Anirud Ravichandran
-
ముచ్చటగా మూడోసారి...
‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.కాగా ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు బుధవారం యూనిట్ ప్రకటించింది. ‘‘ఈ చిత్రంలోని మోస్ట్ ఫెరోషియస్ పాత్ర కోసం నాని మేకోవర్ అవుతున్నారు. ‘జెర్సీ, గ్యాంగ్ లీడర్’ చిత్రాల తర్వాత నానీతో ముచ్చటగా మూడోసారి అనిరుథ్ సినిమా చేస్తున్నారు’’ అని చిత్రయూనిట్ వెల్లడించింది. -
Devara : ఆయుధ పూజ సాంగ్ విన్నారా.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
దేవర నుంచి ఆయుధ పూజ రిలీజైంది. అసలు వస్తుందో రాదో అనుకుంటున్న సమయంలో సడెన్‌గా ఈ పాటను వదిలి సినిమా రిలీజ్‌కి కొన్ని గంటల ముందు సర్ప్రైజ్ చేశారు మేకర్స్. దేవర సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటినుంచి ఆయుధ పూజ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని మేకర్స్ చెప్పుకుంటూ వచ్చారు. దీంతో ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ పాట కోసం ఎదురు చూశారు.(చదవండి: ఆరేళ్ల గ్యాప్.. రికార్డుల మోత.. ‘దేవర’ గురించి ఈ విషయాలు తెలుసా?)తాజాగా దేవర జ్యూక్ బాక్స్ రిలీజ్ చేసి..అందులో ఆయుధ పూజ సాంగ్‌ని కూడా యాడ్ చేశారు. ఎర్రటి సంద్రం ఎగిసి పడే.. అద్దిరి ఇద్దిరి అదిరిపడే హోరు.. రణధీరుల పండుగ నేడు అంటూ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగు ఈ పాటకి రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. కాల భైరవ అద్భుతంగా ఆలపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఇక దేవర విషయానికొస్తే.. జగతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా.. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
'దేవర'ను చూసిన అనిరుధ్.. ఆ రెండు సినిమాలతో పోలిక
ఎన్టీఆర్- కోరటాల శివ కాంబినేషన్లో తెరెక్కిన సినిమా దేవర. కొన్ని గంటల్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో టికెట్ల అమ్మకాలు జరిగాయి. నేడు అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో ఎక్కడ చూసిన దేవర బజ్ క్రియేట్ అయింది. అయితే, తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.'దేవర సినిమాకు సంగీతం అందిస్తున్న క్రమంలో ఆ సీన్లు చూసి నేను ఆశ్చర్యపోయాను. దీంతో ప్రేక్షకులకు మరింత అనుభూతిని అందించాలని ఈ సినిమాకు సంబంధించిన రీరికార్డింగ్ వర్క్‌లో 90 శాతం పైగానే విదేశాల్లో పూర్తి చేశాను. దేవర చూస్తున్నంత సేపు హాలీవుడ్ సినిమాలైన 'అవెంజర్స్, బ్యాట్‌మ్యాన్' చిత్రాలను చూసిన ఫీల్ కలగుతుంది. ఇదొక భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులోని సంగీతం అందరినీ మెప్పిస్తుంది. ఇంత గొప్ప సినిమాను ఎలా నిర్మించారని నాకు అనిపించింది. అదే అనుభూతిని సెప్టెంబర్ 27న ప్రేక్షకులు కూడా పొందుతారు. అందుకే నేను కూడా తారక్ అభిమానులతో కలిసి దేవర ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తాను. కొరటాల శివ హైదరాబాద్‌లో ఏ థియేటర్‌కు తీసుకెళ్లినా సంతోషమే. వాళ్లందరితో కలిసి ఎంజాయ్ చేస్తా.' అని అనిరుధ్ పంచుకున్నారు.జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ దేవర చిత్రానికి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. -
మ్యూజికల్ హిట్ ఇచ్చిన అనిరుధ్ ఫస్ట్ సినిమా రీ-రిలీజ్
ధనుష్, శ్రుతీహాసన్ జంటగా ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘త్రీ’. 2012 మార్చి 30న ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల అయింది. కోలీవుడ్‌లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ధనుష్ సరసన శ్రుతి హాసన్ నటించింది. 2012లో వచ్చిన ఈ సినిమా రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇప్పటికే ఒకసారి రీ-రిలీజ అయిన 'త్రీ' సినిమా ఇప్పుడు మరోసారి భారతదేశం అంతటా థియేటర్లలో రీ-రిలీజ్ చేయడానికి సిద్ధంగా మేకర్స్ ఉన్నారు. ధనుష్ దర్శకత్వం వహించి, అనిరుధ్ రవిచందర్ సంగీత అరంగేట్రం చేసిన ఈ చిత్రాన్ని మరోసారి చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.సెప్టెంబర్ 14న థియేటర్లలో తిరిగి విడుదల కానుంది. ఈ చిత్రం రామ్ (ధనుష్), జనని (శృతి హాసన్) తమ పాఠశాల రోజుల్లో ప్రేమలో పడటం నుంచి కథ ప్రారంభమవుతుంది. చివరికి పెళ్లి చేసుకుంటారు. అయినప్పటికీ, రామ్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో వారి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది, అతని అకాల మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి జనని ఏం చేసిందనేది కథ. ఎంతో థ్రిల్లింగ్ ఇచ్చే ఈ సినిమాను మరోసారి వెండితెరపై చూడొచ్చు.ఈ సినిమాతో అరంగేట్రం చేసిన అనిరుధ్ రవిచందర్ సంగీతం 3 సినిమాకి హైలైట్‌గా నిలిచింది. సౌండ్‌ట్రాక్, ముఖ్యంగా ధనుష్ రచించి పాడిన వై దిస్ కొలవెరి డి పాట సంచలనంగా మారింది. -
ఫ్యాన్స్‌కు పోస్టర్‌తో ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్.. దేవర గ్లింప్స్ రెడీ
పాన్ ఇండియా స్టార్ జూ ఎన్టీఆర్ దేవర కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. 2024 బాక్సాఫీస్ దేవర సొంతం కావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ సమర్పిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఒక శుభవార్తను కూడా ఎన్టీఆర్ షేర్ చేశారు. తన ఎక్స్ పేజీలో సరికొత్త లుక్‌లో ఉన్న తారక్ ఫోటోతో ట్రీట్ ఇచ్చారు. దేవర గ్లింప్స్‌ను జనవరి 8న విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో 2024 ఫుల్ జోష్ మొదలైంది. కొత్త ఏడాదిలో దేవర బరిలోకి దిగాడంటూ వారు కామెంట్లు చేస్తున్నారు. దేవర సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్ ఈ చిత్ర టీజర్‌పై చేసిన వ్యాఖ్యలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పులికి అందరూ సలాం కొడతారు.. త్వరలో వచ్చే టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది అనేలా ఆయన చెప్పారు. మరోవైపు కల్యాణ్ రామ్ కూడా దేవర అంచనాలకు మించే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. దీంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. ఏదేమైనా 2024 బాక్సాఫీస్ దేవర సొంతం అని చెప్పవచ్చు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! Wishing you all a very Happy New Year. Can’t wait for you all to experience the glimpse of #Devara on Jan 8th. pic.twitter.com/RIgwmVA6e0 — Jr NTR (@tarak9999) January 1, 2024 -
చాలా కాలం తర్వాత రెజీనాకు గోల్డెన్ ఛాన్స్
అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో నటి రెజీనాకు అవకాశం వరించినట్లు తాజా సమాచారం. చాలా కాలంగా పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్న అజిత్ 62వ చిత్రం ఎట్టకేలకు ఇటీవలే సెట్స్ పైకి వచ్చింది. విడాముయర్చి పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఆది నుంచి పలు మార్పులు చేర్పులకు గురవుతూ వస్తోంది. ఈ చిత్రానికి ముందుగా విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి వైదొలగడంతో ఆ తర్వాత దర్శకుడు మగిళ్ తిరుమేణి పేరు తెరపైకి వచ్చింది. (ఇదీ చదవండి: నాకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చింది అతనే.. టాలీవుడ్‌పై షాయాజీ షిండే ఆసక్తికర కామెంట్స్!) చిత్ర కథలోని చేర్పులు మార్పులు జరిగాయి. నటి త్రిష, బాలీవుడ్ భామ హ్యుమా ఖురేషీ హీరోయిన్లుగా, విలన్‌గా అర్జున్ దాస్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా ఆ తర్వాత చిత్ర షూటింగ్ ఆలస్యం కావడంతో అర్జున్ దాస్ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పుడు ఆ పాత్రను నటుడు ఆరవ్ పోషిస్తున్నారు. కాగా చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతున్న సమయంలో నటి హ్యుమా ఖురేషీ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఈమె ఇంతకుముందు అజిత్ జంటగా వలిమై చిత్రంలో నటించారు. కాగా ఇప్పుడు విడాముయర్చి చిత్రంలో ఆమెకు బదులు నటి రెజీనాను ఎంపిక చేసినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఈమెకు లక్కీ చాన్స్ అనే చెప్పాలి. ఇటీవల సరైన అవకాశాలు లేక వెబ్ సిరీస్ లో నటిస్తున్న రెజీనాకు ఈ చిత్రం నుంచి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. కాగా ఇన్ని మార్పులు చేర్పులు తర్వాత విడాముయర్చి చిత్రం షూటింగ్ అజర్బైజాన్ దేశంలో ప్రారంభమైంది. తదుపరి దుబాయ్ అబుదాబి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకొని చివరిగా చైన్నెలో షూటింగ్‌ను ముగించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. కాగా దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. -
రజనీకాంత్ సినిమాలో యంగ్ హీరోయిన్స్‌కు ఛాన్స్
నటుడు రజినీకాంత్ జైలర్ చిత్ర విజయాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర 50 రోజుల వేడుకల్లోనూ పాల్గొన్నారు. తర్వాత తన 170వ చిత్రానికి రెడీ అవుతున్నారు. దీన్ని లైకా ప్రొడక్షనన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి జైభీమ్ చిత్రం టీజే. జ్ఞానవేల్ కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమని ఆయన ఇదివరకే తెలిపారు. ఇందులో రజనీకాంత్ మరోసారి పోలీస్ అధికారిగా నటించటానికి సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్ మార్చేసిన మహేశ్ బాబు) ఆ మధ్య దర్బార్ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన రజనీకాంత్ ఇటీవల విడుదలైన జైలర్ చిత్రంలో జైలు అధికారిగా నటించిన విషయం తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో పనిచేసే నటీనటులు సాంకేతిక వర్గం గురించి రోజుకో ప్రకటన విడుదల చేస్తూ వెల్లడిస్తున్నారు. అలా ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించినట్లు తెలిపారు. జైలర్ వంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ రజనీకాంత్, అనిరుధ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. తాజాగా ఇందులో నటి దుషారా విజయన్, రిత్విక సింగ్ వంటి యంగ్ హీరోయిన్స్ నటించనున్నట్లు ప్రకటించారు. కాగా ఇందులో రజనీకాంత్ సరసన మలయాళ నటి మంజు వారియర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ క్రేజీ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా రజనీకాంత్ ముఖ్యపాత్రను పోషించిన లాల్ సలామ్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. విష్ణు విశాల్, విక్రాంత్ నటించిన ఈ చిత్రానికి రజనీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్య దర్శకురాలు కావడం గమనార్హం. -
అనిరుధ్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన తండ్రి
మలయాళ నటి మేనక కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్గా సౌత్ ఇండియాలో నిలదొక్కుకుంది. సావిత్రి బయోపిక్ మహానటిలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ సినిమాతో కీర్తి సురేష్ జాతీయ అవార్డు అందుకుంది. కానీ ఆమెకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడటం లేదు. కానీ కీర్తి పెళ్లిపై మరోసారి రూమర్స్ రావడం జరుగుతోంది. గతంలో కూడా అనేకసార్లు ఇలాంటి రూమర్స్ వచ్చాయి. కాలక్రమంలో అవన్నీ అబద్ధమని కూడా తేలింది. ఈసారి, ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో కలిసి ఉన్నట్లు పుకార్లు వ్యాపించాయి. స్పందించిన కీర్తి సురేష్ తండ్రి అనిరుధ్ రవిచందర్‌తో ఆమె పెళ్లి పుకార్లపై కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ ఇలా స్పందించారు. ' కీర్తి- అనిరుధ్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆ ప్రచారాలు అన్నీ నిరాధారమైనవి, వాటిలో ఏ మాత్రం కూడా నిజం లేదు. కీర్తి గురించి ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే ఇలాంటివి చాలానే ఉన్నాయి. తాజాగా కీర్తి, అనిరుధ్ గురించి ఎవరో కావాలనే ఒక వార్తను క్రియేట్ చేసి ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు.' అని ఆయన అన్నారు. ఇదే సమయంలో కీర్తి సురేష్ కూడా అనిరుధ్‌తో పెళ్లి పుకార్లను ఖండించింది. టైమ్స్ నౌతో ఆమె మాట్లాడుతూ.. అది తప్పుడు వార్త అని అనిరుధ్ నాకు మంచి స్నేహితుడు మాత్రమేనని తెలిపింది. పెళ్లి రూమర్స్ ఎందుకు వచ్చాయ్ అయితే, కీర్తి సురేష్, అనిరుధ్ రవిచందర్ పెళ్లిపై పుకార్లు రావడం ఇది మొదటిసారి కాదని గమనించాలి. రెమో (శివ కార్తికేయ), గ్యాంగ్ (సూర్య), అజ్ఞాతవాసి వంటి మరెన్నో చిత్రాల కోసం కీర్తి, అనిరుధ్ కలిసి పనిచేశారు. వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా అంటారు. ఇటీవల ఆమె జవాన్‌లోని అనిరుద్ బ్లాక్ బస్టర్ సాంగ్ చలేయా.. పాటకు డైరెక్టర్ అట్లీ భార్య కృష్ణ ప్రియతో కలిసి డ్యాన్స్ కూడా చేసింది. అది కూడా భారీగా వైరల్ అయింది. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి పుకార్లు కొన్ని నెలల క్రితం దుబాయ్‌కి చెందిన ఫర్హాన్ అనే వ్యాపారవేత్తతో కీర్తి సురుష్ సంబంధంలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఆమె సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేయడంతో పెళ్లి పుకార్లకు ఆజ్యం పోసింది. అయితే, ఈ వార్త వైరల్ కావడంతో, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తన స్నేహితుడని ఆమె స్పష్టం చేసింది. ఆ సమయంలో ఆమె తండ్రి కూడా ఈ వార్తలను తిప్పికొట్టిన విషయం తెలిసిందే. కానీ ఆమె మరోకరితో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. త్వరలో తన మిస్టరీ మ్యాన్ గురించి చెప్తానని వెల్లడించింది. (ఇదీ దచవండి: శ్రావణ భార్గవికి రెండో పెళ్లా..? హల్దీ ఫంక్షన్ ఫోటోలు వైరల్) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
తమిళ్ సైమా విజేతలు వీరే.. బెస్ట్ హీరో, హీరోయిన్ ఎవరంటే?
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2023 తమిళం, మలయాళ సినిమాలలో తమ సత్తా చాటిన నటీనటులకు సెప్టెంబర్ 16న అవార్డులు ప్రదానం చేశారు. ఇప్పటికే తెలుగు,కన్నడ సినిమాలకు చెందిన అవార్డులు కార్యక్రమం పూర్తి అయిన విషయం తెలిసిందే. దీంతో సైమా అవార్డ్స్ 2023 వేడుక ముగిసింది. తమిళ్ నుంచి విక్రమ్ సినిమాకు గాను కమల్ హాసన్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఈ సారి త్రిష,అనిరుధ్, కీర్తి సురేష్, మణిరత్నం,మాధవన్ వంటి సూపర్ స్టార్స్‌కు అవార్డ్స్ దక్కాయి. తమిళ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం (తమిళం): (పొన్నియిన్ సెల్వన్ - 1) * ఉత్తమ దర్శకుడు (తమిళం): లోకేష్ కనగరాజ్ (విక్రమ్) * ఉత్తమ నటుడు (తమిళం): కమల్ హాసన్ (విక్రమ్) * ఉత్తమ నటి (తమిళం): త్రిష కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ -1) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆర్ మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్) * ఉత్తమ నటి (క్రిటిక్స్): కీర్తి సురేష్ (సాని కాయిదం) తెలుగులో చిన్ని * ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (విక్రమ్) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్-1) * ఉత్తమ సహాయ నటి : వాసంతి (విక్రమ్) ఏజెంట్ టీనా * ఉత్తమ సహాయ నటుడు (తమిళం): కాళీ వెంకట్ (గార్గి) * ఉత్తమ విలన్: ఎస్.జె.సూర్య (డాన్) * ఉత్తమ హాస్యనటుడు: యోగి బాబు (లవ్ టుడే) * ఉత్తమ గాయకుడు : కమల్ హాసన్ (విక్రమ్) పాతాళ పాతాల * ఉత్తమ గేయ రచయిత: ఇళంగో కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ - 1) * ఉత్తమ నూతన నిర్మాత : గౌతం రామచంద్రన్ (గార్గి) * ఉత్తమ నూతన దర్శకుడు: ఆర్ మాధవన్ (రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్) * ఉత్తమ నూతన నటుడు: ప్రదీప్ రంగనాథన్ (లవ్ టుడే) * ఉత్తమ నూతన నటి: అదితి శంకర్ (విరుమాన్) * ఎక్స్ట్రార్డినరీ అచీవ్మెంట్ అవార్డు : మణిరత్నం * ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి (పొన్నియిన్ సెల్వన్ - 1) (ఇదీ చదవండి: శ్రావణ భార్గవికి రెండో పెళ్లి.. హల్దీ ఫంక్షన్ ఫోటోలు వైరల్) -
రజనీకాంత్ 171 సినిమా ప్రకటన.. డైరెక్టర్ ఎవరంటే?
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ప్రకటన వచ్చేసింది. తన 171 చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నట్లు అదికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తన X వెబ్సైట్లో ప్రచురించింది. సన్ పిక్చర్స్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్ పూర్తి.. అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం) సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహింస్తుండటంతో ఒక్కసారిగా భారీ అంచనాలు పెరిగిపోయాయి. కార్తీతో ఖైదీ, విజయ్‌తో మాస్టర్, కమల్ హసన్‌తో విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన డైరెక్ట్ చేసిన విషయం తెలిసందే. విక్రమ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఆయనకు రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. అలాగే ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఆధ్వర్యంలో రజనీకాంత్ 170వ చిత్రం జైలర్ ఆగస్టు 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టింది. జైలర్ విజయాన్ని పురస్కరించుకుని, సన్ పిక్చర్స్ చైర్మన్ కళానిధి మారన్, రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్‌లకు చెక్‌తో పాటు కార్లను బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత సినిమాలో పనిచేసిన 300 మందికి జైలర్ పేరుతో బంగారు నాణేన్ని బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంలో, సూపర్ స్టార్ రజనీకాంత్ 171 చిత్రాన్ని సన్ పిక్చర్స్ 'తలైవర్ 171' గా నిర్మించబోతున్నట్లు చిత్ర సంస్థ X వెబ్సైట్లో అధికారిక సమాచారాన్ని పోస్ట్ చేసింది. #Thalaivar171 అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. We are happy to announce Superstar @rajinikanth’s #Thalaivar171 Written & Directed by @Dir_Lokesh An @anirudhofficial musical Action by @anbariv pic.twitter.com/fNGCUZq1xi — Sun Pictures (@sunpictures) September 11, 2023 -
క్రికెట్ మ్యాచ్‌లో 'జవాన్' ప్లాన్: అట్లీ
ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం జవాన్. దీనికి కారణాలెన్నో. ముఖ్యంగా పఠాన్ వంటి సంచలన విజయం సాథించిన చిత్రం తరువాత తెరపైకి వస్తున్న చిత్రం ఇది కావడం. అదేవిధంగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ దీనికి దర్శకుడు కావడం. లేడీ సూపర్‌స్టార్ నయనతార జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం. క్రేజీ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం, తమిళ నటుడు విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం, దీపికా పదుకునే గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నేడు (సెప్టెంబర్ 7) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మీడియాతో ముచ్చటిస్తూ తాను బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఊహించలేదన్నారు. దీనికి కర్త, కర్మ, క్రియ బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్నేనని పేర్కొన్నారు. ఆయన నమ్మకమే జవాన్ చిత్రం అని పేర్కొన్నారు. ఒకసారి క్రికెట్ మ్యాచ్ చూడడానికి చైన్నె వచ్చినప్పుడు షారూఖ్‌ఖాన్ తన కార్యాలయాలనికి వచ్చారన్నారు. తామిద్దరం సుమారు మూడున్నర గంటలు మాట్లాడుకున్నామని చెప్పారు. అప్పుడే జవాన్ చిత్రానికి బీజం పడిందని చెప్పారు. రూ.350 కోట్లు బడ్జెట్లో చిత్రం చేయడానికి సిద్ధమయ్యామన్నారు. కరోనా కాలంలో షారూఖ్‌ఖాన్ ధైర్యం చేసి ఈ చిత్రాన్ని నిర్మించారని చెప్పారు. అయితే తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. అలా నటి నయనతార, విజయ్‌సేతుపతి, యోగిబాబు, సంగీత దర్శకుడు అనిరుధ్, ఎడిటర్ రూపన్ ఇలా అందరినీ తానే ఈ చిత్రంలోని తీసుకున్నానని చెప్పారు. అయితే చిత్రం అన్ని వర్గాలను అలరించే విధంగా రూపొందించాలన్నదే లక్ష్యంగా భావించామన్నారు. జవాన్ చిత్రం అందరికీ సంతృప్తికరంగా వచ్చిందన్నారు. పఠాన్ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత వస్తున్న చిత్రం కాబట్టి ఆ చిత్రాన్ని రీచ్ అవుతుందా? అన్న విషయం గురించి ఆలోచించలేదన్నారు. ఒక మంచి చిత్రం చేయాలన్న ధ్యేయంతోనే జవాన్ చిత్రం చేశామని అట్లీ చెప్పారు. -
ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార ఎంట్రీ.. ఫాలో అయ్యేది ఆ ఐదుగురిని మాత్రమే
సౌత్ ఇండియా లేడీ సూపార్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. నేడు అందరూ రాఖీ పండుగ సెలబ్రేషన్లో ఉండగా నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టింది. మొదటగా తన ఇద్దరు కుమారులతో (ఉయిర్, ఉలగం) కలిసి ఉన్న స్టైలిష్ వీడియోను షేర్ చేసింది. నయనతార ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే భారీగా వైరల్ కావడంతో ఆమెను లక్షల మంది ఫాలో అయ్యారు. ఆమె పెట్టిన రీల్‌ను కూడా ఇప్పటికే ఐదు లక్షలకు పైగా లైక్ చేయగా.. రెండు మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. (ఇదీ చదవండి: హీరో గోపీచంద్‌ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్) ఇప్పటికే సౌత్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకుని జవాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన నయన్‌కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. తన కుమారుల ఫోటోలను ఇప్పటి వరకు ఎక్కడా రివీల్ చేయని నయన్ తొలిసారి ఇలా షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. జవాన్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నయన్ ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆమెకు ఇప్పటి వరకు ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేయలేదు. తనకు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు భర్త విఘ్నేష్ శివన్ షేర్ చేస్తూ వచ్చేవాడు. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు) 'జైలర్'లోని హుకుమ్ పాట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో తన కవలలను ఎత్తుకుని మాస్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చిన నయన్ తన ఇన్‌స్టాలో మాత్రం కేవలం ఐదుగురిని మాత్రం ఫాలో అవుతుంది. అందులో తన భర్త విఘ్నేశ్, హీరో షారుక్ ఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, ఒబామా భార్య మిషెల్లి ఒబామాతో పాటు తన సొంత ప్రొడక్షన్ సంస్థ అయిన 'ది రౌడీ పిక్చర్స్' ఉన్నాయి. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
'జవాన్' రెండో ట్రైలర్ విడుదల
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. యూఎస్ఏలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్లో సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను నెలరోజుల కిందటే విడుదలైంది. అందులో భారీ యాక్షన్ సీన్స్‌తో షారుక్ అదరగొట్టాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గపడుతుండడం వల్ల సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. అందువల్ల ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్‌ను కూడా మేకర్స్ తాజాగ విడుదల చేశారు. రెండో ట్రైలర్లో కూడా షారుఖ్ దుమ్ములేపాడనే చెప్పవచ్చు. ముంబయ్‌లోని మెట్రోను షారుఖ్ హైజాక్ చేస్తాడు.. ఈ సీన్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుండగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. ట్రైలర్లో విజయ్ సేతుపతిని ప్రత్యేకమైన లుక్‌లో చూపించారని చెప్పవచ్చు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ జవాన్‌ను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నరు. ఈ సినిమా సెప్టెంబర్ 7న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలోకి రానుంది .ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా(దుబాయ్)పై జవాన్ ట్రైలర్‌ను ప్రదర్శించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. దీనిని నేడు రాత్రి (ఆగష్టు 31) 9 గంటలకు పదర్శించనున్నారు. బుర్జ్ ఖలీఫా బిల్డింగ్‌పై షారుక్ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలో రిలీజైన 'పఠాన్' సినిమా ట్రైలర్‌ను కూడా ఇదివరకే అక్కడ ప్రదర్శించిన విషయం తెలిసిందే. -
అనిరుద్ గురించి విజయ్ దేవరకొండ వైరల్ కామెంట్స్
రౌడీ హీరోగా ముద్ర వేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం ఖుషి. సమంత కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ ఎలమంచిలి కలిసి నిర్మించారు. శివ నిర్వాణ కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మురళి చాయాగ్రహణంను, హెశాన్ అబ్దుల్ మహబ్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ ఒకటో తేదీ విడుదల కానుంది. (ఇదీ చదవండి: రాజకీయాల్లో చిరు ఓడిపోవచ్చేమో కానీ సినిమాల్లో ఎప్పటికీ 'మగధీరుడే') దీన్ని తమిళనాడులో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ అధినేత ఎన్వీ ప్రసాద్, కేరళలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ముఖేష్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఆర్బీ చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నిర్మాత ఎంవీ ప్రసాద్ మాట్లాడుతూ.. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించిన చిత్రాలు 90 శాతం విజయం సాధించాయన్నారు. ఖుషి చిత్రానికి తమిళనాడులో మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తాను ఇంతకుముందు నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం చిత్రాల కాలం నుంచి తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఖుషీ చిత్రం కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. నటి సమంతతో కలిసి ఈ చిత్రంలో నటించడం మంచి ఎక్స్పీరియన్స్ అన్నారు. తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఎందరో సూపర్ స్టార్స్ ఉన్నారని, అయితే జాతీయస్థాయిలో వెలిగిపోతున్న ఒకే ఒక్క సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్ అని పేర్కొన్నారు. ఆయన్ను కిడ్నాప్ చేసి తీసుకుపోవాలనిపిస్తోందన్నారు. అనిరుధ్ సంగీత దర్శకత్వంలో ఒక చిత్రం చేయాల్సిందని, అది మిస్ అయిందని, త్వరలోనే తాము కలిసి పనిచేస్తామని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్‌మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. -
ఆ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్‌తో పాటు ఆరుగురు వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్స్
ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం జవాన్. షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించి తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీ పతాకంపై నిర్మించిన చిత్రం ఇది. ఈయన ఇంతకు ముందు నటించిన పఠాన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో జవాన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో విశేషం ఏమిటంటే ఇందులో కోలీవుడ్ నటీనటులు, సాంకేతిక వర్గం ఎక్కువగా పని చేశారు. కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఇందులో నయనతార నాయకిగా, విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన జవాన్‌లో మరో విశేషం ఆరుగురు అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్స్ పని చేయడం. స్పిరో రజటొస్, యనిక్ బెన్, ట్రెయిన్ మాక్రే, కెచ్చా కంపాక్డీ, అనల్ అరసు మొదలగు ఆరుగురు ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన పోరాట దృశ్యాలు, బైక్, కారు ఛేజింగ్స్ జవాన్ చిత్రంలో హైలెట్ కానున్నాయని యూనిట్ సభ్యులు తెలిపాయి. (ఇదీ చదవండి: చిరంజీవిపై విషప్రయోగం.. 35 ఏళ్ల తర్వాత బయటపడ్డ నిజం!) జవాన్ చిత్రం ట్రైలర్ చూస్తేనే యాక్షన్ సన్నివేశాలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. పాటలను భారీగా ఖర్చు చేసి బ్రహ్మాండంగా చిత్రీకరించారు. దీంతో జవాన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 7వ తేదీన తెరపైకి రానుంది. -
రజనీకాంత్‌కు అనిరుధ్ ఏమవుతాడో తెలుసా.. ? జైలర్ సక్సెస్ సీక్రెట్ ఇదే
రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గలేదు.. ఈ మూవీలో 'హుకూం' సాంగ్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇందులో రజనీకాంత్ స్టైల్‌కు యువ సంచలనం అనిరుధ్ అందించిన మ్యూజిక్, బీజీఎం నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. రజనీ కోసం ఆయన ఇచ్చిన బీజీఎంతో ప్రేక్షకులకు గూస్బమ్స్ తెప్పించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో అనిరుధ్ ఇచ్చిన స్టేజ్ ఫర్మామెన్స్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. (ఇదీ చదవండి: పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్) స్టేజీపై మ్యూజిక్కు తగ్గట్టుగా ఆతను ఊగిపోతూ పాడుతుంటే ఆడియన్స్‌ను మరో ట్రాన్స్‌లోకి వెళ్తారు. అంతలా రజనీ కోసం పర్ఫామెన్స్ ఇచ్చాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్‌డమ్‌ను వివరిస్తూ సాగే ఆ పాట సినీ అభిమానులను ఊపేస్తోంది. జైలర్ సినిమాతో అనిరుధ్ తమిళంలో నెంబర్ వన్ స్టార్ అయ్యాడు. 2012లో ధనుష్ త్రి సినిమా కోసం పాటను కంపోజ్ చేసినప్పుడు కేవలం 21 ఏళ్లు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దపు కాలం గడిచింది. తన కెరియర్లో ఎన్నో అద్బుతమైన పాటలను అందించాడు. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏఆర్ రెహమాన్‌ను మించిపోయాడని సినీ ట్రేడర్స్ తెలుపుతున్నాయి. రజనీకి కుమారుడు లేరనే సమస్య లేదు: విఘ్నేష్ జైలర్ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో అనిరుధ్- రజనీకాంత్ బంధం గురించి దర్శకుడు విఘ్నేష్ శివన్ (నయనతార భర్త) చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. 'మనం జీవితంలో కొన్ని అద్భుతమైన క్షణాల కోసం ఎదురుచూస్తాం. నేను తలైవా ముందు నిలబడిన ఈ క్షణం అలాంటిదే. జైలర్‌లో తండ్రీకొడుకుల అనుబంధంపై ఓ పాట రాశాను. దాని గురించి గుర్తుచేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. దానికి కారణం నేను ఇప్పుడు ఇద్దరు అబ్బాయిల తండ్రిని. భవిష్యత్తులో వాళ్లు పెద్దయ్యాక నేను రాసిన పాట రజనీ సినిమాలో ఉందని చెబుతాను. (ఇదీ చదవండి: అతను నా తమ్ముడు.. అవసరమైతే ఎన్నికల్లో ప్రచారం చేస్తా: విష్ణు) అలాగే, తలైవా గురించి నేను ఇంకో విషయం చెప్పాలి. రజనీ సార్ కోసం ఓ పాటను సిద్ధం చేసినప్పుడే తలైవా పట్ల అనిరుధ్‌లోని నిజాయతీ, ప్రేమ కనిపించాయి. రజనీ సర్కి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయనకు కొడుకు లేడనే సమస్య అనిరుధ్‌తో తీరిపోయింది. ఎందుకంటే తలైవా పట్ల అతనిలో విపరీతమైన ప్రేమను చూశాను. ఒకవేళ రజనీకి కొడుకు ఉంటే అనిరుద్- రజనీకాంత్ బంధాన్ని చూసి అసూయపడేవాడు.' అని విఘ్నేష్ శివన్ అన్నారు. (అనిరుధ్ ఫ్యామిలీ) రజనీ- అనిరుధ్ మధ్య ఉన్న బంధుత్వం ఇదే ఆడియో లాంచ్ ఫంక్షన్‌కి అనిరుధ్ వచ్చినప్పుడు సూపర్ స్టార్ రజనీ అతన్ని కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అనిరుధ్ తమిళ నటుడు రవి రాఘవేంద్ర కుమారుడు అనే సంగతి తెలిసిందే. ఆయన రజనీకాంత్‌కు చాలా దగ్గర బంధువు. తలైవా భార్య సతీమణి లతా రజనీకి మేనల్లుడు అవుతాడు. అందుకే రజనీకి అనిరుధ్ అంటే ప్రత్యేక అభిమానం. సుమారు 30 ఏళ్ల క్రితం రజనీ కాంత్ సినిమా షూటింగ్లో ఉండగా అనిరుధ్‌ను తీసుకుని లత వెళ్లారట. ఆ సమయంలో రజనీ-అనిరుధ్ ఫోటో దిగారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
ప్రముఖ సింగర్‌తో అనిరుధ్ ప్రేమాయణం
తమిళ చిత్రాలతో పాటు తెలుగు సినిమాలకూ తనదైన శైలిలో సంగీతం అందిస్తున్నారు అనిరుధ్ రవిచందర్. సంగీత ప్రపంచంలో అనిరుధ్ అనేదు పేరు కాదు బ్రాండ్. ఆయన నుంచి పాట వచ్చిందంటే చాలు అది బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. 'వై దిస్ కొలవెరి కొలవెరి కొలవెరి డి సాంగ్'తో సరిగ్గా పదేళ్లే క్రితం ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తనకు 20 ఏళ్ల వయసులోనే మ్యూజిక్ వరల్డ్‌లోకి వచ్చి సీనియర్లకే గట్టిపోటి ఇచ్చాడు. తెలుగులో 'అజ్ఞాతవాసి' చిత్రంతో పరిచయమయ్యాడు. ఆ సినిమా హిట్ కాకపోయిన అనిరుధ్ మ్యూజిక్ మాత్రం ఇప్పటికి వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు 'దేవర' సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. (ఇదీ చదవండి: విక్రమ్ కోసం కథ సిద్ధం చేస్తున్న స్టార్ డైరెక్టర్) తన సంగీతంతో మంచి గుర్తింపు అయితే వచ్చింది కానీ.. సినీ పరిశ్రమలోని నటీమణులతో రిలేషన్స్‌లో ఉన్నాడనే వార్తలు ఎక్కువగానే వస్తుంటాయి. గతంలో కోలీవుడ్‌లో సుచీ లీక్స్ పేరుతో పలు ఫోటోలో కూడా బయటకు వచ్చాయి. హీరోయిన్ ఆండ్రియాతో అనిరుధ్ డీప్ లిప్ లాక్ పెట్టుకుంటున్న ఫోటో అప్పట్లో లీక్ అయ్యింది. ఒక రకంగా అది సినీ పరిశ్రమలో పెద్ద దుమారమే రేపింది. తాజాగా ఆయన చుట్టూ మరో వివాదం రేగుతుంది. 'బీస్ట్' సినిమాలో 'అరబిక్ కుత్తు' సాంగ్ పాడి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ 'జోనితా గాంధీ'తో అనిరుధ్ ఎఫైర్ నడుపుతున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. కొన్నిరోజులుగా వారిద్దరూ కలిసే తిరుగుతున్నారని టాక్. కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా నుంచే వీరిద్దరూ డీప్ లవ్‌లో పడిపోయారని తెలుస్తోంది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అందుకే అనిరుధ్ ఎక్కడ ఉంటే 'జోనితా' కూడా అక్కడే కనిపిస్తోందని చెబుతున్నారు. ఇంత జరుగుతన్నా ఈ జంట మాత్రం ఖండించింది లేదు.. అలాగని ఇవన్నీ నిజమేనని చెప్పనూ లేదు. ఇప్పటికైనా నోరు విప్పు విషయం ఏమిటో చెప్పాలని ఆయన అభిమానులు ట్వీట్లు కూడా చేస్తున్నారు. (ఇదీ చదవండి: అమ్మాయిలు నాలుగు రకాలు అంటూ నిహారిక పోస్ట్) -
Thalapathy67: అప్పుడు ‘మాస్టర్’.. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్!
‘మాస్టర్’ తర్వాత కోలీవుడ్ స్టార్ విజయ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కుతుందనే విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ని ఇచ్చింది నిర్మాణ సంస్థ 7స్క్రీన్ స్టూడియో. ‘మాస్టర్, వారిసు తర్వాత విజయ్‌తో కలిసి పనిచేస్తుండడం సంతోషంగా ఉంది. #Thalapathy37(వర్కింగ్ టైటిల్)కు లోకేశ్ కనగరాజ్దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 2 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందన్ , సినిమాటోగ్రఫీ మనోస్ పరమహంస అందిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’అని 7స్క్రీన్ స్టూడియో ఒక ప్రకటనలో తెలిపింది. గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. మాస్టర్ సినిమా తర్వాత లోకేశ్-విజయ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. The one & the only brand #Thalapathy67, is proudly presented by @7screenstudio 🔥 We are excited in officially bringing you the announcement of our most prestigious project ♥️ We are delighted to collaborate with #Thalapathy @actorvijay sir, for the third time. @Dir_Lokesh pic.twitter.com/0YMCbVbm97 — Seven Screen Studio (@7screenstudio) January 30, 2023 -
రికార్డులు సృష్టిస్తోన్న ‘కుట్టి స్టోరీ’ సాంగ్
తమిళ హీరో ‘ఇళయ దళపతి’ విజయ్ నటిస్తున్నయాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మాస్టర్’. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆండ్రియా, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అదే విధంగా ‘మాస్టర్’ చిత్రంలో విజయ్ సేతుపతి నెగటీవ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఆడియన్స్ నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ప్రేమికుల రోజు పురస్కరించుకోని ఈ చిత్రంలోని ‘కుట్టి స్టోరీ’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటను హీరో విజయ్, చిత్రానికి సంగీతం అందించిన అనిరుద్ రవిచంద్రన్ కలిసి పాడటం విశేషం. అనురాజా కామరాజ్ సాహిత్యం అందించారు. ప్రస్తుతం ‘కుట్టి స్టోరీ’ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో కొనసాగుతూ అత్యధిక వ్యూస్ సంపాదిస్తోంది. అంతర్జాతీయ మ్యూజిక్ చార్టులో చోటు దక్కించుకుని.. ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానాన్ని ఆక్రమించింది. విడుదల చేసిన రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న‘కుట్టి స్టోరీ’ పాట విజయంపై సర్వకర్త అనిరుద్ రవిచంద్రన్ తన ట్విటర్ ఖాతాలో స్పందించారు. ‘‘కుట్టి స్టోరీ’ పాటకు కోటి వ్యూస్ అందించిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ ఏడాది ప్రారంభంలో హిట్ ట్రాక్‌గా నిలిచిన ‘కుట్టిస్టోరీ’కి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు’ అని అనిరుద్ ట్వీట్ చేశారు. 1 crore love for Thalapathy @actorvijay sir ‘s #KuttiStory 🔥🔥🔥 @Arunrajakamaraj thanks bro! Kodi nandrigal to all of you for making it the biggest track of the year 🙏🏻🙏🏻🙏🏻@Jagadishbliss @MalavikaM_ @SonyMusicSouth @XBFilmCreators @Lalit_SevenScr pic.twitter.com/Qnm65nXidy — Anirudh Ravichander (@anirudhofficial) February 15, 2020 -
పాడతారా?
పవన్‌కల్యాణ్ పాడతారా? లేదా? ప్రస్తుతానికి సస్పెన్స్! కానీ, పవన్‌తో ఒక్క పాట పాడించాలని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్‌ల ఆలోచన. ఆల్రెడీ పవన్ దగ్గర ఈ ప్రపోజల్ పెట్టారు. మరి, ఆయన ఏమంటారో? పవన్‌కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి అనిరుద్ స్వరకర్త. ఆల్రెడీ అన్ని ట్యూన్స్‌ని ఫైనలైజ్ చేసేశారట. అందులో ఓ పాటను పవన్ చేత పాడించాలనుకుంటున్నామని స్వయంగా అనిరుద్ పేర్కొన్నారు. ‘అత్తారింటికి దారేది’లో పవన్ పాడిన ‘కాటమరాయుడా... కదిరి నరసింహుడా’ పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. ఇంకోసారి పవన్ సింగర్‌గా తన గొంతు వినిపిస్తారా? వెయిట్ అండ్ సీ!!