
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అరుదైన, పలకడానికి కష్టంగా ఉన్న ఇంగ్లీష్ పదాలు వాడుతుంటాడు అనేది తెలిసిన విషయమే. అతడి ఖరీదైన ఇంగ్లీష్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన జే అనే టీచర్ ‘శశి థరూర్స్ ఇంగ్లీష్ యాక్సెంట్ ఈజ్ బ్యూటీఫుల్’ అనడమే కాదు అతడిలా చక్కని ఇంగ్లీష్ మాట్లాడాలంటే అంటూ కొన్ని టిప్స్ చెప్పాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో జే పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. శశి థరూర్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న వీడియోలను ప్లే చేస్తూ.... ‘చూడండి ఈ పదాన్ని ఎలా పలికాడో. ఆ పదాన్ని ఎలా స్ట్రెస్ చేశాడో’ అంటూ చెబుతూ పోతాడు జే.
Comments
Please login to add a commentAdd a comment