రజినీకాంత్ వేట్టయాన్‌.. ఓటీటీకి అంత త్వరగానా? | Rajinikanth's Vettaiyan OTT Streaming Likely On This Date Goes Viral | Sakshi
Sakshi News home page

Vettaiyan OTT Release: రజినీకాంత్ వేట్టయాన్‌.. ఓటీటీకి ఆ రోజు నుంచేనా?

Published Mon, Oct 21 2024 3:01 PM | Last Updated on Mon, Oct 21 2024 3:08 PM

Rajinikanth's Vettaiyan OTT Streaming Likely On This Date Goes Viral

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ  చిత్రం తొలిరోజే మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. సినిమా రిలీజైన  రోజు నుంచి ఇప్పటి వరకు రూ.134 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంది.

తాజాగా వేట్టయాన్ మూవీ ఓటీటీ విడుదలపై అప్పుడే టాక్ మొదలైంది. రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీకి రానుందని నెట్టింట చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వేట్టయాన్‌ బాక్సాఫీస్ వద్ద రెండో వారంలోకి అడుగుపెట్టింది. విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఈ మూవీ నవంబర్‌ 7న లేదా 9న ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: రజినీకాంత్ వేట్టయాన్‌.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!)

కాగా.. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోకి దక్కించుకుంది. దసరా సందర్భంగా అక్టోబరు 10న వెట్టయాన్ తెరపైకి వచ్చింది. నాలుగు వారాల తర్వాత అంటే ఈ దీపావళి తర్వాత ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ సినిమాలో మంజు వారియర్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, కిశోర్‌, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజయ్‌, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement