Latha Rajinikanth
-
సూపర్ స్టార్ భార్యకు బెయిల్ మంజూరు..ఆ సినిమా కేసులోనే!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్‌కు బెయిల్ మంజూరైంది. ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన కొచ్చాడియాన్ సినిమా ప్రొడక్షన్ టైంలో ఓ యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి తీసుకున్న ఋణం తిరిగి ఇవ్వకపోవడంపై లతా రజినీకాంత్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెకు తాజాగా బెంగళూరు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే లభించింది. అయితే డిసెంబర్ 1, 2023న కోర్టు బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో ముందస్తుగా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అసలేం జరిగిందంటే.. కొచ్చాడయాన్ సినిమాను భారీ ఖర్చుతో పెట్టి తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా నిర్మించిన మీడియా వన్ ఎంటర్టైన్మెంట్లో పనిచేస్తున్న మురళి అనే వ్యక్తికి.. చెన్నైకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ. 6.2 కోట్ల రుణం ఇచ్చింది. మురళికి ఇచ్చిన రుణానికి గ్యారెంటర్‌గా లతా రజనీకాంత్ సంతకం చేశారు. మురళి అప్పు తీర్చకపోవడంతో హామీదారుగా ఉన్న లత ఈ కేసులో చిక్కుకుపోయారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు... రూ.1 లక్ష వ్యక్తిగత పూచీకత్తు, మరో రూ.25 వేల నగదు కోర్టుకు చెల్లించడంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. -
సూపర్‌స్టార్ ఇంట దసరా వేడుకలు.. కానీ రజనీయే మిస్సింగ్!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో మంగళవారం నాడు నవరాత్రి వేడుకలు ఘనంగా సాగాయి. పండగ చివరి రోజున రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక పోయిస్ గార్డెన్‌లోని తమ ఇంటిలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొనడం విశేషం. ముఖ్యంగా తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం, ఆయన కుటుంబ సభ్యులు, మాజీ ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, సీనియర్ నటి లత, నటి మీనా, నటుడు విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్ సహా పలువురు ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా నటుడు రజనీకాంత్ తన 170వ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న కారణంగా ఈ వేడుకలకు హాజరుకాలేదు. ఆయన కూతుర్లు ఐశ్వర్య, సౌందర్యలు ఇంట జరిగిన వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా లతా రజనీకాంత్ అతిథులందరికీ కానుకలు అందించారు. చదవండి: వెంకటేశ్ కూతురి నిశ్చితార్థం.. చిరంజీవి, మహేశ్ బాబు హాజరు -
రజనీకాంత్‌కు అనిరుధ్ ఏమవుతాడో తెలుసా.. ? జైలర్ సక్సెస్ సీక్రెట్ ఇదే
రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గలేదు.. ఈ మూవీలో 'హుకూం' సాంగ్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇందులో రజనీకాంత్ స్టైల్‌కు యువ సంచలనం అనిరుధ్ అందించిన మ్యూజిక్, బీజీఎం నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. రజనీ కోసం ఆయన ఇచ్చిన బీజీఎంతో ప్రేక్షకులకు గూస్బమ్స్ తెప్పించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో అనిరుధ్ ఇచ్చిన స్టేజ్ ఫర్మామెన్స్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. (ఇదీ చదవండి: పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్) స్టేజీపై మ్యూజిక్కు తగ్గట్టుగా ఆతను ఊగిపోతూ పాడుతుంటే ఆడియన్స్‌ను మరో ట్రాన్స్‌లోకి వెళ్తారు. అంతలా రజనీ కోసం పర్ఫామెన్స్ ఇచ్చాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్‌డమ్‌ను వివరిస్తూ సాగే ఆ పాట సినీ అభిమానులను ఊపేస్తోంది. జైలర్ సినిమాతో అనిరుధ్ తమిళంలో నెంబర్ వన్ స్టార్ అయ్యాడు. 2012లో ధనుష్ త్రి సినిమా కోసం పాటను కంపోజ్ చేసినప్పుడు కేవలం 21 ఏళ్లు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దపు కాలం గడిచింది. తన కెరియర్లో ఎన్నో అద్బుతమైన పాటలను అందించాడు. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏఆర్ రెహమాన్‌ను మించిపోయాడని సినీ ట్రేడర్స్ తెలుపుతున్నాయి. రజనీకి కుమారుడు లేరనే సమస్య లేదు: విఘ్నేష్ జైలర్ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో అనిరుధ్- రజనీకాంత్ బంధం గురించి దర్శకుడు విఘ్నేష్ శివన్ (నయనతార భర్త) చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. 'మనం జీవితంలో కొన్ని అద్భుతమైన క్షణాల కోసం ఎదురుచూస్తాం. నేను తలైవా ముందు నిలబడిన ఈ క్షణం అలాంటిదే. జైలర్‌లో తండ్రీకొడుకుల అనుబంధంపై ఓ పాట రాశాను. దాని గురించి గుర్తుచేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. దానికి కారణం నేను ఇప్పుడు ఇద్దరు అబ్బాయిల తండ్రిని. భవిష్యత్తులో వాళ్లు పెద్దయ్యాక నేను రాసిన పాట రజనీ సినిమాలో ఉందని చెబుతాను. (ఇదీ చదవండి: అతను నా తమ్ముడు.. అవసరమైతే ఎన్నికల్లో ప్రచారం చేస్తా: విష్ణు) అలాగే, తలైవా గురించి నేను ఇంకో విషయం చెప్పాలి. రజనీ సార్ కోసం ఓ పాటను సిద్ధం చేసినప్పుడే తలైవా పట్ల అనిరుధ్‌లోని నిజాయతీ, ప్రేమ కనిపించాయి. రజనీ సర్కి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయనకు కొడుకు లేడనే సమస్య అనిరుధ్‌తో తీరిపోయింది. ఎందుకంటే తలైవా పట్ల అతనిలో విపరీతమైన ప్రేమను చూశాను. ఒకవేళ రజనీకి కొడుకు ఉంటే అనిరుద్- రజనీకాంత్ బంధాన్ని చూసి అసూయపడేవాడు.' అని విఘ్నేష్ శివన్ అన్నారు. (అనిరుధ్ ఫ్యామిలీ) రజనీ- అనిరుధ్ మధ్య ఉన్న బంధుత్వం ఇదే ఆడియో లాంచ్ ఫంక్షన్‌కి అనిరుధ్ వచ్చినప్పుడు సూపర్ స్టార్ రజనీ అతన్ని కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అనిరుధ్ తమిళ నటుడు రవి రాఘవేంద్ర కుమారుడు అనే సంగతి తెలిసిందే. ఆయన రజనీకాంత్‌కు చాలా దగ్గర బంధువు. తలైవా భార్య సతీమణి లతా రజనీకి మేనల్లుడు అవుతాడు. అందుకే రజనీకి అనిరుధ్ అంటే ప్రత్యేక అభిమానం. సుమారు 30 ఏళ్ల క్రితం రజనీ కాంత్ సినిమా షూటింగ్లో ఉండగా అనిరుధ్‌ను తీసుకుని లత వెళ్లారట. ఆ సమయంలో రజనీ-అనిరుధ్ ఫోటో దిగారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
Happy Birthday Rajinikanth: గమ్మత్తుగా లతా లవ్‌లో..
ఎన్న రాస్కెల్.. మైండ్ ఇంట్.. సూపర్‌స్టార్ క్రేజ్ ఒక్క తమిళనాడు.. పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రాలు.. సౌత్.. యావత్ దేశం మాత్రమే కాదు.. ప్రపంచంలోని కొన్ని దేశాలకు కూడా విస్తరించింది. ఏడు పదుల వయసులోనూ స్క్రీన్‌పై ఆయన స్టైలింగ్ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటూనే ఉంటోంది. ప్రతీ పుట్టినరోజుకి వయస్సు తగ్గిపోతుందేమో అనిపించేది.. తలైవా విషయంలోనే ఏమో!. రజనీకాంత్ స్టైల్‌కు ఉన్న ప్రత్యేకత అదే!. రజనీ పుట్టినరోజుకు.. కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. కానీ, రజనీకాంత్‌ది ప్రేమ వివాహమని.. అది చాలా గమ్మత్తుగా జరిగిందనేది మీకు తెలుసా?.. సినిమాల్లో రజనీ.. హీరోయిన్లతో ప్రేమ-పెళ్లి.. ఎంత విజీగా అయిపొగొట్టేస్తారో!. కానీ, రియల్ లైఫ్‌లో ఇష్టపడ్డ అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.. డెబ్భైవ దశకంలో బాలీవుడ్లో వచ్చిన గోల్ మాల్ చిత్రాన్ని.. తిల్లు మల్లు పేరుతో కోలీవుడ్‌లో రీమేక్ చేశారు దర్శక దిగ్గజం బాలచందర్. అందులో ఆయన ప్రియశిష్యుల్లో ఒకరైన రజనీ హీరో. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కి.. సూపర్ హిట్ అయ్యిందా చిత్రం. అయితే.. ఈ చిత్ర షూటింగ్ మధ్యలో ఓ కాలేజీ మ్యాగ్జైన్ ఇంటర్వ్యూ కోసం ఒకావిడ వచ్చారని.. రజనీతో ఆయన అసిస్టెంట్ చెప్పారు. అయితే షూటింగ్ హడావిడిలో ఉన్న రజనీ కాసేపటి దాకా ఆ విషయం పట్టించుకోలేదు. ఆపై ఆ విషయం గుర్తొచ్చి.. పక్కకి వెళ్లారు. ఆమె పేరు లతా రంగాచారి. ఆమెను చూడగానే రజనీ గుండెలో జుజుబి మొదలైంది. మాటల మధ్యలో ఆమెది బెంగళూర్ అని చెప్పటం.. రజనీ కూడా అక్కడ కండక్టర్‌గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆ మాటలు మరింత ముందుకు వెళ్లాయి. ఈ క్రమంలో ఇద్దరి ఆసక్తులు ఒక్కటేనని తేలింది. దీంతో అప్పటికే ఓ స్టార్ అయిన రజనీతో లత చనువుగా మాట్లాడేందుకు వీలైంది. ఆమెతో ఇంటర్వ్యూ కొనసాగుతున్న సమయంలోనే రజనీ మనసు.. మైండ్ రెండూ పని చేయకుండా పోయాయంట. ఆమెతో జీవితం పంచుకోవాలని డిసైడ్ అయిపోయి చివరకు ఆ క్షణంలో మరో ఆలోచన లేకుండా ఆమెకు ప్రపోజ్ చేశాడంట. దీంతో సూపర్ షాక్ తగిలిన ఆమె చిన్నగా నవ్వి.. తన తల్లిదండ్రులతో మాట్లాడమని రజనీకి చెప్పి వెళ్లిపోయిందట. కానీ, తలైవా చాలా చిలిపి. ఆ పని వెంటనే చేయలేదు. ఆమెతో స్నేహం కొసాగిస్తూనే అదను కోసం ఎదురు చూడసాగాడు. ఈ మధ్యలో ఈ విషయాన్ని తన స్నేహితుడు, నటుడు వైజీ మహేంద్రన్‌కు చెప్పాడంట. ఆయన.. లత సోదరి సుధ భర్త కావటం విశేషం. దీంతో తన పని తేలిక అవుతుందని రజనీ భావించారు. అదే సమయంలో.. ఆమె పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదోనన్న భయంతో రజనీ కొందరు సీనియర్ నటులను కూడా రంగంలోకి దింపాడంట. చివరకు.. మహేంద్రన్ దౌత్యంతో వాళ్ల ప్రేమ ఫలించింది. రజనీకి ఊరటనిస్తూ లతా పేరెంట్స్ వారి వివాహానికి ఓకే చెప్పారు. కానీ, ఈ విషయాన్ని రజనీకి చెప్పకుండా వాళ్లు కొంత కాలం టెన్షన్‌తో ఎదురు చూసేలా చేశారట. లతా కూడా కొన్నిరోజులు ఆయనతో మాట్లాడకుండా ఏడ్పించిందట. దీంతో రజనీ ఎవరితో మాట్లాడకుండా కొన్నిరోజులపాటు డిప్రెషన్లోకి వెళ్లారు. చివరికి.. లత, మహేంద్రన్‌లు రజనీ ఇంటికి అసలు విషయం చెప్పడంతో ఆయన ఆశ్చర్యంతో ఆనందానికి లోనయ్యారట. అలా.. చివరకు ఏడాది తిరగక ముందే ఫిబ్రవరి 26, 1981 తిరుపతి వెంకన్న సమక్షంలో మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇది సూపర్‌స్టార్ గమ్మత్తు లవ్ కమ్ మ్యారేజ్ కహానీ!. -
47 ఏళ్ల సినీ ప్రస్థానం.. సూపర్ స్టార్‌కు భార్య స్వీట్ విషెస్
కోలీవుడ్‌లో రజనీకాంత్ దశాబ్దాలుగా సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఈ బిరుదు ఆయనకు మాత్రమే సొంతం. 1975లో దర్శకుడు కె.బాలచందర్ చిత్రం అపూర్వ రాగంగళ్ ద్వారా రజనీ కాంత్ నటుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంతో శివాజీ రావ్ గైక్వాడ్ రజనీకాంత్‌గా మారారు. ఆరంభంలో ప్రతినాయకుడి పాత్రలు పోషించిన రజనీకాంత్ ఆ తరువాత కథానాయకుడిగా మారి భారతీయ సినీ చరిత్ర పుటల్లో తన కంటూ ప్రత్యేక పేజీని రచించుకున్నారు. చదవండి: ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పటికీ రజనీకాంత్ చిత్రం వస్తుందంటే అభిమానుల్లో ఆనందహేళ మొదలవుతుంది. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిషు ఇలా పలు భాషల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్న రజనీకాంత్ నటుడుగా 47 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మధురక్షణాలను రజనీకాంత్ కుటుంబ సభ్యులు మంగళవారం ఇంటిలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. చదవండి: స్పెయిన్‌లో జెండా ఎగురవేసిన నయనతార ఆయన సతీమణి లతా రజనీకాంత్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఆ ఫొటోలను రజనీకాంత్ కూతురు సౌందర్య సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అందులో ఆమె పేర్కొంటూ “నాన్నా.. మాటల్లో వర్ణించలేని భావం మీరు. మీకు వీరాభిమానిని నేను. మీరు మా కుటుంబ సూపర్‌స్టార్’అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్‌లో నటిస్తున్నారు. ఇది ఆయనకు 169వ చిత్రం కావడం విశేషం. -
రజనీకాంత్ ఆరోగ్యంపై స్పందించిన భార్య లతా
-
రజనీకాంత్ ఆరోగ్యంపై స్పందించిన భార్య లతా
Latha Rajinikanth Reacts On Rajinikanth Health: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ఆయన భార్య లతా రజనీకాంత్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే రజనీ ఆసుపత్రిలో చేరారని, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. కాగా నిన్న సాయంత్రం రజినీకాంత్ చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఢిల్లీ నుంచి వచ్చిన రజినీకాంత్ గురువారం సాయంత్రం హుటాహుటిన రజినీ అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చదవండి: అభిమానులకు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ అజయ్‌భూపతి ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ -
లతా రజనీకాంత్‌కు హైకోర్టు నోటీసులు
చెన్నై: ఆశ్రమ్ పాఠశాల వ్యవహారంలో నటుడు రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శ్రీ రాఘవేంద్ర విద్యా సంఘం కార్యదర్శి లతా రజనీకాంత్ స్థానిక గిండి ప్రాంతంలో వెంకటేశ్వర్లు, పూర్ణ చంద్రరావులకు చెందిన స్థలాన్ని అద్దెకు తీసుకుని ఆశ్రమ్ పేరుతో పాఠశాలను నడుపుతున్నారు. అయితే రజనీకాంత్‌కు ఆశ్రమ్ స్థల సొంతదారులకు మధ్య అద్దె విషయంలో చాలా కాలంగా వివాదం జరుగుతోంది. 2018, ఆగస్టు నెలలో ఆశ్రమ్ స్థల సొంతదారులు, లతా రజనీకాంత్ మధ్య జరిగిన చర్చల అనంతరం ఒక నిర్ణయానికి వచ్చారు. చదవండి: నేను ఎంజీఆర్ రాజకీయ వారసుడ్ని: కమల్ 2020, ఏప్రిల్‌లో స్థలాన్ని ఖాళీ చేయడానికి లతా రజనీకాంత్ అంగీకరించారు. అయితే ఇప్పటికీ ఆశ్రమ్ పాఠశాలను అక్కడ నుంచి తొలగించకపోవడంతో ఆ స్థల సొంతదారులు తమకు లతా రజనీకాంత్ అద్దె బకాయి రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా, తమ స్థలంలో ఆశ్రమ్ పాఠశాలను ఖాళీ చేసేలా ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. చాలా కాలంగా విచారణలో వున్న కేసు మంగళవారం మరోసారి న్యాయమూర్తి సతీష్‌కుమార్ సమక్షంలో విచారణకు వచ్చింది. ఇరు తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి 2021 ఏప్రిల్ నెలలోగా ఆశ్రమ్ పాఠశాలలో అక్కడ నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అలా కాని పక్షంలో కోర్టు ధిక్కార కేసులో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తూ లతా రజనీకాంత్‌కు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా 2021–22 ఏడాదికి విద్యా విధానాన్ని కొనసాగించరాదని ఆదేశించారు. కరోనా వ్యాప్తి కారణంగా 2020 ఏప్రిల్ నెలలో ఆశ్రమ్ పాఠశాలను ఖాళీ చేయలేకపోయామని, అందుకు మరింత అవకాశం కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, తమ కోరికను పరిగణలోకి తీసుకున్న కోర్టు 2021 ఏప్రిల్ వరకు ఆశ్రమ్ పాఠశాల ఖాళీ చేయడానికి అవకాశం కల్పించిందని లతా రజనీకాంత్ వర్గం పేర్కొన్నారు. అంతేకాని ఆశ్రమ్ పాఠశాల స్థల సొంతదారులకు తాము బకాయి ఉన్నామన్నది వాస్తవం కాదని, క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తున్నామని వివరించారు. -
లతారజనీకాంత్ సంచలన వీడియో
తమిళనాడు, పెరంబూరు: నటుడు రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ అనాథ పిల్లల రక్షణ కోసం దయా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులోభాగంగా పీస్ ఆఫ్ చిల్డ్రన్స్ పేరుతో సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా ఆదివారం ఒక సంచలన విడియోను విడుదల చేశారు. అందులో ఒక స్త్రీ ఒక బాలికను చిత్ర వధ చేసి కాలితో తొక్కుతున్న దృశ్యం చోటు చేసుకుంది. కాగా ఆ వీడియోతో పాటు లతా రజనీకాంత్ ఒక విజ్ఞప్తి కూడా చేశారు. అందులో చిత్ర వధకు గురైన ఆ చిన్నారి గురించి తెలిసిన వారు తమకు తెలియజేయాలని ఒక ఫోన్ నంబరును కూడా పొందుపరిచారు. కాగా లతా రజనీకాంత్ విదుదల చేసిన ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. Peace for Children:let's come together and make a difference.Kindly request everyone to help track this atrocity been committed to a helpless child.Justice must be served and the guilty punished if anyone has any information please share with us at our toll free number18001208866 pic.twitter.com/QFtMsOAbcu — Latha Rajinikanth (@OfficialLathaRK) July 19, 2019 -
నల్ల తంబి
‘ఎందుకమ్మా నన్నింత నల్లగా కన్నావు’ అంటే ‘నిన్ను ఎర్రగా కని ఉంటే త్వరగా మాసిపోయేవాడివి కదా’ అంటుంది అమ్మ.‘ఎవరిని పట్టుకుని నలుపు అంటున్నావ్.. ఇది గ్యారంటీ కలర్’ అంటాడు శివాజీ వాళ్ల మామయ్య. రజనీకాంత్ నటించిన ‘శివాజీ’ సినిమాలో ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి. ఈ నల్ల ఆ నల్ల కాదు. తమిళంలో నల్ల అంటే మంచి అని. డిసెంబర్ 12 రజనీకాంత్ జన్మదినం సందర్భంగా ఆయన అన్నయ్య సత్యనారాయణ రావ్ ఈ తంబి గురించి ‘సాక్షి’తో పంచుకున్న నల్ల సంగతులు. ►రజనీకాంత్‌గారి బర్త్‌డే (డిసెంబర్ 12) సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకోవాలనిపించింది. అందుకే ఈ ఇంటర్వ్యూ... సత్యనారాయణ రావ్: చాలా సంతోషం. ►ఇప్పుడంటే రజనీగారి పుట్టిన రోజులు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఆయన ఫ్యాన్స్ అయితే ఓ పండుగలా చేస్తున్నారు. చిన్నప్పుడు ఆయన బర్త్‌డేలు ఎలా జరిగేవి? ఇంటివరకే పరిమితం అయ్యేది. మా అమ్మగారు ఉన్నంతవరకూ సింపుల్‌గా చేసేవారు. రజనీకి తొమ్మిదేళ్ల వయసప్పుడు మా అమ్మగారు చనిపోయారు. అనారోగ్యంతో ఆమె కన్నుమూశారు. అమ్మ చనిపోయిన ఏడాదికి నాకు పెళ్లయింది. అప్పటినుంచి మా ఆవిడే రజనీ బర్త్‌డేలు చేయడం మొదలుపెట్టింది. అది కూడా సింపుల్‌గానే. పాయసం, పూరి, వడ.. ఆయన బర్త్‌డే అంటే ఈ మూడూ చేసేది. మా దగ్గర ఆయన ఉన్నంతవరకూ ఇదే ఆనవాయితీ. ► జనరల్‌గా తమ్ముడి గురించి చెప్పేటప్పుడు ‘వాడు’ అంటుంటారు. మీరేమో ‘ఆయన’ అంటున్నారు. స్టార్ కాబట్టి అలా అనాల్సి వచ్చిందా? అదేం కాదు. మాకు ‘ఏరా.. పోరా’ అని పిలుచుకునే అలవాటు చిన్నప్పుడే లేదు. ‘ఎన్నప్పా.. వాప్పా.. పోప్పా’ (ఏమప్పా.. రాప్పా.. పోప్పా) అంటుంటాను. తను కూడా నన్ను అంతే. పిలుపులు గౌరవంగా ఉన్నప్పటికీ అవేవీ మా అనుబంధాన్ని దూరంగా ఉంచినట్లు కాదు. ►రజనీగారికి తోడబుట్టినవాళ్లు ఎంతమంది? ఒక అక్క, తన తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు, రజనీ నాలుగో ఆయన. మా అక్కకి పదహారేళ్ల వయసులోనే పెళ్లయింది. తమ్ముడు చనిపోయాడు. రజనీ, నేను కలిసి పెరిగింది ఎక్కువ. ► మీ ఇద్దరూ కలిసి సినిమాలకు వెళ్లేవారా? కథలు చెప్పుకునేవారా? బోల్డన్ని కథలు చెప్పుకునేవాళ్లం. ముఖ్యంగా రాజుల కథలు చదివేవాళ్లం కూడా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కథ, మహాభారతం చెప్పుకునేవాళ్లం. రజనీకి శివాజీ కథ అంటే ఇష్టం. ఇక సినిమాల గురించి చెప్పాలంటే.. రజనీ ఎక్కువగా తమిళ సినిమాలు, నేను కన్నడ సినిమాలు చూసేవాళ్లం. అందుకని దాదాపు విడివిడిగానే వెళ్లేవాళ్లం. రజనీకి ఎంజీఆర్, శివాజీ గణేశన్గార్ల సినిమాలంటే చాలా ఇష్టం. ► సినిమాల్లో శివాజీ, హిస్టరీలో ఛత్రపతి శివాజీ అంటే ఇష్టం అన్న మాట. రజనీగారి రియల్ నేమ్ కూడా శివాజీరావ్ గైక్వాడ్ కదా? అమ్మానాన్న పెట్టిన పేరు అదే. సినిమాల్లోకి వచ్చాక డైరెక్టర్ కె. బాలచందర్‌గారు పేరు మార్చా రు. ఆ పేరే స్థిరపడిపోయింది. ► చిన్న రజనీ అల్లరిపిల్లవాడేనా? (నవ్వేస్తూ) రుంబ కురుంబు (బాగా అల్లరి). అయితే ఫ్రెండ్స్‌తో బాగా గొడవలు పడటం లాంటివి ఉండేవి కాదు. ఎప్పుడైనా చిన్న చిన్న తగాదాలు ఆడటం, ఆ తర్వాత వెంటనే కలిసిపోవడం. రజనీకి ఫుట్‌బాల్, కబడ్డీ అంటే ఇష్టం. ► మరి ఆటల్లో తొండి చేయడం, ఓడిపోయినప్పుడు ఫీలవ్వడం లాంటివి? రజనీకి ఓటమి అనేది లేదు. ఎప్పుడూ విజయమే. ఆటల్లో ఫస్ట్. చదువులో కూడా బెస్టే. చిన్నప్పుడే మంచి భావాలు ఉండేవి. ఏదైనా అన్యాయం అనిపిస్తే వెంటనే ఎదురు తిరిగి అడగడం లాంటివి. ► ‘శివాజీ’ సినిమాలో నల్లగా ఉన్న రజనీ పాత్ర తెల్లబడటానికి ట్రై చేస్తుంది. ‘బాబా’ సినిమాలో ‘గ్యారంటీ కలర్’ అని ఓ పాటలో వస్తుంది. రజనీగారు ‘నల్ల పయ్యనే కదా’? (నవ్వేస్తూ) అవును. నల్ల పయ్యన్ (మంచి అబ్బాయి). రుంబ రుంబ నల్ల పయ్యన్ (చాలా చాలా మంచి అబ్బాయి). ► మీ అమ్మగారు చనిపోయాక రజనీగారు, మీ నాన్నగారు మీ కుటుంబంతోనే ఉండేవారా? తమ్ముడి స్కూల్ ఫీజులు మీరేమైనా కట్టేవారా? నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవారు. 55 ఏళ్లకు రిటైర్ అయ్యారు. 30 రూపాయలు పెన్షన్ వచ్చేది. ఆ తర్వాత 50, 100. 1985లో నాన్న చనిపోయారు. అప్పటికి ఆయనకు 150 రూపాయలు వచ్చేది. నాతోనే ఉండేవారు. రజనీ స్కూల్ ఫీజులు కట్టేవాడిని. నాకు తనని బాగా చదివించాలని ఉండేది. డాక్టర్ చేయాలని కోరిక. బాగా చదువుకుంటే సీట్ వస్తుంది.. డాక్టర్ అవ్వొచ్చు అనేవాడిని. అయితే డ్రామాల్లో నటించడం మొదలుపెట్టాక రజనీ మైండ్ డైవర్ట్ అయింది. ► మరి ఎంతదాకా చదువుకున్నారు? ప్లస్ టు వరకే. చిన్నప్పుడు రజనీని రామకృష్ణ మిషన్ వాళ్లు స్థాపించిన రామకృష్ణ మఠంలో చేర్పించాను. స్కూల్ అయిపోగానే మఠంకి వెళ్లేవాళ్లం. నేను ప్రార్థనలు చేసేవాడిని. రజనీ అయితే వేద మంత్రాలు నేర్చుకుని, అక్కడ సేవలు కూడా చేయడం జరిగింది. ఆ మఠంలో ఏడాదికి ఒకసారి డ్రామాలు వేసేవారు. ఆ డ్రామాల్లో ఉత్సాహంగా పాల్గొన్న రజనీకి అప్పుడే యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ మొదలైంది. రామకృష్ణ మఠంలో మాత్రమే కాకుండా విడిగా స్టేజ్ నాటకాల్లోనూ నటించడం స్టార్ట్ అయింది. దాంతో చదువు మీద ఆసక్తి పోయింది. ► మీరు మందలించలేదా? అలా ఏం లేదు కానీ కాలేజీకి వెళ్లకపోవడంతో ఖాళీగా ఉండటంవల్ల మాకు తెలిసిన ఆయన రజనీని కండక్టర్‌గా చేర్పించారు. ఆ జాబ్‌లో జాయిన్ అయినా ధ్యాస అంతా నాటకాల మీదే. ఫ్రెండ్స్‌తో కలిసి నాటకాలు వేయడం అలవాటైంది. అప్పుడు తన స్నేహితులు ‘నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. నువ్వు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అవకాశాలు వస్తాయి’ అన్నారు. దాంతో తనకి కూడా ఆసక్తి పెరిగి, మదరాసు వెళ్లడం జరిగింది. ► కండక్టర్ జాబ్ రిజైన్ చేసి, మదరాసు వెళతానంటే మీరేమన్నారు? నెల ఖర్చులు మీరే పంపించేవారా? కండక్టర్‌గా చేసింది రెండేళ్లే. రజనీ ఏం చేస్తానంటే దానికి ఓకే అనేవాడిని. మదరాసు వెళతానంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టాను. ఖర్చుల నిమిత్తం నెలకి రూ.500 పంపించేవాడిని. తన స్నేహితులు కూడా కొంచెం పంపించేవాళ్లు. రజనీకి పట్టుదల ఎక్కువ. పైగా ఇష్టంగా ఎంచుకున్నది కాబట్టి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో క్లాసులకు బాగా వెళ్లి, చివరికి బాలచందర్‌గారి దృష్టిలో పడటం జరిగింది. ► మీ తమ్ముడు సూపర్‌స్టార్ స్థాయికి చేరుకుంటారని ఊహించారా? చిన్నప్పుడు ఆటల్లోనే ఓటమి లేదని చెప్పాను కదా. పెద్ద స్థాయికి వెళ్లడం ఖాయం అనుకున్నాను. సినిమా అవకాశాలు రావడం, బిజీ అవ్వడం.. అంతా సాఫీగా జరిగినందుకు ఆనందంగా ఉంది. ఈ స్థాయికి చేరుకోవడానికి తన కృషి కారణం. ►రజనీగారి స్టైల్ ఆయన్ను మాస్‌కి దగ్గర చేసింది. ఆ నడక వేగం, మాట తీరు ఆకట్టుకున్నాయి. చిన్నప్పుడూ ఇంతేనా? అసలు స్లోగా నడవడం తనకు అలవాటు లేదు. చిన్నప్పుడూ అంతే. ఫాస్ట్‌గా నడవడం, ఫాస్ట్‌గా మాట్లాడటం. స్టైల్ అనేది తను స్క్రీన్ కోసం అలవాటు చేసుకున్నది కాదు. నేచురల్‌గా వచ్చింది. ► మీ కుటుంబం గురించి? మీకెంత మంది పిల్లలు? నా భార్య మూడు నెలల క్రితం చనిపోయింది. నాకు ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. కూతుళ్లిద్దరికీ పెళ్లయింది. కొడుకులు కూడా బాగా సెటిలయ్యారు. ► మీ పిల్లలు సెటిలవ్వడానికి వాళ్ల చిన్నాన్న సహాయం ఎంతవరకూ ఉంది? నా ఇద్దరి కూతుళ్ల పెళ్లిళ్లూ తన చేతుల మీదగానే జరిగాయి. కొడుకులను నేను చదివించుకున్నాను. మాకు కావాల్సిన సౌకర్యాలన్నీ నా తమ్ముడు సమకూర్చడంతో హ్యాపీగా ఉన్నాం. నేను బెంగళూరు కార్పొరేషన్లో సూపర్వైజర్గా చేసేవాడిని. రిటైర్ అయి పదిహేనేళ్లకుపైనే అయింది. పెన్షన్ వస్తోంది. ► రజనీగారికి పెళ్లయ్యాక ఆయన భార్య లతగారు, మీ ఆవిడ ఎలా ఉండేవారు? మీ కుటుంబాన్ని మీ తమ్ముడు చూసే విషయంలో లతగారికి ఏమైనా ఆక్షేపణ ఉండేదా? అలా ఏం లేదు. మా మరదలు, మా ఆవిడ ఇద్దరూ బాగుండేవాళ్లు. తమ్ముడు మదరాసులో సెటిలైనా నా కుటుంబంతో నేను బెంగళూరులోనే ఉండిపోయాను. మంచీ చెడుకి కలుసుకుంటాం. కష్టసుఖాలు చెప్పుకుంటాం. మా ఇంటి ఆడవాళ్ల వల్ల మాకెలాంటి మనస్పర్థలు రాలేదు. ► చిన్నప్పుడు ఎంతో ప్రేమగా పెంచిన వదిన మూడు నెలల క్రితం చనిపోయినప్పుడు రజనీగారు వచ్చారా? వచ్చి, తన వదిన అంతిమ సంస్కారాలన్నీ దగ్గరుండి చేయడం జరిగింది. ఇలా చెప్పొచ్చో లేదో కానీ అలాంటి తమ్ముడు దొరకడం నా పుణ్యం. ► మీ ‘స్టార్ బ్రదర్’కి మీరు ఫోన్ చేయాలంటే.. అందరిలా మేనేజర్ ద్వారానా? డైరెక్ట్‌గా చేస్తారా? లేదు. డైరెక్ట్‌గానే చేస్తాను. వీలున్నప్పుడల్లా మాట్లాడుకుంటాం. ఆరోగ్యం బాగుందా? పిల్లలందరూ బాగున్నారా? అని రజనీ ఫోన్ చేస్తే, తన క్షేమసమాచారాలు తెలుసుకోవడం కోసం నేను ఫోన్ చేస్తుంటాను. ► మీ తమ్ముడు పెద్ద స్టార్ కాబట్టి ఆయనతో సినిమా నిర్మించి క్యాష్ చేసుకోవాలని మీరు అనుకోలేదా? రజనీగారు మీకా సలహా ఇవ్వలేదా? నాకు జాబ్ ఉంది కాబట్టి నేనా విషయం గురించి ఆలోచించలేదు. తమ్ముడు కూడా ఎప్పుడూ నాతో ఆ మాట అనలేదు. అయినా తనతో ఎంతోమంది నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. ఒక సినిమా మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. మా తమ్ముడి సినిమా చాలామందికి ఉపాధి కల్పిస్తోంది కాబట్టి నాకు ఆనందమే. ► మీ పిల్లల్ని కూడా సినిమాల్లోకి తీసుకురావాలనుకోలేదా? నా రెండో కొడుకు పాండురంగకి సినిమాలంటే చాలా ఇష్టం. సినిమాల్లోకి రావాలని ఫుణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా చేరాడు. కానీ మా తమ్ముడికి అంతగా ఇష్టం లేదు. సినిమాల్లో ఏదీ శాశ్వతం కాదు.. జాబ్ చేసుకుని హ్యాపీగా ఉంటే బాగుంటుందనడంతో నాకూ అదే మంచిదనిపించింది. ఎందుకంటే ఇక్కడ పేరు రావాలంటే అదృష్టం ఉండాలి. కొంతమంది పేరు తెచ్చుకోగలిగారు. కొంతమంది ఏమీ లేకుండా పోయారు కూడా. అందుకే తమ్ముడి మాటే కరెక్ట్ అనిపించింది. దాంతో మా పాండురంగ కూడా సినిమా ఆలోచన వదులుకున్నాడు. ► రజనీగారి పిల్లలు ఐశ్వర్య, సౌందర్య మీతో ఎలా ఉంటారు? మీ పిల్లలు ఆయనతో? పెదనాన్న అని నాతో బాగుంటారు. రజనీ పిల్లలు బంగారాలు. నా పిల్లలు కూడా వాళ్ల చిన్నాన్నతో బాగుంటారు. ► మీ అక్కగారికి ఎంతమంది పిల్లలు? వాళ్లను కూడా రజనీగారు బాగా చూసుకుంటారా? అక్కకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఇప్పుడు అక్క లేదు. చనిపోయింది. ఆమె పిల్లలను కూడా రజనీ బాగానే చూసుకోవడంతో వాళ్ల జీవితాలూ బాగున్నాయి. ► రజనీగారు మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు బాబాజీ అంటూ హిమాలయాలకు వెళ్లడం లాంటివి చేసినప్పుడు కెరీర్ గురించి మీరేమైనా కంగారుపడ్డారా? లేదు. ఎందుకంటే చిన్నప్పుడే తనలో ఆధ్యాత్మికం ఉంది. రామకృష్ణ మఠం ప్రభావం తన మీద ఉంది. ఆధ్యాత్మిక బాటలో వెళుతూనే కెరీర్‌ని కూడా సమాంతరంగా తీసుకెళ్లడం తనకు తెలుసు. ఏదో వైరాగ్యం వచ్చినట్లు కుటుంబాన్ని, వృత్తిని వదిలేస్తే అప్పుడు కంగారు పడేవాడిని. ► చిన్నప్పుడు కూడా ఆయనలో ఆధ్యాత్మిక భావాలు ఉండేవన్నారు. గుడికి వెళ్లడంలాంటివి చేసేవారా? మా ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఓ శివుడి గుడి ఉండేది. ఆ పక్కనే రజనీ చదువుకున్న స్కూల్ ఉంది. స్కూల్‌కి వెళ్లేటప్పుడు శివుడి గుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. కండక్టర్ అయిన తర్వాత, హీరో అయ్యాక కూడా రజనీ ఆ గుడిని దర్శించుకున్న సందర్భాలు ఎక్కువే. ► ఆయనతో పాటు హిమాలయాలు రమ్మని మిమ్మల్నెప్పుడూ అడగలేదా? చాలాసార్లు పిలిస్తే నేనే వెళ్లలేదు. కాలి నడకన 40, 50 కిలోమీటర్లు కొండల్లో వెళ్లాలి. నాక్కొంచెం మోకాళ్ల నొప్పి. అందుకే నా వల్ల కాదన్నాను. ► మీకూ, ఆయనకు వయసు వ్యత్యాసం ఎంత? దాదాపు పదేళ్లు. నాకు 77 ఏళ్లు. ► రజనీగారి షూటింగ్ లొకేషన్‌కి మీరు వెళతారా? లేదు. రజనీకి పద్మ విభూషణ్ అవార్డు ఇస్తే ఢిల్లీ వెళ్లాను. అప్పుడు ‘2.ఓ’ షూటింగ్ అక్కడ జరుగుతోంది. అందుకని ఆ లొకేషన్‌కి వెళ్లాను. అప్పుడు రజనీకి ఆరోగ్యం అంత బాగాలేదు. ‘2.ఓ’ అంత బాగా వచ్చిందంటే దానికి కారణం డైరెక్టర్ శంకర్. తమ్ముడికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఓపికగా చేయించుకున్నారు. ► మీ తమ్ముడి ఆరోగ్యం విషయంలో మీరు కలవరపడుతుంటారా? అది ఉంటుంది. అప్పుడప్పుడూ హెల్త్ వైజ్‌గా డౌన్ అయితే ఆ దేవుడ్ని ప్రార్థిస్తుంటాను.. తన ఆరోగ్యం బాగుండాలని. ఎందుకంటే మనకన్నా చిన్నవాళ్లు అనారోగ్యంపాలైతే బాధగా ఉంటుంది. నాకు మోకాలి నొప్పి ఉన్నా ఆరోగ్యపరంగా వేరే సమస్యలు లేవు. అందుకే రజనీ అస్వస్థతకు గురైతే బాధపడిపోతుంటాను. అయినా ఆ మహావతార్ బాబాజీ అనుగ్రహం తన మీద ఉంది. అభిమానుల ప్రార్థనలు ఉంటాయి. అవే చల్లగా కాపాడతాయి. ► రజనీగారి సినిమాలు చూసి బాగుంటే బాగుందని లేదంటే లేదని నిక్కచ్చిగా చెబుతారా? నా తమ్ముడి సినిమా రిలీజ్ అవ్వగానే సాధ్యమైనంతవరకూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తా. బాగుంటే బాగుందని చెబుతాను. బాగా లేకపోతే ఆ విషయం కూడా చెప్పేస్తాను. ‘కాలా’ సినిమాని సరిగ్గా తీయలేదని చెప్పాను. హీరో క్యారెక్టర్‌కి, విలన్ క్యారెక్టర్‌కి మధ్య ఇంకా ఏదో ఉండాలనిపించిందని అన్నాను. ► ఆయన నటించిన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైనవి? ఐదు, పది సినిమాలని లెక్కేసి చెప్పలేను. తమ్ముడు యాక్ట్ చేసే సినిమాలన్నీ ఇష్టమే. తన యాక్టింగ్ చాలా బాగుంటుంది. ► ‘ఈ ఫంక్షన్ నాకు స్పెషల్. ఎందుకంటే మా అన్నయ్య వచ్చారు’ అని ‘2.ఓ’ ఫంక్షన్లో రజనీగారు అన్నారు.. ఆయన ఎందుకలా అన్నారు? నేను సాధారణంగా షూటింగ్ లొకేషన్స్‌కి వెళ్లనని చెప్పాను కదా. సినిమా ఫంక్షన్స్‌కి కూడా వెళ్లను. చెన్నైలో జరిగిన ‘2.ఓ’ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌కి నన్ను రమ్మని రజనీ పిలిస్తే వెళ్లాను. ఇంటి ఫంక్షన్స్‌కి తప్ప సినిమా ఫంక్షన్స్‌కి వెళ్లను కాబట్టి, తనకు ఆనందంగా ఉండి ఉంటుంది. ►ఫైనల్లీ.. రజనీగారికి రాజకీయాలు సూట్ అవుతాయంటారా? ఆ విషయం గురించి నేను చెప్పేకన్నా ఆయన చెబితేనే బాగుంటుంది. అయితే ఒక్కటి మాత్రం చెబుతాను. ఇప్పుడు రాజకీయ నాయకుల్లా మాత్రం పరిపాలించే అవకాశం లేదు. తన స్టైల్లో ఉంటుంది. – డి.జి. భవాని -
బాసు.. భలే పోజు!
ఇక్కడున్న ఫొటో చూశారుగా! సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సింగ్ చేస్తున్నట్లు పోజిచ్చారు. పక్కనున్నది ఎవరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె మణిపూర్‌కు చెందిన ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి మేరికోమ్ అని అందరికీ తెలుసు. కానీ వీళ్లు ఎందుకు కలిశారు? సినిమా కోసమా? అనే ఆలోచనలు తగవు. రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ చెన్నైలో ఓ ఈవెంట్‌ను నిర్వహించారట. ఆ ఈవెంట్‌కి వెళ్లిన మేరికోమ్ అలా రజనీకాంత్‌ను కలిశారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన రజనీ అభిమానులు బాసు.. భలే పోజు అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘2.ఓ’ సినిమా ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల అవుతుంది. అలాగే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట్టా’ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందని కోలీవుడ్ టాక్. -
లతా రజనీకాంత్‌కు సంబంధం లేదు
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ సతీమణి లతారజనీకాంత్‌కు మీడియా ఒన్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ డైరెక్టర్ తిరుమూర్తి మోసెస్ తెలిపారు. బెంగళూర్‌కు చెందిన యాడ్ బ్యూరో సంస్థ మీడియా ఒన్ గ్లోబల్ సం స్థ, ఆ సంస్థలో భాగస్వామ్యం కలిగిన లతా రజ నీకాంత్ల మధ్య కేసులు, కోర్టులు అంటూ చాలా రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో యాడ్‌బ్యూరో సంస్థ లతా రజనీకాంత్ పై సుప్రీంకోర్టును ఆశ్రయింంచడం, అత్యుత్తమ ధర్మాసనం ఆమె విచారణను ఎదుర్కోవలసిందేనని ఆదేశాలు జారీ చేయడం గురించి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. అం దులో కొంతకాలంగా లతా రజనీకాంత్ గురించి, తమ సంస్థ గురించి మీడియా అసత్య ప్రచారాలు చేస్తోందని పేర్కొన్నారు. నిజానికి కోచ్చడైయాన్ చిత్రానికి లతారజనీకాంత్‌కు, అదే విధంగా తమ సంస్థకు, ఆమెకు ఎలాంటి సంబంధం లేదన్నా రు. కోచ్చడైయాన్ చిత్రానికి సంబంధించిన రు ణం విషయం తమ సంస్థకు యాడ్‌బ్యూరో సంస్థ కు సంబంధించిందన్నారు. ఆ సంస్థ తమకు రూ. 20 కోట్ల రుణం ఇవ్వడానికి, అందుకుగానూ చి త్రం తమిళనాడు విడుదల హక్కులను తాము ఇవ్వడానికి ఒప్పందం జరిగిందన్నారు. అయితే యాడ్‌బ్యూరో సంస్థ రూ.10 కోట్లు మాత్రమే చెల్లించిందని, మిగిలిన మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో తమ చిత్ర విడుదల 6 నెలలు ఆలస్యమైందని తెలిపారు. దీంతో తాము యాడ్‌బ్యూరో నుంచి తీసుకున్న రూ.10 కోట్లలో రూ. 9.2 కోట్లు తిరిగి చెల్లించినట్లు తెలిపారు. అయితే యాడ్ బ్యూరో సంస్థ 2014 నవంబర్ 11న తమ సంస్థకు రాసిన లేఖలో ఒప్పందం మీరిన కారణంగా అసలు రూ.10 కోట్లతో వడ్డీ రూ. 4.30కోట్లు, మరో ఆరు నెలలు ఆలస్యం కావడంతో 80 శాతం వడ్డీ కలిపి చెల్లిం చాల్సిం దిగా పేర్కొందని తెలిపారు. -
లతా రజనీకాంత్‌కు సుప్రీం షాక్
సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కొచ్చాడయాన్ సినిమాకు సంబంధంచిన కర్నాటకలో నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేసేందుకు సుప్రీం నిరాకరించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కొచ్చాడయాన్ చిత్ర నిర్మాణం కోసం ఆ చిత్ర నిర్మాణ సంస్థ మీడియా ఒన్ గ్లోబల్ డైరెక్టర్లలో ఒకరైన లతా రజనీకాంత్ హామీ మేరకు ఆ సంస్థకు బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ రూ.10 కోట్లు అప్పుఇచ్చింది. అయితే మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ తీసుకున్న రుణంలో రూ.8.70 కోట్లనే యాడ్‌బ్యూరో సంస్థకు తిరిగి చెల్లించింది. ఇంకా మిగిలిన మొత్తాన్ని వడ్డీ సహా రూ.6.20 కోట్లు చెల్లించకపోవడంతో ఆ సంస్త సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
రజనీ కొచ్చడైయాన్ వివాదం ముగియలేదు!
తమిళసినిమా: కొచ్చడైయాన్ చిత్ర వ్యవహారం సుప్రీంకోర్టుకెళ్లడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొచ్చాడైయాన్ చిత్ర నిర్మాణం కోసం ఆ చిత్ర నిర్మాణ సంస్థ మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ డైరెక్టర్లలో ఒకరైన రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ హామీ మేరకు ఆ సంస్థకు బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ రూ.10 కోట్లు అప్పుఇచ్చింది. అయితే మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ తీసుకున్న రుణంలో రూ.8.70 కోట్లనే యాడ్‌బ్యూరో సంస్థకు తిరిగి చెల్లించింది. ఇంకా మిగిలిన మొత్తాన్ని వడ్డీ సహా రూ.6.20 కోట్లు చెల్లించకపోవడంతో ఆ సంస్త సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు యాడ్‌బ్యూరో సంస్థకు రూ.6.20 కోట్లను మీడియా ఒన్ గ్లోబల్ సంస్థగానీ, లతా రజనీకాంత్ గానీ చెల్లించాల్సిందేనని గత ఏప్రిల్‌లోనే ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు జూలై 3వ తేదీ వరకూ గడువు ఇస్తూ ఆ రోజుకు విచారణను వాయిదా వేశారు. అయితే జూలై 3న ఈ కేసు విచారణకు రాగా యాడ్ బ్యూరో సంస్థకు ఎందుకు రుణం చెల్లించలేదని సుప్రీంకోర్టు లతా రజనీకాంత్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఎప్పుడు చెల్లిస్తారో ఈ నెల 10వ తేదీలోపు కోర్టుకు తెలియజేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పత్రికలు వక్రీకరించాయి సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడ్డ కొన్ని రోజుల తరువాత ఈ వ్యవహారంపై రజనీకాంత్ రెండో కూతురు, కొచ్చడైయాన్ చిత్ర దర్శకురాలు సౌందర్య స్పందించారు.ఆమె శుక్రవారం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అందులో సుప్రీంకోర్టు ఆదేశాలను పత్రికలు వక్రీకరించాయ ని, పూర్తి సమాచారాన్ని ప్రచురించలేదని పేర్కొన్నారు. మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ గురించి, అందులో లతారజనీకాంత్ బాధ్యత ఏమిటన్నదానికంటే ఆమె తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకోకుండా, పిటిషన్‌దారుడు దాఖలు చేసిన పిటిషన్ గురించి పూర్తిగా విచారించాల్సి ఉన్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నట్లు తెలిపా రు. మీడియా ఒన్ గ్లోబల్ సంస్థలో లతారజనీకాంత్‌కు బాధ్యతలు లేవని, అందువల్ల గత ఏప్రిల్ 16న న్యాయస్థానం ఆదేశాలను అమలుపరచడం కూడదని పేర్కొందన్నారు. మీడియా ఒన్ గ్లోబల్ సంస్థలో లతా రజనీకాంత్ బాధ్యత ఎంత అన్న విషయం కంటే అసలు కేసును పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉందని అందుకు ఈ నెల 10 తేదీ వరకూ కేసు విచారణను వాయిదా వేసినట్లు సౌందర్య రజనీకాంత్ తెలిపారు. -
సూపర్‌స్టార్ భార్యకు సుప్రీం కోర్టు మందలింపు
సాక్షి, న్యూఢిల్లీ : కొచ్చాడియాన్ చిత్ర నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని చెల్లించకపోగా, విచారణ ఎదుర్కోకుండా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారంటూ లతా రజనీకాంత్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసే వాళ్లంటే మాకు అస్సలు ఇష్టం ఉండదు. మీరు తప్పకుండా కోర్టుకు హాజరుకావాల్సిందే. తప్పేమీ లేకపోతే నిర్దోషిగా తేలతారు కదా. ఇప్పుడైనా విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే మంచిది’ అంటూ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం చురకలు అంటించింది. వివరాలు.... సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో యానిమేషన్ చిత్రం ‘కొచ్చాడియాన్’ తెరకెక్కిన విషయం తెలిసిందే. 2014లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ చిత్ర నిర్మాణం కోసం లతా రజనీకాంత్‌కు చెందిన మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ... బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ నుంచి రూ.6.20 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది. అయితే రుణం చెల్లించకుండా తమను ఇబ్బంది పెడుతున్నారంటూ యాడ్‌బ్యూరో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు లతా రజనీకాంత్.. జూలై 3వ తేదీ లోపు సంబంధిత సంస్థకు రుణాన్ని చెల్లించాల్సిందేనని గత ఫిబ్రవరిలో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం 12 వారాల గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. కానీ ఇంతవరకు రుణం చెల్లించకపోవడంతో లతా రజనీకాంత్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా గతంలో... ఈ కేసుతో లతా రజనీకాంత్‌కు ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఆమె హామీదారుగా మాత్రమే ఉన్నారని.. యాడ్‌బ్యూరో సంస్థకు చెల్లించాల్సిన రుణాన్ని త్వరలోనే చెల్లిస్తామని మీడియా వన్ గ్లోబల్ సంస్థ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు... జూలై 3వ తేదీలోగా లతా రజనీకాంత్ గాని, మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ గాని యాడ్ బ్యూరో సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని ఆదేశించింది. -
రాజ్ ఠాక్రేతో సూపర్ స్టార్ భార్య భేటీ
ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతో, సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లత భేటీ అయ్యారు. సోమవారం ముంబై కృష్ణ కుంజ్‌లోని రాజ్ ఠాక్రే నివాసానికి వెళ్లిన లత ఠాక్రేతో పాటు ఆయన సతీమణి షర్మిలా ఠాక్రేతో సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను రాజ్ ఠాక్రే ట్విటర్ ద్వారా వెల్లడించారు. రజనీ రాజకీయ ఆరంగేట్రం నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో వీరు తాజా రాజకీయ అంశాలతో పాటు, సినీ, సామాజిక అంశాలను చర్చించినట్టుగా రాజ్ ఠాక్రే పీఆర్ టీమ్ తెలిపింది. గతేడాది డిసెంబర్లో రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపిన రజనీ.. రానున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో 234 నియోజక వర్గాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రజనీ ఇప్పటివరకు తన పార్టీ పేరు మాత్రం వెల్లడించలేదు. -
లతా రజనీకాంత్ రుణం చెల్లించాల్సిందే
సాక్షి సినిమా:కొచ్చాడయాన్ చిత్రం కోసం తీసుకున్న రుణాన్ని జూలై 3వతేదీ లోగా లతా రజనీకాంత్ చెల్లించాల్సిందేనని చెన్నై హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. ఈ కేసు విషయమై ఇంతకు ముందే హైకోర్టు కొచ్చాడయాన్ చిత్రం కోసం బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ నుంచి లతా రజనీకాంత్, ఆమెకు సంబంధిత మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ రుణం రూ.6.20 కోట్లలను చెల్లించాలని గత ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. అందులో ఈ కేసుకు లతారజనీకాంత్‌కు ఎలాంటి సంబంధం లేదని, కొచ్చాడయాన్ చిత్రానికి సంబంధించిన ఈ కేసులో యాడ్‌బ్యూరో సంస్థకు చెల్లించాల్సిన రూ.10 కోట్లలో ఇప్పటికే రూ.9.20కోట్లు తిరిగి చెల్లించినట్లు, మిగిలిన రూ.80 లక్షలను త్వరలోనే చెల్లిస్తామని పేర్కొన్నారు. పిటిషన్ కొట్టివేత.. పిటిషన్‌ను సోమవారం విచారణకు రాగా హైకోర్టు మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ పిటిషన్‌ను కొట్టివేసింది. గతంలో ఆదేశించినట్లుగా జూలై నెల 3లోగా లతారజనీకాంత్ గాని, మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టెయిన్మెంట్ గాని యాడ్ బ్యూరో సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. -
రజనీ భార్యకు షాక్
రజనీకాంత్ హీరోగా రూపొందిన యానిమేషన్ మూవీ ‘కొచ్చాడయాన్’ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాల కోసం నిర్మాణ సంస్థ మీడియా వన్‌కు యాడ్ బ్యూరో కంపెనీ పది కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఆ సమయంలో రజనీ భార్య లతా రజనీకాంత్ హామీ సంతకం చేశారు. ఈ రుణానికి సంబంధించి కొంత మొత్తాన్ని వెంటనే చెల్లించిన చిత్ర యూనిట్ మిగతా మొత్తాన్ని ఇంతవరకు చెల్లించలేదు. ఎప్పుడు చెల్లిస్తారన్న విషయంపై కొచ్చాడయాన్ టీం నుంచి స్పందన రాకపోవటంతో యాడ్ బ్యూరో కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ వివాదంపై విచారణ జరిపిన ధర్మాసనం షూరిటీగా ఉన్న లతా రజనీకాంత్‌ను పన్నెండు వారాల్లోగా 6.2 కోట్ల రూపాయలను వడ్డీతో సహా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన యానిమేషన్ మూవీ కొచ్చాడయాన్లో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే, సీనియర్ హీరోయిన్ శోభనలు హీరోయిన్లుగా కనిపించారు. -
నాన్నా.. రజనీకీ ఓ లవ్ స్టోరీ ఉంది
సాక్షి, చెన్నై : సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్.. తలైవాగా తంబీలతోపాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన పుట్టినరోజు నేడు. 67వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆయనకు సబంధించి కొత్తగా చెప్పుకోవాటానికి ఏముంటుంది చెప్పండి. ప్రతీ పుట్టినరోజుకి ఆయన వయస్సు తగ్గిపోతుందేమో అనిపిస్తోంది. ఇక లత రజనీకాంత్‌తో ఆయనది ప్రేమ వివాహమని.. అది ఎంత గమ్మత్తుగా జరిగిందో ఇప్పుడు చూద్దాం. తొలిచూపులోనే... అది 1980. తిల్లు మల్లు చిత్ర షూటింగ్లో సూపర్ స్టార్ పాల్గొంటున్నాడు. 70వ దశకంలో బాలీవుడ్లో వచ్చిన గోల్ మాల్ చిత్రానికి ఇది రీమేక్. పూర్తి హస్యభరితంగా ఆ చిత్రం ఉంటుంది. షూటింగ్ మధ్యలో ఓ కాలేజీ మ్యాగ్జైన్ ఇంటర్వ్యూ కోసం ఒకామె వచ్చారని ఆయన అసిస్టెంట్ చెప్పారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న రజనీ ఇంటర్వ్యూ కోసం పక్కకి వెళ్లారు. ఆయన్ని ఇంటర్వ్యూ చేయబోయేది ఎవరో కాదు.. లతా రంగాచారి. అప్పుడే ఆ మరుక్షణమే ఆమెకు చూడగానే రజనీ గుండెలో జుజుబి మొదలైంది. మాటల మధ్యలో ఆమెది బెంగళూర్ అని చెప్పటం.. రజనీ కూడా అక్కడ కండక్టర్‌గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆ మాటలు మరింత ముందుకు వెళ్లాయి. ఈ క్రమంలో ఇద్దరి ఆసక్తులు ఒక్కటేనని తేలింది. దీంతో అప్పటికే ఓ స్టార్ అయిన రజనీతో లత చనువుగా మాట్లాడేందుకు వీలైంది. అప్పుడే రజనీ డిసైడ్ అయ్యాడంట... ఆమెతో ఇంటర్వ్యూ కొనసాగుతున్న సమయంలోనే రజనీ మనసు.. మైండ్ రెండూ పని చేయకుండా పోయాయంట. ఆమెతో జీవితం పంచుకోవాలని డిసైడ్ అయిపోయి చివరకు ఆ క్షణంలో ఆమెకు ప్రపోజ్ చేశాడంట. దీంతో సూపర్ షాక్ తగిలిన ఆమె చిన్నగా నవ్వి తన తల్లిదండ్రులతో మాట్లాడమని రజనీకి చెప్పింది. అయితే రజనీ ఆ పని వెంటనే చేయలేదు. ఆమెతో స్నేహం కొసాగిస్తూనే అదను కోసం ఎదురు చూడసాగాడు. ఈ మధ్యలో ఈ విషయాన్ని తన స్నేహితుడు, నటుడు వైజీ మహేంద్రన్‌కు చెప్పాడంట. ఆయన లత సోదరి సుధ భర్త కావటం విశేషం. ఆ సమయంలో ఆమె పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదోనన్న భయంతో రజనీ కొందరు సీనియర్ నటులను కూడా రంగంలోకి దింపాడంట. చివరకు రజనీకి ఊరటనిస్తూ లతా పేరెంట్స్ వారి వివాహానికి ఓకే చెప్పారు. కానీ, ఈ విషయాన్ని రజనీకి చెప్పకుండా వాళ్లు కొంత కాలం ఏడ్పించారంట. చివరకు ఏడాది తిరగక ముందే ఫిబ్రవరి 26, 1981 తిరుపతి వెంకన్న సమక్షంలో మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ఇద్దరూ ఒక్కటయ్యారు. వీరికి ఐశ్వర్య, సౌందర్య అనే పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. -
లతా రజనీకాంత్‌కు హైకోర్టులో చుక్కెదురు
చెన్నై : దుకాణం అద్దె పెంపును వ్యతిరేకిస్తూ లతా రజనీకాంత్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నిరాకరణకు గురైంది. నటుడు రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ తరఫున మోహన్ మేనన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈ విధంగా తెలిపారు. లతా రజనీకాంత్‌కు ఆళ్వార్‌పేటలో కార్పొరేషన్ కేటాయించిన దుకాణం ఉందని, ఇందులో ట్రావెల్స్ సంస్థను నడుపుతున్నట్లు తెలిపారు. ఈ దుకాణానికి గత జూన్ వరకు రూ.3,702 మాత్రమే అద్దె వసూలు చేస్తూ వచ్చారని, ఇలాఉండగా గత జూన్ 23వ తేదీ దుకాణం అద్దెను రూ.21,160గా చెన్నై కార్పొరేషన్ పెంచినట్లు తెలిపారు. ఇదివరకే పాతనోట్ల రద్దు ప్రకటించడం, జీఎస్టీ వంటి సమస్యలతో ట్రావెల్స్ వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితిలో చెన్నై కార్పొరేషన్ అద్దెను పెంచడం తమకు భారంగా మారిందని, దీనిపై తాము కార్పొరేషన్‌కు విన్నవించుకున్నా, దీన్ని పరిశీలించలేదని తెలిపారు. అందువల్ల అద్దె పెంచుతూ కార్పొరేషన్ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి వైద్యనాథన్ సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. ఆ సమయంలో నగర కార్పొరేషన్ తరఫున హాజరైన న్యాయవాది టీసీ గోపాలకృష్ణన్ వాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వ జీవో 92ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు తోసిపుచ్చినట్లు వాదించారు. ఇరు తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి, లతా రజనీకాంత్ తరఫున దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఉత్తర్వులిచ్చారు. -
ఆయన రాజకీయాల్లోకి వస్తే మార్పు తథ్యం
సాక్షి, చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఆయన సతీమణి లతా రజనీకాంత్ స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మార్పు తథ్యం అని ఆమె అభిప్రాయపడ్డారు. లతా రజనీకాంత్ శ్రీ దయా ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చెన్నై మైలాపూర్‌లోని రష్యన్ కల్చరల్ హాలులో మంగళవారం శ్రీ దయా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను వివరిస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె ఫౌండేషన్ సేవలను వివరించారు. పలు ఎన్జీఓ సంస్థలతో కలిసి ఈ సంస్థ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని లతా రజనీకాంత్ తెలిపారు. స్థానిక వాల్టక్స్ రోడ్డులో జీవించే కుటుంబాలను దత్తత తీసుకుందని తెలిపారు. ఈ సందర్భంగా రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ తన భర్త రజనీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామని చెప్పారు. ఆయన త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మంచి జరగుతుందని, అందుకు పలు పథకాలను సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు. రజనీ రాజకీయాల్లోకి వస్తే కచ్చితంగా విజయం సాధిస్తారని, సమాజంలో మార్పు వస్తుందని లతా రజనీకాంత్ వ్యాఖ్యానించారు. -
నష్టపరిహారం కోరుతూ ఐశ్వర్య ధనుష్ పిటిషన్
చెన్నై: ఆశ్రమ పాఠశాల వ్యవహారంపై రూ.6 కోట్లు పరువు నష్టం కోరుతూ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ సోమవారం చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే...స్థానిక గిండీ సమీపంలోని రేస్ కోర్స్ రోడ్డులో రజనీకాంత్ ఆశ్రమ పాఠశాలను నడుపుతున్నారు. ఈ పాఠశాల స్థల యజమాని వెంకటేశ్వర్లు అద్దె ఇవ్వలేదని గత 15న పాఠశాలకు తాళం వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఐశ్వర్య హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఆమె దాఖలు చేసిన పిటిషన్లో శ్రీ రాఘవేంద్ర విద్యాసంఘాన్ని 1991లో రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. ఈ సంఘం ద్వారా ఆశ్రమం పేరుతో వేలచ్చేరి, గిండీ, సైదాపేటలో పాఠశాలలు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. వీటిలో గిండీ రెస్కోర్స్ రోడ్డులో పాఠశాలను 2005లో స్థల యజమాని వెంకటేశ్వర్లు వద్ద లీజ్‌కు తీసుకుని పాఠశాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో గత మే వరకూ అద్దె చెల్లించినట్లు తెలిపారు. ఈ స్థితిలో ఈ నెల 15న వెంకటేశ్వర్లు ఆశ్రమంలోకి చొరబడి అద్దె ఇవ్వడం లేదంటూ పాఠశాలను మూసివేశారన్నారు. అద్దె చెల్లించని కారణంగా ఆశ్రమ పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నామని మీడియాకు ప్రచారం చేశారని పేర్కొన్నారు. పాఠశాల లోపలికి హద్దు మీరి ప్రవేశించినందుకు రూ.కోటి, తమ పాఠశాల సంఘం పేరుకు కళంకం కలిగించినందుకు రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని, ఇతరులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలనీ కోరారు.పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి సీవీ.కార్తీకేయన్ మంగళవారం (ఇవాళ) విచారణ జరపనున్నట్లు తెలిపారు. సంబంధిత వార్త...: రజనీకాంత్ కుటుంబానికి ఎదురుదెబ్బ! -
రజనీకాంత్ కుటుంబానికి ఎదురుదెబ్బ!
చెన్నై : దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నైలోని ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూల్ రజనీ సతీమణి లత నేతృత్వంలో నడుస్తున్న విషయం తెలిసిందే. గిండీలోని పాఠశాల భవనానికి పెద్ద మొత్తంలో అద్దె బకాయిలు పడటంతో బుధవారం ఉదయం సీజ్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ స్కూల్లో చదువుతున్న 300మంది విద్యార్థులను వెలచెరిలోని ఐసీఎస్ఈ స్కూల్ (ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూల్ అనుబంధ సంస్థ)కు తరలించారు. కాగా భవనం యజమాని వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రే స్కూల్‌కు తాళం వేసినట్లు తెలుస్తోంది. 2002లో భవనాన్ని అద్దెకు ఇచ్చామని, అయితే సకాలంలో అద్దె చెల్లించకపోవడంతో 2013లోనూ ఖాళీ చేయాలని స్కూల్ మేనేజ్మెంట్ను కోరినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పదికోట్లు చెల్లించాలంటూ బిల్డింగ్ యజమాని కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే అంత మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేమంటూ స్కూల్ యాజమాన్యం తరఫు న్యాయవాది కేవలం రూ.2కోట్లు మాత్రమే చెల్లించినట్లు తెలుస్తుంది. అప్పటి నుంచి మిగతా బకాయిలు చెల్లించెకపోవడమే కాకుండా, లతా రజనీకాంత్ నుంచి కూడా ఎలాంటి సమాధానం రాకపోవడంతో స్కూల్‌కు తాళం వేసినట్లు సమాచారం. -
లతా రజనీకాంత్‌కు హైకోర్టులో ఊరట
చెన్నై: సూపర్‌స్టార్ సతీమణి లతారజనీకాంత్‌కు 'కొచ్చాడయాన్' చిత్ర వ్యవహారంలో ఊరట లభించింది. ఆమెపై దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. రజనీకాంత్ నటించిన యానిమేషన్ చిత్రం 'కొచ్చాడయాన్'. ఈ చిత్రానికి ఫైనాన్స్ చేసిన యాడ్ బ్యూరో సంస్ధ అధినేత అభీర్‌చంద్ నెహర్ బెంగుళూరు కోర్టులో లతారజనీకాంత్‌పై పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ 'కొచ్చాడయాన్' చిత్రం నిర్మాణంలో ఆర్ధిక సమస్యలు తలెత్తిన సమయంలో ఆ చిత్ర నిర్మాణ సంస్థ తన నుంచి రూ.6.84 కోట్లు రుణం పొందిందన్నారు.అందుకు పూచీకత్తుగా లతారజనీకాంత్ సంతకం చేశారని తెలిపారు. అంతే కాకుండా ఆమె స్థల డాక్యుమెంట్స్ ఇచ్చారని అవి నకిలీవని తేలిందని అన్నారు. నకిలీ డాక్యుమెంట్స్టో తనను మోసం చేసిన లతారజనీకాంత్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. ఆ పిటిషన్‌పై స్పందించిన బెంగుళూరు కోర్టు పిటిషనదారుడిని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది. దీంతో పిటిషనదారుడు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కొంత కాలంగా విచారణలో ఉన్న ఈ కేసులో గురువారం న్యాయమూర్తి ప్రదీప్.టీ.వైన్కంకర్ సమక్షంలో విచారణకు వచ్చింది.అభీర్‌చంద్ నెహర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ జరిపిన ఆయన లతారజనీకాంత్‌పై ఆరోపణలకు పిటిషన్‌దారుడు సరైన ఆధారాలు చూపలేకపోయారంటూ కేసును న్యాయమూర్తి కొట్టివేశారు. -
లతారజనీకాంత్‌కు హైకోర్టులో ఊరట
తమిళసినిమా: సూపర్‌స్టార్ సతీమణి లతారజనీకాంత్‌కు కోచ్చడైయాన్ చిత్ర వ్యవహారంలో ఊరట లభించింది. ఆమెపై దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. రజనీకాంత్ నటించిన యానిమేషన్ చిత్రం కోచ్చడైయాన్. ఈ చిత్రానికి ఫైనాన్స్ చేసిన యాడ్ బ్యూరో సంస్ధ అధినేత అభీర్‌చంద్ నెహర్ బెంగుళూరు కోర్టులో లతారజనీకాంత్‌పై పిటిషన్ దాఖలు చేశారు.అందులో ఆయన పేర్కొంటూ కోచ్చడైయాన్ చిత్రం నిర్మాణంలో ఆర్ధిక సమస్యలు తలెత్తిన సమయంలో ఆ చిత్ర నిర్మాణ సంస్థ తన నుంచి రూ.6.84 కోట్లు రుణం పొందిందన్నారు. అందుకు పూచీకత్తుగా లతారజనీకాంత్ సంతకం చేశారని తెలిపారు. అంతే కాకుండా ఆమె స్థల డాక్యుమెంట్స్ ఇచ్చారని అవి నకిలీవని తేలిందని అన్నారు. నకిలీ డాక్యుమెంట్స్టో తనను మోసం చేసిన లతారజనీకాంత్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. ఆ పిటిషన్‌పై స్పందించిన బెంగుళూరు కోర్టు పిటిషనదారుడిని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది. దీంతో పిటిషనదారుడు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కొంత కాలంగా విచారణలో ఉన్న ఈ కేసులో గురువారం న్యాయమూర్తి ప్రదీప్.టీ.వైన్కంకర్ సమక్షంలో విచారణకు వచ్చింది.అభీర్‌చంద్ నెహర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూలంకషంగా విచారణ జరిపిన ఆయన లతారజనీకాంత్‌పై ఆరోపణలకు పిటిషన్‌దారుడు సరైన ఆధారాలు చూపలేకపోయారంటూ కేసును న్యాయమూర్తి కొట్టివేశారు.