Hero vishal
-
విశాల్‌కు తీవ్ర అస్వస్థత.. డాక్టర్లు ఏమన్నారంటే?
హీరో విశాల్ (Vishal) వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, తనకు చికిత్స అందిస్తున్నామని అపోలో వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం విశాల్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కాగా విశాల్ హీరోగా నటించిన మదగజరాజ సినిమా 12 ఏళ్ల తర్వాత విడుదలవుతోంది. బక్కచిక్కిపోయిన విశాల్చెన్నైలో జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ (Madha Gaja Raja Pre-Release Event)లో విశాల్ సన్నబడిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తన మాటలతో పాటు చేతులు కూడా వణికాయి. అతడు సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులు విశాల్‌కు ఏమైందని ఆందోళన చెందారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.(చదవండి: త్రివిక్రమ్ వివాదంపై శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్)సినిమాకాగా విశాల్.. చెల్లమే (Chellamae Movie) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. సండకోడి (పందెంకోడి) మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. తామిరభరణి, మలైకొట్టాయి, సత్యం, తోరణై (పిస్తా), అవన్ ఇవన్, వేడి, పాట్టతు యానై, పాండియ నాడు, తుప్పరివాలన్, ఎనిమీ, సండకోడి 2, మార్క్ ఆంటోని వంటి పలు చిత్రాలతో అలరించాడు. పాండియ నాడు మూవీతో నిర్మాతగానూ అవతారమెత్తాడు. మార్క్ ఆంటోని మూవీలో అదరదా పాట విశాలే ఆలపించాడు. అంతేకాదు మదగజరాజ సినిమా మై డియర్ లవరూ సాంగ్ కూడా అతడే పాడటం విశేషం. ప్రస్తుతం విశాల్.. బ్లాక్‌బస్టర్ మూవీ తుప్పరివాలన్ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నాడు. 2019లోనే ఈ చిత్రం ప్రకటించారు. ఈ మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మదగజరాజ సినిమా..మదగజరాజ మూవీలో విశాల్ ఎయిట్ ప్యాక్స్‌లో కనిపిస్తాడట! ఈ విషయాన్ని డైరెక్టర్ సుందర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు. క్లైమాక్స్‌లో 8 ప్యాక్స్‌తో కనిపించాలని విశాల్‌తో అన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ క్లైమాక్స్ షూట్ ఆలస్యమైంది. అయినా సరే విశాల్ తన ఎయిట్ ప్యాక్ బాడీని ఏడాదిపాటు మెయింటెన్ చేశాడు అని సుందర్ పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా నటించగా ఖుష్బూ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది.(చదవండి: బాలకృష్ణ హీరోయిన్‌కు వేధింపులు.. మద్దతుగా నిలిచిన అమ్మ!)ఆ రెండూ సస్పెన్స్‌లో..సూపర్ హిట్ మూవీ అభిమన్యుడికి సీక్వెల్ ఉంటుందని హీరో విశాల్ 2021లో ప్రకటించాడు. అది కూడా తనే డైరెక్ట్ చేస్తానన్నాడు. ఏమైందో ఏమో కానీ మళ్లీ దాని ఊసే ఎత్తలేదు. అలాగే గతేడాది ఓ సంచలన ప్రకటన కూడా చేశాడు. త్వరలోనే రాజకీయ అరంగేట్రం ఉంటుందని ప్రకటించాడు. 2026లో తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతానన్నాడు. తన పార్టీ అభ్యర్థులు కూడా పోటీ చేస్తారని వెల్లడించాడు. మరి తను పెట్టబోయే పార్టీ గురించి, అటు అభిమన్యుడు సీక్వెల్ గురించి ఈ ఏడాదేమైనా అప్డేట్ ఇస్తాడేమో చూడాలి! Actor #Vishal 🥹❤️❤️Though he is suffering from high fever, he came to promote his film #MadhaGajaRaja ...pic.twitter.com/4LrLpQmiEh— Official CinemaUpdates (@OCinemaupdates) January 5, 2025 చదవండి: హీరో విశాల్‌కు ఏమైంది? ఎందుకిలా అయిపోయాడు? -
జగన్ గారే ఏపీ నెక్స్ట్ సీఎం : హీరో విశాల్
-
ఏపీ రాజకీయాలపై హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
AP ఎన్నికలపై హీరో విశాల్ రియాక్షన్
-
త్వరలో రాజకీయ పార్టీ: హీరో విశాల్
సాక్షి, చెన్నై: త్వరలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్లు తమిళ నటుడు విశాల్ ప్రకటించారు. 2026లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ త్వరలో రాజకీయాల్లోకి వస్తా. 2026లో పార్టీ తరఫున నేను కూడా బరిలో దిగుతా. పార్టీ ఏర్పాటు, ఇతరత్రా వివరాలను త్వరలోనే వెల్లడిస్తా. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ 100 శాతం జరగాలని ఆశిస్తున్నా’’ అని విశాల్ చెప్పారు. -
RGV నాకు ఇన్స్పిరేషన్.. లవ్ మ్యారేజ్ చేసుకుంటాను
-
శివ సినిమా చూసి ఇండస్ట్రీ కి రావాలి అనుకున్నాను: హీరో విశాల్
-
మా అన్న శ్రీయ లవ్ అలా స్టార్ట్ అయ్యింది
-
నేను ఎంత మందిని లవ్ చేశాను అంటే..!
-
యాంకర్ తో విశాల్ కామెడీ..వేరే లెవెల్
-
విశాల్‌కు హైకోర్టు షాక్.. రూ. 15 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం
స్టార్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. రూ. 15 కోట్ల రూపాయలు శాశ్వత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ కోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. అలా చేయని పక్షంలో తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీలో తెరకెక్కే సినిమాలు రిలీజ్ కాకుండ నిషేధం విధించింది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన కేసులో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కాగా గతంలో విశాల్ ఓ తన నిర్మాణ సంస్థ(ఫలిం ఫ్యాక్టరి) కోసం ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బుచెళియన్ వద్ద రూ. 21. 29 కోట్లు అప్పు తీసుకున్నాడు. అయితే ఈ రుణాన్ని లైకా ప్రొడక్షన్స్ ఫైనాన్షియర్‌కు తిరిగి చెల్లించింది. అయితే, తమకు రుణం చెల్లించేంత వరకు విశాల్ నటించే చిత్రాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇచ్చేలా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ - లైకా ప్రొడక్షన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. కానీ ఈ ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘిస్తూ తన చిత్రం ‘వీరమే వాగై సూడుం’ చిత్రాన్ని రిలీజ్ చేశారు. దీంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జ్ స్పెషల్ కోర్టు దీంతో లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన సింగిల్ జడ్జి స్పెషల్ కోర్టు రిజిస్ట్రార్ పేరుతో రూ.15 కోట్లను మూడు వారాల్లో శాశ్వత డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ సమయంలో విశాల్ నేరుగా కోర్టుకు హాజరై.. లైకా సంస్థ కోర్టును ఆశ్రయించడం వల్లే రుణం చెల్లించలేకపోయాయని, పైగా తనకు ఒకే రోజున రూ.18 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో విశాల్ ఆస్తుల వివరాలను ప్రమాణ పత్రంలో సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ విశాల్ హైకోర్టులో అప్పీల్ చేయగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజా, జస్టిస్ భరత చక్రవర్తిల సారథ్యంలో ధర్మాసనం విచారణ జరిపి.. గతంలో రూ.15 కోట్లను విశాల్ చెల్లించాలంటూ సింగిల్ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. పైగా ప్రత్యేక జడ్జి తుది తీర్పును వెలువరించేంత వరకు విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మించే చిత్రాలు థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీలులేదని ధర్మాసనం ఆదేశించింది. -
ఆ ఘనత విజయకాంత్‌దే: హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
నటుడు విశాల్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం మార్క్ అంటోని. నటుడు ఎస్జే సూర్య ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఇందులో నటి రీతు వర్మ, అభినయ, తెలుగు నటుడు సునీల్, నిళల్గళ్ రవి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మినీ స్టూడియో పతాకంపై వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. కాగా జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమాన్ని బుధవారం స్థానిక సైదాపేటలోని అన్నై వేళాంగణి కళాశాలలో నిర్వహించారు. ఇందులో నటుడు విశాల్, ఎస్ జే సూర్య, దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్, నిర్మాత వినోద్ కుమార్ తదితర చిత్ర వర్గాలు పాల్గొన్నారు. కాగా అన్నా వేళాంగణి కళాశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, అనేక మంది విద్యార్థులు ఈ వేడుకలు పాల్గొన్నారు. నటుడు విశాల్ అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందించారు. ముందుగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దక్షిణ భారత నటీనటుల సంఘానికి నటుడు విజయ్‌కాంత్ విశేష సేవలను అందించారన్నారు. అప్పుల్లో ఉన్న సంఘాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చింది ఆయనేని పేర్కొన్నారు. సంఘ నూతన భవన నిర్మాణానికి విజయ కాంతే కారణమని, మరో ఏడాదిలో నూతన భవనం పూర్తి అవుతుందని చెప్పారు. ఆ తర్వాత నూతన భవనంలో నటుడు విజయ కాంత్‌కు భారీ ఎత్తున అభినందన సభను నిర్వహించినట్లు తెలిపారు. ఇక మార్క్ అంటోని చిత్రం గురించి చెప్పాలంటే ఇది మంచి ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. దర్శకుడు అధిక రవిచంద్రన్ మాట్లాడుతూ ఇది రజనీకాంత్ నటించిన బాషా చిత్రం తరహాలో విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. -
హీరో విశాల్ ఇంటిపై దాడి కలకలం, ధ్వంసమైన కిటికి అద్దాలు
స్టార్ హీరో విశాల్ ఇంటిపై దుండగులు దాడి చేశారు. ఆయన ఇంటిపైకి రాళ్లు రువ్వడంతో కిటికి అందాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన తమినాడు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. చెన్నైలోని అన్నానగర్‌లో తల్లిదండ్రులతో కలిసి కొంతకాలంగా విశాల్ నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎరుపు రంగు కారులో వచ్చి విశాల్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. అనంతరం కారులో పరారయ్యారు. ఈ ఘటన సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో విశాల్ ఇంటి కిటికి అద్దాలు ధ్వంసం కాగా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. చదవండి: Indira Devi: మహేశ్ బాబు తల్లి మృతి.. చిరంజీవి సంతాపం ఈ దాడి జరుగుతున్న సమయంలో విశాల్ ఇంట్లో లేడని సమాచారం. షూటింగ్ నిమిత్తం ఆయన బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ దాడిపై విశాల్ మేనేజర్ అన్నానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విశాల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సినీ పరిశ్రమలో విశాల్ అంటే గిట్టని వారే ఈ దాడికి పాల్పడ్డారా.. లేక మరే ఇతర కారణాలు ఉన్నాయనే అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే విశాల్ తమిళ చిత్ర పరిశ్రమ నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే... విశాల్ ప్రస్తుతం లాఠీ. తుపరివాలన్-2, మార్క్ ఆంటోని వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. చదవండి: Srihari Wife Shanthi: ‘డబ్బులు ఇవ్వకుండా ఎంతోమంది ఆయనను మోసం చేశారు’ -
విశాల్‌తో ఇప్పటి వరకు నటించే అవకాశం రాలేదు: ఉదయనిధి స్టాలిన్
విశాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘లత్తీ’(తెలుగులో లాఠీ). రానా ప్రొడక్షన్స్ పతాకంపై నటులు నందా, రమణ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి నవ దర్శకుడు వినోద్ కుమార్ దర్శకత్వం వహించారు. నటి సునైనా నాయకిగా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆదివారం రాత్రి చెన్నైలోని ప్రసాద్ స్టడియోలో మూవీ టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. చదవండి: యాక్టింగ్‌కి బ్రేక్ ఇస్తున్నా.. అయితే..!: నిత్యా మీనన్ ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడు లాఠీతో దెబ్బలు తినలేదన్నారు. అయితే ఈ చిత్రం షటింగ్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ మినహా దెబ్బలు తిననివారు లేరన్నారు. చిత్ర టీజర్లో ‘ఊర్లో ఉండే పోకిరీలు, పొరంబోకులు అందరూ నన్ను చంపడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరూ తప్పించుకోలేరు. రండిరా’ అని తాను చెప్పిన డైలాగు బాగా నచ్చిందన్నారు. నడిగర్ సంఘం నూతన భవనంలో కరుణానిధి, స్టాలిన్ల పేర్లను పొందుపరచాలనే కోరికను ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ వద్ద విశాల్ వ్యక్తం చేశారు. చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన విజయ్ అనంతరం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. లాఠీ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. విశాల్ కాల్ షీట్స్ కోసం తాము చాలా కాలంగా ప్రయత్నిస్తున్నామని, నందా, రమణ చాలా సులువుగా కాల్ షీట్స్ పొంది చిత్రం చేశారన్నారు. తాను విశాల్ మంచి స్నేహితులమని, కలిసే పాఠశాల, కళాశాలకు వెళ్లావారమన్నారు. ఆ సమయంలో జరిగిన విషయాలను చెప్పకూడదన్నారు. విశాల్ కలిసి చిత్రం చేయాల్సిందని అయితే అది ఇప్పటి వరకు జరగలేదనన్నారు. పోలీస్ అసిస్టెంట్ కమిషనర్‌గా, కమిషనర్‌గా అన్ని పాత్రలు పోషించి ప్రస్తుతం కానిస్టేబుల్ అయ్యారని చమత్కరించారు. విశాల్ నడిగర్ సంఘం భవన నిర్మాణాన్ని పూర్తిచేసి, త్వరగా పెళ్లి చేసుకోవాలని అన్నారు. -
హైకోర్టులో హీరో విశాల్‌కు చుక్కెదురు, రూ. 15 కోట్ల డిపాజిట్‌కు ఆదేశం
Madras High Court Shocks Hero Vishal: హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. లైకా ప్రొడక్షన్ సంస్థ కేసు విషయంలో విశాల్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఈ రుణం కేసులో విశాల్ రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం విశాల్‌కు కోర్టు మూడు వారాల గుడువును ఇచ్చింది. హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున ఆ సొమ్మును ఈ గడువులో లోపల డిపాజిట్ చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. చదవండి: సమంత హాట్ ఫొటోపై దగ్గుబాటి వారసురాలు కామెంట్ కాగా తమ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాన్ని విశాల్ దిక్కరించారంటూ లైకా ప్రొడక్షన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఒప్పందం ప్రకారం అప్పుగా తీసుకున్న రూ. 15 కోట్లు చెల్లించకుండా అతడు కొత్త సినిమా రిలీజ్ చేయకుడదు. కానీ విశాల్ తమ డబ్బు తిరిగి చెల్లించకుండానే కొత్త మూవీ వీరమే వాగౌ సుడుం విడుదల చేసేందుకు సిద్దమయ్యాడని, అంతేకాదు తమకు విశాల్ నుంచి వడ్డీతో సహా రూ.21.69 కోట్ల రుణాన్ని రికవరీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లైకా ప్రొడక్షన్ హౌస్ పిటిషన్ దాఖలు చేసింది. చదవండి: ఓటీటీలోకి అజిత్ ‘వలిమై’, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ఈ పిటిషన్‌పై విచారణ చెప్పట్టిన జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రూ.15 కోట్లు హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున బ్యాంకులో మూడు వారాల్లో డిపాజిట్ చేయాలని విశాల్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే లైకా ప్రొడక్షన్స్‌కు ప్రతివాది రూ. 21.29 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని అగ్రిమెంట్లో ప్రాథమికంగా వెల్లడించినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే విశాల్ మొదట రూ. 12 కోట్లు తీసుకున్నారని, తర్వాత రూ. 3 కోట్లు తీసుకున్నారని, కాబట్టి రూ. 21.29 కోట్ల వడ్డి సరైనది కాదని విశాల్ తరపు న్యాయవాది వాదించారు. -
చెన్నై: సినీ నటుడు విశాల్‌కు ప్రమాదం
-
షూటింగ్లో హీరో విశాల్‌కు గాయాలు
తమిళ హీరో విశాల్ షూటింగ్లో గాయాలపాలయ్యాడు. హైదరాబాద్‌లో లాఠీ సినిమా క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్న సమయంలో అతడు గాయపడ్డాడు. విలన్ నుంచి చిన్నారిని కాపాడే సీన్లో అతడు భవనంపై నుంచి దూకాలి. ఈ క్రమంలో అతడి చేతికి, నుదుటికి గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు షూటింగ్‌కు బ్రేక్ చెప్పి కేరళ వెళ్లి అక్కడ చికిత్స తీసుకుంటున్నాడు. చేతికి గాయాల కారణంగా సినిమా షూటింగ్‌ను మార్చికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని విశాల్ ట్విటర్లో అధికారికంగా వెల్లడించాడు. చేతికి ఫ్రాక్చర్ అయినందున ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. తిరిగి మార్చి మొదటివారంలో ఫైనల్ షెడ్యూల్లో పాల్గొంటానని తెలిపాడు. కాగా లాఠీ సినిమాలో విశాల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు. సునయన హీరోయిన్గా నటిస్తోంది. వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రానా ప్రొడక్షన్స్ ద్వారా రమణ, నంద కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Suffered multiple hairline fractures during the filming of this stunt sequence in #Laththi. Off to #Kerala to rejuvenate myself! Will join the crew for the final schedule from March first week 2022. GB. pic.twitter.com/L1pOByb6hZ — Vishal (@VishalKOfficial) February 11, 2022 -
పునీత్‌కి మాటిస్తున్నాను.. ఆ పిల్లలను నేను చదివిస్తా: విశాల్
Vishal To Continue Puneeth Rajkumars Charity Work: పునీత్ రాజ్‌కుమార్ లాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంత వరకు చూడలేదని హీరో విశాల్ అన్నారు. ఆయన నటుడిగానే కాకుండా చాలా మంచి మనిషి అని తెలిపారు. ఎనిమి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పునీత్‌కు నివాళులు అర్పించిన అనంతరం విశాల్ మాట్లాడారు. 'పునీత్ లేరనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను, ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు, సమాజానికి తీరని లోటు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ నుదిటిన ముద్దు పెట్టిన సీఎం బొమ్మై.. ఫిల్మ్ ఇండస్ట్రీలో పునీత్‌లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. పునీత్ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారు. చివరికి తన కళ్లు కూడా దానం చేశారు. ఆయన చదివించిన 1800 పిల్లల బాధ్యత ఇకపై నేను చూసుకుంటాను. ఒక స్నేహితుడిగా పునీత్ సేవా కార్యక్రమాలకు నా వంతు సాయాన్ని అందిస్తానని మాటిస్తున్నాను అని విశాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విశాల్ గొప్ప మనసుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. విశాల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. ఆర్య మాట్లాడుతూ.. ‘పునీత్ సర్ లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఆయన మరణం తీరని లోటు. మిస్ యూ సర్’ అంటూ ఎమోషన్ అయ్యారు. కాగా విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ రూపొందించిన ‘ఎనిమి’ ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: పునీత్ మరణం: లైవ్‌లో న్యూస్ చదువుతూ ఏడ్చేసిన యాంకర్ నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా? -
విశాల్ తెలుగు డబ్బింగ్ ఎలా చెప్పారో చూడండి
Actor Vishal Dubs For Enemy: యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎనిమీ’.ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా హీరో విశాల్ ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా ఇలా చేతులు ఊపుకుంటూ ఉంటేనే నాకు తెలుగులో డబ్బింగ్ వస్తుంది అంటూ విశాల్ ఫన్నీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే విడుదలైన టీజర్ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. The secret behind my way of dubbing in telugu has been revealed. Like a #TrafficConstable at his best. #EnemyDubbing#Enemy at final stage of Post-Production is going 🤔 pic.twitter.com/mHOxByRPSS — VishalFans360 © (@VishalFans360) September 21, 2021 -
అనాథ చిన్నారులకు విశాల్ గోరుముద్దలు
Hero Vishal: హీరో విశాల్ ఆదివారం తన పుట్టిన రోజు సందర్భంగా అభిమాన సంఘాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు చీరలు, పంచెలు పంచి పెట్టారు. పేద మహిళల ఉపాధి కోసం కుట్టుమిషన్లు, నీటి బిందెలు, బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. అనాథలను గుర్తించి అనాథాశ్రమాల్లో చేర్చారు. కాగా విశాల్ ఆదివారం ఉదయం స్థానిక కీల్పాక్కంలోని మెర్సీ హోమ్‌లోని వృద్ధులకు అన్నదానం చేశారు. స్థానిక కెల్లీస్‌లోని సురభి ఆశ్రమంలో అనాథ బాలల మధ్య కేక్ కట్ చేసి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. పిల్లలకు తన చేతితో అన్నం తినిపించి వారికి మధురానుభూతి కలిగించారు. A Day Spent Well !!! pic.twitter.com/WzIsz162hW — Vishal (@VishalKOfficial) August 29, 2021 -
ఆకట్టుకున్న విశాల్, ఆర్యల ‘ఎనిమి’ ఫస్ట్ సింగిల్
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్యల క్రేజీ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతున్న చిత్రం ‘ఎనిమి. ఇది విశాల్ 30వ చిత్రం కాగా, ఆర్య 32వ సినిమా. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఇందులో కీలక పాత్రలో నటించాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ అన్ని భాషలలో కలిపి 20 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించింది. దీంతో ఈ సినిమాపై అంఛనాలను భారీగా పెరిగాయి. చదవండి: శ్రీవారిని దర్శించుకున్న మంచు మనోజ్, లక్ష్మి ప్రసన్న ఈ నేపథ్యంలో తాజాగా ఎనిమి చిత్రం నుండి బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరపరిచిన ‘పడదే.. పడదే’ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘అదిరే నిను చూసే కనులే నీ స్నేహం కోసం కదిలే..అదిగో నిను చూస్తేనే...’ అంటూ సాగే ఈ పాటకు అనంత్ శ్రీ రామ్ సాహిత్యం అందించగా పృథ్విచంద్ర ఫుల్ ఎనర్జీతో ఆలపించాడు. తమన్ క్యాచీ ట్యూన్ మరోసారి సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. విశాల్, మృణాలిని రవి మధ్య కెమిస్ట్రీ ఈ పాటకి హైలెట్‌గా నిలిచింది. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళం, హిందీ సహా మరికొన్ని భాషలలో ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: బర్త్‌డే పార్టీలో అమ్మాయితో ఆర్జీవీ రచ్చ, వీడియో వైరల్ -
విశాల్, ఆర్యల భారీ మల్టిస్టారర్ ‘ఎనిమీ’ షూటింగ్ పూర్తి
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎనిమీ’. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరు కలిసి నటిస్తోన్న చిత్రమిది. ఇది హీరో విశాల్‌కు 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. కాగా తాజాగా ‘ఎనిమీ’ మూవీ షూటింగ్ పూర్తయినట్లు హీరో విశాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. It’s a wrap for #Enemy shoot,all set 4 Teaser soon,so damn happy & elated 2 hv worked wit a lovely team Tnx to @anandshank,@RDRajasekar,@MusicThaman,cast,crew,Tnx 2 producer @vinod_offl 4 making this lovely project Love U @arya_offl so happy we are again in a fab film together pic.twitter.com/yXTqCWzIcS — Vishal (@VishalKOfficial) July 12, 2021 ఈ సందర్భంగా...‘ఎనిమీ చిత్రీకరణను విజయవంతగా పూర్తి చేశాం. టీజర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇటువంటి లవ్లీ టీమ్‌తో వర్క్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఆర్యతో కలిసి మళ్లీ వర్క్ చేసినందుకు ఆనందంగా ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైన దర్శకుడు ఆనంద్‌శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, కెమెరామ్యాన్ ఆర్డి రాజశేఖర్, నిర్మాత వినోద్ కుమార్‌లతో పాటు చిత్రయూనిట్ సభ్యులందరికి ధన్యవాదలు’ అంటూ విశాల్ రాసుకొచ్చాడు. కాగా ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. తెలుగు, తమిళంతో పాటు మరిన్ని భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. -
ప్రముఖ నిర్మాతపై హీరో విశాల్ ఫిర్యాదు
చెన్నై: సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ అధినేత ఆర్బీ చౌదరిపై హీరో విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన తన డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వకపోవడం వల్లే చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 2018లో ఇరుంబుతిరమ్(తెలుగులో అభిమన్యుడు) సినిమాను విశాల్ తన ఓన్ బ్యానర్ విశాల్ ఫ్యాక్టరీలోనే నిర్మించాడు. ఆ టైంలో విశాల్, ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అయిన ఆర్బీ చౌదరి దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు. ప్రతిగా చెక్ లు, బాండ్లు, ప్రామిసరీ నోట్లను తాకట్టు పెట్టాడు. ఇక అప్పు మొత్తం తీర్చినప్పటికీ తన పత్రాలు ఇవ్వకుండా ఆర్బీ చౌదరి తిప్పించుకుంటున్నాడని అసహనం వ్యక్తం చేస్తూ విశాల్ ఇప్పుడు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. It’s unacceptable that Mr #RBChoudhary failed to return the Cheque Leaves,Bonds & Promissory Notes months after repaying the loan to him for the Movie #IrumbuThirai,he was evading giving excuses & finally told he has misplaced the documents We have lodged a complaint with Police — Vishal (@VishalKOfficial) June 9, 2021 కాగా, ఈ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం విశాల్ ‘ఎనిమీ’, ‘తుప్పరివాలన్ 2’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆర్బీ చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ్, మలయాళంలో సినిమాలు తీశాడు. ఆయన కొడుకులు జీవా, జతిన్ రమేశ్ ఇద్దరూ హీరోలే. చదవండి: విశాల్.. భగత్ సింగ్‌ను తలపించావ్ -
అప్పుడే విజిల్ వేయాలనిపించింది: విశాల్
‘‘చక్ర’ సినిమాలో హీరో ఫాదర్‌కి కేంద్ర ప్రభుత్వం అశోక చక్ర అవార్డు ఇస్తుంది.. కొంత మంది దుండగులు దాన్ని దొంగలిస్తారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఒక సైనికుడు దాన్ని ఎలా చేధించాడు? అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. అందుకే ‘చక్ర’ టైటిల్ పెట్టాం’’ అని హీరో విశాల్ అన్నారు. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా రెజీనా కీలకపాత్రలో నటించిన చిత్రం ‘చక్ర’. విశాల్ నటించి, నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ– ‘‘చక్ర’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా విజువల్స్ చూస్తుంటే ‘అభిమన్యుడు’ సినిమాలాగా అనిపిస్తుంది.. కానీ రెండిటికీ సంబంధం లేదు. ఆనందన్ కథ చెబుతున్నప్పుడే విజిల్స్ వేయాలనిపించింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజెప్పే చిత్రమిది. యువన్ శంకర్‌రాజాతో నా 10వ సినిమా ‘చక్ర’. నా తర్వాతి రెండు చిత్రాలకు కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం ఆర్యతో కలిసి ‘ఎనిమీ’ అనే సినిమా చేస్తున్నాను. నా డైరెక్షన్లో ‘అభిమన్యుడు–2’ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత శరవణన్ అనే ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్‌తో ఓ సినిమా చేస్తా’’ అన్నారు. చదవండి: హీరో విలన్, విలన్ హీరో అయ్యాడు స్టార్ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ రీమేక్! -
ఎన్నికల బరిలోకి మరో స్టార్ హీరో!
చెన్నై: తమిళ సినీ హీరో విశాల్ త్వరలోనే పోలీటికల్ ఎంట్రి ఇవ్వబోతున్నాడు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ పోటీ చేసి గెలుపోందిన విషయం తెలిసిందే. ప్రైవేటు రంగంలో రెండు కీలక పదవులు చేపట్టి సత్తా చాటుకున్న విశాల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తాజాగా ప్రకటించాడు. త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఏదైన ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయ ప్రవేశం చేయాలని విశాల్ నిర్ణయించుకున్నాడు. అంతేగాక తన పోలీటికల ఎంట్రీ కోసం అభిమాన సంఘాల నేతలతో చర్చలు కూడా జరుపుతున్నాడంట. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడనేది విషయంపై స్పష్టత లేదు. ఈ విషయాన్ని విశాల్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నాడంట. (చదవండి: బీజేపీలోకి హీరో విశాల్?) దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతితో గతంలో ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో విశాల్ పోటీ చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ ఎలక్షన్లో నామినేషన్ కూడా వేశాడు. అయితే నామినేషన్‌ను ప్రతిపాదించిన 10 మందిలో కొంత మంది తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో ఎన్నికల కమిషన్ విశాల్ నామినేషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆ ఉపఎన్నికల్లో విశాల్ పోటీ చేయలేకపోయాడు. ఇక త్వరలో రాబోయే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు విశాల్ సిద్ధమవుతున్నాడు. దీంతో టీఎఫ్‌పీసీ అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా విశాల్ రాజీనామ చేయాలని తమిళ పరిశ్రమకు చెందిన దర్శక, నిర్మాతల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: విశాల్‌కు షాక్: నష్టాన్ని అతడే భరించాలి) దర్శకుడు, నటుడు చెరన్ మాట్లాడుతూ.. ‘గత ఆదివారం జరిగిన నిర్మాతల కౌన్సిల్ సమావేశంలో విశాల్ తమ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే నడిగర్ సంఘం, నిర్మాతల కౌన్సిల్ కానీ రాజకీయ పార్టీలు కాదని ఆయన పేర్కొన్నారు. అంతేగాక టీఎఫ్‌పీసీ ఉప చట్టాల ప్రకారం తమ సభ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించలేరని, ఒకవేళ విశాల్ అలా చేయాలనుకుంటే నిర్మాతల కౌన్సిల్‌కు, అసోసియేషన్లకు రాజీనామా చేసిన తర్వాతే అతడు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్మాత, దర్శకుడు రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: కారు ధ్వంసం.. ఆమె పైనే అనుమానం?) -
భగత్‌సింగ్‌ను తలపించావ్
ఇటీవలే కంగనా రనౌత్ ఆఫీస్‌ను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీయంసీ) ధ్వంసం చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను చాలెంజ్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు కంగనా. మీ గర్వం కూడా మా ఆఫీస్ ధ్వంసం అయినట్లే అవుతుందన్నది ఆ వీడియో సారాంశం. ఈ నేపథ్యంలో కంగనా ధైర్యాన్ని పొగుడుతూ ఓ ట్వీట్ చేశారు విశాల్. ‘‘కంగనా... నీ గట్స్‌కి నా హ్యాట్సాఫ్. ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాలను వ్యక్తపరచడానికి నువ్వెప్పుడూ వెనకాడలేదు. నీకు సంబంధించిన విషయాలు కాకపోయినా వాటి గురించి నువ్వు మాట్లాడి, ప్రభుత్వం నుంచి కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నావు. అయినా ధైర్యంగా నిలబడ్డావు. నీ వైఖరి 1920లో భగత్‌సింగ్‌ను తలపించింది. తప్పు ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఎదురుగా ఎవరైనా మాట్లాడొచ్చు అని ఓ ఉదాహరణ చూపించావు’’ అన్నారు విశాల్. -
కారు ధ్వంసం.. ఆమె పైనే అనుమానం?
తమిళ సినిమా(చెన్నై): నటుడు విశాల్ కార్యాలయంలో జరిగిన మోసం వ్యవహారం విశ్వరూపం దాల్చుతోందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇదే. విశాల్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడు రాణిస్తూ నిర్మాతగా తన వీఎఫ్ఎఫ్ సంస్థ ద్వారా చిత్రాలను నిర్మిస్తున్నారు. స్థానిక వదలాలని, కుమరన్ కాలనీలో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో పలువురు సిబ్బంది పని చేస్తున్నారు. అలా రమ్య అనే యువతి విశాల్ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేసింది. ఆమె నిధులను దుర్వినియోగం చేసి రూ.45 లక్షల మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంపై విశాల్ కార్యనిర్వాహకుడు హరి కుమార్ స్థానిక విరుగాంబాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అకౌంట్‌గా పనిచేస్తున్న రమ్య మోసానికి పాల్పడినట్టు వెలుగులోకి వచ్చిందనీ దీని గురించి విచారించి ఆమెపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. (విశాల్ రహస్యాలను బయట పెడతా: రమ్య) పోలీసులు రమ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం పై స్పందించిన రమ్య మీడియాతో మాట్లాడుతూ తనపై విశాల్ వర్గం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, విశాల్ కార్యనిర్వాహకుడు హరి కుమార్ తన అనుచరులను పంపించి తనను బెదిరించినట్లు ఆమె పేర్కొంది. అదేవిధంగా కట్ట పంచాయితీలు చేస్తున్నారంటూ విశాల్‌పై పలు ఆరోపణలు గుప్పించింది. ఈ వ్యవహారం పోలీసుల విచారణలో ఉండగా సోమవారం మరో సంఘటన జరిగింది. స్థానిక కోడంబాక్కంలో నివసిస్తున్న విశాల్ కార్యనిర్వాహకుడు హరికుమార్ కారును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో హరికుమార్ కోడంబాకం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన కారును ధ్వంసం చేసిన వ్యవహారంలో అకౌంటెంట్ రమ్యకు సంబంధం ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనిపై కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రానా థ్రిల్లింగ్ వాయిస్‌కు ఫాన్స్ ఫిదా
సాక్షి, హైదరాబాద్ : ‘యాక్షన్’ సినిమా తెలుగు వెర్షన్ కోసం విలక్షణ నటుడు రానా గొంతు కలిపిన ర్యాప్ సాంగ్ దుమ్ము రేపుతోంది. యాక్షన్ సినిమా కోసం రానా ఈ పాట పాడినట్టు ఇటీవల విశాల ప్రకటించిన సంగతి తెలిసిందే. శాల్, తమన్న హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలోని ఈ మోస్ట్ ఎవైటెట్ రానా ర్యాప్ సాంగ్ మేకింగ్ వీడియోను గురువారం చిత్ర యూనిట్ రీలీజ్ చేసింది. విలక్షణ పాత్రల ఎంపికతో ఇప్పటికే తన అభిమానులను ఆకట్టుకున్న రానా తాజాగా తన మొట్టమొదటి సాంగ్‌తోనే ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. అంతేకాదు ‘అడుగడుగున పిడుగుల జడి’ అంటూ థ్రిల్లింగ్ వాయిస్‌తో సరికొత్త అవతార్‌లో విమర్శకుల చూపును కూడా తన వైపు తిప్పుకున్నాడు. కాగా సుందర్ సి దర్శకత్వంలో వస్తున్నఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. -
ముగిసిన నడిగర్ సంఘం ఎన్నికల పోలింగ్
-
ప్రశాంతంగా ముగిసిన నడిగర్ పోలింగ్
సాక్షి, చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మైలాపూర్‌లోని సెయింట్ ఎబాస్ బాలికల పాఠశాలలో ఓటింగ్ నిర్వహించగా.. కమల్‌హాసన్, ప్రకాష్‌రాజ్, కుష్భూ, రాధ, కేఆర్ విజయ సహా పలువురు నటులు, నటీమణులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. చివరిక్షణంలో హడావుడి ప్రకటన కారణంగా పోలింగ్ మందకోడిగా సాగినట్టు నిర్వాహకులు తెలిపారు. 3వేల100 మంది సభ్యులున్న నడిగర్ సంఘానికి 2019-2022 మధ్యకాలానికి ఈ ఎన్నికలు జరిగాయి. మద్రాస్ హైకోర్టు తుదితీర్పు అనంతరం నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి నాజర్ నేతృత్వంలోని పాండవార్ ప్యానెల్, భాగ్యరాజ్ నేతృత్వంలోని శంకర్‌దాస్ ప్యానెల్ నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీచేశాయి. జనరల్ సెక్రటరీ పదవికి హీరో విశాల్, నిర్మాత గణేశ్‌తో తలపడ్డారు. కోశాధికారి పదవికి హీరో కార్తీ, హీరో ప్రశాంత్ బరిలో ఉన్నారు. నాజర్ గ్రూప్, భాగ్యరాజ్ గ్రూప్ మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరగడంతో.. ఎన్నికల ప్రక్రియ రచ్చకెక్కింది. విశాల్ తమిళ వ్యక్తి కాదని, అతడిని నడిగర్ సంఘం నుంచి బయటకు పంపాలని భాగ్యరాజ్ సంచలన కామెంట్స్ చేయడంతో పోటీ వేడెక్కింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియను ఆపాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. చివరినిమిషంలో హైకోర్టు అనుమతి ఇవ్వడంతో పోలింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ అందకపోవడంతో ముంబైలో దర్బార్ షూటింగ్లో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తంచేశారు. అయితే పదిరోజుల ముందే పోస్టల్ బ్యాలెట్లు పంపామని, తపాలా శాఖ ఆలస్యం కారణంగా అవి అందలేదని నటి కుష్భూ తెలిపారు. -
హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు
సాక్షి, చెన్నై : ప్రముఖ హీరో విశాల్ తీవ్రంగా గాయపడ్డారు. సుందర్.సి దర్శకత్వంలో విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్లో ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విశాల్ కాలు, చేయి విరిగినట్లు సమాచారం. కాలు, చేతికి బ్యాండేజ్‌తో ఉన్న విశాల్ ఫోటో ప్రస్తుం వైరల్ అవుతోంది. సుందర్ సి. దర్శకత్వంలో విశాల్ గతంలో 'మదగజరాజా', 'ఆంబల' చిత్రాల్లో నటించారు. వీరి కాంబినేషన్లో రాబోతున్న మూడో చిత్రమిది. ఈ సినిమాలో మలయాళం యాక్టర్ ఐశ్వర్య లక్ష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టర్కీలో సుమారు 50 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. కాగా ఫైట్ సీన్లను ఎలాంటి డూప్ లేకుండా చేయడం మొదటి నుంచి విశాల్‌కు అలవాటే. గతంలోనూ ’తుప్పరివాలన్’ సినిమా షూటింగ్‌లోనూ ఈ యువహీరో గాయపడిన విషయం తెలిసిందే. ఇక విశాల్ ‘అయోగ్య’ చిత్రం మే 10న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ చేసిన ‘టెంపర్’కి ఇది రీమేక్. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించగా, ఆయన జోడీగా రాశీ ఖన్నా నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ చేయనున్నట్టుగా ముందుగా ప్రకటించినా చివరికి మే నెలకు వాయిదా పడింది. కానీ ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం. -
సినీ నటుడు విశాల్ విడుదల
చెన్నై: సినీ నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ను పోలీసులు విడుదల చేశారు. అలాగే టీనగర్‌లోని నిర్మాతల మండలి కార్యాలయానికి ఎవరూ వెళ్లరాదని పోలీసులు ఆంక్షలు విధించారు. నిర్మాతల మండలి కార్యాలయం చుట్టుపక్కల 144 సెక్షన్ అమలు చేశారు. టీనగర్లో ఉన్న నిర్మాతల మండలి కార్యాలయం తలుపులను బలవంతంగా తెరిచేందుకు విశాల్ ప్రయత్నించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు విశాల్‌ను అదుపులోకి తీసుకున్న సంగతి తెల్సిందే. అనంతరం దగ్గరలో ఉన్న తైనాంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పైరసీని అడ్డుకోవడంలో విశాల్ విఫలమయ్యారని, నిధులను దుర్వినియోగపరచడం, నిర్మాతల సమస్యల్ని పరిషర్కించడంలో కూడా విఫలమయ్యారని ఆరోపిస్తూ కొంత మంది నిర్మాతలు విశాల్‌ను రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్నారు. (హీరో విశాల్ అరెస్ట్..) ఈ విషయమై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. చినికి చినికి వివాదం ముదిరి పెద్దదిగా మారింది. పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం విశాల్ విలేకరులతో మాట్లాడారు. తమ కార్యాలయానికి ఎవరో తాళాలు వేస్తే అడ్డుకోని పోలీసులు వాటిని తొలగించేందుకు వెళితే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. నిర్మాతల మండలి ఐక్యతలో చీలికలు తెచ్చేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇళయరాజా సంగీత విభావరి ద్వారా నిర్మాతల మండలికి నిధుల సేకరణను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళయరాజా కార్యక్రమం నిర్వహించే తీరుతామని స్పష్టం చేశారు. -
హీరో విశాల్ అరెస్ట్..
-
హీరో విశాల్ అరెస్ట్..
తమిళ నిర్మాతల మండలిలో నెలకొన్న విబేధాలు తారస్థాయికి చేరాయి. హీరో అరెస్ట్‌తో గురువారం నిర్మాతల మండలి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన విశాల్‌ను తొలుత అభినందించిన వాళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నారు. సమస్యలను పట్టించుకోవడం లేదని.. పైరసీని అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ సినిమాల వెబ్సైట్ తమిళ్‌రాకర్స్‌లో విశాల్‌కు షేర్ ఉందంటూ ప్రముఖ నిర్మాత అజగప్పన్ ఆరోపించారు. ఇక మీదట నిర్మాతల మండలిలోకి రానిచ్చేది లేదంటూ ఆయన ప్రత్యర్థులు కొందరు కార్యాలయానికి తాళం వేశారు. దాంతో విశాల్ తాళం పగలగొట్టి లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తమిళ నిర్మాతల మండలి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకూ చెన్నై పోలీసలు విశాల్‌ను అరెస్ట్ చేశారు. అయితే గత కొంతకాలంగా విశాల్‌కు, నిర్మాతలకు మధ్య విబేధాలు మొదలయ్యాయి. దాంతో ఓ వర్గం వారు విశాల్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ఈ నెల 21న తమిళనాట ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ చేసేలా పర్మిషన్ ఎలా ఇచ్చారంటూ చిన్న సినిమాల నిర్మాతలు విశాల్‌ను నిలదీస్తున్నారు. కాగా అరెస్ట్ విషయమై విశాల్ ట్విటర్లో స్పందించారు. ‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నిన్న తమిళ నిర్మాతల మండలికి తాళం వేశారు. అప్పుడు స్పందించని పోలీసులు.. నేడు మా తప్పేం లేకపోయినప్పటికి నన్ను, నా సహచరులను అరెస్ట్ చేశారు. దీన్ని నమ్మలేకపోతున్నాను. ఈ విషయం గురించి పోరాటం చేస్తానం’టూ ట్వీట్ చేశారు. Police who were mute yesterday wen unauthorised ppl locked the doors & gates of TFPC have arrested me & my colleague today for no fault of ours,absolutely unbelievable We will fight back,wil do everything to conduct Ilayaraja sir event & raise funds to help Producers in distress — Vishal (@VishalKOfficial) December 20, 2018 -
కేరళ వర్షాలు : భారీ విరాళం ప్రకటించిన హీరోలు
భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరైన కేరళను ఆదుకునేందుకు ప్రముఖ సినీ నటులు స్పందిస్తున్నారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకోసం విరాళాలివ్వమని కేరళ ముఖ్యమంత్రి ఇలా విజ్ఞప్తి చేశారో లేదో సౌత్ సూపర్ స్టార్ సూర్య, ఆయన సోదరుడు, మరో హీరో కార్తి వేగంగా స్పందించారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే కేరళకు భారీ విరాళాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల అందించనున్నామని తమిళ, తెలుగు సినీరంగంలో హీరోలుగా వెలుగొందుతున్న ఈ సోదర బృందం వెల్లడించింది. మరోవైపు కేరళను భారీ వర్షాలు, వరదలు మరోసారి అతలాకుతలం చేస్తున్నాయి. మూడు రోజులుగా భారీ వర్షాలు అక్కడి జనజీవనాన్ని స్థంభింపజేశాయి. కొన్నిచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. నదులు, ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కేరళవాసులను ఆదుకునేందుకు ప్రముఖ తమిళ హీరో విశాల్ ముందుకు వచ్చారు. కేరళ రెస్క్యూ పేరుతో విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్టు ట్విటర్ ద్వారా ప్రకటించారు. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న కేరళ ప్రజలను ఆదుకుందాం. వయనాడ్ ప్రాంతంలో ప్రజలకు సహాయం అందించేందుకు రేపు చెన్నైలోని మహాలింగపురంలో విరాళాలు సేకరిస్తున్నాం. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రిలీఫ్ మెటీరియల్స్‌ను తీసుకుంటాం. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న కేరళ వాసులను ఆదుకుందాం. కష్టసమయంలో ఉన్న వాళ్లకి అండగా ఉందాం. అత్యవసర వస్తువులను ప్రజలు అందజేయాల్సిందిగా నటుడు విశాల్ కోరారు. కాగా కేరళలో వరద పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని ప్రకటించారు. ఈ సందర్భంగా మృతులకు, గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్టు వెల్లడించారు. అంతేకాదు కేరళ ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధిగా విరాళాలివ్వాల్సింగా శనివారం సాయంత్రం విజ్ఞప్తి చేశారు. -
విశాల్ రియల్ లైఫ్‌లో కూడా హీరోనే..
విశాల్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా హీరోనే. నుటుడిగా, నిర్మాతగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా, సామాజిక కార్యకర్తగా ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్రను వేస్తున్నారు. విశాల్ హీరోగా గత వారం రిలీజైన అభిమన్యుడు సినిమా విజయవంతంగా దూసుకెళ్తోంది. విశాల్ గత సినిమాలకు లేనంత రికార్డ్ కలెక్షన్లు సాధిస్తోంది అభిమన్యుడు. మొదటి వారాంతానికి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12కోట్లు కొల్లగొట్టింది. రెండో వారంలో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే తాజాగా విశాల్ ఓ నిర్ణయాన్ని ప్రకటించి రియల్ హీరో అనిపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెగిన ప్రతి టికెట్‌పై ఒక్క రూపాయిని ఇక్కడి రైతులకు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. గతంలో విశాలో తమిళనాట కూడా ఇదే విధంగా ప్రకటించి రైతులకు తన వంతు సహాయాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడ తన సినిమా లాభాల్లో వాటా ఇవ్వబోతున్నానని ప్రకటించడంతో విశాల్‌కు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. -
సత్తా చూపిస్తున్న అభిమన్యుడు
విశాల్ చాలా ఏళ్ల తరువాత పెద్ద హిట్ కొట్టారు. పందెంకోడి లాంటి హిట్ తరువాత మళ్లీ ఆ రేంజ్లో హిట్పడలేదు. మాస్ ఇమేజ్ అంటూ ఒకే ధోరణిలో సినిమాలు చేస్తూ ఉన్న విశాల్ గతేడాది డిటెక్టివ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. కానీ ‘అభిమన్యుడు’ సినిమా ఆ లోటును తీర్చేస్తోంది. విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తూ... విజయవంతంగా ఫస్ట్ వీక్‌ను కంప్లీట్ చేసుకుంది. మొదటి వారాంతానికి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ వారాంతంలో కూడా ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. సమంత, అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి హారిస్ జయరాజ్ సంగీతమందించగా, పీఎప్ మిత్రన్ దర్శకత్వం వహించారు. విశాల్ ప్రస్తుతం పందెంకోడి2, టెంపర్ రీమేక్ మూవీలతో బిజీగా ఉన్నారు. -
అభిమన్యుడు సినిమా దూసుకెళ్తోంది
విశాల్ హీరోగా నటించిన అభిమన్యుడు సినిమాతో థియేటర్లు హౌస్‌ఫుల్‌తో కలకలలాడుతున్నాయి. ఈ వారం విడుదలైన ఆఫీసర్, రాజుగాడు పూర్తిగా తేలిపోవడంతో అభిమన్యుడు కలెక్షన్స్‌లో దుమ్ముదులుపుతోంది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. విశాల్ గత సినిమా డిటెక్టివ్ విభిన్న కథతో తెరకెక్కడం, అది కూడా విజయవంతం కావడంతో అభిమన్యుడు సినిమాపై టాలీవుడ్ కూడా ఆసక్తితో ఎదురుచూసింది. మొదటి వారాంతానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు 7కోట్లు వసూళ్లను సాధించింది. ఓ డబ్బింగ్ సినిమా ఈ రేంజ్లో కలెక్షన్స్ సాధించడం చూసి చాలా కాలమైంది. తమిళ నాట కూడా ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లను సాధిస్తోంది. ఈ సినిమాలో విశాల్‌కు జోడిగా సమంత నటించగా, ప్రతినాయకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ నటించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందిచగా, పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. " #Abhimanyudu has collected 7.10 Crs in 3 Days and emerged as Biggest Hit in @VishalKOfficial's career. Film has already became a Superhit." - Producer Gujjalapudi Hari pic.twitter.com/toOiWbYDlr — BARaju (@baraju_SuperHit) June 4, 2018 -
‘అభిమన్యుడు’ మూవీ రివ్యూ
టైటిల్ : అభిమన్యుడు జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : విశాల్, అర్జున్, సమంత, ఢిల్లీ గణేష్ తదితరులు సంగీతం : యువన్ శంకర్ రాజా నిర్మాత : విశాల్ దర్శకత్వం : పీఎస్ మిత్రన్ కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విశాల్, టాలీవుడ్లో మార్కెట్ సాధించేందుకు చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. గతంలో అతను నటించిన కొన్ని చిత్రాలు ఇక్కడా విజయాలు సాధించి విశాల్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. అదే ఊపులో మరో డిఫరెంట్ ఎంటర్టైనర్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్. కోలీవుడ్ లో ఘనవిజయం సాధించిన ఇరుంబు తిరై సినిమాను తెలుగులో అభిమన్యుడు పేరుతో అనువాదం చేసి రిలీజ్ చేశారు. మరి అభిమన్యుడుగా విశాల్ ఆకట్టుకున్నాడా..? కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిందా..? చూద్దాం కథ : కరుణ(విశాల్) ఆర్మీ మేజర్. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఆవేశపరుడైన ఆఫీసర్. కుటుంబ సమస్యల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కరుణ ఫేక్ డాక్యుమెంట్స్‌తో లోన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ తీసుకున్న లోన్ డబ్బులు నిమిషాల్లోనే బ్యాంక్ ఎకౌంట్ నుంచి మాయం అవుతాయి. దీంతో హీరో ఏం చేయాలలో తెలియని పరిస్థితుల్లో నిస్సహాయుడిగా మిగిలిపోతాడు. హీరో అకౌంట్ నుంచి డబ్బు ఎలా మాయం అయ్యింది..? ఈ నేరాల వెనకు ఉన్న వైట్ కాలర్ పెద్ద మనిషి ఎవరు..? ఈ సైబర్ క్రైమ్‌ను హీరో ఎలా చేధించాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : విశాల్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత మెచ్యూర్డ్‌గా కనిపించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో విశాల్ నటన ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. మిలటరీ ఆఫీసర్‌గా విశాల్ లుక్ సూపర్బ్ అనిపించేలా ఉంది. సినిమాలో మరో కీలక పాత్ర ప్రతినాయకుడు అర్జున్. వైట్ డెవిల్ పాత్రకు అర్జున్ వంద శాతం న్యాయం చేశాడు. అర్జున్ను తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేని స్థాయిలో ఉంది ఆయన నటన. ముఖ్యంగా విశాల్, అర్జున్‌ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరి నటన సూపర్బ్. హీరోయిన్ సమంత రెగ్యులర్ కమర్షియల్ సినిమా హీరోయిన్ పాత్రే. పాటలు, కామెడీ సీన్స్ తప్ప ఆ పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవటానికేం లేదు. విశ్లేషణ : దర్శకుడు మిత్రన్ నేటి డిజిటల్ లైఫ్‌కు తగ్గ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశాల్ బాడీ లాంగ్వేజ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అభిమన్యుడు సినిమాను రూపొందించాడు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ కు సంబంధించి సన్నివేశాలను తెరకెక్కించేందుకు మిత్రన్ చేసిన పరిశోధన తెర మీద కనిపిస్తుంది. వ్యక్తిగత సమాచారం ఎలా చోరికి గురవుతుందన్న అంశాలను చాలా బాగా చూపించాడు. అయితే హీరో క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు తొలి భాగంలో చాలా సేపు రొటీన్ సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. అసలు కథ మొదలైన తరువాత సినిమా వేగం అందుకుంటుంది. అయితే పూర్తిగా టెక్నాలజీకి సంబంధించిన కథ కావటంతో సామాన్య ప్రేక్షకులు ఏ మేరకు అర్థం చేసుకోగలరో చూడాలి. యువన్ శంకర్ రాజా థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ఇంటెన్స్ మ్యూజిక్ తో మెప్పించాడు. సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫి. జార్జ్ సీ విలియమ్స్ తన కెమెరా వర్క్‌తో సినిమా మూడ్‌ను క్యారీ చేశారు. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తొలి భాగంలో అనవసర సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : అర్జున్ నటన నేపథ్య సంగీతం సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : తొలి భాగంలో కొన్ని బోరింగ్ సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
పటాపంచలు చేసేసిన సమంత
సాక్షి, చెన్నై: స్టార్ హీరోయిన్ సమంత అక్కినేనిపై కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రశంసలు గుప్పించారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఇరుంబు తిరై చిత్రం విడుదలై, హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ... సమంతపై పొగడ్తల వర్షం గుప్పించారు. ‘సమంత నిజంగా ఓ అద్భుతం. సాధారణంగా వివాహం అయ్యాక హీరోయిన్లకు గుర్తింపు ఉన్న పాత్రలు దక్కవనే అంతా అనుకుంటుంటారు. కానీ, సామ్ దానిని పటాపంచలు చేసింది. వరుసగా ఫెర్ఫార్మెన్స్ బేస్డ్ చిత్రాలు చేస్తూ సక్సెస్‌లతో దూసుకుతున్నారు. ఆమెను చూస్తే గర్వంగా ఉంది. ఈ చిత్రంలో ఆమె నటన అమోఘం. ఆమెతో పని చేయటం ఎంతో ఆనందానిచ్చింద’ని విశాల్ చెప్పారు. గతేడాది మెర్సల్తోపాటు, ఈ ఏడాది రంగస్థలంలో రామలక్ష్మి, మహానటిలో మధుర వాణి, ఇప్పుడు ఇరుంబు తిరైలో సైకాలజిస్ట్ రతిదేవి పాత్రలో మంచి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చి చిత్ర విజయాల్లో ఆమె ముఖ్య భూమిక పోషించారు. అర్జున్ ముఖ్య పాత్రలో మిత్రన్(డెబ్యూ) డైరెక్షన్లో తెరకెక్కిన ఇరుంబు తిరై త్వరలో అభిమన్యుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో కన్నడ హిట్ మూవీ యూటర్న్ రీమేక్(తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతోంది)తోపాటు, తమిళ్లో విజయ్ సేతుపతి, శివకార్తీకేయన్ చిత్రాలు ఉన్నాయి. ఇవిగాక నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కబోయే చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కనిపించబోతుందన్న టాక్ ఉంది. -
ఈవీఎంలపై నమ్మకం పోయింది
సాక్షి, చెన్నై: స్టార్ హీరో విశాల్ మరోసారి పొలిటికల్ కామెంట్లు చేశారు. విశాల్ తాజా చిత్రం ఇరుంబు తిరై(తెలుగులో అభిమన్యుడు) సక్సెస్ మీట్ గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఈవీఎంలు కీలకంగా మారాయి. నాకు మాత్రం ఈవీఎంలపై నమ్మకం పోయింది. బ్యాలెట్ పేపర్ పైనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. సంస్కరణల పేరిట డిజిటల్ ఇండియా, ఆధార్ అంటూ ప్రభుత్వం హడావుడి చేసింది. కానీ, వాటిపై ప్రజల్లో అభద్రతా భావం నెలకొంది. చివరకు సుప్రీం కోర్టు కూడా వాటి విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు’ అని విశాల్ అన్నారు. వివాహంపై... సామాజిక అంశాలనే ఇరుంబు తిరైలో చూపించామన్న ఆయన, చిత్రం సక్సెస్ పట్ల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక వివాహంపై విశాల్ మరోసారి ప్రకటన చేశారు. ‘జనవరిలో ఓ తమిళ అమ్మాయిని వివాహం చేసుకుంటా. నడిగర్ సంఘం కళ్యాణ మండపంలో మొదటి వివాహం నాదే’ అని చెప్పారు. కాగా, కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో విశాల్ రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. -
ఇక నిరవధిక సమ్మె : హీరో విశాల్
సాక్షి, చెన్నై: క్యూబ్, వీపీఎఫ్ చార్జీలు చెల్లింపు విషయంలో సమ్మె చేపట్టిన తమిళ చలన చిత్ర నిర్మాత మండలి.. శుక్రవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సమ్మెను నిరవధికంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు హీరో-నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ వెల్లడించారు. ‘ఇది డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల డిమాండ్లకు సంబంధించిన అంశం కాదు. థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకులపై అదనపు భారం పడకూడదనే మా ప్రయత్నం. టికెట్ ఛార్జీల మొదలు ఆన్లైన్ బుకింగ్, పార్కింగ్ ఛార్జీలు ఇలా ఏది కూడా ప్రేక్షకుడిపై మోపకుండా ఈ సమస్యను పరిష్కరించేందుకు మార్గాలున్నాయి. నిర్మాతల మండలి డిమాండ్లకు ప్రొవైడర్లు తలొగ్గేదాకా ఈ సమ్మె కొనసాగుతుంది. అందుకోసం ఎన్నాళ్లైనా మా పోరాటం ఆగదు’ అని విశాల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాత మండలి తరపున విశాల్, నడిగర్ సంఘం తరపున హీరో కార్తీ, డైరెక్టర్ యూనియన్స్ తరపున విక్రమన్, సినిమాటోగ్రఫర్ అసోషియేషన్ తరపున పీసీ శ్రీరాం, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి పాల్గొన్నారు. కాగా, ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి పళని స్వామి, మంత్రి కాదంబూర్ రాజుతో కోలీవుడ్ ప్రతినిధులు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పెద్ద చిన్నా అన్న తేడా లేకుండా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. -
ఆ వార్తలను నమ్మకండి : స్టార్ హీరో
సాక్షి, చెన్నై : తన ఆరోగ్య విషయంలో వస్తున్న వార్తలపై స్టార్ హీరో విశాల్ స్పందించాడు. తాను ఆస్పత్రిలో చేరినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ట్విట్టర్లో తెలియజేశాడు. ‘నేను ఫిట్‌గానే ఉన్నానని అందరికీ తెలియజేస్తున్నా. మైగ్రేన్ సమస్య కోసం చికిత్స తీసుకోవటానికి వచ్చా. అది ముగిసిపోయింది కూడా . కంగారుపడాల్సిన అవసరం లేదు. మార్చి మొదటి వారంలో ఇండియాకు వచ్చేస్తా. వదంతులు నమ్మకండి’ అని ఈ ఉదయం విశాల్ ఓ ట్వీట్ చేశాడు. కాగా, అవన్ ఇవన్(తెలుగులో వాడు-వీడు) చిత్రీకరణ సమయంలో విశాల్‌కు తలనొప్పి ప్రారంభమైంది. దీనికి తోడు తుప్పరివాలన్(డిటెక్టివ్) సమయంలో గాయపడటంతో కీళ్లనొప్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలో విశాల్ చికిత్సల అమెరికా వెళ్లి ఆస్పత్రిలో చేరాడంటూ కథనాలు వెలువడ్డాయి. ఇక సినిమాల పరంగా చూసుకుంటే విశాల్ నటించిన ఇరుంబు తిరై(తెలుగులో అభిమన్యుడు) విడుదలకు సిద్ధంగా ఉండగా.. సండైకోళి–2(పందెం కోడి-2) షూటింగ్ జరుపుకుంటోంది. Rumours making rounds that I am admitted in hospital.Wanted to let all my friends,fans and well wishers know that I am fit as a fiddle.The retreat I came for to take care of my migraine will get over in few days & I will be back in the grind by the Ist week of March. C U Soon, GB — Vishal (@VishalKOfficial) 27 February 2018 -
పెళ్లి కోసం మండపాన్ని బుక్ చేసిన విశాల్
సాక్షి, చెన్నై : హీరో, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. అయితే పెళ్లి వచ్చే ఏడాది జనవరిలో జరగనుందట. అయితే పెళ్లి కూతురు ఎవరనేది మాత్రం విశాల్ వెల్లడించలేదు. నిన్న (శుక్రవారం) అతడు చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని, డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని, జనవరిలో ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపాడు. సంఘం సొంత భవనంలో జరగనున్నమొదటి వివాహం తనదే అవుతుందని, అందుకు మండపానికి అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకున్నట్లు విశాల్ పేర్కొన్నాడు. సినిమాల్లోనే అనుకున్నా.. ఇక చెన్నైలో రౌడీముఠా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంపై విశాల్ స్పందిస్తూ...‘రౌడీ ముఠా పుట్టిన రోజు వేడుకను జరుపుకోవడం, అందులో ఆటా, పాటా లాంటివి సినిమాల్లోనే చూపిస్తారనుకుంటామని, నిజ జీవితంలో జరగడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, వారిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన పోలీసులను అభినందించాడు. మార్చి నుంచి సమ్మె చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న క్యూబ్, జీఎస్టీ లాంటి సమస్యలపై పోరాడే విధంగా దక్షిణ భారత సినీనటుల సంఘం మార్చి ఒకటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి చిత్రాల విడుదల ఉండదని వెల్లడించారు. ఈ విషయమై స్పందించిన విశాల్ మార్చి 1 నుంచి సమ్మె తథ్యం అని స్పష్టం చేశాడు. అయితే క్యూబ్ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, చర్చలు సఫలం అవుతాయని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశాడు. అమెరికలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళభాషకు ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిధులను అందించే విషయమై నటీనటుల సంఘం సమాలోచనలు చేస్తోందని తెలిపాడు. -
రానున్న ఎన్నికల్లో పెనుమార్పు తథ్యం: హీరో
సాక్షి, చెన్నై: తాను కూడా రాజకీయాల్లోకి వస్తున్నానని హీరో, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి ఆధ్యక్షుడు విశాల్ వెల్లడించారు. ఆయన ఇంతకు ముందు ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి నామినేషన్ దాఖలు చేసి, ఆ తరువాత నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో భంగపడ్డ విషయం తెలిసిందే. విశాల్ గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తానూ రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఇటీవల ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తన నామినేషన్ విషయంలో జరిగిన అన్యాయం, అవకతవకలే తానీ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా ఆయన పేర్కొన్నారు. తానా ఎన్నికల్లో ఒక రాజకీయవాదిగా పోటీ చేయలేదని, ఆ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల బరిలోకి దిగానని తెలిపారు. తన రాజకీయ నిర్ణయానికి కారణం అయిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో పెను మార్పు తథ్యం అని విశాల్ పేర్కొన్నారు. తాను ఒక రాజకీయవాదిగా ఈ విషయాన్ని చెప్పడం లేదని, ప్రజల ప్రతినిధిగా చెబుతున్నానని ఆయన అన్నారు. -
విశాల్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, చెన్నై: హీరో రాధారవి పిటిషన్ వ్యవహారంలో ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా నటుడు విశాల్‌కు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. గత ఏడాది దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో పోటీ చేసి విశాల్ వర్గం గెలిచిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవిని నాజర్, కార్యదర్శి పదవిని విశాల్, కోశాధికారి పదవిని కార్తీ చేపట్టారు. వీరికి ముందు నిర్వాహక బాధ్యతలను నిర్వహించిన అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి అవకతవకలకు పాల్పడిన ఆరోపణపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు విశాల్ వర్గం ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారంపై మాజీ కార్యదర్శి రాధారవి చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు తీర్పు వెలువడే వరకూ రాధారవిపై చర్యలు ఉండవని ప్రస్తుత నిర్వాహక వర్గం పేర్కొంది. అలాంటిది గత సెప్టెంబర్ 22వ తేదీన హీరో రాధారవిని సంఘ సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు తీర్మానం చేశారు. దీంతో ఇది కోర్టు ధిక్కార చర్య అవుతుందని రాధారవి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు బుధవారం న్యాయమూర్తి ఎంఎం.సుందరేశ్ సమక్షంలో విచారణకు వచ్చింది. దక్షిణ భారత నటీనటుల సంఘం తరఫున హాజరైన న్యాయవాది తగిన బదులివ్వడానికి సమయం కోరగా ఈ నెల 19వ తేదీన గానీ, అంతకు ముందుగానీ నటుడు విశాల్ కోర్టుకు హాజరై ఈ కేసు వ్యవహారంలో వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
విశాల్ నాకు షాక్ ఇచ్చారు..
సాక్షి, చెన్నై: నటుడు విశాల్ నాకు షాక్ ఇచ్చాడని నటుడు పొన్వన్నన్ అన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, తమిళనిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఇటీవల ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం, అది అనేక నాటకీయ పరిణామాల తరువాత తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. విశాల్ అనూహ్య నామినేషన్ చర్య పరిశ్రమలో ఒక వర్గం దిగ్భ్రాంతికి, మరో వర్గం తీవ్ర వ్యతిరేకతకు గురి చేసింది. ఈ వ్యవహరంలో ఇండస్ట్రీలో పెద్ద రచ్చే జరిగింది. అందులో దక్షిణ భారత నటీనటుల సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి నటుడు పొన్వన్నన్ రాజీనామా నిర్ణయం ఒకటి. ఈ విషయంపై ఆ సంఘంలో పెద్ద చర్చే జరిగింది. చివరికి పొన్వన్నన్ రాజీనామాను అంగీకరించేది లేదని సంఘం అధ్యక్షుడు నాజర్ వెల్లడించారు. దీంతో బుధవారం పొన్వన్నన్ మీడియా ముందుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతనటీనటుల సంఘ నిర్వాహం రాజకీయాలకతీతంగా పని చేయాలన్న సిద్ధాంతంతో ఉందన్నారు. అలాంటిది సంఘం కార్యదర్శి విశాల్ అనూహ్యాంగా ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసి తనకు పెద్ద షాక్ ఇచ్చారన్నారు. సంఘం అధ్యక్షుడు నాజర్‌కు ఫోన్ చేసి సంప్రదించగా ఆయన తనకేమీ తెలియదని చెప్పారన్నారు. సంఘం కోశాధికారి కార్తీని సంప్రదించగా తనకూ ఏమీ తెలియదని,అది విశాల్ వ్యక్తిగత నిర్ణయం అని చెప్పారన్నారు. ఈ వ్యవహారంపై మీడియాతో పాటు పలువురు తనను ప్రశ్నించడంతో బదులు చెప్పలేక తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. తన రాజీనామాను సంఘ నిర్వాకం ఆమోదించక పోవడం, విశాల్ ఈ విషయంలో విచారం వ్యక్తం చేసి, ఇకపై ఇలాంటి సంఘటనలు జరగవని మాట ఇవ్వడంతో తన రాజీనామాను వెనక్కు తీసుకున్నట్లు వెల్లడించారు. అదే విధంగా తన రాజీనామాతో సంఘం బలహీన పడుతుందని, సంఘ భవన నిర్మాణం నిధిని సమకూర్చడం కోసం వచ్చే నెల 6వ తేదీన మలేషియాలో నిర్వహించ తలపెట్టిన స్టార్ క్రికెట్ కార్యక్రమం పనులు చేయాల్సిఉండడం లాంటివి దృష్టిలో పెట్టుకుని రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నానన్నారు. రజనీ,కమల్ పాల్గొననున్నారు.. జనవరి 6వ తేదీన మలేషియాలో జరగనున్న స్టార్ క్రికెట్ పోటీల్లో కమలహాసన్, రజనీకాంత్‌తో సహా 200 మంది కళాకారులు పాల్గొననున్నారని వెల్లడించారు. నటుడు అజిత్ కూడా పాల్గొనాలని కోరుతున్నామని చెప్పారు. స్టార్ క్రికెట్‌తో పాటు పలు సంప్రదాయ సినీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీన్ని మలేషియా ప్రభుత్వంతో కలిసి నటీనటుల సంఘం నిర్వహించనుందని పొన్వన్నన్ వివరించారు. -
రిటర్నింగ్ అధికారిపై వేటు
సాక్షి, చెన్నై: తమిళనాడు ఆర్కే నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు పడింది. ప్రముఖ నటుడు విశాల్ కృష్ణ నామినేషన్ వ్యవహారంలో వివాదాస్పదంగా వ్యవహరించిన ఆ అధికారిపై ఎన్నికల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. విశాల్ నామినేషన్ ఉదంతంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. నామినేషన్ పత్రాలను తిరస్కరించిన అధికారి వేలుస్వామిని ఎన్నికల సంఘం వెనక్కి పిలిచింది. ఈయన స్థానంలో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ పీ నాయర్‌ని నూతన రిటర్నింగ్ అధికారిగా నియమించింది. హీరో విశాల్ నామినేషన్ తిరస్కరణపై ప్రతిపక్ష డిఎంకె నేత స్టాలిన్ తీవ్రంగా ప్రతిస్పందించిన విషయం తెలిసిందే. విశాల్ నామినేషన్‌ను తిరస్కరించే విషయంలో భారత ఎన్నికల కమిషన్ పాలక పార్టీతో కుమ్ముక్కయిందని ఆయన ఆరోపించారు. రిటర్నింగ్ అధికారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారులు అధికార పక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కాగా ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశాల్ సమర్పించిన నామినేషన్ అసంపూర్తిగా ఉందని రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం విదితమే. అయితే కొంత సమయం అనంతరం నామినేషన్ అంగీకరిస్తున్నట్టు, మళ్లీ తిరస్కరించినట్టు ప్రకటించడం తీవ్ర గందరగోళానికి తెరతీసింది. విశాల్ అభిమానుల మితిమీరిన ఒత్తిడి మూలంగానే నామినేషన్‌ను ఆమోదించినట్లు అధికారి చెప్పడం మరింత వివాదానికి తెర తీసింది. -
హీరో విశాల్‌కు ఊహించని సపోర్టు..!
సాక్షి, చెన్నై: ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్ది తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ నెల 21న జరగనున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికలో భాగంగా రాజకీయ వేడి రాసుకుంది. ఈ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసేందుకు హీరో విశాల్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు మొదట తిరస్కరించి.. తర్వాత ఆమోదం తెలిపి మరలా తిరస్కరణకు గురి చేశారు. దీనిపై డీఎంకే నేత స్టాలిన్ మాట్లాడుతూ.. విశాల్ నామినేషన్ తిరస్కరణ కుట్రే అని అన్నారు. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా పాలక పక్షంతో కుమ్మక్కైందని ఆయన పేర్కొన్నారు. విశాల్ నామినేషన్‌పై అన్నాడీఎంకే దురాగతాలకు పాల్పడిందని డీఎంకే నేత పేర్కొన్నారు. ఆర్కే నగర్ రిటర్నింగ్ అధికారిని తొలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ విజయం సాధిస్తుందని డీఎంకే నేత స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ మంత్రులే గత ఏప్రిల్‌లో రూ. 89 కోట్లు పంచి పెట్టారన్నారు. ప్రభుత్వం ఆర్కేనగర్ ఉప ఎన్నికను మరోసారి రద్దు చేయడానికి కుట్ర పన్నుతోందని స్టాలిన్ అన్నారు. దాదాపు 70 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీకి దిగడంతో ఉపసమరం ఆసక్తికరంగా మారింది. -
విశాల్ నామినేషన్‌పై హైడ్రామా
సాక్షి, చెన్నై : ఈనెల 21న నిర్వహించే ఆర్కే నగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన సందర్భంగా మంగళవారం భారీ హైడ్రామా నడిచింది. సాంకేతిక కారణాలు చూపుతూ తొలుత ఎన్నికల అధికారులు సినీ నటుడు విశాల్ నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే ఆయన ఎన్నికల ప్రధాన అధికారిని కలుసుకుని తనను బలపరిచిన వారికి బెదిరింపులు వచ్చాయని చెప్పడంతో రాత్రి 8.30 గంటలకు ఆయన నామినేషన్ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా విశాల్ ఇచ్చిన వివరణ అవాస్తమని తేలడంతో తిరిగి రాత్రి 11 గంటలకు ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరోవైపు, జయలలిత మేనకోడలు దాఖలుచేసిన నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. ఒక్క రోజులో ఎన్ని మలుపులో... చెన్నై తండయార్ పేటలోని మండల కార్యాలయంలో ఎన్నికల అధికారి వేలుస్వామి పర్యవేక్షణలో ఉదయం నుంచి నామినేషన్ల పరిశీలన జరిగింది. విశాల్ పేరును ప్రతిపాదించిన ఆర్కేనగర్కు చెందిన పదిమందిలో ఇద్దరి పేర్లు, వివరాలు తప్పుల తడకగా ఉండటంతో పాటు, అనేకచోట్ల అవును, లేదు అన్న సమాధానాలు కూడా ఇవ్వకుండా ఖాళీగా వదలి పెట్టడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు వేలుస్వామి ప్రకటించారు. దీంతో ఆందోళనకు దిగిన విశాల్ పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారు. అనంతరం ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానికి చేసిన ఫిర్యాదులో తన పేరును ప్రతిపాదించిన వారికి బెదిరింపులు వచ్చాయని, వాటిని నిరూపించే వీడియో తన వద్ద ఉందని విశాల్ పోరాటానికి దిగారు. దీంతో రాత్రి 8.30 గంటలకు విశాల్ నామినేషన్ ఆమోదించినట్లు అధికారులు చెప్పారు. చివరకు రాత్రి 11 గంటలకు మళ్లీ ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు 26ఐ పత్రాన్ని పూర్తిగా నింపకుండానే సమర్పించడంతో దీప నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోరులో మొత్తం 131 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో 54 తిరస్కరణకు గురయ్యాయి. -
ఆర్కే నగర్లో విశాల్ నామినేషన్
సాక్షి, చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం తమిళ హీరో విశాల్, దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప, బీజేపీ అభ్యర్థి నాగరాజన్ నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు దాదాపు 40 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ దాఖలుచేయడానికి ముందు హీరో విశాల్ సోమవారం దివంగత ముఖ్యమంత్రులు కామరాజర్, ఎంజీఆర్ స్మారక మందిరాల్లో నివాళులర్పించారు. మెరీనా బీచ్‌లోని జయ సమాధి వద్ద అంజలి ఘటించారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, ప్రజల ప్రతినిధిగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ నియోజవకర్గంలో దాదాపు లక్ష మంది తెలుగు ఓటర్లు ఉండటంతో, విశాల్ వారి ఓట్లే లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విశాల్‌కు మద్దతుగా నటుడు ఆర్య, ప్రకాష్‌రాజ్ కదిలారు. తనకు మద్దతుగా సినీ పరిశ్రమ కదిలిరావాలని పిలుపునిచ్చారు. దాదాపు 70 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీకి దిగడంతో ఉపసమరం ఆసక్తికరంగా మారింది. -
ఆర్కే నగర్ బరిలో తమిళ హీరో విశాల్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, సినీ హీరో విశాల్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా 4వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే రెండు వర్గాలు, డీఎంకే అభ్యర్థులను ప్రకటించాయి. -
షాక్.. ఆర్కే నగర్ ఉపఎన్నిక బరిలో విశాల్!
సాక్షి, చెన్నై : తమిళ రాజకీయాల్లో మరో సంచలనం. యువ హీరో విశాల్ రెడ్డి రాజకీయాల్లోకి ఆరంగ్రేటం చేయటమే కాదు.. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నట్లు తమిళ మీడియా నుంచి వార్తలు అందుతున్నాయి. అంతేకాదు కొత్త పార్టీ నెలకొల్పి 2021 ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నాడంట. సోమవారం విశాల్ ఆర్కే నగర్ ఉపఎన్నికలో తన నామినేషన్ వేయబోతున్నట్లు దాని సారాంశం. స్వతంత్ర్య అభ్యర్థిగా విశాల్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. కమల్, రజనీ రాజకీయ ఆరంగ్రేటంపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో విశాల్ నిర్ణయం పెను చర్చకు దారితీసింది. కాగా, ఇప్పటిదాకా 27 నామినేషన్లు దాఖలు కాగా, విశాల్ ఎంట్రీతో ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారనుంది. -
వాట్సాప్‌లో హీరోకు బెదిరింపులు..!
చెన్నై: ఫైనాన్షియర్ అన్బుచెళియన్ కందువడ్డీ వ్యవహారంలో హీరో విశాల్‌కు వాట్సాప్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై వడపళని, ఆర్కాడ్ రోడ్డుకు చెందిన మణిమారన్ అనే సినీ నిర్మాత బుధవారం ఉదయం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇటీవల సహ నిర్మాత అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని.. ఫైనాన్షియర్ అన్బుచెళియన్ అనుచరుల బెదిరింపులతోనే తాను చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనతో స్పదించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్.. కందువడ్డీ బాధిత నిర్మాతలు ఎవరైనా ఉంటే తన సంఘానికి ఫిర్యాదు చేయాలని కోరారు. దీంతో అన్బుచెళియన్ తరపు వారు వాట్సాప్ ద్వారా జాతి, మత విద్వేశాలు ప్రేరేపించేలా బెదిరింపులు చేస్తున్నారని ఆయన తెలిపారు. అన్బెచెళియన్ కుల, మత భేదాలతో కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి విద్వేష చర్యలను తమిళనాడులో వ్యాపించనీయరాదని అన్నారు. కుల మతాల కతీతంగా ప్రజలు మత సామరస్యంతో జీవిస్తున్నారు. కాబట్టి సినిమా రంగాన్ని ఇలాంటి ఫైనాన్షియర్ల నుంచి రక్షించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
విశాల్ ఐటీ దాడుల వీడియో.. అసలు నిజం
సాక్షి, చెన్నై : కోలీవుడ్ హీరో విశాల్ ఇళ్లు, కార్యాలయాలపై గత నెలలో ఐటీ శాఖ దాడులు నిర్వహించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తంలో విశాల్ పన్నులు ఎగ్గొట్టాడంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇంటెలిజెన్స్(డీజీజీఎస్టీఐ) తనిఖీలు చేసినట్లు వాటి సారాంశం. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం విడుదలైన ఓ వీడియో వైరల్ అవుతోంది. విశాల్ డబ్బును ఐటీ అధికారులు లెక్కిస్తున్నట్లు.. ఆయన్ని ప్రశ్నిస్తున్నట్లు అందులో ఉంది. అది తన కష్టార్జితమని విశాల్ చెబుతుంటే.. అధికారులు మాత్రం లెక్కల్లో లేని సోమ్మని చెప్పటం... కెమెరా ఆఫ్ చెయ్యండంటూ అధికారులను వేడుకోవటం... అన్నింటికి మించి రెండు వేల నోట్ల కట్టల ముందు విశాల్ ముఖంలో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే అసలు వీడియో అంటూ చక్కర్లు కొట్టింది. అయితే వీడియో పూర్తిగా చూసినోళ్లకే అందులో అసలు విషయం అర్థమౌతోంది. అంత సీరియస్ డిస్కషన్ నడుస్తుండగా.. మధ్యలో సీనియర్ నటుడు అర్జున్ అక్కడికి వచ్చారు. ఓ పక్క సీన్ కోసం డైరెక్టర్ వెయిట్ చేస్తుంటే ఏంటయ్యా? ఇదంతా అని విశాల్‌ను అర్జున్ ప్రశ్నించగా.. అందరి ఘోల్లున నవ్వుకున్నారు. రెండు వేల నోట్ల మధ్య అన్నీ తెల్ల కాగితాలే చూపిస్తూ అర్జున్ సరదాగా అక్కడున్న స్టాఫ్‌పై చిర్రుబుర్రు లాటం బట్టి ఇదంతా ఓ ప్రాంక్ వీడియో అని చెప్పకనే చెబుతోంది. మెర్సల్ సినిమాకు మద్దతు ప్రకటించిన మరుసటి రోజే దాడుల వార్తలు రావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ కక్ష్య సాధింపు చర్యకు దిగుతోందని అని పలువురు విశాల్‌కు మద్ధతుగా నిలిచారు. ఇప్పుడు ఇలా ఓ చిత్ర షూటింగ్ సన్నివేశాన్ని ఆ సందర్భానికి అనుగుణంగా మలుచుకున్న విశాల్.. సెన్సాఫ్ హ్యుమర్‌కి అభిమానులు హాట్సాఫ్ చెబుతున్నారు. Unseen Footage of IT Raid @ Vishal.. #ITRaidatVishal pic.twitter.com/ozSAOfpEaX — Ramesh Bala (@rameshlaus) 15 November 2017 -
విశాల్ కార్యాలయంలో జీఎస్టీ తనిఖీలు
-
విశాల్‌కు ఊహించని షాక్
సాక్షి, చెన్నై: మెర్శల్ సినిమాకు మద్దతుగా నిలిచిన హీరో విశాల్‌పై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు హెచ్ రాజాపై విమర్శలు చేసి కొన్ని గంటలు గడవకముందే ఆయనకు షాక్ ఇచ్చింది. విశాల్ కార్యాలయంలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వడాపళనిలోని విశాల్ కార్యాలయానికి వచ్చిన అధికారులు ఆయన చిత్ర నిర్మాణ సంస్థకు సంబంధించిన చెల్లింపు వివరాలను పరిశీలించారు. వస్తు, సేవా పన్ను చెల్లింపుల్లో ఏదైనా ఎగవేత జరిగిందా అనే దాని గురించి శోధించేందుకు జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల విడుదలైన మెర్శల్ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు పెట్టడం వివాదస్పదమైంది. ఈ మాటలు తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మెర్శల్ చిత్ర యూనిట్‌కు ప్రతిపక్షాలు దన్నుగా నిలిచాయి. కమల్‌హాసన్, రజనీకాంత్ సహా సినిమా ప్రముఖులు మెర్శల్‌కు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాల్ కార్యాలయంపై జీఎస్టీ అధికారులు దాడి చేయడం సంచలనంగా మారింది. ‘మెర్శల్’కు అండగా నిలబడిన మిగతావారిపైనా దాడులు జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులు పెట్టిన మెర్శల్ సినిమా పైరసీ కాపీని చూశానని హెచ్ రాజా ప్రకటించడంతో క్షమాపణ చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు. బాధ్యతగల పదవిలో ఉండి పైరసీ సినిమా చూడటానికి సిగ్గులేదా అని ఘాటుగా విమర్శించారు. -
నేనూ రాజకీయాల్లోకి వస్తా: యంగ్ హీరో
చెన్నై: సినిమాలు రాజకీయాల చుట్టూ తిరడగం, రాజకీయాలు సినిమా వాళ్ల చుట్టూ తిరగడం పరిపాటే. అయితే ఈ పరిస్థితి తమిళ చిత్రపరిశ్రమలో కాస్త ఎక్కువ. ఇప్పటికే ప్రముఖ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయ రంగప్రవేశం గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో విశాల్ రాజకీయాల్లో నా ఎంట్రీ షూరూ అంటున్నారు. ఇప్పటికే గట్టి పోటీ మధ్య దక్షిణభారత నటినటుట సంఘం ఎన్నికల్లోనూ, తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ గెలిచి సంచలనం సృష్టించారు విశాల్. తన అభిమాన సంఘం అయిన దేవీ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విశాల్ హీరోగా నటించి నిర్మించిన తాజా చిత్రం తుప్పరివాలన్ గురువారం విడుదలయ్యింది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఈయన పత్రికలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాల్ సేవా కార్యక్రమాలను ప్రస్థావిస్తూ రాజకీయ రంగ ప్రవేశం ఆలోచనతోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ ఈ విషయంలో దాపరికాలు నాకు ఇష్టం లేదు. అధికారం ఉంటే ప్రజలకు మంచి చేయవచ్చు. మంచి చేయడమే రాజకీయం అయితే నేను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా’ నని ఆయన దృఢంగా అన్నారు. ఈ కాలంలో కూడా చదువుకునే పిల్లలు ప్రభుత్వ పాఠశాలకకు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళుతున్నారన్నారు. వాళ్లకు సరైన వసతులు కల్పిస్తే పోయేదేముందని ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా వ్యాఖ్యానించారు. ఒక పక్క ఆర్థిక లోటు అంటూనే ఎమ్మెల్యే జీతాలు మాత్రం పలు రెట్లు పెంచుకున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైతుల రుణాలను మాఫీ చేశారనీ, తమిళనాడులో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఆందోళన బాట పట్టినా రుణమాఫికి నిరాకరిస్తోందని చెప్పారు. రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా ఉచిత విద్య, వైద్యాన్ని అందించాలని విశాల్ పేర్కొన్నారు. -
మరో హీరోకు షూటింగ్లో గాయాలు
చెన్నై: సినీ హీరో విశాల్‌కు షూటింగ్లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన మిష్కిన్ దర్శకత్వంలో ‘తుప్పరివాలన్’ చిత్రంలో నటిస్తున్నారు. విశాల్ ఫిలిం ప్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ గత కొద్ది రోజులుగా చిదంబరం సమీపంలోని పిచ్చాపరంలో జరుగుతోంది. చిత్ర యూనిట్... హీరో... శత్రువులతో పోరాడే దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. కాగా సోమవారం విశాల్ పాల్గొన్న పోరాట దృశ్యలను చిత్రీకరిస్తుండగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు. దీంతో ఆయన గాయపడగా, వెంటనే సమీపంలోని వైద్యులకు పిలిపించి వైద్య చికిత్స చేయించారు. ఈ సంఘటన గురించి చిత్ర యూనిట్ మాట్లాడుతూ... విశాల్ ఫైట్ సన్నివేశంలో అనూహ్యంగా కిందపడిపోయారని, పెద్దగా దెబ్బలేమీ తగల్లేదనీ చెప్పాయి. వైద్యుల విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారనీ, అయితే విశాల్ కొద్దిసేపటి తర్వాత షూటింగ్లో పాల్గొన్నట్లు తెలిపాయి. -
డ్రగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడలేను..
- నిందారోపణలు తగవన్న హీరో విశాల్ చెన్నై: గడిచిన వారం రోజులుగా టాలీవుడ్‌ను వణికిస్తోన్న డ్రగ్స్ అంశంపై తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్ సంఘం కార్యదర్శి, హీరో విశాల్ స్పందించారు. ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నందున ఈ కేసుల గురించి ఇప్పుడే మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. అయితే నోటీసులు అందుకున్న వారి గురించి నిజానిజాలు తెలుసుకోకుండా నిందారోపణలు చేయడం తగదని, అవి వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయని విశాల్ అన్నారు. డ్రగ్స్ కేసులో విచారణ ముగిసిన వెంటనే ఈ అంశంపై మాట్లాడతానన్నారు. చిన్నపిల్లలు, విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లల దినచర్యను గమనిస్తుండాలని విశాల్ సూచించారు. -
విశాల్‌పై హత్యాబెదిరింపుల కేసు
తమిళసినిమా: నటుడు, తమిళనిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ తనపై హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని నిర్మాత, దర్శకుడు సురేశ్ కామాక్షి స్థానిక వడపళనిలోని పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ తాను ఇటీవల జరిగిన తమిళ నిర్మాతల మండిలి ఎన్నికల్లో విశాల్ వర్గానికి పోటీగా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేశానన్నారు. అదే విధంగా నడిగర్ సంఘం, తమిళ నిర్మాతల సంఘం సమస్యలపై తాను గొంతు విప్పుతున్నానన్నారు. అయితే నటుడు విశాల్‌కు తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విరోధం లేదన్నారు.ఇటీవల నడిగర్‌సంఘ నూతన భవన నిర్మాణంపై మద్రాస్ హైకోర్టు తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసిందన్నారు. అందుకు కారణం సంఘం స్థల ఆక్రమణేనని పేర్కొన్నారు. దీంతో తాను సంఘ చర్యలను విమర్శిస్తూ తన ఫేస్బుక్లో పేర్కొన్నానన్నారు. దీంతో విశాల్ తన అభిమానులకు తన సెల్ ఫోన్ నంబర్ ఇచ్చి హాత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆయన అభిమానులుగా చెప్పుకుంటున్న తమిళ నిర్మాతల సంఘ నిర్వాహకుడు రాబిన్, విశాల్ అభిమాన సంఘ అధ్యక్షుడుగా చెప్పుకుంటున్న కమల్‌కన్నన్, మరో అభిమాని తనపై రౌడీయిజానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. సురేశ్ కామాక్షి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీస్ అధికారులు దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆయనకు హామీ ఇచ్చారు. -
హీరో విశాల్‌కు ఊరట
చెన్నై: ప్రముఖ హీరో విశాల్‌కు ఊరట లభించింది. ఆయనపై తమిళ నిర్మాతల మండలి విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మద్రాస్ హైకోర్టు జోక్యంతో తమిళన నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుంది. తమిళ నిర్మాతల మండలి తీరును విమర్శిస్తూ విశాల్ పత్రికల్లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా నిర్మాతల మండలి కార్యవర్గం లేఖ రాసింది. దీంతో విశాల్ వివరణ ఇచ్చాడు. ఈ వివరణతో సంతృప్తి చెందని నిర్మాతల మండలి అతడిపై తాత్కాలికంగా వేటు వేస్తూ తీర్మానం చేసింది. దీంతో విశాల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాను 2013 నుంచి చిత్ర నిర్మాణంలో ఉన్నానని, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ, దురుద్దేశంతో నిర్మాతల మండలి నిర్వాహకులు చట్ట వ్యతిరేకంగా తాత్కాలిక నిషేధం విధించారని పిటిషన్లో పేర్కొన్నాడు. తనపై విధించిన నిషేధాన్ని తొలగించేవిధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరాడు. దీంతో జోక్యం చేసుకున్న హైకోర్టు ఉత్తర్వుల మేరకు విశాల్‌పై సస్పెన్షన్‌ను నిర్మాతల మండలి ఎత్తివేసింది. -
నిరసన కాదు.. విప్లవం: హీరో విశాల్
-
నిరసన కాదు.. విప్లవం: హీరో విశాల్
జల్లికట్టును అనుమతించాలంటూ చెన్నైతో పాటు తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్నది కేవలం నిరసన కాదని, అదో విప్లవమని కోలీవుడ్ హీరో విశాల్ అన్నాడు. చెన్నై మెరీనా బీచ్‌లో వినిపిస్తున్న గొంతులు కేంద్రాన్ని చేరుకోవాలని, అప్పుడైనా కేంద్రం ఆర్డినెన్సు జారీ చేయాలని అన్నాడు. జల్లికట్టుకు అనుమతి కోసం చెన్నైలో మొదలైన నిరసన ప్రదర్శనలు.. ఢిల్లీ వరకు వెళ్లాయి. ప్రస్తుతం చెన్నైలో సినిమా షూటింగులు కూడా ఆపేయడంతో పలువురు నటులు ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు పలువురు నాయకులు కూడా ఢిల్లీ వెళ్లి, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు ప్రయత్నం చేశారు. సీఎం వరకు మోదీ అపాయింట్మెంట్ దొరికినా, పీఎంకే ఎంపీ అన్బుమణి రాందాస్‌కు మాత్రం దొరకలేదు. దాంతో ఆయన ప్రధాని అధికారిక నివాసం ముందు బైఠాయించారు. మోదీ తనకు సమయం ఇవ్వలేదని, ఆయన తనను కలిసేవరకు ఇంటి బయట కూర్చోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని రాందాస్ అన్నారు. అయితే.. మోదీ ఇంటి ముందు బైఠాయించిన ఎంపీని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. -
విశాల్ ఎన్నికల్లో పోటీ చేస్తాడా?
చెన్నై: నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్‌కు తమిళ నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. తమిళ నిర్మాతల మండలి కార్యవర్గంపై నిరాధార ఆరోపణలు చేశారంటూ నటుడు విశాల్‌ను మండలి నుంచి తాత్కాలికంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో తనపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ నటుడు విశాల్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాధించిన నిర్మాతల మండలి తరఫు న్యాయవాది విశాల్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తే ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసే విషయం గురించి నిర్మాతల మండలి చర్చిస్తుందని పేర్కొన్నారు. నటుడు విశాల్ గత 4వ తేదీన నిర్మాతల మండలి గురించి తన వ్యాఖ్యలు వ్యక్తిగతం అని, అవి ఎవరినైనా బాధించినట్లయితే విచారం వ్యక్తం చేస్తున్నట్లు కోర్టుకు తెలియజేశారు. కాగా ఈ కేసు శుక్రవారం మరోసారి కోర్టులో విచారణకు వచ్చింది. నిర్మాతల మండలి తరఫు న్యాయవాది తన వాదనను వినిపిస్తూ విశాల్‌పై నిషేధం ఎత్తివేసేందుకు మండలి నిరాకరించిందన్నారు. ఆయనను మండలి తాత్కాలికంగా బహిష్కరించినా విశాల్ ఆరోపణలు చేస్తూనే ఉండడం వల్ల నిషే«ధాన్ని కొనసాగించాలని, ఆయన విచారాన్ని తిరస్కరిస్తున్నట్లు మండలి తీర్మానంలో పేర్కొందని కోర్టుకు వివరించారు. న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా పిబ్రవరి 5న జరగనున్న తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో తమ జట్టు పోటీ చేస్తుందని ఇప్పటికే వెల్లడించడమే గాకుండా అధ్యక్ష పదవికి నటి కుష్బూ పేరును కూడా ప్రకటించిన విశాల్‌కు ఇది షాక్ ఇచ్చే విషయమే. నిర్మాతల మండలి ఆయనపై బహిష్కరణను ఎత్తివేసినట్టయితే ఆయన రానున్న ఎన్నికల్లో తనకూ ఏదో ఒక ప్రధాన పదవికి పోటీ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడా అర్హత ఆయనకు లేదు. ఎందుకంటే ఈ నెల 8వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. మరి ఇలాంటి పరిణామాల్లో నటుడు విశాల్ తదుపరి చర్య ఏమిటన్నది వేచి చూడాల్సిందే. -
హీరో విశాల్‌కు హైకోర్టు నోటీసులు
చెన్నై: ప్రముఖ హీరో విశాల్ రిట్ పిటీషన్ దాఖలు చేయాల్సిందిగా మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకెళ్లితే తమిళ నిర్మాతల మండలి కార్యవ్యవహార ధోరణిని విమర్శిస్తూ విశాల్ పత్రికలకెక్కిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన నిర్మాతల మండలి కార్యవర్గం విశాల్ నుంచి వివరణ కోరుతూ లేఖ రాసింది. అయితే ఇచ్చిన వివరణ సంతృప్తి కలిగించకపోవడంతో అతడిపై తాత్కాలికంగా వేటు వేస్తూ తీర్మానం చేశారు. దీంతో విశాల్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. తాను 2013 నుంచి చిత్ర నిర్మాణంలో ఉన్నానని, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ, దురుద్దేశంతో నిర్మాతల మండలి నిర్వాహకులు చట్ట వ్యతిరేకంగా తాత్కాలిక నిషేధం విధించారని అతడు తన పిటిషన్లో పేర్కొన్నాడు. తనపై విధించిన నిషేధాన్ని తొలగించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరాడు. ఈ కేసు సోమవారం న్యాయమూర్తి కల్యాణ సుందరం సమక్షంలో విచారణకు వచ్చింది. నిర్మాతల మండలి తరఫున హాజరైన న్యాయమూర్తి వాదిస్తూ ఈ కేసులో విశాల్ తన విచారాన్ని వ్యక్తం చేస్తే అతడిపై నిషేధాన్ని రద్దు చేయడానికి సిద్ధమని తెలిపారు. దీంతో విశాల్ తరఫున బదులివ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. -
ప్రశ్నించడమే నేరమా? : విశాల్
చెన్నై: ప్రశ్నించడమే నేరమా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని నటుడు, నిర్మాత, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ అన్నారు. తమిళ నిర్మాతల సంఘం నిర్వాహకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై తాత్కాలిక సస్పెన్షన్ విధించినట్లు నిర్మాతల మండలి ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇది తనకు షాక్ అని భావించను గానీ, ఆశ్చర్యపరచిందన్నారు. తనకు నిర్మాతల సంఘం నుంచి అంతకు ముందు ఎప్పుడో ఒక లేఖ వచ్చిందనీ, అందులో సంఘం అధ్యక్షుడి పేరుగానీ, కార్యదర్శి పేరుగానీ లేదనీ, ఒక న్యాయవాది ద్వారా ఆ లేఖను పంపారనీ వివరించారు. అయినా ఒక నిర్మాతగా సహ నిర్మాతలకు మంచి జరగాలని కోరుకోవడం, వారి పక్కన నిలబడి ప్రశ్నంచడం నేరమా? అని ప్రశ్నించారు. తన సస్పెన్షన్‌ను చట్టబద్దంగా ఎదుర్కొంటానని, ఈ విషయంలో భయపడేది లేదనీ సోమవారం విలేకరుల సమావేశంలో విశాల్ తెలిపారు. నిజానికి తాను చేసిన నేరం ఏమిటో తనకు తెలియదన్నారు. అప్పుడెప్పుడో ఒక పత్రికకు ఇచ్చిన భేటీలో నిర్మాతల సంఘం నిర్వాహకులు నిర్మాతల శ్రేయస్సు గురించి పట్టించుకోవడం లేదనీ, బోండా, బజ్జీలు తింటూ కాలం గడిపేస్తున్నారని అన్నానని తెలిపారు. అలా అనడం తప్పని తాను భావించడం లేదని పేర్కొన్నారు. అదే తప్పు అయితే అంతకు ముందు అలాంటి వ్యాఖ్యల్నే నటుడు కరుణాస్ చేశారనీ, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అప్పట్లో నడిగర్ సంఘంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైతేనే తాను ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. పైరసీని అరికట్టే విషయంలో నిర్మాతల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. ఈ విషయం లో చాలా మంది తనకు ఫోన్ చేసి అడుగుతున్నారన్నారు. అలాంటిది నిర్మాతల సంఘం నుంచి వస్తే తాను వారికి సహకరించగలనీ అన్నారు. నిర్మాతల సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తాం ఏ విషయంలోనైనా పోటీ ఉండాలన్నారు. జనవరిలో జరగనున్న నిర్మాతల మండలి ఎన్నికల్లో తన తరఫు నుంచి పోటీ ఉంటుందనీ విశాల్ వెల్లడించారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత విరోధాలు లేవనీ, నిర్మాతల సం ఘం అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను అంటే తనకు గౌరవమనీ తెలిపారు. అలాగని తనతో చిత్రం చేయమని ఆయన్ని అడగలేదనీ అన్నారు. ఎవరైనా నిర్మాతలు ఈ విషయంలో మద్దతు తెలిపారా? అన్న ప్రశ్నకు వ్యక్తిగతంగా తనకు ఎవరూ మద్దతు తెలపాల్సిన అవసరం లేదనీ, తన పోరాటంలో న్యాయం ఉందనిపిస్తే వారే మద్దతిస్తారనీ బదులిచ్చారు. -
ఆధారాలుంటే బయట పెట్టండి: విశాల్
చెన్నై: తనపై ఆరోపణలు చేసేవాళ్లు ఆధారాలను బయట పెట్టాలని దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ సవాల్ చేశారు. సోమవారం నటుడు విశాల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన తన అభిమాన సంఘం ద్వారా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విశాల్ నిన్న స్థానిక ట్రిపుల్‌కేన్‌లోని అరిమా సంఘం, ఎంపీఎస్ పాలీ క్లినిక్ నిర్వాహకులతో కలిసి చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ఇది చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరం అని, కాబట్టి తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు ఉచిత వైద్యం పొందవచ్చనని తెలిపారు. కాగా నడిగర్‌సంఘంలో అవకతవకలు జరిగినట్లు సంఘ సభ్యులు కొందరు ఆరోపణలతో శనివారం స్థానిక టీ.నగర్,అబిబుల్లా రోడ్డులోని సంఘ ఆవరణలో ఆందోళనకు దిగారు. వారాహి అనే సంఘ సభ్యుడు సంఘ భవన నిర్మాణం కోసం నిధిని సమకూర్చే విధంగా నిర్వహించిన స్టార్స్ క్రికెట్‌కు సంబంధించి కోట్ల రూపాలు అవినీతి జరిగిందంటూ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై విశాల్ స్పందిస్తూ ఆరోపణలు చేసేవారు ఆధారాలను చూపాలన్నారు. గత సంఘం అవకతవకలకు సంబంధించిన అన్ని వివరాలను మరో 10 రోజులలో బయట పెట్టనున్నట్లు తెలిపారు. తమిళ నిర్మాతల మండలిపై విశాల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ మండలి నిర్వాహకులు వివరణ అడిగిన విషయం విదితమే. ఈ విషయం గురించి ప్రశ్నంచగా నిర్మాతల మండలి నుంచి వివరణ కోరుతూ తనకు ఎలాంటి లేఖ రాలేదన్నారు. అందువల్ల తాను క్షమాపణ కోరాల్సిన అవసరం లేదని విశాఖ స్పష్టం చేశారు. -
రాయుడికి హీరోయిన్ల అభినందనలు
స్వతహాగా తెలుగువాడైనా కోలీవుడ్‌లో దుమ్ము రేపుతున్న హీరో విశాల్. నడిగర సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా ఎన్నికైన విశాల్ అక్కడ, ఇక్కడ చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. విశాల్ హీరోగా చేస్తున్న తాజా సినిమా రాయుడు. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలవుతోంది. అతడి సరసన శ్రీదివ్య హీరోయిన్గా నటిస్తోంది. ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు విశాల్‌ను అభినందనలతో ముంచెత్తారు. తన స్నేహితుడు విశాల్, మొత్తం రాయుడు టీమ్‌కు ఆల్ ద బెస్ట్ అంటూ శ్రుతిహాసన్ ట్వీట్ చేసింది. దాంతోపాటు సినిమా టీజర్ లింకును కూడా ఆమె ట్వీట్ చేసింది. రాయుడు టీజర్ అద్భుతంగా ఉందని, అందరూ ఇక్కడ చూడాలని చెబుతూ తమన్నా కూడా ఈ టీజర్‌ను ట్వీట్ చేసింది. విశాల్‌కు సక్సెస్ రావాలని ఆశిస్తున్నట్లు చెప్పింది. ఇక ఇటీవలి కాలంలో వరుస హిట్లతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా విశాల్‌కు, రాయుడు సినిమాకు ఆల్ ద బెస్ట్ చెబుతూ ట్విట్టర్లో కామెంట్ పోస్ట్ చేసింది. ఇలా టాప్ హీరోయిన్లందరూ ఒకరి వెంట ఒకరు రాయుడికి అభినందనలు చెబుతున్నారు. Wishing my dear friend @VishalKOfficial and d entire team of Rayudu all the very best !! Here's the trailer tweeps ! https://t.co/W6Tl0IHMoU — shruti haasan (@shrutihaasan) 3 May 2016 Check out this amazing teaser of #rayudu https://t.co/9T5Z6Rp128 all the best @VishalKOfficial wishing you all the success!!! — Tamannaah Bhatia (@tamannaahspeaks) 3 May 2016 Wishing @VishalKOfficial all d best 4 his next #Rayudu . Good luck to d team..here goes d trailer https://t.co/0iaX9gZTd8 — Rakul Preet (@Rakulpreet) 3 May 2016 -
విశాల్‌తో రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్
విశాల్‌తో రొమాన్స్‌కు రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధం అవుతుందా? దీనికి కోలీవుడ్ నుంచి ఎస్ అనే సమాధానమే వస్తోంది. నటుడు అరుణ్ విజయ్‌కు జంటగా తడయారు తాక్క చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు దిగుమతి అయిన ఉత్తరాది బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తరువాత పుత్తగమ్, ఎన్నమో ఏదో వంటి చిత్రాల్లో నటించినా ఇక్కడ కేక పుట్టించలేకపోయినా ఈ చిన్నది ఆపై టాలీవుడ్కెళ్లి అక్కడిప్పుడు కేక పుట్టిస్తోంది. తెలుగు యువ హీరోలతో నటిస్తూ యమ బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కు కోలీవుడ్‌లో రాణించలేకపోయాననే బాధ చాలా కాలంగా వెంటాడుతూనే ఉంది. ఆ మధ్య రామ్ చరణ్‌తో నటించిన బ్రూస్లీ చిత్ర తమిళ అనువాద ఆడియో కార్యక్రమంలో పాల్గొన్న ఈ అమ్మడు మంచి అవకాశం వస్తే తమిళంలో నటించడానికి రెడీ అని ఒక స్టేట్మెంట్ పడేసింది. అది ఇప్పుడు వర్కౌట్ అవుతున్నట్లు సమాచారం. రకుల్ త్వరలో విశాల్‌లో డ్యూయెట్లు పాడటానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. దీనికి తుప్పరివాలన్ అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు. ఈ చిత్రం ద్వారా రకుల్ ప్రీత్ సింగ్ కోలీవుడ్‌కు రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. మిష్కిన్ చిత్రాల్లో కథానాయికలకు, కథానాయకులకు సమానంగా ప్రాధాన్యం ఉంటుందన్న విషయం తెలిసిందే. అందువల్ల ఈ చిత్రంతో కోలీవుడ్‌లో తన విజయ ఖాతాను తెరవాలని రకుల్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తుప్పరివాలన్ చిత్రంలో రకుల్‌ను ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నాయని, కాగా ఇంకా ఆమె ఒప్పందంపై సంతకం చేయలేదని విశాల్ వర్గం అంటోంది. -
కోర్టుకెక్కిన హీరో విశాల్
చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్ సంఘం) ఎన్నికలపై హీరో విశాల్ కోర్టుకెక్కారు. ఎన్నికల తేదీని మార్చాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత అధ్యక్షుడు శరత్ కుమార్ తో తాడోపేడో తేల్చుకునేందుకు అతడు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. శరత్ కుమార్, విశాల్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. శరత్ కుమార్ చర్యలను విశాల్ తరచుగా ప్రశ్నిస్తున్నారు. సంఘంపై తరచూ విమర్శలు చేస్తే విశాల్‌పై వేటు వేస్తామని శరత్‌కుమార్ హెచ్చరించారు. అవాస్తవ ప్రకటనలపై ప్రశ్నిస్తే తప్పా? సంఘం నుంచి బహిష్కరించినా భయపడను అంటున్నారు నటుడు విశాల్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం ఎన్నికల తేదీపై విశాల్ కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
విశాల్, శరత్‌ల మధ్య మాటల యుద్ధం
-
పూజ--ఫలించిందా
-
రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్న విశాల్
విశాల్ రీల్ లైఫ్‌లోని కాదు...రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నాడు. ఓ కుటుంబానికి రూ.25వేలు సాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. సోషల్ మీడియాలోని వాట్సాప్ ద్వారా ఆ వార్త తెలుసుకుని సాయం అందించాడు. సాయం చిన్నదే అయినా విశాల్ స్పందించిన తీరుతో పాటు, తన పేరు బయటకు రావద్దంటూ విజ్ఞప్తి చేశాడు. వివరాల్లోకి వెళితే.... అనారోగ్యంతో మృతి చెందిన వీడియో జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఇదే గ్రూప్‌లో ఉన్న నటుడు విశాల్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కలైంజర్ టీవీ వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న వేల్ మురుగన్ అనారోగ్యంతో మృతి చెందాడు. అతని భార్య గర్భిణి. వేల్ మురుగన్ సంపాదనతోనే కుటుంబం గడుస్తోంది. అయితే అతను మరణించినా ఆ సంస్థ పట్టించుకోలేదు. చివరకు జర్నలిస్టు మిత్రులు తమ వాట్సాప్ గ్రూప్‌లో వేల్ మురుగన్ పేదరికాన్ని మిత్రులకు తెలియజేశారు. అలాగే సంస్మరణ సభ, నిధుల సేకరణ నినాదంతో తేదీని వాట్సాప్‌లో ప్రకటించారు. స్వీట్ హార్ట్ పేరిట ఉన్న ఆ వాట్సాప్ గ్రూప్‌లోని మిత్రులందరూ తలా ఓ చేయి వేశారు. రూ.పది వేల వరకు సేకరించారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో తనకు వచ్చిన సమాచారంతో నటుడు విశాల్ స్పందించాడు. తన మేనేజరు ద్వారా రూ.25 వేలు ఆ కుటుంబానికి సాయంగా పంపించాడు. అయితే తన పేరును ప్రచారం చేయవద్దంటూ విశాల్ విజ్ఞప్తి చేసినా కొందరు మిత్రులు వాట్సాప్‌లో అతనికి కతృజ్ఞతలు, అభినందనలు తెలియజేయడం విశేషం. -
హీరో విశాల్ ఫిర్యాదుతో ఇద్దరి అరెస్ట్
చెన్నై : సినీ నటుడు విశాల్ ఫిర్యాదుతో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం పూజై. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర షూటింగ్ కారైకుడిలో జరుగుతోంది. షూటింగ్ పూర్తి కాగానే విశాల్ తాను బస చేసిన హోటల్‌కు వెళ్లి కాసేపు టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాలు వీక్షించారు. అనంతరం లోకల్ ఛానల్స్ తిలకించిన విశాల్ షాక్ అయ్యారు. ఇటీవలే విడుదలైన రెండు తమిళ చిత్రాలను ఎలాంటి హక్కులు లేకుండా ప్రదర్శిస్తుండడమే. దీంతో విశాల్ కారైకుడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పైరసీకి పాల్పడిన పళ్లత్తూర్ ముహ్మద్ మంజూర్, సంపత్ లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పైరసీ సీడీల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్ ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి రేయింబవళ్లు శ్రమించి రూపొందిస్తున్న చిత్రాలను పైరసీ సీడీల ద్వారా అక్రమంగా లబ్ధి పొండటం నీచమయిన చర్య అన్నారు. వారి న్యాయమైన శ్రమను అక్రమంగా దోచుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
నటితోనే ఏడడుగులు
హీరో విశాల్ ....నటితోనే ఏడడుగులు వేస్తానంటున్నాడు. యువ హీరోలలో ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న వారిలో ఒకరు విశాల్, మరొకరు ఆర్య. వీరిద్దరూ మంచి స్నేహితులన్నది తెలిసిన విషయమే. ఆర్య వివాహం తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని ఇటీవలి విశాల్ ఓ ప్రకటన కూడా చేశాడు.ఆర్య, తన పెళ్లి ఒకే రోజు, ఒకే వేదికపై, ఒకే సమయంలో చేయాలని ఇరువురి కుటుంబ సభ్యులు భావించారని....అయితే అందుకు తాను అంగీకరించలేదన్నారు. ఆర్య వివాహం అయిన మరునాడే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పానని విశాల్ తెలిపాడు. తనకు కాబోయే సతీమణి చిత్ర రంగానికి చెందిన అమ్మాయా? లేక బయటవారా అని చాలా మంది అడుగుతున్నారని .... తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నటి లేదా డ్యాన్సర్ అయి ఉంటుందని విశాల్ తెలిపాడు. అయితే కుటుంబ సభ్యుల అనుమతితోనే తన పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశాడు. కాగా విశాల్.... ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో ప్రేమలో పడినట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా నటి రాధిక ...ఈ వివాహానికి పెద్దరికం వహిస్తున్నట్లు సమాచారం. సో... తన పెళ్లి నిశ్చయమైనా... ఆర్య కోసం విశాల్ వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. బెస్ట్ ఆఫ్ లక్ విశాల్.