Sathyaraj
-
సరికొత్త బార్భరిక్
సత్యరాజ్, వశిష్ఠ ఎన్. సింహ, సాంచీ రాయ్, ఉదయ భాను, ‘సత్యం’ రాజేశ్, క్రాంతి కిరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్భరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో దర్శకుడు మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై విజయపాల్ రెడ్డి నిర్మించారు.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ‘‘ఓ సరికొత్త పాయింట్‌తో ‘త్రిబాణధారి బార్భరిక్’ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఇన్ఫ్యూజన్ బ్యాండ్. -
జైపూర్‌కు కూలీ
జైపూర్ వెళ్లనున్నారు కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్‌లో జరగనుందని, ఈ షెడ్యూల్లో రజనీకాంత్, ఆమిర్ ఖాన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో సినిమా దాదాపు పూర్తవుతుందట. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘కూలీ’ సినిమాను కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. -
సత్యదేవ్ 'జీబ్రా' టీజర్ విడుదల
సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జీబ్రా’. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాదిలో 'కృష్ణమ్మ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. ఇప్పుడు జీబ్రా అనే చిత్రంతో రానున్నాడు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు.ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందించారు. -
కట్టప్ప లేటెస్ట్ సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్
'బాహుబలి' కట్టప్పగా మనందరికీ సుపరిచితమైన సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'వెపన్'. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి థియేటర్లలో రిలీజ్ అనుకున్నారు. ఎందుకో వెనక్కి తగ్గారు. తాజాగా తమిళ వెర్షన్‌ని ఆహా ఓటీటీలోకి తీసుకురాగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్‌ని మరో ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చారు.(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)సత్యరాజ్, ఆనంద్ రవి లీడ్ రోల్స్ చేసిన 'వెపన్' చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. అయితే థియేటర్లలో స్కిప్ చేసిన తెలుగు వెర్షన్‌ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. యాక్షన్ మూవీ లవర్స్ దీన్ని ట్రై చేయొచ్చు.'వెపన్' విషయానికొస్తే.. అగ్ని (వసంత్ రవి) ఓ యూట్యూబర్. ప్రకృతి రక్షించేందుకు పాటుపడుతుంటాడు. తేని జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఓ సంస్థ దగ్గర బాంబు పేలుడు జరుగుతుంది. ఈ ప్రాంతంలో అగ్నిని పోలీసులు పట్టుకుంటారు. టెర్రిరిస్ట్ అనుమానంతో అరెస్ట్ చేస్తారు. అయితే తాను ప్రపంచానికి తెలియని సూపర్ హీరో మిత్రన్ (సత్యరాజ్) గురించి వెతుకుతున్నానని, ఈ బ్లాస్టులతో సంబంధం లేదని అంటారు. ఇంతకీ మిత్రన్ ఎవరు? అతడికి అగ్నికి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్) -
నా లుక్ కొత్తగా ఉంటుంది: సత్యరాజ్
‘‘బాహుబలి’ తర్వాత సినిమాల రేంజ్ పెరిగింది. తెలుగు ప్రేక్షకులతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ‘తుఫాన్’ సినిమాతో వారికి మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నాను’’ అని విజయ్ ఆంటోనీ అన్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రం ‘తుఫాన్’. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో కమల్ బోరా, డి. లలిత, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ–‘‘తుఫాన్’ కంటెంట్, క్వాలిటీ మాకు సక్సెస్ ఇస్తాయన్న నమ్మకం ఉంది. నిర్మాతలు ఎంతో కష్టపడి ఈ సినిమాను తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. వారికి థ్యాంక్స్’’ అన్నారు.‘‘నాకు నచ్చిన థ్రిల్లర్ మూవీ ‘తుఫాన్’. ఈ సినిమాలో నా లుక్, మేకోవర్, క్యారెక్టర్ కొత్తగా ఉంటాయి’’ అన్నారు సత్యరాజ్. ‘‘తుఫాన్’ను థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు విజయ్ మిల్టన్. ‘‘తుఫాన్’లో క్వాలిటీ కంటెంట్, కమర్షియల్ అంశాలు ఉన్నాయి’’ అన్నారు ధనుంజయ. -
సికందర్‌కు విలన్ గా
సల్మాన్ ఖాన్ కు విలన్ గా నటుడు సత్యరాజ్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘సికందర్’ అనే ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నారు. జూన్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరిగేలా యూనిట్ సన్నాహాలు చేస్తోందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ రోల్‌కు సత్యరాజ్‌ను తీసుకున్నారట మురుగదాస్.ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్ టాక్. సాజిద్ నడియాడ్వాలా నిర్మించనున్న ‘సికందర్’ వచ్చే ఏడాది రంజాన్‌కి విడుదల కానుంది. ఇదిలా ఉంటే రజనీకాంత్ కూలీ మూవీలో అతడి స్నేహితుడి పాత్రలో సత్యరాజ్ నటించనున్నారని కోలీవుడ్ టాక్. 1986లో వచ్చిన ‘మిస్టర్ భరత్’ సినిమాలో రజనీకాంత్, సత్యరాజ్ చివరిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మళ్లీ 38 సంవత్సరాల తర్వాత ‘కూలీ’ సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకుంటారా? వేచి చూడాలి. -
ఓ పార్టీ నుంచి పిలుపొచ్చింది.. కానీ..: దివ్య సత్యరాజ్
ప్రముఖ నటుడు సత్యరాజ్ కూతురు దివ్య సత్యరాజ్ ప్రముఖ న్యూట్రిషియన్.. ఆమె చాలా కాలంగా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల తను రాజకీయ రంగప్రవేశం చేస్తానని కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆమె శనివారం ఓ మీడియా ప్రకటన చేశారు. అందులో.. తనను చాలా మంది రాజకీయ రంగప్రవేశం చేయడానికి కారణం ఏంటి? ఎంపీగా పోటీ చేస్తారా? మంత్రి పదవి కోసం రాయకీయాల్లోకి వస్తున్నారా? వంటి పలు ప్రశ్నలు వేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ ఎంట్రీ నిజమే.. తాను రాజకీయరంగ ప్రవేశం చేస్తానని చెప్పిన మాట నిజమేనని, అయితే ఏ పదవిని ఆశించో రాజకీయాల్లోకి రావాలని భావించడం లేదని, ప్రజలకు మంచి చేయాలన్నదే తన ప్రధాన లక్ష్యం అని చెప్పారు. తాను చాలా కాలంగా పేదలకు సేవలను అందిస్తూ వస్తున్నానని చెప్పారు. మహిళ్‌మతి ఇయక్కం పేరుతో మూడేళ్ల క్రితమే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. తద్వారా తమిళనాడులోని నిరుపేదలకు పుష్టికరమైన ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అలాంటి పార్టీలో చేరే ఆలోచనే లేదు అలాగే తనకు ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి పిలుపు వచ్చిందన్నారు. అయితే మతతత్వ పార్టీల్లో చేరే ఆలోచన తనకు లేదని, అలాగని తాను సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించనని చెప్పారు. ఏ పార్టీలో చేరేది ఎన్నికలు ముగిసిన తరువాత వెల్లడిస్తానని దివ్య సత్యరాజ్ పేర్కొన్నారు. విప్లవ తమిళుడు సత్యరాజ్ కూతురిగా తమిళుల మంచి కోసం శ్రమిస్తానని ఆమె అన్నారు. చదవండి: 'జైలర్' హిట్ నా వల్లే.. నిర్మాతలకు తమన్నా కొత్త డిమాండ్ -
కట్టప్ప కొత్త సినిమా.. AI టెక్నాలజీతో యంగ్ లుక్‌లో..
నటుడు, బాహుబలి 'కట్టప్ప' సత్యరాజ్, వసంత రవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం వెపన్. చాగల్లు సురేష్ మేళం, నటి తాన్య హోప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టూడియో పతాకంపై ఎంఎస్ మంజూర్ నిర్మిస్తున్నారు. గుహన్ సినీయప్పన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం దర్శకుడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. హాలీవుడ్ చిత్రాలు సూపర్ మాన్, సూపర్ వుమెన్ చిత్రాల తరహాలో సాగే మరో భవిష్య భరిత కథా చిత్రం వెపన్ అని చెప్పాడు. ఇందులో నటుడు సత్యరాజ్ సూపర్ మాన్‌గా నటించారన్నాడు. అయితే ఆయనకు ఆ ఆసక్తి ఎలా వచ్చిందన్నది సస్పెన్స్ అన్నారు. ఆయన్ని చంపడం ఎవరి తరం కాదన్నాడు. హాలీవుడ్ చిత్రాల్లో ముంచుకొస్తున్న ముప్పు నుంచి ప్రపంచాన్ని సూపర్ హీరోలు కాపాడతారని, ఈ చిత్రంలో సత్యరాజ్ తన శక్తితో ఎవరినీ కాపాడకుండా తన వ్యక్తిగత విషయాల కోసం వాడుకుంటారని పేర్కొన్నాడు. ఇందులో ఆయన అడవిలో దారి తప్పిన ఏనుగులను కాపాడే వ్యక్తిగా నటించారన్నాడు. సత్యరాజ్‌కి సీన్ వివరిస్తున్న దర్శకుడు ఫిదా నటుడు వసంత రవి బయట ప్రపంచంలోని అద్భుత వ్యక్తుల గురించి పరిచయం చేసే యూట్యూబర్‌గా నటించినట్లు చెప్పాడు. సురేష్ వేణు ప్రతి నాయకుడిగా నటించారని తెలిపాడు. కాగా ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్‌లో నటుడు సత్యరాజ్ చాలా యంగ్‌గా కనిపిస్తారన్నాడు. అందుకోసం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్లు వెల్లడించాడు. నిర్మాత ఎమ్మెస్ ముంజూర్ మాట్లాడుతూ వెపన్ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పాడు. మరో విషయం ఏంటంటే దీన్ని హాలీవుడ్ చిత్రాల తరహాలో పలు ఫ్రాంచైజీలుగా రూపొందించనున్నట్లు చెప్పాడు. చదవండి: ఇకపై నరేశ్ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. తీర్పు వెల్లడించిన కోర్టు -
‘కట్టప్ప’ సత్యరాజ్ కూతురు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
నటుడు సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు. బాహుబలి చిత్రంతో కట్టప్పగా దేశ్యవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. తమిళ నటుడైన అయన ఎన్నో తెలుగు చిత్రాల్లో తండ్రి పాత్రలతో చేసి మెప్పించారు. శంఖం, మిర్చి, వంటి చిత్రాల్లో హీరోలకు తండ్రిగా నటించి తెలుగ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక బాహుబలితో కట్టప్పగా నేషనల్ స్టార్‌గా మారారు. అంత స్టార్ హోదా పొందిన ఆయన మీడియాకు దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. అందుకే సత్యరాజ్ ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆయనకు భార్య మహేశ్వరి, ఓ కొడుకు, కూతురు ఉన్నారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పటికే ఆయన కుమారుడు సిబిరాజ్ సినీరంగ ప్రవేశం చేశాడు. డోరా, మాయోన్ వంటి చిత్రాల్లో నటించిన మెప్పించాడు. ఇక ఆయన కూతురు పేరు దివ్య సత్యరాజ్. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటున్న దివ్య న్యూట్రిషియన్‌గా కెరీర్ కొనసాగిస్తుంది. స్టార్ నటుడి కూతురిగా మీడియా కంటపడకుండా పర్సనల్ లైఫ్‌ని లీడ్ చేస్తున్న ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. View this post on Instagram A post shared by Divya Sathyaraj (@divya_sathyaraj) ఇన్స్టాగ్రామ్ వేదికగా తరచూ నెటిజన్లకు ఆరోగ్యం, ఆహారపు అలవాట్లపై సలహాలు, సూచనలు ఇస్తుంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలు బయటకు రావడంతో హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని అందం అంటూ సినీ ప్రియులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే తండ్రి వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చే ఆలోచన ఉందా? అనే ప్రశ్నలు తనకు తరచూ ఎదురవుతుంటాయట. దివ్య మాత్రం తన ప్రొఫెషన్‌తో చాలా హ్యాపీగా ఉన్నానని, సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదంటూ సమాధానం ఇస్తుందని సన్నిహితుల నుంచి సమాచారం. View this post on Instagram A post shared by Divya Sathyaraj (@divya_sathyaraj) View this post on Instagram A post shared by Divya Sathyaraj (@divya_sathyaraj) View this post on Instagram A post shared by Divya Sathyaraj (@divya_sathyaraj) -
మా అబ్బాయిని ఆదరించండి
‘‘నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘మాయోన్’ చిత్రం ద్వారా తెలుగులోకి హీరోగా పరిచయమవుతున్న నా కుమారుడు సిబి సత్యరాజ్‌ను కూడా ఆదరించాలి. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’’ అని నటుడు సత్యరాజ్ అన్నారు. కిషోర్ దర్శకత్వంలో సిబి సత్యరాజ్, తాన్యా రవిచంద్రన్ జంటగా నటించిన చిత్రం ‘మాయోన్’. అరుణ్ మోజి మాణికం నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని మూవీమ్యాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్ ఈ నెల 7న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్లో వేడుకలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నేను రాసుకున్న ‘బాహుబలి’ కథలో కట్టప్పగా సత్యరాజ్ నటించడంతో తనకి, నాకు ఏదో రుణానుబంధం ఏర్పడింది. ‘మాయోన్’ హిట్ కావాలి’’ అన్నారు. ‘‘మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది’’అన్నారు కిషోర్. ‘‘మాయోన్’ చిత్రంలో నేను ఆర్కియాలజిస్ట్‌గా నటించాను’’ అన్నారు హీరో శిబి సత్యరాజ్. ‘‘పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది’’ అన్నారు మామిడాల శ్రీనివాస్. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: రామ్‌ప్రసాద్. -
ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్
Sathyaraj About His Role In Chennai Express Movie: దక్షిణాది ప్రముఖ నటుల్లో సత్యరాజ్ ఒకరు. దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించిన బాహుబాలితో కట్టప్పగా వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయ్యారు. కథ, పాత్ర నచ్చితే చాలు అందులో ఇమిడిపోతారు. ఎలాంటి సన్నివేశాలకైన వెనుకాడరు. అలాంటి ఆయన పాత్ర నచ్చకపోయిన ఓ మూవీ ఒప్పుకున్నారట. కేవలం అందులోని హీరో కోసమే ఆ పాత్ర చేశానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కట్టప్ప. 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో పాత్ర కోసం చిత్రబృందం నన్ను సంప్రదించింది. కానీ నాకు ఆ పాత్ర గొప్పదిగా అనిపించలేదు. ఇదే విషయాన్ని షారుక్, డైరెక్టర్ రోహిత్ శెట్టికి చెప్పాను. కానీ ఫైనల్‌గా షారుక్ ఖాన్‌పై అభిమానంతో ఆ మూవీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే షారుక్ అంటే నాకెప్పటి నుంచో అభిమానం. ఆయన నటించిన దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే ఎన్నోసార్లు చూశా. అందులో షారుక్ నటన నాకెంతో నచ్చింది. అందుకే ఆయనతో నటించాలన్న ఉద్దేశంతో ఆ సినిమా ఒప్పుకున్నా.' అని సత్యరాజ్ తెలిపారు. కాగా యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' 2013లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో హీరోయిన్ దీపిక పదుకొణె తండ్రి పాత్రలో లోకల్ మాఫియా నాయకుడిగా సత్యరాజ్ నటించారు. -
సూర్య ఈటీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
క్లైమాక్స్ లేకుండా రిలీజైన రానా మూవీ, ప్రేక్షకుల అసహనం..
Rana Daggubati 1945 Movie Released Without Climax: స్టార్ హీరో రానా ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు సత్య శివ 2016లో తెరకెక్కించిన చిత్రం 1945. బ్రిటీష్ పాలన నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఇందులో హీరోయిన్గా రెజీన నటించగా.. నాజర్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. బాహుబలి సినిమా సమయంలో రానా ఈ మూవీకి కమిట్మెంట్ ఇచ్చాడు. ఈ క్రమంలో షూటింగ్ చివరి దశలో ఉందనగా ఈ మూవీ నిర్మాత సి. కల్యాన్, దర్శకుడు సత్య శివ, రానాల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో రానా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో 90 శాతం పూర్తయిన షూటింగ్ ఆగిపోయింది. చదవండి: Sukumar: మణిరత్నం గారంటే అభిమానం, కానీ కలిసేందుకు వెళ్లిన నాతో సీరియస్‌గా.. ఇదిలా ఉంటే నాలుగేళ్ల తర్వాత ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. చెప్పినట్టుగానే ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ ఈ మూవీని జనవరి 7న థియేటర్లో విడుదల చేశారు మేకర్స్. అయితే 1945 చూసిన వాళ్లంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు క్లైమాక్స్ లేదని, ఎడింగ్ కూడా సరిగా లేదు. సినిమా అంతా అస్తవ్యస్తంగా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రుకటించిన వెంటనే రానా స్పందిస్తూ ట్వీట్ చేశాడు. చదవండి: ఒకే రోజు ఓటీటీకి మూడు కొత్త సినిమాలు, ఉదయం నుంచే స్ట్రీమింగ్ ‘సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు. క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ జరగలేదు. అలాగే నిర్మాత నుంచి నాకు రావాల్సిన రెమ్యునరేషన్ అందలేదు. డబ్బుల కోసమే పూర్తికాని సినిమాను విడుదల చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు’ అంటూ రాసుకొచ్చాడు. ఇక రానా ట్వీట్ నిర్మాతలు రిప్లై ఇస్తూ.. ‘సినిమా పూర్తి అయ్యిందా లేదా అనేది దర్శకులది తుది నిర్ణయం’ అంటూ అనడంతో రానా ఒకే అన్నట్లుగా థంమ్స్ప్ ఎమోజీనితో స్పందించాడు. కాగా ఈ సినిమా సుభాశ్ చంద్రబోస్ జీవిత కథ, ఆయన మరణం నేపథ్యంలో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ మూవీ ఆన్లైన్ వెబ్సైట్లో లీకైంది. మూవీరూల్స్, తమిళరాక్స్ వంటి వెబ్సైట్లలోకి అందుబాటులో ఉంది. -
బాహుబలి కట్టప్ప ఇంట విషాదం
Bahubali Actor Sathyaraj Younger Sister Kalpana Passess Away Due To Ill Health: తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు సత్యరాజ్ అంటే గుర్తుపడతారో లేదో కానీ బాహుబలి సినిమాలో కట్టప్ప అంటే మాత్రం అందరూ ఇట్టే గుర్తుపడతారు. తాజాగా ఈ నటుడి ఇంట్లో విషాదం నెలకొంది. సత్యరాజ్ చెల్లెలు కల్పన మండ్రాదియార్(66) శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా గాంగేయంలో నివసిస్తున్న కల్పన కొద్దివారాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు కోయంబత్తూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం కన్నుమూశారు. దీంతో సత్యరాజ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సత్యరాజ్ సోదరి మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ సినీతారలు సంతాపం తెలియజేశారు. -
‘ప్రతిరోజూ పండగే’ మూవీ స్టిల్స్
-
పండగలా.. ప్రతిరోజూ పండగే
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ప్రతిరోజూ పండగే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్ట్‌ర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా మంగళవారం తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కుటుంబ బంధాలు, విలువలను గుర్తు చేసేలా ఈ చిత్రం రూపొందినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో చూస్తే సత్యరాజ్, తేజ్‌ల మధ్య సన్నివేశాలు చాలా బాగా కుదిరినట్టుగా అనిపిస్తోంది. మంచి ఫీల్‌తో సాగిన ఈ ప్రమోషన్ వీడియో అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. కాగా, మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పత్రిరోజు పండగే యూనిట్ సాయిధరమ్ తేజ్ బర్త్‌డే వేడుకలను నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మారుతి తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. -
షూటింగ్ మొదలైన రోజే వివాదం!
వాల్టర్ పేరు వినగానే నటుడు సత్యరాజ్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటించిన సూపర్‌హిట్ చిత్రం వాల్టర్ వెట్రివేల్ గుర్తుకు వస్తుంది. సత్యరాజ్ వారసుడు శిబిరాజ్ వాల్టర్‌లో హీరోగా నటిస్తున్నారు. 11–11 సినిమా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా అన్బు అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. కాగా నెంజముండు నేర్మైయుండు ఓడు రాజా చిత్రం ఫేమ్ నటి శిరిన్ కాంచ్వాలా సిబిరాజ్‌తో రొమాన్స్ చేయనున్నారు. మరో ముఖ్య పాత్రలో దర్శకుడు సముద్రకని నటిస్తున్నారు. కుంభకోణం నేపథ్యంలో యాక్షన్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం శుక్రవారం చెన్నైలో ప్రారంభం అయింది. కాగా ఇదే రోజున ప్రముఖ ఫైనాన్సియర్, నిర్మాత శింగారవేలన్ వాల్టర్ పేరుతో విక్రమ్‌ప్రభు, అర్జున్‌లను నటింపజేస్తూ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి అన్బరసన్ దర్శకత్వం వహించనున్నారని పేర్కొన్నారు. వాల్టర్ చిత్ర కథ, టైటిల్ తనకు చెందినవని, వాటిని తన అనుమతి లేకుండా వాడితే సంబంధిత దర్శక, నిర్మాతలపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇలా వాల్టర్ చిత్రం ఆదిలోనే వివాదాంశంగా మారడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. -
నాన్నగా నటించడం ఇష్టం లేదు
తమిళసినిమా: నాన్న పాత్రల్లో నటించడం ఇష్టం లేదని నటుడు సత్యరాజ్ పేర్కొన్నారు. ఆయన సోమవారం ఈ రోడ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యరాజ్ మాట్లాడుతూ ఆరంభంలో తనకు ఘోరమైన విలన్ వేషాలే లభించాయన్నారు. నూరావదు నాళ్ చిత్రంలో విలన్ పాత్రను పోషించాననీ, ఆ చిత్రం హిట్ అవుతుందా? అన్న ఆతృతతో విడుదల సమయంలో థియేటర్లకు వెళ్లి చూశానన్నారు. ఎంజీఆర్ చిత్రాలకు వచ్చినంత జనం తన చిత్రానికి రావడంతో నటుడిగా పాస్ అయ్యాయన్నారు. అప్పట్లో రజనీకాంత్, కమలహాసన్ ఇలా అందరి చిత్రాలకు నేనే విలన్ అని చెప్పారు. హీరోగానూ పలు చిత్రాల్లో నటించిన తాను బాగానే సంపాదించుకున్నానని సత్యరాజ్ తెలిపారు. ఇకపై తండ్రి పాత్రలు వద్దనుకునేసరికి తెలుగులో గోపీచంద్ హీరోగా ఓ చిత్రంలో నాన్న పాత్రకు అంగీకరించానన్నారు. ఆ చిత్రంలో కథానా యకి త్రిష తనను మామగారు అని పిలుస్తుం టే చచ్చానురా! అనిపించిందన్నారు. అలా నటిస్తున్న సమయంలోనే బాహుబలి లాంటి గొప్ప అవకాశం వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. -
రైతు సమస్యలపై చినబాబు పోరు
కార్తీ, సాయేషా జంటగా నటించిన చిత్రం ‘చినబాబు’. సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించారు. పాండిరాజ్ దర్శకత్వంలో 2డి ఎంటరై్టన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్స్‌లో హీరో సూర్య, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో రైతుల సమస్యలను పాండిరాజ్ చక్కగా చర్చించారు. కామెడీ, యాక్షన్ కూడా ఉంటుంది. కార్తీ తొలిసారి రైతు పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్లో కార్తీ చెప్పిన డైలాగ్స్ ఆలోచింపచేసేలా ఉన్నాయి. టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. త్వరలో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నాం. ఇందులో శత్రు మెయిన్ విలన్‌గా నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ప్రియా భవానిశంకర్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: సి.హెచ్. సాయికుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్, సంగీతం: డి.ఇమాన్, కెమెరా: వేల్రాజ్. -
ఇంగ్లీష్‌పై కట్టప్ప జోకులు
బాహుబలితో ప్రభాస్ ఎంత ఫేమస్ అయ్యారో అదే రేంజ్లో పేరు వచ్చిన నటుడు సత్యరాజ్. ఈ సిరీస్‌లో తన నటనతో అందరినీ అంతలా ఆకట్టుకున్నాడు ఈ కటప్ప. కీలక పాత్రలు పోషించడంలో ముందుండే సత్యరాజ్ కార్తీ నటించిన చినబాబు చిత్రంలో కూడా నటించాడు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక శనివారం జరిగింది. ఈసందర్భంగా సత్యరాజ్ తనతీరుకు భిన్నంగా, కొత్త యాంగిల్లో స్టేజ్‌పై జోకులు పేల్చేరు. అందరి మొహంలో చిరునవ్వులు పూయించారు. సినిమా వేడుకలో మాట్లాడుతూ.. తాను బీఎస్సీ ఇంగ్లీష్ మీడియంలో చదివానని.. కానీ తనకు ఇంగ్లీష్ రాదని చెప్పారు. ఒకసారి తన ప్రొఫెసర్ ఇంగ్లీష్‌లో నాలుగుముక్కులు సరిగ్గా మాట్లాడలేవా అంటూ అడిగారట.. దానికి సత్యరాజ్ సమాధానం ఇస్తూ తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు 50 కిలోమీటర్లు అంత దగ్గర ఉన్న తెలుగే సరిగ్గా రాదు. ఎక్కడో 8వేల కిలోమీటర్ల ఉన్న లండన్ ఇంగ్లీష్ ఎలా వస్తుందంటూ చమత్కరించారట. ఈ విషయాన్ని చినబాబు వేదికపై పంచుకొన్నారు. -
బ్యాంకాక్‌లో బాహుబలి.. లండన్‌లో కట్టప్ప
ముందు బాహుబలి (ప్రభాస్) బొమ్మ.. ఇప్పుడు కట్టప్ప (సత్యరాజ్) బొమ్మ కూడా కనువిందు చేయనుంది. ఎక్కడ అంటే? మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో. తుస్సాడ్స్ బ్యాంకాక్ శాఖలో ఇప్పటికే బాహుబలి కొలువు దీరాడు. ఇప్పుడు లండన్ శాఖలో కట్టప్ప కనిపించబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకునే ప్రముఖుల మైనపు విగ్రహాలను తుస్సాడ్స్ వారు మ్యూజియంలో ప్రతిష్టించే విషయం తెలిసిందే. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ మైనపు విగ్రహాన్ని బాహుబలి గెటప్‌లోనే ప్రతిష్టించారు. ఇదే సినిమా ద్వారా బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్న సత్యరాజ్ విగ్రహాన్ని కట్టప్ప గెటప్‌లో పెట్టాలని తుస్సాడ్స్ నిర్ణయించుకుంది. త్వరలో సత్యరాజ్‌ని కలిసి విగ్రహ కొలతలు తీసుకోనున్నారు. లండన్ తుస్సాడ్స్‌లో చోటు సంపాదించుకోబోతున్న తొలి తమిళ నటుడు సత్యరాజే కావడం విశేషం. తమిళంలో ఆయన దాదాపు 200 పై చిలుకు సినిమాలు చేసినా ఒక్క ‘బాహుబలి’ ఆయన్ను వరల్డ్ వైడ్‌గా పాపులర్ చేసేసింది. -
కట్టప్పకు అరుదైన గౌరవం
సాక్షి, సినిమా : బాహుబలి సిరీస్‌లో కట్టప్ప పాత్రకు దక్కిన గుర్తింపు అంతా ఇంతా కాదు. మాషిష్మతి రాజ్యానికి, సింహాసనానికి.. నమ్మిన బంటుగా ఉండే పాత్రలో నటుడు సత్యరాజ్ మెప్పించగా.. దర్శకధీరుడు రాజమౌళి ఆ పాత్రను అద్భుతంగా తీర్చి దిద్దడంతో జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఆ కట్టప్ప అలియాస్ సత్యరాజ్‌కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో కట్టప్ప మైనం విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో కట్టప్ప రూపంలో ఉన్న సత్యరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మ్యూజియం నిర్వాహకులు ప్రకటించారు. ఈ విషయాన్ని కోలీవుడ్ మీడియా, సత్యరాజ్ తనయుడు శిబి సత్యారాజ్ కూడా ధృవీకరించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే... మేడమ్ టుస్సాడ్‌లో విగ్రహ ఏర్పాటు గౌరవం అందుకున్న తొలి తమిళ నటుడు సత్యరాజ్ కావటం. అంతకు ముందు బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్ విగ్రహాన్ని కూడా బ్యాంకాక్ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో నెలకొల్పిన విషయం తెలిసిందే. Really proud to read this!😊🙏🏻 #Kattappa #Baahubali https://t.co/M61ZcN8OLU — Sibi (Sathya)raj (@Sibi_Sathyaraj) 11 March 2018 -
హర్రర్ చిత్రంలో సత్యరాజ్
కోలీవుడ్‌లో హర్రర్ కథా చిత్రాల ట్రెండ్ చాలా కాలంగానే కొనసాగుతోంది. ఇందుకు కారణం ప్రేక్షకుల ఆదరణే అని చెప్పవచ్చు. ఇకపోతే దక్షిణ భారతీయ సినిమాలో ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి ఆ పాత్రకు జీవం పోసే నటుడు సత్యరాజ్. ఈ మధ్య బాహుబలి చిత్రంతో తన పేరును దేశ వ్యాప్తంగా ఇనుమడింపజేసుకున్న ఈయన తాజాగా హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంలో ప్రధాన పాత్రను పోషించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని కళ్లపడం చిత్ర ఫేమ్ వేల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ పాత్రలకు నప్పే నటులను ఎంపిక చేసుకోవడం చిత్రానికి చాలా ముఖ్యం అని తాను భావిస్తానన్నారు. ఆ విధంగా తాజా చిత్రానికి సత్యరాజ్ నటించడానికి ఒప్పుకోవడంతో సగం పని తగ్గిందని అన్నారు. ఇది ఒక ఎఫ్ఎం రేడియో స్టూడియో నేపథ్యంలో సాగే సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఒక రాత్రి ఎఫ్ఎం.రేడియో స్టూడియోలో జరిగిన సంఘటన ఇతివృత్తంగా చిత్రం ఉంటుందన్నారు. దీన్ని ఒక ఎఫ్ఎం స్టూడియోలోనే చిత్రీకరించనున్నట్లు తెలిపారు. ఒక నూతన నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని, ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చెప్పారు. హర్రర్ కథా చిత్రాల్లో ఈ చిత్రం వైవిధ్యభరితంగా ఉంటుందని దర్శకుడు వేల్ పేర్కొన్నారు. ఇంకాపేరు నిర్ణయించని ఈ సినిమా ఉత్కంఠ భరిత సన్నివేశాలతో అన్ని వర్గాలను అలరించే చిత్రంగా ఉంటుందని అన్నారు. -
కట్టప్పకు బాహుబలి సలహా
బాహుబలిని పర్సనల్‌గా ఓ సలహా అడిగారు కట్టప్ప. ఎవరి కోసం అనుకుంటున్నారు? సొంత కొడుకు కోసం. అది కూడా రాజమాత శివగామికి తెలియకుండా! ఏంటిది? బ్రహ్మచారి అయిన కట్టప్పకు వారసుడా? రాజమౌళి ఏమన్నా ‘బాహుబలి 3’ ప్లాన్ చేయడం లేదు కదా! అని ఆలోచించొద్దు. ఎందుకంటే కట్టప్ప సలహా అడిగింది రీల్ లైఫ్‌లో కాదు. రియల్ లైఫ్‌లోనే. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘క్షణం’ చిత్రాన్ని తమిళంలో ‘సత్య’ అనే టైటిల్‌తో రీమేక్ చేశారు. సత్యరాజ్ (కట్టప్ప) తనయుడు శిబి హీరోగా ప్రదీప్ డైరెక్షన్లో రూపొందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 8న రిలీజ్ చేయనున్నట్లు చెన్నైలో జరిగిన విలేకర్ల సమావేశంలో చిత్రబృందం పేర్కొంది. ఈ కార్యక్రమంలో సత్యరాజ్ తాను ఈ సినిమా కోసం ప్రభాస్ సలహా తీసుకున్నానని చెప్పారు. ‘‘క్షణం సినిమాను తమిళంలో రీమేక్ చేయాలనుకుంటున్న విషయాన్ని శిబి నాకు చెప్పాడు. అప్పుడు నేను ‘బాహుబలి’ షూటింగ్లో ఉన్నా. ఈ విషయం గురించి ప్రభాస్‌ను అడగ్గా..‘క్షణం సినిమాలో మంచి కంటెంట్ ఉంది. స్క్రిప్ట్ డిఫరెంట్. చేయొచ్చు’ అన్నారు. ఆ మాటలు నాలో కాన్ఫిడెన్స్ నింపాయి. ఆ నమ్మకంతోనే సినిమా రైట్స్ కొన్నాను. కానీ, నేను ‘క్షణం’ చూడలేదు’’ అని సత్యరాజ్ అసలు విషయం చెప్పారు. సో.. కట్టప్పకు బాహుబలి (ప్రభాస్) ఇచ్చిన సలహా ఇదన్నమాట. -
రానా... మళ్లీ గడ్డం పెంచాలి నాన్నా!
ఎవరీ కుర్రాడు? రానాను చూడగానే మ్యాగ్జిమమ్ మనుషులకు డౌటొచ్చింది. చెన్నైలో నాగచైతన్య–సమంత రిసెప్షన్లో! డైరెక్టుగా ‘నువ్వెవరు?’ అనడిగినోళ్లూ ఉన్నారు. ‘నేనండీ... మీ రానాను’ అని చెప్పుకున్నారట! ఎప్పుడూ గడ్డంతో కనిపించే కుర్రాడు సడన్‌గా క్లీన్ షేవ్ లుక్కులో కనిపించేసరికి కన్ఫ్యూజ్ అవ్వరా మరి? ఇంతకీ, రానా గడ్డం ఎందుకు తీశారు? తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘1945’ కోసం! అందులో కొన్ని సన్నివేశాలను క్లీన్ షేవ్ లుక్కులో షూట్ చేశారు. అయితే... సిన్మా అంతా సేమ్ లుక్ ఉండదు. కొన్ని సీన్లలో క్లీన్ షేవ్‌తోనూ, మరికొన్ని సీన్లలో గడ్డంతోనూ కనిపించనున్నారు. క్లీన్ షేవ్ సీన్లు అన్నిటినీ రానా కంప్లీట్ చేసేశారని సమాచారమ్. ఆల్రెడీ గడ్డంతో కొన్ని సీన్లు తీశారు. మరికొన్నిటికి రానా మళ్లీ గడ్డం పెంచుతున్నారు. సో, త్వరలోనే రానా ట్రేడ్ మార్క్ లుక్ (గడ్డంతో)ను ప్రేక్షకులు మళ్లీ చూడొచ్చన్న మాట. ఏ మాటకామాటే చెప్పుకోవాలి... రానా గడ్డం మెయిన్టైన్ చేసినా బాగుంటారు. క్లీన్ షేవ్లోనూ హ్యాండ్సమ్గా ఉన్నారని ప్రేక్షకులు మెచ్చుకున్నారు. సత్యశివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘1945’లో రెజీనా హీరోయిన్గా, నాజర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
రీల్ పైకి ఎంజీఆర్ రియల్ లైఫ్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్... ఇప్పుడు ఇటు సౌత్ అటు నార్త్‌లో బయోపిక్‌ల (జీవితకథ) ట్రెండ్ నడుస్తోంది. మూవీస్, స్పోర్ట్స్, పాలిటిక్స్‌కి చెందిన సెలబ్రిటీల జీవిత కథలను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించడానికి ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్రముఖ దివంగత నటుడు, తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ బయోపిక్‌కి శ్రీకారం జరిగింది. బాలకృష్ణన్ దర్శకత్వంలో రమణ కమ్యూనికేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రారంభం కానుంది. ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ముఖ్య అతిథిగా హాజరవుతారు. మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రకు ఇంకా ఎవర్నీ సెలక్ట్ చేయలేదు. ఈ పాత్ర కోసం చిత్రబృందం పలువురి పేర్లను పరిశీలిస్తున్నారట. కాగా, ‘బాహుబలి’లో కట్టప్పగా అలరించిన సత్యరాజ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు కోలీవుడ్ టాక్. తెలుగులోనూ ఎన్టీఆర్ బయోపిక్‌లు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటు సినిమా, అటు రాజకీయరంగంలో రాణించిన ఎన్టీఆర్, ఎంజీఆర్ బయోపిక్‌లు ఏకకాలంలో రూపొందనుండటం తెలుగు, తమిళ రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ అయింది. -
శివగామితో కట్టప్ప రొమాన్స్.. ఫ్యాన్స్ షాక్!
-
శివగామితో కట్టప్ప రొమాన్స్.. ఫ్యాన్స్ షాక్!
చెన్నై: రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి-2 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. మాహిష్మతి సామ్రాజ్యం రాజమాత శివగామి పాత్రల్లో నటించిన రమ్యకృష్ణకు హీరోల స్థాయిలో పేరు వచ్చింది. ఇక రాణికి విశ్వాసపాత్రుడిగా, బానిసగా కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్‌కు కూడా మంచి మార్కులు పడ్డాయి. కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడని ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రేక్షకులకు సమాధానం దొరికింది. అయితే థియేటర్లలో ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మరో కొత్త ట్విస్ట్ ఎదురైంది..! సినిమా విరామంలో స్నాక్స్, డ్రింక్స్ తీసుకుని థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులు తెరపై కనిపిస్తున్న దృశ్యం చూసి షాకయ్యారు. శివగామి (రమ్యకృష్ణ) పక్కన కట్టప్ప (సత్యరాజ్) కూర్చుని రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఇదేంటి రాజమాతతో బానిస ఇంత చనువుగా ఉండటం ఏంటి? అంటూ ప్రేక్షకులు అయోమయానికి గురయ్యారు. కాసేపు ఏమీ అర్థం కాలేదు. కట్టప్ప ఓ చీరను శివగామికి కానుకగా ఇవ్వగా ఆమె తీసుకుని మురిసిపోతోంది. ప్రేక్షకులు అయోమయంలో ఉండగానే ఇది పోతిస్ యాడ్ అంటూ తెరపై కనిపిస్తుంది. ఇది వ్యాపార ప్రకటన అని తెలిశాక ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దేశ వ్యాప్తంగా బాహుబలికి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి పాపులర్ టెక్స్టైల్ బ్రాండ్ కోసం రమ్యకృష్ణ, సత్యరాజ్‌లతో యాడ్ రూపొందించారు. ఇందులో వీరిద్దరూ రాజు, రాణిగా కనిపిస్తారు. రమకృష్ణ బాహుబలి సినిమాలో మాదిరిగా అదే వేషధారణతో కనిపించగా, సత్యరాజ్ మాత్రం ఈ సినిమాలో పాత్రకు భిన్నంగా బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు ధరించి రాచఠీవిలో కనిపిస్తాడు. మొత్తానికి ఈ యాడ్ చూసిన ప్రేక్షకులు అయోమయానికి గురికావడంతో పాటు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
సత్యరాజ్ క్షమాపణపై కమల్ స్పందన
చెన్నై:తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాలపై కట్టప్ప వ్యాఖ్యలు-బాహుబలి వివాదం నేపథ్యంలో సత్యరాజ్ కన్నడిగులకు క్షమాపణ చెప్పడంపై నటుడు, దర్శకుడు కమల్‌హాసన్ స్పందించారు. కమల్ సత్యరాజ్‌కు శనివారం ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. సత్యరాజ్ గొప్ప మానవుడని కొనియాడారు. "సంక్లిష్ట వాతావరణంలో హేతుబద్ధతను కాపాడిన సత్యరాజ్‌కు అభినందనలు" అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన సినిమా విరుమాందిలోని క్షమాపణ కోరినవాడే గొప్పమానవుడు అన్న మాటలను ఉటంకించారు. మరోవైపు తమిళనాడు బీజేపీ నాయకుడు, మాజీ ఎంఎల్ఏ రాజా సత్యరాజ్, కమల్ హాసన్‌లపై మండిపడ్డారు. వారికి డబ్బుమీద ధ్యాస తప్ప తమిళుల మీద ప్రేమ లేదని ట్విట్టర్ లో ధ్వజమెత్తారు. వారు డబ్బు గురించి మాత్రమే బాధపడతారు , తమిళనాడు, తమిళ సెంటిమెంట్‌పై వారికి పైపైన ప్రేమ మాత్రమేనేని విమర్శించారు. డబ్బు కోసం ఆత్మగౌరవంలేని చర్య గా ఆయన అభివర్ణించారు. కాగా తొమ్మిదేళ్ళ క్రితం సినీ నటుడు సత్యరాజ్, కావేరీ జలాల వివాదంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ వివాదం 'బాహుబలి' (ది కన్‌క్లూజన్) సినిమా విడుదలకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి సత్యరాజ్ తరపున క్షమాపణలు చెప్పారు. అయినా సత్యరాజ్ క్షమాపణలు చెప్పాల్సిందే అని కన్నడిగులు పట్టుబట్టడంతో కర్నాటక ప్రజలపై తనకెప్పుడూ చిన్న చూపు లేదనీ, తనవ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి వుంటే క్షమించమంటూ సత్యరాజ్ కోరిన సంగతి తెలిసిందే. Congrats Mr. Sathyaraj for maintaining rationality in a troubled environement. Quoting VirumaaNdi மன்னிப்புக் கேக்கறவன் பெரியமனுசன். Bravo — Kamal Haasan (@ikamalhaasan) April 22, 2017 Whether it is Kamal or Sathyaraj they are bothered only about money. Their love for Tamil and their Tamil sentiment is only skin deep — H Raja (@HRajaBJP) April 21, 2017 -
బాహుబలి2 విడుదలకు సహకరించాలి..
చెన్నై: కావేరి వివాదంలో తమిళ నటుడు సత్యరాజ్ క్షమాపణలు చెప్పాడు. అంతేకాక బాహుబలి-2ను అడ్డుకోకూడదని కన్నడిగులకు దర్శకుడు రాజమౌళి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ.. 9 సంవత్సరాల ముందు మాట్లాడిన మాటలకు నిరసనగా బాహుబలి-2ను కన్నడిగులు ప్రదర్శన చేయకుండా అడ్డుకుంటామన్నడం కన్నడ, తెలుగు ప్రజల మధ్య విఘాతానికి కారణం కాకూడదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చిత్రా ప్రదర్శన జరిపించాలని కోరారు. కళకు, రాజకీయ మాటలకు సంబంధం లేదని అన్నారు. భారతదేశ చలనచిత్ర వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసిన చిత్రం బాహుబలి అని పోగిడారు. అలాంటి సినిమాను అడ్డుకోకుండా ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని ఆయన అన్నారు. కన్నడ నాట పుట్టి పెరిగినా రాజమౌళిని కన్నడిగులు తమ సహోదరులుగా భావించి చిత్ర విడుదలకు సహకరించాలని పేర్కొన్నారు. అంతేకాక కన్నడ, తెలుగు ప్రజల మధ్య కొనసాగుతున్న సోదర భావం కొనసాగటానికి స్వాగతించాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. -
అసలు కట్టప్ప ఏమన్నాడు?
న్యూఢిల్లీ: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న ఇంతకాలం ప్రేక్షకుల మదిని తొలుస్తూ వచ్చింది. ఆ స్థానంలో కట్టప్ప కన్నడిగులకు క్షమాపణ చెబుతారా, లేదా ? అన్న ప్రశ్న ఆక్రమించింది. చెప్పినా దుమారం రేపిన వివాదం సమసిపోతుందా? సినిమా సకాలంలో విడుదలవుతుందా? అని బాహుబలి అభిమానుల్లో ఆందోళన అంకురించింది. బాహుబలి దర్శకుడు రాజమౌలి సోషల్ మీడియా ద్వారా కట్టప్ప తరఫు బేషరుతుగా కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు. ఆ మరుసటి రోజే, అంటే శుక్రవారం కట్టప్ప పాత్రధారి, తమిళనటుడు సత్యరాజ్ కూడా కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు. ఎప్పుడో చేసిన తన వ్యాఖ్యలు కన్నడిగులను నొప్పించి ఉంటే అందుకు క్షమాపణులు చెబుతున్నానని చెప్పారు. ఈ నెల 28వ తేదీన విడుదల కావాల్సిన బాహుబలి–2 చిత్రం విడుదలను అడ్డుకోరాదని వేడుకున్నారు. ఇంతకు కన్నడిగులను అవమానించేలా సత్యరాజ్ ఏమన్నారు? ఎప్పుడన్నారు? అన్న ప్రశ్నలు కూడా సినిమా ప్రేక్షకులకు కలుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య 800 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్న కావేరీ నదీ పంపకాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో వివాదం నెలకొన్న విషయం తెల్సిందే. ఇరు రాష్ట్రాల నటులు ఎన్నో ఏళ్లుగా వారి వారి ప్రభుత్వాల వైఖరీలకు మద్దతుగా ప్రజాందోళనలకు మద్దతిస్తున్నారు. ధర్నాలు, బైఠాయింపుల్లో కూడా పొల్గొంటున్నారు. 2008లో చెన్నైలో నిర్వహించిన ఓ ధర్నా కార్యక్రమంలో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి నటులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో సత్యరాజ్ మాట్లాడుతూ ‘కుక్కలు ఉచ్చపోస్తుంటే మౌనం వహించే మానులా తమిళప్రజలు ఉండరాదు’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు మండిపడ్డాయి. కాలక్రమంలో ఈ మాటలు ఇరు రాష్ట్రాల ప్రజలు మరచిపోయారు. బహూశ సత్యరాజ్ కూడా మరచిపోయి ఉంటారు. బాహుబలి–2 విడుదలను పురస్కరించుకొని కొందరు నాడు సత్యరాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఏప్రిల్ 28న విడుదలవుతున్న బాహుబలిని అడ్డుకోవడంతోపాటు మొత్తం బెంగళూరు బంద్‌కు వటల్ నాగరాజ్ నాయకత్వంలోని ‘కన్నడ చలవలి వటల్ పక్ష’ సంఘం పిలుపునిచ్చింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరుతుగా సత్యరాజ్ క్షమాపణలు చెబితేగానీ విడుదలను అనుమతించమని నాగరాజ్ హెచ్చరించారు. దానికి కన్నడి చలనచిత్ర వాణిజ్య మండలి కూడా మద్దతు పలికింది. సత్యరాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు చేసినవా, ఎప్పుడో చేసినవా అన్న అంశంతో తమకు సంబంధం లేదని, ఆ వ్యాఖ్యలు కర్ణాటకను, కన్నడిగులను అవమానపరిచే విధంగా ఉన్నాయని మండలి వ్యాఖ్యానించింది. గతంలో నాగరాజ్‌ను పెద్ద కమెడియన్ అంటూ కూడా సత్యరాజ్ ఎద్దేవ చేశారు. ఈ నేపథ్యంలోనే సత్యరాజ్ క్షమాపణల పత్రాన్ని చదవి దాన్ని వీడియోతీసి మీడియాలకు విడుదల చేశారు. కన్నడ సంఘాలు సత్యరాజ్‌ను బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని కోరితే క్షమాపణలు చెప్పిన సత్యరాజ్ చివరలో తాను తమిళ ప్రజల పోరాటానికి ఎప్పుడూ అండగా నిలబడతానని కూడా చెప్పారు. మరి ఇంతటితో వివాదం సమసిపోతుందా, లేదా చూడాలి. వివాదానికి తెరపడకపోతే వాస్తవానికి సత్యరాజ్‌కు వచ్చే నష్టమేమి లేదు. 45 కోట్ల రూపాయలకుపైగా డబ్బులుపెట్టి చిత్రం హక్కులుకొన్ని కన్నడ డిస్ట్రిబ్యూటర్లే నష్టపోతారు. -
ఎట్టకేలకు దిగొచ్చిన ‘కట్టప్ప’
-
ఎట్టకేలకు దిగొచ్చిన ‘కట్టప్ప’
చెన్నై: కన్నడిగుల ఆందోళనతో ‘కట్టప్ప’ దిగొచ్చాడు. కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా 9 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలపై తమిళ నటుడు సత్యరాజ్ క్షమాపణ చెప్పారు. తాను కన్నడ ప్రజలకు వ్యతిరేకం కాదని, వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. తన వ్యాఖ్యలు బాహుబలి-2 సినిమా విడుదలకు అడ్డంకి కారాదని ఆకాంక్షించారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడివుంటే క్షమించాలని వేడుకున్నాడు. బాహుబలి-2 సినిమాను అడ్డుకోవద్దని కన్నడీగులను కోరాడు. ఈ మేరకు లేఖ చదువుతూ వీడియో విడుదల చేశాడు. తమిళ ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతూనేవుంటానని, సినిమాల్లో అవకాశాలు పోయినా లెక్కచేయనని చెప్పారు. కావేరి నదీ జలాల వివాదం నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సత్యరాజ్ క్షమాపణ చెప్పకుంటే బాహుబలి-2 సినిమాను అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. తమ సినిమాను అడ్డుకోవద్దని కన్నడ ప్రజలను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా కోరాడు. భారీ వ్యయంతో తెరకెక్కిన తమ సినిమాను అడ్డుకుంటే తీవ్రంగా నష్టపోతామని తెలిపాడు. రిలీజ్ అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని, బాహుబలి తొలి భాగాన్ని ఆదరించినట్టుగానే కన్నడ ప్రేక్షకులు బాహుబలి-2 కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేశాడు. -
‘బాహుబలి’ విడుదల కానివ్వం
బెంగుళూరు: తమిళనటుడు, బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ బేషరతుగా క్షమాపణ చెప్పేవరకూ ‘బాహుబలి– ది కన్‌క్లూజన్’ చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల కానివ్వమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఏప్రిల్ 28న బాహుబలి రిలీజ్ కానున్న వేళ ‘కన్నడ ఒకోటా’ సంస్థ బెంగుళూరు బంద్‌కు పిలుపునిచ్చింది. ‘కావేరీ జలాల విషయంలో కన్నడిగుల గురించి గతంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు హద్దు దాటాయి. మేం చిత్రాన్ని విడుదల కానివ్వం. మా కార్యకర్తలు ప్రతి జిల్లాలో సినిమా ప్రదర్శనను అడ్డుకుంటారు. కాదు కూడదని రిలీజ్ చేస్తే ఎగ్జిబిటర్లు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ఒకోటా అధ్యక్షుడు వతల్ నాగరాజ్ హెచ్చరించారు. ఈ ఆందోళనకు కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు తెలిపింది. -
వివాదంపై స్పందించిన రాజమౌళి
చెన్నై: కన్నడిగులపై తమిళ నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కర్ణాటకలో బాహుబలి-2 సినిమాను అడ్డుకుంటామని ప్రకటించడంపై దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. ఈ వివాదాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకురావడం సమంజసం కాదని 'ఇండియాటుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 'దాదాపు ఐదేళ్లుగా సత్యరాజ్ తో కలిసి పనిచేస్తున్నా. ఇతరులను బాధ పెట్టేవిధంగా ఆయన నడుచుకోవడం నేనింతవరకు చూడలేదు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన వీడియోల గురించి విచారించాం. అవి తొమ్మిదేళ్ల క్రితం నాటివని తెలిసింది. దీని తర్వాత ఆయన నటించిన 30 సినిమాలు కర్ణాటకలో విడుదలయ్యాయి. బాహుబలి: ది బిగినింగ్ కూడా అందులో ఒకటి. అప్పుడు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ సమయంలో వివాదం చేయడం కరెక్ట్ కాద'ని రాజమౌళి అన్నారు. దగ్గుబాటి రానా మాట్లాడుతూ... 'సత్యరాజ్ 10 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలవి. బాహుబలి మొదటి భాగం కర్ణాటకలో కూడా విడుదలై అందరి అభిమానాన్ని సంపాదించింది. ఘన విజయాన్ని అందుకుంది. వివాదాన్ని మళ్లీ తెరపైకి ప్రచారం పొందాలని కొందరు భావిస్తున్నార'ని అన్నారు. కావేరి నదీ జలాల వివాదం నేపథ్యంలో కన్నడిగులపై సత్యరాజ్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని, ఆయన క్షమాపణ చెప్పేవరకు బాహుబలి-2 సినిమాను విడుదలకానీయబోమని వటల్ నాగరాజ్ అనే కార్యకర్త హెచ్చరించారు. -
దసరా హౌస్‌ఫుల్!
సినిమాలు రిలీజయ్యాక థియేటర్స్ ఫుల్ అవడం కామన్. కానీ, ఈసారి దసరా... చాలా స్పెషల్. రిలీజ్ కన్నా ముందే థియేటర్స్ ఫుల్ అయిపోయాయి. ఒకటీ రెండు కాదు... ఏకంగా డజనుకు పైగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద అప్పుడే కర్చీఫ్ వేసేశాయి. పెద్ద స్టార్స్ లేరన్న మాటే కానీ, యువ హీరోల సినిమాలు సై... అంటే సై... అంటున్నాయి. ఇన్ని సినిమాలకు థియేటర్స్ దొరకడం మాటేమో కానీ, ఈసారి ఆడియన్స్‌కి వినోదం దొరకడం మాత్రం ఖాయమనే అనిపిస్తోంది. బాక్సాఫీస్ దసరాకి... ఇది ‘సాక్షి ఫ్యామిలీ’ టీజర్... హైపరున్నోడు.. తండ్రిపై ప్రేమున్నోడు! చిత్రం: హైపర్, నటీనటులు: రామ్, రాశీఖన్నా, సత్యరాజ్, నరేశ్... దర్శకుడు: సంతోష్ శ్రీనివాస్, నిర్మాతలు: అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, విడుదల తేదీ: సెప్టెంబర్ 30. ‘బాబోయ్.. నా కుమారుడి ప్రేమను తట్టుకోవడం నా వల్ల కాదు’ అని ఓ తండ్రి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. తండ్రిని ప్రేమించే కొడుకు దొరకడం అదృష్టమనుకున్న ఆ తండ్రి కుమారుడి అతి ప్రేమను తట్టుకోలేకపోతాడు. కొడకు అంత హైపర్. ఈ హైపర్ యాక్టివ్ కుర్రాడి కథ ఏంటి? అన్నదే ‘హైపర్’ చిత్రం. ‘కందిరీగ’ తర్వాత హీరో రామ్, దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రమిది. ఈ తండ్రీకొడుకుల కథకు రామ్ ఎనర్జీకి తగ్గట్టు ఫైట్స్, కామెడీ, హీరోయిన్‌తో ప్రేమాయణం జోడించి పసందైన విందు భోజనం లాంటి కమర్షియల్ సినిమా సిద్ధం చేశామని దర్శకుడు చెబుతున్నారు. విజయదశమికి బోణీ కొడుతున్న చిత్రమిదే. అక్టోబర్ 1న అమ్మవారి నవరాత్రులు మొదలు. అంతకు ఒక రోజు ముందే సెప్టెంబర్ 30న ‘హైపర్’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. లవ్.. లైఫ్.. ఫీల్.. చిత్రం: ప్రేమమ్, నటీనటులు: నాగచైతన్య, శ్రుతీహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా, దర్శకుడు: చందు మొండేటి, నిర్మాత: ఎస్.నాగవంశీ, విడుదల తేదీ: అక్టోబర్ 7 రియల్ లైఫ్‌లోనైనా.. రీల్ లైఫ్‌లోనైనా.. ప్రేమకథలకు ముగింపు ఉంటుంది కానీ ప్రేమకు లేదు! ఆ ఫీలింగ్ ఎప్పుడూ మనల్ని పలకరిస్తుంది. ఓ యువకుడి జీవితంలో ఇదే జరిగింది. మూడుసార్లు ప్రేమలో పడ్డాడు. ఓ ప్రేమకథకు ఫుల్స్టాప్ పడిన తర్వాత మరో కథ మొదలైంది. లైఫ్‌లో లవ్ అనే ఫీలింగ్ ఏం మ్యాజిక్ చేసిందనే కథతో తెరకెక్కిన సినిమా ‘ప్రేమమ్’. ముగ్గురు హీరోయిన్లతో నాగచైతన్య నటించిన తొలి చిత్రమిది. దర్శక, నిర్మాతలతోనూ చైతూకి ఇది ఫస్ట్ మూవీ. ఆల్రెడీ రిలీజైన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. ఎవర్గ్రీన్ కాన్సెప్ట్ లవ్. ఏ భాషలోనైనా తిరుగుండదు. మలయాళంలో ‘ప్రేమమ్’ సూపర్ డూపర్ హిట్. ఈ తెలుగు రీమేక్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. బీడీ ఫ్రెండ్స్.. యాక్షన్ గురూ! చిత్రం: ఇజం, నటీనటులు: నందమూరి కల్యాణ్‌రామ్, జగపతిబాబు, అదితీ ఆర్య, దర్శకుడు: పూరి జగన్నాథ్, నిర్మాతలు: నందమూరి కల్యాణ్‌రామ్, విడుదల తేదీ: అక్టోబర్ 7 వ్యవస్థను గౌరవించే హీరోలు ఎవరైనా మాఫియా డాన్లతో ఫ్రెండ్షిప్ చేస్తారా? పూరి జగన్నాథ్ హీరోలు చేస్తారండీ! ‘పోకిరి’ చూడలేదా! పూరి తాజా సినిమా ‘ఇజం’లో హీరో కల్యాణ్‌రామ్ జర్నలిస్ట్‌గానూ, జగపతిబాబు జావేద్ భాయ్గానూ కనిపించనున్నారు. జర్నలిస్ట్‌కి, జావేద్ భాయ్‌కి బీడీల దగ్గర ఫ్రెండ్షిప్ కుదిరింది. ఈ బీడీ ఫ్రెండ్స్ కహానీ ఏంటి? జర్నలిస్ట్ ఏం చేశాడనేది ‘ఇజం’లో చూడమంటున్నారు. ఆల్రెడీ రిలీజైన పూరి మార్క్ టీజర్, కల్యాణ్‌రామ్ సిక్స్‌ప్యాక్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేశాయి. హీరోయిజమ్‌ను ఎలివేట్ చేయడంలో పూరి స్పెషలిస్ట్ కావడంతో ఈ ఫిల్మ్‌తో కల్యాణ్‌రామ్‌కి యాక్షన్ ఇమేజ్ వస్తుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. వన్.. టు.. త్రీ... హారర్ ప్లస్ కామెడీ! చిత్రం: అభినేత్రి, నటీనటులు: ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్, దర్శకుడు: ఏ.ఎల్.విజయ్, నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ, విడుదల తేదీ: అక్టోబర్ 7. ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫార్ములా అంటూ ఏమీ లేదు. ఏ సినిమా సక్సెస్ అయితే ఆ ఫార్ములాను ఫాలో అవడం కామన్. హారర్ ప్లస్ కామెడీ.. ప్రస్తుతం నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఫార్ములా. దీన్ని ఫాలో అవుతూ.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దర్శకుడు ఏఎల్ విజయ్ తీసిన సినిమా ‘అభినేత్రి’. హీరోయిన్ కావాలని ముంబయ్ వెళ్లిన ఓ అమ్మాయి మరణిస్తుంది. అదే ఇంట్లో కొత్తగా పెళ్లైన జంట (ప్రభుదేవా, తమన్నా) అద్దెకు దిగుతారు. మరణించిన అమ్మాయి ఆత్మ తమన్నాలో ప్రవేశించి ఏం చేసిందనేది చిత్రకథ. హారర్, కామెడీలతో పాటు ప్రభుదేవా, తమన్నాల డ్యాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్. ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ముగ్గురూ మూడు భాషల్లోనూ మంచి పేరున్న నటీనటులు కావడం ఈ మూడు భాషల సినిమాకు ప్లస్ పాయింట్. కనులారా వినుకోండి.. చిత్రం: మన ఊరి రామాయణం, నటీనటులు: ప్రకాశ్‌రాజ్, ప్రియమణి, సత్య, దర్శకుడు: ప్రకాశ్‌రాజ్, నిర్మాతలు: రాంజీ, ప్రకాశ్‌రాజ్ విడుదల తేదీ: అక్టోబర్ 7. ‘‘మనలో లోపాలు వదిలేసి ఏవేవో చూస్తుంటాం. పనికొచ్చే విషయం తప్ప, ఏవేవో మాట్లాడతాం. మనసారా చెబుతాన్నా. చెవులారా వినుకోండి. కనులారా చూడండి. ఇది ‘మన ఊరి రామాయణం’. మనలోని రామాయణం. ప్రతి మనిషిలోనూ రాముడు, రావణుడు ఉంటారు. అలాంటి వ్యక్తి కథ ఇది’’ అంటూ ప్రకాశ్‌రాజ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. టీజర్, ట్రైలర్లను బట్టి ఇది ఫ్యామిలీ సినిమా. అందులోనూ సస్పెన్స్ డ్రామా అని అర్థమవుతోంది. ప్రకాశ్‌రాజ్ దర్శకత్వం వహించిన గత చిత్రాలు ఆయన దర్శకత్వ అభిరుచికి అద్దం పట్టాయి. దాంతో ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. చాలా రోజుల తర్వాత ప్రియమణి తెలుగు తెరపై కనిపించనున్నారు. దస్ కా దమ్! ఒకట్రెండు కాదు.. దసరాకి ఏకంగా ‘దస్’ (పది) సినిమాలకు పైనే విడుదల కానున్నాయి. ఇన్ని సినిమాలా? మరి థియేటర్ల సంగతేంటి? ప్రతి సినిమాకీ సరిపడా థియేటర్లు దొరుకుతాయా? థియేటర్లను పక్కన పెడితే.. ప్రేక్షకుల సంగతేంటి? అన్ని సినిమాలనూ చూస్తారా? ఈ ప్రశ్నలకు సినీ ప్రముఖులు, విశ్లేషకులు చెబుతున్న సమాధానం ఒక్కటే. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘నాన్నకు ప్రేమతో’, ‘డిక్టేటర్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాలను వారు గుర్తు చేస్తున్నారు. ఈ నాలుగూ సంక్రాంతికి విడుదలై మంచి విజయాలు, వసూళ్లు సాధించాయి. మంచి సినిమాలు ఒకే వారంలో విడుదలైనా, ప్రేక్షకాదరణ లభిస్తుందనడానికి ఇంత కంటే మంచి ఉదాహరణ ఏముంటుందంటున్నారు! అయినప్పటికీ.. సినీ ప్రముఖులు, డిస్ట్రిబ్యూటర్లలో కొన్ని సందేహాలున్నాయి. ఎందుకంటే.. ఈనెల 23న అంటే దసరాకు రెండు వారాల ముందు నాని ‘మజ్ను’ విడుదలవుతోంది. విజయదశమికి తప్పకుండా ఎన్నో కొన్ని థియేటర్లలో ఉంటుంది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘నిర్మలా కాన్వెంట్’, ‘సిద్ధార్థ’ సహా ఈ శుక్రవారం దాదాపు పది సినిమాలు విడుదలవుతున్నాయి. మంచి పేరొస్తే పాతిక రోజులు థియేటర్లలో ఉండడం ఖాయం. మరి.. తదుపరి విడుదలయ్యే సినిమాలకు థియేటర్లు ఎలా సర్దుబాటు అవుతాయో? అని కొందరు ఆలోచిస్తున్నారు. మనసుంటే మార్గముంటుంది.. పెద్దలందరూ కలిసి అన్ని సినిమాలకూ థియేటర్లు అందేలా చేస్తారని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. మరి.. దసరాకు ‘దస్’కు పైనే విడుదలయ్యే సినిమాల్లో ‘దమ్ము’న్నవి ఎన్ని? అనేది వేచి చూడాలి. బరిలో... చాలానే! ‘అల్లరి’ నరేశ్ ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’, సునీల్ ‘ఈడు గోల్డ్ ఎహే’, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న ‘జాగ్వార్’, ‘లక్ష్మీదేవి సమర్పించు.. నేడే చూడండి’తో పాటు మరి కొన్ని సినిమాలు సైతం ఈ దసరాకు బాక్సాఫీస్ బరిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘సీమశాస్త్రి’, ‘సీమ టపాకాయ్’ సినిమాల తర్వాత దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి, ‘అల్లరి’ నరేశ్ ‘ఇంట్లో దెయ్యం..’తో హ్యాట్రిక్‌పై గురి పెట్టారు. అల్లరోడు నటించిన ఫస్ట్ హారర్ మూవీ ఇది. ‘ఈడు గోల్డ్ ఎహే’ విషయానికి వస్తే - ఇందులో సునీల్ తొలిసారి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. వీరు పోట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇక మరో సంచలనం - రూ. 75 కోట్ల ‘జాగ్వార్’. ఒక కొత్త హీరోతో ఇంత బడ్జెట్‌తో సినిమా తీయడం మామూలు విషయం కాదు. తనయుడు నిఖిల్‌కుమార్ కోసం కర్ణాటక మాజీ సీయం హెచ్.డి. కుమారస్వామి ఈ భారీ చిత్రం ‘జాగ్వార్’ను నిర్మిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించగా, శిష్యుడు మహదేవ్ దర్శకత్వం వహించారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనున్నారు. - సత్య పులగం -
ఇటు 33..అటు 61!
ఇప్పుడు అమలా పాల్ వయసు 24 ఏళ్లు మాత్రమే. మరి, ఇటు 33... అటు 61 ఏంటనుకుంటున్నారా? హీరోల వయసండీ. సిల్వర్ స్క్రీన్‌పై ఓ పక్క యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తున్న ఈ మలయాళీ బ్యూటీ, మరో పక్క సీనియర్ హీరోల సరసన కూడా సై అంటున్నారు. ఇప్పుడీ బ్యూటీ నటిస్తున్న తమిళ సినిమా ‘వడ చెన్నై’ హీరో ధనుష్ వయసు 33 ఏళ్లు. యంగ్ హీరోల సినిమాల్లో మంచి చాన్సులు వస్తున్నప్పుడు సీనియర్ హీరోల పక్కన నటించడానికి అమలా పాల్ వయసున్న హీరోయిన్లు ఆలోచిస్తారు. ఎందుకంటే.. సీనియర్ హీరోయిన్ కింద ట్రీట్ చేసి, యంగ్ హీరోలు చాన్సులు ఇవ్వరేమోననే భయం. కానీ, అమలా పాల్కి అటువంటి భయాలు ఉన్నట్లు కనిపించడం లేదు. 33 ఏళ్ల ధనుష్ సరసన నటిస్తూనే, 61 ఏళ్ల సత్యరాజ్ పక్కన నటించడానికి సంతకం చేసేశారు. మోహన్‌లాల్, అమలా పాల్ జంటగా నటించిన మలయాళ సినిమా ‘లైలా ఓ లైలా’ను సత్యరాజ్ హీరోగా తమిళంలో ‘మురుగవేల్’గా రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్లో పోషించిన పాత్రనే మళ్లీ తమిళంలో చేస్తున్నారు అమలా పాల్. 61 ఏళ్ల సత్యరాజ్ పక్కనే కాదు.. మరో నాలుగేళ్లు పెద్దైన రజనీకాంత్ సరసన కూడా ఆమె నటించనున్నారట. -
జీవీ కొత్త చిత్రం ప్రారంభం
యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ఎనకు ఇన్నోరు పేర్ ఇరుక్కు కుమారు చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుతం జీవీ బ్రూస్లీ, కడవుల్ ఇరుకురాన్ కుమారూ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా జీవీ హీరోగా మరో చిత్రం ఆదివారం చెన్నైలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత ఎంఎస్.శరవణన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం ముత్తుసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్, తంబిరామయ్య, రోబోశంకర్, అరుణ్రాజ్కుమార్, ఆర్జే.బ్లేడ్.శంకర్, ఆర్జే మిర్చి విజయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీనే సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి పీకే.వర్మ చాయాగ్రహణం అందిస్తున్నారు. దీనికి ఎం.సురేశ్‌రాజ్, అరుణ్ పురుషోత్తమన్, టి.రఘనాథన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూజా కార్యక్రమాలకు నటులు ప్రసన్న, శ్యామ్, రాంకీ, నిరోషా దంపతులు, దర్శకుడు విజయ్, నిర్మాత ఫైవ్‌స్టార్ కదిరేశన్, పలువురు సీనీ ప్రముఖులు హాజరై చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
నా పేరు మర్చిపోయారు!
సత్యరాజ్... అంటే ఎవరు? అని అడిగితే చాలామంది ‘ఎవరాయన?’ అన్నట్లు చూస్తారు. అదే ‘కట్టప్ప’ అని అడగండి... తడుముకోకుండా సమాధానం చెప్పేస్తారు. ‘బాహుబలి’లో చేసిన కట్టప్ప పాత్రతో దేశవ్యాప్తంగా సత్యరాజ్ అభిమానులను సంపాదించుకున్నారు. త్వరలో ఆయన దెయ్యంగా భయపెట్టనున్నారు. సత్యరాజ్, ఆయన తనయుడు శిబిరాజ్ కలసి నటించిన తమిళ హారర్ సినిమా ‘జాక్సన్ దొరై’. దరణీధరన్ దర్శకుడు. నిర్మాత జక్కం జవహర్‌బాబు తెలుగులో ‘దొర’గా అనువదించారు. జులై 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా సత్యరాజ్ చెప్పిన విశేషాలు... ► కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన పీరియాడికల్ హారర్ మూవీ ‘దొర’. జాక్సన్ అనే బ్రిటీష్ దెయ్యానికీ, దొర అనే ఇండియన్ దెయ్యానికీ మధ్య కథ జరుగుతుంది. నేను ఇండియన్ దెయ్యంగా నటించా. తెలుగు, తమిళంతో సహా ప్రస్తుతం అన్ని భాషల్లోనూ హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ధరణీదరన్ చెప్పిన కథ బాగా నచ్చి, ఈ సినిమా ఒప్పుకున్నాను. తొలిసారి దెయ్యం పాత్ర చేశా. ► ఆత్మలు ఇలా ప్రవర్తించాలి, ఇలాగే ఉండాలని రూల్ లేదు కదా! వాటికి ప్రత్యేకమైన మేనరి జమ్స్ ఉంటాయో.. ఉండవో? అందుకే నా స్టయిల్లో దర్శకుడు చెప్పినట్లు నటించాను. ► రాజమౌళి దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ‘స్టూడెంట్ నెం.1’ తమిళ రీమేక్‌తో మా అబ్బాయి శిబిరాజ్ హీరోగా పరిచయమయ్యాడు. గతంలో శిబీతో కలసి నటించాను. మళ్లీ ‘దొర’లో నటించడం హ్యాపీగా ఉంది. ► ఈతరం దర్శకులు నన్ను, నా నటనను దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాస్తున్నా రు. రాజమౌళి, కొరటాల శివ, శ్రీకాంత్ అడ్డాల.. ఇలా ప్రతి ఒక్కరూ విభిన్నమైన పాత్రలు రాయడం వలనే నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్క రించుకునే అవకాశం లభించింది. ఓ నటుణ్ణి దృష్టిలో పెట్టుకుని దర్శకులు పాత్రలు రాస్తుంటే గర్వంగా ఉంటుంది. ఇంతకంటే కావల్సింది ఏముంటుంది? ► సుమారు 220 చిత్రాల్లో నటించా. 38 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నాను. కానీ, ప్రస్తుతం అందరూ నా పేరు మర్చిపోయి ‘కట్టప్ప’ అని పిలుస్తున్నారు. చిన్నారులు సైతం ‘కట్టప్ప’ అని గుర్తుపడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ఘనత దర్శకుడు రాజమౌళిదే. జీవితంలో ఒక్కసారే ఇటువంటి పాత్రలు లభిస్తాయి. ‘బాహుబలి: ది కంక్లూజన్’లో కట్టప్ప పాత్ర ఇంకా బలంగా ఉంటుంది. ► ‘బాహుబలి 2’తో పాటు సంతోష్ శ్రీనివాస్ సినిమాలో రామ్ తండ్రిగా.. తెలుగు ‘పటాస్’లో సాయికుమార్ చేసిన పాత్రను తమిళ రీమేక్‌లో చేస్తున్నాను. -
సత్యరాజ్ ‘దొర’ మూవీ స్టిల్స్
-
ఆ ఒక్కడికే తెలుసు !
2015 సంవత్సరంలో చోటుచేసుకున్న నేరాలకు సంబంధించి ఇప్పటివరకు ఏమాత్రం క్లూ దొరకని ఒకే ఒక్క కేసు.. అమరేంద్ర బాహుబలి హత్య! 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' ఈ ప్రశ్నకి సమాధానం కోసం ఎదురుచూడని సినీ అభిమాని ఉండడు. అసలు నిజం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. వారిలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ ఒకరు. బాహుబలి రిలీజ్ అయినప్పటి నుంచి సత్యరాజ్ సుపుత్రుడు, తమిళ నటుడు శిబిరాజ్ ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నాడట. సత్యరాజ్ కుటుంబసభ్యులు కూడా బాహుబలి హత్య వెనుక ఉన్న సీక్రెట్ కోసం శతవిధాలా ప్రయత్నించి విసుగుచెంది ఊరుకున్నారట. ఎవరెంత బతిమిలాడినా సత్యరాజ్ మాత్రం కథలోని సస్పెన్స్ ని బయటపెట్టలేదు. 'మా నాన్నకు పని పట్ల ఉన్న నిబద్ధత అటువంటిది' అంటూ తండ్రి గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు శిబిరాజ్. అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయం సత్యరాజ్ కుటుంబంలో ఒకే ఒక్కరికి తెలుసట.. సత్యరాజ్ రెండున్నరేళ్ల మనవడికి! -
అక్టోబర్ 3న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: జె.పి.దత్తా (దర్శకుడు, నిర్మాత), సత్యరాజ్ (నటుడు) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది గురుసంఖ్య. వీరు ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఎంతో చాకచక్యంగా విజయాలు సాధించి, కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. సద్గురువులు, సజ్జనుల సాంగత్యంతో ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. మధురంగా మాట్లాడతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. వీరు పుట్టినతేదీ 3. ఇది కూడా గురు సంఖ్యే. దీనివల్ల వీరు విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కొత్తస్నేహాలు, కొత్తబంధుత్వాలు ఏర్పడతాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. సమాజంలో గౌరవం, కుటుంబంలో మీ మాటకు విలువ ఏర్పడతాయి. విద్యార్థులు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు పొందుతారు. జ్యోతిష్యులు,వేదపండితులు గుర్తింపు పొందుతారు. లక్కీనంబర్స్: 1,2,3; లక్కీ కలర్స్: క్రీమ్, గోల్డెన్, ఎల్లో, శాండిల్; లక్కీ డేస్: సోమ, గురు, శుక్రవారాలు. సూచనలు: దక్షిణామూర్తిని ఆరాధించడం, పండితులను, మతగురువులను గౌరవించడం, అనాథలను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
మంచి ఛాన్స్ వదులుకున్న కట్టప్ప..
చెన్నై: బాహుబలి సినిమాలో తన విలక్షణ నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్న తమిళ నటుడు సత్యరాజ్ (కట్టప్ప) ఇపుడు ఒక మంచి అవకాశాన్ని వదులుకున్నాడట. బాహుబలి 2 సినిమా కోసం.. తమిళంలో అగ్రకథానాయకుడు విజయ్ సినిమాలో విలన్‌గా నటించే అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడట. బాహుబలి 2 షూటింగ్ కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉండడంతోనే ఈ ఛాన్స్ మిస్ అయినట్టు సమాచారం. ఈ మూవీ కోసం కట్టప్ప 100 రోజులు కేటాయించనున్న నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ తో కలిసి నటించే అవకాశాన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఇంకా పేరు పెట్టని హీరో విజయ్ 59వ తమిళ సినిమాలో విలన్ పాత్ర కోసం సత్యరాజ్‌ను సంప్రదించారట. తప్పనిసరి పరిస్థితిలో, సమయాభావం వల్లనే కట్టప్ప విజయ్ సినిమాను పక్కన పెట్టాల్సి వచ్చిందంటున్నాయి సినీ వర్గాలు. కాగా టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తున్న ప్రతిష్టాత్మక సినిమా బాహుబలి సీక్వెల్ గా తెరకెక్కుతున్న బాహుబలి 2 లో కట్టప్ప పాత్ర కీలకంగా మారింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు, ఎలా హత్య చేశాడు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక కథనాలు కూడా ప్రచారం ఉన్నాయి. 2016 సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీలో రానా, అనుష్క ప్రభాస్ రమ్యకృష్ణ, తమన్నా ప్రధానపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
హాలీవుడ్‌కు దీటుగా బాహుబలి
బాహుబలి సినిమా ప్రపంచం అంతా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రం ఇది. దీనికి సృష్టికర్త రాజమౌళి. టాలీవుడ్లో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని వాడుకుంటూ తన చిత్రాలతో వండర్స్ సృష్టిస్తున్న మేటి దర్శకుడీయన. విక్రమార్కుడు, ఛత్రపతి, మగధీర, ఈగ వంటి సూపర్ సక్సెస్ చిత్రాల తరువాత రాజమౌళి తాజా చిత్రం బాహుబలి. ఇప్పటి వరకు టాలీవుడ్ వరకు పరిమితం అయిన తన ప్రతిభాపాటవాలను రాజమౌళి ఈ చిత్రంతో కోలీవుడ్, బాలీవుడ్‌లకు చాటనున్నారు. బాహుబలి చిత్రాన్ని ఆయన ఈ మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాణా, అనుష్క, తమన్న, సుధీప్, సత్యరాజ్, నాజర్ వంటి ప్రముఖ తారలు నటిస్తున్నారు. శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ వెర్షన్ హక్కులను స్టూడియో గ్రీన్ కె ఇ జ్ఞానవేల్ రాజా పొందారు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు మదన్‌కార్గి మాటలు రాయడం విశేషం. అలాగే చిత్రాన్ని తమిళనాడులో శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ విడుదల చేయనుంది. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం ఈ సందర్భంగా చిత్ర హీరో ప్రభాస్ మాట్లాడుతూ ఒకసారి రాజమౌళి కలిసి చిత్రం చేద్దాం అనగానే కథ ఏమిటని కూడా అడగకుండా ఒకే చేద్దాం అన్నానన్నారు. ఎందుకంటే ఆ విషయాలన్నీ ఆయనే చూసుకుంటారన్న నమ్మకంతోనే అన్నారు. బాహుబలి కోసం 300 రోజులు శ్రమించారన్నారు. గుర్రపుస్వారీ, కత్తి యుద్ధా ల్లో శిక్షణ తీసుకున్నానని తెలి పారు. ఇలాంటి చిత్రం భవిష్యత్తులో మళ్లీ చేయడం సాధ్యం కాకపోవచ్చునని ప్రభాస్ పేర్కొన్నారు. ఇండియన్ సినిమా గర్వపడేలా బాహుబలిని ఇండియన్ సినిమాగర్వ పడేలా దర్శకుడు రాజమౌళి సిల్వర్ స్కీన్‌పై ఆవిష్కరించారని నటుడు సూర్య పేర్కొన్నారు. ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బాహుబలి చిత్రంలో ప్రతి ఫ్రేమ్ ఆశ్యర్యంతో ముంచెత్తుతుందన్నారు. బాహుబలిలో చిన్న వేషం అయినా వేయాలని ఆశించానని ఆ అవకాశం లభించకపోయినా ఈ చిత్ర ప్రచారంలో తాను ఒక భాగం అవ్వడం సంతోషంగా ఉందన్నారు. బాహుబలి చిత్ర షూటింగ్ స్పాట్‌కు ఒక్కసారి వెళ్లానని అప్పుడా చిత్రానికి మూడువేలమంది ఏకధాటిగా పని చేయడం చూసి ఆశ్చర్యపోయానని సూర్య అన్నారు. ఇప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల తరహాలో చిత్రాలు చేయాలని అనుకుంటున్నామన్నారు. బాహుబలి చూసిన తరువాత హాలీవుడ్ పరిశ్రమ ఇలాంటి చిత్రం చేయాలని ఆశపడుతుందని సూర్య అన్నారు. -
పెళ్లి భోజనమెప్పుడు?
ప్రభు, సత్యరాజ్ లాంటి సీనియర్ నటులు సెట్లో ఉంటే అక్కడ వాతావరణం సందడి సందడిగా ఉంటుంది. మరో విషయం ఏమిటంటే వాళ్ల ఇంటి నుంచి ఘుమఘుమ లాడే రకరకాల వంటకాలతో కూడిన పసందైన భోజనం హాట్ క్యారియర్లలో వస్తుంటుంది. దాన్ని చిత్ర యూనిట్ అంతా కమ్మగా ఆరగిస్తుంటారు. తాజాగా ఇలాంటి రుచికరమైన సంఘటనే జరిగింది. యువ నటుడు జయం రవి నటిస్తున్న చిత్రం అప్పాటక్కర్. త్రిష, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముఖ్య పాత్రల్లో ప్రభు, సత్యరాజ్‌లు నటిస్తున్నారు. సూరజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో సాగుతోంది. ఇటీవల నటుడు ప్రభు ఇంటి నుంచి పలు రకాల శాకాహారం, మాంసాహారం పసందైన వంటకాలతో కూడిన భోజనాలు వచ్చాయట. ఇవన్నీ యూనిట్‌సభ్యులు కలిసి పుష్టిగా ఆరగించినట్లు త్రిష తన ట్విట్టర్లో పేర్కొన్నారట. ప్రభుసార్ ఇంటి వంట ఎంత కమ్మగా ఉందో చేపల పులుసు, పీతల ఇగురు, కోడి కూర, అంటూ వివిధ రకాల వంటలు తలచుకుంటే ఇప్పుడు కూడా నోరూరుతున్నాయట అంటూ ట్విట్టర్లో పోస్టు చేశారట. ఇది తెలిసిన ప్రభు షూటింగ్ స్పాట్లో మరి నువ్వు వివాహ విందుఎప్పుడు ఇస్తావు అని అడిగారట. అందరి మధ్య ప్రభు సడన్‌గా అలా అడగడంతో కాస్త ఇబ్బందికి గురైన త్రిష ముఖానికి నవ్వు పులుముకుని అక్కడ నుంచి మెల్లగా జారుకుందట. మరి పెళ్లి గురించి ఎప్పుడు చెబుతుందో! -
రజనీ సలహాఇచ్చారు
తమిళ సినిమా : సూపర్‌స్టార్ రజనీకాంత్ తనకు అడ్వైజ్ చేశారంటున్నారు యువ నటుడు విక్రమ్ ప్రభు. సహ నటుడు శివాజీ గణేశన్ వంశం నుంచి వచ్చిన మూడో తరం హీరో ఈయన. నటుడు ప్రభు కొడుకయిన విక్రమ్ ప్రభు కుంకీ చిత్రం ద్వారా హీరోగా రంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే నటుడిగా తన ఈ సత్తా చాటి ప్రశంసలందుకున్నారు. ఆ తరువాత ఇవన్ వేరమాదిరి, అరిమానంబి చిత్రాలతో హీరోగా తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్న విక్రమ్ ప్రభు ప్రస్తుతం మూడు, నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన నటించిన తాజా చిత్రం శిఖరం తొడు విడుదలకు సిద్ధమవుతోంది. ఇది తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రం. తండ్రిగా సత్యరాజ్ నటించారు. మోనాల్ గజ్జర్ నాయకి. చిత్రంలో విక్రమ్ ప్రభు పోలీస్ అధికారిగా నటించారు. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు మంచి పేరు వస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ ప్రభు తన భావాలను వెల్లడిస్తూ పలానా పాత్రలే చెయ్యాలనే నిర్దిష్ట అభిప్రాయం ఏమీ లేదన్నారు. తన తాత శివాజీ గణేశన్ మాదిరి అన్ని రకాల పాత్రలను పోషించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వెళ్ళైక్కార దురై చిత్రంతోపాటు దర్శకుడు విజయ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నానని చెప్పారు. వెళ్లైక్కార దురై చిత్రంలో తొలిసారిగా వినోదభరిత పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. పోరాట దృశ్యాలలో డూప్ లేకుండా రిస్క్ తీసుకుని నటిస్తున్నానని కుటుంబ సభ్యులు భయపడుతున్నారన్నారు. రజనీకాంత్ కూడా రిస్క్ తీసుకోవద్దని సలహా ఇచ్చారని పేర్కొన్నారు. అయితే తనకు డూప్‌లను పెట్టి నటింప జేయడం ఇష్టం లేదన్నారు. కుంకీ చిత్రంలో డూప్‌లేకుండా సాహసం చేసి ఏనుగుతో నటించిన సన్నివేశాలకు ప్రశంసలు లభించాయని గుర్తు చేసుకున్నారు. అలాగే యువన్ వేరమాదిరి. అరిమానంబి చిత్రాల్లో ఫైట్ సన్నివేశాలలో అభినందనలు లభించాయన్నారు. తాత శివాజీగణేశన్, నాన్న ప్రభుల పేరు కాపాడే విధంగా చిత్రాల ఎంపికలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు విక్రమ్ ప్రభు తెలిపారు. -
అక్షయ్‌కుమార్ పాత్రలోవిక్రమ్...
పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం అంత సులువు కాదు. ముఖ్యంగా శారీరక, మానసిక వైకల్యం ఉన్న పాత్రల్లో ఒదిగిపోవడం చాలా కష్టం. కానీ, విక్రమ్‌లాంటి నటులు సునాయాసంగా చేసేస్తారు. తమిళ ‘కాశి’ సినిమాలో గుడ్డివాడిగా, ‘సేతు’లో మానసిక ఎదుగుదల లేని వ్యక్తిగా, ‘అపరిచితుడు’లో మూడు రకాల పాత్రల్లో.. ఇలా విక్రమ్ పలు వైవిధ్యమైన పాత్రలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఐ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పలు రకాల లుక్స్‌లో కనిపిస్తారట విక్రమ్. ఓ గెటప్ కోసం అయితే బాగా సన్నబడ్డారు కూడా. ఈ సినిమా పూర్తి కావచ్చిన నేపథ్యంలో విక్రమ్ తదుపరి చిత్రాలు అంగీకరించే పని మీద ఉన్నారట. వాటిలో హిందీ చిత్రం ‘స్పెషల్ 26’ కూడా ఉంది. ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులను తిరుపతి బ్రదర్స్ పొందారు. ముందుగా ఈ సినిమాని కమల్‌హాసన్‌తో చేయాలనుకుంటున్నారనే వార్త వచ్చింది. అది నిజం కాలేదు. ప్రస్తుతం విక్రమ్‌తో చేయాలనుకుంటున్నారట. హిందీలో ఈ పాత్రను అక్షయ్‌కుమార్ చేశారు. అలాగే, అనుపమ్ ఖేర్ పోషించిన పాత్రకు సత్యరాజ్‌ని తీసుకున్నారని సమాచారం. -
రాజా రాణి మూవీ స్టిల్స్
-
చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా రివ్యూ!
బాద్షా, డూప్లికేట్, ఫిర్‌బీ దిల్ హై హిందుస్థానీ చిత్రాల తర్వాత కామెడీ, యాక్షన్ చిత్రాల్లో తరహా చిత్రాల్లో షారుక్‌ను చూడక బాలీవుడ్ అభిమానులు చాలా రోజులైంది. తొలినాళ్లలో షారుక్ యాక్షన్, కామెడి నేపథ్యం ఉన్న చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ మధ్యలో దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, దిల్ వాలే దుల్హనియా లేజాయింగే లాంటి ప్రేమ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా ముద్ర వేసుకున్నాడు షారుక్. లవ్, రొమాన్స్ కథాంశాలతో మొన్నటి ‘జబ్ తక్ హై జాన్’ ఘోర పరాజయం వరకు అదే పంథాను కొనసాగించాడు. ‘జబ్ తక్ హై జాన్’ చిత్రం ఫ్లాప్ తర్వాత యాక్షన్, కామెడి అంశాల మేలవింపుతో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ ద్వారా షారుక్ ముందుకు వచ్చాడు. తొమ్మిది నెలల గ్యాప్ తర్వాత దీపికా పదుకోనె,దర్శకుడు రోహిత్ శెట్టి, షారుక్ కాంబినేషనలో వచ్చిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ కథ.. గొప్పగా చెప్పుకునేంత సీన్ ఉన్న కథ కాదు. ఉత్తర భారత దేశానికి చెందిన యువకుడు, దక్షిణాది అమ్మాయితో ప్రేమలో పడటం సింగిల్ లైన్ స్టోరి. రాహుల్ అనే యువకుడు తన తాత అస్థికలను రామేశ్వరంలో కలిపేందుకు బయలుదేరుతాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నిరాకరించి ఇంటి నుంచి పారిపోయిన మీనా చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో రాహుల్‌ని కలుస్తుంది. అనుకోని పరిస్థితుల్లో మీనా స్వంత గ్రామానికి రాహుల్ వెళ్లాల్సి వస్తుంది. అయితే మీనా స్వంత గ్రామంలో ఏమి జరిగింది. రాహుల్, మీనాల మధ్య ఎలా ప్రేమ చిగురించింది. రాహుల్, మీనాలు పెద్దవారిని ఎలా ఒప్పించారనే అంశాలతో తెరకెక్కిన సాదాసీదా ప్రేమకథ చెన్నై ఎక్స్‌ప్రెస్. అయితే దక్షిణాది కామెడీ ట్రాక్‌కు షారుక్ రొమాంటిక్ ఇమేజిని కలిపి దర్శకుడు రోహిత్ శెట్టి, యూనస్ సజావాల్ అందించిన స్క్రీన్ ప్లే, కేరళ అందాలు, అద్బుతమైన దూద్లే ఫోటోగ్రఫీలు సినిమాపై ప్రేక్షకుడు పట్టు సాధించేలా చేశాయి. మున్నార్, దేవికులమ్ లేక్, మీసాపులిమాలా, వాగవారా, కన్నిమాలా ప్రాంతాలు, దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అందాలను అద్బుతంగా తెరకెక్కిచడంలో కెమెరామెన్ దూద్దే సఫలీకృతమయ్యాడు. విశాల్, శేఖర్లు తమ సత్తాకు తగినంతగా సంగీతాన్ని అందించలేదనే చెప్పవచ్చు. అయితే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నేపథ్యంగా తైలవర్ (లుంగీ డ్యాన్స్) పాట, కాశ్మీర్ మే తూ కన్యాకుమారి, ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ టైటిల్ సాంగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. షారుక్ ఖాన్‌కు రాహుల్ లాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న పాత్రలో నటించడం కొట్టిన పిండే. రొమాంటిక్ టచ్‌తో యాక్షన్ హీరోగా షారుక్ చార్మింగ్‌గా కనిపించాడు. రొమాంటిక్ లవర్ బాయ్ పాత్రలో షారుక్ తప్ప మరొకర్ని ఊహించుకోవడం కష్టమనే రీతిలో చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నటనను ప్రదర్శించాడు. క్లైమాక్స్‌లో షారుక్ అదరగొట్టేశాడు. షారుక్ తన మార్క్ కామెడీ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక మీనా(మీనమ్మ)పాత్రలో దీపిక పదుకొనే అమాయకత్వంతోపాటు, చెలాకీతనంతో అద్బుతంగా ప్రదర్శించింది. తమిళ సాంప్రదాయ నేపథ్యం ఎక్కువగా ఉన్న ఈ చిత్రంలో దీపికా కట్టు,బొట్టు, క్యాస్టూమ్స్ ఓహో అనిపించేలా ఉన్నాయి. గ్లామర్‌గా కనిపించాలంటే అర్ధనగ్నంగా కనిపించాల్సిందే అనే ఫీలింగ్ ఉన్న ఈ రోజుల్లో.. కంచిపట్టు చీరలో మీనమ్మాగా దీపికా గతంలో ఎన్నడూ లేనంత అందంగా తెరమీద మెరిసింది. మీనా తండ్రిగా దుగేశ్వర పాత్రలో సత్యరాజ్ గంభీరంగా కనిపించాడు. ఇక విలన్ పాత్ర తంగబలీ పాత్రలో నికితిన్ ధీర్ పర్వాలేదనిపించాడు. అయితే కామెడీయే ప్రధాన నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం ఆ రేంజ్ లో లేకపోవడం ప్రేక్షకుడిని నిరాశపరిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా షారుక్, దీపికా కెమిస్ట్రీని ఎంజాయ్ చేయాలనే టేస్ట్ ఉన్న అభిమానులకు, రిలాక్స్ కోసం ధియేటర్‌కు వెళ్లాలనుకునే ఫ్యామిలీ కేటగిరి ప్రేక్షకులకు చెన్నై ఎక్స్‌ప్రెస్ నచ్చడం ఖాయం. ఇక ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తే ఆ ఘనత షారుక్, దీపికాలకే దక్కుతుంది. షారుక్, దీపికలకు తగ్గట్టుగా కథను సిద్ధం చేసుకోకపోవడం దర్శకుడి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కథను పక్కన పెట్టి కథనంతోనే ప్రయోగం చేసేందుకు దర్శకుడు రోహిత్ శెట్టి సిద్ధమైనట్టు స్పష్టంగా కనిపించింది. విశేషాలు: దేశవ్యాప్తంగా 3500, విదేశాల్లో 700 థియేటర్లలో విడుదలైంది. భారతీయ సినిమాలకు పెద్దగా మార్కెట్‌లేని పెరూ, ఇజ్రాయిల్ దేశాతొలిసారి విడుదలైన బాలీవుడ్ చిత్రంగా చెన్నై ఎక్స్‌ప్రెస్ రికార్డుల్లోకెక్కింది. అంతేకాకుండా నార్త్ అమెరికాలో 195 స్క్రీన్లలో, బ్రిటన్ 175 స్క్రీన్లతోపాటు మొరాకో, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్ దేశాల్లో ప్రద ర్శనకు సిద్ధమవుతోంది.