ఓటీటీలో వేట్టయాన్‌.. దీపావళి కానుక ప్రకటించిన మేకర్స్‌ | Vettaiyan Movie OTT Streaming Date Locked, Officially Announced | Sakshi
Sakshi News home page

ఓటీటీలో వేట్టయాన్‌.. దీపావళి కానుక ప్రకటించిన మేకర్స్‌

Published Thu, Oct 31 2024 10:25 AM | Last Updated on Thu, Oct 31 2024 10:45 AM

Vettaiyan Movie OTT Streaming Date Locked, Officially Announced

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘వేట్టయాన్‌’ ఓటీటీ ప్రకటన అధికారికంగా వచ్చేసింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 420 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టిందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.  అక్టోబర్‌ 10న  విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, కిశోర్‌, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజయ్‌, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్‌ రవిచందర్‌  సంగీతం అందించారు.

వేట్టైయన్ నవంబర్ 8న ఓటీటీలో విడుదల కానున్నట్లు అమెజాన్‌ ప్రైమ్ వీడియో అధికారికంగా సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్‌,కన్నడ,మలయాళం,హిందీ భాషలలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు ఒక పోస్టర్‌ను పంచుకుంది. అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్‌ హక్కులను రూ. 90 కోట్లకు ఆ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. 

కథేంటంటే.. 
ఎస్పీ అదియన్‌ (రజనీకాంత్‌) ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్‌ (ఫహద్‌ ఫాజిల్‌) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్‌ టీచర్‌ శరణ్య(దుషారా విజయన్‌)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్‌ని అదియన్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్‌లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌ ఎస్సీ హరీశ్‌ కుమార్‌(కిశోర్‌)కి అప్పగిస్తారు.

ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్‌ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో  సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత రావడంతో డీజీడీ శ్రీనివాస్‌(రావు రమేశ్‌) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్‌ న్యాయమూర్తి సత్యదేవ్‌(అమితాబ్‌ బచ్చన్‌) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్‌ ఎలా కనిపెట్టాడు?  ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement