

ఇజం బ్యూటీ 'అదితి ఆర్య'ను ఉదయ్ కోటక్ కుమారుడు 'జై కోటక్' వివాహం చేసుకున్నారు.

జై కోటక్ కొలంబియా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

మెకిన్సేలో రెండు సంవత్సరాలు (2012-2014) బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేశారు.

2010లో గోల్డ్‌మన్ సాచ్స్‌లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు.

జై కోటక్ డిజిటల్ బ్యాంకింగ్ విభాగం కోటక్811కి కో-హెడ్‌గా.. సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు

2015లో ఫెమినా మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న ప్రముఖ నటి 'అదితి ఆర్య'ను జై కోటక్ 2023 నవంబర్ 7న పెళ్లి చేసుకున్నారు.

ఈ ఏడాది నవంబర్ 7న వీరిద్దరూ తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.
