Lyca Productions
-
విజయ్ కుమారుడి డైరెక్షన్లో టాలీవుడ్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిలా యాక్టర్ కాకుండా డైరెక్టర్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయన డైరెక్ట్ చేస్తున్న మొదటి సినిమాలో టాలీవుడ్ హీరోకు అవకాశం దక్కింది. విజయ్ అభిమానులు కూడా జేసన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో తెరెక్కిస్తుంది.జాసన్ సంజయ్ తన డెబ్యూ మూవీని ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించారు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్‌కు ఛాన్స్ దక్కినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారని సమాచారం. సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ప్రధాన హీరో, హీరోయిన్లు ఎవరనేది తెలియాల్సి ఉంది.ఈ ప్రాజెక్ట్ గురించి నిర్మాత సుభాస్కరన్ మాట్లాడుతూ.. 'జాసన్ సంజయ్ దర్శకత్వంలో లైకాలో చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది. అతను మాకు కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. సినిమా ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలు కథలో ఉన్నాయి. తమిళ చిత్రసీమలో పాపులర్ అవుతున్న పలువురు నటీనటులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నాం. ఇప్పటికే వారితో చర్చలు కూడా జరుగుతున్నాయి.' అని ఆయన అన్నారు.ఈ క్రమంలో జేసన్ సంజయ్ మొదటి సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తారని మొదట వార్తలు వచ్చాయి. అయితే, ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించడం దాదాపు ఖాయమైందని సమాచారం. కొన్ని నెలల క్రితం విడుదలైన 'రాయన్' చిత్రంతో ఆయన ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నారు. అందులోని ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో సందీప్ కిషన్‌కు ఇలా ఛాన్స్ దక్కిందని చెప్పవచ్చు. -
రజినీకాంత్ లేటేస్ట్ మూవీ .. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ సూపర్‌స్టార్, తలైవా రజినీకాంత్ ప్రస్తుతం వెట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను లైక్షా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా బరిలో నిలిచింది. వచ్చేనెల 10 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండండతో మేకర్స్ దూకుడు పెంచారు. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. మనసిలాయో అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. తాజాగా రిలీజైన లిరికల్ సాంగ్ తలైవా ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేస్తోంది.తలైవా కోసం తప్పుకున్న కంగువా..తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ దసరాకు ఊహించని విధంగా సూపర్ స్టార్ రజినీకాంత్ రేసులోకి రావడంతో కంగువా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంగువా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఓ ఈవెంట్లో సూర్య అధికారికంగా ప్రకటించారు. -
వారికి హెచ్చరిక.. లైకా ప్రొడక్షన్స్ పేరుతో మోసాలు
సోషల్ మీడియా ప్రపంచంలో చాలా జాగ్రత్తగా మెలగాలి లేదంటే కేటుగాళ్ల చేతికి దొరికిపోతారు. ముఖ్యంగా చాలామంది సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారిని ట్రాప్‌లోకి లాగి నిండా ముంచేస్తారు. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ పేరుతో మోసం చేయడానికి మోసగాళ్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇలాంటి విషయాలపై ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలని ప్రజలను పోలీసు శాఖ హెచ్చరిస్తూనే ఉంది. తాజాగా లైకా ప్రొడక్షన్స్ పేరుతో అనేక అనధికారిక కాస్టింగ్ కాల్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది.కోలీవుడ్‌లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మాత సుభాస్కరన్ నిర్మించారు. లైకా ప్రొడక్షన్స్ పేరుతో అనధికారికంగా కొందరు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి సినిమా ఛాన్స్‌లు ఇస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నాయని ఆ సంస్థ గుర్తించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్లు లైకా తెలిపింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించనున్న సినిమాల కోసం ఏవైనా కాస్టింగ్ కాల్లు లేదా ఆడిషన్లు ఉంటే తమ ధృవీకరించబడిన సోషల్ మీడియా పేజీల ద్వారా మాత్రమే అధికారికంగా ప్రకటించబడతాయని తెలిపింది. సోషల్ మీడియాలో అనధికారికంగా ఇలా ఫేక్ కాస్టింగ్ కాల్స్‌ల ట్రాప్‌లో చిక్కుకోకూడదని తాము కోరుతున్నట్లు పేర్కొన్నారు. తమ సంస్థ పేరుతో కాస్టింగ్ కాల్లు లేదా ఆడిషన్లు నిర్వహించే అనధికార వ్యక్తులు, ఏజెన్సీలపై తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లైకా ప్రొడక్షన్ హెచ్చరించింది. ఇలాంటి వారి సమాచారం మీ దృష్టికి వస్తే సమాచారం ఇవ్వండి అంటూ కోరింది. View this post on Instagram A post shared by Lyca Productions (@lycaproductions) -
ఇది మూవీ షూటింగ్ కాదు, సరిగ్గా ఆన్సరివ్వు: విశాల్‌పై మండిపడ్డ కోర్టు
చెన్నై: కోలీవుడ్ హీరో విశాల్‌పై న్యాయస్థానం మండిపడింది. విశాల్‌కు, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో విభేదాలు తలెత్తాయి. దీనిపై లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా విశాల్ కోర్టుకు హాజరయ్యాడు. తాను ఖాళీ కాగితంపై సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందన్న విషయమే తెలియదన్నాడు. అతడి వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివిగా సమాధానం చెబుతున్నారనుకుంటున్నారా? ఇదేం షూటింగ్ కాదు. సరిగ్గా బదులివ్వండి అని గద్దించి అడిగారు.కాగా విశాల్.. ఫైనాన్షియర్ అన్బచెలియన్ దగ్గర తీసుకున్న రూ.21.29 కోట్ల రుణాన్ని లైకా సంస్థ చెల్లించింది. అందుకుగానూ ఆ డబ్బు తిరిగిచ్చేవరకు విశాల్ నిర్మించే సినిమా హక్కుల్ని తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాల్.. వీరమె వాగై చూడమ్ అనే సినిమా హక్కుల్ని లైకాకు బదులు వేరే సంస్థకు విక్రయించాడు. దీంతో రెండేళ్లక్రితం లైకా సంస్థ చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.చదవండి: కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లనన్న బ్యూటీ.. వెనక్కు తగ్గిందా? -
'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!
'భారతీయుడు 2' నిన్న థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శుక్రవారం నాడు బాగానే ఆక్యుపెన్సీలు కనిపించాయి. తమిళంలో ఇలా కూడా కనిపించలేదు. అయితే సినిమా మరీ అంత కాకపోయినా ఓ మాదిరి అంచనాలతో బరిలో నిలిచింది. కానీ కనీసం అంటే కనీస వసూళ్లు రావడం కూడా కష్టమే అనిపిస్తుంది. అయితే సినిమాకు ఇలా అవుతుందని కమల్ ముందే పసిగట్టాడా అని సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: భారతీయుడు 2 కలెక్షన్స్.. తొలిరోజు ఎన్ని కోట్ల రూపాయలంటే?)1996లో వచ్చిన 'భారతీయుడు'.. అప్పట్లో తెలుగు, తమిళ అనే తేడా లేకుండా సెన్సేషన్ సృష్టించింది. దీనికి సీక్వెల్ తీయాలని చాలా ఏళ్ల క్రితమే అనుకున్నారు. కాకపోతే షూటింగ్లో ప్రమాదం, కరోనా వల్ల లేట్ అయిపోయింది. ఎలాగోలా పూర్తి చేసి తాజాగా థియేటర్లలోకి తీసుకొచ్చారు. సీక్వెల్ ఒకటే అనుకున్నది కాస్త రెండు భాగాలైంది. ఇప్పుడు రెండో భాగం రిలీజ్ చేయగా, ఆరు నెలల తర్వాత మూడో భాగాన్ని విడుదల చేయనున్నారు.'భారతీయుడు 2' ఫలితాన్ని కమల్ హాసన్ ముందే పసిగట్టేశాడో ఏమో గానీ రిలీజ్‌కి ముందే తనకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో నిర్మాణ సంస్థ లైకా రెండు భాగాలకు తలో రూ.75 కోట్ల చెప్పున మొత్తంగా రూ.150 కోట్లు ఇచ్చిందట. మిగతా నటీనటులకు మాత్రం ఒక్క మూవీకి అన్నట్లే పారితోషికంగా ఇచ్చారు. ఇక ప్రాజెక్టులో డైరెక్టర్ శంకర్ కూడా భాగస్వామినే. కాబట్టి అతడికి కూడా నష్టాలు గ్యారంటీ. ఓవరాల్‌గా 'భారతీయుడు 2' వల్ల ఎవరైనా లాభపడ్డారంటే అది కమల్ మాత్రమే అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' చూసి కన్నీళ్లు పెట్టుకున్నా: బిగ్‌బాస్ భోలే షావలి) -
లక్కీ హీరోయిన్‌కు భారీగా ఛాన్స్‌లు .. పెళ్లికి ఫుల్స్టాప్
ఆదితిశంకర్కు అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలు అయిన ఈమె వైద్య విద్య చదివి సినిమాపై మక్కువతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. అలా కార్తీ సరసన దుర్మార్ చిత్రంలో కథానాయకిగా పరిచయమైన అదితి శంకర్ తొలి చిత్రంలోనే గాయనిగా కూడా తనను పరిచయం చేసుకున్నారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత శివకార్తికేయన్ సరసన నటించిన మావీరన్ చిత్రం కూడా సక్సెస్ అయ్యింది. దీంతో అదితి శంకర్ లక్కీ హీరోయిన్ అనే ముద్రను వేసుకున్నారు. ఎప్పుడు చలాకీగా ఉండే ఈమె తరచూ స్పెషల్‌గా తీయించుకున్న తన గ్లామరస్ ఫొటోలతో నెటిజన్లను అలరిస్తూ వుంటారు. ప్రస్తుతం విష్ణువర్దన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆకాష్ మురళీకి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. చిత్రం తరువాత చిత్రం చేసుకుంటూ సక్సెస్ఫుల్ బాటలో పయనిస్తున్న అదితిశంకర్ నటనకు స్వస్తి పలికి పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ఆ మధ్య ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని తెలుస్తోంది. త్వరలో సూర్య నటించనున్న నూతన చిత్రంలో ఆయనకు జంటగా అదితి శంకర్ నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా ఇప్పుడు ఈ బ్యూటీని మరో లక్కీచాన్స్ వరించింది అన్నది తాజా సమాచారం. చేసింది రెండు చిత్రాలు అయినా ఈమెకు హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దీనిని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నట్లు సమాచారం. -
సంక్రాంతి నుంచి తప్పుకున్న 'లాల్ సలాం'.. కారణం ఇదేనా?
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. 'లాల్ సలామ్' 2024 సంక్రాంతి బరిలో ఉంటుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. కానీ సమయం దగ్గర పడుతున్నా లాల్ సలాం సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. దీనికి ప్రధాన కారణం రజనీకాంత్ ఇందులో అతిథి పాత్రలో కనిపించడమే అని చెప్పవచ్చు. తాజాగా సంక్రాంతి రేసు నుంచి లాల్ సలాం చిత్రాన్ని తప్పిస్తున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ సంక్రాంతికి చాలా వరకు భారీ సినిమాలు ఉన్నాయి. ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', శివ కార్తికేయన్ 'అయలాన్' చిత్రాలు కోలీవుడ్‌లో రెడీగా ఉన్నాయి. అంతే కాకుండా జైలర్ సినిమాతో తెలుగులో కూడా రజనీ మార్కెట్ భారీగానే పెరిగింది. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి గుంటూరు కారం, ఈగల్, నా సామిరంగా,సైంధవ్, హనుమాన్ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. దీంతో తెలుగు స్ట్రెయిట్ సినిమాలకే థియేటర్లు సరిపోవని పరిస్థితి టాలీవుడ్లో ఉంది. ఇలాంటి టైమ్‌లో మరో మూడు తమిళ సినిమాలు అంటే థియెటర్ల కొరత ఏర్పడటం జరుగుతుందని లాల్ సలాం టీమ్ ఆలోచిస్తుందట. దీంతో లాల్ సలాం వెనక్కు తగ్గడమే మేలని వారు భావించారట. భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో తేడా వస్తే బిజినెస్‌పై ప్రభావం పడుతుందని భావించిన మేకర్స్ ఫైనల్‌గా పొంగల్ నుంచి డ్రాప్ కావడమే బెటర్ అని నిర్ణయించుకున్నారట. కొద్దిరోజుల పాటు లాల్ సలాం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలకు కూడా తాత్కాలిక బ్రేక్ ఇవ్వనున్నారని సమాచారం. విక్రమ్ తంగలాన్ సినిమా కూడా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. జనవరి 26 విడుదల చేస్తామని చెప్పిన తంగలాన్ మేకర్స్ మరోసారి వాయిదా వేశారు. కాబట్టి 2024 జనవరి 26న లాల్ సలాం వచ్చే అవకాశం ఉంది. -
ఆనందం ఉప్పొంగుతోంది
రజనీకాంత్ పట్ట లేనంత ఆనందంలో ఉన్నారు. అందుకే ‘‘నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది’’ అని ట్వీట్ చేశారాయన. ఈ ఆనందానికి కారణం అమితాబ్ బచ్చన్‌తో 33 ఏళ్ల తర్వాత రజనీ స్క్రీన్ షేర్ చేసుకోవడమే. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘అంథా కానూన్ (1983), గిరఫ్తార్ (1985), హమ్’ (1991) చిత్రాల్లో నటించారు. ఇన్నేళ్ల తర్వాత వీరి కాంబినేషన్ మళ్లీ కుదింరింది. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలోనే అమితాబ్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా అమితాబ్‌తో తాను ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘‘లైకా ప్రొడక్షన్స్‌లో నేను చేస్తున్న నా 170వ సినిమాలో నా గురువు, గొప్ప నటుడు శ్రీ అమితాబ్ బచ్చన్‌తో మళ్లీ కలిసి నటిస్తున్నాను. నా హృదయం ఉప్పొంగుతోంది’’ అని ట్వీట్ చేశారు రజనీకాంత్. -
రజనీకాంత్ 170 ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా?
రజనీకాంత్ 'తలైవార్ 170' చిత్రం నేడు అధికారికంగా పూజా కార్యక్రమం జరిగింది. లైకా ప్రొడక్షనన్స్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక కథాచిత్రానికి 'జై భీమ్' చిత్రం ఫేమ్ టీజే జ్ఞానవేల్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో నటించనున్న ఇతర కళాకారుల గురించి చిత్ర నిర్మాణ సంస్థ వరుసగా ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పటికే ఇందులో టాలీవుడ్ నటుడు దగ్గుపాటి రానా నటి మంజు వారియర్, దసరా విజయన్, రిత్విక సింగ్ తదితరులు ఇందులో ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. (ఇదీ చదవండి: సమంత- నాగ చైతన్య మళ్లీ కలుసుకోబోతున్నారా.. ఫోటోలు వైరల్) బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్, మలయాళ స్టార్ నటుడు ఫాహత్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా రజనీకాంత్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం బుధవారం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. అందులో భాగంగా నటుడు రజనీకాంత్ మంగళవారమే చైన్నె నుంచి తిరువంతపురం బయలుదేరిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన పూజలో పాల్గొని మీడియాతో ముచ్చటించారు. ఆయన నటించే 170వ చిత్రం గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఇది మంచి సందేశంతో కూడిన ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదనీ, త్వరలోనే పేరును వెల్లడించనున్నట్లు చెప్పారు. తాను ఇంతకు ముందు నటించిన జైలర్ చిత్రం ఊహించిన దానికంటే ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు. అదేవిధంగా తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో నటించిన లాల్ సలామ్ చిత్రం కూడా ఊహించిన దానికంటేబ్రహ్మాండంగా వచ్చిందని పేర్కొన్నారు. Lights ☀️ Camera 📽️ Clap 🎬 & ACTION 💥 With our Superstar @rajinikanth 🌟 and the stellar cast of #Thalaivar170🕴🏼 the team is all fired up and ready to roll! 📽️ Hope you all enjoyed the #ThalaivarFeast 🍛 Now it's time for some action! We'll come up with more updates as the… pic.twitter.com/gPUXsPmvEQ — Lyca Productions (@LycaProductions) October 4, 2023 -
పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లోకి రానా.. అఫిషియల్ సినిమా ప్రకటన
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ‘జైభీమ్’ సినిమా డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అని చెప్పవచ్చు ఆ సినిమాతో ఆయనకు ఎనలేని గుర్తింపు దక్కింది. చాలా రోజుల తర్వాత ఒక యథార్థ సంఘటన ఆధారంగా రజనీకాంత్‌తో సినిమా అనేసరికి పాన్ ఇండియా రేంజ్లో అంచనాలను పెంచేశాయి. (ఇదీ చదవండి: 100 సినిమాల్లో నటించిన దేవయాని.. టీచర్‌గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది) అంతే కాకుండా ఖర్చుకు ఎలాంటి బార్డర్స్ పెట్టకోని లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీనిని నిర్మిస్తుంది. తత్కాలికంగా ఈ సినిమాకు 'తలైవర్ 170' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి భాగం అవుతున్నట్ల ప్రకటన వచ్చేసింది. దీనిని అఫిషియల్‌గా లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. బాహుబలి సినిమాలో విలన్‌గా రానా పాన్ ఇండియా రేంజ్లో మంచి గుర్తింపు పొందాడు. మరి తలైవార్ ప్రాజెక్ట్‌లో ఆయన రోల్ ఎంటి అనేది ప్రకటించలేదు. ఇప్పటికే ఈ సినిమాకు దుషారా విజయన్, రిత్విక సింగ్ వంటి యంగ్ హీరోయిన్స్‌తో పాటు మలయాళ నటి మంజు వారియర్ ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తున్నట్లు సమాచారం. Welcoming the dapper & supercool talent 😎 Mr. Rana Daggubati ✨ on board for #Thalaivar170🕴🏼#Thalaivar170Team has gotten even more charismatic 🌟 with the addition of the dashing @RanaDaggubati 🎬🤗✌🏻@rajinikanth @tjgnan @anirudhofficial @ManjuWarrier4 @officialdushara… pic.twitter.com/XhnDpm27CH — Lyca Productions (@LycaProductions) October 3, 2023 -
పాన్ ఇండియాపై కన్నేసిన స్టార్ ప్రొడ్యూసర్
లైకా ప్రొడక్షన్స్ నిర్మాత సుభాస్కరన్ భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు ఇప్పటికే అడుగులు వేశారు. అతను రజనీకాంత్‌తో 2.0, విక్రమ్ పొన్నియన్ సెల్వన్ 1 & 2 వంటి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించారు. పొన్నియన్ సెల్వన్ ఫ్రాంచైజీ సాధించిన అద్భుతమైన విజయం తర్వాత, సుభాస్కరన్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి స్టార్లతో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను తెరకెక్కించేదుకు ప్లాన్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ నుంచి త్వరలో వస్తున్న పాన్-ఇండియన్ సినిమా కమల్ హాసన్ ఇండియన్ 2. చిత్రీకరణ ఇప్పటికే దాదాపు పూర్తి అయింది. దీనికి ఎస్ శంకర్ డైరెక్ట్ చేశారు. మరోవైపు, రజనీకాంత్ నటించిన లాల్ సలామ్, తలైవర్ 170 కూడా అదే బ్యానర్ నుంచి వస్తున్నాయి. కోలీవుడ్‌లో భారీ విజయాలతో లైకా ప్రొడక్షన్స్‌కు మంచి గుర్తింపు ఉంది. దీంతో తాజాగా మాలీవుడ్‌లో తన ఫేట్‌ను పరీక్షించడానికి సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: ఎయిర్‌పోర్టులో ప్రభాస్ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్) లైకా ప్రొడక్షన్స్ ఇటీవలే లూసిఫర్-2 చిత్రాన్ని ప్రకటించింది. ఇందులో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌గా విడుదల కానుంది. సుభాస్కరన్ త్వరలో బాలీవుడ్, టాలీవుడ్లో కూడా సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రణాళికలను కూడా ఆయన ప్రారంభించారట. మరో రెండు రోజుల్లో తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాలు ప్రకటించే అవకాశం ఉంది. -
లూసిఫర్ సీక్వెల్ రెడీ.. మాలీవుడ్‌లో లైకా ప్రొడక్షన్స్ ప్లాన్
కోలీవుడ్‌లో చిన్న చిత్రాల నుంచి భారీ చిత్రాల వరకు కేరాఫ్‌గా మారిన చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షనన్స్. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్ ఇప్పుడు మాలీవుడ్లోకి అడుగు పెట్టారు. కంప్లీట్ యాక్టర్‌గా పేరుగాంచిన మోహన్‌లాల్ బహుభాషా నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగు దశాబ్దాలుగా కథానాయకుడిగా నటిస్తూ మాలీవుడ్‌లో (మలయాళం) అత్యధిక పారితోషికం తీసుకున్న నటుల్లో ఈయన ఒకరు. (ఇదీ చదవండి: వాళ్లు అయితే నా దుస్తులు తొలగించేవారు.. ఊసరవెల్లి బ్యూటీ కామెంట్లు) 350 చిత్రాలకు పైగా చేసిన మోహన్ లాల్ ఈమధ్య నటించిన చిత్రం లూసిఫర్. దీనికి మరో మలయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించి అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. లూసిఫర్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా దానికి సీక్వెల్‌గా లూసిఫర్ 2 చిత్రం రూపొందుతోంది. ఇది కూడా మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్లో కాంబినేషన్లోనే తెరకెక్కడం విశేషం. కాగా విచిత్రాన్ని ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోని పెరంబలూర్తో కలిసి లైకా ప్రొడక్షనన్స్ సుభాస్కరన్ నిర్మిస్తుండడం మరో విశేషం. దీని గురించి లైకా ఫిలిమ్స్ సంస్థ అధినేత సుభాస్కరన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ దైవ దేశంగా భావించే మలయాళ చిత్ర పరిశ్రమంలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. అంకితభావంతో పనిచేసే కళాకారులు సహజత్వంతో కూడిన సంస్కృతికి అద్దం పట్టే చిత్రాలను రూపొందించే మలయాళ చిత్ర పరిశ్రమలో లూసిఫర్ 2 చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని తాము పొందామని చెప్పారు. ఈ చిత్త పరిశ్రమ అభివృద్ధిని, ఈ చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ ధ్యేయంగా పేర్కొన్నారు. ఈ చిత్ర విజయం పదికాలాలపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుందని సుభాస్కరన్ పేర్కొన్నారు. -
లైకా ప్రొడక్షన్స్ మరో భారీ డీల్.. ఆ సినిమా హక్కులు సొంతం!
కోలీవుడ్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ చిత్రంలో నటి మాళవిక మోహన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై టీజీ త్యాగరాజన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాతర కార్యక్రమాలను ముమ్మరంగా జరుపుకుంటోంది. కాగా.. ఈ చిత్రంలో ధనుష్ గెటప్ చాలా భిన్నంగా ఉండడం.. ట్రైలర్ ఇటీవలే విడుదలై విశేష స్పందన పొందడంతో కెప్టెన్ మిల్లర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా త్వరలో ఆడియో రిలీజ్‌తో పాటు మరిన్నీ విషయాలను చిత్ర నిర్మాతలు వెల్లడించనున్నట్లు సమాచారం. అదే విధంగా కెప్టెన్ మిల్లర్ చిత్రంపై వ్యాపార వర్గాల్లో చాలా క్రేజ్ ఉంది. తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్ విడుదల హక్కులను లైకా ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. లైకా ప్రొడక్షన్స్ పలు భారీ చిత్రాలను నిర్మిస్తూనే.. మరో పక్క ఇతర చిత్రాలను సైతం విడుదల చేస్తోంది. అలా ఇటీవల అజిత్ హీరోగా నటించిన తుణివు(తెగింపు) చిత్రాన్ని విదేశాలలో అత్యధిక థియేటర్లలో విడుదల చేసింది. తాజాగా ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్ర విదేశీ విడుదల హక్కులను పొందడం మరో విశేషం. ఈ విషయాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ మంగళవారం అధికారికంగా మీడియాకు వెల్లడించింది. This December 15, is gonna be blast 💥 in theatres! We are happy in acquiring the OVERSEAS THEATRICAL RIGHTS 🌍📽️ of #CaptainMiller 🪃 Captain Miller Overseas release by @LycaProductions Subaskaran 🤗✨@dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash… pic.twitter.com/7JtDzXLANm — Lyca Productions (@LycaProductions) September 26, 2023 -
ఆస్తి వివరాలు కోర్టుకు సమర్పించిన విశాల్
హీరో విశాల్ తన ఆస్తులు, బ్యాంకు ఖాతాల వివరాలను కోర్టులో సమర్పించారు. దీనికి సంబంధించిన వివరాలను చూస్తే నటుడు విశాల్ ఫైనాన్షియర్ అన్బచెలియన్ వద్ద తీసుకున్న రూ.21.29 కోట్ల రుణాన్న లైకా సంస్థ చెల్లించింది. అందుకు గానూ విశాల్ నిర్మించే చిత్రాల హక్కులను తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే విశాల్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన వీరమే వాగై చుడుమ్ చిత్ర విడుదల హక్కులను లైకాకు బదులుగా వేరే సంస్థకు విక్రయించారు. దీంతో లైకా సంస్థ చైన్నె హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై చైన్నె హైకోర్టు ప్రత్యేక న్యాయస్థానంలో పలు మార్లు విచారణ జరిగింది. గత 12వ తేదీన ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పీటీ ఉషా విశాల్‌ను తన స్థిరాస్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించించారు. కానీ ఈ ఆదేశాలను పాటించకపోవడంతో గత 19వ తేదీన జరిగిన విచారణ సమయంలో దీన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా ఈ కేసు సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విశాల్ తన ఆస్తుల వివరాలను కోర్టుకు అందించారు. అందులో స్టాండర్డ్ చార్టెడ్, ఐడిబీఐ, యాక్సెస్, హెచ్ డీ ఎఫ్ సీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకుల్లోని తన ఖాతాల వివరాలను పొందుపరిచారు. అయితే ఆ వివరాలు పూర్తిగా లేకపోవడంతో రిట్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా లైకా సంస్థను ఆదేశించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేశారు. చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
కోర్టులో గెలిచిన విశాల్.. చెప్పిన టైమ్‌కే 'మార్క్ ఆంటోని'
హీరో విశాల్‌కు కోర్టు నుంచి ఉపశమనం లభించింది. 'మార్క్ ఆంటోని' విడుదల మీద కొన్నిరోజుల క్రితం మద్రాస్ కోర్టు స్టే విధించింది. కానీ తాజాగా ఆ కేసులో విశాల్ తరపున తీర్పు పాజిటివ్‌గా వచ్చింది. దీంతో సినిమా రిలీజ్‌కి లైన్ క్లియర్ అయినట్లే. సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా విశాల్ మార్క్ ఆంటోని చిత్రం రిలీజ్ కాబోతోంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' రెండో వారం నామినేషన్స్.. లిస్టులో తొమ్మిది మంది!) ఏంటి గొడవ? గతంలో ఓ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దగ్గర దాదాపు రూ.20 కోట్ల మేర అప్పు చేశాడు. అది తిరిగి చెల్లించే విషయంలో ఆలస్యమైంది. ఈ క్రమంలోనే లైకా ప్రొడక్షన్స్.. విశాల్ తమకు రూ.15 కోట్లు చెల్లించాలని, అప్పటివరకు 'మార్క్ ఆంటోని' రిలీజ్ ఆపాలని పిటిషన్ వేసింది. కానీ ఇప్పుడది విశాల్‌కి పాజిటివ్‌గా వచ్చింది. 'మార్క్ ఆంటోని విడుదల చేసేందుకు కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. సెప్టెంబర్ 15న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది' అని హీరో విశాల్ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు. దీంతో విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయని అందరికీ అర్థమైపోయింది. 'మార్క్ ఆంటోని'లో ఎస్.జే.సూర్య కీ రోల్ చేశాడు. రీతూ వర్మ హీరోయిన్. సునీల్, సెల్వ రాఘవన్, అభినయ, కింగ్ స్లే, మహేంద్రన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) -
విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాపై బ్యాన్ విధించిన కోర్టు
నటుడు విశాల్‌కు ఒక హిట్ అవసరం ఎంతైనా ఉంది. ఆయన సమీపకాలంలోని చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. కాగా తాజాగా 'మార్క్ ఆంటోనీ' చిత్రంతో రావడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఎస్ జే.సూర్య ప్రతినాయకుడిగా నటించారు. విశాల్, ఎస్జే.సూర్య ఇద్దరు ద్విపాత్రాభినయం చేయడం విశేషం. మార్క్‌ఆంటోనీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న పాన్ ఇండియా స్థాయిలో తమిళం, తెలుగు హిందీ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ఇలాంటి సమయంలో సినిమా విడుదలను ఆపేయాలని మద్రాసు కోర్టు తీర్పు వెల్లడించింది. ఏం జరిగిందంటే నటుడు విశాల్ చిత్ర నిర్మాణ సంస్థ అయిన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో అన్బుచెజియన్‌కు చెందిన గోపురం ఫిల్మ్స్ నుంచి రూ. 21.29 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నాడు. తిరిగి చెల్లించడంలో ఆయన విఫలం కావడంతో విశాల్‌ను నమ్మి ఆ రుణాన్ని లైకా ప్రొడక్షన్ చెల్లించింది. ఈ విషయంలో, విశాల్, లైకా మధ్య ఒప్పందం ప్రకారం, మొత్తం రుణం తిరిగి చెల్లించే వరకు విశాల్ ఫిల్మ్ కంపెనీకి చెందిన అన్ని చిత్రాల హక్కులను లైకాకు ఇస్తామని హామీ ఇచ్చారు. (ఇదీ చదవండి: శివాజీతో చేతులు కలిపిన షకీలా, అర్ధరాత్రి డ్రామాలు.. ఆగమైన కంటెస్టెంట్లు) ఈ స్థితిలో రుణం చెల్లించకుండా గ్యారెంటీని ఉల్లంఘించి ‘వీరమే వాగై చూడుమ్’ (సామాన్యుడు) సినిమా విడుదలపై నిషేధం విధించాలని లైకా సంస్థ మద్రాసు హైకోర్టులో గతంలో కేసు వేసింది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన మద్రాస్ హైకోర్టు విశాల్‌కు పలు సూచనలు ఇచ్చింది. హైకోర్టు రిజిస్ట్రార్ పేరిట 15 కోట్ల రూపాయలను శాశ్వత డిపాజిట్‌గా బ్యాంకులో డిపాజిట్ చేసి ఆస్తుల వివరాలను సమర్పించాలని నటుడు విశాల్‌ను ఆదేశించింది. దీంతో సింగిల్ జడ్జి ఆదేశాలపై ద్విసభ్య ధర్మాసనంలో విశాల్ అప్పీల్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ రాజా, జస్టిస్ భరత చక్రవర్తితో కూడిన ధర్మాసనం ఈ అప్పీల్‌ను విచారించి, విశాల్ కోర్టుకు రూ.15 కోట్లు చెల్లించాలన్న ఆదేశాలను సమర్థించింది. చెల్లించని పక్షంలో, సింగిల్ జడ్జి ముందు ఈ కేసులో తీర్పు వెలువడే వరకు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మించిన చిత్రాలను థియేటర్లలో లేదా OTT సైట్లలో విడుదల చేయడంపై నిషేధం విధించి అప్పీల్ కేసును ముగించారు. (ఇదీ చదవండి: అట్లీ, షారుఖ్‌పై నయనతార అసంతృప్తి.. నిజమెంత?) ఇదిలా ఉంటే, విశాల్ చిత్రం 'మార్క్ ఆంటోని' సెప్టెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది, ఈ కేసు ఈరోజు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆశా ముందు విచారణకు వచ్చింది. అప్పట్లో కేసును విచారించిన న్యాయమూర్తి హైకోర్టు ఆదేశాల మేరకు రూ.15 కోట్లు డిపాజిట్ కాకపోవడంతో విశాల్ కొత్త సినిమాపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే 'మార్క్ ఆంటోనీ' సినిమా ట్రైలర్ ఇంటర్నెట్లో విడుదలై మిలియన్ వ్యూస్‌ను దాటడం గమనార్హం. రెండు గంటల 30 నిమిషాలు నిడివి కలిగిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. -
డైరెక్టర్‌గా హీరో విజయ్ తనయుడు
తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సుభాస్కరన్ మాట్లాడుతూ– ‘‘కొత్త ఆలోచనలతో ఉండే యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎప్పుడూ గేమ్ చేంజర్స్ అవుతారని మా నమ్మకం. జాసన్ సంజయ్ విజయ్ చెప్పిన యూనిట్ పాయింట్ మాకు నచ్చింది. సంజయ్ లండన్‌లో స్క్రీన్ రైటింగ్‌లో బీఏ (హానర్స్), టొరంటో ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ప్రోడక్షన్ డిప్లామా పూర్తి చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంతికేతిక నిపుణులు పని చేయబోతున్నారు’’ అన్నారు. ‘‘లైకాప్రోడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నా ఫస్ట్ మూవీ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ సంస్థకు నా స్క్రిప్ట్ నచ్చటం నాకు హ్యాపీగా ఉంది’’ అన్నారు జాసన్ సంజయ్ విజయ్ -
డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కొడుకు
దళపతి విజయ్‌ని తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిందే ఏం లేదు. పలు డబ్బింగ్ సినిమాలతో, సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాడు. అయితే ఇతడికి 23 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతడు హీరో అవుతాడనుకుని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు డైరెక్టర్‌గా తొలి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తమిళ హీరో దళపతి విజయ్‌కి ఇద్దరు పిల్లలు. అందులో కొడుకు జేసన్ సంజయ్ పెద్దోడు. ప్రస్తుతం అతడికి 23 ఏళ్లు. అయితే తండ్రిలానే హీరోగా ఎంట్రీ ఇస్తాడని చాలారోజుల నుంచి టాక్ నడుస్తోంది. 'ఉప్పెన' తమిళ రీమేక్‌తో నటుడిగా మారతాడని అప్పట్లో తెగ రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెడుతూ.. జేసన్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో 'వెట్టైకారన్' సినిమాలో విజయ్-జేసన్ కలిసి నటించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?) తమిళంలో పలు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.. జేసన్ సంజయ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తోంది. సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ మేటర్ కాస్త బయటపడింది. విజయ్ హీరోగా నటించిన 'లియో' త్వరలో రిలీజ్ కానుంది. దీని తర్వాత వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేస్తారు. అనంతరం సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసి, రాజకీయాల్లోకి వెళ్లిపోతారని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇతడి వారసుడిగా జేసన్ వస్తాడని ఫ్యాన్స్ అనుకుంటే.. ఇప్పుడు డైరెక్టర్ గా మారి షాకిచ్చాడు. బహుశా భవిష్యత్తులో ఏమైనా హీరో అవుతాడేమో చూడాలి. (ఇదీ చదవండి: యూట్యూబర్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి) View this post on Instagram A post shared by Lyca Productions (@lycaproductions) -
'2018' డైరెక్టర్ నెక్స్ట్ మూవీలో రష్మిక?
హీరోయిన్ రష్మికా మందన్న హీరో విక్రమ్‌కి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ‘2018’ అనే చిత్రం తెరకెక్కించారు డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్. ఈ సినిమా మలయాళంలో అద్భుత విజయాన్ని సాధించి బాక్సాఫీస్ కొత్త రికార్డులను సృష్టించింది. కాగా జూడ్ ఆంథోనీ జోసెఫ్ తన తర్వాతి చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ లో చేయనున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ హీరోగా నటిస్తారని, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాత సుభాస్కరన్ సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ టాక్. ఇందులో హీరోయిన్ గా రష్మికా మందన్న, మాళవిక మోహనన్స్ పేర్లు వినిపించాయి. అయితే రష్మికా మందన్న ఫైనల్ అయ్యారని, అతి త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. విక్రమ్– రష్మిక జోడీ అధికారికంగా ఓకే అయితే... కార్తీ ‘సుల్తాన్ ’, విజయ్ ‘వారిసు’ చిత్రాల తర్వాత రష్మికా మందన్న నటించనున్న మూడో తమిళ సినిమా ఇదే అవుతుంది. -
చంద్రముఖి–2 అభిమానులకు అప్డేట్ ఇచ్చిన మేకర్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్ చిత్రం చంద్రముఖి. పి.వాసు దర్శకత్వం ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా చంద్రముఖి–2 రూపొందిస్తున్న విషయం తెలిసిందే. లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్, వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీమీనన్, సృష్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఇటీవలే నటుడు లారెన్స్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పి పూర్తి చేశారు. కాగా శనివారం నుంచి ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని సమ కూర్చడం ప్రారంభించారని యూనిట్ వర్గాలు తెలిపారు. కాగా త్వరలోనే చంద్రముఖి –2 చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి తెలిపారు. అంతకుముందే వచ్చే నెలలో చిత్రంలోని సింగిల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 19న పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా విడుదల కానుంది. -
తమన్నాకు గోల్డెన్ ఛాన్స్.. మరోసారి ఆయనతో రొమాన్స్‌కు రెడీ
మిల్కీబ్యూటీ తమన్న తాజాగా మరోసారి 'అజిత్'తో రొమాన్స్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సామాజకమాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'వీరం' చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కాగా అజిత్ నటించిన 'తుణివు' తెలుగులో తెగింపు చిత్రం విడుదలై చాలా కాలం అవుతోంది. ఈ చిత్రంతో పాటు తెరపైకి వచ్చిన విజయ్ చిత్రం వారిసు తరువాత ఆయన నటిస్తున్న 'లియో' చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అలాంటిది అజిత్ తాజా చిత్రం మాత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. దీనికి 'విడాముయిర్చి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముందుగా నయనతార భర్త 'విఘ్నేశ్ శివన్' దర్శకత్వం వహించడానికి సన్నాహాలు జరిగాయి. అయితే ఈ చిత్రం నుంచి ఆయనను తొలగించి దర్శకుడు మగిళ్ తిరుమేణిని ఎంపిక చేశారు. దీంతో చిత్రం మే నెలలో ప్రారంభం అవుతుందనే ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. తాజాగా ఆగస్ట్‌లో విడాముయిర్చి సెట్స్‌పైకి వెళ్లడం ఖాయం అనే టాక్ వినిసిస్తోంది. కాగా ఇందులో నటి త్రిష నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. (ఇదీ చదవండి: ఆ సీన్లు లేకుండా చేస్తారా.. నాకు మీరే న్యాయం చేయండి: విజయ్ ఆంటోని) అయితే చిత్ర షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతుండటంతో ప్రస్తుతం విజయ్‌కు జంటగా లియో చిత్రాన్ని పూర్తి చేసిన త్రిషకు తెలుగు, మలయాళం భాషల్లో అవకాశాలు వచ్చాయి. అలా ఆమె మలయాళంలో నటుడు 'టోవినో థామస్'కు జంటగా ఐడెంటీ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు. దీంతో అజిత్ సరనస నటించే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇకపోతే నటి తమన్న ప్రస్తుతం రజనీకాంత్ సరసన 'జైలర్' చిత్రంలో నటించి పూర్తి చేశారు.కాగా ఇందులోని 'కావాలయా అనే పాట'ను ఇటీవల చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఆ పాటలో తమన్న కవ్వింపు డాన్స్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. అంతే కాదు ఈ పాట ఈ మిల్కీబ్యూటీకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందనేది తాజా సమాచారం. అందులో ఒకటి అజిత్ సరసన నటించే విడాముయిర్చి అని టాక్. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ప్రశాంత్ నిల్ మాదిరే మరో డైరెక్టర్ని టార్గెట్ చేసిన సౌత్ నిర్మాతలు
సినీ పరిశ్రమలో టాలెంట్ ఉంటే అవకాశాలు కూడా వారి వెంట పడటం కొత్తేమీ కాదు. ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలను ఇతర భాషల్లో మళ్లీ నిర్మించడం, సక్సెస్ఫుల్ హీరోయిన్లకు ఇతర భాషల్లో అవకాశాలు కల్పించడం, ఒక భాషలో సక్సెస్ సాదించిన దర్శకులతో ఇతర భాష నిర్మాతలు కూడా చిత్రాలు చేయడం సాధారణంగా జరిగే విషయమే. తాజాగా సౌత్ ఇండియా నిర్మాతల దృష్టి మలయాళ దర్శకులపై పడిందనే చెప్పాలి. (ఇదీ చదవండి: Trisha Krishnan : మళ్లీ ఒక రౌండ్ కొడుతున్న త్రిష...) అలా కేజీఎఫ్‌తో ప్రశాంత్ నిల్తో టాలీవుడ్ నిర్మాతలు వరుసగా చిత్రాలు చేయడానికి సిద్ధం అయ్యా రు. ఇక ఇటీవల విడుదలైన మలయాళం చిత్రం '2018' అనూహ్య విజయాన్ని సాధించింది. ఇది 2018 లో కేరళలో తుపాన్ ప్రభావానికి గురైన ఘటనను ఆవిష్కరించిన చిత్రం. దీనిని దర్శకుడు 'జూడ్ ఆంథోనీ జోసెఫ్' అద్భుతంగా తెరకెక్కించారు. హృదయ విదారకరమైన తుపాన్ బాధితుల కష్టాలను ఎంతో సహజంగా తీర్చిదిద్దారు. అలా విమర్శకులు సైతం ప్రశంసలు వర్షం కురిపించిన ఈయనపై ఇతర ఇండస్ట్రీలకి చెందిన నిర్మాతల దృష్టి పడింది. ఆయనతో సినిమాలు నిర్మించే అవకాశాన్ని కోలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పొందడం విశేషం. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మంచి కథా బలం ఉన్న చిత్రాలను నిర్మించడానికి ఎప్పుడు ముందు ఉండే ఈ సంస్థ ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం రెండు భాగాలు పెద్ద విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ –2 చిత్రంతో పాటు.. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో 'లాల్ సలాం' చిత్రాన్ని ఈ సంస్థ నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: Salaar: అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. ఇది జరుగుతుందా?) తదుపరి అజిత్ హీరోగా ఒక చిత్రాన్ని, రజనీకాంత్ కథానాయకుడిగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. కాగా తాజాగా 2018 చిత్ర దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు లైకా ప్రొడక్షన్స్ నిర్వాహకుడు జీకేఎం తమిళ్ కుమరన్ ను కలిసి చర్చలు జరిపారు. దీంతో ఈ కాంబినేషన్లో ఎలాంటి చిత్రం వస్తుందో అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. -
విశాల్‌పై కేసును కొట్టివేసిన కోర్టు
కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వివాదంలో విశాల్‌కు నేడు స్వల్ప ఊరట లభించింది. తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారని, ఆ డబ్బు తిరిగి చెల్లించలేదని లైకా సంస్థ 2022లో మద్రాసు కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ కేసుపై రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని విశాల్‌ను గతంలోనే హైకోర్టు ఆదేశించింది. అంత వరకు విశాల్ నిర్మించిన చిత్రాలను థియేటర్, ఓటీటీలలో విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. (ఇదీ చదవండి: వైరల్ అవుతున్న రకుల్ డ్రెస్.. అతను పట్టుకోవడంతో..!) తాజాగా కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించారని, తమకు డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన రూ. 15 కోట్లును ఇవ్వకుండానే పలు సినిమాలను నిర్మించారని, కోర్టు ధిక్కార కేసును లైకా దాఖలు చేసింది. ఈ కేసు ఈరోజు జడ్జి ఎస్.సెలాందర్ ముందు విచారణకు వచ్చింది. తమ సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి సినిమాలను నిర్మించలేదని విశాల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపి, తగిన ఆధారాలు చూపించారు. విశాల్ సినిమాలు నిర్మించినట్లు లైకా ప్రొడక్షన్స్ ఆధారాలు చూపించలేక పోయింది. దీంతో కేసును కోర్టు కొట్టి వేసింది. లైకా ప్రధాన కేసును జూన్ 26న విచారిస్తామని చెప్పి వాయిదా వేసింది. (ఇదీ చదవండి: ఆమె తల్లి లాంటిది.. ఇలా ప్రచారం చేస్తారా?: ప్రభాస్ శ్రీను) -
లైకా ప్రొడక్షన్స్‌పై ఈడీ దాడులు.. దాదాపు ఎనిమిది చోట్ల ఒకేసారి!
భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌పై ఈడీ సోదాలు చేస్తోంది. చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని రెండు భాగాలుగా లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కించారు. (ఇది చదవండి: లైకా ఖాతాలో.. అరుణ్ విజయ్ చిత్రం) చెన్నైలో లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన ఎనిమిది ప్రాంతాల్లో ఆస్తులపై ఈడీ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ప్రొడక్షన్ హౌస్‌లో అక్రమ నగదు బదిలీపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై లైకా ప్రతినిధులు ఎలాంటి అధికారికి ప్రకటన చేయలేదు. ఈడీ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: ప్రత్యేక పాత్రలో రజినీకాంత్.. ప్రారంభమైన షూటింగ్) తమిళనాడులో లైకా ప్రొడక్షన్స్ ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థగా పేరుంది. రజినీకాంత్ రోబో'2.0', మణిరత్నం'పొన్నియిన్ సెల్వన్ 1', 'పొన్నియిన్ సెల్వన్ 2'తో సహా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది. గతంలో రజనీకాంత్ 'దర్బార్' చిత్రాన్ని కూాడా తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయనతో 'లాల్ సలామ్' చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా.. హిందీలో జాన్వీ కపూర్ నటించిన 'గుడ్ లక్ జెర్రీ' (2022), అక్షయ్ కుమార్ యొక్క 'రామ్ సేతు' (2022) చిత్రాలను నిర్మించింది. కాగా.. ఇటీవలే టాలీవుడ్‌లోనూ మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ED conducts raids at LYCA Productions in Chennai. More details awaited: Sources pic.twitter.com/lZOX7pE9ks — ANI (@ANI) May 16, 2023 -
విశాల్‌కు హైకోర్టు షాక్.. రూ. 15 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం
స్టార్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. రూ. 15 కోట్ల రూపాయలు శాశ్వత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ కోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. అలా చేయని పక్షంలో తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీలో తెరకెక్కే సినిమాలు రిలీజ్ కాకుండ నిషేధం విధించింది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన కేసులో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కాగా గతంలో విశాల్ ఓ తన నిర్మాణ సంస్థ(ఫలిం ఫ్యాక్టరి) కోసం ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బుచెళియన్ వద్ద రూ. 21. 29 కోట్లు అప్పు తీసుకున్నాడు. అయితే ఈ రుణాన్ని లైకా ప్రొడక్షన్స్ ఫైనాన్షియర్‌కు తిరిగి చెల్లించింది. అయితే, తమకు రుణం చెల్లించేంత వరకు విశాల్ నటించే చిత్రాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇచ్చేలా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ - లైకా ప్రొడక్షన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. కానీ ఈ ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘిస్తూ తన చిత్రం ‘వీరమే వాగై సూడుం’ చిత్రాన్ని రిలీజ్ చేశారు. దీంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జ్ స్పెషల్ కోర్టు దీంతో లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన సింగిల్ జడ్జి స్పెషల్ కోర్టు రిజిస్ట్రార్ పేరుతో రూ.15 కోట్లను మూడు వారాల్లో శాశ్వత డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ సమయంలో విశాల్ నేరుగా కోర్టుకు హాజరై.. లైకా సంస్థ కోర్టును ఆశ్రయించడం వల్లే రుణం చెల్లించలేకపోయాయని, పైగా తనకు ఒకే రోజున రూ.18 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో విశాల్ ఆస్తుల వివరాలను ప్రమాణ పత్రంలో సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ విశాల్ హైకోర్టులో అప్పీల్ చేయగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజా, జస్టిస్ భరత చక్రవర్తిల సారథ్యంలో ధర్మాసనం విచారణ జరిపి.. గతంలో రూ.15 కోట్లను విశాల్ చెల్లించాలంటూ సింగిల్ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. పైగా ప్రత్యేక జడ్జి తుది తీర్పును వెలువరించేంత వరకు విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మించే చిత్రాలు థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీలులేదని ధర్మాసనం ఆదేశించింది.