Nadigar Sangam elections
-
'నడిగర్ సంఘం' ఎన్నికలు.. మూడేళ్ల తర్వాత ఫలితాలు
దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికల్లో విశాల్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. గత 2019 జూన్ 23వ తేదీ ఈ సంఘానికి ఎన్నికలు జరిగాయి. పాండవర్ జట్టు పేరుతో నాజర్ అధ్యక్షుడిగా విశాల్ జట్టు, శంకర్‌దాస్ పేరుతో భాగ్యరాజ్ అధ్యక్షుడిగా ఐసరి గణేష్ జట్టు పోటీ పడ్డాయి. అయితే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఎన్నికలను రద్దు చేయాలంటూ ఐసరి గణేష్ జట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికలు సక్రమమే అని ఇటీవల కోర్టు తీర్పు ఇచ్చి ఓట్ల లెక్కింపునకు ఆదేశించింది. దీంతో ఆదివారం ఉదయం స్థానిక నుంగంబాక్కంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో విశ్రాంతి న్యాయమూర్తి పద్మనాభన్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. తపాలా ఓట్ల నుంచే విశాల్ జట్టు భారీ ఆధిక్యంతో దూసుకుపోయింది. ఒక దశలో ఉపాధ్యక్షుడికి పోల్ అయిన ఓట్ల కంటే 7, 8 ఓట్లు అధికంగా లెక్కింపులో వచ్చాయంటూ శంకర్‌దాస్ జట్టుకు చెందిన ఐసరి గణేష్ ఫిర్యాదు చేయడంతో కౌంటింగ్ ప్రక్రియ కొంచెంసేపు నిలిచిపోయింది. అయితే విశాల్ జట్టు భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. కాగా నడిగర్ సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన విశాల్ వర్గానికి తమిళ నిర్మాతల మండలి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటనలో విడుదల చేసింది. -
విశాల్‌కు చెన్నై హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, చెన్నై : నటుడు, నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్‌కు సోమవారం చెన్నై హైకోర్టులో చుక్కెదురైంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల గత నెల 23వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు చాలా వివాదాలు, వ్యతిరేకతల మధ్య జరిగాయి. కాగా ఈ ఎన్నికల్లో విశాల్ పాండవర్ జట్టు, కే.భాగ్యరాజ్ స్వామి శంకరదాస్ జట్టు ఢీకొన్నాయి. అసలు ఎన్నికలు జరుగుతాయా? అన్న సందేహం మధ్య చెన్నై హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు జరిగాయి. ఓట్ల లెక్కింపు కుదరదని ఉత్తర్యులు అయితే ఎన్నికల నిర్వహణకు అనుమతించిన న్యాయస్థానం ఓట్ల లెక్కింపునకు మాత్రం అనుమతివ్వలేదు. న్యాయస్థానం ఆదేశాలు వచ్చే వరకూ సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు జరపరాదని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఓట్ల లెక్కింపునకు అనుమతివ్వాల్సిందిగా ప్రస్తుత సంఘ కార్యదర్శి, పాండవర్ జట్టు తరఫున కార్యదర్శి పదవికి పోటీ చేసిన విశాల్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం కోర్టులో విచారణకు వచ్చింది. విచారించిన న్యాయమూర్తి ఆదికేశవులు సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపును ఇప్పుడు జరపడం కుదరదంటూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో సోమవారం నడిగర్‌సంఘం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని, విజయం ఎవరిని వరిస్తుందో? అని చిత్ర పరిశ్రమలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కోర్టు ఆదేశాలతో ఎన్నికల ఫలితాల కోసం మరింత నిరీక్షణ తప్పదని తెలిసింది. -
ముగిసిన నడిగర్ సంఘం ఎన్నికల పోలింగ్
-
ప్రశాంతంగా ముగిసిన నడిగర్ పోలింగ్
సాక్షి, చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మైలాపూర్‌లోని సెయింట్ ఎబాస్ బాలికల పాఠశాలలో ఓటింగ్ నిర్వహించగా.. కమల్‌హాసన్, ప్రకాష్‌రాజ్, కుష్భూ, రాధ, కేఆర్ విజయ సహా పలువురు నటులు, నటీమణులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. చివరిక్షణంలో హడావుడి ప్రకటన కారణంగా పోలింగ్ మందకోడిగా సాగినట్టు నిర్వాహకులు తెలిపారు. 3వేల100 మంది సభ్యులున్న నడిగర్ సంఘానికి 2019-2022 మధ్యకాలానికి ఈ ఎన్నికలు జరిగాయి. మద్రాస్ హైకోర్టు తుదితీర్పు అనంతరం నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి నాజర్ నేతృత్వంలోని పాండవార్ ప్యానెల్, భాగ్యరాజ్ నేతృత్వంలోని శంకర్‌దాస్ ప్యానెల్ నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీచేశాయి. జనరల్ సెక్రటరీ పదవికి హీరో విశాల్, నిర్మాత గణేశ్‌తో తలపడ్డారు. కోశాధికారి పదవికి హీరో కార్తీ, హీరో ప్రశాంత్ బరిలో ఉన్నారు. నాజర్ గ్రూప్, భాగ్యరాజ్ గ్రూప్ మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరగడంతో.. ఎన్నికల ప్రక్రియ రచ్చకెక్కింది. విశాల్ తమిళ వ్యక్తి కాదని, అతడిని నడిగర్ సంఘం నుంచి బయటకు పంపాలని భాగ్యరాజ్ సంచలన కామెంట్స్ చేయడంతో పోటీ వేడెక్కింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియను ఆపాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. చివరినిమిషంలో హైకోర్టు అనుమతి ఇవ్వడంతో పోలింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ అందకపోవడంతో ముంబైలో దర్బార్ షూటింగ్లో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తంచేశారు. అయితే పదిరోజుల ముందే పోస్టల్ బ్యాలెట్లు పంపామని, తపాలా శాఖ ఆలస్యం కారణంగా అవి అందలేదని నటి కుష్భూ తెలిపారు. -
కొనసాగుతున్న నడిగర్ సంఘం ఎన్నికల పోలింగ్
-
ఇవాళే నడిగర్ సంఘం ఎన్నికలు
-
విశాల్... నా ఓటు కోల్పోయావ్
పెరంబూరు: నటుడు విశాల్, నటి వరలక్ష్మి మధ్య మంచి స్నేహసంబంధం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మధ్య అంతకంటే ఇంకేదో బంధం ఉందనే ప్రచారం చాలా కాలం జరిగింది. వీరిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి లాంటి వదంతులు కూడా వచ్చాయి. అయితే ఇటీవల నటుడు విశాల్‌కు ఇంట్లో వాళ్లు హైదరాబాద్‌కు చెందిన అనీశారెడ్డి అనే అమ్మాయితో వివాహ నిశ్చితార్థం జరిపించడంతో పుకార్లకు బ్రేక్ పడింది. కాగా తాజాగా ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న నటి వరలక్ష్మిశరత్‌కుమార్ నటుడు విశాల్‌పై మండిపడ్డారు. ‘నీ సంకుచిత బుద్ధి బయట పడింది. నీపై నాకున్న గౌరవం తగ్గింది. ఇంకా సాధువులా నటించకు’ అంటూ ఆయనపై మాటల తూటాలు పేల్చారు. ఈ గొడవేంటో ఓ సారి చూద్దాం.. 2019–2022 ఏడాదికి గాను నడిగర్‌సంఘం ఎన్నికలు ఈ నెల 23న జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సంఘ పదవులకు పోటీ పడుతున్న పాండవర్ పేరుతో విశాల్ జట్టు, స్వామి శంకర్‌దాస్ పేరుతో కే.భాగ్యరాజ్ జట్ల మధ్య పోటీ నెలకొంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎవరి ప్రయత్నం వారు ముమ్మరంగా చేస్తున్నారు. స్వామి శంకర్‌దాస్ జట్టు గురువారం నటుడు విజయకాంత్‌ను కలిసి మద్దతు కోరారు. శుక్రవారం నటుడు కమలహాసన్‌ను కలిశారు. కాగా పాండవర్ జట్టులో కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న నటుడు విశాల్ ఓట్లను కొల్లగొట్టడంలో భాగంగా ఒక వీడియోను గురువారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అది ఇప్పుడు సంచలనంగా మారింది. అంతే కాదు నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఆగ్రహానికి కారణం అయ్యింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే నటుడు విశాల్ నడిగర్‌సంఘ మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవిలపై విమర్శలను గుప్పించారు. శరత్‌కుమార్, రాధారవి ఫొటోలను చూపిస్తూ వారి స్వప్రయోజనాల కోసం నాటక రంగ కళాకారుల శ్రేయస్సును పట్టించుకోలేదని, వారి అక్రమాలనుప్రశ్నించడానికే తాము ఈ సంఘం ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అంతే కాకుండా తాము నాటక వృద్ధ కళాకారులకు అందిస్తున్న పింఛన్లు, నిర్మిస్తున్న సంఘ భవననిర్మాణం వంటి విషయాలను పేర్కొన్నారు. ఈ వీడియోకు స్పందించిన నటి వరలక్ష్మిశరత్‌కుమార్ విశాల్‌పై మండిపడ్డారు. ఆమె తన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు. ‘మర్యాద గల విశాల్‌కు.. మీరు విడుదల చేసిన ఎన్నికల ప్రచార వీడియోను చూసి మీరు ఎంతగా దిగజారిపోయారన్న విషయం అర్థమవుతుంది. ఆశ్చర్యంతో పాటు అసంతృప్తికి గురియ్యాను. మీపై ఉన్న కొంచెం మర్యాద, గౌరవం ఇప్పుడు పూర్తిగా పోయింది. నా తండ్రిపై మీరు చేస్తున్న ఆరోపణలపై విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆరోపణలు కోర్టులో రుజువయ్యే వరకు ఎవరైనా నిరపరాధులే. నా తండ్రి నేరస్తుడే అయితే ఇప్పటికే జైలులో ఉండే వారు. కాబట్టి మీ స్థాయిని పెంచుకోండి. ఇలాంటి నీచపు వీడియోలు మీ స్థా«యిని చూపుతున్నాయి. అయినా మిమ్మల్ని తప్పుపట్టలేం ఎందుకంటే మీరు పెరిగిన విధం అలాంటిదని భావిస్తున్నాను. ఇకపై కూడా సాధువులా చెప్పుకునే ప్రయత్నం చేయవద్దు. మీ అబద్ధాలను, ధ్వంద మనస్థత్వాన్ని అందరూ గ్రహించారని భావిస్తున్నాను. మీరు నిజంగానే సాధువు అయితే మీ పండవర్ జట్టు సభ్యులు మీ నుంచి దూరం అయి మరో జట్టును ఏర్పాటు చేయరు. మీరు మంచి పనులు చేస్తే ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న నా తండ్రిని కించపరిచే కంటే, మీరు చేసిన మంచి కార్యాలను చెప్పి ఓట్లు అడుక్కోవచ్చు. ఇంత కాలం మిమ్మల్ని గౌరవించి ఒక స్నేహితురాలిగా మిమ్మల్ని ఆదరిస్తూ వచ్చాను. అలాంటిది ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీరు సాధించిన విషయాలతో వీడియో విడుదల చేయకుండా, ఇలా దిగజారి ప్రచారం చేసుకోవడం చాలా బాధనిపిస్తోంది. మీరు తెర వెనుక కూడా బాగానే నటిస్తున్నారనుకుంటున్నాను. మీరు నా ఓటును కోల్పోయారు. మీరు ఎప్పుడూ చెబుతున్నట్లు సత్యమే గెలుస్తుంది’ అని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ నటుడు విశాల్‌పై మాటల దాడి చేశారు. వరలక్ష్మికి ఆ హక్కు ఉంది కాగా వీడియోను విడుదల చేసిన విశాల్‌పై నటి వరలక్ష్మి, నటి రాధికాశరత్‌కుమార్ చేసిన మూకుమ్మడి మాటల దాడి చిత్ర పరిశ్రమలో కలకలానికి దారి తీసింది. ఇక విశాల్ వ్యతిరేకవర్గం దీన్ని బాగానే వాడుకుంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శుక్రవారం సాయంత్రం పాండవర్ జట్టు నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ను స్థానిక ఆల్వార్‌పేటలోని ఆయన కార్యాలయంలో కలిసి మద్దతు కోరారు. అనంతరం నటుడు విశాల్ మీడియాతో మాట్లాడుతూ.. నడిగర్‌సంఘంలో 30 ఏళ్లుగా జరగనిది తాము మూడేళ్లలో చేసి చూపించామని అన్నారు. సంఘ భవన నిర్మాణానికి ఎందరు ఎన్ని విధాలుగా ఆటంకాలు సృష్టించారన్నది అందరికీ తెలుసన్నారు. ఇక నటి వరలక్ష్మి తనపై విసుర్ల గురించి స్పందిస్తూ ఆమె లాంటి ప్రతి స్నేహితులకు స్వతంత్రంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని అన్నారు. నిసిగ్గుగా చెప్పిందే చెప్పడమా? విశాల్ వీడియోపై శరత్‌కుమార్ సతీమణి, నటి రాధికా శరత్‌కుమార్ ఘాటుగా స్పందించారు. ఆమె ఒక ప్రకటనను విడుదల చేస్తూ.. ఈ నెల 23న సంఘం ఎన్నికలు జరగనున్న సమయంలో పాండవర్ జట్టు విడుదల చేసిన వీడియోలో శరత్‌కుమార్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేయలేదు, పలు అక్రమాలకు పాల్పడ్డారు అంటూ మూడున్నరేళ్ల ముందు చెప్పిన పాత పల్లవినే మళ్లీ సిగ్గు లేకుండా చెప్పడం బిచ్చగాడు వాంతి చేసుకున్నట్లు ఉంది. విశాల్ మీరు చేసిన ఆరోపణలు ఇప్పటి వరకు నిరూపించారా? అయినా మీరు చేసిన ఫిర్యాదులు విచారణలో ఉండగా గతంలో చెప్పిన అసత్యాలు ఇప్పుడు నిజం అవుతాయా? మీపై వేయి కుళ్లిన గుడ్లు ఉండగా శరత్‌కుమార్ గురించి మాట్లాడడానికి సిగ్గుగా లేదా? నిర్మాతల మండలిలో డబ్బు అంతా ఖాళీ చేసి కోర్టు బోనులో నిలబడ్డారే, అలాంటి మీకు ఇలాంటి వీడియోను విడుదల చేసే అర్హత ఉందా? అంటూ రాధికాశరత్‌కుమార్ విశాల్‌పై విరుచుకుపడ్డారు. -
విశాల్‌తో ఐసరి గణేశ్ ఢీ
సాక్షి, చెన్నై : దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్‌సంఘం) ఎన్నికల నగారా ఇప్పటికే మోగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న సంఘ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి పద్మనాభన్ నేతృత్వం వహిస్తున్నారు. 2015లో నటుడు శరత్‌కుమార్, రాధారవిల జట్టును ఢీకొని గెలిచిన విశాల్, నాజర్, కార్తీల పాండవర్ జట్టు మళ్లీ బరిలోకి దిగుతోంది. మహాజట్టు ప్రయత్నం గత ఎన్నికల్లో విశాల్ జట్టు విజయం కోసం కృషి చేసిన పలువురు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారారు. వారంతా కలిసి ఈ సారి విశాల్ జట్టును ముఖ్యంగా విశాల్‌ను ఓడించాలన్న కసిగా ఉన్నారు. దీంతో విశాల్ జట్టుకు వ్యతిరేకంగా మహా జట్టును ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా బిగ్‌షాట్ అయిన ఐసరి గణేశ్‌ను రంగంలోకి దింపారు. ఈయన విద్యా సంస్థల అధినేత, సినీ నిర్మాతగా తెలిసిందే. నటుడిగానూ చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తుంటారు. విశేషం ఏంటంటే ఐసరిగణేశ్ కూడా గత ఎన్నికల్లో విశాల్ జట్టుకు మద్దతుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన్నే ఢీకొనడానికి సిద్ధం అయ్యారన్నది గమనార్హం. విశాల్ జట్టు.. విశాల్ జట్టులో నాజర్ అధ్యక్షుడిగానూ, విశాల్ కార్యదర్శిగానూ, కార్తీ కోశాధికారిగానూ, ఉపాధ్యక్షులుగా కరుణాస్, పూచి మురుగన్ పోటీ చేస్తున్నారు. కార్యవర్గ సభ్యులుగా నటి కుష్భూ, కోవైసరళ, లతా సభాపతి, సోనియా, మనోబాలా, పశుపతి, ఎస్డీ.నందా, హేమచంద్రన్, రమణ, వాసుదేవన్, ఎస్ఎం.కాళిముత్తు, రత్నప్ప, జరాల్డ్, జూనియర్ బాలయ్య, రాజేశ్, దళపతి, దినేశ్, వెంకటేశ్, ఎంఎస్.ప్రకాశ్, సరవణన్ మొదలగు 19 మంది పోటీలో ఉన్నారు. గణేశ్ జట్టు.. వీరికి వ్యతిరేకంగా గణేశ్ జట్టులో అధ్యక్ష పదవికి దర్శక, నటుడు కే.భాగ్యరాజ్‌ను బరిలోకి దించారు. కార్యదర్శి పదవికి ఐసరిగణేశ్ పోటీ చేస్తున్నారు. నటి కుట్టి పద్మిని, నటుడు ఉదయ ఉపాధ్యక్ష పదవులకు, కోశాధికారి పదవికి జయంరవి బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. అయితే ఈ జట్టు వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కాగా ఎన్నికలకు మరో రెండు వారాలే గడువు ఉండడంతో పోటీ వర్గాలు ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్థానాలను కైవసం చేసుకున్న డీఎంకే అధినేత ఎంకే.స్టాలిన్‌ను నటుడు విశాల్ మర్యాదపూర్వకంగా కలిసి అభినంధించారు. దీంతో ఇటీవల ఆయనకు పోటీగా నటుడు ఉదయ కూడా స్టాలిన్‌ని కలిశారు. నడిగర్‌సంఘం రాజకీయ రంగు పులుముకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. కే.భాగ్యరాజ్, ఐసరిగణేశ్ జట్టు విశాల్ జట్టు దూకుడు గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి రసవత్తరంగా జరగనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచే ప్రారంభం కావడంతో విశాల్ జట్టు ముందుగానే తన సభ్యుల పట్టికను ప్రకటించడంతో పాటు శనివారం నామినేషన్ కూడా దాఖలు చేసి దూకుడుని ప్రదర్శించారు. భవన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పాండవర్ జట్టు మీడియా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ నడిగర్ సంఘ నూతన భవన నిర్మాణాన్ని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే వారి ప్రయత్నాలను తాము సాగనివ్వమని అన్నారు. మరో 4 లేదా 6 నెలల్లో సంఘ భవన నిర్మాణం పూర్తి అయ్యే స్థాయిలో ఉన్నాయని, వాటిని కచ్చితంగా పూర్తి చేసి తీరతామన్నారు. తమ కార్యవర్గం గత ఎన్నికల్లో చేసి వాగ్ధానాలన్నీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా విశ్రాంత సభ్యులకు పెన్షన్‌ను పెంచడం లాంటి పలు సంక్షేమ కార్యక్రమాలను నెరవేర్చాయన్నారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని, అలాంటివి తనకు కొత్త కాదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఎవరూ అడ్డుకోలేరని, పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు. అదే విధంగా నడిగర్ సంఘం రాజకీయాలకు అతీతం అన్నారు. ఇందులో ఉన్న వారెవరూ రాజకీయ పార్టీలకు చెందిన వారు కాదన్నారు. త్వరలో నిర్వహించనున్న సంఘ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉపముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలవనున్నట్లు విశాల్ తెలిపారు. -
23న సినిమా షూటింగ్స్ రద్దు
చెన్నై : ఈ నెల 23వ తేదీన షూటింగ్‌లు రద్దు చేయనున్నారు. గత ఆరు నెలలుగా ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని సినీ వర్గాలు ఎదురుచూస్తున్న దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరగనున్నాయి. ప్రస్తుత నిర్వాహక వర్గం విశాల్ నేతృత్వంలో మళ్లీ పోటీకి సిద్ధం అవుతుండగా, వీరికి పోటీగా ఒక మహా జట్టు తయారవుతోంది. ఈ జట్టుకు సంబంధించిన వివరాలు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి పద్మనాభన్ పర్యవేక్షణలో స్థానిక అడయారులోని సత్య స్టూడియో (ఎంజీఆర్ జానకీ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 23వ తేదీన షూటింగ్‌లను రద్దు చేయడానికి సహకరించాల్సిందిగా నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్ నిర్మాతల మండలి బాధ్యతలను నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారి వెంకట్‌కు, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య(ఫెఫ్సీ)కు, విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను మంగళవారం రాశారు. అందులో నిర్మాతల మండలి, ఫెఫ్సీలకు చెందిన సభ్యులు నటీనటులుగా ఉండటంతో వారంతా పోలింగ్‌లో పాల్గొనడానికి సౌకర్యంగా షూటింగ్‌ను రద్దు చేయాల్సిందిగా కోరారు. కాగా నడిగర్ సంఘం విజ్ఞప్తిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాయని ఆయా సంఘాలు తెలిపాయి. -
మేము మళ్లీ పోటీ చేయడానికి రెడీ!
మేము మళ్లీ పోటీ చేయడానికి రెడీ అని తెలిపారు ప్రస్తుతం దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్‌సంఘం) కార్యవర్గం. ఈ సంఘానికి మూడేళ్లకొకసారి ఎన్నికలు జరగడం ఆనవాయితీ. గత 2015లో జరిగిన ఎన్నికల్లో నటుడు శరత్‌కుమార్, రాధారవి జట్టుపై, నటుడు నాజర్, విశాల్, కార్తీల జట్టు పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ కార్యవర్గం పదవీ కాలం గత ఏడాది అక్టోబరుతోనే ముగిసింది. అయితే సంఘ నూతన భవన నిర్మాణం పూర్తి అయ్యే దశలో ఉండడంతో ఎన్నికలను 6 నెలల పాటు వాయిదా వేశారు. అయితే ఇలా వాయిదా వేయడంపై వ్యతిరేక వర్గం తీవ్రంగా ఆరోపిస్తోంది. ఇప్పటికే ఒకసారి అత్యవసరం సమావేశం నిర్వహించిన ప్రస్తుత కార్యవర్గం తాజాగా మంగళవారం సాయంత్రం మరోసారి స్థానిక టీనగర్‌లోని ఓ హోటల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసే విషయం, పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. సమావేశ అనంతరం సంఘం అధ్యక్షుడు నాజర్ మీడియాతో మాట్లాడుతూ తమ జట్టు మళ్లీ పోటీ చేస్తుందని వెల్లడించారు. కాగా ఈ ఎన్నికలను మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి పద్మనాభన్ పర్యవేక్షణలో జరగనున్నట్లు తెలిపారు. సంఘం ఎన్నికలు ఎప్పుడు? ఎక్కడ నిర్వహించాలనన్నది పద్మనాభన్ నిర్ణయం తీసుకుంటారని నాజర్ తెలిపారు. ఈ సమావేశంలో నడిగర్ సంఘ కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షుడు పొన్వన్నన్, పూచీ.మురుగన్ పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేయాలి: రజనీ
చెన్నై : చలన చిత్రపరిశ్రమంతా ఓ కుటుంబమని సూపర్ స్టార్, ప్రముఖ నటుడు రజనీకాంత్ అన్నారు. ఆదివారం ఉదయం చెన్నైలో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు చెన్నైలో అళ్వార్ పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో రజనీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. విజేతలు హామీలు నెరవేర్చకుంటే పదవికి రాజీనామా చేయాలని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే చలన చిత్రరంగానికి చెందిన ప్రముఖలంతా పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు. శరత్‌కుమార్, విజయ్, రాధా, రజనీ తదితరులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత పదేళ్లుగా నడిగర్ సంఘానికి ప్రముఖ నటుడు శరత్‌కుమార్ బృందం కార్య నిర్వాహకవర్గంగా కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది కూడా ఆ బృందమే పదవీ బాధ్యతలు కొనసాగాలని భావించింది. అయితే ప్రముఖ నటుడు విశాల్ బృందం జట్టు కూడా ఈ సంఘం బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహాన్ని చూపింది. దీంతో ఈ సంఘానికి ఎన్నికలు అనివార్యమైనాయి. అంతేకాకుండా అటు శరత్‌కుమార్ జట్టు... ఇటు విశాల్ జట్ల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుని ... చివరికి ఈ రెండు జట్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి నెలకొంది. దాంతో ఈ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ఓ విధంగా చెప్పాంటే సీనియర్ నటులు... జూనియర్ నటుల మధ్య పోటీగా మారిందని చెప్పవచ్చు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మద్దతు మాత్రం శరత్కుమార జట్టుకే ఉందని సమాచారం. కానీ ఈ ఎన్నికల్లో విజయావకాశాలు మాత్రం విశాల్ జట్టుకు వరించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న పద్మనాభన్ ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఆళ్వార్ పేట పరిసర ప్రాంతాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ నడిగర్ సంఘం ఎన్నిక ఏకగ్రీవంగా లేక సాధారణ పోటీ మధ్య ఎంపికయిన జట్టు పదవీ బాధ్యతలు చేపడుతున్న విషయం తెలిసిందే. -
ఢీ అంటే ఢీ
►నడిగర్ సంఘం ఎన్నికలు నేడే ► బరిలో శరత్‌కుమార్, విశాల్ జట్లు ► రాజకీయ ఎన్నికల్ని తలపిస్తున్న వైనం ► విజయం ఎవరిదో? పరిశ్రమలో ఉత్కంఠ తమిళసినిమా: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) మునుపెప్పుడూ లేనంతగా పత్రికల్లో పెద్దపెద్ద హెడ్డింగ్ల్లో వాడివేడి పదజాలాలతో ఒక రకమైన ఉత్కం ఠను కలగజేస్తూ వస్తోంది. ఇందుకు కారణం ఆ సంఘం ఎన్నికలే. సినీ రంగం రెండుగా చీలే రీతిలో తాజా ఎన్నికల సమరం సాగుతోంది. ఎవరిది పైచేయి అన్నది మరి కొన్ని గంటల్లో తేలబోతోంది. ఈ సమయంలో నడిగర్ సంఘం పూర్వోత్తరాల విషయాలకు ఓ మారు వెళితే... పురట్చి తలైవర్ ఎంజీఆర్, నడిగర్ తిలగం శివాజీగణేశన్ కాలంలో(1952) ఆవిర్భవించిన ఈ సంఘం ఆరు శతాబ్దాలకు పైగా సమష్టిగా సభ్యుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తూ వస్తోంది. నడిగర్ సంఘానికి మూడేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహంచడం ఆనవాయితీ. అలాంటిది ప్రస్తుత కార్య నిర్వాహకవర్గంగా ఉన్న నటుడు శరత్‌కుమార్ బృందం సుమారు పదేళ్లపాటుగా ఏకధాటిగా బాధ్యతల్ని నిర్వహించడం విశేషమనే చెప్పాలి. ఆ జట్టు మళ్లీ సంఘం పదవీ బాధ్యతల్ని ఆశిస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఏకగ్రీవంగా లేక పోతే సాధారణ పోటీ మధ్య ఎంపికయిన జట్టు పదవీ బాధ్యతల్ని చేపడుతూ వచ్చారన్నది గమనార్హం. అలాంటిది శరత్‌కుమార్ ఈ సారి గట్టి పోటీని ఎదుర్కోవలసిన పరిస్థితి నెలకింది. నటుడు విశాల్ రూపంలో ఆయనకు పోటీ ఎదురయ్యింది. ఇది మామూలు పోటీ కాదు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు రాజకీయ ఎన్నికల్ని తలపిస్తున్నాయని చెప్పడం అతిశయోక్తి కాదేమో. అన్యాయాలు, అక్రమాలు అంటూ ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అలాగే, ఒకరి మీద మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడమే కాకుండా, కోర్టుల్లో పిటిషన్లు సైతం పోటీ పడి మరీ దాఖలు చేసుకుంటున్నారు. ఇది ఎక్కడి వరకు వెళ్లిందంటే జాతి, మతం, భాషలను ఎత్తి చూపుతూ దూషించుకునే స్థాయికి చేరింది. పచ్చిగా చెప్పాలంటే తమిళ చిత్ర పరిశ్రమే రెండుగా చీలిపోయే పరిస్థితి దాపురిస్తుందేమో నన్నంత భయపడేలా. నటుడు శరత్‌కుమార్ శుక్రవారం ఆవేశంగా మాట్లాడుతూ సినీ పరిశ్రమ ఒకటిగా కలిసే అవకాశంమే లేదని వ్యాఖ్యానించారు. తమిళ నిర్మాతల మండలి శరత్‌కుమార్ జట్టకు మద్దతు ఉందంటూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ మండలి మెడకు చుట్టుకునే పరిస్థితి ఎదురయ్యింది. మండలిలోని చాలా మంది సభ్యులు ఆ మండలి అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిర్మాతల మండలిలో ముఖ్య పదవిలో ఉన్న జ్ఞానవేల్ రాజా (స్టూడియో గ్రీన్ సంస్థ) మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం తన కార్యాలయంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆ సమావేశంలో 500 వరకు పైగా నిర్మాతలు పాల్గొన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితికి కారణాలేమిటి? నడిగర్ సంఘం ఎన్నికలు ఇంత గట్టి పోటీని ఎదుర్కోవడానికి, ఇలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనడానికి కారణాలేమిటన్నదానికి కొంచెం వెనక్కు వెళ్లిచూస్తే స్థానిక టి.నగర్, హబీబుల్లా రోడ్డులోని సంఘం కార్యాల యాన్ని ఆధునీకరించే ప్రక్రియలో భాగంగా బహుళ సముదాయ భవన నిర్మాణ బాధ్యతల్ని ఎస్పీఎస్ సంస్థకు అప్పగించారు. ఆ వ్యవహారాలను సంఘ సభ్యుడైన నటుడు పూచి మురుగన్ ప్రశ్నించారు. ఆ విషయంలో ఆయనకు సంతృప్తికరమైన సమాధానం రాలేదంటూ సంఘం భవన నిర్మాణం ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించడంతో పాటు కోర్టు వరకూ వెళ్లారు. కేసు కోర్టు పరిధిలో ఉండడంతో భవన నిర్మాణం ఆగిపోయింది. నటుడు విశాల్ రంగప్రవేశం ఈ వ్యవహారం నాన్చుకుంటూ పోవడంతో నటుడు విశాల్ రంగంలోకి దిగారు. నడిగర్ సంఘం భవన నిర్మాణం కోసం చిత్ర నిర్మాణం చేపడితే తాము పారితోషికం లేకుండా నటిస్తామని, తద్వారా వచ్చిన ఆదాయంతో భవన నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని బాహాటంగానే ప్రకటించారు. ఆ విధంగా సంఘం వ్యవహారాలను ప్రశ్నించడంతో సంఘ నిర్వాహకులకు విశాల్ దూరం పెరుగుతూ వచ్చింది. అలా మొదలై వ్యక్తిగత దూషణల వరకు వ్యవహారం వెళ్లింది. తనను అవమానించారంటే, తమను విమర్శించారంటూ ఆరోపణల పర్వానికి తెరలేచింది. ఇది ఇరు జట్టులను ఎన్నికల బరిలోకి దూకే వరకూ దారి తీయించింది. పరిస్థితిని గమనించిన తమిళ నిర్మాతల మండలి, తమిళ సినీ దర్శకుల సంఘం, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య(పెప్సీ) ప్రతినిధులు సమస్యను సామరస్య చర్చల ద్వారా పరిష్కారం చేయడానికి ముందుకొచ్చారు. అయితే అప్పటికే నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో విశాల్ జట్టు సామరస్యానికి తావే లేదంటూ తెగేసి చెప్పేసింది. దీంతో నడిగర్‌సంఘం ఎన్నికలు అనివార్యమయ్యాయి. హైకోరు విశ్రాంత న్యాయమూర్తి పద్మనాభన్ పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆదివారం స్థానిక మైలాపూర్‌లోని ఎబాస్ పాఠశాలలో జరగనున్నాయి.మరికొన్ని గంటల్లో ఎన్నికలపర్వం నిర్వహించనున్న నేప్యథంలో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసు పహారా రంగంలోకిదిగింది. ఆదివారమే ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ చిత్రపరిశ్రమను వెంటాడుతోంది. -
అందులో రాజకీయాలు లేవు
తమిళసినిమా: నడిగర్ సంఘం ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పోటీ వర్గాల్లో సెగలు పుడుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. మరోపక్క తామే గెలుస్తామని ఎవరికి వారు మేకపోతు గాంభీర్యం వెలిబుచ్చుతున్నారు. అదే సమయంలో సంగం సభ్యుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. గురువారం ప్రస్తుతం సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి జట్టు మళ్లీ పోటీకి సిద్ధమైంది. వీరికి పోటీగా నటుడు విశాల్ జట్టు బరిలోకి దిగుతోంది. కాగా శరత్‌కుమార్ గురువారం మదురై వెళ్లి అక్కడి నటనారంగ కళాకారుల మద్దతు కోరే ప్రయత్నం చేశారు. అక్కడే ఆధ్యాత్మిక పీఠాన్ని సందర్శించి, విలేకరులతో మాట్లాడారు. నడిగర్ సంఘం విషయంలో కొందరు రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నటుడు విశాల్ మదురైలో మాట్లాడుతూ నడిగర్ సంఘం విషయంలో ఎవరూ రాజకీయాలు చేయడం లేదని శరత్‌కుమార్ వ్యాఖ్యలకు బదులిచ్చారు. ఆ కోరికలు అంగీకరిస్తే.. విశాల్ మాట్లాడుతూ తమ న్యాయమైన కోరికలను శరత్‌కుమార్ అంగీకరిస్తే తాను ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలుగుతామని అన్నారు. అందులో ముఖ్యమైంది సంఘం భవన నిర్మాణం చేపట్టాల న్నారు. అందుకు తామంతా ఒక చిత్రంలో ఫ్రీగా నటించి నిధిని సమకూర్చడానికి సిద్ధమన్నారు. ఈ సినీ దిగ్గజాలు నాటక రంగం నుంచి వచ్చిన దివంగత మహానటులు ఎంజీఆర్, శివాజీగణేశన్ వంటి పలువురు నెలకొల్పిన సంఘం నడిగర్ సంఘం అన్నారు. ఈ సంఘంలో రంగస్థల నటులు ఒక అంగం అన్నారు. అలాంటి సంఘంలో ఏర్పడిన సమస్యల పరిష్కారం కోసమే తాము ఇక్కడికి వచ్చామని అన్నారు. రంగస్థల నటులను డబ్బుతో మభ్యపెట్టి తమ పక్క తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఫిర్కాదులు అందుతున్నాయన్నారు. అలా నాటక కళాకారులకు డబ్బులిస్తే సంతోషమేనన్నారు. కళాకారులు లేకపోతే సినీ కళాకారులు లేరని విశాల్ పేర్కొన్నారు. ఆయనతో పాటు నటుడు కార్తీ, నాజర్ తదితరులు ఉన్నారు.