ఇండియన్2, వేట్టయన్, కంగువా సినిమా ఫలితాలతో తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాలు అనుకున్నంత స్థాయిలో రానించలేదు. దీంతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా నష్టాలు తప్పలేదు. సినిమా బాగున్నప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక అంచనాకు వచ్చింది.
సినిమా విడుదలైన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్, నెటిజన్లు ఇచ్చే రివ్యూలు సినిమా రిజల్ట్‌పై పడుతుందని కోలీవుడ్ నిర్మాతలు గ్రహించారు. భారీ బడ్జెట్‌తో ఈ ఏడాదిలో తెరకెక్కిన సినిమాలపై వారి రివ్యూలు చాలా ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఇండియన్2. వేట్టయాన్,కంగువా సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే పలు యూట్యూబ్ ఛానల్స్ తెరపైకి వచ్చాయి. మూవీ బాగలేదంటూ రివ్యూలు ఇవ్వడం చేశాయి. దీంతో ఈ చిత్రాలపై చాలా ప్రభావం చూపింది. భవిష్యత్‌లో ఇండస్ట్రీకి ఇదొక సమస్యగా మారుతుందని వారు భావించారు.
దీనిని అరికట్టేందుకు థియేటర్ యజమానులు ముందుకు రావాలని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. కొత్త సినిమా విడుదలైన రోజున థియేటర్ ప్రాంగణంలోకి యూట్యూబ్ ఛానల్స్ వారిని అనుమతించరాదని వారు తెలిపారు. పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని పేర్కొంది. రివ్యూల పేరుతో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలను దూషించినా వదిలిపెట్టమని వారు హెచ్చరించారు.
కంగువా, సినిమా విడుదల సమయంలో ఫస్ట్ డే నాడే దారుణమైన రివ్యూలు ఇవ్వడంతో రెండోరోజు సినిమాకు వెళ్లే వారిపై ప్రభావం చూపింది. ఇందులో సూర్య నటన బాగుంది అంటూనే.. సినిమా ఏమాత్రం బాగాలేదని కామెంట్లు చేశారు. ఈ విషయంపై నటి జ్యోతక కూడా రియాక్ట్ అయింది. కంగువా సినిమాపై వచ్చిన నెగటివ్ రివ్యూలు చూసి తాను ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపింది. ఒకరకంగా ఈ రివ్యూల వల్లే సినిమాకు మైనస్ అయిందని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా మొదటిరోజే ఇంతటి నెగిటివ్ రివ్యూలు చూడటం బాధగా ఉందని తెలిపింది. కానీ, ఈ చిత్రంలోని పాజిటివ్స్‌ను ఎవరూ చెప్పలేదని ఆమె పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment