లతారజనీకాంత్
సాక్షి సినిమా:కొచ్చాడయాన్ చిత్రం కోసం తీసుకున్న రుణాన్ని జూలై 3వతేదీ లోగా లతా రజనీకాంత్ చెల్లించాల్సిందేనని చెన్నై హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. ఈ కేసు విషయమై ఇంతకు ముందే హైకోర్టు కొచ్చాడయాన్ చిత్రం కోసం బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ నుంచి లతా రజనీకాంత్, ఆమెకు సంబంధిత మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ రుణం రూ.6.20 కోట్లలను చెల్లించాలని గత ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. అందులో ఈ కేసుకు లతారజనీకాంత్‌కు ఎలాంటి సంబంధం లేదని, కొచ్చాడయాన్ చిత్రానికి సంబంధించిన ఈ కేసులో యాడ్‌బ్యూరో సంస్థకు చెల్లించాల్సిన రూ.10 కోట్లలో ఇప్పటికే రూ.9.20కోట్లు తిరిగి చెల్లించినట్లు, మిగిలిన రూ.80 లక్షలను త్వరలోనే చెల్లిస్తామని పేర్కొన్నారు.
పిటిషన్ కొట్టివేత..
పిటిషన్‌ను సోమవారం విచారణకు రాగా హైకోర్టు మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ పిటిషన్‌ను కొట్టివేసింది. గతంలో ఆదేశించినట్లుగా జూలై నెల 3లోగా లతారజనీకాంత్ గాని, మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్‌టెయిన్‌మెంట్ గాని యాడ్ బ్యూరో సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment