
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే తొలిరోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కు దాటేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ.. రెండొందల మార్క్ దిశగా దూసుకెళ్తోంది.
ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.170 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రదీప్ రంగనాథన్ తమిళ సూపర్ హిట్ మూవీ డ్రాగన్ సాధించిన లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసింది. కేవలం ఐదు రోజుల్లోనే ఆ సినిమాను అధిగమించింది. డ్రాగన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.152 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలవనుంది. కాగా.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వీకెండ్ తర్వాత సోమవారం రూ. 15 కోట్ల నెట్ వసూలు చేసి.. ఐదు రోజుల్లోనే రూ. 101.3 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.
(ఇది చదవండి: ఇళయరాజా నోటీసులు.. రూ.5 కోట్లు డిమాండ్ )
కాగా.. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు. టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో అలరించదగా.. అర్జున్ దాస్ ప్రతినాయకుడిగా మెప్పించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.