Nandita Swetha Slams Who Abusive Comments on Her - Sakshi
Sakshi News home page

Naditha Shwetha: బాడీపై అసభ్య కామెంట్‌, నెటిజన్‌కు హీరోయిన్‌ దిమ్మతిరిగే సమాధానం

Published Mon, Feb 7 2022 7:38 PM | Last Updated on Tue, Feb 8 2022 7:21 AM

Nandita Swetha Counter To Netizen Who Comment On Her Photo - Sakshi

సోషల్‌ మీడియాలో సెలబ్రెటీలు ట్రోల్స్‌ బారిన పడటం సాధారణ విషయమే. మరి ఎక్కువగా నటీమణులు, హీరోయిన్లు తరచూ విమర్శలు ఎదుర్కొంటుంటారు. వారిని నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తుండగా.... మరికొందరు హద్దులు దాటి వారి శరీరాకృతిపై కామెంట్స్‌ చేస్తూ బాడీ షేమింగ్‌కు దిగుతుంటారు. అయితే నటీమణుల్లో కొందరు వీటిని చూసి చూడనంటూ వదిలేస్తే.. మరికొందరూ ఘాటుగా స్పందిస్తూ ట్రోలర్స్‌కు చురకలు అట్టిస్తారు. తాజాగా నటి నందిత శ్వేతాకు ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురైంది.

ఆమె షేర్‌ చేసిన ఓ ఫొటోపై నెటిజన్‌ బాడీ షేమింగ్‌ చేస్తూ కామెంట్‌ చేయడంతో అతడిపై మండిపడింది. స్లీవ్‌లెస్‌ గ్రే కలర్‌ టీ షర్ట్‌, ష్కర్ట్‌ ధరించి గొడకు వాలి నవ్వుతూ పైకి చూస్తున్న తన సైడ్‌ యాంగిల్‌ లుక్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇక దీనిపై ఆమె ఫ్యాన్స్‌, నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్‌ చేయగా ఓ ఆకతాయి తన శరీరాకృతిపై అసభ్యంగా స్పందించాడు. ప్లీజ్‌ మీరు శరీరంపై శ్రద్ధ పెట్టండి. మీ షేప్స్‌ చూసుకొండి ఓసారి. ఆంటీలా అవుతున్నావ్‌. కాస్తా వర్కౌట్స్‌ చేయ్‌’ అంటూ కామెంట్‌ చేశాడు. ఇది చూసిన నందిత అతడిపై మండిపడింది.

ఆ కామెంట్‌ను స్క్రిన్‌ షాట్‌ చేసి ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. ‘ఇలాంటి వాళ్లతో నరకం. మనుషులు ఇలా కూడా ఉంటారా?. నేను దేవతను కాదు.. నేను కూడా ఓ సామాన్య మనిషిని. అందరిలానే నాకు కూడా బాధలు ఉంటాయి.. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు.. నా శరీరాన్ని నేను ప్రేమిస్తాను.. ఇప్పుడు నేను ఉన్న స్థితిని, కనిపించే విధానాన్ని కూడా ఇష్టపడుతున్నాను’ అంటూ అతడికి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. కాగా నందిత ఎక్కడికి పోతావు చిన్నవాడా? మూవీ టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రం 2 మూవీ, అక్షర వంటి చిత్రాలతో పాటు తమిళంలోను పలు సినిమాల్లో నటించింది. ఇటీవల ఆమె ఐపీసీ 376 అనే సినిమాలో చేసింది. వీటితో పాటు పలు టీవీ షోలకు జడ్జీగా కూడా వ్యవహరిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement