో కోర్టు విచారణలో ఉంది. -
అద్వానీ, ఉమాభారతీకి పొంచి ఉన్న గండం!
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి బాబ్రీ మసీదు ధ్వంసం గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, ప్రస్తుతం కేంద్రమంత్రిగా పనిచేస్తున్న ఉమాభారతీ, ఇతర బీజేపీ నాయకులు మసీదు ధ్వంసానికి సంబంధించి కుట్ర చేశారనే ఆరోపణలు ఎదుర్కోనున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నెల (మార్చి)22న బాబ్రీ మసీదు ధ్వంసానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. సుప్రీంలో ఈ కేసుకు సంబంధించి ఇదే చివరి విచారణ కానుందని, ఆ రోజు బీజేపీలో కొందరు సీనియర్ నేతలు ఇంకొందరు కచ్చితంగా కుట్రపూరిత ఆరోపణలు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా లక్నో, రాయబరేలీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఎల్కే అద్వానీ, ఉమాభారతీకి గండం తప్పకపోవచ్చని అంటున్నారు. 1992, డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదు ధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గతంలోనే వివరణ ఇవ్వాలంటూ అద్వానీ, ఉమా భారతీ, మరో 19మంది నేతలకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. -
‘గంగలో రాహుల్ దూకాలి.. లేదంటే నేను దూకుతా’
వారణాసి: ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఎక్కడికక్కడ ఎండగడుతున్న బీజేపీ తాజాగా మరోసారి మాటల యుద్ధం ప్రకటించింది. గంగా నది విషయంలో మోదీని విమర్శించిన రాహుల్‌పై కేంద్ర మంత్రి ఉమా భారతి విరుచుకుపడ్డారు. ‘రాహుల్‌గాంధీ అయినా గంగా నదిలో దూకాలి.. లేదంటే నేను దూకుతాను’ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ది పరిపక్వత లేని మెదడు అని అన్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రాహుల్ ఏ థాయిలాండ్‌కో పారిపోవడం కాదని, నేరుగా తనతో గంగా నది వద్దకు రావాలని, అప్పుడు గంగా శుద్ధి కార్యక్రమం ప్రారంభంకాకుంటే తాను గంగలో దూకుతానని, లేదంటే రాహుల్ దూకాలని సూచించారు. వారణాసిలో పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌కు చేసిందేమి లేదని అన్నారు. ఉత్తరప్రదేశ్‌కు కుమారుడిగా చెప్పుకున్న రాహుల్ గంగా నదిని తన కన్నతల్లిగా చెప్పుకున్నారని, ఇప్పుడు గంగా తల్లికి ఆయన చేసేందేమిటని ప్రశ్నించారు. యూపీకిగానీ, గంగకుగానీ ఏమైనా చేశారా అని నిలదీశారు. గంగను శుద్ధి చేశారా అంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌పై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆయనపై విరుచుకుపడ్డారు. ‘గంగా పరివాహక ప్రాంతంలోని ఐదు రాష్ట్రాల్లోని నాలుగు రాష్ట్రాల్లో పనులు జరుగుతున్నాయి. కానీ, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం మొదలుకాలేదు. మేం ఎప్పుడో నోటిఫికేషన్ ఇచ్చాం. కానీ, ఇంతవరకు నో అబ్జెక్షన్ కాపీ వాళ్లు ఇవ్వలేదు. వాస్తవానికి గంగాకు నిజమైన శత్రువు అఖిలేశ్ యాదవ్. ఓసారి ములాయం వచ్చి గంగా నదిపై పనులు ప్రారంభం కాలేదని పార్లమెంటులో అరిస్తే ఇంతవరకు మీ రాష్ట్రమే ఎన్వోసీ ఇవ్వలేదని గుర్తు చేస్తే చప్పుడు చేయకుండా కూర్చున్నారు. కావాలనే గంగా శుద్ధి కార్యక్రమానికి యూపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. గంగా శుద్ధి కార్యక్రమం ప్రారంభం అవడం ఖాయం. అలా జరగకుంటే నేనన్నా అందులో దూకుతాను. రాహుల్ అయినా దూకాలి’ అని ఉమాభారతీ మండిపడ్డారు. -
‘వాళ్లు మాకు ఓటెయ్యరు.. సీట్లెందుకివ్వాలి?’
ఫైజాబాద్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఓ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు తమకు ఓటే వెయ్యరని, అలాంటప్పుడు తాము వారికి సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. తమ పార్టీ గెలవాలని ముస్లింలు కోరుకోరని, అలాంటి వారికి తామెందుకు సీట్లు ఇస్తామంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇవ్వకుండా బీజేపీ తప్పు చేసిందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఉమా భారతి అన్నారు. ముస్లింలకు బీజేపీ టికెట్లు కేటాయించివుంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. ముస్లింలకు టికెట్లు కేటాయించాల్సిందని తమ పార్టీ నేత, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు సబబనని అన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత వినయ్ ఖతియార్ స్పందిస్తూ అసలు తాము వారికి సీట్లు ఎందుకివ్వాలని నిలదీశారు. ‘ముస్లింలు వారి ఓటును మాకు ఏనాడు ఓటెయ్యన్నప్పుడు మేమెందుకు వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వాలంటూ పార్టీని వెనుకేసుకొచ్చారు. ఐదు దశ ఎన్నికల్లో ఏ ఒక్క ముస్లిం అభ్యర్థి గెలవబోరని చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా బీజేపీకి పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉమాభారతీ వ్యాఖ్యలు చేయగా అందుకు వినయ్ ఖతియార్ సమాధానం ఇచ్చారు. మరిన్ని వార్తా కథనాలకై చదవండి.. బీజేపీ తప్పుచేసింది: కేంద్ర మంత్రి -
బీజేపీ తప్పుచేసింది: కేంద్ర మంత్రి
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇవ్వకుండా బీజేపీ తప్పు చేసిందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఉమా భారతి అన్నారు. ముస్లింలకు బీజేపీ టికెట్లు కేటాయించివుంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. ముస్లింలకు టికెట్లు కేటాయించాల్సిందని తమ పార్టీ నేత, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు సబబనని ఉమా భారతి అన్నారు. అయితే కొన్నిసార్లు ముస్లింలకు, మహిళలకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఈ విషయం గురించి చర్చిస్తానన్నారు. సోమవారం యూపీలో ఐదో దశ ఎన్నికలు 52 నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. కీలకమైన అమేథి, అయోధ్య నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. -
చట్టబద్ధత, రాజ్యాంగ విధేయతలకు చోటెక్కడ?
అవలోకనం మన దేశంలో మంత్రులు, ప్రధాన మంత్రులంతా పదవీ స్వీకారం చేసేటప్పడు ఇలా ప్రమాణం చేస్తారు : ‘‘దేవుని సాక్షిగా నేను భారత రాజ్యాంగానికి, చట్టానికి నిజంగా విధేయుడనై, నిబద్ధుడనై ఉంటాననీ, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్ర తను కాపాడుతాననీ, నా విధులను పూర్తి విధేయతతో, మనఃపూర్వకంగా నిర్వహి స్తానని,.. రాజ్యాంగానికి, చట్టానికి అనుగుణంగా, ఎలాంటి భయం లేదా పక్షపా తమూ, అభిమానం లేదా దురుద్దేశమూ లేకుండా అందరితోనూ సరైన విధంగా నడుచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను.’’ ఇది మన రాజ్యాంగంలోని మూడో షెడ్యూలులో ఉన్నది. ప్రభుత్వ రహస్యాలను దాచి ఉంచుతానంటూ మంత్రి చేసే ప్రమాణమూ ఉంది. అది ‘‘నా పరిశీలనకు వచ్చే లేదా నాకు తెలిసే ఏ విషయాన్నీ మంత్రిగా నా విధులను నిర్వహించే క్రమంలో తప్ప, ఏ వ్యక్తికిగానీ లేదా వ్యక్తుల కుగానీ ప్రత్యక్షంగాగానీ లేదా పరోక్షంగాగానీ చేరవేయను లేదా వెల్లడించను.’’ రాజ్యాంగంపట్ల విధేయతతో ప్రవర్తిస్తామనే ఈ ప్రమాణం పట్ల మన మంత్రులు చిత్తశుద్ధిని చూపుతున్నారా? ‘‘అత్యాచార నేర అనుమానితులను, వారు తమ ప్రాణాలను కాపాడమని ప్రాధేయపడేలా చేశాననీ, వారిని చిత్రహింస లకు గురిచేయమని పోలీసులను ఆదేశించాననీ ఒక భారత మంత్రి చెప్పారు.’’ ఇది ఈ వారం బీబీసీ వెలువరించిన వార్త. అనుమానితులను తలకిందులుగా వేలాడదీసి, వారిపై నేరారోపణ చేసిన వారు దాన్ని కళ్లారా చూసేలా చేశానని కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతి చెప్పారు. ‘‘అత్యాచారానికి పాల్పడిన వారిని వారు క్షమాపణ కోరేవరకు బాధితుల సమక్షంలోనే చిత్రహింసలకు గురి చెయ్యాలి... అత్యాచారానికి పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీసి, చర్మం ఊడేలా చావ బాదాలి’’ అని ఆమె చెప్పినట్టుగా బీబీసీ తెలిపింది. ‘‘కారం రుద్ది కేకలు పెట్టేలా చేయాలి. వారి తల్లులు, అక్కచెల్లెళ్లు దాన్ని చూసేలా చేయాలి’’. మంత్రి చేశానని చెప్పుకుంటున్నది నేరపూరితమైన చర్య. చట్టమూ, రాజ్యాం గమూ ఆమె చేసినదాన్ని అంగీకరించవు. నేరాలతో వ్యవహరించాల్సిన క్రమం స్పష్టంగానే ఉంది. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తు చేస్తారు, ప్రభుత్వం వారిని విచారణకు నిలుపుతుంది, న్యాయవ్యవస్థ తీర్పు చెబుతుంది. ఉమా భారతి గొప్పగా చెప్పుకుంటున్న పని... తాను కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. ఉపఖండంలో మూకుమ్మడిగా ఏ విచా రణా లేకుండానే శిక్షలను వేçస్తుండటం మనం ఊహించగలిగినదే. కానీ మంత్రులే ఆ పని చేసి, అందుకు గర్వించడమనేది మన దేశంలో చట్టంతో ఎలా వ్యవహరి స్తున్నారనేదాన్ని, మన మంత్రులు తమ ప్రమాణ స్వీకారం పట్ల ఎంత చిత్తశుద్ధిని కన బరుస్తున్నారనేదాన్ని కొంత వరకు తెలియజేస్తుంది. అత్యాచారాలకు పాల్పడే వారిని శిక్షించడం గురించిన ఈ డాబుసరి మాటలను, నిజంగా అలాంటి నేరాల విషయంలో దేశం వాస్తవంగా చేపడుతున్న చర్యలతో పోల్చిచూడాలి. 2013 ముజ ఫర్నగర్ అల్లర్లలో సామూహిక అత్యాచారాలకు గురై ఎఫ్ఐఆర్లు దాఖలు చేసిన ఏడుగురిలో ఎవరికీ ఇంతవరకు న్యాయం జరగలేదు. వారిలో ఒక మహిళ చని పోగా, మిగతావారు తమ గోడు వినిపించుకునేలా చేయడానికి వ్యవస్థకు వ్యతి రేకంగా పోరాడుతూనే ఉన్నారు. నిందితులు వారిని బెదిరింపులకు గురిచేశారు. లైంగిక వేధింపులపై ఘనమైన చర్యలు చేపట్టామని గొప్పలు చెప్పుకుంటున్న వారి నుంచి ఆ బాధితులకు ఇంతవరకు ఎలాంటి మద్దతు లభించలేదు. నిర్భయ కేసుగా ప్రసిద్ధి చెందిన ఢిల్లీ ఘటనలో ఒక యువతిపై సామూహి కంగా లైంగిక దాడి, హత్య జరిగాయి. ఆ తదుపరి భారీ ప్రజా ఉద్యమమూ సాగింది. అలాంటి హింస బాధితులకు, బయటపడ్డ వారికి వేగంగా న్యాయం అందేలా చేయడం కోసం చట్టంలోనూ, నియమ నిబంధనలలోనూ మార్పులు చేశారు. కానీ క్షేత్ర స్థాయి పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదనేది వాస్తవం. అందువలన, ఒకవంక లైంగిక హింసపై, అత్యాచారాలకు పాల్పడేవారిపై చర్య లను చేపట్టడంలోనూ, వారికి న్యాయం అందించడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలం కాగా... మరోవంక ఈ నేరాలను అరికట్టడానికి మంత్రులు చేస్తున్న అద్భుత ఘనకార్యాల ప్రకటనలు మన ముందుకు వస్తున్నాయి. ఉమా భారతి తాను చేస్తున్నది సరైనదేనని నమ్ముతున్నారు కాబట్టి ఆమెకు తాను రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నానని సైతం తెలియకపోవచ్చు. ఆమెలాంటి వ్యక్తుల దృష్టికి సరైనదిగా అనిపించేది... తప్పనిసరిగా చట్టబద్ధమైనది కానవసరం లేదు. ‘అందరితోనూ సరైనవిధంగా నడుచుకుంటాన’ని ఆమె ప్రమాణం చేశారు. కానీ ‘మంచి కుటుంబాల’ నుంచి వచ్చిన వారుంటారని విశ్వసించేవారు ఉన్న సమాజంలో నేరారోపణలు ఎదుర్కొంటున్నవారికి, శిక్షపడ్డ వారికి మధ్య తేడా ఉండదు. మంచి కుటుంబాల నుంచి రాని వారిది తప్పక చెడు పుట్టుకే కావచ్చు. అందుకుగానూ వారిని శిక్షించాల్సిందే అనే భావన ప్రబలంగా ఉంటుంది. కానీ చట్టం పట్ల నాగరిక భావన ఆరోపితులకు రక్షణను కల్పిస్తుంది. ‘‘దోషిగా తేలే వరకు అమాయకునిగానే భావించాలి’’ అనే పదబంధం ఉన్నది కూడా అందుకే. అయితే అది, మన మంత్రి ప్రదర్శించిన ఆదిమ ఆలోచనకు విరుద్ధమైనది. ఆ ప్రమాణంలోని ‘‘భారత దేశ ఐక్యత, సమగ్రత’’ అన్న దానిపై దృష్టి కేంద్రీ కణ అంతా ఉంటుంది. అది పవిత్రమైనది. ఆ భావనను, మాటల్లోనే అయినా ఉల్లంఘించినట్టుగా ఆరోపణకు గురైన వారిని ఎవరినైనా చావబాదేస్తారు. అది కూడా ఎలాంటి విచారణ లేకుండానే. భారత రాజ్యాంగానికి, చట్టానికి కట్టుబడి ఉండటం అనే ఆ మిగతాదంతా నసుగుడు మాత్రమే. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
రేపిస్టులను చిత్రహింసలు పెట్టాలి
ఆగ్రా: అత్యాచారానికి పాల్పడిన వారిని చర్మం ఊడేంతవరకు చిత్రహింసలు పెట్టాలని జలవనరుల మంత్రి ఉమాభారతి అన్నారు. బులంద్‌షహర్ అకృత్యం కేసులో బాధితులకు న్యాయం చేయటంలో ఎస్పీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో మంత్రి ప్రసంగిస్తూ.. రేప్ చేసిన వారిని తలకిందులుగా కట్టేసి చర్మం ఊడేవరకు చిత్రహింసలు పెట్టాలన్నారు. గాయాలకు ఉప్పు, కారం పూసి ప్రాణం కోసం బతిమాలుకునేంతవరకూ వదలిపెట్టొదన్నారు. -
రావణుడిని చంపినట్టు.. వారి తలల్ని నరకాలి
ఆగ్రా: కేంద్ర మంత్రి ఉమా భారతి రేపిస్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్షమించమని నిందితులు వేడుకునేవరకు, బాధితుల ముందు వారికి చిత్రహింసలు పెట్టాలని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఉమా భారతి మాట్లాడుతూ.. తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యాచార నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించానని చెప్పారు. 'రేపిస్టులను తల కిందలుగా వేలాడతీసి చిత్రహింసలు పెట్టాలి. గాయాలకు కారం చల్లాలి. ఏడుస్తూ క్షమించమని వేడుకునేవరకు ఇలాగే చేయాలి. ఈ దృశ్యాలను మహిళలు దగ్గర నుంచి చూడాలి' అని ఉమాభారతి అన్నారు. బులంద్షార్ అత్యాచార ఘటన కేసులో నిందితులకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కనీసం ప్రయత్నించలేదని విమర్శించారు. గతేడాది ఢిల్లీకి సమీపంలో హైవేపై వెళ్తున్న వాహానాన్ని ఆపి, తల్లీకూతుళ్లపై సామూహిక లైంగికదాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. పదేళ్ల క్రితం తాను మధ్యప్రదశే్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రేపిస్టులను పోలీస్ స్టేషన్లో తలకిందులు వేలాడతీసి చిత్రహింసలు పెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించానని, ఆ దృశ్యాలను కిటికీల ద్వారా చూడాలని మహిళలకు చెప్పానని ఉమాభారతి చెప్పారు. ఇందుకు ఓ పోలీస్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేయగా, రాక్షసులకు మానవహక్కులు ఉండవని, రావణుడిని చంపినట్టు వారి తలలను నరికివేయాలని చెప్పానని వెల్లడించారు. -
గంగా నదిని కలుషితం చేస్తే జరిమానా!
న్యూఢిల్లీ: గంగా నదిని కలుషితం చేసే వారికి జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. గంగా నదిని శుభ్రంగా ఉంచడానికి, నదిలో ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడకుండా చూడటానికి ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురానుంది. ఇందుకోసం జస్టిస్ గిరిధర్ మాలవ్య నేతృత్వంలో బిల్లు రూపొందుతోంది. బిల్లు రూపు రేఖలు ఖరారయ్యాక మంత్రివర్గం ముందుకు వస్తుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి చెప్పారు. ‘గంగా నది జన్మస్థానం నుంచి సముద్రంలో కలిసే వరకు శుభ్రంగా, ప్రవహిస్తూనే ఉండేలా చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ నదిని కలుషితం చేసే వారికి, ప్రవాహాన్ని అడ్డుకునే వారికి జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలు ఉంటాయ’ని ఆమె అన్నారు. -
డీమానిటైజేషన్ కార్ల్‌మార్క్స్ ఐడియా అట
లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న డీమానిటైజేషన్ నిర్ణయంపై బీజేపీ మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి ఉమాభారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్లధనానికి వ్యతిరేకంగా మోదీ మార్క్సిస్టు ఎజెండాను అవలంబించారని పేర్కొన్నారు. తద్వారా భారత ప్రధాని మార్క్సిస్టు మహానాయకుడు కారల్ మార్క్స్ చెప్పిన సమాసమాజంకోసం పాటుపడుతున్నారన్నారు. నిజానికి ఇది మార్క్సిస్ట్ ఎజెండా. ఒకపుడు లోహియా, కాన్షీరామ్ చెప్పిన వాటిని ఇపుడు మన ప్రధానమంత్రి అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా మోదీ యోగి టర్న్డ్ సూపర్ హీరో అని ఉమ భారతి అభివర్ణించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్యూలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు. మార్క్స్ అసమానతలు లేని సమసమాజం కోరుకున్నారన్నారు. ఒకవైపు ఒక మనిషి 12 గదుల ఇంట్లో ఉంటే, మరొక వైపు 12 మంది ఒకే గదిలోఉండడం ఆమోదయోగ్యం కాదన్నారు. కానీ 12గదులను బలవంతంగా ఆక్రమించు కోకూడదన్నారు. అందుకే పేద, ధనిక మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారన్నారు. నల్లధనాన్ని నిరోధించి, ఆ నగుదును జనధన్ ఖాతాల్లో, ముద్రా యోజన ఖాతాల్లో జమ అయ్యేలా మోదీ చర్యలు చేపట్టారని తెలిపారు. ఇందుకు వామపక్షవాదులు మోదీని అభినందించాలని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత రాజకీయాల్లో అభివృద్ధి ఎజెండా తీసుకురావడం, పేదల సంక్షేమం కోసం అత్యాధునిక టెక్నాలజీ వినియోగం లాంటి మార్పులతోపాటూ యోగి నుంచి మహానాయకుడిగా అవతరించాన్నారు. దేశానికి మోదీలాంటి సూపర్ హీరో అవసరం చాలా వుందని ఉమా భారతి ప్రశంసల జల్లు కురిపించారు. -
ఈ నెల 23న ఢిల్లీకి రండి
హరీశ్‌రావుకు కేంద్ర మంత్రి ఉమాభారతి లేఖ సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి కృషి సించారుు యోజన (పీఎంకేఎస్‌వై) పథకం పరిధిలోని ప్రాజెక్టులకు నిధుల అంశాన్ని చర్చించేందుకు ఈ నెల 23న ఢిల్లీకి రావాలని నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీశ్‌రావును కేంద్ర జల వనరుల శాఖా మంత్రి ఉమాభారతి ఆహ్వానించారు. ఈ మేరకు ఉమాభారతి మంత్రికి శుక్రవారం లేఖ రాశారు. దేశం మొత్తంగా 99 ప్రాజెక్టులను పీఎంకేఎస్‌వై పరిధిలోకి తేగా, అందులో రాష్ట్రం నుంచి 11 ప్రాజెక్టులున్నారుు. వీటికోసం కేంద్ర సాయం, రుణాల రూపంలో మొత్తంగా రూ.7,900కోట్లు ఇవ్వాలని ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. 23న జరిగే సమావేశంలో వీటిపై చర్చించే అవకాశం ఉంది. -
సరిహద్దుల్లో నేను నిరాహార దీక్ష చేస్తా!
-
సరిహద్దుల్లో నేను నిరాహార దీక్ష చేస్తా!
న్యూఢిల్లీ: సంచలన వ్యాఖ్యలు చేసే ఫ్రైర్‌బ్రాండ్ నాయకురాలు, కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి కావేరి నదీ జలాల వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కావేరి జలాల విషయంలో ఉద్రిక్తతలు తగ్గకపోతే.. తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో తాను నిరాహార దీక్ష చేస్తానని ఆమె హెచ్చరించారు. ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేస్తున్న కావేరి జలాల ప్రతిష్టంభనను తొలగించేందుకు ఆమె గురువారం రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కావేరి జలాల సమస్య పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు. తమిళనాడుకు తాజాగా కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం.. ఆ తీర్పును ధిక్కరిస్తూ కర్ణాటక జలాలు విడుదల చేయకపోవడం తెలిసిందే. కావేరి నదీ జలాల లభ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కర్ణాటకను తమ మంత్రిత్వశాఖను కోరిందని కేంద్రమంత్రి ఉమాభారతి తెలిపారు. సమస్య పరిష్కారానికి రెండు రాష్ట్రాలు చొరవ చూపుతున్నాయని, ఈ సమావేశంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు నివేదిస్తామని ఆమె తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసి కూచొని కోర్టు బయటే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని తాను కోరానని ఆమె చెప్పారు. -
‘కావేరి’పై ఢిల్లీలో కీలక భేటీ
న్యూఢిల్లీ: కావేరి నది జల వివాదంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, తమిళనాడు పీడబ్ల్యూడీ మంత్రి ఎడప్పడి కే పళని సామి గురువారం భేటీ అయ్యారు. తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం కారణంగా ఈ భేటీకి హాజరు కాలేకపోయారు. రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 క్యూసెక్కుల కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సలహా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉమాభారతి అధ్యక్షతన కర్ణాటక, తమిళనాడు ప్రతినిధులు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
‘కావేరి’పై ఢిల్లీలో రేపు కీలక భేటీ
-
‘కావేరి’పై ఢిల్లీలో రేపు కీలక భేటీ
న్యూఢిల్లీ: కావేరి నది జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు గురువారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో సమావేశం కానున్నారు. రేపు 11.30 గంటలకు సమావేశానికి హాజరు కావాలని తమిళనాడు సీఎం జయలలిత, తనకు ఉమాభారతి వర్తమానం పంపారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ భేటీ నేపథ్యంలో తమిళనాడుకు కావేరి నది జలాల విడుదలను వాయిదా వేసినట్టు చెప్పారు. కేంద్ర మంత్రిలో సమావేశం తర్వాత నీటి విడుదల విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 క్యూసెక్కుల కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సలహా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు సీఎంలతో ఉమాభారతి సమావేశమవుతున్నారు. అయితే అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఈ భేటీకి హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. తన తరపున ఆమె ప్రతినిధుల బృందాన్ని పంపనున్నారని సమాచారం. -
ఉమాభారతి (కేంద్ర మంత్రి) రాయని డైరీ
మాధవ్ శింగరాజు బాగా తడిసిపోయి వచ్చారు కౌన్సిల్ మీటింగ్‌కి కేసీఆర్‌గారు, చంద్రబాబుగారు! బయటికి చూశాను. సన్నటి జల్లు. కేసీఆర్ వణుకుతున్నారు. అసలే బక్కపలుచని మనిషి. ఏసీ ఆఫ్ చేయించాను. చంద్రబాబు చొక్కా పిండుకుంటున్నారు. ఆయన చొక్కా ఆయనే పిండుకోవాలి కాబట్టి నా సహాయమంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ చేసే సహాయం కూడా ఏమీ లేకుండా పోయింది. తల తుడుచుకోడానికి రెండు పొడి టవల్స్ తెప్పించాను. ‘‘ఇంత వర్షం ఎప్పుడు పడింది సంజీవ్?’’ అని అడిగాను. ‘‘మేడమ్... అది ఢిల్లీ వర్షం కాదు. ఢిల్లీ బయటి వర్షం. ఒకటి ఆంధ్రా వర్షం. ఒకటి తెలంగాణ వర్షం. ఫ్లయిట్ ఎక్కేముందే ఇద్దరు సీఎంలూ తడిసినట్లున్నారు’’ అన్నాడు సంజీవ్ నా చెవిలో మెల్లిగా. కేసీఆర్‌గారు టవల్ అందుకుని శుభ్రంగా తల తుడుచుకున్నారు. తుడుచుకున్నాక, ప్యాంట్ జేబులోంచి దువ్వెన తీసి చక్కగా తల దువ్వుకున్నారు. షర్ట్ కాలర్ సరి చేసుకున్నారు. కొద్దిగా వాటర్ తాగి, బాటిల్‌ని టేబుల్ మీద పెట్టారు. అది తనతో పాటు తెచ్చుకున్న బాటిల్. కేంద్ర జల వనరుల శాఖ తెప్పించిన బాటిల్ కాదు. పద్ధతైన మనిషిలా ఉన్నారు కేసీఆర్! చంద్రబాబుగారింకా తల తుడుచుకోలేదు. ఆయన తల మీద నుంచి చుక్కలు చుక్కలుగా నీళ్లు కారుతున్నాయి. ‘‘చంద్రబాబుగారూ.. తల తుడుచుకోండి’’ అన్నాను. ‘‘నేను తుడుచుకునిపోయే రకం కాదు, తేల్చుకునిపోయే రకం’’ అన్నారు చంద్రబాబు! ఆయన మూడ్ బాగున్నట్టు లేదు. ‘‘మంచినీళ్లు తాగుతారా?’’ అన్నాను వాటర్ బాటిల్‌ని చంద్రబాబు చేతికి అందిస్తూ. ‘‘వద్దు’’అన్నారు. ‘‘నాకు మీ బాటిల్ అక్కర్లేదు’’ అన్నారు. ‘‘కేసీఆర్‌లా మీ బాటిల్ మీరే తెచ్చుకున్నారా?’’ అన్నాను నవ్వుతూ. చంద్రబాబు నవ్వలేదు. ‘‘కేసీఆర్ బాటిల్ తెచ్చుకోవడం ఏమిటి?! కేసీఆర్ నీళ్లు తాగుతున్న బాటిల్ నాదే. నాది నాకు ఇప్పించేస్తే నేను వెళ్లిపోతాను’’అన్నారు! కేసీఆర్ వైపు చూశాను. కేసీఆర్ నావైపు చూడలేదు. అసలు ఎవరి వైపూ చూడలేదు. ‘‘బాటిలు చంద్రబాబుది కాదు, బాటిల్లోని వాటరూ చంద్రబాబుది కాదు’’ అంటూ బాటిలెత్తి చంద్రబాబు కళ్ల ముందే ఇంకో గుక్క గొంతులో పోసుకున్నారు కేసీఆర్! ‘‘విభజన ముందు వరకే ఇది మా ఇద్దరి బాటిల్. విభజన తర్వాత ఇది నా ఒక్కడి బాటిల్’’ అన్నారు మరో గుక్క ఒంపుకుంటూ. బాటిల్ చేతికి వచ్చే వరకు పచ్చిగంగ ముట్టనని లేచి వెళ్లిపోయారు చంద్రబాబు. వరుణుడొచ్చి ఎన్ని టీఎంసీలు కుమ్మరించినా చేతిలోని బాటిల్‌ని మాత్రం వదిలిపెట్టేదిలేదని పైకి లేచారు కేసీఆర్. కేసీఆర్ కేసీఆర్‌లా లేరు, చంద్రబాబు చంద్రబాబులా లేరు. కృష్ణా, గోదావరి నదుల్లా ఉన్నారు. ఈ నదులను అనుసంధానం చెయ్యడం సాధ్యమేనా?! -
ఏపీ, తెలంగాణ నీళ్ల పంచాయితీ
-
ఢిల్లీలో నేడు ‘కృష్ణ’ తులాభారం
-
ఢిల్లీలో నేడు ‘కృష్ణ’ తులాభారం
⇒ హస్తినకు చేరిన నీళ్ల పంచాయితీ ⇒ పాల్గొననున్న తెలంగాణ, ఏపీ సీఎంలు, మంత్రులు, అధికారులు ⇒ అధికారులతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ సమీక్ష ⇒ పాలమూరు, డిండిలపై పాత జీవోలు సహా పలు నివేదికలతో రెడీ ⇒ పట్టిసీమ, పోలవరం కింద వాటాపై నిలదీయాలని నిర్ణయం ⇒ ఆర్డీఎస్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు సంసిద్ధం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఏపీ మధ్య రెండున్నరే ళ్లుగా నలుగుతున్న వివాదం హస్తిన చేరింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ఇందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శ ర్మ, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఈఎన్సీ విజయ్‌ప్రకాశ్‌లు మంగళవారం సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రమశక్తి భవన్‌లోని కేంద్రమంత్రి ఉమాభారతి చాంబర్లో సమావేశం జరగనుంది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల కింద తమకు దక్కే వాటాలపై గళమెత్తేందుకు ఇటు తెలంగాణ.. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై నిలదీసేందుకు అటు ఏపీ సిద్ధమయ్యాయి. మన వాదనలు గట్టిగా వినిపిద్దాం.. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాలమూరు, డిండి, టెలీమెట్రీ విధానం, నీటి వాటాల సర్దుబాటు, పట్టిసీమ, పోలవరం కింది వాటాలు, నీటి పంపిణీ-నిర్వహణలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎజెండాలో చేర్చిన అంశాలపై ఇరు రాష్ట్రాలు మొదట తమ వాదన వినిపించిన తర్వాత.. ఇతర అంశాలేవైనా ఉంటే వాటిపైనా వాదనలు జరిగే అవకాశం ఉంది. భేటీలో లేవనెత్తాల్సిన అంశాలపై తెలంగాణ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై గతంలో ఇచ్చిన జీవోలు, నీటి వాటాల్లో ఏపీ ఉల్లంఘనలు, ప్రాజెక్టుల నియంత్రణపై చట్టంలో పేర్కొన్న అంశాలు, బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పులు, సుప్రీంకోర్టులో కేసులకు సంబంధించిన అన్ని అంశాలతో అధికారులు నివేదిక సిద్ధం చేశారు. రెండేళ్లుగా నీటి విడుదలపై బోర్డుకు రాష్ట్రానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా నివేదిక రూపంలో పొందుపరిచారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరడానికి ముందు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్.. అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అధికారులు సిద్ధం చేసిన నివేదికలను అధ్యయనం చేయడంతో పాటు వాటిలో మార్పుచేర్పులపై కీలక సూచనలు చేశారు. ఏపీ లేవనెత్తే ప్రతీ అంశాన్ని సమర్థంగా తిప్పికొట్టేలా రాష్ట్ర వాదనలు సిద్ధం చేశారు. ముఖ్యంగా ఏపీ చేపట్టిన పోలవరం, పట్టిసీమతో గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తే తెలంగాణకు దక్కే 90 టీఎంసీల వాటాను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచి, ఏపీ వాటాను 512 టీఎంసీల నుంచి 422 టీఎంసీలకు తగ్గించాల్సిందిగా కోరాలని నిర్ణయించారు. కీలకంగా ఆర్డీఎస్.. ఎజెండాలో లేని రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) అంశాన్ని ప్రస్తావించాలని తెలంగాణ నిర్ణయించింది. నిజానికి ఆర్డీఎస్ పథకం కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా 5 నుంచి 6 టీఎంసీలకు మించి నీరందడం లేదు. దీని కింద 87,500 ఎకరాలకు నీరందాల్సి ఉన్నా 20 వేలకు మించి అందడం లేదు. కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండియాయి. దీంతో ఆనకట్ట పొడవు పెంచేందుకు నిర్ణయించి, పనులు చేపట్టగా ఏపీ పదేపదే అడ్డుకుంటోంది. దీనిపై చర్చలకు ఆహ్వానించినా.. ఏపీ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీనికి తోడు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకముందే ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వకానికి ఏపీ సర్కారు సిద్ధమవుతోంది. ఈ అంశాలను అపెక్స్ కమిటీ ముందుంచాలని సీఎం నిర్ణయించారు. -
గంగా కాలుష్యంపై కొరడా
న్యూఢిల్లీ: గంగానదీ కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర జలవనరుల శాఖ కసరత్తులు చేస్తోంది. మంగళవారం ఆ శాఖ మంత్రి ఉమా భారతి మాట్లాడుతూ.. నదీజలాల కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, సెక్షన్ 5 కింద కూడా చర్యలు తీసుకునేలా పీసీబీకి సూచించామన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న అథారిటీ స్వయం ప్రతిపత్తితోపాటు పరిశ్రమలపై చర్యలు తీసుకునే అధికారాల్ని కలిగివుంటుందన్నారు. కొత్త అథారిటీ చర్యలు తీసుకోవడంలో విఫలమైన పక్షంలో జరిమానా విధించేందుకు కోర్టును కూడా ఆశ్రయించవచ్చని తెలిపారు. నూతనంగా ఏర్పాటు కానున్న అథారిటీకి ఇంకా ఏ పేరు పెట్టలేదని.‘జాతీయ గంగాజల శుద్ధీకరణ కార్యక్రమం’ పేరు అయితే బాగుంటుందన్నారు. -
ఇంగ్లిష్‌కు బానిసలమైనందుకు సిగ్గుపడాలి
న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు దాటినా మనం ఇంగ్లిష్ భాష బానిసత్వంలోనే ఉన్నామనీ, ఇది సిగ్గుపడాల్సిన విషయమని కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతి అన్నారు. పరిపాలన వ్యవహారాల్లో దేశభాష హిందీని వాడాలని అధికారులను కోరారు. సొంత భాషను తక్కువ చేసుకునే జాతికి ఆత్మగౌరవం ఉండదని బుధవారమిక్కడ ఓ కార్యక్రమంలో అన్నారు. -
ఎయిమ్స్ నుంచి ఉమా భారతి డిశ్చార్జ్
న్యూఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి సోమవారం ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీనొప్పితో ఆమె శుక్రవారం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అనీజినెస్తో పాటు ఛాతినొప్పితో ఉమా భారతి ఆస్పత్రిలో చేరినట్లు జలవనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా వెన్ను, మోకాళ్లలో వణుకుపై వైద్యులు చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆస్పత్రిలో చేరిన ఉమా భారతి
న్యూఢిల్లీ : కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి శుక్రవారం ఎయిమ్స్‌లో చేరారు. ఆమెకు ఛాతీనొప్పి రావటంతో హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఉమాభారతికి చికిత్స అందిస్తున్నారు. కాగా ఉమా భారతి ఆరోగ్యంపై వైద్యులు వివరాలు వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కృష్ణా బోర్డు పరిధి దాటుతోంది
ఉమాభారతికి హరీశ్ ఫిర్యాదు - చట్టాన్ని ఉల్లంఘిస్తోంది - లేని అధికారాలతో ముసాయిదా తెచ్చింది - ఆమోదిస్తే కోర్టుకు వెళతామని స్పష్టీకరణ.. నేడు సాగునీటి కార్యదర్శితో సవివర చర్చ సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తన పరిధిని అతిక్రమించి నీటి కేటాయింపుల్లో జోక్యం చేసుకోవాలని చూస్తోందని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతికి నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ పట్ల పక్షపాతం చూపుతోందని ఆరోపించారు. తెలంగాణ, ఏపీలకు నీటి కేటాయింపుల బాధ్యతను తన వద్దే ఉంచుకుంటూ బోర్డు రూపొందించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను తక్షణం నిలిపేయాలని కోరారు. సోమవారం ఆయన ఉమాభారతితో ఇక్కడ ఆమె నివాసంలో సమావేశమై మాట్లాడారు. అనంతరం వివరాలను టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి విలేకరులకు వెల్లడించారు. ‘‘కృష్ణా బోర్డు అత్యుత్సాహ వైఖరితో చట్టాన్ని అతిక్రమించజూస్తోంది. చ ట్టాన్ని ఉల్లంఘించే విపరీత ప్రయత్నాలతో వ్యవహరిస్తున్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 85 (బి), 87 (1) ప్రకారం బోర్డుకు ఉన్న బాధ్యత ట్రిబ్యునల్ కేటాయింపులను అమలు చేస్తూ నియంత్రించడం మాత్రమే. కానీ, బోర్డు తనకు లేని అధికారాన్ని తీసుకుని... కేటాయింపులు చేసే బాధ్యతలను అట్టిపెట్టుకుంటూ ముసాయిదా నోటిఫికేషన్ తయారు చేసి కేంద్రానికి పంపింది. ఏపీ సర్కారు రాసిస్తే, దానిపై బోర్డు సంతకం పెట్టినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ ముసాయిదాను అంగీకరించరాదని, తక్షణమే కేంద్రం నిలుపుదల చేయాలని మంత్రిని కోరాం. ఆమోదిస్తే కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేశాం. వీటన్నింటిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. మంగళవారం నీటి పారుదల శాఖ కార్యదర్శితో సమావేశం ఏర్పాటుచేశారు. ఆ భేటీలో అన్ని విషయాలనూ సమగ్రంగా వివరిస్తాం.’’ అని తెలిపారు. ఏపీ పట్ల బోర్డు పక్షపాతం ఏపీ పట్ల కృష్ణా బోర్డు పక్షపాతం చూపుతోందని హరీశ్ ఆరోపించారు. ‘‘బ్రిజేశ్ ట్రిబ్యునల్ తాజా కేటాయింపులపై సుప్రీంకోర్టులోనూ, ట్రిబ్యునల్‌లోనూ వివాదం నడుస్తోంది. ప్రస్తుతం బచావత్ అవార్డు అమల్లో ఉంది. ఆ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గుండుగుత్తగా నీళ్లు కేటాయించిందే తప్ప ప్రాజెక్టులవారీగా కాదు. కాబట్టి రాష్ట్రం విడిపోయిన తొలి ఏడాదే తాత్కాలికంగా నీటి వాడకంపై అవగాహన కుదిరింది. దాని ప్రకారం ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంటుంది. ఇదేమీ తుది నిర్ణయం కాదు. తుది నిర్ణయం సుప్రీం, ట్రిబ్యునల్ చేతుల్లో ఉంది. ఆ నిర్ణయం వెలువడకముందే కృష్ణా బోర్డు తన పరిధిపై నోటిఫికేషన్ ముసాయిదా పంపింది. శ్రీశైలం ఎగువనున్న జూరాలతో ఏపీకి ఏ మాత్రం సంబంధం లేకపోయినా బోర్డు దాన్ని కూడా పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటూ ముసాయిదా రూపొందించింది. ఏపీలోని పులిచింతల, కేసీ కెనాల్, కృష్ణా డెల్టా వంటి వాటిపైనేమో నామమాత్రపు నియంత్రణతో సరిపెట్టింది. మిగులు జలాలపై ఆధారపడ్డ తెలంగాణకు చెందిన కల్వకుర్తి, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులకు కేవలం వరద జలాలనే వాడుకోవాలని చెప్పింది. అదే ఏపీలో మిగులు జలాలపై ఆధారపడ్డ వలిగొండ, హెచ్ఎన్ఎస్, గాలేరు-నగరి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల విషయానికి వచ్చేసరికి వరద జలాల ప్రస్తావన లేదు. కేసీ కెనాల్, కృష్ణా డెల్టాలకు కేటాయింపులకు మించి దశాబ్దాలుగా వాడుకుంటున్నా వాటిపై నియంత్రణ పెట్టకుండా పూర్తిగా వదిలేశారు. బోర్డు పక్షపాతానికి ఇవి నిదర్శనం మాత్రమే’’ అని విమర్శించారు. రాధామోహన్‌సింగ్‌తో భేటీ: కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌తో కూడా హరీశ్ భేటీ అయ్యారు. మండలాల్లో నిర్మించ తలపెట్టిన గోడౌన్లకు సబ్సిడీ ఇవ్వాలని కోరారు. కరువు నిధులను రూ.791 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మొత్తం రూ.1,400 కోట్లు విడుదల చేయాలని కోరారు. తెలంగాణకు మరో 90 టీఎంసీలు ఇవ్వాలన్నాం ‘‘ఏపీ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు రాగానే 90 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు వర్తిస్తాయని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు చెప్పింది. తెలంగాణకు 45 టీఎంసీలు, కర్ణాటక, మహారాష్ట్రలకు 45 టీఎంసీలు రావాల్సి ఉంటుంది. పట్టిసీమకు అనుమతులు రాగానే మరో 90 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు వర్తిస్తాయి. ఇందులో 45 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏఐబీపీ కింద తెలంగాణలోని 11 ప్రాజెక్టులకు త్వరగా నిధులు విడుదల చేయాలని, ఒక జాతీయ ప్రాజెక్టు మంజూరు చేయాలని కోరాం. ఏఐబీపీ ప్రాజెక్టులు, ప్రస్తుతం అమల్లో ఉన్న 15 జాతీయ ప్రాజెక్టుల నిర్మాణం కొలిక్కివచ్చాక తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు’’ అని హరీశ్ వివరించారు. -
కేంద్రమంత్రికి కేసీఆర్ లేఖ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు బుధవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు వచ్చే వాటా ఎంతో తేల్చాకే.. ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో కేసీఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న నూతన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిబంధనలకు లోబడే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను తేల్చాలని కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. -
'నితీష్ పీఎం అయితే దేశంలో జంగిల్ రాజ్'
న్యూఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. నితీష్ ప్రధాని అయితే బిహార్ లో మాదిరిగా దేశంలో జంగిల్ రాజ్(ఆటవిక రాజ్యం) వస్తుందని అన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ అక్రమంగా జేడీయూతో పొత్తు పెట్టుకొని నితీష్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బిహార్ లో జేడీయూ ఎమ్మెల్సీ కుమారుడు తన కారును ఓవర్ టేక్ చేశాడని 19 ఏళ్ల యువకున్ని కాల్చి చంపడంపై ఆమె స్పందిస్తూ... నితీష్ మద్యపానం సేవించేవారిపై చర్యలు తీసుకుంటున్నారని అలాగే అధికార మదంతో ప్రవర్తిస్తున్నవారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె సవాల్ విసిరారు. ఈరోజు సాహెబ్ గంజ్ లో ఆమె గంగానది ప్రక్షాళన చేసేందుకు తొమ్మిది పథకాలను ఆమె ప్రారంభించనున్నారు. -
సీఎంపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అహంకార దోరణితో వ్యవహరిస్తున్నారని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమా భారతి విమర్శించారు. తాగునీటి సరఫరా విషయంలో ఆమె యువ సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుందేల్ ఖండ్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. కేంద్రం ఈ మధ్య రైళ్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ నుంచి గురువారం ఓ రైలు నీటిని తీసుకెళ్తుండగా ఝాన్సీ ప్రాంతంలో నిలిపివేసినట్లు మంత్రి తెలిపారు. ఈ విషయంలో కేంద్ర జోక్యం అనవసరమని, వారి ప్రమేయం ఎందుకంటూ అఖిలేశ్ వ్యాఖ్యానించడంపై ఉమా భారతి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయాలు చేసేందుకు ఇవి తగిన అంశాలు కావని హితవు పలికారు. సీఎం అఖిలేశ్ చదువుకున్న వ్యక్తి అయినప్పటికీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని, యూపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. నీళ్లు, ఆహారం లాంటి విషయాల్లో రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టంచేశారు. వాటర్ తో రైలు రావడం, అడ్డగించడం విషయంపై తమ వద్ద సరైన సమాచారం లేదని జిల్లా కలెక్టర్ అజయ్ శుక్లా పేర్కొన్నారు. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే పార్టీల నేతలు రాజకీయాలు మొదలుపెట్టారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పోలవరం పురోగతి అంతంత మాత్రమే
♦ లోక్‌సభలో వెల్లడించిన ఉమాభారతి ♦ ఎంపీలు వైవీ,అవినాష్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి అంతంత మాత్రంగానే కొనసాగుతోందనీ డ్యామ్ ప్రాంతంలో భూమి పనులు 26 శాతం, కట్టల పనులు రెండు శాతం, కాంక్రీటు పనులు 4 శాతం ఇప్పటి వరకూ పూర్తయ్యాయనీ కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమా భారతి పునరుద్ఘాటించారు. అయితే 2018 మార్చికల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యమని తెలిపారు. ఆమె లోక్‌సభలో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌పై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ప్రస్తుత పంచవర్ష ప్రణాళికలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందా? అన్న ఎంపీల ప్రశ్నకు కేంద్ర మంత్రి నేరుగా జవాబివ్వలేదు. ముందుగా ఖరారు చేసిన ప్రణాళిక ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌ను 2018 మార్చి నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యమని మాత్రమే తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అందించిన సమాచారం ప్రకారం పోలవరం డ్యామ్ ప్రస్తుత పనుల వివరాలను వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు. -
గడువులోగా పోలవరం పూర్తికాదు
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు గడువులోగా పూర్తికాదని, గడువులోగా పూర్తి చేయడానికి కొన్ని సమస్యలు తలెత్తాయని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి చెప్పారు. పోలవరం పూర్తికి కొంత కాలపరిమితి పెంచాల్సి రావచ్చన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అథారిటీని ఏర్పాటు చేశామని, అయితే గడువులోగా పూర్తి సమస్యలు ఉన్నాయని శనివారం విలేకరుల సమావేశ ంలో ఆమె చెప్పారు. పోలవరం పాజెక్టు పూర్తి కార్యాచరణ, ప్రణాళికలను చర్చించడానికి ఢిల్లీకి రావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబును కోరామని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించి ప్రాజెక్ట్‌కు కొత్త కాలపరిమితి నిర్ధారిస్తామన్నారు. ప్రాజెక్టుకు విధించిన గడువు దాటరాదన్నది తమ అభిమతమని, కానీ కొంతమేరకు సమయం పెంచాల్సి రావచ్చునని ఉమాభారతి వెల్లడించారు. ఇప్పుడు ప్రాజెక్టుకు నిధుల కొరత లేదన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఇటీవలే రూ. 200 కోట్లు అందించామని, మొత్తం ఇప్పటికి రూ. 500 కోట్లు విడుదల చేశామని తెలిపారు. అయితే ఈ మొత్తం కేటాయింపులపై తనకు సంతృప్తిగా లేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ. 1,600 కోట్లు విడుదల చేయాలని నీతి ఆయోగ్‌ను కోరామన్నారు. -
గడువులోపే పోలవరం పూర్తి చేస్తాం: ఉమా భారతి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును గడువులోపే పూర్తిచేస్తామని, అవసరమైన మేర నిధులు అందిస్తామని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు కేటాయిస్తే ఎప్పటికి పూర్తిచేస్తారని మీడియా ప్రశ్నించగా.. ‘పోలవరం ప్రాజెక్టు దేశానికి గర్వకారణం. చట్టాన్ని అనుసరించి దానిని జాతీయ ప్రాజెక్టును చేశాం. ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటు చేశాం. అథారిటీ అవసరాలు, డిమాండును బట్టి నిధులు అందజేస్తాం. నిర్మాణం పూర్తిచేస్తాం. నీతిఆయోగ్‌ను కూడా తరచుగా సంప్రదిస్తున్నాం. నిర్ధిష్ట సమయంలోపే పూర్తిచేస్తాం’ అని వివరించారు. ‘పోలవరం అంశంపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబుని పిలిచాం. గడువులోపు ఎలా పూర్తిచేయాలన్న అంశంపై ఆయనతో చర్చిస్తాం’ అన్నారు. -
మంత్రులతో హరీశ్‌రావు భేటీ
-
'ఇక పెళ్లయ్యే ఛాన్స్ లేదు'
న్యూఢిల్లీ: తాను పెళ్లి చేసుకోలేదని, తన జీవితంలో వివాహానికి చోటు లేదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చెప్పారు. లోక్ సభ స్పీకర సుమిత్రా మహాజన్ పొరపాటుగా శ్రీమతి' అని సంబోధించడంతో ఆమె ఈ విధంగా స్పందించారు. సభలో ప్రకటన చేయడాలని కోరుతూ ఉమాభారతిని శ్రీమతిగా పేర్కొన్నారు. దీనిపై ఉమాభారతి వెంటనే స్పందించారు. 'నేను ఇప్పటికి వరకు పెళ్లి చేసుకోలేదు. భవిష్యత్ లో కూడా ఆ అవకాశం లేదు. అక్కడ వేకెన్సీ బోర్డు లేదని' ఉమాభారతి అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. స్పీకర్ పొరపాటుకు క్షమాపణ చెప్పి తమ మాటను సవరించుకున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన 56 ఏళ్ల ఉమాభారతిని ' సాధ్వి'గా పేర్కొంటారు. -
ఉమాభారతితో సీఎం చంద్రబాబు భేటీ
-
'పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత మాదే'
న్యూఢిల్లీః పోలవరం ప్రాజెక్టును నిర్ధిష్ట సమయంలో పూర్తిచేస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టు అయినందున తమకు పూర్తి బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం తాను స్వయంగా నీతిఆయోగ్‌కు వెళ్లి చర్చించానని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి కావాలని కోరుతోందని వివరించారు. పోలవరం ప్రాజెక్టుపై గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటివరకు కేవలం 5 గ్రామాలకు మాత్రమే పునరావాస సహాయ చర్యలు చేపట్టారని, ప్రాజెక్టు సత్వర నిర్మాణం కోసం నిధులు భారీగా విడుదల చేయాలని కోరారు. కొత్త చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఇప్పటికీ తమ తమ ఆవాసాల్లోనే ఉన్నందున వారందరికీ 1894 నాటి చట్టం ప్రకారం కాకుండా.. 2013 తరువాత వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ ఎ.సీతారాంనాయక్ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రాన్ని కోరారు. దీనికి ఉమాభారతి సమాధానమిస్తూ నిర్వాసితులకు మేలు చేకూర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం ఇదే అంశంపై ప్రశ్నిస్తూ కొత్త చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు. -
ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా ఇవ్వండి: కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు త్వరగా జాతీయ హోదా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని బుధవారం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అనేక అడ్డంకులు, కేసులు ఉన్నప్పటికీ జాతీయ హోదా దక్కిందని, అయితే ప్రాణహిత విషయంలో ఇంకా జాప్యం జరుగుతోందన్నారు. జాతీయ జలవనరుల మరమ్మతులు, ఆధునీకరణ, సంరక్షణ ప్రాజెక్టు(ఆర్ఆర్ఆర్) పథకం కింద తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశా రు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్‌కాకతీయ పనులను స్వయంగా వీక్షించాలని కోరా రు. జాతీయహోదా ప్రకటన ప్రక్రియను వేగవంతం చేయడంపై, ఆర్ఆర్ఆర్ నిధుల కేటాయింపుపై మంత్రి సానుకూలంగా స్పందించారని కవిత మీడియాకు తెలిపారు. -
'ప్రాణహితకు సీడబ్ల్యూసీ అనుమతి త్వరగా ఇవ్వండి'
- ఉమాభారతికి ఎంపీ వినోద్ లేఖ న్యూఢిల్లీ: బి.ఆర్.అంబేడ్కర్ ప్రాణహిత - చేవెళ్ల సుజల స్రవంతి పథకానికి కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి త్వరగా వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రి ఉమాభారతిని కోరుతూ కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ లేఖ రాశారు. ఆ లేఖను మంగళవారం ఇక్కడ మీడియా కు విడుదల చేశారు. ‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించేం దుకు ఇప్పటికే ప్రధాని సానుకూలత వ్యక్తం చేశారు. దీనికి సీడబ్ల్యూసీ అనుమతి కోసం 2010లోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను ప్రాజెక్టు సీఈ సమర్పించా రు. ‘రాష్ట్ర నీటి పారుదల శాఖలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) ఉన్నప్పుడు సీడబ్ల్యూసీ పాత్రను కేవలం అంతర్రాష్ట్ర వివాదాలు, హైడ్రాలజీ వంటి అంశాలకే పరిమితం కావాలని నిబంధనలు చెబుతున్నాయి. సీడబ్ల్యూసీ తన పాత్ర వరకే పరి మితమై అనుమతులు త్వరగా మంజూరు చేసేలా చైర్మన్‌కు ఆదేశాలు జారీచేయగల రు. త్వరగా అనుమతి వస్తే జాతీయ ప్రా జెక్టు హోదా ప్రకటనకు మార్గం సుగమం అవుతుంది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
అపెక్స్ కౌన్సిల్‌పైనే ఆశలు!
మూడోవారంలో భేటీ కృష్ణా జలాల వివాదం పరిష్కారందిశగా ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ఈనెల మూడో వారంలో తెరపడవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ‘మిషన్ కాకతీయ’ ప్రారంభోత్సవానికి మూడో వారంలో హైదరాబాద్ రానున్న కేంద్ర జలవనరులశాఖ మంత్రి, అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ ఉమా భారతి ఇరు రాష్ట్రాల సీఎంలతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించి వివాదానికి పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాయి. ఇప్పటికే వివాదంపై కృష్ణా నదీ బోర్డు చేతులెత్తేసిన పరిస్థితుల్లో అపెక్స్ కౌన్సిల్ ఒక్కటే రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చగలదని పేర్కొంటున్నాయి. కృష్ణా జలాలపై సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కరించుకోవడానికి రెండు రాష్ట్రాల సీఎంలు ముందుకు వస్తే తప్ప కృష్ణా జలాల వివాదానికి తెరపడదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని ఇరు రాష్ట్రాల అధికారులు కేంద్ర జలవనరులశాఖ అధికారులకు చెప్పినట్లు సమాచారం. కేంద్ర జలవనరుల మంత్రి నేతృత్వంలోని ‘అపెక్స్ కౌన్సిల్’లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర మంత్రి ఉమా భారతి తెలంగాణకు వచ్చినప్పుడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే ఆమె సమక్షంలో ఇద్దరు సీఎంలు చర్చించుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు కేంద్రానికి నివేదించారని తెలిసింది. ఇందుకు కేంద్ర జలవనరులశాఖ అధికారుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, అపెక్స్ కౌన్సిల్ భేటీ దిశగా ప్రయత్నాలు చేస్తామని వారు పేర్కొన్నట్లు సమాచారం. మిషన్ కాకతీయ ప్రారంభోత్సవ తేదీకి ముందు లేదా తర్వాత రోజు అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ‘ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వెళితేనే సమస్యకు పరిష్కారం ఉంటుంది. బోర్డుకు ఎన్ని లేఖలు రాసినా, బోర్డు ఎన్ని వివరాలు కోరినా.. అది సమస్యను పరిష్కరించలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చిన 60 రోజుల్లోగా నోటిఫై చేయాలనే నిబంధన ఉన్నా కేంద్రం పట్టించుకోలేదు. పంతాలకు పోతే రైతులు నష్టపోతారు. వాస్తవ పరిస్థితిని దృష్టి లో పెట్టుకొని సీఎంలు సమస్య పరిష్కరించుకోవాలి’ అని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. న్యాయ సలహా కోరే యోచనలో బోర్డు! ఇక కృష్ణా జలాల వివాదంపై బోర్డు న్యాయ సలహా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. సాగర్‌లో నీటి లభ్యత, డిమాండ్, భవిష్యత్ తాగునీటి అవసరాల గణాంకాలను పేర్కొంటూ రెండు రాష్ట్రాలు బోర్డుకు రాసిన లేఖల్లో పొంతన లేని లెక్కలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సమావేశమై ఒకే రకమైన గణాంకాలు సమర్పించాలని బోర్డు సూచించినా అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో చేతులెత్తేసిన కృష్ణా బోర్డు తదుపరి కార్యాచరణపై న్యాయ సలహా తీసుకోవాలని యోచిస్తున్నట్లు బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. -
సంక్రాంతిలోగా ఢిల్లీకి సీఎం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంక్రాంతి పండుగలోగా ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రధానంగా నల్లగొండలో జెన్కో, ఎన్టీపీసీ సంస్థలు ఏర్పాటు చేయనున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం అటవీ భూమిని బదిలీ చేయాలని కోరడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ విద్యుత్ ప్రాజెక్టులకు అనువైన స్థలాన్ని ఇటీవల సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేలో పరిశీలించిన సంగతి తెలిసిందే. ఇక్కడ దాదాపు పదివేల ఎకరాలకు పైగా భూమిని నల్లగొండ జిల్లా అధికారులు సర్వే కూడా పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో అక్కడ అటవీ భూములను పరిశ్రమలకు కేటాయిస్తే ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపిస్తామని సీఎం వివరించనున్నట్లు సమాచారం. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్, కేంద్ర జల వనరుల మంత్రి ఉమా భారతి, ఇంధన మంత్రి పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను కూడా కేసీఆర్ కలవనున్నట్టు తెలిసింది. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ మాత్రం ఇంకా సీఎం కార్యాలయం కోరలేదని సమాచారం. -
కేంద్రానికి చెప్పి వాటా వాడుకుందాం
రబీకి కృష్ణా జలాల వినియోగంపై టీ సర్కార్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాలను ప్రస్తుత రబీ అవసరాలకు వినియోగించుకునే విషయంలో వాస్తవ పరిస్థితులను కేంద్రానికి తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిం ది. కేంద్రానికి లేఖ ద్వారా లేదా స్వయంగా అన్ని విషయాలు వివరించాకే నీటి వినియోగం మొదలుపెట్టాలని భావిస్తోం ది. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటిపారుదలశాఖకు స్పష్టమైన సూచనలు చేశారు. కేరళ పర్యటన నుంచి వచ్చిన కేసీఆర్.. ఆదివారం నీటిపారుదల మం త్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు తదితరులతో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. మూడు గంటలపాటు కృష్ణా జలాల వివాదం, ఏపీ చేస్తున్న వాదనలపై కూలంకషంగా చర్చించారు. ఇప్పటికే వాటా మేరకు నీటిని వినియోగించుకున్న ఏపీ ప్రస్తుతం మిగిలిన నీటిలోనూ వాటా కోరుతోందని, ఇందుకు అంగీకరించకపోవడంతో బోర్డుకు పదేపదే లేఖలు రాస్తూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని అధికారులు వివరించినట్లుగా తెలిసింది. ఈ దృష్ట్యా తాము సైతం రబీ అవసరాలకు నీటిని వినియోగించుకునే అంశమై బోర్డుకు లేఖ రాశామని, వారి నుంచి పెద్దగా స్పందన లేదని తెలిపినట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, అన్ని అంశాలను కేంద్ర జలవనరులశాఖకు తెలుపుతూ లేఖ రాయాలని సూచించినట్లుగా చెబుతున్నారు. అవసరమైతే త్వరలో చేపట్టనున్న ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి ఉమా భారతిని కలసి సమస్యను వివరించి పరిష్కారం కోరతానని సీఎం వెల్లడించినట్లుగా తెలిసింది. కేంద్రానికి అన్ని వివరాలు తెలిపాకే రబీకి నీటి వినియోగం ప్రారంభిద్దామని ఆయన సూచించినట్లుగా సమాచారం. ఇక, ప్రస్తుతం సాగర్‌లో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని రబీ అవసరాలను కేవలం నల్లగొండ జిల్లాకే పరిమితం చేయాలనే దిశగా సమాలోచనలు చేసినట్లు తెలిసింది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కలిపి 4.20 లక్షల ఎకరాల మేరకు నీటి అవసరాలు ఉన్నా, నల్లగొండ జిల్లాకు 3 లక్షల ఎకరాల మేరకే నీటిని ఇవ్వగలిగే అవకాశం ఉందని సమావేశంలో అధికారులు సీఎంకు తెలియజేసినట్లుగా సమాచారం. ఖమ్మం జిల్లాను సైతం కలిపితే పంట చేతికొచ్చే సమయంలో నీటి కొరత ఏర్పడితే సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఈ దృష్ట్యా రబీ నుంచి ఖమ్మం ఆయకట్టును పక్కనబెట్టడమే ఉత్తమమని వారు సూచించినట్లుగా తెలిసింది. అయితే ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం మిగిలి ఉన్న 1.20 లక్షల ఎకరాల ఖరీఫ్ సాగు అవసరాలకు నీటిని మాత్రం యథాతథంగా విడుదల చేస్తామని వారు స్పష్టం చేసినట్లుగా తెలిసింది. దీనికి సీఎం సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. -
జాతీయ హోదాకు ఓకే!
-
జాతీయ హోదాకు ఓకే!
* ప్రాణహిత ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సుముఖత * మరోవారం రోజుల్లో అన్ని అంశాలపై చర్చిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హామీ * కొత్త రాష్ట్రానికి కేంద్రం సహకారం ఉంటుందని వెల్లడి * కేంద్రమంత్రితో సీఎం భేటీ.. ప్రాజెక్టులపై చర్చ * పోలవరం డిజైన్ మార్చాలని విన్నపం * దేవాదులకు తొలి విడతగా రూ. 64 కోట్ల విడుదలకు కేంద్రమంత్రి అంగీకారం * ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, దేవాదుల ప్రాజెక్టు పూర్తికి నిధులు సహా పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు పార్లమెంట్‌కు వెళ్లిన కేసీఆర్.. అక్కడ టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. విభజన చట్టంలోని హామీలను సాధించేం దుకు ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇందులో చర్చించినట్టు సమాచారం. అనంతరం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభ పక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, కవిత, బూర నర్సయ్యగౌడ్, సీతారాం నాయక్, బాల్క సుమన్, బీబీ పాటిల్, నగేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలాచారి, తేజావత్ రామచంద్రుడు, తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం వ్యక్తిగత కార్యదర్శి నర్సింగరావుతో కలిసి శ్రమశక్తి భవన్‌కు వెళ్లి కేంద్ర మంత్రి ఉమాభారతితో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరాంతోపాటు ఆ శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోండి.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్.. ఉమాభారతిని కోరారు. ఈ సందర్భంగా ఇందులో సాంకేతిక సమస్యలపై రాష్ట్ర, కేంద్ర జలవనరుల శాఖల అధికారులతో ఉమాభారతి చర్చించారు. ప్రధానంగా విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ప్రస్తావించగా, అందుకు కేసీఆర్ స్పందిస్తూ.. విద్యుత్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ‘ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రాతో ఏం లడాయి లేదుగా..’’ అని కేంద్రమంత్రి అడిగారు. ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం చెప్పారు. తర్వాత ఉమాభారతి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణకు కూడా జాతీయ ప్రాజెక్టు ఉండాలని నేను చాలా ఆత్రుతతో ఉన్నా. మా అధికారులతో వీలైనంత త్వరగా చర్చిస్తా. మేం చాలా సానుకూలంగా ఉన్నాం. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహాలు వద్దు’’ అని పేర్కొన్నారు. తెలంగాణలో దేవాదుల పూర్తి చేసేందుకు కూడా సహకరించాలని సీఎం కోరగా.. ఈ ప్రాజెక్టుకు వారం రోజుల్లో మొదటి విడత కింద రూ.64 కోట్లు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చండి.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణకు అభ్యంతరాలు లేవని, అయితే కేంద్రం నిర్ణయంతో మూడు లక్షల మంది గిరిజనులు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని సీఎం కేసీఆర్.. ఉమాభారతి దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న చోటు దేశంలోనే రెండో భూకంప తీవ్రత కల్గిన ప్రాంతంగా నివేదికలు వచ్చాయని, డిజైన్ మార్చాలని కోరారు. ఇందుకు మంత్రి ఉమాభారతి స్పందిస్తూ.. ‘పోలవరం విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవచ్చు కదా’ అని సూచించారు. అందుకు కేసీఆర్ స్పందిస్తూ.. దీనిపై చర్చించుకునేందుకు తమకేం ఇబ్బంది లేదన్నారు. అనంతరం చెరువులు, కుంటలను అనుసంధానం చేసే ‘మిషన్ కాకతీయ’ గురించి వివరించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావాలని కోరారు. ప్రతి ఇంటికీ మంచినీటి నల్లా వేసే కార్యక్రమం గురించి సీఎం చెప్పగా.. కేంద్రం తరఫున సహకారం అందిస్తామని మంత్రి హామీనిచ్చారు. సమావేశం అనంతరం కేసీఆర్ హైదరాబాద్‌కి బయలుదేరి వెళ్లారు. రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్ చేరుకున్నారు. సానుకూలంగా స్పందించారు: కవిత తెలంగాణకు కేంద్ర జలవనరుల శాఖ నుంచి సహకారం ఉంటుందని ఉమాభారతి హామీ ఇచ్చినట్టు టీఆర్ఎస్ ఎంపీ కవిత చెప్పారు. తెలంగాణ నా బిడ్డ లాంటిది: ఉమాభారతి ‘‘తెలంగాణ నాకు బిడ్డ లాంటిది. ఉద్యమంలో నేను మా పార్టీ తరపున వచ్చాను. తెలంగాణ పదం వింటేనే నా నోరు తీపి అవుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తన కాళ్లమీద తాను నిలబడేందుకు నా శాఖ తరఫున పూర్తిగా సహకరిస్తా’’ అని సీఎం కేసీఆర్‌తో ఉమాభారతి అన్నారు. ఇందుకు సీఎం.. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు హైదరాబాద్‌లో నా ఇంటికి వచ్చి ఆశీర్వదించారు. అప్పుడు నేను మీకు మొక్కిన ఫొటోనే పెద్దగా చేసి పెట్టుకున్నాను’’ అని గుర్తు చేశారు. ‘‘అప్పట్లో వార్తా పత్రికల్లోనూ ఆ ఫొటో పెద్దగా వచ్చింది. నాకు ఇంకా గుర్తుంది. అయినా అందులో తప్పేం లేదు. సోదరికి, సోదరి కూతుళ్లకు మొక్కడం మన సంప్రదాయం. కవిత నాకు కోడలు లాంటిది’’ అని మంత్రి ఆత్మీయంగా అన్నారు. ‘‘తెలంగాణ పేరిట ఉద్యమం చేసి చాలా మంది సీఎంలు అయ్యారు. ఆ తర్వాత వాళ్లంతా తెలంగాణకు శత్రువులుగా మారిపోయారు. మీరు మాత్రం ఎంతో తపస్సు చేసి తెలంగాణ సాధించుకున్నారు’’ అని కేసీఆర్‌ని అభినందించారు. -
రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకోండి: బుట్టా
సాక్షి, న్యూఢిల్లీ: తుంగభద్ర నదిపై హవేరీ జిల్లాలో మరో రిజర్వాయర్ నిర్మించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దానిని అడ్డుకోవాలని వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీ బుట్టా రేణుక కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే దిగువన ఉన్న కర్నూలు జిల్లా రైతాంగ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈమేరకు ఆమె ఉమాభారతికి శుక్రవారం ఓ వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచడంతో ఆగస్టు తర్వాత శ్రీశైలం డ్యాంకి వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోతోందని మంత్రి దృష్టికి తెచ్చారు. దీనివల్ల కర్నూలు జిల్లాలో వ్యవసాయానికి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతోందన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఎగువ తుంగభద్రపై మరో డ్యాం నిర్మిస్తే జిల్లా రైతుల ఇబ్బందులు మరింత పెరుగుతాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మించకుండా అడ్డుకోవాలని కోరారు. -
రాజనాథ్, ఉమాభారతిలతో బాబు భేటీ
-
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రికి ఫిర్యాదు