ఎన్టీఆర్- కోరటాల శివ కాంబినేషన్‌లో తెరెక్కిన సినిమా దేవర. కొన్ని గంటల్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో టికెట్ల అమ్మకాలు జరిగాయి. నేడు అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో ఎక్కడ చూసిన దేవర బజ్ క్రియేట్ అయింది. అయితే, తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
'దేవర సినిమాకు సంగీతం అందిస్తున్న క్రమంలో ఆ సీన్లు చూసి నేను ఆశ్చర్యపోయాను. దీంతో ప్రేక్షకులకు మరింత అనుభూతిని అందించాలని ఈ సినిమాకు సంబంధించిన రీరికార్డింగ్ వర్క్‌లో 90 శాతం పైగానే విదేశాల్లో పూర్తి చేశాను. దేవర చూస్తున్నంత సేపు హాలీవుడ్ సినిమాలైన 'అవెంజర్స్, బ్యాట్‌మ్యాన్' చిత్రాలను చూసిన ఫీల్ కలగుతుంది. ఇదొక భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులోని సంగీతం అందరినీ మెప్పిస్తుంది. ఇంత గొప్ప సినిమాను ఎలా నిర్మించారని నాకు అనిపించింది. అదే అనుభూతిని సెప్టెంబర్ 27న ప్రేక్షకులు కూడా పొందుతారు. అందుకే నేను కూడా తారక్ అభిమానులతో కలిసి దేవర ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తాను. కొరటాల శివ హైదరాబాద్‌లో ఏ థియేటర్‌కు తీసుకెళ్లినా సంతోషమే. వాళ్లందరితో కలిసి ఎంజాయ్ చేస్తా.' అని అనిరుధ్ పంచుకున్నారు.
జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ దేవర చిత్రానికి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు.
Comments
Please login to add a commentAdd a comment