Aditi Arya
-
జై కోటక్‌తో మాజీ మిస్ ఇండియా అదితి ఆర్య వివాహం (ఫొటోలు)
-
వాళ్లు చెప్పిందొకటి.. చేసిందొకటి
‘‘తెలుగు అమ్మాయి కావాలి అని దర్శకులు అనుకున్నారు కాబట్టే ‘దర్శకుడు, రంగస్థలం, కల్కి’ సినిమాల్లో నాకు అవకాశాలు వచ్చాయి’’ అన్నారు పూజిత పొన్నాడ. కెమెరామెన్ నిజార్ షఫీ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘7’. హవీష్ హీరోగా, రెజీనా, నందితాశ్వేత, త్రిధాచౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. రమేష్ వర్మ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ నెల 5న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా పూజిత పొన్నాడ చెప్పిన విశేషాలు... ► నా తొలి ప్రాధాన్యం ప్రేమకథకే. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘7’ చిత్రంలో నాది సస్పెన్స్ రోల్. అందుకే నా పాత్ర గురించి ఎక్కువగా రివీల్ చేయకూడదు. సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ ఎవరి కథ వారిదే. క్లైమాక్స్‌లో మెర్జ్ అవుతాయి. ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్ లేని హీరోయిన్ని నేనే అనుకుంటాను. హావీష్ మంచి కో స్టార్. ‘రాజుగాడు’ సినిమాలో చేసినప్పుడే షఫీగారితో పరిచయం.ఆయన దర్శకత్వంలో నటించడం హ్యాపీ. ► ఎలాంటి టీమ్‌తో వర్క్ చేయకూడదో ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ సినిమా ప్రయాణం నేర్పించింది. ఈ సినిమా చేసినందుకు రిగ్రేట్ ఫీల్ అవుతున్నాను. స్క్రిప్ట్ నుంచి ప్రమోషన్, రిలీజ్ దాకా వారు చెప్పింది ఒకటి.. చేసింది మరొకటి. ఏదీ నేను అనుకున్నట్లు జరగలేదు. ఈ సినిమాకు ముందు స్క్రిప్ట్‌ని బట్టి మాత్రమే సినిమా చేసేదాన్ని. ఇప్పుడు మూవీ టీమ్‌ని కూడా పరిశీలించుకుంటున్నాను. ► ప్రస్తుతం ‘కల్కి’ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. తెలుగులో కీర్తీ సురేశ్ లీడ్ రోల్ చేయనున్న చిత్రంలో నటించనున్నా. అదేవిధంగా మరో తమిళ సినిమాకి కూడా సైన్ చేశాను. -
ముద్దు సీన్లు ఉన్నాయని ముందు తెలియదు
‘‘సాధారణంగా నాకు థ్రిల్లర్స్ పెద్దగా ఆసక్తి లేదు. ఆ సబ్జక్టే కొంచెం డ్రైగా అనిపిస్తుంది. కానీ ఈ థ్రిల్లర్ ఒప్పుకోవడానికి కారణం కథ. ప్లస్ 6 హీరోయిన్లు ఉన్న తర్వాత ఇక డ్రైగా ఎందుకు ఉంటుంది? ఇలాంటి కథ ఎక్కడా రాలేదు’’ అన్నారు హవీష్. కెమెరామేన్ నిజార్ షఫీ దర్శకుడిగా మారి హవీష్ హీరోగా రెజీనా, నందితా శ్వేత, త్రిధా చౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘7’. రమేశ్ వర్మ కథను అందించి, నిర్మించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఈ నెల 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా హవీష్ పలు విషయాలు పంచుకున్నారు. ► సినిమాలో రెహమాన్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన దృష్టిలో హీరోయిన్లు, నేను (6+1) 7 పాత్రలం. అందుకే ఆ టైటిల్ పెట్టాం. మొదట సినిమా అనుకున్నప్పటి నుంచి మరో నాలుగు రోజుల్లో సెట్స్ మీదకు వెళ్తాం అనేవరకూ కూడా తెలుగులో మాత్రమే తీయాలనునుకున్నాం. చివర్లో మరో నిర్మాత కూడా తోడవ్వడంతో తెలుగు, తమిళంలో నిర్మించాం. దర్శకుడు షఫీ పుట్టింది తమిళనాడులో అయినా తెలుగు సినిమాలు ఎక్కువ చేశారు. రెండు ప్రాంతాల వాళ్లకు అనుగుణంగా ఈ సినిమా తెరకెక్కించారు. నాకు ఒక్క ముక్క తమిళం రాదు. డైలాగ్స్ నేర్చుకోవడానికి గంటల గంటలు పట్టేది. ► కథలో బలం ఉండబట్టే ఆరుగురు హీరోయిన్లు నటించడానికి ఒప్పుకున్నారు. ఒకరితో ఫ్రెండ్ అవుతున్నాను అనుకునే లోపు ఆమె పార్ట్ షూటింగ్ పూర్తయి మరో హీరోయిన్ జాయిన్ అయ్యేవారు. ఇంత మంది హీరోయిన్లు ఉన్నప్పుడు చిన్న చిన్న ఫైట్స్ కామన్. ఇద్దరు హీరోయిన్స్ సెట్లో ఉన్నప్పుడు అక్కడి వాతావరణంలో తేడా నాకు అర్థం అయ్యేది. ► ఏ పని చేసినా నం.1గా ఉండాలనుకునే మనస్తత్వం నాది. అలానే కష్టపడతాను. మన పని మనం చేసుకుంటూ వెళ్తే సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆ మధ్య ఓ పెద్ద ప్రాజెక్ట్‌లో హీరోగా అవకాశం వచ్చింది. చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. దాంతో నా గత చిత్రానికి, దీనికి ఇంత గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ఓ మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. అభిషేక్ పిక్చర్స్ వాళ్లకు చేస్తున్నది ఫ్యామిలీ డ్రామా. అందులో మంచి లవ్‌స్టోరీ ఉంటుంది. ► మా ప్రొడక్షన్లో ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘రాక్షసుడు’ సినిమా చేస్తున్నాం. జూలై 18న రిలీజ్ అనుకుంటున్నాం. నా బ్యానర్లో నేను నటించకపోయినా ఫర్వాలేదు. ఆల్రెడీ బ్యానర్లో నిర్మాతగా నా పేరున్నట్టే. ప్రతి సినిమాలో నేనుండవసరం లేదు కదా. ► ‘7’లో కొన్ని లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నాయి. కథ చెప్పినప్పుడు ముద్దు సీన్లు ఉన్నాయని నాతో చెప్పలేదు. సెట్లోకి వెళ్లి హీరోయిన్ను ముద్దుపెట్టమంటే భయపడ్డాను. ‘ఒకవేళ తను కొడితే ఏంటి?’ అనుకున్నాను. మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత ధైర్యంగా చేసేశాను. ఏ రంగంలో అయినా మార్పు మంచిదే. అందరికీ చాన్స్ ఇవ్వాలనే పద్ధతిని నమ్ముతాను. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబుగారిని చూశాం. ఇప్పుడు జగన్‌గారికి అవకాశం ఇచ్చారు. ఆప్షన్ ఉండాలి. ఈయన సరిగ్గా పరిపాలించకపోతే ఆయన. ఆయన చేయకపోతే ఈయన.. అలా ఉండాలి. జగన్‌గారు రావడం ఖచ్చితంగా మంచిదే. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదని ఎందుకు అనుకోవాలి. జగన్‌గారు యంగ్‌స్టర్, ప్రపంచాన్ని చూశాడు. ఆయన బాగా పాలించగలరని అనుకుంటున్నాను. -
ఆరుగురు అమ్మాయిలు.. ఓ అబ్బాయి
అతడి పేరు కార్తీక్. ఆరుగురు అమ్మాయిలు అతనితో ‘ఐ థింక్... ఐయామ్ ఇన్ లవ్ విత్ యు కార్తీక్’ అన్నారు. దీంతో ఆరుసార్లు నవ్విన కార్తీక్ ఆరుగురికీ ముద్దులు పెట్టి, ముగ్గులోకి దింపాడు. ఇంతకీ అతడి కథేంటి? అన్నది జూన్ 5న తెలుస్తుంది. హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. కిరణ్ స్టూడియోస్‌పై రమేష్ వర్మ ప్రొడక్షన్లో రమేష్ వర్మ నిర్మించారు. ఈ సినిమా వరల్డ్‌వైడ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాని జూన్ 5న విడుదల చేస్తోంది. సంస్థ అధినేత అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘సెవెన్’ ఫస్ట్ కాపీ చూశా. మైండ్ బ్లోయింగ్. థ్రిల్లర్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది. ట్విస్ట్ వెనక ట్విస్ట్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయి. రమేష్ వర్మగారు ఫెంటాస్టిక్ స్టోరీ, స్క్రీన్ ప్లే రాశారు. ఈ సినిమాలో కొత్త హవీష్‌ను చూస్తారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, సహ నిర్మాత: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ, కెమెరా–దర్శకత్వం నిజార్ షఫీ. -
ఆరు ప్రేమకథలు
‘‘ఆరుగురు అమ్మాయిలు.. ఆరు ప్రేమకథలు.. విచిత్రంగా ఆరు ప్రేమకథల్లోనూ అబ్బాయి ఒక్కడే. ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న ఆ అబ్బాయి మంచోడా? చెడ్డోడా?’’ తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటోంది ‘సెవెన్’ చిత్రబృందం. హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వం వహించిన చిత్రం ‘సెవెన్’. రెజీనా, అనీషా ఆంబ్రోస్, త్రిదా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రమేష్ వర్మ కథ అందించడంతో పాటు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘సెవెన్’ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదో రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ఊహించని మలుపులు ఉంటాయి’’ అన్నారు రమేష్ వర్మ. ఈ సినిమాకు కెమెరా: నిజార్ షపి, సంగీతం: చైతన్య భరద్వాజ్. -
ధృవ, అదితి ఆర్యల 'ఎప్పటికీ ప్రేమ'
ధృవ, అదితి ఆర్య( ఇజం ఫేమ్) కాంబినేషన్లో రూపొందిన ఇండిపెండెంట్ ఆల్బమ్ సాంగ్ `ఎప్పటికీ ప్రేమ` ఏప్రిల్ 14న విడుదల కానుంది. 300కు కైగా థియేటర్ షోస్ చేసి అంతర్జాతీయంగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ధృవ, ఈ ఇండిపెండెంట్ ఆల్బమ్ తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రొమాంటిక్ సాంగ్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ స్వరూప్ రాజ్ మేడర డైరెక్ట్ చేశారు. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్ టీజర్‌కు మంచి రెస్పాన్స వచ్చింది. శైలేష్ సువర్ణ సంగీతం అందించగా.. గ్రాండ్ విజువల్స్, హై క్వాలిటీ చాలా రిచ్‌గా పిక్చరైజ్ చేశారు.. మంచి లుక్, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న ధృవకు ఈ సాంగ్, టాలీవుడ్లో మంచి ఎంట్రీ అవుతుందని భావిస్తున్నారు. ఈ నెల 14 ఎప్పటికీ ప్రేమ సాంగ్‌ను లహరి మ్యూజిక్‌వారు విడుదల చేస్తున్నారు. -
న్యూ లుక్‌లో పటాస్ హీరో
యంగ్ హీరో కళ్యాణ్ రామ్ తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు. పటాస్ హిట్‌తో ఫాంలోకి వచ్చిన నందమూరి హీరో ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. మే 26 నుంచి నానక్ రామ్ గూడ స్టూడియోలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు రీమిక్స్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్‌గా నటిస్తున్న ఈ సినిమాతో 2015 మిస్ ఇండియా వరల్డ్ అదితి ఆర్య హీరోయిన్గా పరిచయం అవుతోంది. పూరి మార్క్ హీరోయిజంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. గతంలో ఎన్నడూ కనిపించనంత ట్రెండీగా కనిపిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పటి వరకు రివీల్ చేయని కళ్యాణ్ రామ్ లుక్‌ను మంగళవారం ట్విట్టర్ లో రిలీజ్ చేశాడు పూరి.