GV Prakash kunar
-
భర్తతో విడాకులు.. ట్రోల్స్ చేయడం దారుణమన్న సింగర్!
నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్, సింగర్ సైంధవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. తామిద్దర పరస్పరం అంగీకారంతోనే విడిపోతున్నట్లు జీవీ ప్రకాశ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తమ నిర్ణయాన్ని గౌరవించాలని.. ప్రైవసీకి భంగం కలిగించొద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు. అయినప్పటికీ ఈ జంటపై ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ విమర్శిస్తున్నారు.తాజాగా తమపై వస్తున్న ట్రోల్స్‌పై సింగర్ సైంధవి స్పందించింది. తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా యూట్యూబ్‌లో కొందరు వీడియోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నేను.. ప్రకాశ్ ఆలోంచించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అందరూ మా నిర్ణయాన్ని గౌరవించాలని అభ్యర్థించారు. ఇలా ఒకరిపై ఆరోపణలు చేయడం దారుణమని వాపోయారు. మేమిద్దరం 24 ఏళ్లుగా మంచి స్నేహితుల్లా ఉన్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ తమ స్నేహా బంధాన్ని కొనసాగిస్తామని సైంధవి పేర్కొన్నారు. కాగా.. అంతకుముందే ట్రోల్స్ పట్ల జీవీ ప్రకాశ్ సైతం స్పందించారు. దయచేసి తమ పట్ల ట్రోల్స్ చేయడం సరైంది కాదని హితవు పలికారు. -
'కెప్టెన్ మిల్లర్' నుంచి ఎమోషనల్ లవ్ సాంగ్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్ జోడీగా తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. 1930-40ల నేపథ్యంలో సాగే పీరియాడికల్ కథాంశంతో అరుణ్ మాథేశ్వరన్ డైరెక్ట్ చేశాడు. జి.శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘క్రీ నీడలే’ అంటూ సాగే ఈ పాటను జావేద్ అలీ ఆలపించారు. ఇందులోని లిరిక్స్‌తో విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, మొదటి పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగగా తాజాగా విడుదలైన ఈ సాంగ్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. యుద్ధభూమిలో కెప్టెన్ మిల్లర్‌గా ధనుష్ కనిపిస్తున్న ఈ చిత్రంలో డాక్టర్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ పవర్ ఫుల్ పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాష్ కుమార్ అందించారు. -
యదార్థ సంఘటన ఆధారంగా వస్తోన్న 'రెబెల్'!
తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రెబెల్. నటి మమితా బైజూ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. నికేశ్ ఆర్ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న రెబల్ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్ర ఫస్ట్ పోస్టర్‌ను హీరో శింబు విడుదల చేశారు. ఈ సినిమాను 1980 ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించినట్లు చిత్ర దర్శకుడు నికేష్ ఆర్ఎస్ తిరుపతి తెలిపారు. కాలేజీ నేపథ్యంలో సాగే రాజకీయాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా రెబల్ చిత్రం ఉంటుందన్నారు. ఇది జీవీ ప్రకాష్ కుమార్ సినీ కెరియర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సినీ వర్గాలు, ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. రెబల్ చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా చెప్పారు. ఈ చిత్రంలో కరుణాస్, సుబ్రహ్మణ్య శివ, షాలు రహీం, వెంకటేష్, దీప్తీ ఆదిత్య భాస్కర్, కల్లూరి వినోద్, అదిరా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. #rebel first look is here … a super promising script from a debutant director @NikeshRs …. Joining hands wit my fav @StudioGreen2 after the success of #darling amd #trishaillananayanthara @kegvraja @NehaGnanavel @Dhananjayang #rebel @arunkrishna_21 pic.twitter.com/RK0Ok1NQNX — G.V.Prakash Kumar (@gvprakash) October 26, 2023 -
హిట్ జోడీ రిపీట్.. హాట్ బ్యూటీ మళ్లీ ఆ హీరోతో!
మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరోగా చేస్తూ అలరిస్తున్న జీవీ ప్రకాష్ కుమార్.. ఈ మధ్యే 'అడియే' సినిమాతో హీరోగా మరో హిట్ కొట్టేశాడు. అంతకు ముందు 'బ్యాచిలర్' మూవీతో సక్సెస్ అందుకున్నాడు. అందులో జీవీ సరసన హాట్ బ్యూటీ దివ్యభారతి హీరోయిన్గా చేసింది. ఈ సినిమాలో ముద్దులు, రొమాన్స్ కి మించి యాక్టింగ్ తో ఈ కాంబో అదరగొట్టేసింది. ఇప్పుడు వీళ్లిద్దరో మరోసారి జోడీగా కనిపించనున్నారట. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.100 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే!) 'అడియే' తర్వాత జీవీ ప్రకాష్ హీరోగా నటిస్తున్న సినిమా 'కింగ్స్టన్'. జీవీ నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాంటసీ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఉండనుందని తెలుస్తోంది. ఇందులోనే దివ్యభారతి హీరోయిన్ అని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశముంది. (ఇదీ చదవండి: యాంకర్ సుమ కొడుకు మూవీ టీజర్ చూశారా?) -
ఐశ్వర్య రాజేశ్ తాజా చిత్రం.. హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన చిత్రం 'డియర్'. నట్ మెగ్ ఫ్రాడక్షన్‌న్స్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జీ.పృథ్వీరాజ్ కలిసి నిర్మించారు. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కాళీ వెంకట్, ఇళవరసు, నటి రోహిణి, గీతా కై లాసం, తలైవాసల్ విజయ్, బ్లాక్‌షిప్ నందిని ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జీవీ. ప్రకాష్‌కుమార్ సంగీతమందించగా.. జగదీష్ చంద్రమూర్తి ఛాయాగ్రహణం అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇది చదవండి: బుల్లితెర నటుడి నిశ్చితార్థం.. వీడియో వైరల్) ఈ చిత్ర విడుదల హక్కులను రోమియో పిక్చర్స్ సంస్థ పొందడం విశేషం. ప్రముఖ చిత్రం నిర్మాణ సంస్థగా పేరు గాంచిన రోమియో పిక్చర్స్ అధినేత పలు విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారన్నది గమనార్హం. ఇంతకుముందు నేర్కండ పారువై, వలిమై, నెంజుక్కు నీతి, వీట్ల విశేషం, ట్రిక్కర్, తుణివు, డైనోసర్స్ వంటి పలు విజయవంతమైన చిత్రాలు విడుదలయ్యాయి. కాగా ఈ సంస్థ తాజాగా డియర్ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంతకుముందు చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు ఓ ప్రకటనలో నిర్వాహకులు తెలిపారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. జగదేకవీరుడు.. అతిలోకసుందరి నటుడు మృతి! ) #DeAr - Tamil Nadu theatrical rights bagged by #RomeoPictures. Get ready for exciting updates soon!#DearWithRomeoPictures @aishu_dil @mynameisraahul @tvaroon @NutmegProd @Anand_Rchandran #AbhishekRamisetty @jagadeesh_s_v @editor_rukesh @narentnb @proyuvraaj pic.twitter.com/B9q4BJkcqS — G.V.Prakash Kumar (@gvprakash) August 31, 2023 -
బైక్ రేస్ నేపథ్యంలో సిద్దార్థ్ మూవీ
‘ట్రాఫిక్ రేస్‌లో నడిపే బండి ముఖ్యం కాదు.. ఎవరు నడుపుతున్నారన్నదే ముఖ్యం, మీరు ఇల్లీగల్ రేసింగ్ చేస్తున్నారు, మన దేశం గురించి తెలుసుకోవాలంటే ఒక్కొక్కళ్ల ఇంటికి వెళ్లక్కర్లేదు సర్.. రోడ్లు చెప్పేస్తాయ్ దేశం గురించి’ వంటి డైలాగులతో ‘ఒరేయ్ బామ్మర్ది’ టీజర్ విడుదలైంది. ‘బొమ్మరిల్లు’ ఫేమ్ సిద్ధార్థ్ , సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’. ‘బిచ్చగాడు’ ఫేమ్ శశి దర్శకత్వం వహించారు. కశ్మీరా పరదేశి, లిజోమోల్ జోస్ కథానాయికలు. రమేష్ పి. పిళ్లై నిర్మించిన ఈ సినిమాని శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌పై ఏ.ఎన్ బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. టీజర్‌ని బట్టి చూస్తే బైక్ రేస్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఏ.ఎన్ బాలాజీ మాట్లాడుతూ – ‘‘యాక్షన్ ఓరియంటెడ్ మూవీ ఇది. సిద్ధార్థ్, ప్రకాష్ పోటాపోటీగా నటించారు. వీరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ఇప్పటికే విడుదలైన ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్స్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన టీజర్ కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. -
జీవీ నుంచి మరో హాలీవుడ్ సాంగ్
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్ రూపొందించిన హాలీవుడ్ ఆల్బమ్ నుంచి మరో ఇంగ్లిష్ సాంగ్ విడుదలకు సిద్ధమైంది. సంగీత దర్శకుడిగా, నటుడిగా కోలీవుడ్‌లో విజయవంతమైన పయనాన్ని సాగిస్తున్న జీవీ ఇప్పుడు ఇంగ్లిషు పాటల ఆల్బమ్‌తో హాలీవుడ్ సంగీత ప్రియులను కూడా అలరించడానికి సిద్ధమయ్యారు. ఈయన సూరరై పోట్రు చిత్రానికి సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం దీపావళి సందర్భంగా అమెజాన్ ప్రైమ్ టైంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంటోంది. ఇందులో జీవీ సమకూర్చిన సంగీతానికి మంచి ప్రశంసలు వస్తున్నాయి. జీవీ ఇటీవల ‘గోల్డ్ నైట్స్’ పేరుతో ఒక ఇంగ్లిష్ ఆల్బమ్‌ను రూపొందించారు. అందులోని ‘హై అండ్ డ్రై’ అనే పాటను గత సెప్టెంబర్ 17వ తేదీన విడుదల చేయగా యువతను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో అదే ఆల్బంలోని ‘క్రయింగ్ అవుట్’ అనే మరో పాటను ఈనెల 19న నటుడు ధనుష్ చేతుల మీదగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ పాటను జీవీ, కెనడాకు చెందిన జూలియా గర్దా కలిసి పాడడం విశేషం. -
నిఘా కెమెరాలను వితరణ చేసిన జీవీ
పెరంబూరు: యువ సంగీత దర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ గురువారం పొల్లాచ్చి ప్రాంతానికి 50 సీసీ కెమెరాలను వితరణ చేశారు. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈయన నటించిన కుప్పత్తురాజా గతవారం తెరపైకి వచ్చింది. ఈ శుక్రవారం జీవీ నటించిన వాచ్మెన్ తెరపైకి వచ్చింది. త్వరలో 100 శాతం లవ్ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా విజయ్ దర్శకత్వం వహించిన వాచ్‌మన్ చిత్రాన్ని గురువారం నగరంలోని 300 మంది విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించారు. పూర్తి వినోదభరితంగా సాగే ఈ చిత్రాన్ని విద్యార్థులు చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ చూశారని ఆ చిత్ర కథానాయకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సాలిగ్రామంలోని బాలలోక్ పాఠశాలలోని విద్యార్థులను కలిసి వారితో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాచ్మెన్ చిత్ర ఆడియా ఆవిష్కరణ సమావేశంలో పొల్లాచ్చి గ్రామానికి 50 సీసీ కెమెరాలను అందిస్తానని ప్రకటించానని, ఆ విధంగా 50 సీసీ కెమెరాలను ఆ గ్రామానికి అందించినట్లు తెలిపారు. ఇటీవల పొల్లాచ్చిలో జరిగిన అత్యాచార సంఘటన ఆవేదనను కలిగించిందన్నారు. మానసిక రోగులే అలాంటి అఘాయిత్యాలకు పాల్పడతారని అన్నారు. విద్యార్థులు అవగాహనతో మెలగాలని, తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్త వహించాలని జీవీ పేర్కొన్నారు. అదే విధంగా విదేశాల్లో లైంగిక అవగాహన గురించిన పాఠ్యాంశాలను పాఠశాలల్లో ప్రవేశ పెడుతున్నారని, అలాంటి అవగాహనతో కూడిన పాఠ్యాంశాలు మన దేశంలో కూడా ప్రవేశపెడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని జీవీ.ప్రకాశ్‌కుమార్ వ్యక్తం చేశారు. -
ఇంగ వాంగ
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా మళ్లీ తమిళ డైలాగ్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్నారు. అవును.. ఆమెకు కోలీవుడ్ నుంచి మళ్లీ ‘ఈషా.. ఇంగ వాంగ’ అని కబురు వచ్చింది. అంటే.. ఈషా.. ఇక్కడికి రండి అని అర్థం. ‘వైలేయున్ను వందుట్టా వెళ్లక్కారన్, సరవణన్ ఇరుక్క భయమేన్’ వంటి తమిళ సినిమాలకు దర్శకత్వం వహించిన ఏళిల్ దర్శకత్వంలో నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయికగా ఈషా రెబ్బాను తీసుకున్నారు. హారర్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఇంతకుముందు ‘ఓయ్’ (2016) అనే తమిళ సినిమాలో నటించారు ఈషా రెబ్బా. -
సర్వం తాళమయం
సంగీత ప్రధానంగా సాగే సినిమా అంటే కళా తపస్వి కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘శంకరా భరణం, శృతిలయలు, సాగర సంగమం’ వంటి సినిమాలు గుర్తుకొస్తాయి. అలాంటి సినిమాలు చూసినపుడు.. సినిమా ఎలా ఉంది అంటే ‘సర్వం తాళమయం’ అంటారు. ఇప్పుడు అదే టైటిల్‌తో సంగీత సరస్వతితో ఎంతో అనుబంధం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన జీవీ ప్రకాశ్ కుమార్ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు అనే ట్యాగ్ నుంచి త్వరగానే బయటపడి సంగీతదర్శకుడిగా మంచి పేరు తెచ్చుకుని, ఇప్పుడు హీరోగానూ దూసుకెళుతున్నారు జీవీ. ‘సర్వం తాళమయం’లో ఆయనకు జోడీగా అపర్ణ బాలమురళీ నటిస్తున్నారు. రాజీవ్ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మైండ్ స్క్రీన్స్ పతాకంపై ఆయన భార్య లత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో జీవీ ప్రకాశ్ చేతిలో మృదంగంతో సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా ఉన్నారు. రవి యాదవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రాకేందు మౌళి సాహిత్యాన్ని అందిస్తున్నారు. డిసెంబర్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
శ్రీదివ్య చిత్రాలు విడుదల ఎప్పుడో!
లక్కుంటే లక్ష్మి వరిస్తుంది. మరి ముఖం చాటేస్తే? వచ్చేది చిం తే. ప్రస్తుతం నటి శ్రీదివ్య ను అలాంటిదే పట్టింద ట. వరుత్తపడాద వాలిభ ర్ సంఘం చిత్రంతో అనూ హ్య విజయాన్ని తన ఖాతా లో వేసుకుని రాశిగల నటి అ ని ముద్ర వేసుకున్న ఈ అచ్చ తెలుగు అమ్మాయికి ఆ తరువాత విడుదలైన జీవా చిత్రం కూడా హి ట్ అని పించుకోవడం, వరుసగా అ వకాశాలు వచ్చిపడడంతో అమ్మడికి భవిష్యత్ ఉజ్వలంగా కనిపించింది. దీంతో ఒక పెద్ద హీరో చిత్రాన్నికూడా నిరాకరించారనే ప్రచారం జరిగింది. కాగా శ్రీదివ్య నటించిన రెండు చిత్రాల విడుదల ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారడంతో అమ్మడి మనసు బాధపడుతోందట. దీని గురించి శ్రీదివ్య మాట్లాడుతూ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కునార్ సరసన నటించిన పెన్సిల్, అధర్వతో నటించిన ఈటీ చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చే సుకున్నా వాటి విడుదల ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంది. ఈ రెండు చిత్రాల్లో తనకు బలమైన పాత్రలు లభించాయని చెప్పింది. దీంతో దర్శకుడు చెప్పకపోయినా తాను చాలా హోమ్‌వర్క్ చేసి నటించానని అంది. అలాంటి చిత్రాలు విడుదల కాకపోవడం బాధగా ఉందని పే ర్కొంది. విషయం ఏమిటంటే పెన్సిల్ చిత్రం విడుదల కష్టమే అని జీవీనే ఇటీవల అనడం గమనార్హం. ఇక ఈటీ చిత్ర విషయానికొస్తే అధర్వ నటించిన చండీ వీరన్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఆ తరువాత ఈటీ విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇది శ్రీదివ్యకు కాస్త ఊరటనిచ్చే వార్తే అవుతుందనుకుంటా.