చెన్నై : ఈ నెల 23వ తేదీన షూటింగ్‌లు రద్దు చేయనున్నారు. గత ఆరు నెలలుగా ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని సినీ వర్గాలు ఎదురుచూస్తున్న దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరగనున్నాయి. ప్రస్తుత నిర్వాహక వర్గం విశాల్ నేతృత్వంలో మళ్లీ పోటీకి సిద్ధం అవుతుండగా, వీరికి పోటీగా ఒక మహా జట్టు తయారవుతోంది. ఈ జట్టుకు సంబంధించిన వివరాలు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
కాగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి పద్మనాభన్ పర్యవేక్షణలో స్థానిక అడయారులోని సత్య స్టూడియో (ఎంజీఆర్ జానకీ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 23వ తేదీన షూటింగ్‌లను రద్దు చేయడానికి సహకరించాల్సిందిగా నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్ నిర్మాతల మండలి బాధ్యతలను నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారి వెంకట్‌కు, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య(ఫెఫ్సీ)కు, విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను మంగళవారం రాశారు. అందులో నిర్మాతల మండలి, ఫెఫ్సీలకు చెందిన సభ్యులు నటీనటులుగా ఉండటంతో వారంతా పోలింగ్‌లో పాల్గొనడానికి సౌకర్యంగా షూటింగ్‌ను రద్దు చేయాల్సిందిగా కోరారు. కాగా నడిగర్ సంఘం విజ్ఞప్తిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాయని ఆయా సంఘాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment