chennai high court
-
వివరణ ఇవ్వాలి.. నయనతారకి హైకోర్టు నోటీసు
నటి నయనతార, ఆమె భర్త–దర్శకుడు విఘ్నేశ్ శివన్ లకు చెన్నై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే... నయనతార జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా ‘నయనతార: బియాండ్ద ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపొందిన విషయం తెలిసిందే. నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమ్ అవుతోంది. కాగా ఈ డాక్యుమెంటరీలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీదాన్ ’ చిత్రంలోని సన్నివేశాలను ఉపయోగించారు. అయితే ఇలా వినియోగించడానికి ధనుష్ అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ధనుష్‌ని విమర్శిస్తూ నయనతార ఒక లేఖను విడుదల చేశారు. అది సినీ వర్గాల్లో చర్చకి దారి తీసింది. ఇక తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీదాన్ ’లోని క్లిప్పింగ్ వాడినందుకు నష్టపరిహారంగా రూ. 10 కోట్లు కోరుతూ నయనతారపై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నయనతార, విఘ్నేష్ శివన్ లకు నోటీసులు జారీ చేశారు. మరి... తదుపరి పరిణామాలేంటి? అనేది వేచి చూడాల్సిందే. – సాక్షి, తమిళ సినిమా -
మనిలాండరింగ్ కేసులో మాజీ మంత్రి.. ఈడీకి సుప్రీం కీలక ఆదేశాలు
మనీలాండరింగ్ కేసులో గత ఏడాది అరెస్టైన తమిళనాడు మాజీ మంత్రి వి.సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి స్పందన కోరింది. సెంథిల్ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 29లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈడీని ఆదేశించింది. అంతకుముందు సెంథిల్ బెయిల్ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనిలాండరింగ్ కేసులో బెయిలా ఫిబ్రవరి 28న సెంథిల్ బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఆ సమయంలో మనిలాండరింగ్ వంటి అసాధారణ కేసుల్లో బెయిల్ ఇవ్వడం తప్పుడు సంకేతాలు పంపుతుందని, అది ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొంది. అంతేకాదు, పిటిషనర్ ఎనిమిది నెలలకు పైగా జైలు శిక్ష అనుభవించారని, అందువల్ల ఈ కేసును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ప్రత్యేక కోర్టును ఆదేశించడం సముచితంగా ఉంటుందని పేర్కొంది.సుప్రీం ఆదేశాలకు అనుగుణంగాదీని ప్రకారం ఈ ఉత్తర్వుల కాపీ అందిన తేదీ నుంచి మూడు నెలల్లో కేసును పరిష్కరించాలని చెన్నై ప్రిన్సిపల్ స్పెషల్ కోర్టును కోరాలని ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రోజువారీగా విచారణ జరపాలని చెన్నై హైకోర్టు ఆదేశించింది.మనీ లాండరింగ్ కేసు గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈడీ అధికారులు సెంథిల్ బాలాజీని గత ఏడాది జూన్ 14న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్న ఆయన పలు మార్లు బెయిల్ కోసం అప్లయి చేశారు. తాజాగా సెంథిల్ బెయిల్‌పై సుప్రీం కోర్టు ఈడీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. -
మనిలాండరింగ్ కేసులో మాజీ మంత్రి.. ఈడీకి సుప్రీం కీలక ఆదేశాలు
మనీలాండరింగ్ కేసులో గత ఏడాది అరెస్టైన తమిళనాడు మాజీ మంత్రి వి.సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి స్పందన కోరింది. సెంథిల్ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 29లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈడీని ఆదేశించింది. అంతకుముందు సెంథిల్ బెయిల్ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనిలాండరింగ్ కేసులో బెయిలా ఫిబ్రవరి 28న సెంథిల్ బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఆ సమయంలో మనిలాండరింగ్ వంటి అసాధారణ కేసుల్లో బెయిల్ ఇవ్వడం తప్పుడు సంకేతాలు పంపుతుందని, అది ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొంది. అంతేకాదు, పిటిషనర్ ఎనిమిది నెలలకు పైగా జైలు శిక్ష అనుభవించారని, అందువల్ల ఈ కేసును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ప్రత్యేక కోర్టును ఆదేశించడం సముచితంగా ఉంటుందని పేర్కొంది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా దీని ప్రకారం ఈ ఉత్తర్వుల కాపీ అందిన తేదీ నుంచి మూడు నెలల్లో కేసును పరిష్కరించాలని చెన్నై ప్రిన్సిపల్ స్పెషల్ కోర్టును కోరాలని ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రోజువారీగా విచారణ జరపాలని చెన్నై హైకోర్టు ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసు గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈడీ అధికారులు సెంథిల్ బాలాజీని గత ఏడాది జూన్ 14న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్న ఆయన పలు మార్లు బెయిల్ కోసం అప్లయి చేశారు. తాజాగా సెంథిల్ బెయిల్‌పై సుప్రీం కోర్టు ఈడీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. -
22 కేజీల గంజాయి తిన్న ఎలుకలు.. తప్పించుకున్న స్మగ్లర్లు
చెన్నై: గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్టైన ఇద్దరి నుండి స్వాధీనం చేసుకున్న మొత్తం 22 కిలోల గంజాయిని ఎలుకలు తినేయడంతో సాక్ష్యాధారాలు లేని కారణంగా వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2022లో రాజగోపాల్, నాగేశ్వర రావు అనే ఇద్దరు వ్యక్తులు మారీనా బీచ్ సమీపంలో గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మరీనా పోలీసులు వీరి నుండి 22కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అందులోనుంచి 50 గ్రాములను మాత్రం పరీక్షల నిమిత్తం నార్కోటిక్ విభాగానికి పంపించారు. మిగిలిన మొత్తాన్ని వారి స్వాధీనంలోని ఉంచి నిందితులిద్దరినీ రిమాండుకు తరలించారు. ఈ కేసులో మరీనా పోలీసులు ఇప్పటికే ఛార్జిషీటు కూడా దాఖలు చేయగా అప్పటి నుంచి చెన్నై హైకోర్టులోని మాదకద్రవ్య నియంత్రణ విభగంలో న్యాయవిచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా మంగళవారం కోర్టు పోలీసులను సాక్ష్యం సేకరించిన గంజాయిని కోర్టుకు చూపించమని కోరగా ఆ మొత్తాన్ని ఎలుకలు ఖాళీ చేసేశాయని చెప్పారు. దీంతో విచారణ సమయంలో సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించని కారణంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు రాజగోపాల్, నాగేశ్వర రావులను చెన్నై కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఏసీ వార్డు కోసం రచ్చ.. కయ్యానికి దిగిన వియ్యంకులు -
జైభీమ్ వివాదం: హైకోర్డులో సూర్య దంపతులకు ఊరట
హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభిచింది. జై భీమ్ చిత్రంలోని పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు పటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. గురువారం(ఆగస్ట్ 11) ఈ కేసుపై విచారించిన మద్రాస్ న్యాయస్థానం ఈ పటిషన్‌ను రద్దు చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ సతీష్ కుమార్ ఈ కేసును కొట్టివేస్తున్నట్లు ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చారు. కాగా గతేడాది సూర్య నటించిన చిత్రం జై భీమ్. టూడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య కలిసి నిర్మించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చదవండి: 3,4 రోజుల వసూళ్లకే సంబరాలు చేసుకోవద్దు: తమ్మారెడ్డి భరద్వాజ అయితే కొన్ని సామాజిక వర్గాల మాత్రం ఈసినిమాను వ్యతిరేకించాయి. ముఖ్యంగా హిందూ వన్నియార్ల సామాజికవర్గానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి తమ మనోభావాలు దెబ్బతిసే విధంగా జై భీమ్ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ సైదాపేట కోర్టులో మొదట పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ జైభీమ్ మేకర్స్ చెన్నై హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇది రిటైర్డ్ అడ్వకేట్ చందు నిజ జీవితం ఆధారం తీసిన సినిమా అని, ఓ కేసులో ఆయన ఎలా పోరాడో ఉన్నది ఉన్నట్లు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. అంతేకాని ఎవరి మనోభవాలను దెబ్బతీయాలనేది తమ ఉద్ధేశం కాదంటూ సూర్య కోర్టుకు వివరణ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో నేడు ఈ పటిషన్‌పై విచారించిన చెన్నై హైకోర్టు ఈ కేసును రద్దు చేసింది. -
జై భీమ్ వివాదం.. సూర్యపై హైకోర్టు కీలక ఆదేశం
సూర్యపై ఎలాంటి కఠిన చర్యలు చేపట్టరాదని చెన్నై హైకోర్టు సోమవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. నటుడు సూర్య కథానాయకుడు నటించిన చిత్రం జై భీమ్. టూడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య కలిసి నిర్మించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకుడు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అయితే కొన్ని సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంది. ముఖ్యంగా హిందూ వన్నియార్ల సామాజిక వర్గం తమ మనోభావాలు దెబ్బతినే విధంగా జై భీమ్ చిత్రంలో సన్నివేశాలు చోటు చేసుకున్నాయంటూ సంతోష్ అనే వ్యక్తి స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: మహేష్‌బాబు సినిమానే చివరగా చూశా: కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయకుడు సూర్య, నిర్మాతల్లో ఒకరైన జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సూర్య తదితరులపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వెలచ్ఛేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ జైభీమ్ చిత్రం సూర్య తరపున చెన్నై హైకోర్టును కోరారు. ఈ కేసు సోమవారం విచారణకు రాగా.. న్యాయమూర్తి సతీష్ కుమార్ ఈనెల 21వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు సూర్యపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పోలీసులను ఆదేశించారు. -
‘దళపతి’ విజయ్ కేసును ముగించిన హైకోర్టు
సినీ హీరో విజయ్‌కి చెందిన కారు టాక్స్ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2019 జనవరి నాటికి ఎంట్రీ టాక్స్ చెల్లించకపోతే జరిమానా చెల్లించాల్సిందేనని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే నటుడు విజయ్ 2005లో రూ. 63 లక్షల ఖరీదైన కారును విదేశం నుంచి దిగుమతి చేసుకున్నారు. అయితే దీనికి రాష్ట్ర ఎంట్రీ టాక్స్‌ను చెల్లించకపోవడంతో వివాదానికి దారి తీసింది. వాణిజ్యశాఖాదికారులు ఎంట్రీ టాక్స్‌ను చెల్లించాలంటూ విజయ్‌కు నోటీసులు జారీ చేశారు. దీనిపై విజయ్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. చదవండి: వాళ్లు ఉన్నంత కాలం సినీ పరిశ్రమ మునిగిపోతుంది: డైరెక్టర్ సాధారణంగా కారును దిగుమతి చేసుకున్న నెల నుంచి రెండు శాతం జరిమానా మాత్రమే చెల్లించాల్సి ఉండగా తన కారుకు 40 శాతం జరిమానా విధించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై పలు మార్లు కోర్టులో విచారణ జరిగింది. కాగా గురువారం న్యాయమూర్తి సురేశ్ కుమార్ తుది తీర్పును వెల్లడించారు. అందులో విదేశం నుంచి దిగుమతి చేసుకున్న కారుకు 2019 జనవరిలోగా విజయ్ పూర్తిగా ఎంట్రీ టాక్స్ చెల్లించినట్లయితే జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని, చెల్లించని ఎడల జరిమానా చెల్లించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేస్తూ.. కేసు విచారణను ముగించారు. -
ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు హైకోర్టులో ఊరట
నటుడు ధనుష్, ఆయన మాజీ భార్య (వీరు ఇటీవలే విడిపోయారు) ఐశ్వర్య రజనీకాంత్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళ్లితే నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన చిత్రం వేలై ఇల్లా పట్టాదారి. వండర్ బార్ సంస్థ 2014లో నిర్మించిన చిత్రం ఇది. ఈ సంస్థకు నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్టర్లుగా ఉన్నారు. కాగా, ఈ చిత్రంలో పొగ తాగే సన్నివేశాలు చోటుచేసుకున్నాయని, ఆ సన్నివేశాల్లో చట్టపరమైన హెచ్చరిక నిబంధనలు పాటించనందున, నటుడు ధనుష్, నిర్మాతలపైన తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు పొగాకు నియంత్రణ ప్రజా సమితి తరఫున 2014 జూలైలో ప్రభుత్వానికి ఫిర్యా దు చేశారు. చదవండి: బడా వ్యాపారవేత్త నన్ను జీతం తీసుకునే భార్యగా ఉండమన్నాడు: హీరోయిన్ దీంతో ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్.. ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్‌పై స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 15వ తేదీన కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసును కొట్టివేయాలని, తమను సైదాపేట కోర్టులో హాజరవ్వాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ చెన్నై హైకోర్టులో విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఎన్. సతీష్ కుమార్ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ సైదాపేట న్యాయస్థానంలో హాజరయ్యే అంశంపై స్టే విధిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేశారు. -
ఆదాయ పన్ను కేసులో నటి గౌతమికి ఊరట
సాక్షి, చెన్నై: ఆదాయపు పన్ను చెల్లింపు వ్యవహారంలో సినీ నటి గౌతమికి మద్రాసు హైకోర్టులో గురువారం ఊరట లభించింది. ఈమె గతంలో శ్రీపెరంబదూరు సమీపంలో తన వ్యవసాయ పొలాన్ని విక్రయించారు. ఈ వ్యవహారంలో ఆదాయపు పన్ను చెల్లింపులు గందరగోళానికి దారి తీశాయి. దీంతో ఆమెకు చెందిన బ్యాంక్ ఖాతాలను ఐటీ వర్గాలు సీజ్ చేశాయి. దీనిని వ్యతిరేకిస్తూ గౌతమి హైకోర్టును ఆశ్రయించారు. ఆ స్థలాన్ని తాను రూ. 4 కోట్ల 10 లక్షలకు విక్రయించానని, అయితే, ఐటీ వర్గాలు రూ. 11 కోట్ల 11 లక్షలు విచారించినట్టు పేర్కొంటున్నాయని కోర్టుకు వివరించాయి. ఆరు బ్యాంక్‌ల్లోని తన ఖాతాల్ని సీజ్ చేశారని, వీటిని మళ్లీ ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని విన్నవించారు. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ ఆ స్థలం విక్రయాన్ని ప్రస్తావిస్తూ, మూలధనంలో 25 శాతం చెల్లిస్తే, సీజ్ చేసిన ఖాతాల్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని ఐటీ వర్గాల్ని ఆదేశించారు. -
Juscti For Manikandan: సంచలన ఆదేశం.. రీపోస్ట్ మార్టం చేయాల్సిందే!
Juscti For Manikandan: పోలీసు కస్టోడియల్ మరణాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. 21ఏళ్ల విద్యార్థి ఎల్ మణికందన్ పోలీసు కస్టడీ నుంచి విడుదలైన మరుసటిరోజే మృతి చెందటం కలకలం రేపుతోంది. తన కుమారుడిది పోలీసు కస్టోడియల్ మరణమంటూ అతని తల్లి కోర్టును ఆశ్రయించింది. మంగళవారం మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ మణికందన్ మృతదేహానికి తిరిగి పోస్ట్ మార్టం చేయాలని ఆదేశించింది. వివరాలు.. ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఎల్ మణికందన్ తన స్నేహితుడితో బైక్ మీద వెళుతుండగా.. పరమకుడి-కీజాతొరోవల్ రోడ్డులో వెహికల్ చెకప్ చేస్తున్న పోలీసులు ఆపారు. అయితే వారి నుంచి తప్పించుకోవడానికి మణికందన్, అతని స్నేహితుడు ప్రయత్నించారు. కానీ, పోలీసులు వారిని పట్టుకొగా అతని స్నేహితుడు భయంతో పారిపోయాడు. దీంతో పోలీసులు మణికందన్‌ను స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతని తల్లి రామలక్ష్మీకి సమాచారం అందించగా.. మణికందన్‌ను తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు. అయితే మరుసటి రోజు ఉదయం మణికందన్ సృహలో లేకపోవడం గమనించిన తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మణికందన్ మృతిచెందాడు. మణికందన్‌కు పోస్ట్ మార్టం చేయించిన పోలీసులు.. తల్లిందండ్రులకు అప్పగించారు. అయితే తమ కొడుకు పోలీసులే స్టేషన్లో హింసించడం వల్ల మారణించాడని తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరుపుతామని పోలీసు అధికారలు చెప్పడంతో నిరసన విరమించారు. సోమవారం పోలీసులు పోలీసు స్టేషన్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. అతని శరీరానికి ఎటువంటి గాయం లేదని, పోలీసులు హింసించలేదని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. వాహన తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నామని, అతని(మణికందన్) స్నేహితుడు గంజాయి కేసుల్లో ఉన్నాడని తెలిపారు. పోలీసులు హింసించారని దానికారణంగా మణికందన్ తల్లిదండ్రులు కోర్టును అశ్రయించారు. పోలీసులు చాలా తక్కువ నిడివి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే విడుదల చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో మణికందన్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే మణికందన్ ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పోలీసు దౌర్జన్యం, కస్టోడియల్ మరణాలకు వ్యతిరేకంగా ‘జై భీం’ మూవీ విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. -
నటుడి బంధువు ఆత్మహత్య.. ప్రముఖ నిర్మాతకు ఊరట
సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజాకు చెన్నై హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళ్తే 2017లో నటుడు శశికుమార్ బంధువు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో కోలీవుడ్‌లో కలకలానికి దారి తీసింది. ఆ వ్యవహారంపై సినీ ఫైనాన్షియర్ బోద్రాను నిర్మాత జ్ఞానవేల్ రాజా విమర్శిస్తూ ఆరోపణలు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఫైనాన్షియర్ బోద్రా చెన్నై హైకోర్టులో జ్ఞానవేల్ రాజా తనపై నిరాధార ఆరోపణలు చేసినట్లు పిటీషన్ దాఖలు చేశారు. పలుమార్లు విచారణ అనంతరం కేసుకు సంబంధించి న్యాయమూర్తి దండపాణి బుధవారం ఫైనాన్షియర్ బోధ నిర్మాత జ్ఞానవేల్ రాజాపై వేసిన పిటీషన్లో తగిన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: Deepika Padukone: అటు ద్రౌపదిగా, ఇటు సీతగా! -
విశాల్‌కు చెన్నై హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, చెన్నై : నటుడు, నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్‌కు సోమవారం చెన్నై హైకోర్టులో చుక్కెదురైంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల గత నెల 23వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు చాలా వివాదాలు, వ్యతిరేకతల మధ్య జరిగాయి. కాగా ఈ ఎన్నికల్లో విశాల్ పాండవర్ జట్టు, కే.భాగ్యరాజ్ స్వామి శంకరదాస్ జట్టు ఢీకొన్నాయి. అసలు ఎన్నికలు జరుగుతాయా? అన్న సందేహం మధ్య చెన్నై హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు జరిగాయి. ఓట్ల లెక్కింపు కుదరదని ఉత్తర్యులు అయితే ఎన్నికల నిర్వహణకు అనుమతించిన న్యాయస్థానం ఓట్ల లెక్కింపునకు మాత్రం అనుమతివ్వలేదు. న్యాయస్థానం ఆదేశాలు వచ్చే వరకూ సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు జరపరాదని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఓట్ల లెక్కింపునకు అనుమతివ్వాల్సిందిగా ప్రస్తుత సంఘ కార్యదర్శి, పాండవర్ జట్టు తరఫున కార్యదర్శి పదవికి పోటీ చేసిన విశాల్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం కోర్టులో విచారణకు వచ్చింది. విచారించిన న్యాయమూర్తి ఆదికేశవులు సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపును ఇప్పుడు జరపడం కుదరదంటూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో సోమవారం నడిగర్‌సంఘం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని, విజయం ఎవరిని వరిస్తుందో? అని చిత్ర పరిశ్రమలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కోర్టు ఆదేశాలతో ఎన్నికల ఫలితాల కోసం మరింత నిరీక్షణ తప్పదని తెలిసింది. -
హైకోర్టును ఆశ్రయించిన కమల్
సాక్షి, చెన్నై : హిందూ ఉగ్రవాది వ్యాఖ్యలు చేసినందుకు తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ నేత కమల్ హాసన్ మద్రాస్ హైకోర్టు మధురై బ్రాంచ్‌ను ఆశ్రయించారు. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే స్వతంత్ర భారత్‌లో తొలి హిందూ ఉగ్రవాది అని అరవకురుచ్చిలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్‌పై ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో కేసు నమోదవగా, అరవకురుచ్చి పోలీస్స్టేషన్లోనూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనపై కేసులను కొట్టివేయాలని కోరుతూ తన అప్పీల్‌పై తక్షణ విచారణ చేపట్టాలని కమల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌ను వెకేషన్ బెంచ్ విచారణకు చేపట్టలేదని న్యాయమూర్తి కమల్ వినతిని తోసిపుచ్చారు. మరోవైపు కమల్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ బుధవారం పిటిషన్ దాఖలు చేయగా కమల్ వ్యాఖ్యలు తమ కోర్టు పరిధిలో చేయనందున పిటిషన్‌ను స్వీకరించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. -
హైకోర్టును ఆశ్రయించిన హీరో విశాల్
సాక్షి, చెన్నై : నిర్మాతల మండలికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించడాన్ని వ్యతిరేకిస్తూ మండలి అధ్యక్షుడు విశాల్ సోమవారం చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాతల మండలిలో అవకతవకలు జరిగాయని, కార్యవర్గం నిబంధనల ప్రకారం ఏ విషయంలోనూ నడుచుకోలేదన్న ఆరోపణల నేపథ్యంలో... ప్రభుత్వం నిర్మాతల మండలిని తన చేతుల్లోకి తీసుకుని ఎన్.శేఖర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాతల మండలి ప్రత్యేక అధికారిని నియమించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి పూర్తి అయ్యిందని, మండలి ఆదాయ, వ్యయ వివరాలను సభ్యుల ముందు ప్రవేశ పెట్టి వారి ఆమోదం పొందడానికి మే 1వ తేదీన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నామని పిటిషన్లో పేర్కొన్నారు. సమావేశంలోనే తదుపరి ఎన్నకల తేదీ గురించి ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మండలికి ప్రత్యేక అధికారిగా ఎన్.శేఖర్‌ను నియమించడం సరైన నిర్ణయం కాదన్నారు. ఇది చట్ట విరుద్ధం... నిర్మాతల మండలిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అలాంటప్పుడు ప్రత్యేక అధికారిని నియమించడం చట్ట విరోధం పిటిషన్లో అని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలనీ, ప్రతేక అధికారి నియామకంపై నిషేధం విధించాలనీ కోరారు. అదే విధంగా ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాలని కోరారు. అందుకు సమ్మతించిన న్యాయమూర్తి ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరపనున్నట్లు తెలిపారు. -
ఇళయరాజాపై హైకోర్టులో కేసు
పెరంబూరు(చెన్నై): సంగీత జ్ఞాని ఇళయరాజాకు వ్యతిరేకంగా చిత్ర నిర్మాతలు చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు. సంగీత దర్శకుడు ఇళయరాజా తన పాటలను అనుమతి లేకుండా ఏ వేదికపైనా పాడరాదని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు, గత ఐదేళ్లుగా తన పాటలకు రాయల్టీని వసూలు చేస్తున్నారు. ఈ విధానానికి చెక్‌పెట్టేలా ‘పులి’ చిత్ర నిర్మాత పీటీ సెల్వకుమార్, అన్బుసెల్వన్, జపజోన్స్, మీరాకధిరవన్, మణికంఠన్, చంద్రశేఖర్ తదితర నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పీటీ సెల్వకుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాను సంగీతాన్ని అందించిన పాటలపై తనకే హక్కంటూ వాటిపై ఇళయరాజానే రాయల్టీ పొందడం చట్ట విరుద్ధమన్నారు. పాటల రాయల్టీలో చిత్ర నిర్మాతకు కనీసం 50 శాతం చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ పిటిషన్ వేశామన్నారు. -
హీరోకు హైకోర్టు హెచ్చరిక
ఒక చిత్ర నిర్మాణ సంస్థ నుంచి తీసుకున్న అడ్వాన్స్ చెల్లించే విషయంలో కోలీవుడ్ స్టార్ నటుడు శింబు కు హైకోర్టులో గట్టి దెబ్బ తగిలింది. సదరు సంస్థ నుంచి తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా రూ.85 లక్షలు చెల్లించాలని, లేని పక్షంలో ఇంటిని జప్తు చేయాల్సి ఉంటుందని శనివారం చెన్నై హైకోర్టు హెచ్చరించింది. వివరాల్లోకి వెళ్లితే.. సంచలన నటుడు శింబు ఫ్యాషన్ అనే నూతన నిర్మాణ సంస్థలో అరసన్ చిత్రంలో నటించడానికి 2013లో రూ.50 లక్షలు అడ్వాన్స్ పుచ్చుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆ సంస్థలో చిత్రం చేయకపోవడంతో ఫ్యాషన్ సంస్థ అధినేతలు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం నటుడు శింబు అడ్వాన్స్‌గా తీసుకున్న రూ.50 లక్షలకు వడ్డీతో కలిపి మొత్తం రూ.85లక్షలను నాలుగు వారాల్లోగా ఫ్యాషన్ చిత్ర నిర్మాణ సంస్థకు తిరిగి చెల్లించాలని, లేని పక్షంలో శింబు కారు, సెల్‌ఫోన్, ఇతర వస్తువులతో సహా ఇంటిని జప్తు చేయాల్సి ఉంటుందని శనివారం విచారణానంతరం హెచ్చరించింది. కోర్టులో శింబు తరఫున ఫ్యాషన్ సంస్థ అనుకున్న సమయంలో చిత్రం చేయలేదని వివరణ ఇచ్చినా, నాలుగు సంవత్సరాలుగా చిత్రం చేయకపోవడానికి కోర్టు తప్పు పట్టింది. -
లతా రజనీకాంత్ రుణం చెల్లించాల్సిందే
సాక్షి సినిమా:కొచ్చాడయాన్ చిత్రం కోసం తీసుకున్న రుణాన్ని జూలై 3వతేదీ లోగా లతా రజనీకాంత్ చెల్లించాల్సిందేనని చెన్నై హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. ఈ కేసు విషయమై ఇంతకు ముందే హైకోర్టు కొచ్చాడయాన్ చిత్రం కోసం బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ నుంచి లతా రజనీకాంత్, ఆమెకు సంబంధిత మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ రుణం రూ.6.20 కోట్లలను చెల్లించాలని గత ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. అందులో ఈ కేసుకు లతారజనీకాంత్‌కు ఎలాంటి సంబంధం లేదని, కొచ్చాడయాన్ చిత్రానికి సంబంధించిన ఈ కేసులో యాడ్‌బ్యూరో సంస్థకు చెల్లించాల్సిన రూ.10 కోట్లలో ఇప్పటికే రూ.9.20కోట్లు తిరిగి చెల్లించినట్లు, మిగిలిన రూ.80 లక్షలను త్వరలోనే చెల్లిస్తామని పేర్కొన్నారు. పిటిషన్ కొట్టివేత.. పిటిషన్‌ను సోమవారం విచారణకు రాగా హైకోర్టు మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ పిటిషన్‌ను కొట్టివేసింది. గతంలో ఆదేశించినట్లుగా జూలై నెల 3లోగా లతారజనీకాంత్ గాని, మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ గాని యాడ్ బ్యూరో సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. -
హీరో సూర్యపై కేసు కొట్టివేత
తమిళసినిమా: నటుడు సూర్య, శరత్‌కుమార్‌లతో పాటు మరో 8మంది నటీనటులపై ఊటీ కోర్టులో నమోదైన కేసును బుధవారం చెన్నై హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2009లో ఓ సంతాప కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సూర్య, శరత్‌కుమార్, సత్యరాజ్, వివేక్, అరుణ్‌విజయ్, దర్శకుడు చేరన్, నటి శ్రీప్రియ వీరంతా తమ గురించి తప్పుగా రాశారంటూ విలేకరులను, వారి కుటుంబ సభ్యులను దూషించారు. దీనిపై నీలగిరికి చెందిన మరియకుసై అనే విలేకరి ఊటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు 8మందిని కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే వారు కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. దీంతో సూర్య, శరత్‌కుమార్ బృందం చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ముందు హైకోర్టు నటులపై అరెస్ట్ వారెంట్‌ను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బుధవారం ఈ కేసు విచారణకు రాగా న్యాయమూర్తి ఎంవీ మురళీధరన్ ఇరువర్గాల వాదనలు విన్న తరువాత నటీనటులపై కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. -
సామరస్యంగా పరిష్కరించుకోండి
పెరంబూర్: నటి రంభ, ఆమె భర్త ఇంద్రకుమార్ తమ సమస్యలను సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని చెన్నై హైకోర్టు సూచించింది. వివరాలు.. నటి రంభ కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను ప్రేమించి 2010లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం కెనడాలో కాపురం పెట్టిన ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రంభకు ఇంద్రకుమార్‌కు మధ్య మనస్పర్థలు తలెత్తడంలో రంభ తన ఇద్దరు పిల్లలను తీసుకుని చెన్నైకి తిరిగొచ్చేశారు. కాగా 2016లో భర్తతో తనను కలపాలని కోరుతూ చెన్నై హైకోర్టు, కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో పిల్లల విద్య, సంరక్షణ ఖర్చుల కోసం నెలకు రూ.2.5 లక్షలు చెల్లించేలా ఆదేశించాలని పేర్కొన్నారు. కాగా ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. నటి రంభ తన ఇద్దరు పిల్లలతో కోర్టుకు హాజరయ్యారు. అదే విధంగా ఆమె భర్త ఇంద్రకుమార్ కూడా కోర్టుకు వచ్చారు. దీంతో ఇది కుటుంబ సమస్య కాబట్టి రంభను ఆమె భర్తను ఒక ప్రత్యేక గదిలో ఉంచి సామరస్య చర్చల ద్వారా పరిష్కరించుకునేలా ఒక న్యాయవాదిని నియమించారు. కాగా తదుపరి విచారణలో తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. -
విశాల్ ఎన్నికల్లో పోటీ చేస్తాడా?
చెన్నై: నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్‌కు తమిళ నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. తమిళ నిర్మాతల మండలి కార్యవర్గంపై నిరాధార ఆరోపణలు చేశారంటూ నటుడు విశాల్‌ను మండలి నుంచి తాత్కాలికంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో తనపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ నటుడు విశాల్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాధించిన నిర్మాతల మండలి తరఫు న్యాయవాది విశాల్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తే ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసే విషయం గురించి నిర్మాతల మండలి చర్చిస్తుందని పేర్కొన్నారు. నటుడు విశాల్ గత 4వ తేదీన నిర్మాతల మండలి గురించి తన వ్యాఖ్యలు వ్యక్తిగతం అని, అవి ఎవరినైనా బాధించినట్లయితే విచారం వ్యక్తం చేస్తున్నట్లు కోర్టుకు తెలియజేశారు. కాగా ఈ కేసు శుక్రవారం మరోసారి కోర్టులో విచారణకు వచ్చింది. నిర్మాతల మండలి తరఫు న్యాయవాది తన వాదనను వినిపిస్తూ విశాల్‌పై నిషేధం ఎత్తివేసేందుకు మండలి నిరాకరించిందన్నారు. ఆయనను మండలి తాత్కాలికంగా బహిష్కరించినా విశాల్ ఆరోపణలు చేస్తూనే ఉండడం వల్ల నిషే«ధాన్ని కొనసాగించాలని, ఆయన విచారాన్ని తిరస్కరిస్తున్నట్లు మండలి తీర్మానంలో పేర్కొందని కోర్టుకు వివరించారు. న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా పిబ్రవరి 5న జరగనున్న తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో తమ జట్టు పోటీ చేస్తుందని ఇప్పటికే వెల్లడించడమే గాకుండా అధ్యక్ష పదవికి నటి కుష్బూ పేరును కూడా ప్రకటించిన విశాల్‌కు ఇది షాక్ ఇచ్చే విషయమే. నిర్మాతల మండలి ఆయనపై బహిష్కరణను ఎత్తివేసినట్టయితే ఆయన రానున్న ఎన్నికల్లో తనకూ ఏదో ఒక ప్రధాన పదవికి పోటీ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడా అర్హత ఆయనకు లేదు. ఎందుకంటే ఈ నెల 8వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. మరి ఇలాంటి పరిణామాల్లో నటుడు విశాల్ తదుపరి చర్య ఏమిటన్నది వేచి చూడాల్సిందే. -
పోర్‌గళత్తిల్ ఒరు పూ చిత్రానికి హైకోర్టు షాక్
పోర్‌గళత్తిల్ ఒరు పూ చిత్రానికి చెన్నై హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ చిత్ర విడుదలపై నిషేధం విధిస్తూ తీర్పును వెల్లడి ంచింది. శ్రీలంక సైన్యానికి, ఎల్టీటీఈకి జరిగిన తుది పోరులో అనేక మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ యుద్ధంలో ఇసైప్రియ అనే ఒక పత్రికా విలేకరిని సైనికులు అత్యాచారం చేసి క్రూరంగా చంపేశారు. ఆ సంఘటన ప్రధాన ఇతివృత్తంగా తమిళంలో పోర్‌గళత్తిల్ ఒరు పూ పేరుతో చిత్రం తెరకెక్కింది. కె.గణేశ్ దర్శకత్వంలో ఏసీ.గురునాథ్ సెల్లసామి నిర్మించిన ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్టు సభ్యులు నిరాకరించారు. దీంతో చిత్ర దర్శక నిర్మాతలు రివైజింగ్ కమిటీకి వెళ్లారు. అక్కడా చిత్రంపై పెద్ద చర్చే జరిగింది. అయితే రివైజింగ్ కమిటీ పోర్ గళత్తిల్ ఒరు పూ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. అయినా పట్టు విడవకుండా చిత్ర దర్శక నిర్మాతలు చెన్నై హైకోర్టుకు వెళ్లారు. మరో పక్క ఇసైప్రియ తల్లి టి.వేదరంజని, అక్క ధర్మిణి వాహజన్ పోర్ గళత్తిల్ ఒరు పూ చిత్రం విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి శివజ్ఞానం సమక్షంలో విచారణకు వచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తి చిత్రంలో క్రూరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయనీ, ఈ చిత్రాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లడానికి అనుమతించలేమని తెలుపుతూ చిత్ర విడుదలపై నిషేధం విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. అయితే హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తామని చిత్ర దర్శక, నిర్మాతలు, వారి తరఫు న్యాయవాది పేర్కొనడం గమనార్హం. -
ఆక్రోశం
సాక్షి ప్రతినిధి, చెన్నైః కొన్నాళ్లుగా శాంతియుతంగా సాగుతున్న లాయర్ల ఆందోళన సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. న్యాయవాదుల చట్టంలో చెన్నై హైకోర్టు కొన్ని సవరణలు చేసింది. ఈ ఉత్తర్వులు తమిళనాడు గె జిట్లో కూడా ప్రచురితమయ్యాయి. చట్టంలో చేసిన సవరణలను ఉపసంహరించాలని కోరుతూ న్యాయవాదులు రెండు నెలలుగా పలురకాల ఆందోళనలు సాగిస్తున్నారు. ఈనెల 22వ తేదీన న్యాయవాద సంఘాలతో ఐదుగురితో కూడిన న్యాయమూర్తుల బృందం చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈనెల 29వ తేదీ నాటికి చర్చలను వాయిదావేశారు. ఇదిలా ఉండగా, కోర్టు కార్యక్రమాలను స్తంభింపజేస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్న న్యాయవాదు ల జాబితాను పంపాల్సిందిగా అఖిల భారత బార్ కౌన్సిల్ చెన్నై హైకోర్టు బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. అలాగే జాబితాలో ఉన్న 126 మంది న్యాయవాదులను సస్పెండ్ చేస్తున్నట్లు అఖిల భారత బార్ కౌన్సిల్ ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. రెచ్చిపోయిన న్యాయవాదులు న్యాయవాదుల చట్టంలో చేసిన సవరణలను ఉపసంహరించక పోగా 126 మంది సస్పెండ్ కావడంతో న్యాయవాదులు సోమవారం మ రింతగా రెచ్చిపోయారు. సస్పెండ్ ఉత్తర్వులు అందిన నేపథ్యంలో చెన్నై హైకోర్టును ముట్టడించాలని ఆదివారం పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఉద యం నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో న్యాయవాదులు చేరుకోవడం ప్రారంభించారు. హైకోర్టుకు దారితీసే మార్గాల ను పోలీసులు ముందు జాగ్రత్తగా బారికేడ్లు అడ్డుపెట్టి మూసివేశారు. దీంతో అక్కడికి సమీపంలో ప్ర భుత్వ దంత వైద్యకళాశాల, రాజా అన్నామలై మన్రం వద్ద న్యాయవాదుల గుమికూడారు. న్యాయవాదులు జొరపడకుండా హైకోర్టు పరిసరాలను సుమారు 2 వేలమంది పోలీసులు మొహరించి బందోబస్తు నిర్వహించారు. హైకోర్టులోని ఏడు ప్రవేశద్వారాల వద్ద పోలీసులు నిలబడ్డారు. న్యాయవాదులు ఆందోళన కోసం సిద్ధం చేసుకున్న వేదికపైకి సస్పెండైన 126 మంది న్యాయవాదులు ఎక్కి తమను తాము పరిచయం చేసుకున్నారు. ఉదయం 12 గంటల సమయానికి నాలుగువేల మందికి పైగా న్యాయవాదులు హైకోర్టువైపునకు ఊరేగింపుగా దూసుకువచ్చారు. బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లే ప్రయత్నంలో న్యాయవాదుల, పోలీసుల మధ్య తోపులాట సాగింది. ఈ సమయంలో కొంద రు న్యాయవాదులు పోలీసులపైకి వాటర్ బాటిళ్లు విసిరేయగా, ఒక న్యాయవాది ఆత్మాహుతి యత్నం చే య డంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనలో పాల్గొన్న లాయర్లు ‘న్యాయమూర్తులు’ అనే అక్షరాలు కలిగిన ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి తగులబెట్టారు. ప్రధాన న్యాయమూర్తి ఇంటిని కూడా ముట్టడించే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో వారు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే సుమారు 20 మంది సాయుధ పోలీసులను న్యాయమూర్తుల క్వార్టర్లోని ప్రధాన న్యాయమూర్తి నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. స్తంభించిన ఉత్తర చెన్నై న్యాయవాదుల ఆందోళన కారణంగా పెద్దఎత్తున పోలీసులు మొహరింపు, బారికేడ్లు పెట్టడం, కొడిమర రోడ్డు మీదుగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలతో ఉత్తర చెన్నై దాదాపుగా స్తంభించి పోయింది. ఉద్రిక్త పరిస్థితులను ముందుగానే ఊహించిన ఆయా ప్రాం తాల వ్యాపారులు ముందుగానే దుకాణాలను మూసివేశారు. కొన్ని రోడ్ల వద్ద అప్పటికప్పుడు ట్రాఫిక్ మళ్లించడం వల్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హైకోర్టుకే బెదిరింపులాః ప్రధాన న్యాయమూర్తి ఎస్కే కౌల్ న్యాయవాద పట్టా పుచ్చుకున్న వారు హైకోర్టుకే బెదిరింపులకు పాల్పడడం శోచనీయమని ప్రధాన న్యాయమూర్తి సంజ య్ కిషన్ కౌల్ అన్నారు. న్యాయవాదులు తమ అసంతృప్తిని మరో కోణంలో చాటుకోవడంలో తమకు అభ్యంతరం లేదని, అయితే హైకోర్టు ప్రాంగణంలోనే శాంతి భద్రతల సమస్యలను సృష్టించేందుకు సిద్ధం కావడంతో పోలీసు బందోబస్తు తప్పలేదని అన్నారు. న్యాయవాదులు చర్చలకు ముందుకు రావాలని కోరారు. -
హైకోర్టులో లాయర్‌పై కొడుకు కత్తితో దాడి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై హైకోర్టులో న్యాయవాది మణిమారన్పై కన్న కొడుకే కత్తితో దాడి చేశాడు. హైకోర్టు ఆవరణలో భారీ భద్రతను తప్పించుకుని నిందితుడు కత్తితో కోర్టులోకి ప్రవేశించాడు. న్యాయవాదులు, సిబ్బంది, క్లయింట్లు చూస్తుండగానే తండ్రిపై దాడి చేసి కత్తితో పొడిచాడు. ఈ ఘటనతో కోర్టులో ఉన్నవారు షాకయ్యారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా మణిమారన్ కు, ఆయన కొడుకుకు మధ్య విబేధాలున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
అమ్మకు చుక్కెదురు!
చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి కేసులు బనాయించాలంటే ముందుగా తమ నుంచి అనుమతిని పొందాలన్న తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. తమిళనాడులో పని చేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినట్లయితే, సదరు ఆరోపణలపై కేసు నమోదు చేసే ముందు తమిళనాడు విజి లెన్స్ కమిషనర్ నుంచి అనుమతి పొందాలని 1988లో తమిళనాడు ప్రభుత్వం ఒక చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టానికి అభ్యంతరం తెలుపుతూ న్యాయవాది పుహళేంది మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్)ను దాఖలు చేశారు.‘కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వస్తే పోలీసులు కేసు నమోదు చేయవచ్చు, అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చిన సందర్భంలో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని మాత్రమే తగిన చర్యలు చేపట్టాలని చెప్పడం సరికాదు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల పట్ల పక్షపాత వైఖరిని చాటుతోంది. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలి, అలాగే ఉన్నతాధికారులపై సైతం వెంటనే కేసు నమోదు చేసేలా ఉత్తర్వులు జారీచేయాలి’ అంటూ పిల్ ద్వారా కోర్టును కోరారు. ఈ పిటిషన్ విచారణకు రాగా, ప్రభుత్వ సిబ్బంది, అధికారులు ఎవరిపై అవినీతి ఆరోపణలు వచ్చినా ప్రభుత్వ అనుమతి పొందేలా గత ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన కొత్త చట్టాన్ని తీసుకువచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ కొత్త చట్టాన్ని నిరసిస్తూ న్యాయవాది పుహళేంది మరో పిల్‌ను దాఖలు చేశారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకునే ముందు ప్రభుత్వ అనుమతి పొందాలన్న నిబంధన చట్ట విరుద్ధం కావడంతో గత ఏడాది తీసుకువచ్చిన కొత్త చట్టాని కొట్టివేస్తూ మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ తీర్పుచెప్పారు. గత ఏడాది తెచ్చిన చట్టాన్ని తమిళనాడు ప్రభుత్వమే రద్దు చేసి ఉండాల్సింది, అయితే చివరకు కోర్టు వరకు వచ్చి తీర్పు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాఖ్యానించారు. -
మదన్‌ను కోర్టులో హాజరుపరచండి
చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం తమిళసినిమా: వేందర్ మూవీస్ మదన్ ఆచూకీ కనిపెట్టి అతన్ని కోర్టులో హాజరుపరచాలని చెన్నై హైకోర్టు నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. మదన్ ఇటీవల ఐదు పేజీల లేఖను మీడియాకు విడుదల చేసి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. అందులో తాను కాశీలో తనువు చాలిస్తానని పేర్కొన్నారు. ఆయన అదృశ్యం అయినప్పటి నుంచి లేఖలోని అంశాలు ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీటు కోసం ఫీజులు చెల్లించిన వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మరోపక్క మదన్ భార్యలిద్దరూ తమ భర్త ఆచూకీ కనుగొని తమకు అప్పగించాల్సిందిగా పోలీస్ క మిషనర్‌ను కోరారు. దీంతో పోలీసులు మదన్ కోసం గాలింపు చర్యలు తీవ్రం చేశారు. తాజాగా మదన్ తల్లి చెన్నై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చే సింది. తన కొడుకు గత నెల 29న ఇల్లు విడిచి వెళ్లిపోయారని, అప్పటి నుంచి తన గురించి ఎవరికీ తెలియలేదని ఆమె పిటిషన్లో పేర్కొంది. తన కొడుకు ఆచూకీ కనుగొని తమకు అప్పగించాల్సిందిగా పోలీస్ క మిషనర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు తన కొడుకు ఆచూకి కనుగొనలేదని పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి తన కొడుకు ఆచూకి కనిపెట్టి తమకు అప్పజెప్పాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని ఆమె కోరారు. ఈ పిటిషన్ సోమవారం న్యాయమూర్తులు నాగముత్తు,భారతీదాసన్ల సమక్షంలో విచారణకు వచ్చింది. పిటీషన్‌ను విచారించిన న్యాయమూర్తులు ఈ నెల 8వ తేదీ లోపు మదన్ ఆచూకీ కనుగొని కోర్టులో హాజరు పరచాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా దీనిపై పీఎంకే నేత రామదాస్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో సీటు కోసం డబ్బు చెల్లించిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఆయన అందులో పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని విశ్వవిద్యాలయం గుర్తింపును రద్దు చేయాలని, వెంటనే ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని అందులో రామదాస్ విడుదల చేశారు. దీంతో మదన్ అదృశ్యం వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.