Madras High Court Shocks Hero Vishal: హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. లైకా ప్రొడక్షన్ సంస్థ కేసు విషయంలో విశాల్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఈ రుణం కేసులో విశాల్ రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం విశాల్‌కు కోర్టు మూడు వారాల గుడువును ఇచ్చింది. హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున ఆ సొమ్మును ఈ గడువులో లోపల డిపాజిట్ చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
చదవండి: సమంత హాట్ ఫొటోపై దగ్గుబాటి వారసురాలు కామెంట్
కాగా తమ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాన్ని విశాల్ దిక్కరించారంటూ లైకా ప్రొడక్షన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఒప్పందం ప్రకారం అప్పుగా తీసుకున్న రూ. 15 కోట్లు చెల్లించకుండా అతడు కొత్త సినిమా రిలీజ్ చేయకుడదు. కానీ విశాల్ తమ డబ్బు తిరిగి చెల్లించకుండానే కొత్త మూవీ వీరమే వాగౌ సుడుం విడుదల చేసేందుకు సిద్దమయ్యాడని, అంతేకాదు తమకు విశాల్ నుంచి వడ్డీతో సహా రూ.21.69 కోట్ల రుణాన్ని రికవరీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లైకా ప్రొడక్షన్ హౌస్ పిటిషన్ దాఖలు చేసింది.
చదవండి: ఓటీటీలోకి అజిత్ ‘వలిమై’, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఈ పిటిషన్‌పై విచారణ చెప్పట్టిన జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రూ.15 కోట్లు హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున బ్యాంకులో మూడు వారాల్లో డిపాజిట్ చేయాలని విశాల్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే లైకా ప్రొడక్షన్స్‌కు ప్రతివాది రూ. 21.29 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని అగ్రిమెంట్‌లో ప్రాథమికంగా వెల్లడించినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే విశాల్ మొదట రూ. 12 కోట్లు తీసుకున్నారని, తర్వాత రూ. 3 కోట్లు తీసుకున్నారని, కాబట్టి రూ. 21.29 కోట్ల వడ్డి సరైనది కాదని విశాల్ తరపు న్యాయవాది వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment