'భారతీయుడు 2' నిన్న థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శుక్రవారం నాడు బాగానే ఆక్యుపెన్సీలు కనిపించాయి. తమిళంలో ఇలా కూడా కనిపించలేదు. అయితే సినిమా మరీ అంత కాకపోయినా ఓ మాదిరి అంచనాలతో బరిలో నిలిచింది. కానీ కనీసం అంటే కనీస వసూళ్లు రావడం కూడా కష్టమే అనిపిస్తుంది. అయితే సినిమాకు ఇలా అవుతుందని కమల్ ముందే పసిగట్టాడా అని సందేహం వస్తోంది.
(ఇదీ చదవండి: భారతీయుడు 2 కలెక్షన్స్.. తొలిరోజు ఎన్ని కోట్ల రూపాయలంటే?)
1996లో వచ్చిన 'భారతీయుడు'.. అప్పట్లో తెలుగు, తమిళ అనే తేడా లేకుండా సెన్సేషన్ సృష్టించింది. దీనికి సీక్వెల్ తీయాలని చాలా ఏళ్ల క్రితమే అనుకున్నారు. కాకపోతే షూటింగ్‌లో ప్రమాదం, కరోనా వల్ల లేట్ అయిపోయింది. ఎలాగోలా పూర్తి చేసి తాజాగా థియేటర్లలోకి తీసుకొచ్చారు. సీక్వెల్ ఒకటే అనుకున్నది కాస్త రెండు భాగాలైంది. ఇప్పుడు రెండో భాగం రిలీజ్ చేయగా, ఆరు నెలల తర్వాత మూడో భాగాన్ని విడుదల చేయనున్నారు.
'భారతీయుడు 2' ఫలితాన్ని కమల్ హాసన్ ముందే పసిగట్టేశాడో ఏమో గానీ రిలీజ్‌కి ముందే తనకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో నిర్మాణ సంస్థ లైకా రెండు భాగాలకు తలో రూ.75 కోట్ల చెప్పున మొత్తంగా రూ.150 కోట్లు ఇచ్చిందట. మిగతా నటీనటులకు మాత్రం ఒక్క మూవీకి అన్నట్లే పారితోషికంగా ఇచ్చారు. ఇక ప్రాజెక్టులో డైరెక్టర్ శంకర్ కూడా భాగస్వామినే. కాబట్టి అతడికి కూడా నష్టాలు గ్యారంటీ. ఓవరాల్‌గా 'భారతీయుడు 2' వల్ల ఎవరైనా లాభపడ్డారంటే అది కమల్ మాత్రమే అని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' చూసి కన్నీళ్లు పెట్టుకున్నా: బిగ్‌బాస్ భోలే షావలి)
Comments
Please login to add a commentAdd a comment