అనాథ చిన్నారులకు విశాల్‌ గోరుముద్దలు | Hero Vishal Celebrates His Birthday With Orphans | Sakshi
Sakshi News home page

Vishal: అనాథ చిన్నారులతో విశాల్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌

Aug 30 2021 10:26 AM | Updated on Aug 30 2021 10:26 AM

Hero Vishal Celebrates His Birthday With Orphans - Sakshi

Hero Vishal: హీరో విశాల్‌ ఆదివారం తన పుట్టిన రోజు సందర్భంగా అభిమాన సంఘాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు చీరలు, పంచెలు పంచి పెట్టారు. పేద మహిళల ఉపాధి కోసం కుట్టుమిషన్లు, నీటి బిందెలు, బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. అనాథలను గుర్తించి అనాథాశ్రమాల్లో చేర్చారు.

కాగా విశాల్‌ ఆదివారం ఉదయం స్థానిక కీల్పాక్కంలోని మెర్సీ హోమ్‌లోని వృద్ధులకు అన్నదానం చేశారు. స్థానిక కెల్లీస్‌లోని సురభి ఆశ్రమంలో అనాథ బాలల మధ్య కేక్‌ కట్‌ చేసి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. పిల్లలకు తన చేతితో అన్నం తినిపించి వారికి మధురానుభూతి కలిగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement