![Maharashtra: Raj Thackeray Security Enhanced Following Death Threats - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/14/raj.jpg.webp?itok=qlcK4x0P)
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. రాజ్ ఠాక్రేను హతమారుస్తామని రెం డు రోజుల కిందట బెదిరింపు లేఖ వచ్చిన విష యం తెలిసిందే. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత బాల నాంద్‌గావ్కర్ బుధవారం హోంమంత్రి దిలీప్ వల్సే పాటిల్‌తో భేటీ అయి ఈ విషయా న్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాస్తవా లు ఆరా తీసిన మహావికాస్ ఆఘాడి ప్రభు త్వం భద్రత పెంచుతున్నట్లు శుక్రవారం ప్రక టించింది. ప్రస్తుతం రాజ్ ఠాక్రేకు వై–ప్లస్ భ ద్రతా ఉంది.
బెదిరింపు లేఖ వచ్చిన తరువాత ప్రభుత్వం ఈ భద్రతను ఇలాగే కొనసాగిస్తూ అదనంగా పోలీసుల సంఖ్య పెంచింది. ఇందు లో అదనంగా ఒక పోలీసు అధికారి, కానిస్టేబుల్ ఉన్నారు. బెదిరింపు లేఖ హిందీలో ఉన్నప్పటకీ అందులో వాడిన పదాలు ఎక్కువ శాతం ఉర్దూలో ఉన్నాయి. దీంతో రాజ్‌కు ఏదైనా హాని జరిగితే మహారాష్ట్ర తగలబడకుండా ఉండదని నాంద్‌గావ్కర్ హెచ్చరించారు.
లౌడ్‌స్పీకర్ల వివాదం తెరమీదకు వచ్చిన తరువాత తమకు అనేక బెదిరింపు లేఖలు వస్తున్నాయని నాంద్‌గావ్కర్ అన్నారు. రాజ్ ఠాక్రేను హతమారుస్తామని ఇలా బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. లౌడ్‌స్పీకర్లలో నమాజ్ వినిపించడాన్ని అడ్డుకుంటున్న విధానం మానుకోవాలని, లేదంటే నిన్ను, రాజ్ ఠాక్రేను వదిలే ప్రసక్తే లేదు. కచ్చితంగా హతమారుస్తామని రాసి ఉంది. ఈ లేఖను రాజ్ ఠాక్రేకు చూపించిన తరువాత పోలీసు కమిషనర్‌తో భేటీ అయినట్లు ఆయన తెలిపారు. దీంతో రాజ్‌కు భద్రత మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చదవండి: క్యాట్ కుప్పకూలుతోంది: సుప్రీం కోర్టు సీరియస్
Comments
Please login to add a commentAdd a comment