
జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం కింగ్‌స్టన్. ఈ సినిమాకు కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించారు. ఈ సీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై జీవీ ప్రకాష్ కుమార్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 7న సినిమా థియేటర్లలోకి రానుంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే సముద్ర తీర గ్రామం చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మార్చి 7న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ కీలక పాత్రలు పోషించారు.