ఇంగ్లిష్‌కు బానిసలమైనందుకు సిగ్గుపడాలి
న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు దాటినా మనం ఇంగ్లిష్ భాష బానిసత్వంలోనే ఉన్నామనీ, ఇది సిగ్గుపడాల్సిన విషయమని కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతి అన్నారు. పరిపాలన వ్యవహారాల్లో దేశభాష హిందీని వాడాలని అధికారులను కోరారు. సొంత భాషను తక్కువ చేసుకునే జాతికి ఆత్మగౌరవం ఉండదని బుధవారమిక్కడ ఓ కార్యక్రమంలో అన్నారు.