రజినీకాంత్‌ 'వెట్టైయాన్‌'.. ట్రైలర్ వచ్చేసింది! | Rajinikanth Latest Movie Vettaiyan Trailer Out Now | Sakshi
Sakshi News home page

Vettaiyan Trailer: సూపర్ స్టార్ 'వెట్టైయాన్‌'.. ట్రైలర్ వచ్చేసింది!

Published Wed, Oct 2 2024 5:14 PM | Last Updated on Wed, Oct 2 2024 5:28 PM

Rajinikanth Latest Movie Vettaiyan Trailer Out Now

సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన తాజా చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానలేల్ డైరెక్షన్‌లో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరెకెక్కించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించింది. ఇప్పటికే రిలీజైన 'మనసియాలో' అనే సాంగ్‌ తలైవా ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. తాజాగా వేట్టైయాన్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

(ఇది చదవండి: ఆస్పత్రిలో రజినీకాంత్‌.. కోలుకోవాలంటూ విజయ్ ట్వీట్!

కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ కూడా ాకనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ దసరాకు అక్టోబర్ 10 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ మూవీలో ఫాహాద్‌ ఫాజిల్‌, రితికా సింగ్‌, మంజు వారియర్‌, దుషారా విజయన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement