Nanditha Swetha
-
OMG Review: ‘ఓ మంచి ఘోస్ట్’ మూవీ రివ్యూ
టైటిల్: OMG (ఓ మంచి ఘోస్ట్)నటీనటులు: వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవీన్ నేని, రఘు బాబు, నాగినీడు, బాహుబలి ప్రభాకర్, షేకింగ్ శేషు, తదితరులు.నిర్మాత: డా.అబినికా ఇనాబతునిదర్శకుడు: శంకర్ మార్తాండ్సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూఎడిటర్: ఎం.ఆర్.వర్మవిడుదల తేది: జూన్ 21, 2024కథేంటంటే.. చైతన్య (రజత్), రజియా (నవమి గాయక్), లక్ష్మణ్ (నవీన్), పావురం (షకలక శంకర్).. ఈ నలుగురికి డబ్బు సమస్య ఉంటుంది. మనీ కోసం తన తన మేన మరదలు, స్థానిక ఎమ్మెల్యే సదాశివరావు(నాగినీడు) కూతురు కీర్తి (నందిత శ్వేత)ను కిడ్నాప్ చేయాలని చైతన్య ప్లాన్ వేస్తాడు. అనుకున్నట్లే ఈ నలుగురు కలిసి కీర్తిని కిడ్నాప్ చేసి ఊరి చివర ఉన్న బంగ్లాలోకి తీసుకెళ్తారు. ఈ బంగ్లాలో ఓ దెయ్యం ఉంటుంది. కిడ్నాప్ చేసేవాళ్లు అంటే దానికి అస్సలు పడదు. అలాగే కిర్తీకి కూడా ఓ సమస్య ఉంటుంది? అటు దెయ్యం, ఇటు కీర్తికి ఉన్న సమస్య కారణంగా ఈ నలుగురికి ఎదురైన సమస్యలు ఏంటి? బంగ్లాలో ఉన్న దెయ్యం కిడ్నాప్ చేసినవాళ్లను మాత్రమే ఎందుకు చంపుతుంది? చైతన్యకు తన మేనమామ, ఎమ్మెల్యే సదాశివరావుపై ఎందుకు కోపం? కీర్తికి ఉన్న సమస్య ఏంటి? చివరకు ఆ బంగ్లా నుంచి నలుగురు బతికి బయటపడ్డారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. హారర్ కామెడీ జానర్లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఓ మంచి ఘోస్ట్ కూడా ఆ జానర్లో తెరకెక్కిన చిత్రమే. ఒకవైపు ప్రేక్షకులను నవ్విస్తూనే.. భయపెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే కథ విషయంలో మాత్రం కొత్తదనం లేదు. దెయ్యం, కిడ్నాప్ డ్రామా..ప్రతీది పాత సినిమాలను గుర్తు చేస్తుంది. అనుభవం ఉన్న నటీనటులు కావడంతో.. రొటీన్ సన్నివేశాలే అయినా తమదైన నటనతో బోర్ కొట్టకుండా చేశారు. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. కిడ్నాప్ డ్రామ అంతగా ఆకట్టుకోదు. నలుగురి గ్యాంగ్ బంగ్లాలోకి వెళ్లిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఆత్మ పాత్రలో వెన్నెల కిశోర్ ఎంట్రీ.. అతన్ని దెయ్యం అనుకొని ఆ నలుగు భయపడే సన్నివేశాలు.. ఎవరు దెయ్యం అనే విషయాన్ని కనిపెట్టే ప్రయత్నాలు.. ఈ క్రమంలో శకలక శంకర్ చేసే పనులు అన్నీ థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో దెయ్యాలు చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. ఇక దెయ్యాల ప్లాష్‌బ్యాక్ స్టోరీ రొటీన్‌గా అనిపిస్తుంది. సీక్వెల్ ఉంటుందని తెలియజేసేలా క్లైమాక్స్ ఉంటుంది. మొత్తంగా ఓ మంచి దెయ్యం కొన్ని చోట్ల నవ్విస్తూనే.. మరికొన్ని చోట్ల భయపెడుతుంది. హారర్ కామెడీ చిత్రాలను ఇష్ట పడేవారికి ఈ మూవీ నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే.. వెన్నెల కిషోర్, షకలక శంకర్ థియేటర్లో ప్రేక్షకుల్ని పగలబడేలా నవ్విస్తుంటారు. వీరిద్దరికీ ఇలాంటి పాత్రలేమీ కొత్త కాదు. మరోసారి ఈ చిత్రంతో ఆడియెన్స్‌ను విరగబడేలా నవ్విస్తారు. నందిత ఆల్రెడీ ఘోస్ట్‌గా ఇది వరకు భయపెట్టేసింది. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో అదరగొట్టేసింది. నవమి గాయక్ గ్లామరస్‌గా అనిపిస్తుంది. రఘుబాబు కనిపించినంత సేపు నవ్విస్తాడు. రజత్ చక్కగా నటించాడు. నవీన్ నేని మధ్య మధ్యలో నవ్విస్తాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. -
ఓటీటీకి సరికొత్త మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వైభవ్, నందితాశ్వేత జంటగా నటించిన చిత్రం రణం. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో రణం అరమ్ థవరేల్ పేరుతో ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆద్యంతం ట్విస్టులతో ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాదు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.15 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఓ సిరియల్ కిల్లర్ చేసిన హత్యలను చేధించే కథాంశంతో ఈ సినిమాను దర్శకుడు షరీఫ్ తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్కు రాబోతోంది. ఈ నెల 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఓవర్సీస్ ఆడియన్స్ కోసం టెంట్కోట్టాలోనూ స్ట్రీమింగ్కు రానుంది. దాదాపు థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ చిత్రంలో ఓ స్కెచ్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. ఈ సినిమాలో నందితా శ్వేత నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మరో హీరోయిన్ తాన్యా హోప్ ఇన్స్పెక్టర్ పాత్రలో కనిపించింది. వీళ్లంతా కలిసి సీరియల్ కిల్లర్‌ను పట్టుకున్నారా? లేదా అన్నదే కథ. థియేటర్లలో చూడలేనివారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. Vaibhav’s #Ranam will be streaming from Apr 19 on AMAZON PRIME. pic.twitter.com/cHXxx2331L — Christopher Kanagaraj (@Chrissuccess) April 17, 2024 -
9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
మరో డిఫరెంట్ తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కేవలం ఒకే ఒక పాత్రతో తీసిన ఈ చిత్రం గతేడాది థియేటర్లలో రిలీజ్ అయింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇన్నాళ్లకు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. అయితే సమ్‌థింగ్ స్పెషల్ ఉండే మూవీస్ చూద్దామనుకునేవాళ్లు ఇది ట్రై చేయొచ్చు.ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: కుర్చీ తాత అరెస్ట్.. అసలు నిజాలు బయటపెట్టిన యూట్యూబర్) హీరోయిన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నందిత శ్వేతా.. తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. ఈమెని ప్రధాన పాత్రలో పెట్టి తీసిన విభిన్న సినిమా 'రా రా పెనిమిటి'. సత్య వెంకట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ.. మ్యూజిక్ అందించారు. గతేడాది ఏప్రిల్ 28న థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత 'హంగామా ప్లే', 'గ్యాలక్సీ ఓటీటీ' అనే రెండు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లోకి ఈ సినిమా వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లోనూ ఉన్నప్పటికీ.. మనం దేశంలో మాత్రం స్ట్రీమింగ్ అందుబాటులో లేదు. కథ విషయానికొస్తే టైటిల్‌కి తగ్గట్లు.. ఓ భార్య తన భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మరి చివరకు ఏమైంది? భర్త వచ్చాడా లేదా అనేది స్టోరీ. పలువురు ఆర్టిస్టుల వాయిస్ వినిపిస్తుంది. కానీ మూవీ మొత్తం నందితా శ్వేతా మాత్రమే కనిపిస్తుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) -
ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'రాఘవ రెడ్డి'!
శివ కంఠనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై శివ శంకర్ రావ్, రాంబాబు యాదవ్, వెంకటేశ్వర్ రావు నిర్మిస్తున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘రాఘవ రెడ్డి ట్రైలర్ చూస్తే ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసరైన హీరో డ్యూటీ పరంగా మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలేంటి? నిజాయతీగా ఉండటం వల్ల అతనేం కోల్పోయాడు? అన్న కథాంశంతో తెరకెక్కించారు. ఈ ట్రైలర్లో ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో పోసాని, అజయ్ ఘోష్, అజయ్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
నెలలోపే ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ హీరో సినిమా!
బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈ ఏడాది బిచ్చగాడు-2 (పిచ్చైక్కారన్ 2) చిత్రంతో మరో హిట్ అందుకున్నారు. వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటిస్తోన్న నటుడు విజయ్ తాజాగా నటించిన చిత్రం రత్తం. ఇన్ఫినిటీ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రానికి సీఎస్ అముదాన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. నవంబర్ 3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ చిత్రం విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సరసన నటి మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్యానంబీశన్ ముగ్గురు హీరోయిన్లు నటించడం విశేషం.ఈ చిత్రానికి కన్నన్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. #Raththam from November 3rd on @PrimeVideoIN 🩸 pic.twitter.com/0S7VbGaNvL — vijayantony (@vijayantony) October 31, 2023 -
ఎన్నో కోల్పోయా..బాధతో జీవించడం అలవాటైంది: విజయ్ ఆంటోని
తమిళసినిమా: నటుడు, సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రత్తం. తమిళ్ పడం వంటి విజయవంతమైన చిత్రాల ఫేమ్ సీఎస్ అముదమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్ పతాకంపై కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ కలిసి నటించిన ఇందులో నటి మహిమా నంబిరాయర్, నందితా శ్వేత, రమ్యా నంబీశన్ ముగ్గురు హీరోయిన్లు నటించగా నిళల్గల్ రవి, జగన్ ముఖ్యపాత్రలు పోషించారు. కన్నన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 6న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా రత్తం చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో నిర్మాత టీజీ త్యాగరాజన్, అమ్మా క్రియేషన్స్ టి.శివ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన ధనుంజయన్ మాట్లాడుతూ దర్శకుడు సీఎస్ అముదమ్ తన గత చిత్రాలకు పూర్తిభిన్నంగా రత్తం చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారని చెప్పారు. విజయ్‌ఆంటోని మాట్లాడుతూ ఇది పాత్రికేయుల ఇతివృత్తంతో రూపొందిన కథా చిత్రం అని పేర్కొన్నారు. చిత్రం బాగా వచ్చిందని తనకు ఇందులో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. అలాగే తన కూతురు మరణాన్ని తలుచుకుంటూ..‘జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. నేను జీవితంలో ఇప్పటికే ఎన్నో కోల్పోయాను. బాధతో జీవించడం అలవాటు చేసుకున్నాను. బాధల నుంచే ఎంతో నేర్చుకున్నా’ అన్నారు. అనంతరం అమ్మా క్రియేషన్స్ టి.శివ మాట్లాడుతూ తాను రత్తం చిత్రాన్ని చూసి చెబుతున్నానని, చాలాబాగా వచ్చిందని చెప్పారు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయన్నారు. విజయ్‌ఆంటోని కెరీర్ రత్తం చిత్రం స్పెషల్‌గా నిలిచిపోతుందన్నారు. ఆయన పుట్టెడు బాధల్లో ఉండి కూడా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, నిర్మాతల శ్రేయస్సు గురించి నటుల్లో తనకు తెలిసి తమిళ సినీ పరిశ్రమలో నటుడు విజయ్‌కాంత్ తరువాత విజయ్ఆంటోనినేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్‌ఆంటోని తన చిన్న కూతురు లారాతో కలిసి పాల్గొన్నారు. -
సురేష్ గారు ప్రొడ్యూసర్ నాకేం నెక్లెస్ గిఫ్ట్ ఇవ్వలేదండి ..
-
Hidimba Review: ‘హిడింబ’ మూవీ రివ్యూ
టైటిల్: హిడింబ నటీనటులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్, రఘు కుంచె తదితరులు నిర్మాత: గంగపట్నం శ్రీధర్ సమర్పణ: అనిల్ సుంకర దర్శకత్వం: అనిల్ కన్నెగంటి విడుదల తేది: జులై 20, 2023 కథేంటంటే.. హైదరాబాద్‌లో వరుగా అమ్మాయిలు కిడ్నాప్‌కు గురవుతుంటారు. దాదాపు 16 మంది అదృశ్యం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కేరళ నుంచి ఐపీఎస్ ఆద్య(నందితా శ్వేతా)ను నగరానికి రప్పిస్తారు. అప్పటి వరకు ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అభయ్(అశ్విన్ బాబు)తో కలిసి ఆద్య విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో కాలాబండలోని బోయ(రాజీవ్ పిళ్ళై) అనే కరుడుగట్టిన రౌడీ గురించి తెలుస్తుంది. ఆభయ్ రిస్క్ చేసి మరీ కాలాబండలో బందీగా ఉన్న అమ్మాయిలను విడిపిస్తాడు. అయినప్పటికీ నగరంలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్‌కి గురవుతుంటారు. మరి అమ్మాయిలను కిడ్నాప్ చేసేదెవరు? ఎందుకు చేస్తున్నారు? రెడ్ డ్రెస్ వేసుకున్న యువతులను మాత్రమే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్ దీవుల్లో ఉన్న గిరిజన తెగ హిడింబాలకు సంబంధం ఏంటి? చివరకు ఆద్యకు తెలిసిన నిజమేంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఎలాంటి కథ అయినా ప్రేక్షకులకు అర్థమయ్యేలా, వారు ఆ కథలో ప్రయాణించేలా చేస్తేనే ఆ చిత్రాన్ని ఆదరిస్తారు. లేదంటే ఎంత గొప్ప కథ అయినా, ఎంత క్రియేటివ్‌గా చూపించినా వారికి అర్థం కాకపోతే అంతే సంగతి. ‘హిడింబ’లో ఆ పొరపాటే జరిగింది. వాస్తవానికి ఈ మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తది. తెలుగు తెరపై ఇంతవరకు రానటువంటి కథను చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దర్శకుడి తప్పిదమే లేదా ఎడిటింగ్ లోపమో తెలియదు కానీ ఈ చిత్రం ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తుంది. నాన్ లినియర్ స్క్రీన్‌ప్లేతో(ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే..మరొక సీన్ గతంలో సాగుతుంటుంది) కాస్త డిఫరెంట్‌గా ఈ కథను చెప్పే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి దర్శకుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడేమో కానీ అది వర్కౌట్ కాకపోవడమే కాకుండా ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేస్తుంది. నగరంలో వరుస కిడ్నాపులు జరగడం, ఆ కేసును ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగడం.. ఈ క్రమంలో వాళ్లకు కొన్ని సవాళ్లు ఎదురు కావడం, చివరకు ఆ కేసును చేధించడం ఇలా రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ తరహాలో ఫస్టాఫ్ సాగుతుంది. కాలబండాలో బోయ ముఠాలో హీరో చేసే ఫైట్ సీన్ ఆకట్టకుంటుంది. అలాగే హీరోహీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ చూడడానికి బాగుంటుంది కానీ సాఫీగా సాగుతున్న కథకి అడ్డంకిగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లో ఉంటుంది. హిడింబ తెగకు సంబంధించిన నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుంది. నగరంలో జరుగుతున్న కిడ్నాపులకు, హిడింబ తెగకు సంబంధం ఉండడం.. చివర్లో వచ్చే ట్విస్టులు, సర్ప్రైజ్లు ప్రేక్షకులను ధ్రిల్కు గురిచేస్తుంది. అయితే దర్శకుడు చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. పోలీసులు పెద్దగా కష్టపడకుండానే కిడ్నాప్‌కు సంబంధించిన క్లూలు లభించడం, నగరం దాటి వెళ్లొద్దని ఆద్యకు డీజీపీ చెప్పినా.. ఆమె కేరళ వెళ్లడం, ఇలా చెప్పుకుంటూ చాలా సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. స్క్రీన్‌ప్లే మరింత పకడ్బందీగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. పోలీసు అధికారి అభయ్ పాత్రకు అశ్విన్ బాబు న్యాయం చేశాడు. గత సినిమాలతో పోలిస్తే నటన విషయంలో అశ్విన్ చాలా మెరుగుపరుచుకున్నాడు. యాక్షన్ సీన్స్ స్టార్ హీరోలకు తగ్గకుండా చేశాడు. క్లైమాక్స్‌లో అతని నటన అద్భుతంగా ఉంటుంది. ఐపీఎస్ అధికారి ఆద్యగా నందితా శ్వేతా తనదైన నటనతో మెప్పించింది. హీరోతో సమానమైన పాత్ర తనది. మకరంద్ దేశ్ పాండే పాత్ర ఈ సినిమాకు చాలా ప్లస్. ఆ పాత్రలో ఆయనను తప్పా మరొకరిని ఊహించుకోలేం. రఘు కుంచె, సంజయ్ స్వరూప్, రాజీవ్ పిళ్ళై తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం వికాస్ బాడిస సంగీతం. తనదైన బీజీఎంతో ప్రేక్షకులను భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Jetty Review: ‘జెట్టి’ మూవీ రివ్యూ
టైటిల్: జెట్టి నటీనటులు: మాన్యం కృష్ణ, నందిత శ్వేతా, తేజశ్వని బెహెర, ఎంఎస్ చౌదరి, జి.కిశోర్, గోపి, జీవ, శివాజీ రాజా, సుమన్ శెట్టి తదితరులు నిర్మాణ సంస్థ: వర్థని ప్రొడక్షన్స్ నిర్మాతలు: కే వేణు మాధవ్ దర్శకత్వం: సుబ్రహ్మణ్యం పిచ్చుక సంగీతం: కార్తీక్ కొడకండ్ల విడుదల తేది: నవంబర్ 04, 2022 కథేంటంటే... కటారిపాలెం గ్రామ ప్రజలకు కట్టుబాట్లు ఎక్కువ. ఆ కట్టుబాట్లను ఊరి పెద్ద జాలయ్య(ఎంఎస్ చౌదరి)పరిరక్షిస్తూ.. ఆ ఊరికి, అక్కడ ఉన్నా చుట్టూ పక్కల ప్రాంతానికి పెద్ద కాపుగా ఉంటారు.తరచూ గ్రామానికి చెందిన మత్స్య కారుల బోట్స్ తుపానుల తాకిడికి కొట్టుకు పోయి నష్టాలను తెస్తుంటాయి. దాంతో ఎలాగైనా జెట్టి నిర్మించి మత్స్య కారులను ఆదుకోవాలని ఆ ప్రాంత ఎమ్మెల్యే అయిన దశరథ రామయ్య(శివాజీ రాజా)కి మొరపెట్టుకుంటారు. అయితే అతను ప్రతి పక్ష పార్టీ కి చెందిన ఎమ్మెల్యే కావడంతో తానూ జెట్టిని కట్టలేనని చేతులెత్తేస్తాడు. అయితే ఈ జెట్టి నిర్మిస్తే మత్స్యకారులు తమను లెక్క చేయరని విలన్ (మైమ్ గోపి ) అడ్డు తగులుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ గ్రామానికి ఉపాధ్యాయినిగా వచ్చిన శ్రీ (కృష్ణ మాన్యం) గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ... జాలయ్య కూతురు మీనాక్షి( నందిత శ్వేత) ప్రేమలో పడతారు. వీరిరువురు ఓ రోజు గ్రామ వదిలి వెళ్ళిపోతారు. దాంతో ఆ ఊరి సంస్కృతి సంప్రదాయం, కట్టు బాట్ల ప్రకారం జాలయ్య అవమానంగా ఫీల్ అవుతాడు. మరి జాలయ్య ఓ వైపు తనని నమ్ముకున్న మత్స్య కారులకి జెట్టిని ప్రభుత్వం నుంచి సాధించుకున్నారా? అలాగే ఊరి కట్టుబాట్లని లెక్క చేయకుండా ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిన తనకూతురుని ఎం చేసాడు అనేదే జెట్టి మిగతా కథ. ఎలా ఉందంటే.. వందల గ్రామాలు, కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు, వాళ్ళ జీవితాల కోసం చేసే పోరాటమే జెట్టి సినిమా. ప్రపంచానికి మారుమూల బ్రతికే మత్స్యకారుల కఠినమైన కట్టుబాట్లు, వారి జీవనశైలి, మత్స్యకారులు పోరాటం చేసి జెట్టిని ఎలా సాధించారు అన్నదే ఈ సినిమా కథాంశం. సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెనను జెట్టి అంటారు. ఈ జెట్టి అవసరం ఏమిటనే కోణంలో ఈ సినిమా కథను తెరకెక్కించారు దర్శకుడు. ఇందులో దర్శకుడు తీరా ప్రాంతంలో ఉన్న కటారి పాలెం అనే ఓ గ్రామాన్ని తీసుకొని... ఆ ప్రాంతం, దాని చుట్టూ పక్కల ఉండే సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంగా కథ నాన్ని రాసుకుని వెండితెరపై మత్స్య కారుల జీవితాన్ని ఆవిష్కరించారు. (చదవండి: ‘ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ) అలానే మత్స్య కారులని దోచుకునే ఓ మోతుబరి ఆ ప్రాంతాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంటాడు. అతడిపై మత్య్సకారులు ఎందుకు ఎదురు తిరిగారు అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని రాసుకున్న కథ, కథనాలు ప్రేక్షకులని కట్టి పడేస్తాయి. ఇందులో ఎంతో భావోద్వేగం ఉంటుంది. కూతుళ్ల మధ్య ఉండే ఓ ఎమోషనల్ బాండింగ్ క్లైమాక్స్ లో కంటతడి పెట్టిస్తుంది. ఆ ప్రాంతానికి జెట్టి తీసుకు రావడానికి ఓ తండ్రి ఏం చేశారు అనేది ఈ సినిమాకు ఆత్మ లాంటిది. జెట్టి సినిమా గుండెను బరువెక్కించే సినిమా. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గ్రామ పెద్ద జాలయ్య పాత్రలో ఎమ్మెస్ చౌదరి బాగా క్యారీ చేశారు. తన్ని నమ్ముకున్న వారికి ఓ గ్రామ పెద్దగా ఎలా సహాయం చేయాలనే పాత్రని బాగా పండించారు. హీరోగా నటించిన కృష్ణ మాన్యం... స్కూల్ టీచర్ పాత్రలోను ... గ్రామాభివృద్ధికి పాటు పడే మంచి యువ ఉపాధ్యాయ పాత్రలో చక్కగా ఒదిగి పోయారు. హీరో కటౌట్ కూడా ఆరడుగులు పైనే ఉండటంతో యాక్షన్ సీన్స్ లోను మెప్పిచారు. అతనికి జోడిగా నటించిన నందిత శ్వేత పైగా గ్రామీణ యువతిగా, ఫిషరీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారిణిగా చక్కగా నటించారు. విలన్ గా మైమ్ గోపి రౌద్రం పండించారు. పొలిటీషియన్ పాత్రలో శివాజీ రాజా పర్వాలేదు అనిపించాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సంగీతం బాగుంది. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన పాట బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘జెట్టి’లోని కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి: గోపిచంద్ మలినేని
మాన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా నటించిన చిత్రం జెట్టి. శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వం వహించగా వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ‘వీరాసింహారెడ్డి’ సెట్స్‌లో లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. జెట్టి ట్రైలర్ లో కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి. చాలా రియలిస్టిక్ అప్రోచ్ తో మత్య్సకారుల జీవితాలను తెరమీదకు తెచ్చిన విధానం బాగుంది. ఈ కథలో మట్టివాసనలు తెలుస్తున్నాయి. వీరి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో పరిచయం అవుతన్న హీరో కృష్ణకు దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుకకు నా అభినందనలు’ అన్నారు. హీరో మాన్యం కృష్ణ మాట్లాడుతూ.. మత్య్స కారుల జీవితాలను ఆవిష్కరించిన ఈ సినిమా లో అందమైన ప్రేమకథతో పాటు తండ్రి కూతుళ్ళ మధ్య బలమైన ఎమోషన్స్ ఉంటాయి. నందిత శ్వేత గారితో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక ఈ కథను మలిచిన తీరు చాలా హృద్యంగా ఉంటుంది’ అన్నారు. ‘తీర ప్రాంతం లో ఒక జీవిన విధానం ఉంటుంది. వారి సమస్యలు కట్టుబాట్లు చాలా పటిష్టంగా ఉంటాయి. అలాంటి నేపథ్యం లో తీసిన జెట్టి కథ తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందింస్తుంది’ అని దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక అన్నారు. -
సరికొత్త కాన్సెప్ట్‌తో ‘రత్తం’.. డబ్బింగ్ ప్రారంభం
రత్తం చిత్ర డబ్బింగ్ శనివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. ఆయనకు జంటగా మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్యా నంబీశన్ మొదలగు ముగ్గురు నాయికలు నటిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్ పతాకంపై కమల్ బొహ్రా, లలిత ధనుంజయ్, బి.ప్రదీప్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సి.ఎస్.అముదన్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: అప్పుడు చాలా అవమానంగా అనిపించింది: చిరంజీవి) సరికొత్త కాన్సెప్ట్‌తో ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్రం షూటింగ్‌ను ప్రణాళిక ప్రకారం రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇండియాలోని ప్రధాన ప్రాంతాల్లో కొంతభాగం పూర్తి చేసుకుందని, మిగిలిన భాగాన్ని త్వరలో విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు పేర్కొన్నారు. మరోపక్క డబ్బింగ్ పార్ట్‌ను శనివారం ప్రారంభించినట్లు చెప్పారు. దీనికి కన్నన్ సంగీతాన్ని, గోపి అమర్నాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
హీరోయిన్ బాడీపై అసభ్య కామెంట్, నందిత దిమ్మతిరిగే సమాధానం
సోషల్ మీడియాలో సెలబ్రెటీలు ట్రోల్స్ బారిన పడటం సాధారణ విషయమే. మరి ఎక్కువగా నటీమణులు, హీరోయిన్లు తరచూ విమర్శలు ఎదుర్కొంటుంటారు. వారిని నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండగా.... మరికొందరు హద్దులు దాటి వారి శరీరాకృతిపై కామెంట్స్ చేస్తూ బాడీ షేమింగ్‌కు దిగుతుంటారు. అయితే నటీమణుల్లో కొందరు వీటిని చూసి చూడనంటూ వదిలేస్తే.. మరికొందరూ ఘాటుగా స్పందిస్తూ ట్రోలర్స్‌కు చురకలు అట్టిస్తారు. తాజాగా నటి నందిత శ్వేతాకు ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె షేర్ చేసిన ఓ ఫొటోపై నెటిజన్ బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్ చేయడంతో అతడిపై మండిపడింది. స్లీవ్‌లెస్ గ్రే కలర్ టీ షర్ట్, ష్కర్ట్ ధరించి గొడకు వాలి నవ్వుతూ పైకి చూస్తున్న తన సైడ్ యాంగిల్ లుక్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇక దీనిపై ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేయగా ఓ ఆకతాయి తన శరీరాకృతిపై అసభ్యంగా స్పందించాడు. ప్లీజ్ మీరు శరీరంపై శ్రద్ధ పెట్టండి. మీ షేప్స్ చూసుకొండి ఓసారి. ఆంటీలా అవుతున్నావ్. కాస్తా వర్కౌట్స్ చేయ్’ అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన నందిత అతడిపై మండిపడింది. ఆ కామెంట్‌ను స్క్రిన్ షాట్ చేసి ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘ఇలాంటి వాళ్లతో నరకం. మనుషులు ఇలా కూడా ఉంటారా?. నేను దేవతను కాదు.. నేను కూడా ఓ సామాన్య మనిషిని. అందరిలానే నాకు కూడా బాధలు ఉంటాయి.. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు.. నా శరీరాన్ని నేను ప్రేమిస్తాను.. ఇప్పుడు నేను ఉన్న స్థితిని, కనిపించే విధానాన్ని కూడా ఇష్టపడుతున్నాను’ అంటూ అతడికి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. కాగా నందిత ఎక్కడికి పోతావు చిన్నవాడా? మూవీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రం 2 మూవీ, అక్షర వంటి చిత్రాలతో పాటు తమిళంలోను పలు సినిమాల్లో నటించింది. ఇటీవల ఆమె ఐపీసీ 376 అనే సినిమాలో చేసింది. వీటితో పాటు పలు టీవీ షోలకు జడ్జీగా కూడా వ్యవహరిస్తోంది. View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) -
హీరోయిన్ నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం
Nandita Swetha Father Passed Away : హీరోయిన్ నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి శివస్వామి ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా అభిమానులు, శ్రేయోభిలాషులకు తెలియజేస్తూ.. ‘నా తండ్రి శివస్వామి 54 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని పోస్ట్ చేసింది. ఇక నందిత తండ్రి చనిపోయారన్న విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా 'నంద లవ్స్ నందిత' అనే కన్నడ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన నందిత హీరో నిఖిల్‌తో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంలో నటించి తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో నటిస్తుంది. This is to inform all my wellwishers that My father Mr.shivaswamy aged 54 passed away today. May his soul rest in peace — Nanditaswetha (@Nanditasweta) September 19, 2021 చదవండి: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన హీరో అడివి శేష్ -
జిగేలుమంటున్న నందిత శ్వేత ఫోటోలు
-
కపటధారి మూవీ రివ్యూ
టైటిల్ : కపటధారి జానర్ : క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు : సుమంత్, నందిత, నాజర్, జయప్రకాశ్, వెన్నెల కిషోర్ తదితరులు నిర్మాణ సంస్థ : క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు : ధనంజయన్, లలితా ధనంజయన్ దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తి సంగీతం : సిమన్ కె కింగ్ సినిమాటోగ్రఫీ : రసమతి ఎడిటర్ : ప్రవీన్ కేఎల్ విడుదల తేది : ఫిబ్రవరి 19 అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడానికి సుమంత్ కృషి చేస్తున్నాడు. హీరోయిజం, మాస్ మసాల అంశాలను పక్కనబెట్టి విభిన్న కథలు ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వరుస ప్రేమకథా చిత్రాలు చేసి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న సుమంత్.. ఇప్పుడు థ్రిల్లర్ కథలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఈసారి ‘కపటధారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్. కన్నడ సూపర్ హిట్ ‘కవలుధారి’ సినిమాకు ఇది రీమేక్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తమిళ వెర్షన్ జనవరి 28న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. మరి కన్నడ, తమిళంలో విజయం సాధించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సుమంత్‌కు ఈ సినిమా హిట్ అందించిందా? రివ్యూలో చూద్దాం. కథ గౌతమ్ (సుమంత్) ఒక సిన్సియర్ ట్రాఫిక్ ఎస్సై. కానీ ఆ జాబ్‌తో అతను సంతృప్తి చెందడు. పోలీసుగా విధుల్లో చేరి క్రైమ్ కేసులను విచారించాలని అనుకుంటాడు. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించినా..పై అధికారులు అతనికి ప్రమోషన్ ఇవ్వరు. ఇదిలా ఉంటే.. ఒకరోజు మెట్రో కోసం తవ్విన తవ్వకాలల్లో ఓ ముగ్గురి అస్థిపంజరాలు బయటపడతాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పైపైన విచారణ చేసి కేసును మూసేసే ప్రయత్నం చేస్తారు. కానీ గౌతమ్ మాత్రం ఆకేసును సీరియస్‌గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతనికి జర్నలిస్ట్ గోపాల్ కృష్ణ (జయప్రకాశ్), 40 ఏళ్ల క్రితం ఆ కేసును డీల్ చేసిన రిటైర్డ్ పోలీసు అధికారి రంజన్ (నాజర్) పరిచయం అవుతారు. కేసు విచారణలో ఆలేరు శ్రీనివాస్ అనే మరోవ్యక్తి పేరు బయటకు వస్తుంది. అసలు ఈ ఆలేరు శ్రీనివాస్ ఎవరు? అతనికి ఈ కేసుకు ఏం సంబంధం? మెట్రో తవ్వకాల్లో లభించిన అస్థిపంజరాలు ఎవరివి? వాళ్లు ఎలా చనిపోయారు? కేసు విచారణలో గౌతమ్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? చివరకి అతను ఈ కేసును ఎలా ఛేదించాడనేది మిగతా కథ. నటీనటులు ట్రాఫిక్ ఎస్సై గౌతమ్ పాత్రలో సుమంత్ ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్లను కూడా బాగా పండించాడు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం నాజర్ పాత్ర. రిటైర్డ్ పోలీసు అధికారి రంజిత్ పాత్రకు ఆయన ప్రాణం పోశాడు. దాదాపు హీరోతో సమానంగా స్ర్కీన్‌ను పంచుకున్నాడు. తన అనుభవం అంతా తెరపై కనబడుతుంది. ఇక జరల్నిస్టుగా జయప్రకాశ్ తన పాత్రకు న్యాయం చేశాడు. కమెడియన్ వెన్నెల కిషోర్ రెండు మూడు సీన్లలో కనిపించినా.. తనదైన కామెడీ పంచ్‌లతో నవ్విస్తాడు. హీరోయిన్ నందిత, గెస్ట్‌రోల్‌లో కనిపించిన సుమన్ రంగనాథన్, విలన్‌గా చేసిన సతీష్ కుమార్ తమ పరిధిమేరకు నటించారు. విశ్లేషణ ‘కవలుధారి’కి రీమేక్‌గా వచ్చింది ‘కపటధారి’. క్రైమ్ థ్రిల్లర్ సినిమా కావడంతో విడుదలైన రెండు భాషల్లోనూ పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. ఇక తెలుగు ప్రేక్షకులు కూడా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను బాగానే ఆదరిస్తారు. అదే నమ్మకంతో ప్రదీప్ కృష్ణమూర్తి తెలుగులో ఈ మూవీని తెరకెక్కించాడు. అతని నమ్మకం కొంతవరకు వమ్ముకాలేదనే చెప్పాలి. థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్‌లు మెండుగా ఉండటం సినిమాకి చాలా ప్లస్ అయింది. అయితే, ఈ కథను తెలుగు ప్రేక్షకులను నచ్చే విధంగా తీర్చిదిద్దడంలలో దర్శకుడు కొద్దిమేరకే సఫలం అయ్యాడని చెప్పొచ్చు. దర్శకుడు థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ఫీల్‌ని క్రియేట్ చేయగలిగాడు కానీ ఎమోషనల్ అంశాలను మరిచాడు. ఒరిజినల్ వెర్షన్‌ని మక్కీకి మక్కీ దించేశాడు. అది కొంత మైనస్. కథ నెమ్మదిగా సాగడం, కొన్ని సీన్లు రిపీట్ కావడం ప్రేక్షకుడిని ఇబ్బంది పెడతాయి. ఇలాంటి క్రైమ్ తరహా సినిమాలు ఇదివరకే చూశాం కదా అనే ఫీలింగ్ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సిమోన్ కె కింగ్ నేపథ్య సంగీతం. తన బీజీయంతో కొన్ని సన్నివేశాలకు అతను ప్రాణం పోశాడు. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే సినిమాపై ఆసక్తి పెరుగుతుంది అనడం అతిశయోక్తికాదు. ఎడిటర్ ప్రవీణ్ కెఎల్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సుమంత్, నాజర్ నటన ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌లోని కొన్ని థ్రిల్లింగ్ అంశాలు నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ స్లో నెరేషన్ స్ర్కీన్ ప్లే రొటీన్ క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ హిట్లు కపటధారికి నమ్మకాన్నిచ్చాయి – నాగార్జున
‘‘కపటధారి ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు నాగార్జున. సుమంత్, నందితా శ్వేత జంటగా ప్రదీప్ కష్ణమూర్తి దర్శకత్వంలో డా. ధనంజయన్ నిర్మించిన చిత్రం ‘కపటధారి’. ఈ శుక్రవారం విడుద లవుతున్న ఈ చిత్రం కన్నడ ‘కవలుధారి’కి రీమేక్. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ– ‘‘కోవిడ్ సమయంలో ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా? రారా? అనుకున్నాం. ‘క్రాక్’ సినిమా ఆ భయాలను పోగొట్టింది. ‘ఉప్పెన’తో హిట్ అందుకున్న హీరో వైష్ణవ్ తేజ్‌కి కంగ్రాట్స్. ఈ విజయాలు ‘కపటధారి’ యూనిట్‌కు నమ్మకాన్నిచ్చాయి’’ అన్నారు. సుమంత్ మాట్లాడుతూ – ‘‘వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు. అందుకు మా చిన్న మావయ్యే (నాగార్జున) స్ఫూర్తి. ‘కపటధారి’ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘ప్రస్తుతం తెలుగు సినిమా ఇండియన్ సినిమాను లీడ్ చేస్తుందనే నమ్మకం పెరిగింది’’ అన్నారు ధనంజయన్. ‘‘తెలుగు, తమిళంలో నేనే దర్శకత్వం వహించాను’’ అన్నారు ప్రదీప్ కృష్ణమూర్తి. ఇంద్రగంటి మోహనకృష్ణ, అడివి శేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇన్‌స్ట్రాగామ్‌లో నటికి అసభ్య ఎస్ఎంఎస్లు
సినిమా: నిన్నటి వరకు మీటూ వేధింపులంటూ నార్త్, సౌత్ అని తేడా లేకుండా చిత్ర పరిశ్రమలో వాతావరణం వేడెక్కింది. అది కాస్త చల్లారిందనుకుంటున్న సమయంలో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నటీమణులకు వేధింపుల బెడద తలెత్తుతోంది. నిజానికి ఈ తరహా వేధింపులు చాలా కాలం నుంచే తలెత్తుతున్నాయి. అయితే కోలీవుడ్‌లో ప్రముఖ కథానాయికలకు ఇలాంటివి అరుదే. తాజాగా నటి నందిత శ్వేత అసభ్య ఎస్ఎంఎస్ బెడదను ఎదుర్కొంంటోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. తమిళంలో అట్టకత్తి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన నందితాశ్వేత ఇక్కడ ఇదర్కు దానే, ఆశైపడ్డాయ్ బాలకుమారా తదితర చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. అంతే కాదు తెలుగు, కన్నడం భాషల్లోనూ నటిస్తూ దక్షిణాది హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కాగా ఈ చిన్నది చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో తన చిత్రాల వివరాలను, విశేషాలను పంచుకుంటుంది. అలా నందితాశ్వేతను ఇన్‌స్ట్రాగామ్‌లో చాలా మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. అలా ఫాలో అయిన వారిలో వాంజి సెలియన్ అనే యువకుడు అసభ్య ఎస్ఎంఎస్లతో వేధింపులకు గురి చేస్తున్నాడట. దీని గురించి నందితాశ్వేత స్పందిస్తూ.. ఆ వ్యక్తి అసభ్య ఎస్ఎంఎస్లతో తనను వేధింపులకు గురి చేస్తున్నాడని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొంది. ఇలాంటి వారికి కుటుంబం అంటూ ఉండదా? ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి అని వాపోయింది. అయితే ఈ వ్యవహారంలో పోలీస్‌లకు ఫిర్యాదు చేసే ఆలోచన తనకు లేదని చెప్పికొచ్చింది. ఈ వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసి మరింత రచ్చ చేయడం నందితాశ్వేతకు ఇష్టం లేనట్టుంది. సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణిగితే ఫర్వాలేదు. లేకుంటే పోలీసుల వరకూ వెళ్లే అవకాశం ఉంటుంది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో తానా చిత్రంలోనూ.. తెలుగులో అక్షర, ఐపీసీ 376 చిత్రాల్లోనూ నటిస్తోంది. వీటితో పాటు కన్నడంలో మైనేమ్ ఈజ్ కిరాతక అనే చిత్రంలోనూ నటిస్తోంది. -
సిబిరాజ్‌కు జంటగా నందితాశ్వేత
నటి నందితాశ్వేతాకు నటుడు సిబిరాజ్‌తో జత కట్టే చాన్స్ వచ్చింది. అట్టకత్తి చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ అమ్మడికి ఆ చిత్రం హిట్ అయ్యి మంచి పేరే తెచ్చి పెట్టింది. ఆ తరువాత పలు అవకాశాలు వస్తున్నాయి. అంతేకాదు తెలుగులోనూ నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. కానీ ఎందుకో అందం కూడా కావలసినంత ఉన్నా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోతోంది. అంతేకాదు స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే అవకాశాలను రాబట్టుకోలేకపోతోంది. ఇటీవల ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన దేవీ 2 చిత్రంలో ఒక హీరోయిన్గా కనిపించింది. ఈ అమ్మడు చివరిగా నటించిన చిత్రం 7. ఈ ద్విభాషా చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. తాజాగా నటుడు సిబిరాజ్‌తో జతకట్టే అవకాశం తలుపు తట్టింది. ఇంతకుముందు సిబిరాజ్ హీరోగా సత్య చిత్రాన్ని తెరకెక్కించిన ప్రదీప్‌కృష్ణమూర్తి తాజాగా ఆయన హీరోగానే మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో సిబి రాజ్ తండ్రి సత్యరాజ్ కూడా నటించనున్నారు. ఇది కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన కావలుదారి చిత్రానికి రీమేక్. దీన్ని జీ.ధనుంజయన్ నిర్మించనున్నారు. చాలా కాలం తరువాత తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఇందులో నటి నందితాశ్వేత జర్నలిస్ట్ పాత్రలో నటించనుందట. చిత్రంలో ఆమెకు రొమాంటిక్ సన్నివేశాలాంటివేవీ ఉండవట. అయితే కథలో చాలా ముఖ్యమైన పాత్ర అని చిత్ర వర్గాలు అంటున్నారు. -
రాశీ-నందితా శ్వేత కొత్త సినిమా ప్రారంభం
-
‘మంచి సినిమా అందివ్వాలని మా తాపత్రయం’
శివ కంఠమనేని కథానాయకుడిగా లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 2గా రూపొందుతోన్న నూతన సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు, కె.ఎస్. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మాతలు. యువ కథానాయిక నందితా శ్వేత, రాశి, కె. అశోక్‌కుమార్, శ్రీనివాసరెడ్డి ప్రధాన తారాగణం. ఈ ప్రారంభోత్సవంలో శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ‘వాసవి గ్రూప్’ విజయ్‌కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా... అశోక్ కుమార్ క్లాప్ ఇచ్చారు. చంద్ర సిద్ధార్థ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివ కంఠమనేని మాట్లాడుతూ ‘ఇంతకు ముందు మేం లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై ‘అక్కడొకటుంటాడు’ సినిమా చేశాం. ఇది మా రెండో ప్రొడక్షన్. కుటుంబ కథా చిత్రమిది. అలాగే, సస్పెన్స్ థ్రిల్లర్! ఇందులో నేను, రాశిగారు లీడ్ రోల్స్ చేస్తున్నాం. హీరోయిన్గా నందితా శ్వేతగారు చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి మరో లీడ్ రోల్ చేస్తున్నారు. మా దర్శకుడు సంజీవ్ మేగోటి ఇంతకు ముందు తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేశారు. రెండు షెడ్యూళ్లల్లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. ఇది పూర్తయిన తర్వాత పది పదిహేను రోజులు విరామం తీసుకుని రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఆల్రెడీ నాలుగు పాటలు రికార్డ్ చేశాం. పాటలు విన్న వారందరూ బావున్నాయని ప్రశంసించారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులు అందివ్వాలని మా తాపత్రయం’’ అని అన్నారు. రాశి మాట్లాడుతూ ‘చాలా గ్యాప్ తర్వాత మంచి సినిమాతో నేను మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాను. ముఖ్యంగా నాకు కథ బాగా నచ్చింది. వెరీ బోల్డ్, ఇండిపెండెంట్ విమెన్ క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా రోజులకు నాకు నచ్చిన పాత్ర వచ్చింది. ఈ మధ్యలో చాలా పాత్రలు వచ్చాయి. కానీ, నేను యాక్సెప్ట్ చేయలేదు. ఇందులో నందితా శ్వేత నా కుమార్తెగా చేస్తోంది. తనతో నేను తొలిసారి నటిస్తున్నా. అలాగే, చాలా రోజుల తర్వాత అన్నపూర్ణమ్మగారితో సినిమా చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. నందితా శ్వేత మాట్లాడుతూ ‘నేను తమిళ్, కన్నడ సినిమాలు చేస్తున్నప్పుడు ‘మీరు తెలుగు సినిమాలు చేస్తారా? ఓన్లీ గ్లామర్ రోల్స్ ఉంటాయి?’ అని అక్కడివారు అడిగేవారు. నేను వెయిట్ చేసి చేసి మంచి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను. ఇప్పటివరకూ గ్లామర్ కంటే ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించాను. ఇప్పుడు ఈ సినిమాలో గ్లామర్ రోల్ చేస్తున్నాను. వెరీ హ్యాపీ. ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇందులో నా క్యారెక్టర్ పేరు లక్కీ. టెర్రర్ గాళ్‌గా కనిపిస్తా. మంచి మంచి యాక్టర్స్‌తో చేస్తున్నా. నేను నేర్చుకోవడానికి ఎంతో స్కోప్ ఉంది. నాపై నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్’ అన్నారు. దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ ‘నేను చాలా ఏళ్ల క్రితం తెలుగులో సినిమాలు చేశాను. తర్వాత కర్ణాటక వెళ్లాను. కన్నడలో ఆరు సినిమాలకు దర్శకత్వం వహించాను. స్ర్కీన్‌ప్లే రైటర్‌గా కన్నడ, తెలుగు ఛానల్స్‌లో బిజీగా ఉన్నాను. మంచి ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్న టైమ్‌లో కొత్తదనంతో కూడిన కథ రెడీ చేశా. కథ ప్రకారం 40, 45 సంవత్సరాల వయసు ఉన్న హీరో కావాలి. సరైన కథకు సరైన నటీనటులు లభిస్తే ఎంత బావుంటుందో ప్రేక్షకులందరికీ తెలుసు. శివ కంఠమనేని, రాశి, నందిత, అన్నపూర్ణమ్మ, శ్రీనివాసరెడ్డి, అజయ్ ఘోష్... ఇలా మంచి మంచి నటీనటులు కుదిరారు. కథకు ఏం కావాలో చెప్పమని అడిగిన నిర్మాతలకు థ్యాంక్స్’ అన్నారు. -
ఆరుగురు అమ్మాయిలు.. ఓ అబ్బాయి
అతడి పేరు కార్తీక్. ఆరుగురు అమ్మాయిలు అతనితో ‘ఐ థింక్... ఐయామ్ ఇన్ లవ్ విత్ యు కార్తీక్’ అన్నారు. దీంతో ఆరుసార్లు నవ్విన కార్తీక్ ఆరుగురికీ ముద్దులు పెట్టి, ముగ్గులోకి దింపాడు. ఇంతకీ అతడి కథేంటి? అన్నది జూన్ 5న తెలుస్తుంది. హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. కిరణ్ స్టూడియోస్‌పై రమేష్ వర్మ ప్రొడక్షన్లో రమేష్ వర్మ నిర్మించారు. ఈ సినిమా వరల్డ్‌వైడ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాని జూన్ 5న విడుదల చేస్తోంది. సంస్థ అధినేత అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘సెవెన్’ ఫస్ట్ కాపీ చూశా. మైండ్ బ్లోయింగ్. థ్రిల్లర్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది. ట్విస్ట్ వెనక ట్విస్ట్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయి. రమేష్ వర్మగారు ఫెంటాస్టిక్ స్టోరీ, స్క్రీన్ ప్లే రాశారు. ఈ సినిమాలో కొత్త హవీష్‌ను చూస్తారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, సహ నిర్మాత: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ, కెమెరా–దర్శకత్వం నిజార్ షఫీ. -
క్రైమ్ థ్రిల్లర్.. ఆకట్టుకుంటోన్న ‘7’ ట్రైలర్
క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువగా తమిళ, మలయాళంలో వస్తుండగా.. ప్రస్తుతం తెలుగులో కూడా వీటి హవా కొనసాగుతోంది. తాజాగా ‘7’ ట్రైలర్‌ను విడుదల చేశారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. అమ్మాయిలు వరుసగా హత్యకు గురవటం, వాటికి కారణాలు ఏంటో తెలియకపోవడం, కార్తీక్ అనే కుర్రాడే ఈ హత్యలు చేశాడని పోలీసులు అనుమానించడం.. ఇలా ఈ కేసును చేదించడం.. ఈ క్రమంలో ఒకేలా ఇద్దరు ఉన్నారా? ఇలా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. ఈ చిత్రంలో నందితా శ్వేతా, రెజీనా, రెహమాన్ కీలకపాత్రల్లో నటిస్తుండగా.. చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. జూన్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ప్రేమ కథా చిత్రమ్ 2’ మూవీ రివ్యూ
టైటిల్ : ప్రేమ కథా చిత్రమ్ 2 జానర్ : హారర్ కామెడీ తారాగణం : సుమంత్ అశ్విన్, సిద్ధీ ఇద్నానీ, నందితా శ్వేత సంగీతం : జేబీ దర్శకత్వం : హరి కిషన్ నిర్మాత : ఆర్ సుదర్శన్ రెడ్డి సుధీర్ బాబు, నందిత జంటగా తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ కామెడీ ప్రేమ కథాచిత్రం. తాజాగా ఆ సినిమాకు సీక్వల్‌ను తెరకెక్కించారు చిత్రయూనిట్. హరి కిషన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధి ఇద్నాని లు హీరో హీరోయిన్లుగా నటించారు. గతంలో కామెడీ హారర్ లు టాలీవుడ్ సక్సెస్ ఫార్ములాగా పేరుతెచ్చుకున్న ఇటీవల కాలంలో ఈ జానర్లో వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ప్రేమ కథా చిత్రమ్ 2 మరోసారి సక్సెస్ ఫార్ములాగా ప్రూవ్ చేసుకుందా..? ఈ సినిమా అయినా సుమంత్ అశ్విన్‌కు సక్సెస్ అందించిందా.? కథ : డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న సుధీర్ (సుమంత్ అశ్విన్)ను కాలేజ్‌లో పరిచయం అయిన బిందు (సిద్ధి ఇద్నాని) ఇష్టపడుతుంది. కానీ సుధీర్ ఆమె ప్రేమను రిజెక్ట్ చేయటంతో బిందు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆమెను కాపాడిన సుధీర్, తాను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాని నచ్చజెప్పి వెళ్లిపోతాడు. తరువాత అనుకోని పరిస్థితుల్లో సుధీర్ ఓ ఫాం హౌజ్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఫాం హౌస్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచి సుధీర్‌కు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఓ అమ్మాయి(నందితా శ్వేత) రాత్రి మాత్రమే కనిపిస్తూ సుధీర్‌ని అతని ఫ్రెండ్ బబ్లూని బయపెడుతుంటుంది. ఇంతకీ సుధీర్ ఆ ఫాం హౌజ్‌కి ఎందుకు వెళ్లాడు? సుధీర్‌ను భయపెడుతున్న ఆ అమ్మాయి ఎవరు? బిందు ఏమైంది.? చివరకు సుధీర్ తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : లవర్ బాయ్ ఇమేజ్‌తో మెప్పించిన సుమంత్ అశ్విన్ హారర్ కామెడీతో ఆకట్టుకోలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ కాలేజ్ సీన్స్‌లో పరవాలేదనిపించినా క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాల్లో సుమంత్ ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. సిద్ధి ఇద్నాని తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో పరవాలేనిపిస్తుంది. కీలక పాత్రలో నటించిన నందిత శ్వేత నిరాశపరిచింది. చాలా సన్నివేశాల్లో ఆమె నటన అతిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ పాత్రల్లో కనిపించిన కృష్ణతేజ(బబ్లూ), విధ్యుల్లేఖ రామన్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. విశ్లేషణ : ప్రేమ కథా చిత్రమ్ సినిమాకు కొనసాగింపుగా కథను తయారు చేసుకున్న దర్శకుడు, ఆ కథను తెర మీదకు తీసుకురావటంలో తడబడ్డాడు. తన కథనంతో ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఏ జరుగుతుంది.. ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది అని ప్రేక్షకుడు అర్థం చేసుకోవడానికే సరిపోతుంది. ద్వితీయార్థంలో కథనం రోలర్‌కోస్టర్‌లా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని మరింత పరీక్షిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆడియన్స్‌ను భయపెట్టేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నాలన్నీ నవ్వుతెప్పిస్తాయి. సంగీత దర్శకుడు జేబీ తన సంగీతంతో సినిమాను కొంతమేర కాపాడే ప్రయత్నం చేశాడు. పాటలు, నేపథ్యం సంగీతం పరవాలేదనిపిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కామెడీ మైనస్ పాయింట్స్ : స్క్రీన్‌ప్లే దర్శకత్వం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది
సుమంత్ అశ్విన్, సిద్ధీ ఇద్నానీ జంటగా నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమకథాచిత్రమ్ 2’. 2013లో వచ్చిన ‘ప్రేమకథాచిత్రమ్’ సినిమాకు ఇది సీక్వెల్. హరికిషన్ దర్శకత్వంలో ఆర్. సుదర్శన్‌రెడ్డి నిర్మించారు. ఆయుష్ సహ నిర్మాత. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను నటుడు సప్తగిరి శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం సప్తగిరి మాట్లాడుతూ– ‘‘ప్రేమకథాచిత్రమ్’ మాకు జీవితాన్ని ప్రసాదించింది. ఆ సినిమా పేరును ఇంకా చెప్పుకుంటున్నాం. అంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఫస్ట్ పార్ట్‌లో నటించిన నేను ఈ ‘ప్రేమకథాచిత్రమ్ 2’ ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. స్టోరీ పరంగా నేను అవసరం లేదనే నిర్మాత నన్ను ఈ సినిమాకు పిలవలేదు. పిలిచి ఉంటే వచ్చేవాడిని. సుమంత్ కెరీర్లో ఇది బెస్ట్ మూవీగా ఉండిపోతుంది. నిర్మాతకు డబ్బులు రావాలి. సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది’’ అన్నారు. ‘‘భావోద్వేగభరితమైన సన్నివేశాలను హరికిషన్ చక్కగా తెరకెక్కించారు. హీరోయిన్ల పాత్రలు ఇతర పాత్రలను డామినేట్ చేసేలా ఉన్నాయి’’ అన్నారు సుమంత్ అశ్విన్. ‘‘కంటెంట్‌ని నమ్మి ఈ సినిమాను నిర్మించాను. స్క్రిప్ట్ పరంగా సప్తగిరి పాత్రకు అవకాశం లేదు. ఇప్పుడు ఆయన హీరో కూడా అయిపోయారు. కెమెరామేన్ రాంప్రసాద్ మంచి విజువల్స్ అందించారు. నందితా సింగిల్ టేక్ ఆర్టిస్టులా నటించారు. సుమంత్ అశ్విన్ కెరీర్లో ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఈ సినిమాను ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల చేస్తున్నాం’’ అన్నారు సుదర్శన్‌రెడ్డి. ‘‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తర్వాత చాలా హారర్ కథలు విన్నాను. ఈ చిత్రానికి సైన్ చేసినప్పుడు... మళ్లీ హారరా? అన్నారు నా సన్నిహితులు. కానీ నా క్యారెక్టర్ బాగుంటుంది’’ అన్నారు నందితాశ్వేత. ‘‘ఈ సీక్వెల్ ‘ప్రేమకథాచిత్రమ్’కు దీటుగా ఉండాలని చాలా కష్టపడి తీశాం. సినిమా హిట్ సాధిస్తుంది’’ అన్నారు దర్శకుడు హరికిషన్. ‘‘ప్రేమకథాచిత్రమ్ 2’ నాకు స్పెషల్ మూవీ. ఇది తెలుగులో నా రెండో చిత్రం. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు సిద్ధీ ఇద్నానీ. నిర్మాతలు శ్రీధర్ రెడ్డి, ఆయుష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ జేబీ, కెమెరామేన్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మే నెలలో ప్రేక్షకుల ముందుకు ‘అక్షర’
ఎక్కడికీపోతావు చిన్నవాడా సినిమాతో ఆకట్టుకున్న నందితా శ్వేత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెండ్ సినిమా అక్షర. విద్యతో సామాజిక మార్పు సాధ్యం అవుతుందని నమ్మే అక్షర అందుకోసం ఏం చేసింది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు బీ చిన్నికృష్ణ దర్శకుడు. ఇప్పటికే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న అక్షర మూవీ ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో నందితతో పాటు కీలక పాత్రల్లో నటిస్తోన్న షకలక శంకర్, సత్య, మధునందన్ పాల్గొంటున్నారు. వీరి పాత్రలు సినిమాలో హైలెట్ గా ఉంటాయంటున్నారు చిత్రయూనిట్. చివరి దశకు చేరుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. మే నెలలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘ప్రేమకథా చిత్రమ్ 2’ మూవీ స్టిల్స్
-
‘బ్లఫ్ మాస్టర్’ మూవీ రివ్యూ
టైటిల్ : బ్లఫ్ మాస్టర్ జానర్ : క్రైమ్ థ్రిల్లర్ తారాగణం : సత్యదేవ్, నందిత శ్వేత, ఆదిత్య మీనన్, సిజ్జు, వంశీ సంగీతం : సునీల్ కాశ్యప్ దర్శకత్వం : గోపి గణేష్ నిర్మాత : శివలెంక కృష్ణ ప్రసాద్, పి. రమేష్ సపోర్టింగ్ రోల్స్‌తో వెండితెరకు పరిచయం అయిన సత్యదేవ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతి లక్ష్మి సినిమాతో లీడ్ యాక్టర్‌గా మారాడు. తరువాత కూడా క్షణం, ఘాజీ, అంతరిక్షం లాంటి సినిమాలతో నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకొని మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కోలీవుడ్‌లో ఘన విజయం సాధించిన శతురంగవేట్టై సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన బ్లఫ్ మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో సత్యదేవ్ హీరోగా సక్సెస్ సాదించాడా..? కథ : ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) ఏడేళ్ల వయస్సులో తన తల్లిదండ్రుల మరణంతో సమాజం మీద ద్వేషం పెంచుకుంటాడు. ఇక్కడ బతకాలంటే డబ్బు కావాలనే ఉద్దేశంతో.. ఆ డబ్బు కోసం ఎలాంటి మోసం చేయడానికైనా సిద్ధపడతాడు. మనం నమ్మి చేసేది ఏది మోసం కాదని భావించే ఉత్తమ్ రకరకాల పేర్లతో ఎన్నో మోసాలు చేస్తాడు. పోలీసులు అరెస్ట్ చేసినా డబ్బుతో సాక్షాలను, లాయర్లను కొని బయట పడతాడు. ఇలా అడ్డదారిలో వెళుతున్న ఉత్తమ్ మంచి వాడిగా ఎలా మారాడు..? ఉత్తమ్ జీవితంలోకి వచ్చిన అవని ఎవరు..? ఆమె రాకతో ఉత్తమ్ ఎలా మారాడు..? మంచి వాడిగా మారిన ఉత్తమ్‌కు ఎదురైన సమస్యలేంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమా అంతా సత్యదేవ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మాటలతో మాయ చేసి మోసం చేసే పాత్రలో సత్యదేవ్ నటన వావ్ అనిపిస్తుంది. ప్రతీ సన్నివేశంలోనూ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. మోసగాడిగా కన్నింగ్ లుక్స్‌లో మెప్పించిన సత్య, సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్స్‌లోనూ అంతే బాగా ఆకట్టుకున్నాడు. అవని పాత్రలో నందితా శ్వేత ఒదిగిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఆమె నటన కాస్త నాటకీయంగా అనిపించినా.. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌తో మంచి మార్కులు సాధించింది. ఇతర పాత్రల్లో ఆదిత్య మీనన్, సిజ్జు, వంశీ, చైతన్య తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : తమిళ సినిమా శతురంగవేట్టైని తెలుగులో రీమేక్ చేసిన దర్శకుడు గోపీ గణేష్ తెలుగు నేటివిటికి తగ్గట్టుగా తీర్చిదిద్దటంలో సక్సెస్ సాధించాడు. అసలు కథలో పెద్దగా మార్పులు చేయకపోయినా.. కథనంలో తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో డ్యూయెట్లు, ఫైట్లు ఇరికించకుండా సినిమాను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినట్టుగా అనిపించినా ప్రేక్షకుడిని కదలకుండా కూర్చోబెడ్డటంలో దర్శకుడు విజయం సాధించాడు. సినిమాకు మరో బలం డైలాగ్స్ చాలా డైలాగ్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా గుర్తుండిపోయేలా ఉన్నాయి. సునీల్ కాశ్యప్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సత్యదేవ్ డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా నెమ్మదించిన కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘ప్రేమకథా చిత్రమ్ 2’ మూవీ స్టిల్స్
-
ప్రేక్షకాదరణే ప్రధానం
కంటోన్మెంట్: ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అంటూ రెండేళ్ల క్రితం నిఖిల్‌ను పలకరించిన నందిత శ్వేతా తాజాగా ‘శ్రీనివాస కళ్యాణం’లో నితిన్‌కు మరదలుగా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. తొలుత వీడియో జాకీగా కేరీర్ ప్రారంభించిన ఈ బెంగళూరు అమ్మాయి తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతో విజయవంతంగా ముందుకెళుతోంది. ఇప్పటివరకు ఆమె 8 సినిమాల్లో నటించగా, అందులో ఆరు సినిమాలు ఈ ఏడాదిలోనే కావడం విశేషం. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో పోషించిన పాత్రకు మంచి గుర్తింపు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా రావడంతో తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలుగులో తన రెండో సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’ గురువారం విడుదల కానున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా నందిత శ్వేతా కొద్దిసేపు ముచ్చటించారు. ప్రేక్షకుల ‘సపోర్ట్’తో తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించేఅవకాశముందన్నారు. ఇటీవల ఆఫర్లు పెరిగాయి.. 2008లో తొలి సినిమా విడుదలైన నాలుగేళ్లకు 2012లో తమిళ సినిమాలో నటించా. 2013లో విడుదలైన ఎథిర్ నీచల్ చిత్రానికి గానూ సైమా అవార్డు దక్కగా, తెలుగు చిత్రం ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు వచ్చిందన్నారు. ఈ ఏడాది ఇప్పటికే మూడు తమిళ చిత్రాలు విడుదలయ్యాయని, వీటిలో కుష్బూ నిర్మించిన ‘కాలకలప్పు–2’లో సీబీఐ ఆఫీసర్ పాత్ర పోషించినట్లు తెలిపారు. హిందీలో, తమిళంలో మరో రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. -
నా టీమ్‌కు సక్సెస్ రావాలి
ఆశ అత్యాశగా మారినప్పుడే అనర్థాలు ఏర్పడతాయి. అలాంటి అత్యాశపరులను టార్గెట్ చేసే వ్యక్తి కథే ‘బ్లఫ్ మాస్టర్’. తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’ సినిమాకు అఫీషియల్ రీమేక్ ఇది. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో సత్య దేవ్, నందితా శ్వేత జంటగా గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రమేశ్ పిళ్లై నిర్మించారు. ఈ చిత్రం టైటిల్ లోగోను దర్శకుడు పూరి జగన్నాథ్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘గణేశ్ దర్శకుడిగా నాకు ఇష్టం. నా ప్రొడక్షన్లో ఓ సినిమా చేశాడు. సత్య, సునీల్ కశ్యప్ ఇలా నా టీమ్ మెంబర్స్ ఈ సినిమాకి వర్క్ చేశారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి. కృష్ణప్రసాద్‌గారు ఈ ప్రాజెక్ట్‌లో ఉండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘డబ్బింగ్ పూర్తయింది. ఈ నెలలోనే పాటలు, టీజర్‌ను రిలీజ్ చేస్తాం. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘మా బాస్ పూరిగారి చేతుల మీదగా లోగో రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది. ఆయన పుట్టిన రోజే ఈ సినిమా రిలీజ్ కావడం ఇంకా హ్యాపీ. రెండు అగ్ర నిర్మాణ సంస్థలు కలిసి చేస్తున్న సినిమాలో హీరోగా చేయడం నా అదృష్టం’’ అన్నారు సత్యదేవ్. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్. కెమెరా: దాశరధి శివేంద్ర, డైలాగ్స్: పులగం చిన్నారాయణ. -
తమిళ సూపర్ హిట్ రీమేక్ 'బ్లఫ్ మాస్టర్'
ఆశ, అత్యాశల నేపథ్యంలో రూపొందిన తమిళ సూపర్ హిట్ సినిమా చతురంగ వేట్టై. ఈ సినిమాతో తెలుగులో గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో రీమేక్ చేశారు. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాత. ‘జ్యోతిలక్ష్మి’, ‘ఘాజి’ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నందితా శ్వేత హీరోయిన్గా నటించారు. ఈ సినిమా గురించి నిర్మాత రమేష్ పిళ్లై మాట్లాడుతూ ‘తొలిసారిగా అభిషేక్ ఫిలిమ్స్ పతాకం ఫై లారెన్స్ నటించిన శివలింగ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించి మంచి విజయాన్ని సాధించాము . ప్రస్తుతం తమిళంలో ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘చతురంగ వేట్టై’ తెలుగులో రీమేక్ చేశాం . చిత్రీకరణ పూర్తయింది. కొడైకెనాల్, కర్నూలు , వైజాగ్, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపాం . ఎక్కడా రాజీపడకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది . పాటలను జులై నెలాఖరున, చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది’ అని అన్నారు. దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి మాట్లాడుతూ ‘రోజూ ఏ పేపర్లో చదివినా , ఏ టీవీ ఛానల్లో చూసినా 90 శాతం మోసాల గురించే ఉంటాయి. మనిషికి ఆశ సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే నేరాలు జరుగుతాయి. అత్యాశ ఉన్న ప్రతి చోటా ఒక బ్లఫ్ మాస్టర్ ఉంటాడు. ఆ నేపథ్యం లోనే ఈ సినిమా ఉంటుంది. బ్లఫ్ మాస్టర్ గా సత్యదేవ్ అదరగొట్టేశాడు. ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా లైవ్లీ గా ఉంటుంది’ అన్నారు. -
వాళ్లెవరూ నటించనన్నారు!
తమిళసినిమా: పలువురు హీరోయిన్లు అసురవధం చిత్రంలో నటించడానికి అంగీకరించలేదని నటుడు, దర్శక నిర్వాత శశికుమార్ పేర్కొన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం అసురవధం. 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా మరుదు పాండియన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందితా శ్వేత హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి గోవింద్ వసంత్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. చిత్ర కథానాయకుడు శశికుమార్ మాట్లాడుతూ ఇంతకు ముందు తన చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పని చేసిన మిత్రుడు ప్రేమ్ ఈ చిత్ర దర్శకుడు మరుదు పాండియన్‌ను కథ చెప్పడానికి తన వద్దకు పంపారన్నారు. కథ వినగానే తానే చిత్రాన్ని నిర్మించాలని భావించానని చెప్పారు. అలాంటి సమయంలో నిర్మాత లలిత్ సార్ మీతో నేను చిత్రం చేయాలని కోరుకుంటున్నానన్నారన్నారు. నిజానికి తానూ అప్పుడు కాస్త కష్టాల్లో ఉండడంతో ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను లలిత్‌కు అప్పగించానని తెలిపారు. ఆయన, కదిర్ కష్ట సమయంలో తనకు అండగా నిలిచారని చెప్పారు. ఈ చిత్ర షూటింగ్‌ను అధిక భాగం కొడైక్కెనాల్లో చేశామని, అతి శీతోష్ణంలోనూ చిత్ర యూనిట్ అంతా శ్రమ అని భావించకుండా కష్టపడి పని చేశారని చెప్పారు. నిర్మాత లలిత్ మీపై నమ్మకం ఉంది, మీరు ఏం అనుకంటే అది చేయండి అని అనడంతో తనకు మరింత భయం అనిపించిందన్నారు. రెండు రోజుల క్రితమే చిత్రం చూపిన నిర్మాత లలిత్ సార్ తనకు మొదటి చిత్రాన్నే ఉత్తమ చిత్రంగా అందించారని చెప్పడంతో సంతోషం కలిగిందన్నారు. చిత్రంలో నటన తెలిసిన నటిని ఎంపిక చేయండని దర్శకుడికి చెప్పానన్నారు. అయితే చాలా మంది హీరోయిన్లు ఇందులో నటించడానికి నిరాకరించారని, అలాంటి సమయంలో కథను అర్థం చేసుకుని నటి నందితాశ్వేత నటించడానికి ఒప్పుకున్నారని చెప్పారు. ఇక ఈ చిత్రంలో విలన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ఇలాంటి పాత్రలో నటించడానికి ఎవరూ ఒప్పుకోరని అన్నారు. అలాంటి పాత్రలో రచయిత వసుమిత్రను నటించడానికి ఒప్పించామని తెలిపారు. ఇది మంచివాడు, దుర్మార్గుడిల కథా చిత్రం అని శశకుమార్ వెల్లడించారు. అసురవధం చిత్రంలో చాలా ఎమోషనల్, ఘనమైన సన్నివేశాలు కలిగిన పాత్రను తాను నటించగలనని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నటి నందితా శ్వేత పేర్కొంది. దర్శకుడు మరుదు పాండియన్, నటుడు విసుమిత్ర, నిర్మాత లలిత్ పాల్గొన్నారు. -
ఇద్దరు భామలతో ‘ప్రేమ కథా చిత్రం 2’
సుధీర్ బాబు, నందితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా ప్రేమకథా చిత్రం. మారుతి కథ అందించిన ఈ సినిమాకు జె ప్రభాకర్ రెడ్డి దర్శకుడు. కామెడీ హర్రర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో సుమంత్ అశ్విన్ హీరోగా సీక్వెల్ ను ప్రారంభించారు. ప్రేమ కథా చిత్రం 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. హరి కిషన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఒక హీరోయిన్గా జంబ లకిడి పంబ ఫేం సిద్ధి ఇద్నాని నటిస్తుండగా మరో హీరోయిన్ గా ఎక్కడికి పోతావు చిన్నావాడా ఫేం నందిత శ్వేత నటించనుంది. ప్రేమ కథా చిత్రానికి నిర్మాతగా వ్యహరించిన సుదర్శన్ రెడ్డి సీక్వెల్‌ను కూడా నిర్మిస్తున్నారు. -
సింగపూర్ టు అమలాపురం
సింగపూర్‌కు బై బై చెప్పి, అమలాపురంలో వాలిపోయారు హీరోయిన్ రాశీ ఖన్నా. ఎందుకు? సింగపూర్ హాలీడే ట్రిప్‌లో చేసినట్లు ఇక్కడ కూడా ఏవైనా అడ్వెంచర్స్ ప్లాన్ చేశారా? అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వడానికి అమలాపురంలో అడుగుపెట్టారు రాశీ. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘శ్రీనివాసకల్యాణం’. రాశీ ఖన్నా, నందితా శ్వేత కథానాయికలు. ప్రస్తుతం అమలాపురంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూట్లో జాయిన్ అవ్వడానికే రాశీ అమలాపురం వెళ్లారు. అంతకు ముందు తమిళంలో ‘జయం’ రవితో నటిస్తున్న సినిమా షెడ్యూల్‌ని కంప్లీట్ చేసుకుని హాలీడే కోసం రాశీఖన్నా సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ‘‘గుడ్‌బై చెప్పడం నాకు అంతగా ఇష్టం ఉండదు. కానీ వెళ్లాలి. బై బై సింగపూర్. ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలో జాయిన్ అయ్యేందుకు అమలాపురం వచ్చాను’’ అని పేర్కొన్నారు రాశీఖన్నా. -
నాన్‌స్టాప్
ఐదు కాదు. పది కాదు. ఏకంగా ఇరువై గంటలు కెమెరా ముందే ఉన్నారు కథానాయిక నందితా శ్వేత. అవును... ఉదయం నాలుగు గంటల నుంచి దాదాపు ఇరవై గంటల పాటు షూట్లో పాల్గొన్నారు నందిత. దీన్ని బట్టీ ఆమె ఎంత అకింతభావంతో వర్క్ చేస్తోరో అర్థం చేసుకోవచ్చు. అంతేనా.. ఈ ఏడాది ఆమె సూపర్ స్పీడ్.. కాదు కాదు జెట్‌స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు. మరి.. ఏక కాలంలో ఏడు సినిమాల్లో నటించడం అంటే మాములు విషయం కాదు కదా. ‘‘ఈ ఏడాది లైఫ్ రంగులరాట్నంలా తిరుగుతుంది. గత ఆరు నెలల నుంచి ఏక కాలంలో ఏడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను. నా వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం నైట్ షూట్లో పాల్గొంటున్నాను’’ అని పేర్కొన్నారు నందితా శ్వేతా. అంటే నందిత నాన్‌స్టాప్‌గా కెరీర్లో ముందుకెళ్తున్నారన్నమాట. రెండేళ్ల క్రితం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు తెరపై మెరిశారీ బ్యూటీ. ప్రస్తుతం నితిన్ హీరోగా ‘శతమానంభవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారు నందిత. మరో కథానాయికగా రాశీఖన్నా చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది. తమిళ సినిమా ‘నర్మద’లో తల్లి పాత్రలో యాక్ట్ చేస్తున్నారామె. -
తల్లి పాత్రలో...
ఎన్ ఫర్ ‘నర్మద’. ప్రస్తుతం ఇలాగే చెబుతున్నారు కథానాయిక నందితా శ్వేత. ఎందుకంటే ఆమె నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ఇది. ఇందులో ఏడేళ్ల బాబుకి తల్లి పాత్రలో నటించడానికి నందిత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. కథ బాగా నచ్చడంతో తల్లి పాత్ర చేయడానికి ఒప్పుకున్నారట. గీతా రాజ్‌పుత్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమా మంగళవారం ప్రారంభమైంది. ‘‘మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుంది. నందితకు ఇది డిఫరెంట్ క్యారెక్టర్’’ అన్నారు దర్శకుడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో మంచి అభినయంతో ప్రేక్షకుల మనసు దోచిన నందిత ఇప్పుడు నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీనివాస కల్యాణం’లో ఓ నాయికగా నటిస్తున్నారు. రాశీ ఖన్నా మరో నాయిక. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులోపు రిలీజ్ చేయాలనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. -
బ్యాడ్ గర్ల్
ట్రెడిషనల్ రోల్స్‌తో ఎంట్రీ ఇచ్చి, మెల్లిగా గ్లామరస్ రోల్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న అమలా పాల్ ఇప్పుడు కెరీర్‌ని యూ టర్న్ తిప్పారు. కొత్త క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్‌తో ప్రయోగాలు చేస్తున్నారు. తమిళంలో చేస్తున్న ‘అదో అంద పరవై పోల’లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ చేస్తున్న ఆమె ఇప్పుడు ఏకంగా బ్యాడ్ గర్ల్‌గా మారారట. ‘భలేభలే మగాడివోయ్, మహానుభావుడు’ సినిమాలకు కెమెరామేన్‌గా పని చేసిన నిజర్ షఫీ దర్శకుడిగా మారి తెలుగు–తమిళ్ బైలింగువల్ మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నందితా శ్వేత, శ్రద్ధ శ్రీనాథ్, అదితీ ఆర్య, అనీషా ఆంబ్రోస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులోనే అమలా పాల్ విలన్‌గా నటించనున్నారు. ఆమె పాత్ర 1950ల కాలంలో ఉంటుందట. ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు నిజర్ షఫీ కెమెరామేన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్‌లో రిలీజ్ కానుందని సమాచారం. -
రీమేక్ సినిమాతో వస్తున్న హ్యాండ్సమ్ హీరో
క్షణం సినిమాతో సైలెంట్ హిట్ కొట్టిన అడవి శేష్.. మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన చిన్న సినిమా చతురంగ వేట్టైని తెలుగు రీమేక్ చేస్తున్నాడు శేష్. సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణ్యం హీరోగా నటించిన ఈ సినిమా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది. వినోద్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాను గోపి గణేష్ దర్శకత్వంలో తెలుగులో రూపొందిస్తున్నారు. ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేం నందిత శ్వేత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఏప్రిల్‌లో సినిమాను ప్రారంభించి జూలైలో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.