జైపూర్ వెళ్లనున్నారు కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్‌లో జరగనుందని, ఈ షెడ్యూల్‌లో రజనీకాంత్, ఆమిర్ ఖాన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో సినిమా దాదాపు పూర్తవుతుందట. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘కూలీ’ సినిమాను కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment