Bharateeyudu 2 Movie
-
వేట్టయన్, కంగువా, సినిమాల ఎఫెక్ట్.. కోలీవుడ్ కీలక నిర్ణయం
ఇండియన్2, వేట్టయన్, కంగువా సినిమా ఫలితాలతో తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాలు అనుకున్నంత స్థాయిలో రానించలేదు. దీంతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా నష్టాలు తప్పలేదు. సినిమా బాగున్నప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక అంచనాకు వచ్చింది.సినిమా విడుదలైన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్, నెటిజన్లు ఇచ్చే రివ్యూలు సినిమా రిజల్ట్‌పై పడుతుందని కోలీవుడ్ నిర్మాతలు గ్రహించారు. భారీ బడ్జెట్‌తో ఈ ఏడాదిలో తెరకెక్కిన సినిమాలపై వారి రివ్యూలు చాలా ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఇండియన్2. వేట్టయాన్,కంగువా సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే పలు యూట్యూబ్ ఛానల్స్ తెరపైకి వచ్చాయి. మూవీ బాగలేదంటూ రివ్యూలు ఇవ్వడం చేశాయి. దీంతో ఈ చిత్రాలపై చాలా ప్రభావం చూపింది. భవిష్యత్‌లో ఇండస్ట్రీకి ఇదొక సమస్యగా మారుతుందని వారు భావించారు. దీనిని అరికట్టేందుకు థియేటర్ యజమానులు ముందుకు రావాలని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. కొత్త సినిమా విడుదలైన రోజున థియేటర్ ప్రాంగణంలోకి యూట్యూబ్ ఛానల్స్ వారిని అనుమతించరాదని వారు తెలిపారు. పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని పేర్కొంది. రివ్యూల పేరుతో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలను దూషించినా వదిలిపెట్టమని వారు హెచ్చరించారు.కంగువా, సినిమా విడుదల సమయంలో ఫస్ట్ డే నాడే దారుణమైన రివ్యూలు ఇవ్వడంతో రెండోరోజు సినిమాకు వెళ్లే వారిపై ప్రభావం చూపింది. ఇందులో సూర్య నటన బాగుంది అంటూనే.. సినిమా ఏమాత్రం బాగాలేదని కామెంట్లు చేశారు. ఈ విషయంపై నటి జ్యోతక కూడా రియాక్ట్ అయింది. కంగువా సినిమాపై వచ్చిన నెగటివ్ రివ్యూలు చూసి తాను ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపింది. ఒకరకంగా ఈ రివ్యూల వల్లే సినిమాకు మైనస్ అయిందని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా మొదటిరోజే ఇంతటి నెగిటివ్ రివ్యూలు చూడటం బాధగా ఉందని తెలిపింది. కానీ, ఈ చిత్రంలోని పాజిటివ్స్‌ను ఎవరూ చెప్పలేదని ఆమె పేర్కొంది. -
ఫ్యాన్స్‌కు 'శంకర్' షాక్.. ఆ సినిమా రీషూట్ కోసం రూ. 100 కోట్లు
టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్‌లో కూడా ప్రస్తుతం సీక్వెల్స్ సీజన్ నడుస్తుందనే చెప్పాలి. తెలుగులో సలార్, కల్కి, దేవర చిత్రాలకు సీక్వెల్స్ ఉంటాయని ప్రకటించారు. అయితే వీటికి సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. తమిళ చిత్రాలు విషయానికొస్తే భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన భారతీయుడు – 2 చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ చిత్రానికి 3వ సీక్వెల్‌ని కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా తాజాగా విడులైన సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని పేర్కొన్నారు. కంగువ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీనికి సీక్వెల్ నిర్మాణానికి కూడా కొంత సమయాన్ని తీసుకుంటున్నట్లు నిర్మాత చెబుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన భారతీయుడు చిత్రం 1996లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. దీంతో దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అది తెర రూపం దాచడానికి 28 ఏళ్లకు పైగా పట్టింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నా భారతీయుడు – 3 చిత్రాన్ని కూడా ఏకకాలంలో రూపొందించారు. అయితే భారతీయుడు – 2 చిత్రం విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పార్ట్ – 3 విడుదల సందిగ్ధంలో పడింది. ఈ క్రమంలోనే దీనిని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయడానికి దర్శకుడు శంకర్, నటుడు కమలహాసన్ సిద్ధంగా లేరని తెలిసింది. అదేవిధంగా భారతీయుడు– 2 మాదిరిగా పార్ట్- 3 కాకూడదని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమని నటుడు కమలహాసన్ దర్శకుడు శంకర్‌కు సూచించినట్లు సమాచారం. శంకర్ కూడా అందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రూ.100 కోట్లు ఉంటేనే..భారతీయుడు – 3 చిత్రం కోసం ఆయన నిర్మాణ సంస్థ లైకాకు మరో రూ.100 కోట్లు బడ్జెట్‌ను సమకూర్చమని చెప్పినట్లు సమాచారం. కాగా శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ నటుడు రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన తెరపైకి రానుంది. ఆ తర్వాత భారతీయుడు– 3 చిత్ర రీషూట్‌కు శంకర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. -
ఇండియన్ 2 ఫ్లాప్ అయినందుకు సంతోషం: రేణు దేశాయ్
భారతీయుడు సినిమా ఎంత హిట్టో దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన భారతీయుడు 2 అంత ఫ్లాప్‌గా నిలిచింది. కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో విడుదలవగా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ మూవీ వీక్షించిన నటి రేణు దేశాయ్ సినిమా టీమ్‌పై ఫైర్ అయింది. ఇటువంటి సినిమాలు ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. చాలా సంతోషంఆమె ఇలా మాట్లాడటానికి అందుకు కారణం లేకపోలేదు. ఈ సినిమాలో వీధికుక్కలను హీనంగా చూసే డైలాగ్ ఉంటుంది. ఆ క్లిప్పింగ్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన రేణు దేశాయ్.. తెలివితక్కువ రచయితలు ఇలాంటి డైలాగ్స్ ఎలా రాస్తారు? అసలు వాళ్లకు ఏమైంది? అని మండిపడింది. ఇకపోతే ఇండియన్ 2తో ట్రోలింగ్ బారిన పడ్డ శంకర్ తర్వాతి పార్ట్ విషయంలో అయినా జాగ్రత్త వహిస్తే బెటర్ అని నెటిజన్లు సూచిస్తున్నారు!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓటీటీలో భారతీయుడు-2 రిలీజ్.. శంకర్ ను తిట్టిపోస్తున్న నెటిజెన్స్..
-
భారతీయుడు 2 ఫ్లాప్.. నా వల్లే అంటున్నారు: హీరోయిన్
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2 మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. భారతీయుడు సినిమా అద్భుతంగా ఉంటే దాని సీక్వెల్ దరిదాపుల్లో కూడా లేదని పలువురూ విమర్శించారు. ఈ మూవీ విడుదలైనప్పుడు తనను తీవ్ర స్థాయిలో విమర్శించారంటోంది హీరోయిన్ ప్రియ భవానీ శంకర్.ముందే తెలిస్తే..హీరోయిన్ ప్రియ మాట్లాడుతూ.. నా కెరీర్లో నేను సంతకం చేసిన భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. ఈ మూవీ ఒప్పుకోగానే నాకు ఎన్నో ఛాన్సులు వచ్చాయి. పెద్ద సినిమాలు చేస్తేనే హీరోయిన్గా భావిస్తున్నారు. ఇకపోతే ఫ్లాప్ అవుతాయని ముందే తెలిస్తే ఎవరైనా సరే సినిమాలు ఎందుకు చేస్తారు? టెక్నీషియన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సినిమా హిట్టవ్వాలనే కష్టపడతారు.వర్కవుట్ కాకపోతే..అందరూ ఇష్టంగా కష్టపడి పని చేసినప్పుడు అది వర్కవుట్ కాకపోతే చాలా బాధేస్తుంది. ఇండియన్ 2 హిట్ అవదని తెలిసినా సరే దాన్ని నేను వదులుకోకపోయేదాన్ని. కమల్ -శంకర్ సర్ కాంబినేషన్లో మూవీని ఎవరు వద్దనుకుంటారు? కానీ జనాలు నన్ను మాటలతో వేధిస్తున్నారు. అందుకు బాధగా ఉంది. మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు సారీ..ఒక్కరే కారణం కాదుసినిమా వైఫల్యం ఒక్కరి మీదే ఆధారపడదు. ఎన్నో కారణాలు ముడిపడి ఉంటాయి. కానీ నేనే కారణమంటే మనసుకు బాధేస్తోంది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియ భవానీ శంకర్ 'డీమాంటి కాలనీ' సినిమాలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
ఓటీటీలోకి 'భారతీయుడు 2'.. అధికారిక తేదీ ప్రకటన
విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2'. దాదాపు 28 ఏళ్ల క్రితం వచ్చిన చిత్రానికి సీక్వెల్‌గా దీన్ని తెరకెక్కించారు. దాదాపు నాలుగేళ్ల పాటు పలు ఇబ్బందులు ఎదుర్కొని షూటింగ్ పూర్తి చేసి.. గత నెలలో థియేటర్లలో రిలీజ్ చేశారు. టాక్ తేడా కొట్టేయడంతో ఇప్పుడు అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు అధికారిక తేదీ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)కమల్ హాసన్-శంకర్ కాంబోలో వచ్చిన 'భారతీయుడు'.. 1996లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. లంచగొండితనం కాన్సెప్ట్ అప్పట్లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చింది. దీనికి సీక్వెల్‌ని తాజాగా జూలై 12న థియేటర్లలో రిలీజ్ చేశారు. కట్ చేస్తే కమల్ కెరీర్లోనే ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. కథాకథనాలు మరీ తీసికట్టుగా ఉన్నాయని ఆడియెన్స్ తేల్చేశారు.ఇకపోతే భారతీయుడు 2 సినిమా డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ముందు అనుకున్న ప్రకారం 6-8 వారాల తర్వాత స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. కానీ ఫ్లాప్ టాక్ రావడంతో ప్లాన్ మారింది. 28 రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఆగస్టు 9 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓటీటీలో రిలీజ్ ఉంటుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్)Thatha varaaru, kadhara vida poraaru 🔥#Indian2 is coming to Netflix on 9 August in Tamil, Telugu, Malayalam and Kannada!#Indian2OnNetflix pic.twitter.com/cJN0JWaprp— Netflix India South (@Netflix_INSouth) August 4, 2024 -
భారతీయుడి బాధలు అన్ని ఇన్ని కావు.. కంగువతో 1000 కోట్లు కొట్టేస్తా అంటున్న సూర్య..
-
భారతీయుడు 2 చిత్రానికి ఓటీటీ చిక్కులు
కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు 2 సినిమాకు ఓటీటీ చిక్కులు ఎదురుకానున్నాయని తెలుస్తోంది. జులై 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్‌గా మిగిలిపోయింది. సినిమాలో డైరెక్టర్ శంకర్ మార్క్ ఎక్కడా కనిపించకపోవడంతో ప్రేక్షకులు కూడా పెద్దగా ఆదరించలేదు. సినిమాపై ఆశలు పెట్టుకుని భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. దీంతో భారతీయుడు 2 ఓటీటీ విషయంలో సందిగ్ధత నెలకొనే అవకాశాలు ఉన్నాయి.1996లో విడుదలైన భారతీయుడు సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా పార్ట్ 2 వచ్చింది. ఇందులో కమల్ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు. సినిమా విడుదలకు ముందు భారీ బజ్ క్రియేట్ కావడంతో భారతీయుడు 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.120 కోట్లకు డీల్ సెట్ చేసుకుందని సమాచారం. అయితే, సినిమా విడుదలయ్యాక పరిస్థితి మారిపోయింది. దీంతో డీల్ ప్రకారం ఉన్న అంత మొత్తం చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్ ముందుకు రావడం లేదట. ఈమేరకు లైకా ప్రొడక్షన్స్‌తో మళ్లీ చర్చలు జరిపి రూ. 60 కోట్లకు ఫైనల్ చేయాలని కోరిందట. ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో భారతీయుడు ఓటీటీలో వచ్చేందుకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో రజనీకాంత్ 'లాల్ సలామ్', టైగర్ ష్రాఫ్ 'గణపత్' కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఇలాంటి అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. భారతీయుడు 2 కోసం సుమారు రూ. 250 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా.. అయితే, ఈ సినిమా రూ. 120 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. -
ఓటీటీలో భారతీయుడు 2.. అంచనాలు తప్పడంతో మార్పులు
కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 1996లో విడుదలైన భారతీయుడు సూపర్ హిట్ దక్కించుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్ 2 జులై 12న విడుదలైంది. అయితే, సినిమా భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు.భారతీయుడు 2 సినిమాను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. కోలీవుడ్‌లో అత్యంత ఎక్కువ ధరతో ఈ సినిమా రైట్స్‌ను వారు తీసుకున్నట్లు సమాచారం. విడుదల సమయం నుంచి సుమారు 2 నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకురావలనే షరతుతో నెట్‌ఫ్లిక్స్ అగ్రిమెంట్ చేసుకుందట. వారి ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 12 తర్వాత ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. కానీ, సినిమా రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఇప్పటి వరకు కనీసం రూ.70 కోట్లు కూడా దాటలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో నిర్మాతలకు కూడా తీరని నష్టాన్ని ఇండియన్ 2 సినిమా మిగిల్చిందనే చెప్పవచ్చు.భారతీయుడు 2 చిత్రాన్ని ఇప్పటికే చాలాచోట్ల తొలగించేశారు. ఓటీటీలో చూడొచ్చని ప్రేక్షకులు కూడా డిసైడ్ అయిపోయారు. దీంతో ఈ చిత్రాన్ని అగ్రిమెంట్ ప్రకారం కాకుండా నెలలోపే ఓటీటీలోకి తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుందట. ఆగష్టు 2న భారతీయుడు 2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ మంతనాలు జరుపుతుందట. ఈమేరకు అధికారికంగా త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది. -
మెగా ప్యాన్స్‌ని భయపెడుతున్న ‘భారతీయుడు’
సాధారణంగా పెద్ద డైరెక్టర్ల సినిమాకు డిజాస్టర్ టాక్ వస్తే..దాని ఎఫెక్ట్ నెక్ట్స్ ఫిల్మ్‌పై కచ్చితంగా ఉంటుంది. సదరు డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు కూడా. ఒకవేళ అల్రేడీ సినిమా స్టార్ట్ చేసి ఉంటే.. సదరు హీరో అభిమానులకు టెన్షన్ తప్పదు. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి ఆ టెన్షన్ పట్టుకుంది. ‘భారతీయుడు 2’ రిజల్ట్ చూసి వారు భయపడిపోతున్నారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.భారతీయుడు 2 రిజల్ట్ చూసిన తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో టెన్షన్ మొదలైంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ డిలే కావడంతో రీలీజ్ పోస్ట్ పోన్ అయింది. అయితే మొన్నటి వరకు చరణ్ ఫ్యాన్స్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ప్రకటించాలని టీమ్‌పై ఒత్తిడి తెచ్చారు. అప్డేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడయా వేదికగా శంకర్‌కి, నిర్మాత దిల్‌రాజ్‌కి విజ్ఞప్తులు చేశారు. కానీ ఇప్పుడు అదే ఫ్యాన్స్.. ఇప్పట్లో రిలీజ్ వద్దంటూ వేడుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శంకర్‌పై ఫుల్ ట్రోలింగ్ నడుస్తోంది. భారతీయుడు 2 చిత్రాన్ని నాసిరకంగా తెరకెక్కించారంటూ శంకర్‌ని విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా.. ట్రోలింగ్ తప్పదు. అందుకే కొన్నాళ్ల పాటు ఎలాంటి ప్రకటనలు చేయొద్దని, వీలైతే రిలీజ్ డేట్‌ని కూడా పోస్ట్‌పోన్ చేసుకోండి అని చిత్ర యూనిట్‌కి మెగా ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. -
'భారతీయుడు 2' కంటే 'కల్కి'పైనే కమల్ స్పెషల్ ఇంట్రెస్ట్!
విలక్షణ నటుడు కమల్ హాసన్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఇది 'భారతీయుడు 2' మూవీ గురించి అనుకుంటే మీ పొరపాటే. ఎందుకంటే ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ అయిందని ఈయనకు కూడా తెలిసినట్లు ఉంది. దీంతో పూర్తిగా మర్చిపోయినట్లు ఉన్నారు. మరోవైపు 'కల్కి' సక్సెస్ గురించి ఏకంగా మూడున్నర నిమిషాలు మాట్లాడారు.(ఇదీ చదవండి: 'పొలిమేర' నిర్మాతల మధ్య వివాదం.. బెదిరింపులు-కేసుల వరకు!)కమల్ హాసన్ లీడ్ రోల్ చేసిన 'భారతీయుడు 2' రీసెంట్గా థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందు ఓ మాదిరి అంచనాలు ఉండేవి. కానీ సినిమా మరీ ల్యాగ్ ఉండటం పెద్ద మైనస్ అయింది. దీంతో ఘోరమైన డిజాస్టర్ దిశగా వెళ్తోంది. మరోవైపు దీనికి రెండు వారాల ముందు రిలీజైన పాన్ ఇండియా మూవీ 'కల్కి'లోనూ సుప్రీం యాష్కిన్ అనే విలన్ పాత్రని కమల్ చేశారు. రెండు మూడు సీన్లలో కనిపించినప్పటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ క్రమంలోనే కమల్ హాసన్ 'కల్కి' బ్లాక్ బస్టర్ కావడంపై స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. మూవీ టీమ్‌ని అభినందిస్తూనే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ని ఆకాశానికెత్తేశారు. దాదాపు మూడన్నర నిమిషాలు మాట్లాడారు. 'కల్కి' గురించి చాలా మాట్లాడారు కానీ రిలీజ్ తర్వాత 'భారతీయుడు 2' గురించి ఒక్క ట్వీట్, పోస్ట్, వీడియో గానీ కమల్ పెట్టలేదు. అంటే ఈయనకు కూడా రిజల్ట్ ఏంటే అర్థమైపోయింది అనుకుంటా!(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి) -
పొరపాటు సరిదిద్దుకున్న 'భారతీయుడు 2'.. ఇదేదో ముందే చేసుంటే!
తప్పు జరిగిన తర్వాత కానీ సేనాపతి తాతయ్యకి ఎంత పొరపాటు జరిగిందో తెలిసీ రాలేదు. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన 'భారతీయుడు 2' తొలిరోజు తొలి ఆట నుంచే ఘోరమైన నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రారంభ షోలు చూసిన వాళ్ల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ తర్వాత మాత్రం టాక్ పూర్తిగా మారిపోయింది. చాలా తక్కువమంది మాత్రమే పాజిటివ్ అన్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే మూవీ టీమ్ పొరపాటు సరిదిద్దుకుంది.యాక్షన్ సినిమాల్లాంటివి అంటే మూడు గంటలు చూస్తారు గానీ డ్రామా ఉండే సినిమాలు ఎంత క్రిస్పీగా ఉంటే అంత బెటర్. ఇలానే తను తీసిన సీన్లపై నమ్మకంతో దాదాపు 3 గంటల నిడివితో 'భారతీయుడు 2'ని డైరెక్టర్ శంకర్.. ప్రేక్షకుల ముందుకు వదిలారు. ఇంత ల్యాగ్ ఏంట్రా బాబు అని చెప్పి అదే ఆడియెన్స్ సైడ్ చేసేశారు. దీంతో సినిమాలో అనవసరంగా అనిపించిన 20 నిమిషాల సన్నివేశాల్ని ఇప్పుడు తీసేశారు.(ఇదీ చదవండి: Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ)అలా 2 గంటల 40 నిమిషాల ఎడిట్ వెర్షన్‌ని ఆదివారం నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ న్యూస్ బయటకొచ్చిన వెంటనే.. నెటిజన్లు కూడా తలో రకంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ పనేదో ముందే చేసుంటే కొంతలో కొంత డ్యామేజ్ కంట్రోల్ అయ్యేదని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా చేతులు కాల్చుకున్న తర్వాత గానీ భారతీయుడు తాతయ్య ఆకులు గుర్తుకురాలేదు!ఇదిలా ఉండగా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 'భారతీయుడు 2' సినిమాకు రూ.12 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెగిటివ్ టాక్, మరోవైపు సీన్లు తీసేసిన దృష్ట్యా ఆడియెన్స్ ఏ మేరకు థియేటర్లకు వెళ్తారనేది చూడాలి?(ఇదీ చదవండి: 'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!) -
'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!
'భారతీయుడు 2' నిన్న థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శుక్రవారం నాడు బాగానే ఆక్యుపెన్సీలు కనిపించాయి. తమిళంలో ఇలా కూడా కనిపించలేదు. అయితే సినిమా మరీ అంత కాకపోయినా ఓ మాదిరి అంచనాలతో బరిలో నిలిచింది. కానీ కనీసం అంటే కనీస వసూళ్లు రావడం కూడా కష్టమే అనిపిస్తుంది. అయితే సినిమాకు ఇలా అవుతుందని కమల్ ముందే పసిగట్టాడా అని సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: భారతీయుడు 2 కలెక్షన్స్.. తొలిరోజు ఎన్ని కోట్ల రూపాయలంటే?)1996లో వచ్చిన 'భారతీయుడు'.. అప్పట్లో తెలుగు, తమిళ అనే తేడా లేకుండా సెన్సేషన్ సృష్టించింది. దీనికి సీక్వెల్ తీయాలని చాలా ఏళ్ల క్రితమే అనుకున్నారు. కాకపోతే షూటింగ్లో ప్రమాదం, కరోనా వల్ల లేట్ అయిపోయింది. ఎలాగోలా పూర్తి చేసి తాజాగా థియేటర్లలోకి తీసుకొచ్చారు. సీక్వెల్ ఒకటే అనుకున్నది కాస్త రెండు భాగాలైంది. ఇప్పుడు రెండో భాగం రిలీజ్ చేయగా, ఆరు నెలల తర్వాత మూడో భాగాన్ని విడుదల చేయనున్నారు.'భారతీయుడు 2' ఫలితాన్ని కమల్ హాసన్ ముందే పసిగట్టేశాడో ఏమో గానీ రిలీజ్‌కి ముందే తనకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో నిర్మాణ సంస్థ లైకా రెండు భాగాలకు తలో రూ.75 కోట్ల చెప్పున మొత్తంగా రూ.150 కోట్లు ఇచ్చిందట. మిగతా నటీనటులకు మాత్రం ఒక్క మూవీకి అన్నట్లే పారితోషికంగా ఇచ్చారు. ఇక ప్రాజెక్టులో డైరెక్టర్ శంకర్ కూడా భాగస్వామినే. కాబట్టి అతడికి కూడా నష్టాలు గ్యారంటీ. ఓవరాల్‌గా 'భారతీయుడు 2' వల్ల ఎవరైనా లాభపడ్డారంటే అది కమల్ మాత్రమే అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' చూసి కన్నీళ్లు పెట్టుకున్నా: బిగ్‌బాస్ భోలే షావలి) -
భారతీయుడు 2 మూవీ స్టిల్స్ HD
-
భారతీయుడు 2 కలెక్షన్స్.. ఆ సినిమాకు దరిదాపుల్లో కూడా లేవు
కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 1996లో విడుదలైన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా జులై 12న ఈ మూవీ విడుదలైంది. ఇందులో కమల్ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు. అయితే, సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదని చాలామంది క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సినిమాకు మొదటిరోజు కలెక్షన్స్ కూడా పెద్దగా రాబట్టలేదని తేలుతుంది.(చదవండి: : ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ)ఇండియన్ 2 మూవీ తొలిరోజు రూ. 26.1 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళ్ వర్షన్లో రూ. 16 కోట్లు వస్తే.. తెలుగులో రూ. 8 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక హిందీలో అయితే మరీ దారణంగా కలెక్షన్స్ వచ్చాయి. బాలీవుడ్లో మొదటిరోజు కేవలం కోటి రూపాయలు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. శంకర్ లాంటి పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ సినిమాకు బాలీవుడ్లో ఇంత తక్కువ కలెక్షన్స్ రావడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.2022లో విడుదలైన విక్రమ్ సినిమా మొదటిరోజు రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, భారతీయుడు 2 మూవీ మాత్రం విక్రమ్ కలెక్షన్స్‌కు దరిదాపుల్లో కూడా చేరుకోలేకపోయింది. ఇదే క్రమంలో డైరెక్టర్ శంకర్ చివరి సినిమా రోబో 2.ఓ తొలిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లకు పైగా రాబట్టింది. భారతీయుడు 2 సినిమా బాగాలేదంటూ ఇప్పటికే మోత్ టాక్ పబ్లిక్‌లోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా తెలంగాణలో ఈ సినిమా టిక్కెట్ల ధరలు పెంచారు. ఈ ప్రభావం భారతీయుడు 2 కలెక్షన్ల మీద భారీగా పడనుంది. ఒక డబ్బింగ్ సినిమాకు టిక్కెట్ల ధరలు పెంచుకోవడం ఏంటి..? అనే విమర్శలు కూడా వస్తున్నాయి. కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో సినిమా కదా చూసేద్దామని కుటుంబంతో వీకెండ్లో సినిమా ప్లాన్ చేసుకునే వారు కూడా భారతీయుడు వైపు వెళ్లకుండా చేసేలా టికెట్ల ధరలు ఉన్నాయిని నెటిజన్లు వాపోతున్నారు. -
'భారతీయుడు 2' ఆ ఓటీటీలోనే.. ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఎట్టకేలకు భారతీయుడు తాత థియేటర్లలోకి వచ్చేశాడు. అప్పుడెప్పుడో 1996లో వచ్చిన సినిమాకు సీక్వెల్‌ని తాజాగా బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ చేశారు. తెలుగు, తమిళంలో వచ్చిన ఈ చిత్రానికి తొలి ఆట నుంచి మిక్స్డ్ టాక్ వచ్చేసింది. మరోవైపు ఈ చిత్ర ఓటీటీ పార్ట్నర్ ఎవరనేది కూడా క్లారిటీ వచ్చేసింది. అలానే స్ట్రీమింగ్ డేట్ కూడా ఇదే కావొచ్చని టాక్ కూడా వినిపిస్తోంది.(ఇదీ చదవండి: మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే?)కమల్ హాసన్ - శంకర్ కాంబోలో అప్పట్లో వచ్చిన 'భారతీయుడు'.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. తీసింది తమిళంలో అయినా తెలుగు డబ్బింగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక కొన్నేళ్ల క్రితం రెండో భాగాన్ని మొదలుపెట్టగా.. కొవిడ్, షూటింగ్ స్పాట్లో ప్రమాదం వల్ల ఏళ్లకు ఏళ్లు లేట్ అవుతూ వచ్చింది. చివరకు ఎలాగోలా పూర్తి చేసి ఇప్పుడు థియేటర్లలోకి తీసుకొచ్చారు.సినిమా మరీ ల్యాగ్ ఉందని చూసొచ్చిన ప్రేక్షకులు అంటున్నారు. తాతయ్య మరీ విసిగించేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే 'భారతీయుడు 2' డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. లెక్క ప్రకారం అయితే 6-8 వారాల తర్వాత రావొచ్చు. కానీ టాక్ తేడాగా వస్తుండటంతో 4-5 వారాల్లోపే వచ్చే అవకాశముంది. దీనిబట్టి చూస్తే ఇండిపెండెన్స్ డే వీక్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.(ఇదీ చదవండి: ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు) -
Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ
టైటిల్: భారతీయుడు 2(ఇండియన్ 2)నటీనటులు: కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్,సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్నిర్మాత: సుభాస్కరన్ కథ, దర్శకత్వం: ఎస్.శంకర్‌సంగీతం: అనిరుధ్ రవిచందర్ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌విడుదల తేది: జులై 12, 2024కమల్ హాసన్ నటించిన బెస్ట్ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1996లో విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘భారతీయుడు 2’(Bharateeyudu 2 Review) పై భారీ హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. భారతీయుడు 2 కథేంటంటే..చిత్ర అరవిందన్(సిద్దార్థ్), హారతి(ప్రియాభవాని శంకర్) ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాలపై వీడియోలు చేసి బార్కింగ్ డాగ్స్ అనే పేరుతో య్యూట్యూబ్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేస్తుంటారు. వారి చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు చూసి చలించిపోయిన అరవిందన్.. మళ్లీ భారతీయుడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. కమ్‌బ్యాక్ ఇండియా(Comeback India) హ్యాష్‌ట్యాగ్‌తో సేనాపతి(కమల్ హాసన్) మళ్లీ ఇండియా రావాలని పోస్టులు పెడతారు. అవికాస్త వైరల్ అయి.. చైనీస్ తైపీలో ఉన్న సేనాపతి అలియాస్ భారతీయుడుకి చేరతాయి. దీంతో సేనాపతి తిరిగి ఇండియా వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారి ప్రమోద్(బాబీ సింహా).. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ భారతీయుడు గెటప్స్ మారుస్తూ అవినీతికి పాల్పడిన వారిని దారుణంగా హత్య చేస్తుంటారు. భారతీయుడు ఇచ్చిన పిలుపుతో దేశంలోని యువత కూడా అవితీనికి వ్యతిరేకంగా పని చేస్తుంటుంది. ఈ క్రమంలో అరవిందన్ ఫ్యామిలీలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి కారణంగా భారతీయుడే అని అరవిందన్‌తో సహా అందరూ నిందిస్తారు. అసలు అరవిందన్ ఇంట్లో చోటు చేసుకున్న ఆ విషాదం ఏంటి? దానికి భారతీయుడు ఎలా కారణం అయ్యాడు? కమ్‌బ్యాక్ ఇండియా అని భారతీయుడిని ఆహ్వానించిన యువతే.. గోబ్యాక్ ఇండియా అని ఎందుకు నినదించారు? సామాన్యులకు సైతం భారతీయుడుపై ఎందుకు కోపం పెరిగింది? రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటూ వేలకోట్లు సంపాదించిన సద్గుణ పాండ్యన్(ఎస్ జే సూర్య)..సేనాపతిని చంపేందుకు వేసిన ప్లాన్ వర్కౌంట్ అయిందా? సీబీఐ అధికారులకు దొరికిన సేనాపతి..వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు సేనాపతి టార్గెట్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అంటెండర్ దగ్గర నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో ‘భారతీయుడు’లో కళ్లకు కట్టినట్లు చూపించాడు శంకర్. ఆ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా.. ఆ కథ, అందులోని పాత్రలు మనకు అలా గుర్తిండిపోతాయి. అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే..కచ్చితంగా అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా భారతీయుడు 2ని తీర్చిదిద్దలేకపోయాడు శంకర్. స్టోరీ లైన్ మాత్రమే కాదు చాలా సన్నివేశాలు ‘భారతీయుడు’చిత్రాన్నే గుర్తు చేస్తాయి. అయితే అందులో వర్కౌట్ అయిన ఎమోషన్ ఇందులో మిస్ అయింది. ప్రతి సీన్ సినిమాటిక్‌గానే అనిపిస్తుంది కానీ.. ఎక్కడ కూడా రియాల్టీగా దగ్గరగా ఉండదు. స్క్రీన్‌ప్లే కూడా చాలా రొటీన్‌గా ఉంటుంది. పార్ట్ 3 కోసమే అన్నట్లుగా కథను సాగదీశారు. కొన్ని సీన్లు చూస్తే నిజంగానే ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారా అనే అనుమానం కలుగుతుంది. భారతీయుడులో అవినీతికి పాల్పడిన వారిని సేనాపతి చంపుతుంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఇందులో మాత్రం అలాంటి సీన్లను కూడా చాలా చప్పగా తీసేశాడు. సినిమా నిడివి( 3 గంటలు) కూడా మైనస్సే. కొన్ని సీన్లను తొలగించి.. నిడివిని తగ్గిస్తే బాగుండేది (తొలగించడానికి ఒక్క సీన్ లేదనే పార్ట్ 3 ప్లాన్ చేశామని ఓ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పారు..కానీ సినిమా చూస్తే సాధారణ ప్రేక్షకుడు సైతం కట్ చేయాల్సిన సీన్ల గురించి చెప్పగలడు). ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. భారతీయుడు సినిమాలాగే ఈ కథ కూడా మొత్తం లంచం చుట్టే తిరుగుతుంది. సినిమా ప్రారంభ సీన్‌తోనే ఆ విషయం అర్థమైపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా చిత్ర అరవిందన్ గ్యాంగ్ చేసే పోరాటం కాస్త ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. అవినీతి జరిగే సీన్లను బలంగా చూపించలేకపోయాడు. ఇక సేనాపతి ఎంట్రీ సీన్‌తో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత..కథనం రొటీన్‌గా సా..గూ..తూ.. చిరాకు తెప్పిస్తుంది. తరువాత ఏం జరుగుతందనే విషయం ముందే తెలిసిపోవడంతో.. కథపై అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సింపుల్‌గానే ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథ మరింత సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మర్మకళను ఉపయోగించి సీక్స్ ఫ్యాక్‌తో కమల్ చేసే యాక్షన్ సీన్ బాగుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే ఛేజింగ్ సీన్ అయితే సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపులో పార్ట్ 3 స్టోరీ ఎలా ఉంటుందో చూపించారు. అది కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అవినీతిని అంతం చేయాలంటే అది మొదట మన ఇంటి నుంచే ప్రారంభించాలని యూత్‌కి ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది. ఎవరెలా చేశారంటే..వైవిధ్యమైన పాత్రలు పోషించడం కమల్ హాసన్‌కు కొత్తేమి కాదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతుంటాడు. సేనాపతి పాత్రలో కమల్ ఒదిగిపోయాడు. రకరకాల గెటప్స్‌లో కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. అయితే ఆయన గొంతే ఒక్కో చోట ఒక్కోలా వచ్చింది. సిక్స్ ఫ్యాక్స్‌తో కమల్ చేసే యాక్షన్ సీన్‌కి థియేటర్లో ఈళలు పడతాయి.ఇక హీరో సిద్ధార్థ్‌కి మంచి పాత్ర దక్కింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే చిత్ర అరవిందన్ పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. సిద్ధార్థ్ స్నేహితురాలికిగా ప్రియా భవానీ శంకర్ ఆకట్టుకుంది. సిద్ధార్థ్ ప్రియురాలు దిశగా నటించిన రకుల్‌కి ఈ చిత్రంలో ఎక్కువగా స్క్రీన్ స్పేస్ లభించలేదు. సినిమా మొత్తంలో రకుల్ మూడు, నాలుగు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. సీబీఐ అధికారి ప్రమోద్‌గా బాబీ సింహా ఉన్నంతగా బాగానే నటించాడు. వ్యాపారీ సద్గుణ పాండ్యన్‌గా ఎస్ జే సూర్యకి పార్ట్ 3లోనే ఎక్కువ నిడివి ఉన్నట్లు ఉంది. ఇందులో కేవలం మూడు సీన్లలో కనిపించి వెళ్తాడు. ఏసీబీ అధికారిగా సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్‌గా సినిమా పర్వాలేదు.అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం యావరేజ్‌గా ఉంది. ఇక పాటలు గురించి మాట్లాడుకోవద్దు. ఒక్కటి కూడా గుర్తుంచుకునే విధంగా లేవు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.(Bharateeyudu 2 Telugu Movie Review)-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
భారతీయుడు 2 దెబ్బకు అక్షయ్ వెనక్కి
-
భారతీయుడు 2 దెబ్బకు అక్షయ్ వెనక్కి
-
రెహ్మాన్ రావాల్సిన ఛాన్స్..
-
Bharateeyudu 2 X Review: ‘భారతీయుడు 2’ టాక్ ఎలా ఉందంటే.. ?
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు(1996)’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అవినీతికి వ్యతిరేకంగా సేనాపతి(కమల్ హాసన్) చేసే పోరాటానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా విడుదలైన 28 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా భారతీయుడు 2(ఇండియన్ 2) వచ్చింది. సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలు తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న శంకర్.. మరోసారి తనదైన మార్క్ సందేశంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.Bharateeyudu 2 Telugu Review: ‘భారతీయుడు 2’ మూవీ ఎలా ఉందంటే..?ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘భారతీయుడు కథేంటి?, సేనాపతిగా మరోసారి కమల్ ఆకట్టుకున్నాడా? లేదా? శంకర్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. . ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్‌లో ‘భారతీయుడు 2’కి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. అంతగా ఆకట్టుకోలేకపోయిందని మరికొంత మంది ట్వీట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా వరకు నెగెటివ్ టాకే వినిపిస్తోంది. కొంతమంది అయితే ఈ చిత్రానికి నిజంగానే శంకర్ దర్శకత్వం వహించాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. #Bharateeyudu2 Movie Review 🔥🔥🔥 1/2Hats off to director #Shankar for his top level direction.#KamalHassan is steel the complete show. Social Message of the movie will reach to every audience.Overall movie wins normal audience heart💐💐#Bharateeyudu2Review#Indian2Review pic.twitter.com/tRB6cidHsV— Movie Muchatlu (@MovieMuchatlu1) July 12, 2024 డైరెక్టర్ శంకర్‌కి హాట్సాఫ్. అద్భుతంగా సినిమాని తెరకెక్కించాడు. కమల్ హాసన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సోషల్ మెసేజ్ ప్రతి ఆడియన్‌కి రీచ్ అవుతుంది. నార్మల్ ఆడియన్స్ మనసును కూడా ఆకట్టుకునేలా సినిమా ఉంది’ అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు. Genuine #Indian2Review/#Bharateeyudu2ReviewDISASTER👎Rating 1.5/5Impactless,Dragged, Boring,Outdated,Cringe Movie👎#Siddharth #KamalHaasan (Less Screen time) &Director #Shankar gone Outdated👎#Indian2 #Bharateeyudu2#Hindustani2Review #Hindustani2 https://t.co/3c9WuK58GK— #Kalki2989AD ❤ (@TheWarriorr26) July 12, 2024 భారతీయుడు 2 డిజాస్టర్ మూవీ. బోరింగ్, ఔడేటెడ్ స్టోరీ. సాగదీశారు. ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. డైరెక్టర్ శంకర్ పని అయిపోయింది’ అంటూ మరో నెటిజన్ కేవలం 1.5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు. first half: movie starts well, but follows conventional shankar sir’s screenplay making it very predictable and boring.. no gripping/exciting sequences.. needs a very strong second half #Indian2 #Bharateeyudu2 https://t.co/fgOf5prfHJ— movie buff (@newMovieBuff007) July 12, 2024 ఇప్పుడే ఫస్టాఫ్ కంప్లీట్ అయింది. మూవీ ప్రారంభం బాగానే ఉంది. కానీ కథ ముందుగు సాగుతున్నకొద్ది బోరింగ్‌గా అనిపించింది. శంకర్ స్క్రీన్‌ప్లే ఆకట్టుకోలేకపోయింది. గ్రిస్పింగ్‌గా, ఎగ్జైట్మెంట్ చేసే సీక్వెన్స్లేవి లేవు. సెకండాఫ్ బాగుండాల్సి ఉంది’అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు.. #Indian2 Review 1.5/5Fully disappointed Bad screenplay Emotions lackIndian 3 kastame... pic.twitter.com/fcaOB7vPHX— 👥𝕳𝖆𝖗𝖘𝖍𝖆💫 (@Harsh___07__) July 12, 2024 ‘సినిమా నిరుత్సాహపరిచింది. స్క్రీన్‌ప్లే అస్సల్ బాగోలేదు. ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ కాలేదు. ఇండియన్ 3 కష్టమే’ అని ఒకరు ట్వీట్ చేశారు.#Indian2 is an outdated and tedious movie. Though the movie tries to give honest messages, it’s done in a boring way with no proper emotion and drama at all. Shankar tried to repeat the screenplay of his old movies but fails to recreate the magic big time. All of the emotions…— Venky Reviews (@venkyreviews) July 12, 2024#Indian2 #Bharateeyudu2 #indian2review Telugu review:It’s just an average to below average movie. There is no story it is just like a set up to Indian3. Yes Indian3 trailer was played after the rolling titles and Indian3 seems pretty interesting and I think Indian3 would be…— Vijay (@vijay827482) July 12, 2024#Bharateeyudu2 #Indian2 Stil remember the first part can't say whether the sequel could match it as the bench mark was high it releases today but there is no buzz at least in Hindi. Why aren't films being promoted ##Kalki2898AD too was released in a similar way. WOM will decide.— Bhaskar Agnihotri (@BHASKARAGNIHOT) July 12, 2024#Indian2 #Bharateeydu2 #Indian2Review #Bharateeydu2Review #Review *Not Engaging at all*No shankar mark*No emotional ConnectDid Shankar directed this movie for real ?— Raju (@rsofficial18) July 12, 2024Finally Kamal Hassan's entry.. But it has zero impact in the audience with 30 mins of lag boring scenes. Even Kamal Hassan's entry failed to excite the mass audience. Till now, there is not even a single scene of Shankar's calibre #Indian2 #Bharateeyudu2 pic.twitter.com/gztpLV2iwJ— Taran Adarsh (@tarann_adarshh) July 12, 2024 -
భారతీయుడు 2 రిలీజ్.. టెన్షన్లో రామ్ చరణ్ ఫ్యాన్స్!
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 రేపు(జులై 12) విడుదల కానుంది. ఈ సినిమాపై పెద్దగా బజ్ లేకపోయినా.. తెలంగాణలో మాత్రం టికెట్స్ రేట్స్ పెంచడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. తమిళనాడు కంటే తెలంగాణలోనే టికెట్ ధరలు అత్యధికం. ఇది సినిమాకు ప్లస్ అవుతుందా లేదా అనేది రేపటి టాక్ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికి అయితే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. హిట్ టాక్ వస్తే.. ఆటోమేటిక్‌గా బుకింగ్స్ పెరుగుతాయి. ఒకవేళ నెగెటివ్ టాక్ వస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2ని ఆదరించడం కాస్త కష్టమే. ఎందుకంటే ఇప్పటికీ థియేటర్స్‌లో ‘కల్కి 2898 ఏడీ’ దుమ్ము రేపుతోంది. వీకెండ్లో చాలా మంది కల్కి 2898 మూవీ చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.(చదవండి: తెలుగులో ఇలా.. అక్కడేమో అలా.. టికెట్ ధరల్లో ఇంత తేడాలేంటి?)ఇన్ని సవాళ్ల మధ్య రిలీజ్ అవుతున్న భారతీయుడు 2 కచ్చితంగా విజయం సాధించాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దానికి కారణంగా డైరెక్టర్ శంకరే. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా పూర్తి కావోస్తోంది. అన్ని కుదిరితే ఈ ఏడాదిలో చివరల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రేపు విడుదలవుతున్న భారతీయుడు రిజల్ట్ కచ్చితంగా ఈ సినిమాపై ఉంటుంది. అది హిట్ అయితే గేమ్ ఛేంజర్‌కి ప్లస్ అవుతుంది. (చదవండి: కమల్ హాసన్ 'గుణ' రీ-రిలీజ్‌పై కోర్టు నోటీసులు)ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం గేమ్ ఛేంజర్‌కు కాస్త ఇబ్బందే. అదే ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్‌ని కలవరపెడుతోంది. అసలే శంకర్‌కి సాలిడ్ హిట్ లేక చాలా కాలం అవుతుంది. భారతీయుడు2తో కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. మరోవైపు సిద్ధార్థ్ కూడా ఈ చిత్రంపైనే ఆశలు పెంచుకున్నాడు. ఇందులో ఆయన పోషించింది చిన్న పాత్రే అయితే..హిట్ అయితే మాత్రం మంచి పేరే వస్తుంది. రకుల్‌కి కూడా భారతీయుడు2 హిట్ చాలా అవసరం. మరి వీరిద్దరి ఆశలు నెరవేరుతాయా లేదా అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. -
భారతీయుడు 2 ఎండింగ్లో బిగ్ సర్ప్రైజ్ ప్లాన్
భారతీయుడు.. కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇన్నేళ్ల తర్వాత వారిద్దరి కాంబోలేనే భారతీయుడు 2 సీక్వెల్ రానుంది. జులై 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు.'భారతీయుడు 2' సినిమా టికెట్లు ఆన్లైన్ పెట్టిన వెంటనే భారీగా అమ్ముడుపోతున్నాయి. వీటి ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 75 పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఫ్యాన్స్ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సినిమాను నిర్మించినట్లు తెలుస్తోంది. నాటికి, నేటికి సమాజంలో ఎలాంటి మార్పులు రాలేదని అందుకే పార్ట్ 2 నిర్మించామని కమల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సమాజాన్ని పట్టిపీడించే అవినీతిపై పోరాటం గురించి పార్ట్ 1 లోనే తాను చెప్పాలనుకుంది చెప్పానని డైరెక్టర్ శంకర్ అన్నారు. పార్ట్ 2ని అందుకు భిన్నంగా తెరకెక్కించాలనే క్రమంలోనే కథ రాసేందుకు చాలా సమయం పట్టిందని ఆయన అన్నారు.భారతీయుడు 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో డైరెక్టర్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదల సందర్భంగా కేరళలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. అందుకు అభిమానులు ఎవరికి తోచింది వారు చెప్పుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. భారతీయుడు 2 సినిమా ఎండ్ టైటిల్స్ తర్వాత ఇండియన్ 3 ట్రైలర్ చూపించబోతున్నట్లు నెట్టింట చర్చ జరుగుతుంది. పార్ట్ 3 చిత్రీకరణ కూడా ఇప్పటికే దాదాపు 70 శాతం పైగా జరిగినట్లు సమాచారం. ఎప్పుడో విడుదల కానున్న సినిమా ట్రైలర్‌ను ముందే విడుదల చేస్తున్నట్లు వార్తలు రావడంతో సినీ ప్రేమికులు సంతోషిస్తున్నారు. ఇలా భారతీయుడు 2 సినిమాలో పార్ట్ 3 ట్రైలర్‌ను విడుదల చేసి కమల్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసే పనిలో డైరెక్టర్ శంకర్ ఉన్నారని తెలుస్తోంది. -
భారతీయుడు 2 టీంకు అభినందనలు
-
'భారతీయుడు 2' టీమ్‌కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఎందుకంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కమల్ హాసన్ 'భారతీయుడు 2' చిత్రబృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ కూడా వేశారు. అయితే ఓ సినిమా కోసం సీఎం రేవంత్ ఇలా ట్వీట్ ఎందుకు చేశారు? అసలేంటి విషయం?(ఇదీ చదవండి: నా కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు: హీరో సిద్ధార్థ్)కొన్నిరోజుల క్రితం సినిమా టికెట్ రేట్ల గురించి ఓ సందర్భంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇకపై ఎవరికైనా సరే రేటు పెంపు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే 'భారతీయుడు 2' టీమ్ నుంచి కమల్ హాసన్, సిద్ధార్థ్, సముద్రఖని, డైరెక్టర్ శంకర్.. ఓ వీడియో రిలీజ్ చేశారు.దీనికి రిప్లై ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. 'భారతీయుడు 2 బృందానికి నా ప్రత్యేక అభినందనలు. డ్రగ్స్ రహిత సమాజం కోసం.. ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా.. శ్రీ కమల్ హాసన్, శ్రీ శంకర్, శ్రీ సిద్దార్, శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం' అని రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: 'ఈ జనరేషన్లోనే వరస్ట్ హీరో'.. అందుకే 4 జాతీయ అవార్డులు!)భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు.డ్రగ్స్ రహిత సమాజం కోసం…ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా…శ్రీ కమల్ హాసన్…శ్రీ శంకర్…శ్రీ సిద్దార్థ…శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో…రూపొందించడం హర్షించదగ్గ విషయం.#DrugFreeTelangana #SayNoToDrugs pic.twitter.com/MDkT95sqze— Revanth Reddy (@revanth_anumula) July 9, 2024