కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తాజా చిత్రం విదాముయార్చి(Vidaamuyarchi Movie). ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌తో నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
కాగా.. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమా అంతా అజర్ బైజాన్‌లోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో కార్లతో అజిత్ స్టంట్స్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా అర్జున్ సర్జాతో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూస్తుంటే మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికే విదాముయార్చి విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
కారు రేస్ గెలిచిన అజిత్..
ఇటీవల దుబాయ్‌లో జరిగిన 24హెచ్ కారు రేసులో అజిత్ టీమ్ మూడోస్థానంలో నిలిచింది. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత అజిత్ తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. దీంతో అజిత్ టీమ్‌పై సినీ తారలు ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన అనంతరం అజిత్ జాతీయజెండా పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు.
అజిత్ కుమార్‌కు ప్రమాదం..
రేసు ప్రారంభానికి ముందే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అజిత్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..
అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్‌గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
Persistence is the path, Victory is the destination. 💥 The VIDAAMUYARCHI & PATTUDALA Trailer is OUT NOW. ▶️
🔗 Tamil - https://t.co/zKlPqI9XGE
🔗 Telugu - https://t.co/mYt21igQIs
FEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar… pic.twitter.com/wTL2C1tZHP— Lyca Productions (@LycaProductions) January 16, 2025
Comments
Please login to add a commentAdd a comment