![Ajith Kumar Vidaamuyarchi box office Collections On Day 1](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/ajith.jpg.webp?itok=okhIGIz2)
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విదాముయార్చి యాక్షన్-థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అజిత్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. తొలిరోజే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. దేశవ్యాప్తంగా రూ.22 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది.
గతేడాది వచ్చిన అజిత్ మూవీ తునివు(తెగింపు) వసూళ్లను మాత్రం విదాముయార్చి అధిగమించలేకపోయింది. తునివు చిత్రం మొదటి రోజే రూ. 24.4 కోట్ల నికర వసూళ్లను సాధించింది. విదాముయార్చి కేవలం రూ.22 కోట్ల నెట్ కలెక్షన్స్‌కే పరిమితమైంది. అయితే వీకెండ్స్‌లోనైనా ఈ మూవీ వసూళ్లపరంగా రాణిస్తుందేమోనని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీ పరంగా చూస్తే ఉదయం 58.81 శాతం, మధ్యాహ్నం 60.27 శాతం, సాయంత్రం షోలలో 54.79 శాతంగా నమోదైంది. తిరుచ్చి, పాండిచ్చేరిలలో చెన్నై కంటే ఎక్కువగా 92 శాతం, 91.67 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా.. న్నైలో 88.33 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడిచాయి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment