సాక్షి, చెన్నై : నటుడు, నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్‌కు సోమవారం చెన్నై హైకోర్టులో చుక్కెదురైంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల గత నెల 23వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు చాలా వివాదాలు, వ్యతిరేకతల మధ్య జరిగాయి. కాగా ఈ ఎన్నికల్లో విశాల్ పాండవర్ జట్టు, కే.భాగ్యరాజ్ స్వామి శంకరదాస్ జట్టు ఢీకొన్నాయి. అసలు ఎన్నికలు జరుగుతాయా? అన్న సందేహం మధ్య చెన్నై హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు జరిగాయి.
ఓట్ల లెక్కింపు కుదరదని ఉత్తర్యులు
అయితే ఎన్నికల నిర్వహణకు అనుమతించిన న్యాయస్థానం ఓట్ల లెక్కింపునకు మాత్రం అనుమతివ్వలేదు. న్యాయస్థానం ఆదేశాలు వచ్చే వరకూ సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు జరపరాదని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఓట్ల లెక్కింపునకు అనుమతివ్వాల్సిందిగా ప్రస్తుత సంఘ కార్యదర్శి, పాండవర్ జట్టు తరఫున కార్యదర్శి పదవికి పోటీ చేసిన విశాల్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం కోర్టులో విచారణకు వచ్చింది. విచారించిన న్యాయమూర్తి ఆదికేశవులు సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపును ఇప్పుడు జరపడం కుదరదంటూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో సోమవారం నడిగర్‌సంఘం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని, విజయం ఎవరిని వరిస్తుందో? అని చిత్ర పరిశ్రమలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కోర్టు ఆదేశాలతో ఎన్నికల ఫలితాల కోసం మరింత నిరీక్షణ తప్పదని తెలిసింది.
విశాల్‌కు చెన్నై హైకోర్టులో చుక్కెదురు
Published Tue, Jul 9 2019 9:50 AM | Last Updated on Tue, Jul 9 2019 9:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment