ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ చేసుకున్న వెట్టయాన్.. భారీ ధరకు రైట్స్! | Rajinikanth Vettaiyan Ott Partner Locked with This Platform | Sakshi
Sakshi News home page

Vettaiyan Ott Partner: రజినీకాంత్ వెట్టయాన్.. ఆ ఓటీటీకే డిజిటల్ రైట్స్!

Published Thu, Oct 10 2024 7:09 PM | Last Updated on Thu, Oct 10 2024 7:27 PM

Rajinikanth Vettaiyan Ott Partner Locked with This Platform

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్‌  దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ మూవీతో అమితాబ్‌తో పాటు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. వేట్టయాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ చిత్రం విడుదలైన ఆరు వారాల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు. అంటే నవంబర్ చివర్లో ఓటీటీకి వచ్చే అవకాశముంది. తెలుగులోనూ అదే టైటిల్‌తో ఈ మూవీని రిలీజ్ చేశారు మేకర్స్. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement