రజనీకాంత్‌ 171 సినిమా ప్రకటన.. డైరెక్టర్‌ ఎవరంటే? | Rajinikanth 171th Movie Officially Announced By Sun Pictures | Sakshi
Sakshi News home page

Rajinikanth 171th Movie: రజనీకాంత్‌ 171 సినిమా ప్రకటన.. బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌కు దక్కిన ఛాన్స్‌

Sep 11 2023 1:23 PM | Updated on Sep 11 2023 1:55 PM

Rajinikanth 171th Movie Officially Announced By Sun Pictures - Sakshi

జైలర్‌ తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్  సినిమా ప్రకటన వచ్చేసింది. తన 171 చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నట్లు అదికారికంగా అనౌన్స్‌ చేశారు. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తన X వెబ్‌సైట్‌లో ప్రచురించింది. సన్‌ పిక్చర్స్‌ విడుదల చేసిన పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

(ఇదీ చదవండి: పంచ్‌ ప్రసాద్‌కు ఆపరేషన్‌ పూర్తి.. అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం)

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహింస్తుండటంతో ఒక్కసారిగా భారీ అంచనాలు పెరిగిపోయాయి. కార్తీతో ఖైదీ, విజయ్‌తో మాస్టర్‌, కమల్‌ హసన్‌తో విక్రమ్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలకు ఆయన డైరెక్ట్‌ చేసిన విషయం తెలిసందే. విక్రమ్‌ లాంటి సూపర్‌ హిట్‌ సినిమా తర్వాత ఆయనకు రజనీకాంత్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం దక్కింది. అలాగే ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. 

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఆధ్వర్యంలో రజనీకాంత్ 170వ చిత్రం జైలర్ ఆగస్టు 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టింది. జైలర్ విజయాన్ని పురస్కరించుకుని, సన్ పిక్చర్స్ చైర్మన్ కళానిధి మారన్, రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్‌లకు చెక్‌తో పాటు కార్లను బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత సినిమాలో పనిచేసిన 300 మందికి జైలర్ పేరుతో బంగారు నాణేన్ని బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంలో, సూపర్ స్టార్ రజనీకాంత్ 171 చిత్రాన్ని సన్ పిక్చర్స్ 'తలైవర్ 171' గా నిర్మించబోతున్నట్లు చిత్ర సంస్థ X వెబ్‌సైట్‌లో అధికారిక సమాచారాన్ని పోస్ట్ చేసింది. #Thalaivar171 అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement