Anirudh Ravichander Love Relationship With Singer Jonita Gandhi, Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

Anirudh, Jonita Gandhi Love Rumours: ప్రముఖ సింగర్‌తో అనిరుధ్ ప్రేమాయణం

Jul 10 2023 7:50 AM | Updated on Jul 10 2023 10:36 AM

Anirudh Ravichander Love Affair Singer Jonita Gandhi - Sakshi

తమిళ చిత్రాలతో పాటు తెలుగు సినిమాలకూ తనదైన శైలిలో సంగీతం అందిస్తున్నారు అనిరుధ్ రవిచందర్. సంగీత ప్రపంచంలో అనిరుధ్ అనేదు పేరు కాదు బ్రాండ్. ఆయన నుంచి పాట వచ్చిందంటే చాలు అది బ్లాక్‌ బస్టర్ అవ్వాల్సిందే. 'వై దిస్ కొలవెరి కొలవెరి కొలవెరి డి సాంగ్'తో సరిగ్గా పదేళ్లే క్రితం ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. తనకు 20 ఏళ్ల వయసులోనే మ్యూజిక్‌ వరల్డ్‌లోకి వచ్చి సీనియర్లకే గట్టిపోటి ఇచ్చాడు. తెలుగులో  'అజ్ఞాతవాసి' చిత్రంతో పరిచయమయ్యాడు. ఆ సినిమా హిట్‌ కాకపోయిన అనిరుధ్‌ మ్యూజిక్ మాత్రం ఇప్పటికి వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు 'దేవర' సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.  

(ఇదీ చదవండి: విక్రమ్‌ కోసం కథ సిద్ధం చేస్తున్న స్టార్‌ డైరెక్టర్‌)

తన సంగీతంతో మంచి గుర్తింపు అయితే వచ్చింది కానీ.. సినీ పరిశ్రమలోని నటీమణులతో  రిలేషన్స్‌లో ఉన్నాడనే వార్తలు ఎక్కువగానే వస్తుంటాయి. గతంలో కోలీవుడ్‌లో సుచీ లీక్స్ పేరుతో పలు ఫోటోలో కూడా బయటకు వచ్చాయి.  హీరోయిన్ ఆండ్రియాతో అనిరుధ్ డీప్ లిప్ లాక్ పెట్టుకుంటున్న ఫోటో అప్పట్లో లీక్ అయ్యింది. ఒక రకంగా అది సినీ పరిశ్రమలో పెద్ద దుమారమే రేపింది.

తాజాగా ఆయన చుట్టూ మరో వివాదం రేగుతుంది. 'బీస్ట్' సినిమాలో 'అరబిక్ కుత్తు' సాంగ్ పాడి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ 'జోనితా గాంధీ'తో అనిరుధ్‌ ఎఫైర్ నడుపుతున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. కొన్నిరోజులుగా వారిద్దరూ కలిసే తిరుగుతున్నారని టాక్‌. కమల్‌ హాసన్‌ 'విక్రమ్‌' సినిమా నుంచే వీరిద్దరూ డీప్‌ లవ్‌లో పడిపోయారని తెలుస్తోంది. త‍్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. అందుకే అనిరుధ్ ఎక్కడ ఉంటే 'జోనితా' కూడా అక్కడే కనిపిస్తోందని చెబుతున్నారు. ఇంత జరుగుతన్నా ఈ జంట మాత్రం ఖండించింది లేదు.. అలాగని ఇవన్నీ నిజమేనని చెప్పనూ లేదు. ఇప్పటికైనా నోరు విప్పు విషయం ఏమిటో చెప్పాలని ఆయన అభిమానులు ట్వీట్లు కూడా చేస్తున్నారు.

(ఇదీ చదవండి: అమ్మాయిలు నాలుగు రకాలు అంటూ నిహారిక పోస్ట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement