నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్, సింగర్ సైంధవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. తామిద్దర పరస్పరం అంగీకారంతోనే విడిపోతున్నట్లు జీవీ ప్రకాశ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తమ నిర్ణయాన్ని గౌరవించాలని.. ప్రైవసీకి భంగం కలిగించొద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు. అయినప్పటికీ ఈ జంటపై ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ విమర్శిస్తున్నారు.
తాజాగా తమపై వస్తున్న ట్రోల్స్‌పై సింగర్ సైంధవి స్పందించింది. తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా యూట్యూబ్‌లో కొందరు వీడియోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నేను.. ప్రకాశ్ ఆలోంచించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అందరూ మా నిర్ణయాన్ని గౌరవించాలని అభ్యర్థించారు. ఇలా ఒకరిపై ఆరోపణలు చేయడం దారుణమని వాపోయారు. మేమిద్దరం 24 ఏళ్లుగా మంచి స్నేహితుల్లా ఉన్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ తమ స్నేహా బంధాన్ని కొనసాగిస్తామని సైంధవి పేర్కొన్నారు. కాగా.. అంతకుముందే ట్రోల్స్ పట్ల జీవీ ప్రకాశ్ సైతం స్పందించారు. దయచేసి తమ పట్ల ట్రోల్స్ చేయడం సరైంది కాదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment