ఆరుగురు అమ్మాయిలు.. ఓ అబ్బాయి | Abhishek Pictures Gets Worldwide Rights Of Seven | Sakshi
Sakshi News home page

ఆరుగురు అమ్మాయిలు.. ఓ అబ్బాయి

May 19 2019 4:07 AM | Updated on May 19 2019 4:07 AM

Abhishek Pictures Gets Worldwide Rights Of Seven - Sakshi

హవీష్, పూజితా పొన్నాడ

అతడి పేరు కార్తీక్‌. ఆరుగురు అమ్మాయిలు అతనితో ‘ఐ థింక్‌... ఐయామ్‌ ఇన్‌ లవ్‌ విత్‌ యు కార్తీక్‌’ అన్నారు. దీంతో ఆరుసార్లు నవ్విన కార్తీక్‌ ఆరుగురికీ ముద్దులు పెట్టి, ముగ్గులోకి దింపాడు. ఇంతకీ అతడి కథేంటి? అన్నది జూన్‌ 5న తెలుస్తుంది. హవీష్‌ హీరోగా నిజార్‌ షఫీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సెవెన్‌’. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. కిరణ్‌ స్టూడియోస్‌పై రమేష్‌ వర్మ ప్రొడక్షన్‌లో రమేష్‌ వర్మ నిర్మించారు.

ఈ సినిమా వరల్డ్‌వైడ్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్న అభిషేక్‌ పిక్చర్స్‌ ఈ సినిమాని జూన్‌ 5న విడుదల చేస్తోంది. సంస్థ అధినేత అభిషేక్‌ నామా మాట్లాడుతూ– ‘‘సెవెన్‌’ ఫస్ట్‌ కాపీ చూశా. మైండ్‌ బ్లోయింగ్‌. థ్రిల్లర్‌ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్‌ సృష్టిస్తుంది. ట్విస్ట్‌ వెనక  ట్విస్ట్‌ ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తాయి. రమేష్‌ వర్మగారు ఫెంటాస్టిక్‌ స్టోరీ, స్క్రీన్‌ ప్లే రాశారు. ఈ సినిమాలో  కొత్త హవీష్‌ను చూస్తారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్‌ భరద్వాజ్, సహ నిర్మాత: కిరణ్‌ కె. తలశిల (న్యూయార్క్‌), ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రామకృష్ణ, కెమెరా–దర్శకత్వం నిజార్‌ షఫీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement