Vettaiyan Movie
-
93% సినిమాలు ఫ్లాప్.. వెయ్యి కోట్ల నష్టం.. నిర్మాతల కంట రక్తకన్నీరు!
రిలీజైన ప్రతి సినిమా హిట్టవదు. కంటెంట్‌లో దమ్మున్నవి మాత్రమే హిట్టు, సూపర్ హిట్టుగా నిలుస్తాయి. కథలో ఏమాత్రం పస లేకపోయినా సినిమాను నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తారు. అలా తమిళ సినిమాలోనూ వందల సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించారు. 2024లో తమిళ ఇండస్ట్రీలో విడుదలైన సినిమాలెన్ని? (Kollywood Box Office Report - 2024) లాభనష్టాలేంటి? అనేవి ఓసారి చూసేద్దాం..రూ.1000 కోట్ల నష్టంకోలీవుడ్ (Tamil Cinema Industry)లో గతేడాది 241 సినిమాలు రిలీజయ్యాయి. వీటికోసం తమిళ ఫిలిం మేకర్స్ దాదాపుగా రూ.3000 కోట్లు ఖర్చుపెట్టారు. ఖర్చుకు వెనకాడకుండా సినిమాలు తీసిన నిర్మాతలకు బాక్సాఫీస్ దగ్గ భంగపాటు ఎదురైంది. ఏకంగా 223 సినిమాలు బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేకపోయాయి. దీంతో వెయ్యి కోట్ల మేర నష్టం వాటిల్లింది. సూర్య, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి హీరోల సినిమాలు సైతం చతికిలపడ్డాయి. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన కంగువా రూ.1000 కోట్లు రాబడుతుందనుకున్నారు. అతి కష్టమ్మీద రూ.100 కోట్లు!తీరా చూస్తే కేవలం రూ.106 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అలాగే టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఇండియన్ 2 సినిమా (Indian 2 Movie)ను రూ.250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. చివరకు ఇది కూడా కంగువా బాటలోనే పయనించింది. రూ.150 కోట్లకంటే ఎక్కువ రాబట్టలేకపోయింది. రజనీకాంత్ వేట్టైయాన్ చిత్రాన్ని సైతం ప్రేక్షకులు ఇలాగే తిరస్కరించారు.చదవండి: పెళ్లి వద్దనుకుని 'కళార్పణ'కు అంకితమైన శోభన93% సినిమాలు ఫ్లాప్2024లో కేవలం 18 చిత్రాలు మాత్రమే హిట్టయ్యాయి. ఈ లెక్కన గతేడాది 93% చిత్రాలు ఫ్లాప్ లిస్ట్‌లో చేరిపోగా ఏడు శాతం మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఆ సక్సెస్ జాబితాలో అమరన్ (Amaran Film), ద గోట్, రాయన్ వంటివాటితో పాటు లబ్బర్ పందు, గరుడన్, డిమాంటి కాలనీ 2, వాళై చిత్రాలూ ఉన్నాయి. 2025కి తమిళ ఇండస్ట్రీ శుభారంభం పిలికింది. మదగజరాజ, కుడుంబస్తాన్ చిత్రాలు హిట్లుగా నిలిచాయి. కానీ గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌గా నిలిచింది.ఆశలన్నీ ఈ ఏడాదిపైనే!2023లో జైలర్, పొన్నియన్ సెల్వన్ 2 వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కాసులవర్షం కురిపించాయి. కానీ 2024లో మాత్రం ఇండియన్ 2, కంగువా, వేట్టైయాన్ వంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడ్డాయి. ద గోట్, అమరన్, మహారాజా, రాయన్, అరణ్మణై 4 వంటి కొన్ని చిత్రాలు మాత్రమే హిట్టందుకున్నాయి. 2024 అత్యంత చెత్త సంవత్సరంగా నిలిచింది. 2025లో ఈ పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నాం.- నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ జి. ధనాంజనేయన్చదవండి: Madha Gaja Raja Review: ‘మదగజరాజా’ మూవీ రివ్యూ -
వేట్టయన్, కంగువా, సినిమాల ఎఫెక్ట్.. కోలీవుడ్ కీలక నిర్ణయం
ఇండియన్2, వేట్టయన్, కంగువా సినిమా ఫలితాలతో తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాలు అనుకున్నంత స్థాయిలో రానించలేదు. దీంతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా నష్టాలు తప్పలేదు. సినిమా బాగున్నప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక అంచనాకు వచ్చింది.సినిమా విడుదలైన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్, నెటిజన్లు ఇచ్చే రివ్యూలు సినిమా రిజల్ట్‌పై పడుతుందని కోలీవుడ్ నిర్మాతలు గ్రహించారు. భారీ బడ్జెట్‌తో ఈ ఏడాదిలో తెరకెక్కిన సినిమాలపై వారి రివ్యూలు చాలా ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఇండియన్2. వేట్టయాన్,కంగువా సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే పలు యూట్యూబ్ ఛానల్స్ తెరపైకి వచ్చాయి. మూవీ బాగలేదంటూ రివ్యూలు ఇవ్వడం చేశాయి. దీంతో ఈ చిత్రాలపై చాలా ప్రభావం చూపింది. భవిష్యత్‌లో ఇండస్ట్రీకి ఇదొక సమస్యగా మారుతుందని వారు భావించారు. దీనిని అరికట్టేందుకు థియేటర్ యజమానులు ముందుకు రావాలని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. కొత్త సినిమా విడుదలైన రోజున థియేటర్ ప్రాంగణంలోకి యూట్యూబ్ ఛానల్స్ వారిని అనుమతించరాదని వారు తెలిపారు. పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని పేర్కొంది. రివ్యూల పేరుతో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలను దూషించినా వదిలిపెట్టమని వారు హెచ్చరించారు.కంగువా, సినిమా విడుదల సమయంలో ఫస్ట్ డే నాడే దారుణమైన రివ్యూలు ఇవ్వడంతో రెండోరోజు సినిమాకు వెళ్లే వారిపై ప్రభావం చూపింది. ఇందులో సూర్య నటన బాగుంది అంటూనే.. సినిమా ఏమాత్రం బాగాలేదని కామెంట్లు చేశారు. ఈ విషయంపై నటి జ్యోతక కూడా రియాక్ట్ అయింది. కంగువా సినిమాపై వచ్చిన నెగటివ్ రివ్యూలు చూసి తాను ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపింది. ఒకరకంగా ఈ రివ్యూల వల్లే సినిమాకు మైనస్ అయిందని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా మొదటిరోజే ఇంతటి నెగిటివ్ రివ్యూలు చూడటం బాధగా ఉందని తెలిపింది. కానీ, ఈ చిత్రంలోని పాజిటివ్స్‌ను ఎవరూ చెప్పలేదని ఆమె పేర్కొంది. -
ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఏది ఎందులో?
చాలారోజుల ఓటీటీలు కళకళలాడిపోతున్నాయి. ఎందుకంటే ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు హిట్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. వీటిలో ఎన్టీఆర్, రజనీకాంత్, సమంత.. ఇలా స్టార్ హీరోహీరోయిన్లు నటించిన పలు చిత్రాలు ఉండటం విశేషం. ఇవన్నీ ఒకటి రెండు రోజుల్లో ఓటీటీల్లోకి రావడంతో మూవీ లవర్స్ ఉబ్బితబ్బిబయిపోతున్నారు. ఇంతకీ ఏది ఏ ఓటీటీలో ఉందంటే?దేవరఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ 'దేవర'.. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తీసిన ఈ సినిమాలో ఫైట్స్, సాంగ్స్ అదిరిపోయాయి. జాన్వీ కపూర్ అందాల గురించి చెప్పేదేముంది. సినిమా చూస్తే మీరే ఫిదా అయిపోతారు. అక్కడక్కడ చిన్న లోపాలు ఉన్నప్పటికీ తారక్-అనిరుధ్ తమదైన శైలిలో అదరగొట్టేశారు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్)వేట్టయన్రజనీకాంత్, అమితాబ్, రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియన్.. ఇలా బోలెడంత మంది స్టార్స్ నటించిన 'వేట్టయన్'.. అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ఫేక్ ఎన్ కౌంటర్ అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా.. థియేటర్లలో తెలుగు వరకు అంతంత మాత్రంగానే ఆడింది. ఓటీటీలో కాబట్టి ఆడుతూపాడుతూ చూసేయొచ్చు.జనక అయితే గనకయంగ్ హీరో సుహాస్ లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. పిల్లలు వద్దనుకునే ఓ మధ్య తరగతి వ్యక్తి.. తండ్రి అయ్యాయని తెలిసి కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు. ఏకంగా కోటి రూపాయల దావా వేస్తాడు. బోల్డ్ సబ్జెక్టే కానీ డైరెక్టర్ బాగానే డీల్ చేశారు. కాకపోతే కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఓటీటీలోనే కాబట్టి ఓ లుక్ వేయొచ్చు.(ఇదీ చదవండి: ‘జితేందర్ రెడ్డి’ మూవీ రివ్యూ)సిటాడెల్: హనీబన్నీసమంత నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఆరు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్.. అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సిరీస్‌పై మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో సమంత లిప్ లాక్ కూడా ఇచ్చేసింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఏఆర్ఎమ్ఇది మలయాళ డబ్బింగ్ సినిమా. పీరియాడికల్ కాన్సెప్ట్‌తో తీశారు. '2018' మూవీతో మనకు కాస్త పరిచయమైన టొవినో థామస్ హీరో. హాట్‌స్టార్‌లో ప్రస్తుతం తెలుగులోనే అందుబాటులో ఉంది. కాస్త టైముంది డిఫరెంట్‌గా ఏదైనా చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు. ఇలా ఈ వీకెండ్లో ఐదు సినిమాలు డిఫరెంట్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు) -
'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. కాకపోతే ఈ వారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. దీంతో అందరి దృష్టి ఓటీటీలపై పడింది. ఇందుకు తగ్గట్లే దేవర, వేట్టయన్ సినిమాలతో పాటు సమంత 'సిటాడెల్' సిరీస్ ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. మరోవైపు సుహాస్ 'జనక అయితే గనక' లాంటి కామెడీ ఎంటర్టైనర్ వచ్చేది కూడా ఈ వీకెండ్లోనే. ఇంతకీ ఈ శుక్రవారం ఏయే మూవీస్ ఏయే ఓటీటీల్లోకి రాబోతున్నాయంటే?(ఇదీ చదవండి: రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ డిమాండ్!)ఈ వీకెండ్ రిలీజయ్యే మూవీస్ (నవంబర్ 8వ తేదీ)అమెజాన్ ప్రైమ్వేట్టయన్ - తెలుగు డబ్బింగ్ సినిమాఎవ్రీ మినిట్ కౌంట్స్ - స్పానిష్ సిరీస్సిటాడెల్: హన్నీ బన్నీ - తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)హాట్స్టార్ఏఆర్ఎమ్ - తెలుగు డబ్బింగ్ సినిమాద ఫైరీ ప్రియస్ట్ సీజన్ 2 - కొరియన్ సిరీస్నెట్ఫ్లిక్స్దేవర - తెలుగు సినిమాబ్యాక్ అండర్ సీజ్ - స్పానిష్ సిరీస్ఇన్వెస్టిగేషన్ ఏలియన్ - ఇంగ్లీష్ సిరీస్మిస్టర్ ప్లాంక్టన్ - కొరియన్ సిరీస్ద బకింగ్హమ్ మర్డర్స్ - హిందీ మూవీద కేజ్ - ఫ్రెంచ్ సిరీస్ఉంజోలో: ద గాన్ గర్ల్ - ఇంగ్లీష్ సినిమావిజయ్ 69 - తెలుగు డబ్బింగ్ మూవీఆర్కేన్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (నవంబర్ 09)ఇట్ ఎండ్స్ విత్ అజ్ - ఇంగ్లీష్ సినిమా (నవంబర్ 09)10 డేస్ ఆఫ్ ఏ క్యూరియస్ మ్యాన్ - టర్కిష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)బార్న్ ఫర్ ద స్పాట్లైట్ - మాండరిన్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)కౌంట్ డౌన్: పాల్ vs టైసన్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్‌లో ఉంది)ఆహాజనక అయితే గనక - తెలుగు మూవీబుక్ మై షోబాటో: రోడ్ టూ డెత్ - నేపాలీ సినిమాజియో సినిమాక్వబూన్ క జమేలా - హిందీ మూవీ(ఇదీ చదవండి: నాని ఈసారి 'ది ప్యారడైజ్') -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్
దీపావళి అయిపోయింది. గతవారం రిలీజైన 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఇకపోతే ఈ వారం కూడా చిన్న సినిమాలు క్యూ కట్టేశాయి. ఏకంగా తొమ్మిది మూవీస్ బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ కానున్నాయి. 'ధూం ధాం', 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో', 'జితేందర్ రెడ్డి', 'బ్లడీ బెగ్గర్', 'జాతర', 'ఈసారైనా', 'రహస్యం ఇదం జగత్', 'వంచన', 'జ్యూయల్ థీఫ్' సినిమాలు ఈ లిస్టులో ఉన్నాయి. వీటిలో బ్లడీ బెగ్గర్.. 7వ తేదీన రానుండగా మిగిలినవన్నీ 8వ తేదీన రిలీజ్ కానున్నాయి. కానీ ఒక్కదానిపై కూడా బజ్ లేదు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్: నయని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 23 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 'సిటాడెల్ హన్నీ బన్నీ' వెబ్ సిరీస్‌తో పాటు 'వేట్టయన్', 'జనక అయితే గనక', 'ఏఆర్ఎమ్', 'విజయ్ 69' మూవీస్ మాత్రం అస్సలు మిస్సవొద్దు. వీకెండ్లో సడన్గానూ కొన్ని రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ సినిమా రిలీజ్ కానుందంటే?ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు)అమెజాన్ ప్రైమ్సిటాడెన్: హన్నీ బన్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 07వేట్టయన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 08నెట్ఫ్లిక్స్లవ్ విలేజ్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) - నవంబర్ 05లవ్ ఈజ్ బ్లైండ్: అర్జెంటీనా (స్పానిష్ సిరీస్) - నవంబర్ 06మీట్ మీ నెక్స్ట్ క్రిస్మస్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 06పెడ్రో పరామో (స్పానిష్ సినిమా) - నవంబర్ 0610 డేస్ ఆఫ్ ఏ క్యూరియస్ మ్యాన్ (టర్కిష్ మూవీ) - నవంబర్ 07బార్న్ ఫర్ ద స్పాట్లైట్ (మాండరిన్ సిరీస్) - నవంబర్ 07కౌంట్ డౌన్: పాల్ vs టైసన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 07ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 07బ్యాక్ అండర్ సీజ్ (స్పానిష్ సిరీస్) - నవంబర్ 08ఇన్వెస్టిగేషన్ ఏలియన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 08మిస్టర్ ప్లాంక్టన్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 08ద బకింగ్హమ్ మర్డర్స్ (హిందీ మూవీ) - నవంబర్ 08ద కేజ్ (ఫ్రెంచ్ సిరీస్) - నవంబర్ 08ఉంజోలో: ద గాన్ గర్ల్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 08విజయ్ 69 (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 08ఆర్కేన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 09ఇట్ ఎండ్స్ విత్ అజ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 09హాట్స్టార్ఏఆర్ఎమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 08ఆహాజనక అయితే గనక (తెలుగు మూవీ) - నవంబర్ 08జియో సినిమాడెస్పికబుల్ మీ 4 (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 05బుక్ మై షోట్రాన్స్ఫార్మర్స్ వన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 06(ఇదీ చదవండి: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?) -
ఓటీటీలో వేట్టయాన్.. దీపావళి కానుక ప్రకటించిన మేకర్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ ఓటీటీ ప్రకటన అధికారికంగా వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 420 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.వేట్టైయన్ నవంబర్ 8న ఓటీటీలో విడుదల కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్‌ను పంచుకుంది. అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులను రూ. 90 కోట్లకు ఆ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు.ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత రావడంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
సోషల్‌మీడియాలో ట్రెండింగ్ సాంగ్.. వీడియో చూశారా..?
రజనీకాంత్ వేట్టయాన్ సినిమాలో సూపర్ హిట్ అయిన సాంగ్ 'మనసిలాయో'. తాజాగా ఈ పాట వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషించారు. చాలా సింపుల్ కొరియోగ్రఫీతో దినేశ్ ఈ సాంగ్‌ను క్రియేట్ చేశారు. ఈ పాట మీద చాలా రీల్స్ వచ్చాయి. సోషల్‌మీడియాలో ఇప్పటికీ ఈ సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది.ఈ పాటలో రజనీకాంత్‌తో మంజు వారియర్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మలయాళంలో చాలా పాటలు ఆమె చేసినప్పటికీ ఇంత క్రేజ్ రాలేదని చెప్పవచ్చు. తన కెరీర్లో ఇంత పెద్ద హిట్ అయిన పాట ఇదేనని మంజు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. -
వేట్టయాన్ కలెక్షన్స్.. 18 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటుతుంది. 18 రోజులకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 420 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఇంతటి కలెక్షన్స్ రావడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.వేట్టయాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద నాలుగో వారంలో అడుగుపెట్టింది. ఇప్పుడు కూడా భారత్‌లో రోజుకు రూ. 2 కోట్ల కలెక్షన్స్ వేట్టయాన్ రాబడుతుంది. అయితే, ఓవర్సీస్లో ఎక్కువగా ఈ మూవీ సత్తా చాటుతుంది. కేవలం భారత్‌లో రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి.. ప్రపంచవ్యాప్తంగా రూ. 420 కోట్ల మార్క్‌ను అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. జైలర్ సినిమా అంతటి పాజిటివ్ టాక్ వేట్టయాన్‌కు రాలేదు. అయినా, కలెక్షన్స్ పరంగా మెరుగ్గానే రాబడుతుంది.వేట్టైయన్ నవంబర్ 7న ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అన్ని భాషలలో డిజిటల్ హక్కులను రూ. 90 కోట్లకు ఆ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. -
రజినీకాంత్ వేట్టయాన్.. ఓటీటీకి అంత త్వరగానా?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. సినిమా రిలీజైన రోజు నుంచి ఇప్పటి వరకు రూ.134 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంది.తాజాగా వేట్టయాన్ మూవీ ఓటీటీ విడుదలపై అప్పుడే టాక్ మొదలైంది. రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీకి రానుందని నెట్టింట చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వేట్టయాన్ బాక్సాఫీస్ వద్ద రెండో వారంలోకి అడుగుపెట్టింది. విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఈ మూవీ నవంబర్ 7న లేదా 9న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: రజినీకాంత్ వేట్టయాన్.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!)కాగా.. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోకి దక్కించుకుంది. దసరా సందర్భంగా అక్టోబరు 10న వెట్టయాన్ తెరపైకి వచ్చింది. నాలుగు వారాల తర్వాత అంటే ఈ దీపావళి తర్వాత ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
రజినీకాంత్ వేట్టయాన్.. వారికి బిర్యానీ వడ్డించిన డైరెక్టర్!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. సినిమా రిలీజైన పది రోజుల్లోనే రూ.129 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది.బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంది. తాజాగా వేట్టయాన్ చిత్రబృందం థ్యాంక్స్ గివింగ్ మీట్ పేరుతో చెన్నైలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకల్లో చిత్రబృందంతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ భోజనాలు వడ్డించారు.(ఇది చదవండి: వేట్టయాన్ కలెక్షన్స్.. మ్యాజిక్ నంబర్‌కు దగ్గర్లో రజనీకాంత్)ఈ సక్సెస్ మీట్లో వేట్టయాన్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ స్వయంగా చిత్రబృందంతో పాటు మీడియా ప్రతినిధులకు బిర్యానీ వడ్డించారు. దీనికి సంబంధించిన ఫోటోలను లైకా ప్రొడక్షన్స్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. A gathering of gratitude and celebration! 🤩 The VETTAIYAN 🕶️ family comes together, thankful for the overwhelming support and love from the press and media. ✨ #VettaiyanRunningSuccessfully 🕶️ in Tamil, Telugu, Hindi & Kannada!@rajinikanth @SrBachchan @tjgnan… pic.twitter.com/W0yA6yqgYH— Lyca Productions (@LycaProductions) October 20, 2024 -
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను
‘‘రజనీకాంత్ గారిని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారో అనే అవగాహన నాకు ఉంది. ఫ్యాన్స్‌ని అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాను రూపొందించడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. రజనీకాంత్‌గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’’ అని డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అన్నారు. రజనీకాంత్ లీడ్ రోల్లో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వేట్టయాన్: ది హంటర్’. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై రిలీజైంది. తమిళ్, తెలుగులో ఈ సినిమాకి మంచి స్పందన వస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా టీజే జ్ఞానవేల్ పంచుకున్న విశేషాలు.→ ‘జైలర్’ సినిమా తర్వాత రజనీకాంత్‌గారి కుమార్తె సౌందర్య నాతో ‘మా నాన్నకి సరి΄ోయే కథలు ఉన్నాయా’ అని అడిగారు. రజనీకాంత్‌గారు నా శైలిని అర్థం చేసుకుని, కావాల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. నిజ జీవిత ఎన్కౌంటర్ల నుంచి స్ఫూర్తి పొంది ‘వేట్టయాన్: ది హంటర్’ కథ రాశాను. అయితే ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ రజనీకాంత్‌గారి అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టడం, ఈ కథకి ఆయన స్టైల్, మేనరిజమ్‌ను జోడించడం నాకు సవాల్‌గా అనిపించింది. → దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికే వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు తప్పించుకుంటున్నారని నా పరిశోధనల్లో తెలిసింది. ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? నిజమైన దోషులనే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయాన్: ది హంటర్’లో చూపించాను. విద్యా వ్యవస్థ లోపాలను కూడా టచ్ చేశాం. → ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్గార్లను బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టలేదు. వారి పాత్రల భావజాలాన్ని బ్యాలెన్స్ చేయడంపైనే దృష్టి పెట్టాను. ΄్యాట్రిక్ పాత్రకు ఫాహద్ ఫాజిల్ కరెక్ట్ అనిపించింది. అలాగే నటరాజ్ పాత్రని రాస్తున్నప్పుడు రానా దగ్గుబాటినే అనుకున్నాను. అనిరుథ్ రవిచందర్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం అందించాడు. ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాకి ప్రీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఇక నవంబరు మొదటి వారంలో నా కొత్త సినిమాల గురించి చెబుతాను. -
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను: జ్ఞానవేల్
‘దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. వాటితో ప్రభావితుడ్ని అయ్యాను. ఈ ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? దోషుల్నే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయన్’లో చూపించాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికేసే అమాయకుల్ని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. నా పరిశోధనలో పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు న్యాయం నుండి తప్పించుకుంటారని తెలిసింది. విద్యా వ్యవస్థ లోపాలను కూడా ఇందులో చూపించాను. ఈ చిత్రంలో నేను లేవనెత్తిన అంశాల గురించి చర్చలు జరుగుతాయని నేను భావిస్తున్నాను’ అన్నారు దర్శకుడు టీజే జ్ఞానవేల్. ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయన్’. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా కీలక పాత్రలు పోషించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు జ్ఞానవేల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'జై భీమ్' తర్వాత సూర్యతో ఒక ప్రాజెక్ట్ లైన్లో ఉంది, కానీ రజనీకాంత్ గారితో పనిచేసే అవకాశం వచ్చింది. 'జై భీమ్' ఓ సెక్షన్ ఆడియెన్స్‌ను మాత్రమే ప్రతిధ్వనిస్తుండగా.. రజినీకాంత్ సినిమాకు ఉండే విస్తృత అంచనాలను అందుకోవాలని ముందే ఫిక్స్ అయ్యాను. అందుకే నేను ఓ యాభై శాతం వినోదం.. యాభై శాతం సందేశం ఉండాలని ఇలా కథను రాసుకున్నాను. అయితే నేను ఏ విషయంలోనూ రాజీ పడలేను. ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ.. రజనీకాంత్ అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టాను. ఈ కథకి రజినీ స్టైల్, మ్యానరిజంను జోడించడమే నాకు ఎదురైన సవాల్.→ రజనీకాంత్‌ను ఎలా చూడాలని, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారనే అవగాహన నాకు ఉంది. నేను ఆయనకు ఓ ఎలివేషన్ సీన్స్ చెబితే.. ఆయన ఫుల్ ఎగ్జైట్ అయ్యేవారు. అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటారో ఆయనకు బాగా తెలుసు. ఆయన నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను.→ నా పరిశోధన ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పులు, మానవ హక్కుల కమిషన్‌తో చర్చలపై దృష్టి సారించడంపై జరిగింది. ఎన్కౌంటర్ల చట్టపరమైన, నైతిక అంశాలను అర్థం చేసుకోవడానికి ఇవి బలమైన పునాదిని అందించాయి.→ ఇది సీరియస్ కథ. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేయడం అతి కష్టమైన పని. వినోదాన్ని కోరుకునే రజనీ అభిమానులతో పాటు ఆలోచింపజేసే కథనాలను మెచ్చుకునే ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం నచ్చుతుంది.వెట్టయన్'కి ప్రీక్వెల్‌ను చేయాలని ఉంది. 'వెట్టయన్: ది హంటర్' అతియాన్ గురించి చెబుతుంది. అయితే అతియాన్ ఎలా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయ్యారనే కథను చెప్పాలని అనుకుంటున్నాను. ఫహద్ ఫాసిల్ దొంగగా, పోలీసు ఇన్ఫార్మర్గా మారడం, ఇలా ఈ కథలోని చాలా అంశాలకు బ్యాక్ స్టోరీని చెప్పాలని అనుకుంటున్నాను.→ నిజ-జీవిత ఎన్కౌంటర్ కేసుల నుండి ప్రేరణ పొందాను. అటువంటి సంఘటనల చుట్టూ ఉన్న నైతిక సంక్లిష్టతలను జోడించి కథ రాయాలని అనుకున్నాను.→ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసింది. ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడంలో అతను నిష్ణాతుడు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన సంగీతాన్ని అందించడంలో దూసుకుపోతున్నారు. అతను సినిమా సోల్‌ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. దానికి తగ్గ సంగీతాన్ని అందిస్తారు.→ నా దగ్గర కొన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, కానీ నేను ప్రస్తుతం 'వెట్టయన్'పై దృష్టి పెడుతున్నాను. నవంబర్ మొదటి వారంలో నేను నా భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి చెబుతాను. -
'వేట్టయాన్' భారీ ఆఫర్.. టికెట్ల రేట్లు తగ్గింపు
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటుతుంది. ఇప్పటి వరకు సుమారు రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దసరా సెలవులు ఈ చిత్రానికి బాగా కలిసొచ్చాయని చెప్పవచ్చు. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.దసరా సెలవులు ముగియడంతో వేట్టయాన్ సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు. ఈమేరకు అధికారికంగా తెలిపారు. ఈ రేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో వేట్టయాన్‌కు మళ్లీ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. మల్టీ ప్లెక్స్‌లలో రూ. 200, సిటీ సింగిల్ స్క్రీన్లలో రూ. 150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ. 110గా టికెట్ రేట్లు ఉండనున్నాయి. అయితే, ఈ ఆఫర్ తెలంగాణలో మాత్రమే ఉండనుంది. ఏసియన్ ఎంటర్టైన్మెంట్, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో మాత్రం శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేశారు.కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు.ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే -
వేట్టయాన్‌లో నానికి ఆఫర్ ఆ రోల్.. చివరికీ!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో నానికి ఓ పాత్ర ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే నాని ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అయితే నాని ప్లేస్‌లో పుష్ప ఫేమ్ ఫాహద్ ఫాజిల్‌ను ఎంపిక చేశారు. అయితే నాని నిర్ణయంపై అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. కానీ వీరి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. దీనిపై ఓ అభిమాని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఈ సినిమా నుంచి నాని తప్పించుకున్నాడని రాసుకొచ్చారు. -
కోలుకున్న రజినీకాంత్.. 'వేట్టయన్' టీమ్‌తో ఇలా
సూపర్‌స్టార్ రజినీకాంత్.. కొన్నిరోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పి రావడంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తగ్గిపోతుందిలే అనుకున్నారు. కానీ అది సీరియస్ అయి, గుండెకి ఇబ్బందిగా మారింది. దీంతో డాక్టర్స్ స్టెంట్ వేశారు. ఇంతలోనే ఆయన నటించిన 'వేట్టయన్' సినిమా రిలీజైంది. తాజాగా మూవీ టీమ్ రజినీని కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అలా రజినీ కొత్త ఫొటోలు బయటకొచ్చాయి.(ఇదీ చదవండి: ఒకే వేదికపై ప్రభాస్,రజనీ,సూర్య.. ఎందుకో తెలుసా..?)ఈ ఫొటోల్లో రజినీని చూస్తే అనారోగ్యం నుంచి కోలుకున్నట్లు కనిపిస్తున్నారు. త్వరలో 'కూలీ' మూవీ షూటింగ్‌లోనూ పాల్గొంటారని తెలుస్తోంది. ఇకపోతే 'వేట్టయన్' చిత్రానికి 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగానే రజినీని చిత్రబృందం అంతా కలిసి విషెస్ చెప్పారు.తమిళంలో 'వేట్టయన్'కి హిట్ టాక్ వచ్చింది. కానీ తెలుగులో మాత్రం మిశ్రమ స్పందన లభించింది. దసరా టైంలో అది కూడా నాలుగైదు చిత్రాలతో కలిసి రావడం తెలుగులో ఈ చిత్రానికి కాస్త మైనస్ అయింది. పండగకు రిలీజైన ఏ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకుల్ని సరిగా ఎంటర్టైన్ చేయలేకపోయింది.(ఇదీ చదవండి: 'పుష్ప2' ప్రతి సీన్ ఇంటర్వెల్లా ఉంటుంది: దేవిశ్రీ ప్రసాద్) -
రజినీకాంత్ వేట్టయాన్.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా.. తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది.విడుదలైన నాలుగు రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా రూ.104.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రజినీ కెరీర్లో రూ.200 కోట్ల క్లబ్లో చేరిన ఏడో చిత్రంగా వేట్టయాన్ నిలిచింది. అంతకుముందు తలైవా చిత్రాలైన పెట్టా, దర్బార్, ఎంథిరన్, కబాలి, జైలర్, రోబో 2.0 చిత్రాలు రూ.200 కోట్ల క్లబ్లో చేరాయి. కాగా.. ఈ ఏడాదిలో రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.605 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇదో జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే పెట్టా (రూ. 223 కోట్లు), దర్బార్ (రూ. 226 కోట్లు) చిత్రాలను వేట్టయాన్ అధిగమించనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో రానా కీలక పాత్రలు పోషించారు. -
ఫేట్ మార్చిన రజనీ, ధనుష్ సినిమాలు.. అదృష్టమంటే ఈ డస్కీ బ్యూటీదే (ఫొటోలు)
-
'వేట్టయాన్'కు ఎవరి రెమ్యునరేషన్ ఎంత..?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద వీకెండ్లో మంచి కలెక్షన్లతో సత్తా చాటుతుంది. TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ముఖ్యంగా మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు సినీ దిగ్గజాలు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది.‘వేట్టయాన్’ సినిమాను సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 148 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం కోసం రజనీకాంత్ రూ. 125 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటే.. అమితాబ్ బచ్చన్ మాత్రం కేవలం రూ. 7 కోట్లు తీసుకున్నట్లు ఒక వార్త ట్రెండ్ అవుతుంది. బచ్చన్ కంటే తలైవా 17 రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. ఇద్దరూ సూపర్ స్టార్స్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే, రెమ్యునరేషన్లో ఇంత వ్యత్యాసం ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.సపోర్టింగ్ కాస్ట్ రెమ్యూనరేషన్వేట్టయాన్ సినిమాలో చాలామంది స్టార్స్ సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రం కోసం రూ. 3కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటే.. మంజు వారియర్ ఆమె పాత్ర కోసం రూ. 2.5 కోట్లు అందుకున్నట్లు సమాచారం. అయితే, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి మాత్రం తన రోల్ కోసం రూ.5 కోట్లు ఛార్జ్ చేశారట. వేట్టయాన్‌లో తనదైన స్టైల్లో దుమ్మురేపిన రితికా సింగ్ మాత్రం కేవలం రూ. 25 నుంచి 35 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. -
వేట్టయాన్‌కు ఊహించని రెస్పాన్స్.. మేకర్స్ కీలక నిర్ణయం!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. దసరా సందర్బంగా ఈనెల 10న థియేటర్లలోకి వచ్చింది. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో తొలిరోజు కలెక్షన్లపై ప్రభావం చూపింది. అయినప్పటికీ ఫస్ట్ రోజే రూ.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ది గోట్(రూ. 44 కోట్లు) తర్వాత సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.అయితే రజనీకాంత్ వేట్టైయాన్కు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెట్టయాన్ కోసం మరిన్ని థియేటర్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో దేశంలోని కీలక రాష్ట్రాల్లో అదనపు స్క్రీన్లలో వేట్టయాన్ ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్న చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోందని.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు అదనపు స్క్రీన్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కాగా..టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టయాన్ యాక్షన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, అభిరామి, దుషార విజయన్, రితికా సింగ్ కీలక పాత్రలు పోషించారు. -
వేట్టయాన్ కలెక్షన్స్.. మ్యాజిక్ నంబర్‌కు దగ్గర్లో రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద వీకెండ్లో మంచి కలెక్షన్లతో సత్తా చాటుతుంది. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది.రజనీకాంత్ వేట్టయాన్ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ145.80 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ప్రముఖ ట్రేడ్ సంస్థ తెలిపింది. మ్యాజిక్ నంబర్ రూ. 150 కోట్లకు చాలా దగ్గరలో కలెక్షన్లు ఉన్నాయి. నేటి కలెక్షన్లతో సులువుగా దానిని రజనీ అదిగమిస్తాడని చెప్పవచ్చు. కోలీవుడ్‌లో 2024లో విడుదలైన చిత్రాల్లో కలెక్షన్ల పరంగా వేట్టయాన్ 5వ స్థానంలో ఉంది. దసరా సందర్భంగా రజనీకాంత్ సినిమాకు శనివారం నాడు మంచి కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది.కోలీవుడ్‌లో సినిమా ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా కూడా వేట్టయాన్ కలెక్షన్ల గురించి ఒక ట్వీట్ చేశాడు. ఈ చిత్రం ఉత్తర అమెరికాలో రూ. 17 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిందని పేర్కొన్నాడు. అమెరికాలో ఇప్పటి వరకు ఈ మార్క్‌ను అందుకున్న రజనీ సినిమాలు రోబో,2.0,కబాలి,పేట,దర్బార్, జైలర్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో వేట్టయాన్ కూడా చేరిందని ఆయన తెలిపాడు. ఈ చిత్రం సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేయవచ్చని ఆయన తెలిపాడు. -
రజనీకాంత్ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్’ చిత్రంలో తమ ప్రాంత పాఠశాలను, విద్యార్థులను తప్పుగా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమిళనాడులోని కోవిల్పట్టి గాంధీనగర్ వాసులు శుక్రవారం ఆందోళనకు దిగారు. సౌత్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి నటీనటులతో తెరకెక్కిన వేట్టయన్ చిత్రం గురువారం విడుదలైంది. ఈ చిత్రంలో తమ ప్రాంతంలోని ఉత్తమ పాఠశాల, అందులో విద్యార్థులను తప్పుగా చూపించారంటూ తెన్కాశి జిల్లా, కోవిల్పట్టి గాంధీనగర్‌కు చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.డ్రగ్స్ విషయంలో తమ పాఠశాలకు వ్యతిరేకంగా దృశ్యాలున్నాయని, వాటిని తొలగించకుంటే ప్రదర్శనను అడ్డుకుంటామని స్థానికంగా ఉన్న లక్ష్మీ థియేటర్‌ను ముట్టడించడంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి వారిని బుజ్జగించారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే సంబంధిత సినీ వర్గాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు.కాగా, అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వేట్టయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా నటించారు. మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది. చదవండి: రజనీకాంత్ వేట్టయన్ సినిమా ఎలా ఉంది.. మూవీ రివ్యూ -
పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?
తెలుగు రాష్ట్రాల్లో దసరా జోష్ కనిపిస్తుంది. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్లని ఎంటర్టైన్ చేయడానికా అన్నట్లు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కాస్త ఎక్కువగానే రిలీజయ్యాయి. వీటిలో రజినీకాంత్ 'వేట్టయన్', గోపీచంద్ 'విశ్వం', సుహాస్ 'జనక అయితే గనక', సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేశాయి. ఇంతకీ ఇవి ఎలా ఉన్నాయంటే?వేట్టయన్రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్.. ఇలా బోలెడంత మంది స్టార్స్ నటించిన ఈ సినిమాని.. పోలీసులు- ఫేక్ ఎన్ కౌంటర్ చేయడం అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించారు. తమిళనాడులో హిట్ టాక్ వచ్చింది గానీ తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చింది. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టుండాల్సిందని అంటున్నారు. ఓవరాల్ రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేసేయండి. (రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ)మా నాన్న సూపర్ హీరోసుధీర్ బాబు హీరోగా నటించిన ఈ మూవీని తండ్రి సెంటిమెంట్ స్టోరీతో తీశారు. చిన్నప్పుడే కన్న తండ్రి నుంచి దూరమైన పిల్లాడు.. మరొకరి దగ్గర పెరిగి పెద్దవుతాడు. సవతి తండ్రికి ఇతడంటే అస్సలు ఇష్టముండదు. మరి సొంత తండ్రి-కొడుకు చివరకు ఎలా కలుసుకున్నారనేది తెలియాలంటే సినిమా చూడాలి. మంచి ఎమోషనల్ కంటెంట్‌తో తీసిన ఈ చిత్రం ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి. పూర్తి రివ్యూ ఇదిగో ('మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)విశ్వంగోపీచంద్ లేటెస్ట్ మూవీ ఇది. దాదాపు ఆరేళ్ల తర్వాత శ్రీనువైట్ల ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే రెగ్యులర్ రొటీన్ స్టోరీ కావడంతో తొలి ఆట నుంచే మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కమర్షియల్ మూవీకి కావాల్సిన అన్ని అంశాలు ఉన్నప్పటికీ రెగ్యులర్ ఫార్మాట్లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవరాల్ రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేసేయండి. (‘విశ్వం’ మూవీ రివ్యూ)జనక అయితే గనకసుహాస్ లీడ్ రోల్ చేసిన మూవీ ఇది. ఓ వ్యక్తి పిల్లల్ని వద్దనుకుంటాడు. సేఫ్టీ కూడా వాడుతుంటాడు. అయినా సరే భార్య గర్భవతి అవుతుంది. దీంతో కండోమ్ కంపెనీపై కేసు వేస్తాడు. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ. ప్రస్తుత కాలంలో పిల్లల్ని కనడం, పెంచడం ఖరీదైన వ్యవహారం. ఇదే పాయింట్ తీసుకుని, ఎంటర్టైనింగ్ చెప్పారు. ప్రీమియర్లు వేస్తే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పూర్తి రివ్యూ కూడా చదివేయండి. (‘జనక అయితే గనక’మూవీ రివ్యూ)(ఇదీ చదవండి: ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్‌కి బాబు లాంటి సినిమా) -
రజినీ 'వేట్టయన్'.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా అంటే మినిమమ్ క్రేజ్ ఉంటుంది. ఈసారి తమిళనాడు వరకు ఓకే గానీ తెలుగులో పెద్దగా హడావుడి లేకుండానే 'వేట్టయన్' రిలీజైపోయింది. దసరా కానుకగా ఈ గురువారం థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజే మిక్స్డ్ టాక్ వినిపించింది. వీకెండ్ గడిస్తేగాని అసలు టాక్ ఏంటనేది బయటపడదు.(ఇదీ చదవండి: రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ)మరోవైపు 'వేట్టయన్' చిత్రానికి తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల వరకు వచ్చినట్లు టాక్. తమిళనాడులోనే రూ.22 కోట్లు, దేశంలో మిగిలిన చోట్లన్నీ కలిపి రూ.25 కోట్లు, ఓవర్సీస్లో రూ.23 కోట్లు వచ్చాయని సమాచారం. తెలుగు వరకు అయితే దాదాపు రూ.3 కోట్లు వరకు వచ్చిన సమాచారం.తెలుగులో అయితే 'విశ్వం', 'మా నాన్న సూపర్ హీరో', 'జనక అయితే గనక' లాంటి సినిమాలు రిలీజయ్యాయి. అలానే 'జిగ్రా', 'మార్టిన్' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా తాజాగా థియేటర్లలో రిలీజయ్యాయి. వీటని దాటుకుని 'వేట్టయన్' తెలుగులో ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి. తొలిరోజు అయితే పర్లేదనిపించింది గానీ వీకెండ్ ముగిసేసరికి ఎన్ని డబ్బులు వస్తాయనే దానిబట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది.(ఇదీ చదవండి: బొమ్మ పడలేదు.. కొత్త సినిమాలకు రిలీజ్ సమస్యలు!) -
ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న వెట్టయాన్.. భారీ ధరకు రైట్స్!
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ మూవీతో అమితాబ్‌తో పాటు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. వేట్టయాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ చిత్రం విడుదలైన ఆరు వారాల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్కు తీసుకురానున్నారు. అంటే నవంబర్ చివర్లో ఓటీటీకి వచ్చే అవకాశముంది. తెలుగులోనూ అదే టైటిల్‌తో ఈ మూవీని రిలీజ్ చేశారు మేకర్స్. -
వెట్టయాన్ ఫస్ట్ షో వీక్షించిన స్టార్ హీరో.. వీడియో వైరల్
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ మూవీతో అమితాబ్‌తో పాటు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు.అయితే రజినీకాంత్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తమిళ అభిమానం గురించి చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ మొదటి రోజే ఫస్ట్ షో చూడాలనే ఆతృత అభిమానులకు ఉంటుంది. కానీ ఒక స్టార్ హీరో మూవీ ఫస్ట్ షో చూడడం చాలా అరుదుగా కనిపించే సన్నివేశం. ఇవాళ అలాంటి అరుదైన సంఘటనే చోటు చేసుకుంది.ఇటీవల ది గోట్ మూవీ అభిమానులను మెప్పంచిన విజయ్.. రజినీకాంత్ చిత్రం వేట్టయాన్ ఫస్ట్ షోను వీక్షించారు. ఆయనతో పాటు ది గోట్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్.. రజనీకాంత్‌కు అభిమాని కావడంతో మొదటి ఆటను చెన్నైలో ఓ థియేటర్లో చూశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. வேட்டையன் படம் பார்த்த விஜய்... தலைவருக்காக வந்த தளபதி..!#Chennai #ThalapathyVijay #Vijay #Vettaiyan #VettaiyyanMovie #VettaiyanFDFS #VettaiyanReviews #Rajinikanth #DeviTheatre #NewsTamil #NewsTamil24x7 pic.twitter.com/csFT8A3FUB— News Tamil 24x7 (@NewsTamilTV24x7) October 10, 2024 -
రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ
టైటిల్: ‘వేట్టయన్- ది హంటర్’నటీనటులు:రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్ దర్శకత్వం: టి.జె.జ్ఞానవేల్సంగీతం:అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.కదిర్ఎడిటర్: ఫిలోమిన్ రాజ్విడుదల తేది: అక్టోబర్ 10, 2024కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు. ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..'సత్వర న్యాయం'పేరుతో పోలీసులు చేసే ఎన్కౌంటర్లు ఎంతవరకు కరెక్ట్? అనే సీరియస్ పాయింట్‌తో వేట్టయన్ అనే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జ్ఞానవేల్. జైభీమ్ సినిమా మాదిరే ఇందులో కూడా పేదవాడికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. అలా అని ఈ సినిమా కథనం జైభీమ్ మాదిరి నెమ్మదిగా, ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సాగదు. రజనీకాంత్ ఫ్యాన్స్‌కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని ఈ చిత్రంలో ఉన్నాయి. అయితే ఎమోషనల్‌గా మాత్రం ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ కథలో చాలా డెప్త్ ఉంది. కేవలం ఎన్‌కౌంటర్‌పై మాత్రమే కాకుండా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విద్య దోపిడిపై కూడా దర్శకుడు ఈ చిత్రంలో చర్చించాడు. స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో ప్రైవేట్ సంస్థలు పేద విద్యార్థులను ఎలా దోచుకుంటున్నాయి? అనేది తెరపై కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. కానీ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో విఫలం అయ్యాడు. బలమైన భావోధ్వేగాలు పండించే సీన్లను కూడా సింపుల్‌గా తీసేశారు. విలన్ పాత్రను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. అలాగే ఉత్కంఠను పెంచే సన్నివేశాలేవి ఇందులో ఉండవు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా అంతగా ఆకట్టుకోదు. కొన్ని చోట్ల రజనీకాంత్ తనదైన మ్యానరిజంతో ఆ తప్పులను కప్పిపుచ్చాడు. ఇంటర్వెల్‌కి 20 నిమిషాల ముందు వరకు కథనం సాదాసీదాగా సాగినా.. పహద్ పాత్ర చేసే చిలిపి పనులు, రజనీకాంత్ మాస్ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్ బోర్ కొట్టదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్‌లోనే మెయిన్ స్టోరీ అంతా ఉంటుంది. అయితే బలమైన సీన్లు లేకపోవడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. క్లైమాక్స్ బాగున్నా.. ‘పేదవాడిని అయితే ఎన్కౌంటర్ చేస్తారు కానీ డబ్బున్న వాడిని చేయరు’ అని అమితాబ్ పాత్రతో డైరెక్టర్ చెప్పించిన డైలాగ్‌కి ‘న్యాయం’ జరగలేదనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రజనీకాంత్ మ్యానరిజం, స్టైల్‌ని దర్శకుడు జ్ఞానవేల్ కరెక్ట్‌గా వాడుకున్నాడు. అభిమానులు అతన్ని తెరపై ఎలా చూడాలనుకుంటారో అలాగే ఎస్పీ అదియన్ పాత్రను తీర్చిదిద్దాడు. ఆ పాత్రకు రజనీ పూర్తి న్యాయం చేశాడు. వయసుతో సంబంధం లేకుండా తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. ‘గురి పెడితే ఎర పడాల్సిందే’అంటూ ఆయన చేసే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక న్యాయమూర్తి సత్యదేవ్‌గా అమితాబ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై హుందాగా కనిపిస్తాడు. అదియన్ భార్యగా మంజువారియర్ పాత్ర పరిది తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ఇక ఫహద్ ఫాజిల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అదియన్ తర్వాత అందరికి గుర్తుండే పాత్ర ప్యాట్రిక్. ఒకప్పుడు దొంగగా ఉండి ఇప్పుడు పోలీసులకు సహాయం చేసే ప్యాట్రిక్ పాత్రలో ఫహద్ ఒదిగిపోయాడు. రానా విలనిజం పర్వాలేదు. కానీ ఆ పాత్రను మరింత బలంగా రాసి ఉంటే బాగుండేది. రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమాగా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం బాగుంది. ‘మనసిలాయో’ పాట మినహా మరేవి అంతగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రజినీకాంత్ 'వేట్టయన్' ట్విటర్ రివ్యూ
సూపర్‌స్టార్ రజినీకాంత్ కొత్త మూవీ 'వేట్టయన్' థియేటర్లలోకి వచ్చేసింది. 'మనసిలాయో' పాటతో ట్రెండ్ అయిపోయిన ఈ చిత్రంలో రజినీతో పాటు అమితాబ్ బచ్చన్, రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, దుసరా విజయన్ లాంటి స్టార్ కాస్ట్ నటించారు. చాలాచోట్ల ఎర్లీ మార్నింగ్ షోలు, ఓవర్సీస్ షోలు పడ్డాయి. దీంతో ట్విటర్లో పలువురు నెటిజన్లు రివ్యూ పోస్ట్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: సోషల్ మీడియాలో వేట్టైయాన్పై ట్రోల్స్.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్)రజినీకాంత్ మాస్ అప్పీల్ అదిరిపోయిందని, అనిరుధ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడని అంటున్నారు. రీసెంట్ టైంలో వచ్చిన వన్ ది బెస్ట్ ఫస్ట్ హాఫ్ అని అంటున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథని, ఆలోచన రేకెత్తించే సోషల్ మెసేజ్‌తో దర్శకుడు జ్ఞానవేల్ అద్భుతంగా చూపించాడని తెగ పొగిడేస్తున్నారు.(ఇదీ చదవండి: రజినీకాంత్ వెట్టైయాన్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో బిగ్ షాక్!)#Vettaiyan - Superstar Rajinikanth & FaFa scenes are super Funny & Refreshing 😁❤️So nice to see #FahadhFaasil in this kind of character🌟 pic.twitter.com/fLjFzUiGHU— AmuthaBharathi (@CinemaWithAB) October 10, 2024First Half #Vettaiyan(4/5) : Intriguing Investigate Thriller#Rajinikanth & his mass moments🔥racy a screenplay filled with investigation of crime#Fafa super fun@anirudhofficial's BGM & song👌Emotions are well connected@officialdushara plays a crucial role@tjgnan 👍 pic.twitter.com/Qv4TvXaypk— Kollywood Updates (@KollyUpdates) October 10, 2024#Vettaiyan First half 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Content la mass illa , mass la thaan content🔥🔥🔥 First 25 minutes, absolute goosebumps with Thalaivar 🔥🔥🔥🔥🔥🔥 Ani bgm and RR is his career best. That intro theme music, thaaaa🔥🔥🔥🔥🔥 Intriguing crime thriller investigation… pic.twitter.com/nfQB5tOu1i— Achilles (@Searching4ligh1) October 9, 2024#Vettaiyan First Half - SUPERB❤️🔥- First 20 mins to celebrate Superstar #Rajinikanth & his mass moments😎- After half an hour moves towards racy a screenplay filled with investigation of crime 👌- Anirudh BGM & song is so good🎶- Emotions are well connected ❤️- Dushara plays… pic.twitter.com/2V7AcPr2Q0— AmuthaBharathi (@CinemaWithAB) October 10, 2024Thaaaaaaaa! Terrific screenplay writing! Unbelievable TWIST! Absolute banger of a first half! TJ Gnanavel - you won biggggg! Just 50% more to show the world you are bigger than NELSON or KARTHIK SUBBARAJ! One of the best first half ever! #Vettaiyan IS GOING TO BE HUGE!— 𝔻𝕣. 𝔹𝕠𝕙𝕣𝕒 𝕄𝔻. 𝔸𝕀ℝ𝔻 (@Vasheegaran) October 9, 2024#manasilaayo? Glad to be here with loads of #ThalaivarRajinikanth fans! 🔥🔥❤️❤️ #VettaiyanVibes #Vettaiyanfdfs #Vettaiyan pic.twitter.com/Uz8yqxc9wv— Prasanna (@IamprasannaGA) October 9, 2024#Vettaiyan First Half - SUPER GRIPPING & ENGAGING 🔥Fully on content based👌 pic.twitter.com/rkmf8YMF7f— AmuthaBharathi (@CinemaWithAB) October 9, 2024#Vettaiyan Review - Intriguing investigative thriller raising moral questions. Engaging first half sets the stage for a promising second half.TJ Gnanavel blends commercial elements with social justice & human biasLaw vs. Encounter. Amitabh is a fitting match up to Rajini. pic.twitter.com/GIJtFFEbO3— MovieCrow (@MovieCrow) October 9, 2024Thalaivar fans coming out of theatres after watching the climax twist in #Vettaiyan 🔥🔥😭😭😭pic.twitter.com/BKPclWfHOH— Agastya🦕 (@Salaar4k) October 9, 2024#Vettaiyan first half 🔥🔥🔥 thalaivar semma!!!! pic.twitter.com/1Mq2vYLdtf— Anup Krishnia (@CKrishnia) October 10, 2024#Vettaiyan First Half : “Excellent First Half”🔥🔥👉Starts off a bit alow in the first 30mins,but once the story gains momentum, it transforma into an engaging crime thriller that keeps you on the edge of the seat.👉The film leans more towards the director’s film than merely…— PaniPuri (@THEPANIPURI) October 10, 2024 -
సోషల్ మీడియాలో వేట్టైయాన్పై ట్రోల్స్.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.అయితే టాలీవుడ్లో రజినీకాంత్‌కు ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉంది. దీంతో టాలీవుడ్‌లోనూ వెట్టైయాన్ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అందులో తెలుగులోనూ అదే టైటిల్‌తో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై అప్పుడే నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. వెట్టైయాన్ డిజాస్టర్ అంటూ నెగెటివ్ ట్రోలింగ్ మొదలెట్టారు. మరోవైపు తెలుగులో ఈ మూవీని ఏషియన్, దిల్‌రాజు సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగులో తమిళ టైటిల్ ఉండడంపై సోషల్ మీడియాలో చర్చ జరగడంపై ఆయన స్పందించారు.దిల్ రాజు మాట్లాడుతూ.. 'పాన్ ఇండియా సినిమా చేసేటప్పుడు కొన్ని టైటిల్ విషయంలో సమస్యలు ఉంటాయి. గేమ్ ఛేంజర్ విషయలో కూడా రెండు, మూడు భాషల్లో ఇబ్బంది ఎదురైంది. సోషల్ మీడియాలో రజనీకాంత్ వెట్టాయన్ బాయ్ కాట్ ట్రెండింగ్ చేస్తున్నారు. అలాగే వెట్టయాన్ అనే టైటిల్ తెలుగులో కాంట్రవర్సీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా గ్లోబల్ అయిపోయింది. సాధ్యమైనంత వరకు టైటిల్స్ లోకల్ పేరుతో పెడుతున్నారు. లేని పక్షంలో అదే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. సినిమాని సినిమాగా చూడండి' అని అన్నారు.నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ …'తెలుగులో చాలా డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినిమాలు కూడా చాలా ఇతర భాషల్లో డబ్ అవుతున్నాయి. వన్ ఇండియా వన్ నేషన్ అంటున్నారు కదా. తెలుగు వెట్టయాన్ అందరూ వచ్చి చూడండి' అని అన్నారు. దగ్గుబాటి రానా మాట్లాడుతూ … 'రజినీకాంత్ సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉంటుంది. డైరెక్టర్ మీద ఇష్టంతో ఈ సినిమాలో ఇంతమంది స్టార్స్ నటించారు. ఈ రోజు మన తెలుగు సినిమాని ప్రపంచం మొత్తం చూస్తోంది. ట్రోల్స్ అనేవి టైం పాస్ లాంటివని అన్నారు. -
రానా.. నన్ను చూపుతో భయపెట్టాడు: రజనీకాంత్
రానా పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా 'బాహుబలి'. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎప్పుడో ఒకటి అనేంతలా నటిస్తున్నాడు. రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'వేట్టయన్'లోనూ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా రానా గురించి స్వయానా రజినీకాంత్ ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ దర్శకుడిదే తప్పు.. మానభంగం చేశాడు: పూనమ్ కౌర్)'రానా.. రామానాయుడి మనవడిగా చిన్నప్పటి నుంచి తెలుసు. అప్పట్లోనే షూటింగ్‌కి వచ్చేవాడు. ఫుల్ జాలీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ సీరియస్ లుక్ ఇచ్చేవాడు. అప్పుడు నిజంగా నేను భయపడేవాడిని' అని రజినీకాంత్ చెప్పుకొచ్చాడు. సూపర్‌స్టారే యాక్టింగ్ గురించి ప్రశంసించారంటే.. రానాకి ఇంతకంటే బెటర్ ఎలివేషన్ ఉండదేమో?'జై భీమ్' ఫేమ్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన 'వేట్టయన్' సినిమాలో రజినీతో పాటు అమితాబ్, రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుసరా విజయన్.. ఇలా భారీ తారాగణం ఉంది. అనిరుధ్ ఇచ్చిన పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అక్టోబరు 10న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: 7 నెలల తర్వాత ఓటీటీలోకి పూరీ తమ్ముడి సినిమా)Imagine the level of Achievement when SUPER STAR himself talks something like this!🤯🤯🔥🔥🔥#RanaDaggubati #Vettaiyan #Rajinikanth pic.twitter.com/KMMKTrWa2s— Filmy Bowl (@FilmyBowl) October 8, 2024 -
'దేవర' ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం
'దేవర' మూవీ ఇంకా థియేటర్లలో ధనాధన్ లాడిస్తూనే ఉంది. ఇప్పటికే రూ.450 కోట్ల మార్క్ దాటేసింది. దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి రూ.500 కోట్లు సులభంగా దాటేస్తుంది. ఇదంతా పక్కనబెడితే తారక్ ఫ్యాన్స్ ఇప్పుడు మరోసారి తెగ బాధపడిపోతున్నారు. దీనికి అనిరుధ్ కారణం. ఎందుకంటే?(ఇదీ చదవండి: సమంత-త్రివిక్రమ్‌తో సినిమా.. ఆలియా పెద్ద కోరిక)లెక్క ప్రకారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలి. కానీ ఊహించిన దాని కంటే ఎక్కువమంది వచ్చేసరికి విధ్వంసం జరిగింది. కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేశారు. సరే అదలా పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం రజినీకాంత్ 'వేట్టయన్' ఆడియో లాంచ్ జరిగింది. ఇప్పటికే సూపర్ అయిపోయిన 'మనసిలాయో' పాటకు అనిరుధ్ అదిరిపోయే లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.గతంలో 'హుకుం' సాంగ్‌కి స్టేడియంలో జనాలు ఎలా ఊగిపోయారో.. ఇప్పుడు 'మనసిలాయో'కి కూడా అదే సీన్ రిపీటైంది. తాజాగా ఈ ఫెర్ఫార్మెన్స్ వీడియోని యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. అయ్యో ఇలాంటి ఫెర్ఫార్మెన్స్ మిస్ అయిపోయామే అని అనుకుంటున్నారు. ఈవెంట్ సంగతి ఏమైనా సరే 'ఫియర్' సాంగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దెబ్బకు థియేటర్లలో ఆల్రెడీ టాప్ లేచిపోయిందిగా అని సంతృప్తి పడుతున్నారు.(ఇదీ చదవండి: కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా) -
మళ్ళీ అనిరుద్ ట్వీట్.. ఫుల్ జోష్ లో తలైవా ఫ్యాన్స్
-
రజినీకాంత్ 'వెట్టైయాన్'.. ట్రైలర్ వచ్చేసింది!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానలేల్ డైరెక్షన్లో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరెకెక్కించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే రిలీజైన 'మనసియాలో' అనే సాంగ్ తలైవా ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. తాజాగా వేట్టైయాన్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: ఆస్పత్రిలో రజినీకాంత్.. కోలుకోవాలంటూ విజయ్ ట్వీట్!) కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా ాకనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ దసరాకు అక్టోబర్ 10 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ మూవీలో ఫాహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్, దుషారా విజయన్ ముఖ్య పాత్రల్లో నటించారు. -
అలాంటి వీడియోలు షేర్ చెయ్యొద్దని చెప్పారు : హీరోయిన్ రితికా సింగ్
తనను తాను రక్షించుకోవాడానికే బాక్సింగ్, కరాటే నేర్చుకున్నానని చెబుతోంది హీరోయిన్ రితికా సింగ్. ‘గురు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బాక్సింగ్ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగు,తమిళ, మలయాళ సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో కలిసి నటించిన ‘వేట్టయాన్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రితికా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను ఎందుకు కరాటే, బాక్సాంగ్ నేర్చుకోవాల్సి వచ్చిందో చెప్పింది. ‘మన జీవితంలో ఎప్పుడైనా ఊహించని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. వాటిని తట్టుకొని నిలబడడానికి మనం సిద్ధంగా ఉండాలి. అమ్మాయిలు బయటకు వెళ్తే దురదృష్టవశాత్తు ఏమైనా జరగొచ్చు. నన్ను నేను రక్షించుకోవడానికే కరాటే, బాక్సింగ్ నేర్చుకున్నాను. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే..కొంతమంది వద్దని చెప్పారు. ‘నీ కరాటే వీడియోలు చూసి నెటిజన్లు భయపడిపోతున్నారు. వాటిని షేర్ చేయకండి’ అని కొంతమంది నాకు సలహా ఇచ్చారు. కానీ నేను మాత్రం షేర్ చేయడం ఆపలేదు. కరాటే వీడియోలే కాదు.. శారీ ఫోటో షూట్, డ్యాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తుంటాను. ఒక నటిగా నేను ఏం చేయగలనో అన్ని చేశాను. అయినా కూడా కొంతమంది విమర్శిస్తుంటారు. వాటని పట్టించుకోను. ఎవరో ఏదో అన్నారనని నా ట్రైనింగ్ మానుకోలేదు. ఇప్పటికే కరాటే, బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అది నాకు ఇష్టమైన పని. నేను ఇంత స్ట్రాంగ్ ఉండడం మంచిది కాదని కొంతమంది సలహా ఇస్తున్నారు. ఎందుకు ఉండకూడదు? నేను బయటకు వెళ్లినప్పుడు ఏమైనా జరిగితే ఎవరు రక్షిస్తారు? నన్ను నేను రక్షించుకోవడానికే మార్షల్ ఆర్ట్స్‌లో బేసిక్స్ నేర్చుకున్నాను. అలా అని ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అన్యాయం జరిగితే ధైర్యంగా మన గళాన్ని వినిపించాలి. మన వాయిసే ఒక ఆయుధం కావాలి’ అని రితికా చెప్పుకొచ్చింది. -
రజినీకాంత్ వెట్టైయాన్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం వెట్టైయాన్. ఈ సినిమాను టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా కనిపించనున్నారు. ఈ దసరాకు థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. వేట్టైయాన్ ట్రైలర్‌ను అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ఇప్పటికే ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 43 నిమిషాల 25 సెకన్లు ఉన్నట్లు తెలుస్తోంది. వెట్టైయాన్‌కు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. మూడు చోట్ల డైలాగ్స్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని మ్యూట్ చేయాలని.. లేదంటే వేరే పదాలు వినియోగించాలని చిత్ర బృందానికి సూచించింది.(ఇది చదవండి: రజినీకాంత్‌తో నటించావా? అని అడిగారు.. రాయన్ ఫేమ్ ఆసక్తికర కామెంట్స్!)ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషించారు. తెలుగులోనూ ఇదే పేరుతో వెట్టైయాన్ విడుదల కానుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.The Target is set! 🎯 The VETTAIYAN 🕶️ trailer is dropping on October 2nd. 🔥 Get ready to catch the prey. 🦅#Vettaiyan 🕶️ Releasing on 10th October in Tamil, Telugu, Hindi & Kannada!@rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran… pic.twitter.com/Qs8w8xJRqH— Lyca Productions (@LycaProductions) September 30, 2024 -
సూపర్ స్టార్ రజనీ ‘వెట్టయన్’మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
'వేట్టైయాన్' సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'వేట్టైయాన్.' ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజువారియర్, రిత్విక సింగ్, దుషారా విజయన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి జైభీమ్ చిత్రం ఫేమ్ టీజే. జ్ఞానవేల్ కథ, దర్శకత్వం బాధ్యతలను అందించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారి ఎత్తున నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈచిత్రం అక్టోబర్ 10న తెరపైకిరానుంది. కాగా ఇందులో రజనీకాంత్ ఇందులో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటించారు. ఇటీవలే చిత్ర ఆడియోను అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించారు. పాటలకు మంచి స్పందన వస్తోంది. యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన 'వేట్టైయాన్' సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. సినిమా రన్‌టైమ్ 2:47 గంటలు (167 నిమిషాలు) ఉన్నట్లు ప్రకటించింది. కాగా వేట్టైయాన్ చిత్రానికి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఓవర్సీస్లో కూడా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. -
యముడొచ్చి దిగినాడు!
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 10న విడుదల కానుంది. తెలుగులో ‘వేట్టయాన్: ద హంటర్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి టీజర్ తరహాలో ప్రివ్యూ వీడియో విడుదలైంది. బుధవారం విడుదలైన ఈ తెలుగు వెర్షన్ వీడియోలో ‘ఈ దేశంలో లక్షలాదిమంది ΄ోలీసు అధికారులు ఉన్నారు. కానీ వీళ్లను మాత్రం చూడగానే గుర్తు పడుతున్నారంటే... హౌ ఈజ్ ఇట్ ΄ాజిబుల్, సో... ఎన్కౌంటర్ పేరుతో ఒక మనిషిని హత్య చేయడం అదొక హీరోయిజం...ఈజ్ ఇట్’ (అమితాబ్ బచ్చన్), ‘ఎన్కౌంటర్ అనేది నేరం చేసినవాళ్లకి విధించే శిక్ష మాత్రమే కాదు... ఇక మీదట ఎలాంటి నేరం మళ్లీ జరగకూడదని తీసుకునే ముందు జాగ్రత్త చర్య’ (రజనీకాంత్), ‘మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్‌ని భయపడకుండా ఎన్కౌంటర్ చేసినందు వల్ల వీళ్లు హీరోస్ అయ్యారు’ (రితికా సింగ్), ‘మన ఎస్పీ అన్న పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు’ అనే డైలాగ్స్ ఈ ప్రివ్యూ వీడియోలో ఉన్నాయి. -
జైలర్ సక్సెస్ తర్వాత టెన్షన్లో రజనీకాంత్
సినిమా స్టార్లకు హిట్టు వచ్చినా బాధే, ఫ్లాప్ వచ్చినా బాధే! హిట్టు వచ్చిందంటే దాన్ని అలాగే కొనసాగించాలని, వీలైతే సూపర్ హిట్ కొట్టాలన్న ఒత్తిడి ఉంటుంది. అదే ఫ్లాప్ వచ్చిందంటే నానామాటలు, విమర్శలు.. ఈసారైనా గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలన్న ఒత్తిడి ఉంటుంది. నటుడి జీవితం ఇంతే! అంటున్నాడు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్.రజనీ స్టెప్పులుప్రస్తుతం రజనీకాంత్.. వేట్టైయాన్, కూలీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వేట్టైయాన్ మూవీ ఆడియో లాంచ్ శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో రజనీ స్పీచ్‌తో సరిపెట్టకుండా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్‌తో కలిసి స్టెప్పులేశాడు. మనసిలాయో.. పాటలోని హుక్ స్టెప్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఏ రకంగా చూసినా ఒత్తిడి తప్పదుఆడియో లాంచ్‌లో రజనీ మాట్లాడుతూ.. ఏదైనా సినిమా ఫ్లాప్ అయిందంటే నెక్స్ట్ ఎలాగైనా హిట్ కొట్టాలన్న టెన్షన్ ఉంటుంది. అలాగే ఒక సినిమా సక్సెస్ అయిందంటే తర్వాతి చిత్రాలు కూడా హిట్టవ్వాలని, అవసరమైతే అంతకంటే ఇంకా పెద్ద విజయం సాధించాలన్న ఒత్తిడి ఉంటుంది. అందరూ అదే కోరుకుంటారు. జైలర్ సినిమా ఘన విజయం తర్వాత నాపై ఇలాంటి ఒత్తిడే ఉంది అని రజనీకాంత్ పేర్కొన్నాడు.అప్పుడే రిలీజ్ఇకపోతే వేట్టైయాన్ సినిమాలో రానా, ఫహద్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ వంటి పలువురు కీలక పాత్రల్లో నటించారు. అమితాబ్ బచ్చన్ సైతం ముఖ్య పాత్రలో మెప్పించనున్నాడు. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అక్టోబర్ 10న విడుదల కానుంది. #Rajinikanth and #Anirudh dance for #Manasilaayo 👌❤️ pic.twitter.com/5dr2hpSuDa— CHITRAMBHALARE (@chitrambhalareI) September 21, 2024 బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అమితాబ్ బచ్చన్ పరిస్థితి చూసి వాళ్లందరూ నవ్వుకున్నారు: రజనీకాంత్
రజనీకాంత్ , అమితాబ్ బచ్చన్ ఇద్దరూ మంచి స్నేహితులేనని అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో 'హమ్, అందాకా నూన్, గిరాఫ్తార్' వంటి సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే, 32 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ కలిసి నటించిన సినిమా 'వెట్టైయాన్'. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ వేదికపై తన మిత్రుడు అమితాబ్ బచ్చన్ గురించి రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.రజనీకాంత్ మాట్లాడుతూ.. 'అమితాబ్ బచ్చన్ సినీ నిర్మాతగా భారీ అర్ధిక నష్టాలను చవిచూశారు. ఒకానొక సమయంలో తన వాచ్‌మెన్‌కు కూడా జీతం ఇవ్వలేని స్థితికి చేరిపోయారు. దీంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో తనకు ఎంతో ఇష్టమైన జూహూ ఇంటిని వేలానికి పెట్టారు. అప్పడు బాలీవుడ్ మొత్తం ఆయన్ను చూసి నవ్వింది. పతనమైనప్పటికీ సరిగ్గా మూడేళ్లలో తిరిగి మళ్లీ నిలబడ్డారు. కౌన్ బనేగా కరోడ్‌పతి నుంచి చేతికి వచ్చిన ప్రతి యాడ్ చేస్తూ కష్టపడ్డారు. అందుకోసం ఆయన చాలా శ్రమించారు. 82 ఏళ్ల వయసులో కూడా రోజుకు 10 గంటలకు పైగానే కష్టపడ్డారు. తను ఎక్కడైతే కిందపడ్డారో మళ్లీ అక్కడే తనేంటో చూపించారు. జూహూలోని తన ఇంటితో పాటు మరో మూడు ఇళ్లను తిరిగి కొనుగోలు చేశారు.' అని రజనీ చెప్పారు.గాంధీ కుటుంబంతో అమితాబ్ బంధం: రజనీకాంత్అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడుతూ ఒక అరుదైన విషయాన్ని రజనీకాంత్ ఇలా పంచుకున్నారు. ఒకసారి అమితాబ్‌కు ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇందిరా గాంధీ విదేశాల్లో ఓ సదస్సుకు వెళ్లారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆమె వెంటనే ఇండియాకు వచ్చారు. రాజీవ్ గాంధీ, అమితాబ్ జీ కలిసి చదువుకున్నారని అప్పుడే అందరికీ తెలిసింది. అలా గాంధీ కుటుంబంతో ఆయనకు దగ్గరి పరిచయాలు ఉన్నాయని అప్పుడే తెలిసింది. అమితాబ్ జీ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ గొప్ప రచయిత. తనకు కష్టం వచ్చినప్పుడు తండ్రి పేరు చెప్పుకొని ఎవరినైనా సాయం అడగొచ్చు. కానీ, ఆయన అలాంటి పనిచేయలేదు. కష్టాల్లో కూడా తనంతట తానే తిరిగి మళ్లీ నిలబడ్డారు. అమితాబ్ ఎందరికో ఆదర్శం.దసరా సందర్భంగా అక్టోబర్ 10న థియేటర్స్‌లోకి ‘వేట్టైయాన్’ రానున్నాడు. రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్‌పై ఈ మూవీని సుభాస్కరన్ నిర్మించారు. వేట్టయాన్‌లో సత్యదేవ్ పాత్రలో అమితాబ్ నటించారు. రితికా సింగ్, దుషార విజయన్, మంజు వారియర్ , రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్ నటించారు. -
రజనీకాంత్ 'వేట్టైయాన్' నుంచి ప్రివ్యూ ప్రోమో
దసరా పండక్కి థియేటర్స్‌లోకి రానున్నాడు ‘వేట్టైయాన్ ’. రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్‌పై ఈ మూవీని సుభాస్కరన్ నిర్మించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మనసిలాయో’ అనే సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, వేట్టైయాన్ ప్రమోషన్స్‌లో భాగాంగా తాజాగా ప్రివ్యూ పేరుతో ఒక టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అనిరుధ్ ఫ్లాష్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో దుమ్మురేపాడు. టీజర్లో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ ఇతర పాత్రల్లో నటించారు. -
రజనీకాంత్ కోసం సూర్య భారీ త్యాగం!
కంగువా చిత్రంపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తనే నిజమైంది. సినిమా విడుదల వాయిదా పడింది. సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే సీజీ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్‌ని వాయిదా వేశారు మేకర్స్. నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.వేట్టయాన్ కోసమే వాయిదా?రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుభాస్కరన్ నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘వేట్టయాన్’ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 10న రిలీజ్ కానుంది. అదే తేదిన కంగువా రిలీజ్ కావాల్సింది. మేకర్స్ ముందే ప్రకటించారు. అయితే బరిలోని రజనీకాంత్ సినిమా రావడంతో సూర్య వెనక్కి తగ్గారు. తనకంటే సీనియర్ హీరో సినిమాతో పోటీ వద్దని సూర్య చెప్పారట. దీంతో అక్టోబర్ 10న కాకుండా నవంబర్ 14న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. (చదవండి: అటు ప్రభాస్.. ఇటు మహేశ్.. కరీనాకి డబుల్ చాన్స్!)మూడు విభిన్న పాత్రల్లో సూర్యకంగువా చిత్రం కోసం సూర్య చాలా కష్టపడ్డాడు. ఇందులో మూడు విభిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు భారతీయ తెరపై రాని కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారట. రెండున్నరేళ్ల పాటు సుమారు 1000 మందికి పైగా ‘కంగువా’ కోసం శ్రమించారని ఓ ఇంటర్వ్యూలో సూర్య చెప్పారు. ఇక ఈ చిత్రానికి బడ్జెట్ కూడా భారీగానే అయిందట. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. విజువల్స్ పరంగా ఈ చిత్రం సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని మేకర్స్ ముందు నుంచి చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. The Battle of Pride and Glory, for the World to Witness ⚔🔥#Kanguva's mighty reign storms screens from 14-11-24 🤎#KanguvaFromNov14 🦅 @Suriya_offl @thedeol @directorsiva @DishPatani @ThisIsDSP #StudioGreen @GnanavelrajaKe @vetrivisuals @supremesundar @UV_Creations… pic.twitter.com/de3yYAL0BI— Studio Green (@StudioGreen2) September 19, 2024 -
రజనీకాంత్‌తో హుక్ స్టెప్.. డబుల్ హ్యాపీ: మంజు వారియర్
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీని టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘వేట్టయాన్’ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 10న రిలీజ్ కానుంది. రీసెంట్గా ఈ సినిమా నుంచి ‘మెరుపై వచ్చాడే’ అంటూ సాగే ‘మనసిలాయో...’ సాంగ్ విడుదలైంది. ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాదు... ఈ పాటలో అదిరి పోయే స్టెప్పులేసి మంజు వారియర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.(చదవండి: ఒక్కసారి ఫిక్స్ అయితే ఎంత కష్టపడటానికైనా రెడీ!)ఇక ‘వేట్టయాన్’ సినిమాలో తన పాత్ర గురించి మంజు వారియర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ– ‘‘మనసిలాయో...’ పాటకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సెలబ్రేషన్ సాంగ్‌ను నేను చాలా సినిమాల్లో చూశాను. ఇప్పుడు ఈ తరహా సాంగ్‌లో డ్యాన్స్ చేయడం నాకు చాలా సరదాగా అనిపించింది. అంతమంది డ్యాన్సర్స్ సెట్స్‌లో ఉన్నప్పుడు ఒకే రిథమ్‌లో హుక్ స్టెప్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది.(చదవండి: ఆడది అబల కాదు సబల అని నిరూపించిన సినిమా)అలాగే అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌లో నేను చేసిన తొలి పాట కూడా ఇదే. ఇక జ్ఞానవేల్గారి ‘జై భీమ్’ సినిమా చూసిన తర్వాత ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తే బాగుంటుందనిపించింది. ఆ సమయంలో ‘వేట్టయాన్’ సినిమాతో ఆయన నన్ను అ్రప్రోచ్ అయ్యారు. పైగా రజనీకాంత్‌గారు కూడా ఉంటారని చెప్పారు. దీంతో డబుల్ హ్యాపీ ఫీలయ్యాను. రజనీగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో నేను రజనీగారి భార్య తారగా కనిపిస్తాను. ఇంకా విజయ్ సేతుపతి ‘విడుదలై 2’, మోహన్‌లాల్ ‘ఎల్: ఎంపురాన్’ (లూసిఫర్ సీక్వెల్) చిత్రాల్లో నటిస్తున్నాను’’ అన్నారు. ఇక అక్టోబరులో ‘వేట్టయాన్’తో, డిసెంబరులో ‘విడుదలై 2’తో రెండు నెలల గ్యాప్‌తో తెరపై కనిపిస్తారు మంజు.