ముగిసిన నడిగర్ సంఘం ఎన్నికల పోలింగ్ | Nadigar Sangam elections: Polling peaceful after the ruckusci | Sakshi

ముగిసిన నడిగర్ సంఘం ఎన్నికల పోలింగ్

Jun 24 2019 8:44 AM | Updated on Mar 22 2024 10:40 AM

దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్‌) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మైలాపూర్‌లోని సెయింట్‌ ఎబాస్‌ బాలికల పాఠశాలలో ఓటింగ్‌ నిర్వహించగా.. కమల్‌హాసన్‌, ప్రకాష్‌రాజ్‌, కుష్భూ, రాధ, కేఆర్‌ విజయ సహా పలువురు నటులు, నటీమణులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. చివరిక్షణంలో హడావుడి ప్రకటన కారణంగా పోలింగ్ మందకోడిగా సాగినట్టు నిర్వాహకులు తెలిపారు. 3వేల100 మంది సభ్యులున్న నడిగర్‌ సంఘానికి 2019-2022 మధ్యకాలానికి ఈ ఎన్నికలు జరిగాయి. మద్రాస్‌ హైకోర్టు తుదితీర్పు అనంతరం నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి

Advertisement
 
Advertisement

పోల్

Advertisement