Jay
-
ఇజం బ్యూటీని పెళ్లాడిన బిజినెస్ మ్యాన్ గురించి తెలుసా?
-
తండ్రి బిలియనీర్.. భార్య మిస్ ఇండియా.. అతడెవరో తెలుసా?
బిలియనీర్ల పిల్లలు.. దాదాపు వారి కుటుంబ వ్యాపారాలను చూసుకుంటూ వాటిని అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉంటారు. ఈ కోవకు చెందిన వారిలో ముకేశ్ అంబానీ పిల్లలు (ఇషా, అనంత్, ఆకాష్) మాత్రమే కాకుండా.. ఉదయ్ కోటక్ కుమారుడు జై కోటక్ కూడా ఉన్నారు.జై కోటక్ డిజిటల్ బ్యాంకింగ్ విభాగం కోటక్811కి కో-హెడ్‌గా.. సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఉదయ్ కోటక్ స్థాపించిన కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 3,53,000 కోట్లు. కాగా ఉదయ్ కోటక్ నికర విలువ 13.4 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు లక్ష కోట్ల కంటే ఎక్కువ.2015లో ఫెమినా మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న ప్రముఖ నటి 'అదితి ఆర్య'ను జై కోటక్ 2023 నవంబర్ 7న పెళ్లి చేసుకున్నారు. కాగా ఈ ఏడాది నవంబర్ 7న వీరిద్దరూ తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా జై తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు.జై కోటక్.. కొలంబియా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అయితే ఇతడు తన తండ్రి బ్యాంకులో చేరడానికి ముందు, మెకిన్సేలో రెండు సంవత్సరాలు (2012-2014) బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేశారు. తర్వాత, అతను 2010లో గోల్డ్‌మన్ సాచ్స్‌లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు. -
శశిథరూర్లాగా ఇంగ్లీష్ గిట్ల మాట్లాడాలే...
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అరుదైన, పలకడానికి కష్టంగా ఉన్న ఇంగ్లీష్ పదాలు వాడుతుంటాడు అనేది తెలిసిన విషయమే. అతడి ఖరీదైన ఇంగ్లీష్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన జే అనే టీచర్ ‘శశి థరూర్స్ ఇంగ్లీష్ యాక్సెంట్ ఈజ్ బ్యూటీఫుల్’ అనడమే కాదు అతడిలా చక్కని ఇంగ్లీష్ మాట్లాడాలంటే అంటూ కొన్ని టిప్స్ చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో జే పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. శశి థరూర్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న వీడియోలను ప్లే చేస్తూ.... ‘చూడండి ఈ పదాన్ని ఎలా పలికాడో. ఆ పదాన్ని ఎలా స్ట్రెస్ చేశాడో’ అంటూ చెబుతూ పోతాడు జే. -
జై కోటక్‌తో మాజీ మిస్ ఇండియా అదితి ఆర్య వివాహం (ఫొటోలు)
-
ఆ హీరోతో లివింగ్ టుగెదర్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
ప్రస్తుతం వెబ్ సీరీస్ క్వీన్‌గా వెలిగిపోతున్న నటి వాణిభోజన్. టీవీ యాంకర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఈమె ఆ తర్వాత బుల్లితెర నటిగా కొన్ని సీరియళ్లలో నటించింది. దీంతో సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఓ మై కడవులే చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడిని ఆ తర్వాత పలు అవకాశాలు వరించాయి. నటుడు విక్రమ్‌కు జంటగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మహాన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే చిత్రం విడుదలైన తర్వాత ఆమెకు నిరాశే ఎదురైంది. కారణం ఆమె పాత్రను పూర్తిగాఎడిటింగ్ పార్ట్‌కే పరిమితం చేశారు చిత్ర వర్గాలు. అదేవిధంగా వాణి భోజన్ నటించిన సినిమాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో వాణి దృష్టి వెబ్‌సీరీస్‌పై పడింది. అలా తమిళ్ రాకర్స్ ట్రిపిల్స్ ఇరు ధృవం 2, తాజాగా సెంగళం వెబ్ సీరీస్‌లో నటించింది. కాగా వ్యక్తిగతంగా ఈమె ఒక నటుడితో ప్రేమ, లివింగ్ టు గెదర్ వంటి వార్తలు బాగానే ప్రచారంలో ఉన్నాయి. నటుడు జైతో లివింగ్ టుగెదర్‌లో ఉన్నట్టు ప్రచారం హోరెత్తింది. ఈమె కాల్షీట్స్ వ్యవహారం కూడా ఆయనే చూసుకునేవారని, ఇతరులెవరూ ఆమెతో సంప్రదించే అవకాశం కూడా ఉండేది కాదు అనే ప్రచారం జరిగింది. దీని వల్లే వాణిభోజన్కు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అని వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే నటుడు జైతో లివింగ్ టుగెదర్ ప్రచారాన్ని వాణి భోజన్ ఇప్పుడు ఖండిస్తూ ఉంది. దీని గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంటూ తాను, నటుడు జయ్ ట్రిపిల్స్ వెబ్‌సీరీస్‌లో నటించామని, అలాగని ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తారా అంటూ ప్రశ్నించింది. జైతో రిలేషన్ షిప్ అన్నా బాధపడను కానీ లివింగ్ టుగెదర్‌లో ఉన్నాననడమే బాధిస్తుందని పేర్కొంది. తాను కష్టపడి బ్యాంకులోను తీసుకుని ఇల్లు కట్టుకుంటే సొంత ఇంట్లో నివశించకుండా ఎవరో ఒకరి ఇంట్లో అతనితో లీవింగ్ టుగెదర్‌లో ఉంటున్నానని రాయడం చీప్‌గా ఉందని వాణి భోజన్ ఆవేదనను వ్యక్తం చేసింది. -
రియల్ నాగుపాముతో సినిమా
బ్యాంకాక్‌కు చెందిన పామును నీయా–2 చిత్రంలో నటింపజేసినట్లు చిత్ర దర్శకుడు ఎల్.సురేశ్ తెలిపారు. జంబూ సినిమాస్ పతాకంపై ఏ.శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం నీయా–2. నటుడు జై హీరోగా నటించిన ఇందులో రాయ్ లక్ష్మి, వరలక్ష్మీశరత్‌కుమార్, క్యాథిరిన్ ట్రెసా హీరో యిన్లుగా నటించారు. ప్రియదర్శిని, బాలశరవణన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతాన్ని షబ్బీర్, ఛాయాగ్రహణం రాజవేల్ మోహన్ అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కా ర్యక్రమంలో పాల్గొన్న నటి రాయ్‌లక్ష్మి మాట్లాడుతూ తాను రెండేళ్ల తరువాత తమిళంలో నటించిన చిత్రం నీయా–2 అని చెప్పింది. దర్శకుడు సురేశ్ కథ చెప్పినప్పుడు మూడు గంటల సేపు విన్న తరువాత ఇది భారీ చిత్రం లాగుందనిపించిందన్నారు. దీంతో కాస్త ఎక్కువగానే ఆలోచించి చివరికి నటించాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పిం ది. ఇది పాము ఇతివృత్తంతో కూడిన చిత్రం అని తెలిపింది. ఇంతకు ముందు దెయ్యం ఇతివృత్తంతో కూడిన హర్రర్ కథా చిత్రాల అవకాశాలు చాలా వచ్చినా అంగీకరించలేదని, థ్రిల్లర్‌తో కూడిన ప్రేమ, పాము కథాంశంతో కూడిన నీయా–2లో తానూ ఒక భాగం కావడం సంతోషంగా ఉందని అంది. అ నంతరం చిత్ర దర్శకుడు ఎల్.సురేశ్ మాట్లాడుతూ దర్శకుడు బాలుమహేంద్ర వద్ద తానూ, వెట్రిమారన్ సహాయ దర్శకులుగా పని చేశామని తెలిపారు. తాను తెలుగులో దర్శకత్వం వహించిన చిత్రం తమిళంలో ఎత్తన్ పేరుతో రీమేక్ అయ్యిందని తెలిపారు. ఈ చిత్ర నిర్మాత పాము ఇతివృత్తంతో చిత్రం చేద్దాం అని అన్నప్పుడు పాముతో ఎలాంటి కథ చేయాలని ఆలోచిస్తుండగా టీవీలో నందిని సీరియల్ చూశానన్నారు. అది మంచి ప్రేక్షకాదరణను పొందడంతో ఈ నీయా–2 కథను రెడీ చేశానని చెప్పారు. అయితే ఇందులో రాజనాగం (పాము)ను నటింపజేయాలని భావించామన్నారు. అందుకోసం ఆ పాము గురించి తెలుసుకోవడానికి బ్యాంకాక్ వెళ్లినట్లు చెప్పారు. అక్కడ ఒక ఇంట్లో రాజనాగంను పెంచుతుండడం చూశానన్నారు. అలా ఈ చిత్రంలో నిజ నాగపామునే నటింపజేశామని చెప్పారు. తమ చిత్రానికి విలన్ వర్షమేనని అన్నారు. దీంతో చాలా శ్రమించి చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. ఇందులో నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌కు చాలా కఠినమైన పాత్రను ఇచ్చామని, ఆమె అద్భుతంగా నటించారని అన్నారు. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. నీయా–2 భారీ చిత్రంగా అమరడానికి నటుడు జై, వరలక్ష్మీశరత్‌కుమార్, రాయ్‌లక్ష్మి, క్యాథరిన్‌ట్రెసా వంటి నటీనటులను నిర్మాత అందించడమేనని అన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు వెట్రిమారన్ అతిథిగా పాల్గొన్నారు. -
అవును వాళ్లు ప్రేమించుకుంటున్నారు!
అనూహ్యంగా కొన్ని సంఘటనలు, సందర్భాలు వాస్తవాలను బహిరంగపరుస్తాయనడానికి తాజా ఉదాహరణ నటుడు జయ్, నటి అంజలిల ప్రేమ వ్యవహారమే. వీరిద్దరి ప్రేమ గురించి చాలా కాలంగా మీడియాలో కథలు కథలుగా ప్రచారం జరిగింది.అయినా తామిద్దరి మధ్య ఉన్నది మంచి స్నేహమేనని ఈ జంట తప్పించుకుంటూ వచ్చారు. తాజాగా నట దంపతులు సూర్య, జ్యోతిక కారణంగా జయ్,అంజలిల ప్రేమ గుట్టు బయట పడింది. జ్యోతిక నటించిన తాజా చిత్రం మగళీర్ మట్టుం చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. దీంతో ఆ చిత్ర నిర్మాత సూర్య ప్రమోషన్ కు శ్రీకారం చుట్టూరు. అందులో భాగంగా దోసెల పోటీని పెట్టారు.ముందుగా తన భార్య జ్యోతికకు దోసెలు వేయడం నేర్పించి, తను చుట్టిన దోసెలను ఆమెకు తినిపించిన ఫొటోలను వెబ్సైట్లో పోస్ట్ చేశారు. అదే విధంగా మీరు మీ భార్యలకు దోసెలు వేసి తినిపించి పోటీలో పాల్గొనాలంటూ పిలుపు నిచ్చారు. దర్శకుడు వెంకట్‌ప్రభు నటుడు జయ్‌కు ధైర్యం ఉంటే మీ లవర్ అంజలికి దోసెలు వేయడం నేర్పించి సూర్య దోసెల పోటీల్లో పాల్గొనాలని ఛాలెంజ్ విసిరారు. దాన్ని స్వీకరించిన జయ్ దోసెలు వేసి నటి అంజలికి తినిపించారు. ఈ ఫొటోలను తన వెబ్సైట్లో పోస్ట్ చేశారు కూడా. దీంతో జయ్,అంజలిల మధ్య ప్రేమ ఎంత ఘూటుగా సాగుతుందో అర్థం అవడంలా?జయ్ దోసెలు వేసి అంజిలికి అందిస్తున్న ఫొటో దృశ్యాలిప్పుడు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
తాప్సీకి కోపమొచ్చింది
ఎప్పుడు నవ్వుతూ జాలీగా ఉండే నటి తాప్సీ. అలాంటి ఈ బ్యూటీ ఇటీవల చాలా ఆవేశానికి గురయ్యారు. కారణం ఏమిటంటారనేగా మీ ప్రశ్న. నిజం చెప్పాలంటే విజయం అనే దప్పికతో చాలాకాలంగా కొట్టుమిట్టాడుతున్న నటి తాప్సీ. ఈ బహుభాషా నటికి చాలా కాలం తరువాత కాంచన-2 చిత్రం తన విజయ దాహార్తిని తీర్చింది. దీంతో పుల్‌జోష్‌లో కొచ్చేశారు. అంతేకాదు తమిళంలో ఒకటి రెండు చిత్రాల్లో నటించే అవకాశాల్ని రాబట్టుకున్నారు. ప్రస్తుతం జయ్ సరసన కొత్త చిత్రంలో నటిస్తూ బిజీగా వున్న తాప్సీ ఇటీవల సినీ కార్యక్రమాల్లో చాలా ఉషారుగా పాల్గొంటున్నారు. అలాంటి సమయంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్న ఆమెను ఆగ్రహానికి గురి చేసింది. అది ఏమై ఉంటుందనేగా మీ ఆసక్తి. ఆ మధ్య జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో ఫుట్‌బాల్ క్రీడలో వెండి పతకాన్ని గెలుచుకున్న మ్యాథ్యూస్పో తో మీ ప్రేమాయణం ఎంత వరకు వచ్చిందన్న ప్రశ్నకు తాప్సీకి ఎక్కడలేని కోపం వచ్చేసిందట. దీంతో తన ప్రేమ గురించి చెప్పుకోవలసిన వారెవరైనా ఉంటే అది తన తల్లిదండ్రులేనన్నారు. వే రెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారట. కొన్ని నిజాలు ఇలా నిప్పులనే రగిలిస్తాయని పెద్దలంటుంటారు. అది ఇదేనేమో. -
త్రిషకు బదులు తాప్సీ
కోలీవుడ్‌లో నటి తాప్సికో అవకాశం వచ్చింది. దక్షిణాదిలో అవకాశాలు లే ఎండమావులవుతున్న తరుణంలో ఇది ఆమెకు మండుటెండల్లో పన్నీటి జల్లు లాంటిదే. ఇంతకీ ఆ అవకాశం ఏంటో చెప్పలేదు కదూ.. నటి త్రిష నటించడానికి అంగీకరించి ఆ తరువాత కాల్షీట్స్ సమస్య కారణంగా వైదొలగిన చిత్రంలో నటించే అవకాశం తాప్సీని వరించింది. ఈ చిత్రాన్ని త్రిషకు కాబోయే భర్త నిర్మించడం విశేషం. జయ్ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి సమర్, నాన్ శిగప్పు మనిదన్ చిత్రాల ఫేమ్ తిరు దర్శకత్వం వహించనున్నారు. త్రిష చేయాల్సిన పాత్రను తాప్సీ పోషించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్రం గురించి తిరు మాట్లాడుతూ తాప్సీ ఈ చిత్రంలో కుంభకోణానికి చెందిన యువతిగా నటించనున్నారని చెప్పారు. జయ్ మోడ్రన్ యువకుడిగా కనిపించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో కుంభకోణంలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇందులో తాప్సీ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని దర్శకుడు తిరు అన్నారు. కాంచన-2 చిత్రం విడుదలానంతరం తన టైమ్ బాగుంటుందని ఆ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తున్న తాప్సీకి ఇది అనుకోని అతిథిగా వచ్చిన అవకాశమే. దీంతో మంచి ఖుషీలో వున్న తాప్సీ కాంచన -2 తో పాటు తాజాగా నటించనున్న చిత్రం కోలీవుడ్‌లో తన నట జీవితాన్ని మంచి మలుపు తిప్పుతాయనే ఆశాభావంతో ఉన్నారు. -
ఆ చిత్రంలో త్రిష లేదు
నటి త్రిష వరుణ్‌మణియన్ త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్న జంట అన్న విషయం తెలిసిందే. వీరి వివాహా నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి అయ్యే వరకే కాదు ఆ తరువాత కూడా నటనకు దూరం కాను అని నిక్కచ్చిగా చెప్పిన త్రిష అన్నట్టుగానే తమిళం, తెలుగు భాషలలో నటిస్తూ బిజీగా వున్నారు. త్రిషకు కాబోయే భర్త వ్యాపారవేత్త, నిర్మాత అన్న విషయం తెలిసిందే. ఇంతకుముందు వాయై మూడి పేసవుం మొదలగు కొన్ని చిత్రాలు నిర్మించారు. తాజాగా యువ నటుడు జయ్ హీరోగా నాన్ శివప్పు మనిదన్ చిత్రం ఫేమ్ తిరు దర్శకత్వంలో చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో జయ్ సరసన త్రిష నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా చిత్రంలో త్రిష నటించడం లేదట. కారణం ఇతర చిత్రాలతో ఆమె బిజీగా ఉండటమేనని త్రిష పేర్కొన్నారు.ఈ బ్యూటీ ప్రస్తుతం జయం రవి సరసన అప్పాటక్కర్, బోగి చిత్రాలతో పాటు తన మేనేజర్ గిరిధర్ నిర్మించనున్న ద్విభాషా చిత్రం నటించడానికి సమ్మతించారు. అదే విధంగా బాలకృష్ణ సరసన లయన్ అనే తెలుగు చిత్రంలోను నటిస్తున్నారు. దీంతో కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో తన కాబోయే భర్త చిత్రం నుంచి వైదొలగినట్లు త్రిష వివరణ ఇచ్చారు. అయితే త్రిష వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారా? లేక మరేమైనా కారణం ఉందా? అని ఆరా తీసేపనిలో పడింది కోలీవుడ్. -
జయ్‌తో జోడీకి సై
యువ నటుడు జయ్‌తో స్టార్ హీరోయిన్లు జతకట్టడానికి సై అంటున్నారు. ఆ మధ్య రాజారాణి చిత్రంలో నయనతార జయ్‌తో రొమాన్స్ చేశారు. తాజాగా త్రిష రెడీ అవుతున్నట్లు సమాచారం. వడకర్రి హిట్‌తో మంచి జోరులో ఉన్న జయ్ నటించిన తిరుమణం ఎన్నుం నిఖా ఈ నెల 24న తెరపైకి రానుంది. ఇందులో నజ్రియా హీరోయిన్. జయ్ తాజా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకు ముందు వాయయైమూడి పేసవుం, వడకర్రి చిత్రాల నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకున్న వరుణ్ మణియన్ రాడియన్స్ మీడియా సంస్థ, సుశాంత్ ప్రసాద్, గోవిందరాజ్ ఫిలిం డిపార్ట్మెంట్ సంస్థతో కలిసి నిర్మించనున్న చిత్రంలో జయ్ హీరోగా నటించనున్నారు. ఉదయం ఎన్‌హెచ్ 4 కంటే సక్సెస్ఫుల్ చిత్రం ద్వారా పరిచయమైన మణిమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో నటి త్రిష హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై చిత్ర దర్శక నిర్మాతలు ఈ బ్యూటీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అన్ని వర్గాలను అలరించేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలంటున్నారు. వేల్రాజ్ ఛాయాగ్రహణం అందించనున్నారు. -
జయ్‌తో ఆండ్రియా రొమాన్స్
తెరవెనుక సంగీత దర్శకుడు అనిరుధ్‌తో రొమాన్స్ చేసిన ఆండ్రియా తాజాగా తెరపై యువ నటుడు జయ్‌తో ఫుల్‌గా రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. జయ్ నటించిన తిరుమణం ఎన్నుం నిఖా చిత్రం త్వరలో తెరపైకి రానుంది. జయ్ తదుపరి చిత్రానికి రెడీ అయిపోయారు. ఈయన నటిస్తున్న చిత్రానికి వలియవన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో జయ్ సరసన నటి ఆండ్రియా హీరోయిన్గా జతకట్టడం విశేషం. వీరి కాంబినేషన్లో రూపొం దుతున్న ఈ చిత్రానికి ఎంగేయుం ఎప్పోదుం చిత్రం ఫేమ్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, వలియవన్ తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. ఇం దులో యాక్షన్ కంటే రొమాన్సే అధికంగా ఉంటుందన్నారు. జయ్‌తో ఇంతకు ముందే ఎంగేయుం ఎప్పోదుం చిత్రంలో కలిసి పని చేశానని, అయితే ఆండ్రియా ఈ చిత్ర కథకు అవసరం అయ్యాయని వివరించారు. ఈ పాత్రకు ఆమె మినహా మరొక నటి గురించి ఆలోచన లేదన్నారు. ఈ చిత్రాన్ని ఎస్.కె.స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్నట్లు దర్శకుడు శరవణన్ తెలిపారు. ఆండ్రియా ఇప్పటికే జాతీయ అవార్డు గ్రహీత రామ్ దర్శకత్వంలో తరమణి చిత్రం లోను, కమల్ హాసన్ సరసన ఉత్తమ విలన్ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. -
15న తిరుమణం ఎన్నుం నిఖా
తిరుమణం ఎన్నుం నిఖా చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. యువజంట జయ్, నజ్రియా నజీమ్ నటించిన చిత్రం తిరుమణం ఎన్నుం నిఖా చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్ రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. దీని ద్వారా నాజర్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన అనిస్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. చిత్ర దర్శకుడు అనిస్ మాట్లాడుతూ తిరుమణం ఎన్నుం నిఖా రొమాంటిక్ లవ్, కామెడీ ఎంటర్టైనర్ కథా చిత్రమన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే జయ్, నజ్రియా మధ్య ప్రేమ ఎలా మొదలైంది, ఆ ప్రేమ పెళ్లికి దారి తీసిందా? లేదా? అన్నదే చిత్ర ఇతివృత్తమని తెలిపారు. చిత్రం ఆస్కార్ ఫిలింస్ స్థాయికి తగ్గట్టుగా ఉంటుందని తెలిపారు. రంజాన్ వేడుకలను చెన్నై నగరంలో ఒకరకంగాను, ఉత్తర చెన్నై రాయపురంలో మరో విధంగాను నిర్వహిస్తారన్నారు. ఈ రెండు ప్రాంతాల రంజాన్ నిజ వేడుకలను తిరుమణం ఎన్నుం నిఖా చిత్రం కోసం చిత్రీకరించామని తెలిపారు. చిత్ర ఆలస్యానికి ఇదే కారణంగా పేర్కొన్నారు. అదే విధంగా మోహరం వేడుకలను యథాతథంగా చిత్రీకరించామని చెప్పారు. చిత్రంలో పలువురు నూతన తారలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి నటింప చేశామని వెల్లడించారు. కరెక్టుగా చెప్పాలంటే ఈ చిత్రాన్ని లేటెస్ట్ కాదల్‌కోట్టై గా చెప్పవచ్చునని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తెలిపారు. సంగీత దర్శకుడు జిబ్రాన్ అందించిన సంగీత బాణీలు చిత్రానికి హైలెట్‌గా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.