Director Vignesh Shivan Comments On Rajinikanth And Anirudh Ravichander Bonding - Sakshi
Sakshi News home page

Anirudh Ravichander: అనిరుధ్- రజనీ బంధం గురించి విఘ్నేష్ శివన్‌ కామెంట్‌తో రివీల్‌!

Published Thu, Aug 17 2023 12:17 PM | Last Updated on Thu, Aug 17 2023 12:56 PM

Vignesh Shivan Viral Comments On Rajini And Anirudh Bonding - Sakshi

రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గలేదు.. ఈ మూవీలో 'హుకూం' సాంగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతుంది. ఇందులో రజనీకాంత్‌ స్టైల్‌కు యువ సంచలనం అనిరుధ్‌ అందించిన మ్యూజిక్‌, బీజీఎం నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లాయి. రజనీ కోసం ఆయన ఇచ్చిన బీజీఎంతో ప్రేక్షకులకు గూస్‌బమ్స్‌ తెప్పించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో అనిరుధ్‌ ఇచ్చిన స్టేజ్‌ ఫర్మామెన్స్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంది.

(ఇదీ చదవండి: పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్‌ వైరల్‌ కామెంట్స్‌)

స్టేజీపై మ్యూజిక్‌కు తగ్గట్టుగా ఆతను ఊగిపోతూ పాడుతుంటే ఆడియన్స్‌ను మరో ట్రాన్స్‌లోకి వెళ్తారు. అంతలా రజనీ కోసం పర్‌ఫామెన్స్‌ ఇచ్చాడు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్టార్‌డమ్‌ను వివరిస్తూ సాగే ఆ పాట సినీ అభిమానులను ఊపేస్తోంది. జైలర్ సినిమాతో అనిరుధ్ తమిళంలో నెంబర్ వన్ స్టార్ అయ్యాడు.  2012లో ధనుష్‌ త్రి సినిమా కోసం పాటను కంపోజ్ చేసినప్పుడు కేవలం 21 ఏళ్లు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి  దశాబ్దపు కాలం గడిచింది. తన కెరియర్‌లో ఎన్నో అద్బుతమైన పాటలను అందించాడు. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏఆర్‌ రెహమాన్‌ను మించిపోయాడని సినీ ట్రేడర్స్‌ తెలుపుతున్నాయి.

రజనీకి కుమారుడు లేరనే సమస్య లేదు: విఘ్నేష్
జైలర్ ఆడియో రిలీజ్‌ కార్యక్రమంలో  అనిరుధ్- రజనీకాంత్ బంధం గురించి దర్శకుడు విఘ్నేష్ శివన్ (నయనతార భర్త) చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. 'మనం జీవితంలో కొన్ని అద్భుతమైన క్షణాల కోసం ఎదురుచూస్తాం. నేను తలైవా ముందు నిలబడిన ఈ క్షణం అలాంటిదే. జైలర్‌లో తండ్రీకొడుకుల అనుబంధంపై ఓ పాట రాశాను. దాని గురించి గుర్తుచేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. దానికి కారణం నేను ఇప్పుడు ఇద్దరు అబ్బాయిల తండ్రిని. భవిష్యత్తులో వాళ్లు పెద్దయ్యాక నేను రాసిన పాట రజనీ సినిమాలో ఉందని చెబుతాను.

(ఇదీ చదవండి: అతను నా తమ్ముడు.. అవసరమైతే ఎన్నికల్లో ప్రచారం చేస్తా: విష్ణు)

అలాగే, తలైవా గురించి నేను ఇంకో విషయం చెప్పాలి. రజనీ సార్‌ కోసం ఓ పాటను సిద్ధం చేసినప్పుడే తలైవా పట్ల అనిరుధ్‌లోని నిజాయతీ, ప్రేమ కనిపించాయి. రజనీ సర్‌కి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయనకు కొడుకు లేడనే సమస్య అనిరుధ్‌తో తీరిపోయింది. ఎందుకంటే తలైవా పట్ల అతనిలో విపరీతమైన ప్రేమను చూశాను. ఒకవేళ రజనీకి  కొడుకు ఉంటే అనిరుద్- రజనీకాంత్ బంధాన్ని చూసి  అసూయపడేవాడు.' అని విఘ్నేష్ శివన్ అన్నారు.


(అనిరుధ్‌ ఫ్యామిలీ)

రజనీ- అనిరుధ్‌ మధ్య ఉన్న బంధుత్వం ఇదే
ఆడియో లాంచ్ ఫంక్షన్‌కి అనిరుధ్ వచ్చినప్పుడు సూపర్ స్టార్ రజనీ అతన్ని కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అనిరుధ్ తమిళ నటుడు రవి రాఘవేంద్ర కుమారుడు అనే సంగతి తెలిసిందే. ఆయన రజనీకాంత్‌కు చాలా దగ్గర బంధువు. తలైవా భార్య సతీమణి లతా రజనీకి మేనల్లుడు అవుతాడు. అందుకే రజనీకి అనిరుధ్ అంటే ప్రత్యేక అభిమానం.  సుమారు 30 ఏళ్ల క్రితం రజనీ కాంత్‌ సినిమా షూటింగ్‌లో ఉండగా అనిరుధ్‌ను తీసుకుని లత వెళ్లారట. ఆ సమయంలో రజనీ-అనిరుధ్‌ ఫోటో దిగారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement