
ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతో, సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లత భేటీ అయ్యారు. సోమవారం ముంబై కృష్ణ కుంజ్‌లోని రాజ్ ఠాక్రే నివాసానికి వెళ్లిన లత ఠాక్రేతో పాటు ఆయన సతీమణి షర్మిలా ఠాక్రేతో సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను రాజ్ ఠాక్రే ట్విటర్ ద్వారా వెల్లడించారు. రజనీ రాజకీయ ఆరంగేట్రం నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో వీరు తాజా రాజకీయ అంశాలతో పాటు, సినీ, సామాజిక అంశాలను చర్చించినట్టుగా రాజ్ ఠాక్రే పీఆర్ టీమ్ తెలిపింది.
గతేడాది డిసెంబర్‌లో రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపిన రజనీ.. రానున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో 234 నియోజక వర్గాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రజనీ ఇప్పటివరకు తన పార్టీ పేరు మాత్రం వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment