Loud speakers
-
చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన మోదీ
జైపూర్: రాజస్థాన్ సిరోహిలో శుక్రవారం పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే ఆయన అంతకుముందు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అబు రోడ్లో బీజేపీ నిర్వహించిన ర్యాలీకి ఆలస్యంగా వెళ్లారు. సమయం రాత్రి 10గంటలు దాటిపోయింది. రాజస్థాన్‌లో 10 దాటిన తర్వాత మైక్‌లు, లౌడ్ స్పీకర్లపై నిషేధం అమలులో ఉంది. దీంతో నిబంధనలకు లోబడి ఆయన మైక్‌లో మాట్లాడలేదు. నిబంధనలు అతిక్రమించి మైక్‌లో ప్రసంగించడానికి తన మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని మోదీ అన్నారు. దయచేసి తనను క్షమించాలని అక్కడికి భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యర్తలను, అభిమానులను కోరారు. తాను మరోసారి కచ్చితంగా ఈ ప్రాంతానికి తిరిగి వచ్చి ఇప్పుడు చూపించిన ప్రేమ, అభిమానానికి రుణం చెల్లిస్తానని హామీ ఇచ్చారు. 'భారత్ మాతాకీ జై' అని ప్రసంగం ముగించారు. ఇదంతా స్టేజీపై మైక్ లేకుండా సాధారణంగా మాట్లాడారు మోదీ. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదే వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్, పార్టీ సీనియర్ నేత అమిత్ మాలవీయ. మోదీ అంతకుముందు ఏడు కార్యక్రమాల్లో పాల్గొన్నారని, అందుకే షెడ్యూల్ అలస్యమై సమయం 10 దాటిందని వెల్లడించారు. 72 ఏళ్ల వయసులోనూ ఆయన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం చేస్తున్నారని చెప్పారు. ఇతర బీజేపీ నేతలు కూడా మోదీ నిజాయితీని కొనియాడారు. ప్రధాని హోదాలో ఉండి కూడా ఆయన వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురిపించారు. PM Modi decided against addressing the public meeting at Abu Road because it was well past stipulated time. This was 7th program of the day. Earlier he flagged and took a ride on Vande Bharat and Ahemdabad Metro, prayed at Ambaji among others. He is 72 and fasting for Navratri! pic.twitter.com/UWiotbehQm — Amit Malviya (@amitmalviya) September 30, 2022 చదవండి: ఐక్యరాజ్యసమితి నుంచి రాజకీయాల్లోకి.. శశి థరూర్ ప్రస్థానమిదే.. -
లౌడ్‌స్పీకర్ల వివాదం..చంపేస్తామని బెదిరింపులు.. రాజ్ ఠాక్రేకు భద్రత పెంపు
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. రాజ్ ఠాక్రేను హతమారుస్తామని రెం డు రోజుల కిందట బెదిరింపు లేఖ వచ్చిన విష యం తెలిసిందే. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత బాల నాంద్‌గావ్కర్ బుధవారం హోంమంత్రి దిలీప్ వల్సే పాటిల్‌తో భేటీ అయి ఈ విషయా న్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాస్తవా లు ఆరా తీసిన మహావికాస్ ఆఘాడి ప్రభు త్వం భద్రత పెంచుతున్నట్లు శుక్రవారం ప్రక టించింది. ప్రస్తుతం రాజ్ ఠాక్రేకు వై–ప్లస్ భ ద్రతా ఉంది. బెదిరింపు లేఖ వచ్చిన తరువాత ప్రభుత్వం ఈ భద్రతను ఇలాగే కొనసాగిస్తూ అదనంగా పోలీసుల సంఖ్య పెంచింది. ఇందు లో అదనంగా ఒక పోలీసు అధికారి, కానిస్టేబుల్ ఉన్నారు. బెదిరింపు లేఖ హిందీలో ఉన్నప్పటకీ అందులో వాడిన పదాలు ఎక్కువ శాతం ఉర్దూలో ఉన్నాయి. దీంతో రాజ్‌కు ఏదైనా హాని జరిగితే మహారాష్ట్ర తగలబడకుండా ఉండదని నాంద్‌గావ్కర్ హెచ్చరించారు. లౌడ్‌స్పీకర్ల వివాదం తెరమీదకు వచ్చిన తరువాత తమకు అనేక బెదిరింపు లేఖలు వస్తున్నాయని నాంద్‌గావ్కర్ అన్నారు. రాజ్ ఠాక్రేను హతమారుస్తామని ఇలా బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. లౌడ్స్పీకర్లలో నమాజ్ వినిపించడాన్ని అడ్డుకుంటున్న విధానం మానుకోవాలని, లేదంటే నిన్ను, రాజ్ ఠాక్రేను వదిలే ప్రసక్తే లేదు. కచ్చితంగా హతమారుస్తామని రాసి ఉంది. ఈ లేఖను రాజ్ ఠాక్రేకు చూపించిన తరువాత పోలీసు కమిషనర్‌తో భేటీ అయినట్లు ఆయన తెలిపారు. దీంతో రాజ్‌కు భద్రత మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: క్యాట్ కుప్పకూలుతోంది: సుప్రీం కోర్టు సీరియస్ -
ముగిసిన డెడ్‌లైన్.. ముంబైలో హైఅలర్ట్
ఆజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా రాజకీయం.. బెదిరింపులతో ముంబై మహానగరం అప్రమత్తం అయ్యింది. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే విధించిన డెడ్ లైన్ పూర్తి కావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మసీద్‌లపై లౌడ్‌స్పీకర్ల నుంచి ఆజాన్ వినిపిస్తే.. ప్రతిగా హనుమాన్ చాలీసా ప్రదర్శిస్తామంటూ రాజ్ థాక్రే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మసీద్‌లపై లౌడ్స్పీకర్లు తొలగించాలంటూ మే 3వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించాడాయన. ఆజాన్ శబ్ధ కాలుష్యానికి కారణం అవుతుందనేది ఆయన వాదన. ఈ మేరకు ఆయన విధించిన గడువు ముగియడంతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇదిలా ఉండగా.. ముంబై నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలాచోట్ల ఆజాన్ టైంలో స్పీకర్లు స్వచ్ఛందంగా బంద్ చేశారు. మసీదు ట్రస్టీలతో సమావేశాలు నిర్వహించిన పోలీసులు.. ఉదయం ప్రార్థనల సమయంలో లౌడ్ స్పీకర్లు బంద్ చేయాలనే సుప్రీం కోర్టు ఆదేశాలను వాళ్లకు వివరించారు. దీంతో కళ్యాణ్ తో పాటు చాలా ప్రాంతాల్లో లౌడ్స్పీకర్లు మూగబోయాయి. ఈ క్రమంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు మసీదుల దగ్గరకు వెళ్లి.. లౌడ్స్పీకర్లు బంద్ కావడం గమనించి అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు. అందుకే అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంది. మరోవైపు విద్వేషపూరిత ప్రసంగంతో రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేశారంటూ రాజ్‌థాక్రేపై ఔరంగాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు నోటీసులు అందించిన పోలీసులు.. బుధవారం ఉదయం రాజ్‌థాక్రే ఇంటి వద్ద భారీగా మోహరించారు. థాక్రే వర్సెస్ థాక్రే మహారాష్ట్రలో స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. థాక్రే కుటుంబంలో రాజకీయ వైరం లౌడ్ స్పీకర్ల వ్యవహారంతో ముదురుతోంది. అధికార పార్టీ శివసేన, ఎంఎన్ఎస్ను బీజేపీ బీ టీంగా అభివర్ణిస్తోంది. హిందుత్వ ఓటు బ్యాంక్‌తో సేన ఓట్లను ఎంఎన్ఎస్ ద్వారా చీల్చే యత్నం చేస్తోందంటూ బీజేపీపై మండిపడుతోంది. చదవండి: 14 ఏళ్ల కిందటి కేసు.. రాజ్‌థాక్రేపై నాన్ బెయిలబుల్ వారెంట్ -
లౌడ్‌స్పీకర్ల వివాదంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. రాజ్ ఠాక్రేపై కేసు
ముంబై: ఔరంగాబాద్‌లో ఆదివారం ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్‌ఠాక్రే నిర్వహించిన బహిరంగ సభలో పోలీసులు విధించిన షరతుల్లో కొన్ని ఉల్లంఘించారనే అభియోగంపై మంగళవారం చీఫ్ రాజ్ ఠాక్రేపై కేసు నమోదైంది. రాజ్ ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఔరంగాబాద్ పోలీసులు నియమాల ఉల్లంఘన జరిగినట్లు నివేదిక రూపొందించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి, హోంమంత్రి, సంబంధత అధికారులతో జరిగిన సమావేశంలో ఆ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై ఆరా తీసిన తరువాత ఔరంగాబాద్‌లోని సిటీ చౌక్ పోలీసు స్టేషన్లో రాజ్‌పై కేసు నమోదు చేశారు. సభకు అనుమతిచ్చే ముందు పోలీసులు విధించిన మొత్తం 16 షరతుల్లో 12 షరతుల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాజ్‌తోపాటు సభకు అనుమతివ్వాలని దరఖాస్తు చేసుకున్న రాజీవ్ జవళేకర్పై కూడా కేసు నమోదు చేశారు. ఔరంగాబాద్‌లో కేసు నమోదైన విషయంపై రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే ఫోన్‌చేసి స్ధానిక ఎమ్మెన్నెస్ పదాధికారి రజీవ్ జవళేకర్తో చర్చించారు. చట్టం అందరి సమానంగా ఉండాలని, పోలీసులు సభకు అనుమతిచ్చే ముందు కేవలం 15 వేల మంది హాజరుకావాలని షరతులు విధించారని, అయితే రాజ్ ఠాక్రే రోడ్డుపై నడుస్తూ వెళుతుంటేనే 15 వేలకుపైగా జనాలు అనుసరిస్తారని, ఇలాంటి సందర్భంలో షరతులు ఉల్లంఘించారని కేసు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మరోనేత సందీప్ దేశ్‌పాండే మాట్లాడుతూ తొలుత సభకు అనుమతివ్వకపోవడం, ఆ తరువాత సమయం దగ్గరపడగానే షరతులతో కూడిన అనుమతివ్వడం లాంటి సందర్భాలు గతంలో ఎదురు కాలేదన్నారు. పోలీసులపై ప్రభుత్వం కచ్చితంగా ఒత్తిడి తెచ్చిందని దీన్ని బట్టి స్పష్టమవుతోందన్నారు. కార్యకర్తలను భయపట్టేందుకే కేసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసు నమోదు చేసిన నిందితుల జాబితాలో రాజ్ ఠాక్రే పేరు మొదటి స్ధానంలో ఉంది. ఆ తరువాత రాజీవ్ జావళేకర్, నిర్వాహకులు, ఇతర పదాధికారుల పేర్లున్నాయి. స్ధానిక సిటీ చౌక్ పోలీసు ఇన్స్పెక్టర్ అశోక్ గిరీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: డెన్మార్క్ ప్రధాని నివాసంలో మోదీ చర్చలు.. వీడియో వైరల్ నాన్ బెయిలబుల్ వారెంట్ మరోవైపు మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరేపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 14 ఏళ్ల కిందటి కేసులో మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా రాజ్ ఠాక్రే రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై 2008లో ఆయనపై ఐపీసీ సెక్షన్ 109,117 కింది కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణలో రాజ్ ఠాక్రే కోర్టుకు హాజరు కాకపోవడంతో జూన్ 8లోపు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని సాంగ్లి జిల్లా షిరాలా ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పేర్కొంది. అయితే 2012 కంటే ముందు నమోదైన రాజకీయ పరమైన కేసులన్నిటినీ ప్రభుత్వం రద్దు చేసిందని ఎంఎన్ఎస్ నేత ఒకరు గుర్తు చేశారు. -
మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై సీఎం కీలక నిర్ణయం
లక్నో: ఇక నుంచి మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించేందుకు అధికారుల అనుమతి తప్పనిసరి చేస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ వెల్లడించారు. అంతేగాక ప్రార్ధనా ప్రాంగణం నుంచి శబ్ధం బయటకు రాకూడదని తెలిపారు. లౌడ్ స్పీకర్లకు కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని పేర్కొన్నారు. ‘ప్రతి ఒక్కరికి తమ మత విశ్వాసాలకు తగిన విధంగా ఆరాధించే స్వేచ్ఛ ఉంటుంది కానీ అది ఇతరులకు అసౌకర్యం కలిగించకూడదు’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు మతపరమైన ప్రదేశాలలో అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం విధించిన మూడు రోజుల తర్వాత యూపీలో యోగి ఈ ప్రకటన చేశారు. ఆజాన్ సమయంలో 15 నిమిషాలు ముందు, తరువాత లౌడ్ స్పీకర్ల ద్వారా హనుమాన్ చాలీసా, భజనలు ప్లే చేయరాదని నాసిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక మహారాష్ట్రలోని అన్ని మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించేందుకు మే 3లోగా అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. చదవండి: మత ఘర్షణల నేపథ్యంలో.. యోగి సర్కార్ కీలక నిర్ణయం కాగా ఇప్పటికే యోగి సర్కార్ మతపరమైన ఉరేగింపులు, ర్యాలీలకు అధికారుల అనుమతులు తప్పనిసరి చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇకపై యూపీలో మత పరమైన ర్యాలీలకు పోలీసులకు అఫిడవిట్‌ను సమర్పించాలని సీఎం తెలిపారు. అనుమతి లేకుండా ఎలాంటి మతపరమైన ఊరేగింపు జరగకూడదని పేర్కొన్నారు. సాంప్రదాయ మతపరమైన ర్యాలీలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, కొత్త కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని తెలిపారు. -
చైనా కుట్ర : సరిహద్దుల్లో పంజాబీ సాంగ్స్
సాక్షి, న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా- భారత్ సరిహద్దులో డాగ్రన్ కంట్రీ ఒప్పందాలు తుంగలో తొక్కుతూ కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా చైనా అనేక కుట్రలు పన్నుతూ భారత్‌ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు మరొక నీచమైన చర్యకు చైనా పాల్పడింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారీ లౌడ్ స్పీకర్లు ఉంచి, పంజాబీ సాంగ్స్ ప్లే చేస్తూ భారత సైన్యం దృష్టి మరల్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది. లద్ధాఖ్లోని ప్యాంగ్యాంగ్ ప్రాంతంలోని ఫింగర్ 4 ఏరియాలో లౌడ్ స్పీకర్లను ఉంచింది. చైనాతో సరిహద్దు వివాదం మొదలవడంతో భారత సైన్యం పగలు, రాత్రి అనే తేడా లేకుండా కంటిమీద కునుకేయకుండా కాపల కాస్తోంది. దీంతో వారి కన్నుగప్పడానికి చైనా ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతోంది. అంతటితో ఆగకుండా హిందీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడ చేస్తున్నట్లు భారత ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. మన సైనికులు ఇలాంటి ప్రలోభాలకు లొంగడం లేదని, అంతేకాకుండా మ్యూజిక్ వింటూ ఆనందిస్తున్నారని ఆ అధికారి పేర్కొన్నారు. ఇక చైనా భారత్ వివాదం గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పార్లమెంట్లో మాట్లాడుతూ, భారత భూభాగం 38,000 కిలోమీటర్ల చదరపు అడుగులను చైనా ఆక్రమించిందని తెలిపారు. సరిహద్దు ఒప్పందాన్ని అతిక్రమించి చైనా ఈ దుశ్చర్యలకు పాల్పడుతుందని ఆయన పేర్కొన్నారు. శాంతి ఒప్పందం ద్వారా భారత్ ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచిస్తుందని రాజ్‌నాధ్ సింగ్ తెలిపారు. చదవండి: చైనా నుంచి చొరబాట్లు లేవు -
పొలాల మధ్యన డీజే, లౌడ్ స్పీకర్ల హోరు..
లక్నో: పెళ్లి ఊరేగింపు, విజయోత్సవ ర్యాలీ వంటి వేడుకల్లో డీజే పెట్టడం సాధారణంగా కనిపించే దృశ్యం. కానీ ఉత్తరప్రదేశ్ రైతులు మాత్రం మిడతల దండును తరిమి కొట్టడం కోసం డీజే, లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేశారు. అది కూడా పొలాల మధ్యన. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఓ వైపు దేశం కరోనాతో అతలాకుతలమవుతోంటే.. మరోవైపు మిడతల దండు పొలాలపై దాడి చేసి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే లాక్డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు మిడతల రూపంలో మరో నష్టం కళ్ల ముందు కనిపిస్తుంది. (వణికిస్తున్న రాకాసి మిడతలు) గుంపులు గుంపులుగా మిడతలు పొలాల్లో స్వైర విహారం చేస్తూ.. అన్నదాతను అశాంతికి గురి చేస్తున్నాయి. ఆఫ్రికా, యెమెన్, ఇరాన్, పాకిస్తాన్ మీదుగా మిడతలు భారతదేశంలో ప్రవేశించాయి. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో మిడతల దండు వీర విహారం చేస్తుంది. ఇప్పటికే రాజస్తాన్‌లో ఈ మిడతల దండు 50,000 హెక్టార్ల పంటను నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పంటలను కాపాడుకునేందుకు యూపీ రైతులు ఇలాంటి వినూత్న ఆలోచన చేశారు. మిడతలను తరిమేందుకు పొలాల మధ్యలో డీజే, లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేశారు.(రాకాసి మిడతల దండుపై కెమికల్ స్ప్రే) ఇప్పుడు గనక ప్రభుత్వాలు మిడతల సమస్యపై దృష్టి సారించకపోతే.. ముందు ముందు తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే రానున్నది వర్షా కాలం. వరి, గోధుమ, పత్తి, సోయాబీన్ వంటి పంటలు సాగు చేసిది ఈ కాలంలోనే. ఒక వేళ ప్రభుత్వాలు గనక ఇప్పుడు ఈ మిడతలను నివారించకపోతే.. రైతలు తీవ్రమైన పంట నష్టం చవి చూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఇది మతతత్వ గూండాగిరీ
గుళ్లు, మసీదులపై సోనూ నిగమ్ వ్యాఖ్య ముంబై: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ గుళ్లు, మసీదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లౌడ్ స్పీకర్ల ద్వారా మసీదులు, గుళ్లు, హరిద్వారాలు చేసే ఉపన్యాసాలు, ప్రార్థన పిలుపులను ‘గూండాగిరీ’గా అభివర్ణించారు. సోమవారం ఈ మేరకు వరుసగా ట్వీట్లు చేశారు. ‘గుళ్లు, మసీదులు.. ప్రజలను లౌడ్‌స్పీకర్ల ద్వారా ఎందుకు నిద్ర లేపుతున్నాయో నాకు అర్థం కావడం లేదు. బలవంతపు మతతత్వాన్ని ప్రజలపై రుద్దడాన్ని ఆపేయాలి’ అని డిమాండ్ చేశారు. ‘దేవుడు అందరినీ ఆశీర్వదించాలి. నేను ముస్లింను కాను. కానీ ప్రతి రోజూ తెల్లవారుజామునే అజాన్‌తో నిద్ర లేస్తున్నాను. దేశంలో ఈ బలవంతపు మతతత్వం ఎప్పుడూ అంతమవుతుందో..’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. ‘మహ్మద్ ప్రవక్త కాలంలో కరెంట్ లేదు. ఎడిసన్ తర్వాతే ఎందుకు నాకీ గోల (లౌడ్స్పీకర్లలో అజాన్ ఇవ్వడంపై)’ అని విమర్శించారు. -
మసీదుల్లో లౌడ్‌స్పీకర్లపై ఆంక్షలు
ఇకపై పోలీసుల అనుమతి తప్పనిరి సాక్షి, ముంబై: నగరంతోపాటు, నవీముంబై పరిసరాల్లోని మసీదుల మినార్లపై లౌడ్ స్పీకర్లు ఏర్పాటుచేసే ముందు పోలీసుల అనుమతి తీసుకున్నారా ...? లేదా..? అనేది పరిశీలించాలని బాంబే హైకోర్టు ముంబై, నవీముంబై పోలీసులను ఆదేశించింది. ఒకవేళ అనుమతి తీసుకోని పక్షంలో ఆ లౌడ్స్పీకర్లను జప్తు చేయాలని ఆదేశించింది. లౌడ్‌స్పీకర్ల వినియోగంపై సంతోష్ పాచ్‌లగ్ అనే సామాజిన కార్యకర్త కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు విద్యాసాగర్ కానడే, ప్రమోద్ కోదే ల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. నవీముంబై పరిసరాల్లో 45 మసీదుల్లో ఏర్పాటుచేసిన లౌడ్స్పీకర్లకు స్థానిక పోలీసుల అనుమతి తీసుకోలేదని సమాచార హక్కు ద్వారా సేకరించారు. దీంతో ఆయన కోర్టులో పిల్ దాఖలు చేశారు. పంద్రాగస్టు లేదా జనవరి 26తో పాటు వివిధ మతాల పండుగల్లో అక్రమంగా లౌడ్స్పీకర్లను వినియోగిస్తుంటారు. ఇలాంటి వాటిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు పిల్లో పేర్కొన్నాడు. కాగా నవరాత్రి ఉత్సవాల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఉంటుంది. వీటి కారణంగా వృద్ధులు ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు పడతారని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ముంబై, నవిముంబై పరిసరాల్లో మసీదుల్లో ఏర్పాటుచేసిన లౌడ్స్పీకర్లకు అనుమతి తీసుకోని పక్షంలో వాటిని జప్తు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ధ్వని కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని కోర్టు అభిప్రాయపడింది. -
వీళ్లా..పాలకులు!
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్ : అధికారులు, అధికార పార్టీ పాలకుల మదాందానికి ఈ రచ్చబండ సాక్షి. రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏకంగా తరగతి గదిని ఆక్రమించి విద్యార్థులను ఆరు బయటకు తరిమేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్న ఇంగితం లేకుండా వ్యవహరించారు. లౌడ్ స్పీకర్లు పెట్టి తమ ప్రసంగాలతో విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీశారు. ప్రభుత్వ పాఠశాల కావడంతో ఆ విద్యార్థులు ఎటుపోతే మాకేంటి అన్న రీతిలో వ్యవహరించారు. నగరంలోని ఏసీ నగర్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో నగర, రూరల్ ఎమ్మెల్యేల నేతృత్వంలో రచ్చబండ నిర్వహించారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు విద్యార్థులు త్రైమాసిక పరీక్షలు రాస్తున్నారు. ఈ రచ్చబండ నిర్వహణకు ఓ గది వరండాను వేదికగా వాడుకున్నారు. దీంతో ఆ గదిలో పరీక్షలు రాయాల్సి విద్యార్థులు ఆరు బయట మరో గది వరండాలో పరీక్షలు రాశారు. అదే సమయంలో మైక్‌ల ద్వారా పాలకులు తమ ప్రసంగాలను హోరెత్తించారు. దీంతో విద్యార్థులు ఏకాగ్రత కొరవడి పరీక్షలు సక్రమంగా రాయలేకపోయారు. పాలకులే నిబంధనలను ఉల్లంఘిస్తున్నా.. వారిని వారించలేక ఉపాధ్యాయులు మౌనం వహించారు. రచ్చబండకు హాజరైన జిల్లా అధికారులు పరీక్షలు జరిగే సమయంలో పాఠశాలలో రచ్చబండ నిర్వహించొద్దని సూచించకపోవడం, పాలకుల సేవలో తరించడం బాధాకరం. పాలకుల తీరు చూసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వీళ్లా..మన పాలకులంటూ ఆవేదన వ్యక్తం చేశారు.