ఎకానమీ క్లాస్‌లో సూపర్‌ స్టార్‌.. వీడియో వైరల్! | Superstar Rajinikanth Flies Economy On IndiGo Flight | Sakshi
Sakshi News home page

Rajinikanth: కడప ఎయిర్‌పోర్ట్‌లో రజినీకాంత్‌.. ఎకానమీ క్లాస్‌లో వెళ్తూ!

Mar 1 2024 3:50 PM | Updated on Mar 1 2024 3:59 PM

Super Star Rajinikanth Flies Economy On IndiGo Flight - Sakshi

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల లాల్ సలామ్ సినిమాలో మెప్పించారు. ఐశ్వర్య రజినీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో కీ రోల్ పోషించారు. గతనెల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఆయన ప్రస్తుతం వెట్టైయాన్ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. 

ఇదిలా ఉండగా.. తాజాగా తలైవా కడప ఎయిర్‌పోర్ట్‌లో మెరిశారు. ఓ సామాన్యుడిలా ఎకానమీ క్లాస్‌లో దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన తలైవా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దటీజ్ సూపర్ స్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఓ ప్రయాణికుడు ట్విటర్‌లో రాస్తూ.. నేను దేవుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నాను అంటూ పోస్ట్ చేశాడు. అదే ఫ్లైట్‌లో ఉన్న నటుడు జీవా కూడా ఉన్నారు. 

ఆ తర్వాత రజనీకాంత్ బస్సులో ప్రయాణిస్తున్న వీడియోను నటుడు జీవా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. రజనీకాంత్, జీవా బస్సులో నిలబడి ఉన్న ఫోటోలు, వీడియోలు కూడా వైరలయ్యాయి. సీసీఎల్ కోసం చెన్నై రైనోస్ టీమ్‌తో కలిసి వీరిద్దరు బస్సులో వెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement